త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశంలో అత్యంత ధనిక మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇంతకీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోటీ చేస్తున్న దేశంలోనే అత్యంత మహిళా సంపన్నురాలు ఎవరు?
హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర నగర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హిసార్ అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..హిసార్ ప్రజలు నా కుటుంబ సభ్యులు.నా భర్త ఓం ప్రకాష్ జిందాల్ ఈ కుటుంబంతో మంచి సంబంధం ఉంది. జిందాల్ కుటుంబం ఎప్పుడూ హిస్సార్‌కు సేవ చేస్తూనే ఉంది. ప్రజల అంచనాలకు అనుగుణంగా,వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను పూర్తిగా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధంగా అని అన్నారు.
ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?
బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోటీ
సావిత్రి జిందాల్ ప్రస్తుత రాష్ట్ర మంత్రి,హిసార్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తాపై పోటీ చేస్తున్నారు. మీ అబ్బాయి బీజేపీ ఎంపీగా పనిచేస్తున్నారు. మీరు అదే పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తాపై పోటీ చేస్తున్నారు. అంటే బీజేపీ రెబల్ అభ్యర్థిగా మారారా? అని ప్రశ్నించగా.. అలా ఏం లేదు. బీజేపీ సభ్యత్వం తీసుకోకుండానే నా కుమారుడు నవీన్ జిందాల్ తరుఫున లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశాను’అని గుర్తు చేశారు.
రెండు సార్లు ఎమ్మెల్యే
సావిత్రి జిందాల్ 2005,2009లలో హిసార్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా పని చేశారు. 2013లో సింగ్ హుడా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కాగా, ఈ ఏడాది మార్చిలో సావిత్రి జిందాల్,ఆమె కుమారుడు నవీన్ జిందాల్ పార్టీని వీడారు.నవీన్ జిందాల్ బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఫోర్బ్స్ ఇండియా జాబితాలో
కాగా, సావిత్రి జిందాల్ ఈ ఏడాది ఫోర్బ్స్ ఇండియా జాబితాలో 29.1 బిలియన్ డాలర్ల నికర సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా చోటు సంపాదించారు
Comments
Please login to add a commentAdd a comment