Haryana Assembly Elections 2024
-
ఈవీఎంలపై సందేహాలను ఈసీ నివృత్తి చేయాలి: ఎంపీ కపిల్ సిబల్
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో తేడాలపై కాంగ్రెస్ లేవనెత్తిన సందేహాలను ఎన్నికల సంఘం (ఈసీ) నివృత్తి చేయాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ గురు, శుక్రవారాల్లో ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈసీకి ఆధారాలు అందజేస్తున్నామని, తమ సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాల్సి ఉందని కపిల్ సిబల్ అన్నారు. ‘ఈవీఎంల దుర్వినియోగం జరుగుతోందనే భావిస్తున్నా. అయితే అది ఏమేరకు జరుగుతోందనేది నేను చెప్పలేను. ఈవీఎంల వాడకానికి నేను మొదటినుంచి వ్యతిరేకమే. పారదర్శకత లేనిదేనైనా ఆమోదయోగ్యం కాదు’ అని కాంగ్రెస్ మాజీ నాయకుడు సిబల్ అన్నారు. హరియాణాలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈవీఎంల బ్యాటరీలు 80 శాతం కంటే తక్కువ ఉన్నచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబర్చారని, 99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయనేది కాంగ్రెస్ ఆరోపణ. -
ఈవీఎంలలో అవకతవకలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదులు
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి మరిన్ని ఫిర్యాదులు చేసింది. దాదాపు 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. ఈ నెల 8న జరిగిన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని ఈవీఎంల బ్యాటరీలు 99 శాతం చార్జింగ్‌తో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మిగతా ఈవీఎంల బ్యాటరీల్లో 80 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉందన్నారు. 99 శాతం చార్జింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తమ పార్టీ ఫిర్యాదులపై ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈవీఎంలను తారుమారు చేశారని వారు అనుమానిస్తున్నారు. అందుకే న్యాయం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. -
ఈనెల 15న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ ప్రమాణ స్వీకారం!
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ పటాపంచలు చేస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. 90 స్థానాలకుగానూ 48 స్థానాల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 15న హర్యానాలో నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 15న పంచకులలో సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పంచకులలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందుబాటులో ఉంటారో లేదో అనేది తెలియాల్సి ఉందని, ఆయన ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.హర్యానా ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పంచకుల డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో కూడిన అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంచకుల అదనపు డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కూడా సభ్యులుగా ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీవీఎస్ఎన్ ప్రసాద్ గురువారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో తెలిపారు.కాగా ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్‌ను తప్పించి నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసిన విషయం తెలిసిందే. సైనీ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది బీజేపీ... మరోసారి బీసీ నేత అయిన ఆయనకే రాష్ట్ర పగ్గాలను అప్పగించనుంది అధిష్టానం. ముఖ్యమంత్రితోపాట మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్‌పై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్.. అంత మాట అనేశారేంటి?
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం చతికిలపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ కాషాయపార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 48 చోట్ల, కాంగ్రెస్ 37 చోట్ల విజయం సాధించాయి. అటూ జమ్మూకశ్మీర్ ఎన్నికల్లోనూ బీజేపీ బాగానే పుంజుకుంది. అధికారంలోకి రాకలేకపోయినప్పటికీ సీట్లను గణనీయంగా పెంచుకుంది. సొంతంగానే 29 స్థానాల్లో జెండా ఎగురవేసింది. కాగా, హరియాణా ఫలితాలను అంగీకరించబోమని కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ఈవీఎంలపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ఈవీఎంలతోనే గెలిచారని గుర్తు చేశారు. హరియాణాలో బీజేపీ మళ్లీ గెలవడానికి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలే కారణమని ఆరోపించారు.బుధవారం ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "ఈవీఎంలను నిందించడం పరిపాటిగా మారింది. ఈవీఎంలతోనే మీరు ఒకచోట గెలిచారు. మరోచోట ఓటమి ఎదురయ్యేసరికి వాటిని నిందిస్తున్నారు. నా అంచనా ప్రకారం హరియాణాలో బీజేపీ ఓడిపోవాల్సింది. ఆ పార్టీకి వ్యతిరేకంగా చాలా అంశాలున్నాయి. పదేళ్లపాటు హరియాణాలో అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో బీజేపీ లాభపడింది. ఎన్నికల పోరులో బీజేపీకి కొంచెం ఓపెనింగ్ ఇస్తే చాలు.. దాన్ని సద్వినియోగం చేసుకుంటుంద"ని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. చదవండి: ఏపీలాగే హరియాణా ఫలితాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలుహరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడించే సువర్ణావకాశాన్ని కాంగ్రెస్ జారవిడుచుకుందని దుయ్యబట్టారు. "ద్వేష రాజకీయాలతోనే బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పుకునే వారు. ఈ విషయం తప్పని 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను చెప్పాను. హరియాణాలో బీజేపీ విజయానికి కారకులు ఎవరు? బీజేపీని ఓడించే అవకాశం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కానీ సువర్ణ అవకాశాన్ని ఆ పార్టీ జారవిడుచుకుంద"ని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: కాంగ్రెస్షహరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోయింది. హరియాణా ఫలితాలను అంగీకరించబోమని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ ఒత్తిడితో ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించింది. అంచనాలకు విరుద్ధంగా హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. -
ఏపీలాగే హర్యానా ఫలితాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ల అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లాగానే హర్యానా ఎన్నికల ఫలితాలు కూడా ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు వైఎస్ జగన్. ఇప్పటికైనా ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.హర్యానా ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఏపీలోలాగే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మనలాంటి ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి.అభివృద్ధి చెందిన దేశాలలో ఎన్నికల్లో ఇప్పటికీ బ్యాలెట్లనే వాడుతున్నారు. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయి. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్లకే వెళ్లటం మంచిది. అప్పుడే ఓటర్లలో కూడా విశ్వాసం పెరుగుతుంది. ఓటర్లలో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’ అని కోరారు. Yet another election result confounds popular perception. Haryana election result is no different from Andhra Pradesh, on which cases are pending in courts. In a democracy like ours, Democracy should not only be prevalent but also be seen to be thriving. Only way to ensure both,…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 9, 2024 -
హరియాణాలో ఆప్ గుండుసున్నా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి రెండు రకాల అనుభవాలు ఎదురయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఖాతా తెరవగా, హరియాణాలో మాత్రం చతికిలపడింది. జమ్మూకశ్మీర్‌లో ముస్లిం మెజార్టీ కలిగిన దోడా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గజయ్సింగ్ రాణాపై 4,538 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) సభ్యుడైన మెహ్రాజ్ మాలిక్‌కు 32,228 ఓట్లు, గజయ్సింగ్కు 18,690 ఓట్లు లభించాయి. దోడాలో నేషనల్ కాన్ఫరెన్స్, డీపీఏ పీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామమాత్రంగా ఓట్లు సాధించారు. మెహ్రాజ్ మాలిక్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2020లో డీడీసీ సభ్యుడిగా గెలిచారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనపై పదునైన విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్శించారు. తన విజయం ప్రజలకే దక్కుతుందని మాలిక్ అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా3 కోసం తన పోరాటం సాగిస్తానని చెప్పారు. ఆయన ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నిరాశ చెందకుండా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలుపు సొంతం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ‘ఆప్’ 7 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. హరియాణాలో 1.79 శాతం ఓట్లే హరియాణా అసెంబ్లీలో పాగా వేయాలని ఎన్నికల్లో గట్టిగా తలపడిన ఆమ్ ఆద్మీ పార్టీకి నిరాశే మిగింది. ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీకి కేవలం 1.79 శాతం ఓట్లు లభించాయి. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణా ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రమైన హరియాణాలో ఆప్ 89 స్థానాల్లో పోటీ చేసింది. చివరకు రిక్తహస్తమే ఎదురయ్యింది. 2014లో ఆ పార్టీ ఏర్పాటయ్యింది. హరియాణాలో ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, లోక్‌సభ ఎన్నికల్లో గానీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. ఏ ఒక్క ఎన్నికల్లోనూ గెలుపు దక్కలేదు. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 46 సీట్లలో పోటీ చేయగా, ఎక్కడా కూడా ‘నోటా’ కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడం ఆప్‌ను దెబ్బతీసినట్లు పరిశీలకులు చెబుతున్నారు. హరియాణాకు రెండు వైపులా ఉన్న పంజాబ్, ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.అతివిశ్వాసం వల్లే ఓటమి: కేజ్రీవాల్న్యూఢిల్లీ: హరియాణాలో అతి విశ్వాసం వల్లే ఓడిపోయామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో ఓ సమావేశంలో మాట్లాడారు. అతి విశ్వాసం ఉన్నవారికి హరియాణా ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠం అని పేర్కొన్నారు. ఏ ఒక్క ఎన్నికనూ తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి సీటూ ముఖ్యమేనని, గెలుపు కోసం కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. హరియాణాలో ఇతర పార్టీలతో తాము పొత్తు పెట్టుకొని ఉంటే భిన్నమైన ఫలితాలు వచ్చేవని రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సుశీల్ గుప్తా చెప్పారు. -
హస్తం అస్తవ్యస్తం
హరియాణాలో ఈసారి కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేయనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, తీవ్రంగా నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, ఎలాగూ గెలిచేది మేమేనన్న కాంగ్రెస్ నేతల అతి ఆత్మవిశ్వాసం.. వెరసి హస్తం పార్టీని మరోసారి అధికారానికి దూరంచేశాయి. మోదీ–షా ద్వయం రాజకీయ చతురత ధాటికి కాంగ్రెస్ మూడోసారీ ఓటమిని మూటగట్టుకుంది. స్వీయ తప్పిదాలు సైతం కాంగ్రెస్‌ను విజయానికి ఆమడదూరంలో ఆపేశాయి. కేవలం జాట్ వర్గం పైనే గంపెడాశలు పెట్టుకోవడం, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ సింగ్ హూడా అడుగుజాడల్లో నడవడం, కుమారి సెల్జా వంటి దళిత నాయకురాలికి ప్రాధాన్యత తగ్గించడం, అగ్రనేతల మధ్య లోపించిన ఐక్యత వంటి అంశాలు కాంగ్రెస్‌ను పదేళ్ల తర్వాత అధికారం పీఠంపై కూర్చోనివ్వకుండా చేశాయి.ఏకమైన జాట్ వ్యతిరేక ఓట్లుమొదట్నుంచీ రాష్ట్రంలోని జాట్ ఓట్లనే కాంగ్రెస్ నమ్ముకుంది. జాట్యేతర దళితులు, ఓబీసీలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారన్న సంకేతాలను కాంగ్రెస్ పసిగట్టలేకపోయింది. ఇది కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం. బీజేపీ అత్యధిక టికెట్లను ఓబీసీలు, బ్రాహ్మణులకే ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ భూపీందర్ నిర్ణయాలపై ఆధారపడింది. దీన్ని అలుసుగా తీసుకున్న భూపీందర్ కేవలం తన అనుచరగణానికే పెద్దపీట వేశారు. ఎక్కువ మందికి టికెట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలను శాసించే భూపీందర్ పరోక్షంగా పార్టీ ఓటమికి కారణమయ్యారు.గెలుపు గుర్రాలా? కాదా? అనేది చూసుకోకుండా తన అనుచరవర్గానికే అత్యధికంగా పార్టీ టికెట్లు దక్కేలాచేశారు. రాష్ట్రంలో 90 స్థానాలుంటే 72 చోట్ల కాంగ్రెస్ టికెట్ పొందిన వాళ్లు భూపేందర్ మనుషులే. తాను గెలిచి తన వారినీ గెలిపించుకుంటానన్న భూపీందర్ అతివిశ్వాసమే కాంగ్రెస్ పుట్టి ముంచిందని తెలుస్తోంది. కుమారి సెల్జా తన అనుచరుల్లో 9 మందికి టికెట్ దక్కేలా చేశారు. రణ్‌దీప్ సూర్జేవాలా సైతం తన వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. దీంతో గెలుపు గుర్రాలను పక్కనబెట్టిన కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది.దూరంగా ఉండిపోయిన సెల్జాబీజేపీకి దగ్గరవుతున్న దళితులను కాంగ్రెస్ వైపునకు తిప్పే సత్తా ఉన్న దళిత నాయకురాలు కుమారి సెల్జా. అయితే ఈమె ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించలేదు. సిర్సా ఎంపీ అయిన సెల్జాను పార్టీ అధిష్టా నమే హరియాణా ఎన్నికల్లో కలగజేసు కోవద్దని సూచించినట్లు సమాచారం. దీని వెనుక భూపీందర్ హస్తముందని వార్తలొచ్చాయి. పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ సెల్జా పాల్గొనలేదు. కీలక ప్రచార ఘట్టాల్లోనూ ఆమె జాడ లేదు. ఒకే పార్టీలో వేర్వేరుగా ప్రచారంరాష్ట్ర నేతలంతా కలిసి ఒకే ప్రచార కార్యక్రమం చేస్తే అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అందుకు భిన్నంగా ముఖ్య నేతలు ఎవరికి వారే భిన్న కార్యక్రమాలు చేపట్టి దేనికీ అగ్రతాంబూలం దక్కకుండా చేసుకున్నారు. భూపీందర్ వర్గం విడిగా ‘ఘర్ ఘర్ కాంగ్రెస్’ అంటూ ఇంటింటికీ ప్రచారం మొదలెట్టింది. వీళ్లకు పోటీగా కాంగ్రెస్‌లోనే సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలాలు ‘కాంగ్రెస్ సందేశ్’ యాత్రను మొదలెట్టారు. హరియాణా జనాభాలో 26–28 శాతం మంది జాట్లు ఉంటారు. ఇక్కడ 17 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. మెజారిటీ మార్కును చేరుకోవడానికి అవకాశాలను పెంచే ఈ ఎస్సీ స్థానాలపై కాంగ్రెస్ పెద్దగా దృష్టిపెట్టలేదు. దెబ్బకొట్టిన ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులుప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. దీనిని ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అవరోధంగా తయారయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులకు మళ్లాయి. దీంతో ఎవరికీ సరైన మెజారిటీ రాలేదు. ఇది బీజేపీకి లాభం చేకూర్చింది. చాలా స్థానాల్లో గెలుపు మార్జిన్లు చాలా స్వల్పంగా ఉండటం చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బాగా చీలినట్లు అర్థమవుతోంది. బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా కేవలం 0.85 శాతం కాగా, ఒంటరిగా పోటీ చేసిన ఆప్‌కు 1.79 శాతం ఓట్లు రావడం గమనార్హం.మరోవైపు దళితుల ఓట్లు పెద్దగా కాంగ్రెస్‌కు పడలేదు. జననాయక్ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, ఆజాద్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు ప్రధానంగా దళితుల ఓట్లపై దృష్టిపెట్టాయి. దీంతో దళితులు కేవలం ఒక్క పార్టీకే ఓటేయకుండా వేర్వేరు పార్టీలకు ఓట్లేయడంతో ఓట్లు చీలాయి. ఇవి పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చగా కాంగ్రెస్ నష్టపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ జాట్ల ఆధిపత్యం కొనసాగుతుందన్న భావనతో ఇతర కులాలు, వర్గాలు ఉద్దేశపూర్వకంగానే ఒక్క బీజేపీకే ఓటేశాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. బరిలో నిల్చొని దాదాపు 10 స్థానాల్లో విజయావకాశాలను కాంగ్రెస్ రెబల్స్ దెబ్బతీశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హరియాణాలో హ్యాట్రిక్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. 48 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించింది. గెలుపు తమదేననే ధీమాతో వెళ్లిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల నష్టాన్ని నివారించలేకపోయింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమి విజయాన్ని సొంతం చేసుకుంది. సీపీఎంతో కలిసి కూటమికి 49 స్థానాలు లభించాయి. హరియాణా ప్రజలు తప్పుడు ప్రచారాన్ని తిరస్కరించారు. అభివృద్ధికి గ్యారంటీని గెలిపించారు. భగవద్గీత బోధించిన నేలపై సత్యం, అభివృద్ధి, సుపరిపాలనకు దక్కిన విజయమిది. ఏ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా దీర్ఘకాలం పాటు ప్రజలు మద్దతిస్తూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్‌కు ‘నో ఎంట్రీ’చూపించారు. అధికారాన్ని జన్మహక్కుగా భావించే కాంగ్రెస్‌కు మళ్లీ అవకాశమివ్వడం చాలా అరుదు. వరుసగా మూడోసారి బీజేపీకి మెజారిటీ ఇచ్చిన హరియాణా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కూటములు కడుతూ భాగస్వాములపై ఆధారపడే కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవి. ఒక్కోసారి ఆ పార్టీలనే మింగేస్తుంటుంది.జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యం సాధించిన విజయం. మంచి ఫలితాలు సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు అభినందనలు. బీజేపీ సాధించిన ఫలితాలను చూసి గర్వంగా ఉంది. మా పార్టీపై నమ్మకముంచి, ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – బీజేపీ కార్యాలయంలో మోదీచండీగఢ్: పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను పటాపంచలు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారీ హరియాణాలో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. జాట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ చతికిలపడితే ఓబీసీ, దళితులు, బ్రాహ్మణుల ఓట్లను సమీకరించి బీజేపీ జయకేతనం ఎగరేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తగ్గిన ఎంపీ సీట్లతో కుదుపులకు లోనైన కమలనాథుల విజయరథ జైత్రయాత్ర.. హరియాణాలో మాత్రం సాఫీగా సాగింది.మంగళవారం ఉదయం కౌంటింగ్ మొదలయ్యాక ఆరంభ రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. తర్వాత ఉదయం 10, 11 గంటల సమయం దాటగానే ఫలితాల సరళిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యత క్రమంగా తగ్గుతూ బీజేపీ పుంజుకుంది. అది అలాగే తుదికంటా కొనసాగి కమలనాథులకు విజయాన్ని కట్టబెట్టింది. మంగళవారం వెల్లడైన హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీకి 39.94 శాతం ఓట్లు పడగా దాదాపు అదే స్థాయిలో కాంగ్రెస్‌కు 39.09 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కంటే కేవలం 0.85 శాతం ఓట్ల ఆధిక్యతతో బీజేపీ ఏకంగా 11 సీట్లను ఎక్కువ గెల్చుకోవడం గమనార్హం. చాలా చోట్ల అత్యల్ప తేడాతో కాంగ్రెస్ ఓడినట్లు వార్తలొచ్చాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించగా వాటిని నిరాధార ఆరోపణలుగా కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) పార్టీ కేవలం రెండు చోట్ల గెలిచింది. స్వతంత్రులు మూడు స్థానాల్లో నెగ్గారు. దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. సొంతంగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 1.79 శాతం ఓట్లతో గెలుపు బోణీ కొట్టలేక ఉసూరుమంది. మల్లయోధురాలి గెలుపు పట్టు బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ(లాద్వా), కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా(గర్హీ సాంప్లా–కిలోయీ) విజయం సాధించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం కొద్దిలో చేజార్చుకున్న మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ ఎన్నికల్లో మాత్రం విజయాన్ని తొలి ప్రయత్నంలోనే ఒడిసిపట్టుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఈమె జూలానా నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. హిసార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్నివాస్ రాణాపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్ స్వతంత్య్ర అభ్యరి్థగా పోటీచేసి గెలిచారు.జేజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, హరియాణా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు, బీజేపీ నేత భవ్య బిష్ణోయ్ ఓటమిని చవిచూశారు. భవ్య ఓడిపోయిన అదమ్‌పూర్ స్థానం గత ఐదు దశాబ్దాలుగా బిష్ణోయ్‌లకు కంచుకోటగా ఉంది. ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా సైతం ఓడిపోయారు. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేసిన బీజేపీ తన కేబినెట్ మంత్రులను మాత్రం గెలిపించుకోలేకపోయింది. అసెంబ్లీ స్పీకర్, బీజేపీ నేత జ్ఞాన్‌చంద్ గుప్తా, ఎనిమిది మంది మంత్రులు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో 15 శాతం ఓట్లతో 10 స్థానాల్లో గెలిచిన జననాయక్ జనతా పార్టీ ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 13 మందిమహిళల విజయం 90 స్థానాలున్న అసెంబ్లీలోకి ఈసారి 13 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ ఫొగాట్, సావిత్రి జిందాల్‌సహా 13 మంది గెల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళా అభ్యర్థులు గెలిచారు. బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు మహిళలు విజయం సాధించారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం: సీఎం సైనీ పార్టీని విజయతీరాలకు చేర్చినందుకు ఓటర్లకు బీజేపీ నేత, ముఖ్యమంత్రి సైనీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ మోదీ నాయకత్వంలో ప్రభుత్వ విధానాలకు ప్రజలు పట్టంకట్టారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం దక్కిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఈ గెలుపు ఘనత పూర్తిగా మోదీజీదే’ అని సీఎం అన్నారు. -
హర్యానా, కశ్మీర్ ఫలితాలపై హరీష్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గారడీలను హర్యానా ప్రజలు నమ్మలేదని.. అందుకే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని సెటైర్లు వేశారు. అటు కశ్మీర్లో బీజేపీని విశ్వసించలేదని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడింది.ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. అటు కశ్మీర్లో బీజేపీని విశ్వసించలేదు, హర్యానాలో కాంగ్రెస్‌ను విశ్వసించలేదు. రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉన్నదనేది సుస్పష్టం అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి.తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడింది. ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి…— Harish Rao Thanneeru (@BRSHarish) October 8, 2024 -
ఎన్ని అవమానాలు, ఎన్నెన్ని అవహేళనలు : ఆమె ఒక ఫీనిక్స్ పక్షి
ఆమె విజయం ప్రతి అమ్మాయి విజయం. అవును 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎంఎల్ఏ వినేశ్ ఫోగట్ విజయోత్సాహంతో అన్న మాటలు అక్షరాలా నిజం. దసరా నవరాత్రుల్లో ఆమెను విజయదుర్గగా జులనా నియోజకవర్గం ప్రజలు నిలిపారు. రెజ్లింగ్ రింగ్లోతగిలిన ప్రతీ దెబ్బను తట్టుకొని పైకి లేచినట్టుగా, సంచలన లైంగిక వేధింపుల వ్యతిరేక పోరాటంలో అలుపెరుగని పోరులో అరకొర చర్యలే మిగిలినా, అందినట్టే అందిన పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్ విజయంపై అనర్హత వేటు పడినా, ఫీనిక్స్ పక్షిలా ఆ గాయాల నుంచే తనను తాను పునఃప్రతిష్ట చేసుకొని అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అద్వితీయమైన మహిళా శక్తిని చాటింది.మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం ప్రతీ పోరు మహిళకు గర్వకారణం. 5761 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌ను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. ఇది ప్రతీ ఆడబిడ్డ పోరాడే మార్గాన్ని ఎంచుకునే ప్రతీ మహిళ విజయంగా ఆమె అభివర్ణించింది. ఈ దేశం తనకిచ్చిన ప్రేమను, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ వినేశ్ ఫోగట్ భావోద్వేగానికి లో నైంది. వినేశ్ విజయంపై కాంగ్రెస్ దిగ్గజ నేతలు, మరో రెజ్లర్, కాంగ్రెస్ నేత బజరంగ్ పునియా సహా, పలువురు సోషల్ మీడియా ద్వారా అభినందించారు. ముఖ్యంగా ఇది పార్టీల మధ్య పోరు మాత్రమే కాదు. ఈ పోరాటం బలమైన అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరు. ఈ గెలుపుతో దేశంలోని పోరాట శక్తులు విజయం సాధించాయని పునియా ఎక్స్‌లో రాసుకొచ్చారు.లైంగిక వేధింపుల ఆరోపణలతో మహిళా రెజర్ల పోరుఅప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు దుమారాన్ని రేపాయి. వినేశ్ ఫోగాట్, సాక్షి మలిక్, బజరంగ్ పునియా, ఇతర రెజ్లర్లు దీనిపై పెద్ద యుద్ధమే చేశారు. బ్రిజ్ భూషణ్‌ను అధికారిక పదవులనుంచి తొలగించి అరెస్టు చేయాలి, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలని, తమకు న్యాయం దక్కాలని డిమాండ్ చేస్తూ మూడు నెలలపాటుధర్నా చేశారు. ఈ పోరాటంలో మహిళా రెజర్లకు మద్దతుగా నిలిచి, న్యాయ పోరాటం చేసింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. సరికదా ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళన చేస్తున్న వీరిపై పోలీసుల దమనకాండచూసి యావత్ క్రీడాప్రపంచం, క్రీడాభిమానులు నివ్వెరపోయారు.వినేశ్ ఫోగట్1994 ఆగస్ట్ 25 న జన్మించిన ఆమె తన రెజ్లింగ్ కెరీర్లో అపారమైన విజయాలను అందుకుంది. కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేతగా అవతరించింది, 2014, 2018 2022లో స్వర్ణాలు గెలుచుకుంది. కామన్వెల్త్, ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ కూడా.అవార్డులు , రివార్డులు- 2016లో అర్జున అవార్డు- 2018లో పద్మశ్రీకి నామినేట్ అయ్యారు- 2019లో లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ నామినేషన్- 2020లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం,- 2022 లో బీబీసి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినేషన్రెజ్లింగ్ కెరీర్ హైలైట్స్- 2018 ఆసియా క్రీడల్లో 50 కేజీల విభాగంలో స్వర్ణం - 2014 ఆసియా క్రీడల్లో 48 కేజీల విభాగంలో కాంస్యం - 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో స్వర్ణం - 2019 , 2022 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లలో 53 కిలోల విభాగంలో కాంస్యంఇంత అద్భుతమైన రెజ్లింగ్ కెరీర్ తర్వాత, వినేష్ ఫోగట్ అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే కాదు తొలి ప్రయత్నంలోనే గెలుపు సాధించడం విశేషం. -
హర్యానాలో బీజేపీ జోరు.. కాబోయే సీఎం ఎవరంటే?
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దూసుకెళ్లోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో కాషాయ పార్థీ నేతలు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ నడుస్తోంది. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీనే మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం. సైనీవైపే హైకమాండ్ మొగ్గుచూపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో లాడ్వా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం సైనీ.. కాంగ్రెస్ అభ్యర్థి మేమా సింగ్‌పై భారీ విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్యానా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మూడో సారి బీజేపీకి అధికారం ఇచ్చినందకు ధన్యావాదాలు. మోదీ నాయకత్వం వల్లే విజయం సాధ్యమైందన్నారు. #WATCH | Kurukshetra: Haryana CM Nayab Singh Saini says "I want to thank the 2.80 crore people of Haryana for putting a stamp on the works of BJP for the third time. All this is only because of PM Modi. Under his leadership, we are moving forward. He spoke to me and gave his… pic.twitter.com/jPmMecyA8D— ANI (@ANI) October 8, 2024ఇదిలా ఉండగా.. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 90 స్థానాలు ఉన్న హర్యానాలో ఇప్పటికే 49 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. దీంతో మ్యాజిక్ ఫిగర్(46)ను అధికార బీజేపీ దాటేసింది. ఇక, ముందంజలో ఉన్న 49 స్థానాల్లో ఇప్పటికే 30 స్థానాల్లో కాషాయ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో, బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. అయితే, ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ క్రమంగా బీజేపీ దూసుకెళ్లింది. కాంగ్రెస్ పట్టున్న పలు స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక, ప్రస్తుత లెక్కల ప్రకారం.. బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో, ఇతరులు ఐదు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. BIG BREAKING NEWS 🚨 BJP heading for landslide victory in Haryana.BJP is leading on 51 assembly seats. Congress reduced to only 34. No one had imagined it even in dreams.Haryana CM Nayab Singh Saini dedicates Historic Haryana Hat-trick to PM Modi.#HaryanaElectionResult pic.twitter.com/xelrupD7At— ASHER (@ASHUTOSHAB10731) October 8, 2024 -
కాంగ్రెస్ బలపడింది అని అనుకోవడం లేదు..
-
జులనా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫొగట్ ముందంజ
-
కాంగ్రెస్ దే హార్యానా.. సీఎం పీఠం ఎవరిదంటే..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 నియోజకవర్గాలకు గానూ 55కి పైగా స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఇక రేపు(అక్టోబర్ 8) అధికారిక ఫలితాలు వెలువడనున్న ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానిపై చర్చ మొదలైంది.ప్రధానంగా సీఎం పదవికి ముందంజలో ఉన్న పార్టీ సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అయితే ఆ పదవికి కావాల్సిన అర్హతలు, అనుభవం తనకు ఉందని పేర్కొన్నారు.@నేనేమీ చెప్పలేను. నేనే కాదు. ఎవరూ ఏం చెప్పలేరు.. సీఎం ఎవరనే విషయం హైకమాండ్ ప్రకటన తర్వాతే తెలుస్తుంది.. హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారు.. నేను ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో మాట్లాడాను.. ఈ విషయం హైకమాండ్‌కు తెలుసు. అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది.’ అని కుమారి సెల్జా సోమవారం తెలిపారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర’ ఆయనపై. పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చేసిందని పేర్కొన్నారు. ‘రాహుల్ యాత్రతో మొత్తం మారిపోయింది. ఆయనపై ప్రజల్లో ఉన్న అవగాహన, కాంగ్రెస్‌పై ఉన్న అభిప్రాయం, బీజేపీపై ఉన్న అభిప్రాయం మారిపోయింది. అందుకే లోక్‌సభలో బీజేపీ సీట్లు ఎలా తగ్గాయో చూశాం. హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.’ అని పేర్కొన్నారు. -
హర్యానా ఎగ్జిట్ పోల్స్.. ఓటర్లు ఎటువైపు?
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారనేది తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో సర్వే సంస్థలు తమననిర్వహించిన సర్వే విడుదల చేస్తున్నాయి. Dainik Bhaskarబీజేపీ.. 15-29కాంగ్రెస్.. 44-54జేజేపీ.. 0-1ఐఎన్ఎల్డీ.. 1-5ఆప్.. 0-1ఇతరులు.. 4-9Dhruv Researchబీజేపీ.. 22-32కాంగ్రెస్..50-64జేజేపీ.. 0ఐఎన్ఎల్డీ..0ఆప్.. 0ఇతరులు.. 2-8Peoples Pulseబీజేపీ.. 20-32కాంగ్రెస్..49-61జేజేపీ.. 0-1ఐఎన్ఎల్డీ.. 2-3ఆప్.. 0ఇతరులు.. 3-5Republic Bharat- MATRIZబీజేపీ- 18-24కాంగ్రెస్..55-62ఆప్..0-3జేజేపీ.. 0-3ఐఎన్ఎల్డీ..3-6ఇతరులు..2-5హర్యానా హస్తగతమేనా?హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ప్రకటించింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్-55 , బీజేపీ-26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ, తన ప్రత్యర్థి బీజేపీపై 7-8 శాతం ఓట్ల ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్ఎల్డి-బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1 శాతం, జేజేపీ ఒక్క శాతం లోపు, ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఎన్నికల తర్వాత సీఎల్పీ లీడర్ భూపీందర్ సింగ్ హూడాకు 39 శాతం, సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనీకి 28 శాతం, కాంగ్రెస్ ఎంపీ కుమారీ సెల్జాకు 10 శాతం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు 6 శాతం మంది ముఖ్యమంత్రి కావాలని మద్దతిస్తున్నారని తెలిపింది.హర్యానా కాంగ్రెస్‌దే అంటున్న మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్మ్యాట్రిజ్ సర్వే ప్రకారం హర్యానాలో కాంగ్రెస్‌కు 55 నుంచి 62 సీట్లు..హర్యానాలో బీజేపీకి 18 నుంచి 24 సీట్లు మాత్రమే వస్తాయంటున్న మ్యాట్రిజ్మూడు నుంచి ఆరు సీట్లకే పరిమితం కానున్న ఐఎన్ఎల్డీసీఎన్ఎన్ సర్వేహర్యానాలో కాంగ్రెస్‌కు 59, బీజేపీకి 21 సీట్లువచ్చే అవకాశంకాగా గత రెండు పర్యాయాలుగా హర్యానాలో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. మూడోసారి సైతం తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామినే ధీమాను వ్యక్తపరుస్తోంది కాషాయ పార్టీ. మరోవైపు పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరి రాష్ట్ర ఓటర్లు బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని అందివ్వనున్నారా లేక.. మార్పు కోరుకుంటూ కాంగ్రెస్‌కు అందలం ఇవ్వనున్నారా అనేది మరికాసేపట్లో తేలనుంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం సర్వేల ఆధారంగా తెలిపే వివరాలు మాత్రమే.. అక్టోబర్ 8న వెలువడే అధికారిక ఫలితాలే తుది ఫలితాలు. -
హర్యానా ఎన్నికల వేళ బీజేపీకి షాక్
చండీగఢ్: బీజేపీ నేత, మాజీ ఎంపీ అశోక్ తన్వర్ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఆయన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందు మహేంద్రగఢ్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ముందు బీజేపీ చేరిన అశోక్‌ను ఆ పార్టీ సిర్సా లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించగా ఓటమి పాలయ్యారు.कांग्रेस ने लगातार शोषितों, वंचितों के हक़ की आवाज़ उठाई है और संविधान की रक्षा के लिए पूरी ईमानदारी से लड़ाई लड़ी है।हमारे इस संघर्ष और समर्पण से प्रभावित होकर आज BJP के वरिष्ठ नेता, पूर्व सांसद, हरियाणा में BJP की कैंपेन कमेटी के सदस्य और स्टार प्रचारक श्री अशोक तंवर… pic.twitter.com/DynuJEleSE— Congress (@INCIndia) October 3, 2024మాజీ కాంగ్రెస్ ఎంపీ అయిన తన్వర్.. 2014 నుంచి 2019 వరకు హర్యానా కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేశారు. 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి.. మరుసటి ఏడాది ఆప్‌లోకి మారారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయాన్ని అశోక్.. వ్యతిరేకిస్తూ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆప్‌ని వీడి బీజేపీ చేరారు. సార్వత్రిక ఎన్నికలలో సిర్సా నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి కుమారి సెల్జా చేతిలో ఓడిపోయారు.‘‘ సమాజంలోని అణగారిన వర్గాల కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ తన గళం వినిపిస్తుంది. కాంగ్రెస్ పోరాటం, అంకితభావానికి ప్రభావితమై.. బీజేపీ నేత, మాజీ ఎంపి, బీజేపీ ప్రచార కమిటీ సభ్యుడు, స్టార్ క్యాంపెయినర్ అశోక్ తన్వార్ కాంగ్రెస్‌లో చేరారు’’ అని కాంగ్రెస్ ఎక్స్‌లో పేర్కొంది.గురువారం ఉదయం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా తన్వర్ ట్వీట్ చేయడం గమనార్హం. అనంతరం కాంగ్రెస్ ర్యాలీలో ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హర్యానా రాష్ట్రంలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 5న (శనివారం) పోలింగ్ జరగనుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ప్రజా ధనంతో కొడుకు పెళ్లా?.. ముకేష్ అంబానీపై రాహుల్ ధ్వజం
చండీగఢ్: ప్రముఖ వ్యాపారవేత, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కోసం వేల కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేశాడని.. అదంతా దేశ ప్రజల నుంచి దోచిన సొమ్మేనని ఆరోపించారాయన.హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. అంబానీ తన కొడుకు పెళ్లికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు కదా? అది ఎవరిది.. అదంతా మీ(ప్రజల) డబ్బు.. మీ పిల్లలకు మీరు పెళ్లిళ్లు చేయాలంటే అక్కడ.. మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేదు.. మీ పిల్లల పెళ్లిళ్లకు మీరు బ్యాంకు రుణం తీసుకోవాల్సిందే. కానీ దేశంలో 25 మంది(పలువురు పారిశ్రామికవేత్తలు) మాత్రం తమ వివాహాలు, వేడుకలు జరిపించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చేశారు’ అని విమర్శలు గుప్పించారు.#WATCH | Haryana | Addressing a public rally in Sonipat's Gohana, Congress MP & LoP Rahul Gandhi says, "Did you see Ambani wedding? It went on for 15 days you all saw. Did you see Modi ji at the wedding? You saw it right. Did you see Rahul Gandhi there? It should be clear now who… pic.twitter.com/mh3N3E4CQc— ANI (@ANI) October 1, 2024రైతులు బ్యాంకుల్లో, వేరే వారి వద్ద నుంచి అప్పులు తీసుకుంటేనే తన కుటుంబంలో వివాహాలు జరిపించగలుగుతున్నారు. ప్రధాని మోదీ.. మీ జేబులో నుంచి డబ్బులు తీసుకొని ఆ 25 మంది జేబుల్లోకి వేస్తున్నాడని మండిపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. భారత సైనికుల నుంచి పెన్షన్, క్యాంటీన్, అమరవీరుల హోదాను లక్కోవడానికి అగ్నిపథ్ వంటి పథకాలు తీసుకొచ్చారని దుయ్యబట్టారు.#WATCH | Sonipat, Haryana: Congress MP and Leader of Opposition in Lok Sabha Rahul Gandhi while addressing a rally said, "There is everything for Adani, Ambani and billionaires....What is the meaning of Agniveer Yojana?... This scheme has only one aim - snatch away the money for… pic.twitter.com/1nFIlYmCtW— ANI (@ANI) October 1, 2024 ఇదిలా ఉండగా.. వ్యవసాయం ప్రధాన వృత్తిగా సాగుతున్న హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. అటు 10 సంవత్సరాల తర్వాత ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కృషి చేస్తోంది. అక్టోబర్ 8న వెలువడే ఫలితాలతో అటు రెండు పార్టీల భవితవ్యం తేలనుంది. -
Haryana Assembly elections 2024: రాహుల్ గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్: అమిత్
చండీగఢ్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇస్తున్న ఎన్నికల హామీలు అమలే కావడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాహుల్ గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆయన ఆదివారం హరియాణాలోని గురుగ్రాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమలుకు వీలుకాని ఎలాంటి హామీనీ బీజేపీ ఇవ్వదని మంత్రి అన్నారు. ‘‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ బాబా అండ్ కంపెనీ ఎలాంటి అభివృద్ధీ చేయలేదు. హరియాణాలో మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధికి హామీ ఇస్తుంది’’ అన్నారు. ‘‘సరిహద్దులను రక్షిస్తాం. రిజర్వేషన్లను కాపాడుతాం. ఆరి్టకల్ 370ను మళ్లీ రానివ్వం’’ అని స్పష్టం చేశారు. వక్ఫ్ నిబంధనల్లో లొసుగులను సరిదిద్దేందుకే పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు పెడుతున్నట్లు చెప్పారు. రాహుల్‌ను అబద్ధాల మిషన్‌గా అభివరి్ణంచారు. అగి్నవీర్లకు ఉద్యోగాలు రావంటూ దు్రష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. -
Haryana Assembly Elections 2024: రెబెల్స్ దడ
హరియాణాలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ముఖ్యనేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన 10 సీట్లలో ఐదు నెగ్గింది) కనబర్చిన కాంగ్రెస్ హరియాణాను తమ ఖాతాలో వేసుకోగలమనే ధీమాలో ఉంది. రైతుల అసంతృప్తి, నిరుద్యోగం, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజర్ల లైంగిక వేధింపుల ఆరోపణలు, అగి్నవీర్ పథకంపై యువతలో నెలకొన్న ఆగ్రహం.. కాంగ్రెస్ అవకాశాలను మెరుగుపరిచాయి. అయితే పార్టీలోని ఆధిపత్య పోరు కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. మరోవైపు బీజేపీ గడిచిన పదేళ్లలో చేసిన అభివృద్ధిపై ఆశలు పెట్టుకుంది. 20 స్థానాల్లో రెబెల్స్ ప్రభావంఅయితే రెండు పారీ్టలకూ తిరుగుబాటు అభ్యర్థులు దడ పుట్టిస్తున్నారు. టికెట్లు నిరాకరించడంతో.. పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. మరికొందరు ఇతర పార్టీల నుంచి నామినేషన్ వేశారు. మొత్తం మీద సొంత పార్టీలకు సవాల్ విసురుతున్నారు. హోరాహోరీ పోరులో రెబెల్స్ ఎవరి పుట్టిముంచుతారోననే దడ రెండు పారీ్టల్లోనూ ఉంది. హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. కనీసం 20 నియోజకవర్గాల్లో రెబెల్స్ ఫలితాలను తారుమారు చేసే స్థితిలో ఉన్నారు. 15 స్థానాల్లో 19 మంది బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. 20 నియోజకవర్గాల్లో 29 మంది కాంగ్రెస్ రెబెల్స్ పోటీలో ఉన్నారు. 7 స్థానాల్లో 12 మంది అసంతృప్త నేతలను కాంగ్రెస్ బుజ్జగించింది. అలాగే 6 నియోజకవర్గాల్లో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు పార్టీ సీనియర్ల విజ్ఞప్తులను మన్నించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హరియాణా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గణనీయమైన ఓట్ల శాతాన్ని రాబట్టుకుంటూ వస్తున్నారు. ఇది ప్రధాన పారీ్టలకు తలనొప్పిగా మారింది. గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో వీరు ఓట్లను చీల్చితే.. తాము నష్టపోతామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అందరి దృష్టి హిసార్ పైనే.. బీజేపీ రెబెల్స్‌లో దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నది సావిత్రి జిందాల్. ఓ.పి.జిందాల్ గ్రూపు చైర్పర్సన్ అయిన సావిత్రి భారత్‌లోనే అత్యంత సంపన్న మహిళ. హిసార్‌లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఆరోగ్యశాఖ మంత్రి కమల్ గుప్తాకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గూటికి చేరి.. కురుక్షేత్ర ఎంపీగా గెలిచారు. కమల్ గుప్తా గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ సావిత్రి జిందాల్ కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. గనౌర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవేందర్ కౌశిక్‌కు రెబెల్ అభ్యర్థి దేవేందర్ కడ్యాన్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. బీజేపీ ఓటు బ్యాంకును వీరిద్దరూ పంచుకుంటుండడంతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ శర్మకు కలిసివస్తోంది. కుల్దీప్ 2009, 2014లలో రెండుసార్లు గనౌర్ నుంచి గెలుపొందారు. బీజేపీ టికెట్‌ను నిరాకరించడంతో మాజీ విద్యుత్‌శాఖ మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలా రైనా నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్నారు. 2009, 2014లలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన రంజిత్‌సింగ్.. 2019లో రైనా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ చేరారు. గురుగావ్‌లో బీజేపీ ట్రేడ్ సెల్ మాజీ కనీ్వనర్ నవీన్ గోయల్ రెబెల్ అభ్యరి్థగా బరిలో నిలిచారు. సఫిదాన్‌లో బీజేపీ అభ్యర్థి రామ్‌కుమార్ గౌతమ్‌కు తిరుగుబాటు అభ్యర్థి బచన్‌సింగ్ ఆర్య చెమటలు పట్టిస్తున్నారు. సఫిదాన్‌లో బచన్‌సింగ్ 2009, 2019లలో రెండోస్థానంలో నిలువడం గమనార్హం. కాంగ్రెస్‌కూ సెగ.. అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున బలమైన నేత అనిల్ విజ్ మరోసారి బరిలో నిలువగా.. కాంగ్రెస్‌ను చిత్ర సర్వరా భయం వెంటాడుతోంది. 2009, 2014లలో అనిల్ విజ్ చేతిలో ఓటమి చవిచూసిన చిత్ర 2019లో స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగి రెండోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యరి్థని మూడోస్థానానికి నెట్టారు. దాంతో కాంగ్రెస్ ఆమెను ఆరేళ్లు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జగధారి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు ఆదర్శపాల్ గుర్జా ర్ పార్టీ మారి ఆప్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అక్రమ్ ఖాన్‌కు గట్టి సవాల్ విసురుతున్నారు. ఇది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్వర్పాల్కు అడ్వాంజేట్గా మారింది. అక్రమ్‌ఖాన్ 2009లో బీఎస్పీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లలో రెండోస్థానానికి పరిమితమయ్యారు. సదౌ రా నియోజకవర్గంలో బ్రిజ్‌పాల్ చప్పర్ బీఎస్పీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేణు బాలాపై పోటీచేస్తునానరు. రేణు 2019లో 17 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అయితే సదౌరాలో బీఎస్పీ 2009, 2019లలో 18–19 శాతం ఓట్లు సాధించడం.. కాంగ్రెస్ అభ్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొత్తం మీద ఏ పార్టీని రెబెల్స్ ఎంతమేరకు దెబ్బతీస్తారనేది అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు తర్వాత తేలనుంది. హరియాణా అసెంబ్లీకి అక్టోబరు 5న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
PM Narendra Modi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విధ్వంసమే
సోనిపట్: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ హరియాణాలో పొరపాటున అధికారంలోకి వస్తే విధ్వంసం తప్పదని అన్నారు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుందని, అస్థిరత రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు అధికారం అప్పగించవద్దని ప్రజలకు సూచించారు. బుధవారం హరియాణాలోని సోనిపట్ జిల్లా గొహానాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అస్థిరత, అవినీతి, బంధుప్రీతి తదితర అవలక్షణాలన్నీ ఉంటాయని ఆరోపించారు. కర్ణాటకలో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందని గుర్తుచేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య అంతర్గత యుద్ధం సాగుతోందన్నారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ అదే కథ అని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పట్ల హరియాణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో బడుగులకు అన్యాయం రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి మండిపడ్డారు రిజర్వేషన్ల పట్ల ద్వేషం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ రాజ కుటుంబంలోని నాలుగో తరం రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో లేనప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హక్కులు లభించాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయా వర్గాల హక్కులను లాక్కుందని, తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. పారిశ్రామికీకరణతో పేదలు, రైతులు, దళితులకు లబ్ధి ఇటీవల జరిగిన అమెరికా పర్యటన గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. అమెరికాలో పలువురు ముఖ్య నాయకులను, ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులను కలిశానని చెప్పారు. భారతీయ యువత నైపుణ్యాల గురించి వారికి వివరించానని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు నేడు భారత్‌లో ఫ్యాక్టరీలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. దేశంలో పారిశ్రామికీకరణ పెరిగితే పేదలు, రైతులు, దళితులు అధికంగా లబ్ధి పొందుతారని స్పష్టంచేశారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో బీజేపీ ప్రభుత్వం హరియాణాను అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దిందని ఉద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ బీజేపీకి ఆదరణ నానాటికీ పెరుగుతోందని, కాంగ్రెస్ దిగజారిపోతోందని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు. -
Haryana Assembly Elections 2024: బీజేపీలో చేరాలంటూ సెల్జాకు ఖట్టర్ ఆఫర్
చండీగఢ్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కుమారి సెల్జాను బీజేపీలో చేరాల్సిందిగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానించారు. ప్రముఖ దళిత నేత కూడా అయిన సెల్జా వచ్చే నెలలో జరిగే హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారన్న వార్తల నేపథ్యంలో మంత్రి ఈ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తీవ్రతరమైందని మంత్రి ఖట్టర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఘరువాండాలో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో మాట్లాడారు. -
Haryana: ఆ 11 స్థానాల్లో పోటాపోటీ
హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా తారస్థాయికి చేరుతోంది. పాలక బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ బలహీనపడిందన్న (2019లో మొత్తం పది సీట్లనూ బీజేపీ నెగ్గగా.. 2024లో కాంగ్రెస్ సగం స్థానాలను చేజిక్కించుకుంది) విపక్షాల వాదనకు బలం చేకూర్చేందుకు కాంగ్రెస్‌కు, దాన్ని పూర్వపక్షం చేసేందుకు అధికార పారీ్టకి ఈ ఎన్నికల్లో ఘన విజయం అత్యవసరంగా మారింది. ఢిల్లీ , పంజాబ్ వెలుపల ఉనికి చాటుకోజూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఈ ఎన్నికలు అగి్నపరీక్ష వంటివే. కాంగ్రెస్ సమరోత్సాహంతో కనిపిస్తుండగా, పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతతో సతమతమవుతోంది. రైతు ఆందోళనల వంటివి ఆ పారీ్టకి మరింత సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాలు ఈ రెండు పారీ్టలతో పాటు జేజేపీ, ఐఎన్ఎల్డీ వంటి ప్రాంతీయ పార్టీల హోరాహోరీ పోరుకు వేదికగా మారాయి. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆ హాట్ సీట్లపై ఫోకస్... గర్హీ సంప్లా కిలోయీ హుడా కంచుకోట రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా కంచుకోట. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇప్పటిదాకా ఓటమే ఎరగని నేత ఆయన. దాంతో ఈ స్థానాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్‌కు అత్యవసరం. 25 శాతం జనాభాతో హరియాణాలో ప్రబల శక్తిగా ఉన్న జాట్ల ఓట్లు ఈ స్థానంలో నిర్ణాయకం. వారిలో తమపై తీవ్ర ఆగ్రహం నెలకొని ఉండటం బీజేపీని కలవరపెడుతోంది. హుడాపై గాంగ్స్టర్ రాజేశ్ హుడా భార్య మంజు హుడాను బీజేపీ పోటీకి నిలిపింది. ఆమె తండ్రి మాజీ పోలీసు అధికారి కావడం విశేషం.బద్లీ బీజేపీకి గట్టి పరీక్షబీజేపీ నుంచి రాష్ట్ర పార్టీ మాజీ చీఫ్, జాట్ నేతఓం ప్రకాశ్ ధన్‌ఖడ్ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేశారు. 2014లో నెగ్గగా 2019లో కాంగ్రెస్ ప్రత్యర్థి కుల్దీప్ వత్స్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారీ ఆయనతోనే అమీతుమీ తేల్చుకుంటున్నారు. హోదాల్ బరిలో పీసీసీ చీఫ్ ఈ ఎస్సీ రిజర్వుడు స్థానంలో కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ బరిలో ఉన్నారు. దాంతో బీజేపీ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన జగదీశ్ నాయర్‌ను పక్కన పెట్టి హరీందర్‌సింగ్ రామ్ రతనన్కు టికెటిచి్చంది.హిస్సార్ బీజేపీకి జిందాల్ సవాల్! అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ కీలకంగా మారే ఈ స్థానం ఈసారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోనే ధనిక మహిళ అయిన పారిశ్రామిక దిగ్గజం సావిత్రి జిందాల్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగడమే అందుకు కారణం. ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవలే బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి విజయం సాధించడం తెలిసిందే. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కమల్ గుప్తాకే హిస్సార్ టికెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి మళ్లీ రామ్నివాస్ రారా బరిలో ఉన్నారు.తోశాం వారసత్వ పోరుకాంగ్రెస్ నుంచి పూర్వాశ్రమంలో క్రికెట్ అడ్మిని్రస్టేటర్ అయిన అనిరుధ్ చౌదరి బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి శ్రుతి చౌదరితో ఆయన తలపడుతున్నారు. వీరిద్దరూ దివంగత సీఎం బన్సీలాల్ మనవడు, మనవరాలు కావడం విశేషం. దాంతో అన్నాచెల్లెళ్ల పోరు అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి రాజ్యసభకు ఎన్నికైన కిరణ్ చౌదరి కూతురే శ్రుతి.కైతాల్ బరిలో సుర్జేవాలా జూనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా 2019లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి లీలారామ్ గుర్జర్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి గుర్జర్‌పై సుర్జేవాలా కుమారుడు ఆదిత్య బరిలో ఉన్నారు. తండ్రి ఓటమికి ఆయన బదులు తీర్చుకోగలరా అన్నది ఆసక్తికరంగా మారింది. జూలానా హై ప్రొఫైల్ పోరు ఈసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న స్థానం. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆ పార్టీ తరఫున ఇక్కడి నుంచి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. బీజేపీ కెపె్టన్ యోగేశ్ బైరాగికి టికెట్ ఇవ్వగా, ఆప్ నుంచి మరో రెజ్లర్ కవితా దేవి బరిలో దిగడం విశేషం. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల వివాదంలో మోడీ సర్కారు వ్యవహార శైలి బీజేపీకి ఇక్కడ బాగా ప్రతికూలంగా మారవచ్చని అంటున్నారు.అంబాలా కంటోన్మెంట్ కాంగ్రెస్‌కు ఇంటి పోరుబీజేపీ దిగ్గజం అనిల్ విజ్ ఇక్కడ ఆరుసార్లు గెలిచారు. మనోహర్‌లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో హోంమంత్రిగా చక్రం తిప్పారు. కానీ నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో చేరకుండా దూరం పాటిస్తున్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు వేళ బీజేపీ నేతలేవరూ వెంట లేకపోవడం చర్చకు తావిచ్చింది. కాంగ్రెస్ ఇక్కడ ఇంటి పోరుతో సతమతం అవుతోంది. పరీ్వందర్ సింగ్ పరీని బరిలో దించగా పార్టీ సీనియర్ నేత నిర్మల్‌సింగ్ కుమార్తె చిత్రా శర్వర ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు. గత ఎన్నికల్లో కూడా ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అనిల్ విజ్ చేతిలో 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.ఉచానా జేజేపీ అడ్డా! మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా సిట్టింగ్ స్థానం. రాష్ట్రంపై జేజేపీ పట్టు సడలుతున్న దృష్ట్యా ఈసారి ఇక్కడ ఘన విజయం ఆయనకు అత్యంత కీలకం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేజేపీ 10 సీట్లు నెగ్గి కింగ్ మేకర్‌గా ఆవిర్భవించడం, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం తెలిసిందే. బీజేపీ నుంచి దేవేందర్ అత్రి, కాంగ్రెస్ నుంచి బ్రిజేంద్ర సింగ్ ఆయనకు పోటీ ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ అయిన బ్రిజేంద్ర గత మార్చిలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు.లడ్వా సీఎం సైనీకి పరీక్ష! గత మార్చిలో ఖట్టర్ స్థానంలో సీఎంగా పగ్గాలు చేపట్టిన సైనీ ఇక్కడ బరిలో ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఖట్టర్ కంచుకోట అయిన కర్నాల్ నుంచి గెలిచిన ఆయన ఈసారీ అక్కడినుంచే పోటీ చేయాలని భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు పారీ్టకి అత్యంత సురక్షితమైన ఈ స్థానం నుంచి అయిష్టంగానే బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నెగ్గడం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యే మేవాసింగ్ ఈసారి కూడా బరిలో అన్నారు.ఎలెనాబాద్ ఐఎన్ఎల్డీకి అగి్నపరీక్ష జేజేపీ మాదిరిగానే నానాటికీ ప్రభ తగ్గుతున్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ)కు ఇక్కడ విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి అభయ్ సింగ్ చౌతాలా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి భారత్ సింగ్ బెనివాల్, బీజేపీ నుంచి ఆరెస్సెస్ మూలాలున్న అమర్ చంద్ మెహతా ఆయనకు పోటీ ఇస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల వేళ.. హర్యానా బీజేపీలో ట్విస్ట్!
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ విజ్ అన్నారు. అయితే ఇప్పటికే హర్యానాలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం నయాబ్ సింగ్ సైనీని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ విజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అంబాల కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న అనిల్ విజ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘‘ నేను ఇప్పటి వరకు పార్టీ నుంచి ఏం ఆశించలేదు. కానీ ఈసారి మాత్రం నా సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని నేను హర్యానాకు సీఎం కావాలనుకుంటున్నా. రాష్ట్రంలోని నలుమూలల నుంచి నన్ను కలవడానికి వస్తున్నారు. అంబాల ప్రజలు కూడా నేను చాలా సీనియర్ నేతను అని.. నేను ఎందుకు ముఖ్యమంత్రి కావొద్దని అడుగుతున్నారు. ప్రజల డిమాండ్, నా సీనియార్టి ఆధారంగా ఈసారి కచ్చితంగా నేను హర్యానా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా. నాకు పార్టీ అధిష్టానం ఈసారి సీఎంగా అవకాశం కల్పిస్తే.. హర్యానా ముఖచిత్రాన్ని మార్చివేస్తాను’’ అన్నారు. హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక.. సీఎం నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలో హర్యానాలో బీజేపీ మూడోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఫోకస్ పెట్టింది.#WATCH | BJP candidate from Ambala Cantt Assembly constituency Anil Vij says, "I am the senior most MLA of BJP in Haryana. I have contested elections for 6 times. On the demand of people, I will claim for the designation of CM on the basis of my seniority this time. However, it… pic.twitter.com/jdwQt9nKSS— ANI (@ANI) September 15, 2024చదవండి: తమిళ ప్రజలకు రాముడు తెలియకుండా చేశారు: గవర్నర్ రవి -
బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ పోటీ!
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశంలో అత్యంత ధనిక మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇంతకీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోటీ చేస్తున్న దేశంలోనే అత్యంత మహిళా సంపన్నురాలు ఎవరు?హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర నగర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హిసార్ అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..హిసార్ ప్రజలు నా కుటుంబ సభ్యులు.నా భర్త ఓం ప్రకాష్ జిందాల్ ఈ కుటుంబంతో మంచి సంబంధం ఉంది. జిందాల్ కుటుంబం ఎప్పుడూ హిస్సార్‌కు సేవ చేస్తూనే ఉంది. ప్రజల అంచనాలకు అనుగుణంగా,వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను పూర్తిగా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధంగా అని అన్నారు.ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోటీసావిత్రి జిందాల్ ప్రస్తుత రాష్ట్ర మంత్రి,హిసార్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తాపై పోటీ చేస్తున్నారు. మీ అబ్బాయి బీజేపీ ఎంపీగా పనిచేస్తున్నారు. మీరు అదే పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తాపై పోటీ చేస్తున్నారు. అంటే బీజేపీ రెబల్ అభ్యర్థిగా మారారా? అని ప్రశ్నించగా.. అలా ఏం లేదు. బీజేపీ సభ్యత్వం తీసుకోకుండానే నా కుమారుడు నవీన్ జిందాల్ తరుఫున లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశాను’అని గుర్తు చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ 2005,2009లలో హిసార్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా పని చేశారు. 2013లో సింగ్ హుడా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కాగా, ఈ ఏడాది మార్చిలో సావిత్రి జిందాల్,ఆమె కుమారుడు నవీన్ జిందాల్ పార్టీని వీడారు.నవీన్ జిందాల్ బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా జాబితాలోకాగా, సావిత్రి జిందాల్ ఈ ఏడాది ఫోర్బ్స్ ఇండియా జాబితాలో 29.1 బిలియన్ డాలర్ల నికర సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా చోటు సంపాదించారు -
Haryana: ఆసక్తికరమైన పోరు
జమ్మూ– కశ్మీర్లో తొలి విడత పోలింగ్‌కు మరొక్క వారమే మిగిలింది. హర్యానాలో నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో ముగియనుంది. ఈ పరిస్థితుల్లో కశ్మీర్లో ప్రచారం ఊపందుకుంటుంటే, హర్యానాలో అభ్యర్థుల ఖరారు తుది అంకానికి చేరింది. కశ్మీర్‌ను అటుంచితే... కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య సీట్ల సర్దుబాటు విఫలమవడంతో హర్యానా ఆసక్తి రేపుతోంది. బహుముఖ పోటీ అనివార్యమయ్యేసరికి పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఆప్ ఒంటరి పోరుకు దిగడమే కాక, మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కలాయత్ లాంటి చోట్ల గెలిచిన ఊపుతో, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న స్థానాల్లో అభ్యర్థుల్ని నిలిపి, పట్టణ ప్రాంతాలకే కాక మిగతా చోట్లకూ తన ఉనికిని విస్తరించు కోవాలని సాహసిస్తోంది. వీధికెక్కి పోరాడినా, లైంగిక వేధింపుల సమస్యను పరిష్కరించని కేంద్ర సర్కార్ వైఖరితో విసిగిన రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజ్రంగ్ పూనియాలు కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయం మరింత వేడెక్కింది. మహిళా రెజ్లర్లపై జనంలో సానుభూతి, పాలకుల నిర్లక్ష్యంతో రైతుల ఆగ్రహం, జాట్లు సహా వివిధ వర్గాల్లో అసంతృప్తి మధ్య అధికార బీజేపీ ఎదురీదుతోంది.మొత్తం 90 స్థానాలకు గాను కాషాయపార్టీ ఇప్పటికే 87 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మిగతా 3 స్థానాలను హర్యానా లోక్‌హిత్ పార్టీ (హెచ్ఎల్పీ) లాంటి చిరు మిత్రపక్షాల కోసం అట్టి పెట్టింది. అభ్యర్థుల ప్రకటనపై పార్టీలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటనతోనే అసంతృప్తి జ్వాలలు రగిలినా, రెండో విడత జాబితా కూడా ప్రకటించేసరికి అది మరింత పైకి ఎగసింది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ, మాజీ మంత్రులకూ టికెట్లు నిరాకరించేసరికి సమస్య పెద్దదైంది. పార్టీ రాష్ట్ర శాఖ ఆఫీస్ బేరర్ల మొదలు పలువురు సీనియర్ నాయకులు రాజీనామా చేయడం గమనార్హం. బీజేపీ హర్యానా శాఖ వైస్ ప్రెసిడెంటైన మాజీ డిప్యూటీ స్పీకర్, అలాగే రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, కొందరు మంత్రులు, మాజీ మంత్రులు సైతం అసెంబ్లీ టికెట్ దక్కలేదని కినుక వహించి, పార్టీని వీడారంటే పరిస్థితిని అర్థం చేసు కోవచ్చు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అసలైన కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేసి, పనిచేయనివారికీ, అసలు ఆ నియోజకవర్గ పౌరులే కానివారికీ సీట్లు కేటాయిస్తోందని సొంత పార్టీ వారే ఆరోపిస్తున్నారు. నిజానికి ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) చెందిన నయబ్ సైనీని కొంతకాలం క్రితం సీఎంను చేశాక హర్యానాలో పార్టీ గ్రాఫ్ కొంత పెరిగింది. ఇప్పుడూ సైనీనే సీఎం అభ్యర్థిగా చూపుతూ బీజేపీ ఎన్నికలకు వెళుతోంది. అయితే, ఆచరణలో మాత్రం ఆయన ప్రమేయం పెద్దగా లేకుండానే బీజేపీ టికెట్ల కేటాయింపు ప్రక్రియ జరిగిపోయిందని చెబుతున్నారు. ఏళ్ళ తరబడిగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని కొత్తవారికీ, ఇతర పార్టీల నుంచి ఫిరాయించి వచ్చిన వారికీ బీజేపీ పట్టం కట్టడం సైతం రేపు ఎన్నికల్లో పార్టీని కొంత దెబ్బ తీయవచ్చు. దానికి తోడు పార్టీలో అంతర్గత విభేదాలు, ఆశావహ సీఎం అభ్యర్థుల తాకిడి ఉండనే ఉన్నాయి. పదేళ్ళుగా అధికారంలో కొనసాగాక బీజేపీకి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం చిత్రమే. ఈసారి ఎన్నికల్లోనూ గెలిచి, వరు సగా మూడోసారి గద్దెనెక్కాలని చూస్తున్న కాషాయపార్టీకి ఇప్పుడది సులభం కాకపోవచ్చు. కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తోంది. పైగా ఎన్నికలంటే ఎక్కడైనా అధికార పక్షం పట్ల వ్యతిరేకత సహజం. బీజేపీలోని వర్గవిభేదాలు, రైతులు – జాట్ల లాంటి వర్గాలతో సహా గ్రామీణ ప్రాంతాల్లో దాని పట్ల అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలసి అక్టోబర్ 8న పోలింగ్‌లో విపక్షానికి అనుకూలించవచ్చు.లోక్‌సభ ఎన్నికల ఫలితాల సరళి, ప్రాథమిక ఒపీనియన్ పోల్స్‌ను బట్టి చూస్తే, కాంగ్రెస్‌కు కొంత అనుకూలత కనిపిస్తోంది. కానీ, అంతర్గత విభేదాలు ఆ పార్టీనీ పీడిస్తున్నాయి. స్వతంత్రు లుగా బరిలోకి దిగే అసమ్మతులతో అన్ని పార్టీలకూ చిక్కే. మరోపక్క ఎన్నికలిప్పుడు బీజేపీ,కాంగ్రెస్, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ కావడంతో అధికారపక్ష వ్యతిరేక ఓటు ఏ మేరకు చీలుతుంది, అది బీజేపీకి ఎంత మేర లాభిస్తుంది అన్నది ఆసక్తికరం. గతంలోకి వెళితే –∙2019 ఎన్నికల్లో హర్యా నాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అంతకు పదేళ్ళ ముందూ అలాగే జరిగింది. అలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీల వారు, స్వతంత్రులు కీలకమవుతారు. ఈ ‘ఇతరులు’ పాతికేళ్ళ క్రితం 30 శాతం ఓట్లు సాధిస్తే, క్రితంసారి అది 18 శాతానికి పడిపోయింది. అయితేనేం, ప్రతిసారీ వారు 8 నుంచి 16 సీట్ల మధ్య గెలుస్తున్నారని మర్చిపోలేం. 2009లో కాంగ్రెస్ స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతోనే గద్దెనెక్కింది. 2019లో బీజేపీ సైతం జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో ఎన్నికల అనంతర పొత్తుతోనే అధికారం చేపట్టింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇతరుల’కు 8 శాతం ఓట్లే వచ్చినా, స్థానిక అంశాలు ప్రధానమయ్యే అసెంబ్లీ ఎన్నికల్లో వారి పాత్ర గణనీయమవుతుంది. కాకపోతే, స్థానికమైన జేజేపీ గ్రామీణ ప్రాంతాల్లోని తన పట్టును నిలుపుకోలేకపోతోందనీ, సాంప్ర దాయిక రైతు ఓటర్లున్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) బలం ప్రస్తుతం కొద్ది స్థానాలకే పరిమితమనీ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో పెరుగుతున్న నిరుద్యోగం, లోపించిన పారిశ్రామికీకరణ, వివాదాస్పద అగ్నిపథ్ పథకం లాంటి అంశాలు బీజేపీని వెనక్కి లాగుతున్నాయి. హర్యానా జనాభా 20 శాతం దళితులే. తాజా లోక్‌సభ ఎన్నికల్లో వారిలో 68 శాతం మంది, అలాగే సగానికి పైగా ఓబీసీలు ‘ఇండియా’ కూటమికి మద్దతునిచ్చినట్టు విశ్లేషణ. ఇప్పుడూ అదే ధోరణి కొనసాగి, జాట్లు సహా ఇతర చిరకాల సమర్థక వర్గాల నుంచి విపక్షానికే మద్దతుంటే... అధికార పక్షా నికి చిక్కులు తప్పకపోవచ్చు. నిరుడు కర్ణాటక లానే ఇప్పుడు హర్యానాలో బీజేపీకి శృంగభంగం జరగవచ్చు. అక్టోబర్ 5న జరగనున్న ఎన్నికలు బీజేపీ ప్రతిష్ఠకు పెనుసవాలుగా మారింది అందుకే!