హర్యానా ఫలితాలు: కాంగ్రెస్‌ నిజ నిర్ధరణ కమిటీ ఏర్పాటు! | Congress will form fact finding committee for Haryana elections loss | Sakshi
Sakshi News home page

హర్యానా ఫలితాలు: కాంగ్రెస్‌ నిజ నిర్ధరణ కమిటీ ఏర్పాటు!

Published Thu, Oct 10 2024 3:07 PM | Last Updated on Thu, Oct 10 2024 3:22 PM

Congress will form fact finding committee for Haryana elections loss

చండీగఢ్‌: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ నిజ నిర్ధరణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హర్యానాలో ఊహించని ఫలితాలు రావడంతో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, అశోక్‌ గహ్లోత్ తదితరులు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిజ నిర్ధరణ కమిటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్‌ నేతలు వచ్చినట్లు సమాచారం.

 

సమీక్ష అనంతరం.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ అబ్జర్వర్, కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు.‘‘ మేము హర్యానా ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశం నిర్వహించాం. ఎన్నికల పోల్ ఫలితాలు చాలా అనూహ్యమైనవి. ఎగ్జిట్ పోల్స్, వాస్తవ ఫలితాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది.ఈ వ్యవహారంపై మేము ఏం చేయాలో నిర్ణయించుకున్నాం.దాని ప్రకారమే ముందుకు వెళ్తాం’’ అని అన్నారు.

 

హర్యానా ఎన్నికలక ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు.‘‘ మేము హర్యాలో పొందిన ఓటమిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రజలు అభిప్రాయ పడినట్లు పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అందుకే  ఈ వ్యవహారంలో పూర్తిగా పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.

ప్రతికూల ఫలితాల్చిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ పద్ధతి, ఈవీఎంల పనితీరును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ఇక.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అద్భుతమైన విజయం సాధించింది. కాంగ్రెస్‌ ఆశలు ఆవిరి చేస్తూ 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 37 స్థానాల్లో గెలుపొందింది. 1966లో రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి బీజేపీ ఇన్ని సీట్లు సాధించడం ఇదే తొలిసారి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement