Fact Finding Committee
-
హర్యానా ఫలితాలు: కాంగ్రెస్ నిజ నిర్ధరణ కమిటీ ఏర్పాటు!
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నిజ నిర్ధరణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హర్యానాలో ఊహించని ఫలితాలు రావడంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, అశోక్ గహ్లోత్ తదితరులు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిజ నిర్ధరణ కమిటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్ నేతలు వచ్చినట్లు సమాచారం.Congress will form a fact-finding committee for poll loss in Haryana: Sources— ANI (@ANI) October 10, 2024 సమీక్ష అనంతరం.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ అబ్జర్వర్, కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు.‘‘ మేము హర్యానా ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశం నిర్వహించాం. ఎన్నికల పోల్ ఫలితాలు చాలా అనూహ్యమైనవి. ఎగ్జిట్ పోల్స్, వాస్తవ ఫలితాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది.ఈ వ్యవహారంపై మేము ఏం చేయాలో నిర్ణయించుకున్నాం.దాని ప్రకారమే ముందుకు వెళ్తాం’’ అని అన్నారు.#WATCH | Delhi | AICC Observer for Haryana assembly elections, Congress leader Ajay Maken says, " We held a review meeting on HAryana election results. Poll results were unprecedented. There was a lot of difference between exit polls and actual results. We have decided what we… pic.twitter.com/bvYa34TZbD— ANI (@ANI) October 10, 2024 హర్యానా ఎన్నికలక ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు.‘‘ మేము హర్యాలో పొందిన ఓటమిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రజలు అభిప్రాయ పడినట్లు పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అందుకే ఈ వ్యవహారంలో పూర్తిగా పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.#WATCH | Delhi | AICC senior observer for Haryana polls, Congress leader Ashok Gehlot says, "We are taking this loss very seriously. The exit polls, the public in one voice was saying that Congress would form govt (in Haryana). We need to go to the root of this..." pic.twitter.com/CPOncfICCy— ANI (@ANI) October 10, 2024ప్రతికూల ఫలితాల్చిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పద్ధతి, ఈవీఎంల పనితీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ఇక.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అద్భుతమైన విజయం సాధించింది. కాంగ్రెస్ ఆశలు ఆవిరి చేస్తూ 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుపొందింది. 1966లో రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి బీజేపీ ఇన్ని సీట్లు సాధించడం ఇదే తొలిసారి. -
పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన?
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రస్తుతం దేశ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. సందేశ్‌ఖాలీలో మహిళలను కొందరు టీఎంసీ నేతలు లైంగికంగా వేధించారని, వారి భూములు ఆక్రమించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌లు పశ్చిమ బెంగాల్‌లోని మమత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సందేశ్‌ఖాలీకి వెళ్తున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత వారిని విడుదల చేశారు. ఇప్పుడు ఆ నిజనిర్ధారణ బృందం పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌తో సమావేశమైంది. వారు సందేశఖలీ అంశంపై తమ అభిప్రాయాన్ని గవర్నర్ ముందు వెల్లడించారు. సందేశ్‌ఖాలీకి వెళ్లేందుకు తాము వెళుతుండగా పోలీసులు తమను అడ్డుకున్నారని వారు గవర్నర్‌కు తెలిపారు. దాదాపు గంటన్నర పాటు తమను నిర్బంధించి, ఆ తరువాత విడుదల చేశారని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తాము గవర్నర్‌ను కోరామని నిజనిర్ధారణ బృందం మీడియాకు తెలిపింది. రాష్ట్రంలో సెక్షన్ 144 అమలు చేయాలని కోరామని, దేశ పౌరులు స్వేచ్ఛగా తిరగలేకపోవడం కన్నా దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండదని వారు వాపోయారు. తమ అరెస్టు చట్ట విరుద్ధమని ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ గవర్నర్‌తో భేటీ సందర్భంగా పేర్కొంది. కాగా ఈ బృందానికి పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి, ఇతర సభ్యులు నాయకత్వం వహించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ ఆరోపణలపై వెంటనే డీజీపీ నుంచి నివేదిక తీసుకోవాలని గవర్నర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
సందేశ్‌ఖాలీ ఆందోళనలు.. నిజనిర్ధారణ కమిటీ సభ్యుల అరెస్ట్
కోల్‌కతా: సందేశ్‌ఖాలీలో మహిళలపై టీఎంసీ నేతల ఆగడాల్లో నిజాలు నిగ్గు తేల్చడానికి వెళ్లిన నిజ నిర్ధారణ బృంద సభ్యులను పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ బృందంలో తెలుగు వ్యక్తి, పాట్నా హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి రాజ్‌పాల్‌సింగ్, నేషనల్ ఉమెన్ కమిషన్ మాజీ సభ్యురాలు చారు వలి కన్నా, న్యాయవాది భావ్నా బజాజ్ ఉన్నారు. సందేశ్‌ఖాలీకి వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేసినందుకుగాను నిజనిర్ధారణ కమిటీ సభ్యులంతా ధర్నాకు దిగారు. అయితే వీరిని శాంతికి విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో ముందస్తు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘మేం సందేశ్‌ఖాలీకి వెళ్లి బాధిత మహిళలతో మాట్లాడాలనుకున్నాం. కానీ పోలీసులు వెళ్లనివ్వకుండా మమ్మల్ని కావాలని అరెస్ట్ చేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.సెక్షన్ 144ను ఉల్లంఘించబోము అని చెప్పినా పోలీసులు వినడం లేదు’అని నిజనిర్ధారణ కమిటీ సభ్యురాలు చారుకన్నా తెలిపారు. #WATCH | West Bengal: A member of the Fact-Finding Committee, OP Vyas says, "We are sitting here obediently to oppose as they (police) have stopped us illegally which is against our rights. We'll complain about it to the CM, Governor, Union HM and even to the PM. During Ram… pic.twitter.com/Fg21ZawAXD — ANI (@ANI) February 25, 2024 కాగా, పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమపై లైంగిక దాడులు చేసేందుకు, తమ భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో షాజహాన్‌ఖాన్ ఇంటిపై ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు కూడా జరిపింది. దాడులు జరుపుతున్న సమయంలో షాజహాన్‌ఖాన్ మనుషులు ఈడీ సిబ్బందిపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి షాజహాన్‌ఖాన్ పరారీలో ఉన్నాడు. ఇదీ చదవండి.. మమత అక్క కాదు.. గయ్యాలి అత్త -
వారికి వారే మాట్లాడుకొని వెళ్లారు!
సాక్షి, హైదరాబాద్: లింగోజీగూడ కార్పొరేటర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కోసం పలువురు కార్పొరేటర్లతోపాటు బీజేపీ ముఖ్య నేతలు రాంచందర్‌రావు, శేఖర్‌రావు తదితరులు టీఆర్ఎస్ నేతలను, మంత్రి కేటీఆర్‌ను కలిసిన విషయంలో వారికి వారే సొంతంగా నిర్ణయం తీసుకొని వెళ్లారని నిజ నిర్ధారణ కమిటీ పేర్కొంది. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికను ఆయనకు అందజేసింది. ఈ విషయంపై బండి సంజయ్‌కి సమాచారం ఇవ్వకపోవడం పొరపాటేనని నేతలు కమిటీ ముందు ఒప్పుకున్నారు. అయితే నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. చదవండి: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా? -
ఢిల్లీ అల్లర్లు : కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ
న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణలకు సంబంధించి కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి మెమొరాండం సమర్పించారు. ఢిల్లీ హింసకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆదేశించాలని ఈ సందర్భంగా వారు రాష్ట్రపతిని కోరారు. అలాగే ఢిల్లీలో అల్లర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. తాజాగా ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సోనియా గాంధీ తెలిపారు. ఈ బృందం ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ కమిటీలో ముకుల్ వాస్నిక్, తారిక్ అన్వర్, సుష్మితా దేవ్, శక్తిసిన్హా గోహిల్, కుమారి సెల్జా సభ్యులుగా ఉన్నారు. ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఈ కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సోనియాగాంధీకి అందజేయనున్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో 42 మంది మృతిచెందగా, 300 మందికిపైగా గాయపడ్డారు. చదవండి : ఢిల్లీ అల్లర్లు : రాహుల్, ప్రియాంకలపై పిటిషన్ వందల్లో ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోరా? ఐబీ అధికారి హత్య : గంటల పాటు సాగిన అరాచకం ఢిల్లీ ప్రశాంతం..! -
కోటయ్య ఫోన్ ఎందుకు మాయం చేశారు?
సాక్షి, గుంటూరు : బీసీ రైతు కోటయ్యను చంపేశారనడానికి వంద ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించింది. చంద్రబాబు సర్కారే కోటయ్యను చంపేసిందని, ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ, మంత్రి నారా లోకేష్ చెబుతున్నదానికి పొంతన లేదని వ్యాఖ్యానించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్థారణ కమిటీ బుధవారం పుట్టకోటలో పర్యటించిన.. కోటయ్య కుటుంబసభ్యుల్ని పరామర్శించింది. అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ...‘వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీని పర్యటించకుండా అడ్డుకుంటున్నారు. కోటయ్య కుటుంబసభ్యులపై సామ,దాన,భేద, దండోపాయాలు ప్రయోగించారు. రైతుల పొలానికి, సీఎం హెలీపాడ్‌కు సంబంధం లేదని లోకేష్ అంటున్నారు. మరోవైపు కోటయ్య అనుమతితోనే పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టామని నిన్న ఎస్పీ చెప్పారు. లోకేష్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో వివరణ ఇవ్వాలి. కోటయ్యను రక్షించే క్రమంలో విద్యుత్ విభాగానికి చెందిన వాహనం పొలంలో కొద్దిమేర తొక్కిందని ఎస్పీ చెప్పారు. బొప్పాయి తోటలో పోలీసులు కాయలు కోస్తే కోసుండొచ్చని ఎస్పీ చెప్పారు. దీన్నిబట్టి పోలీసులు పొలంలోకి ప్రవేశించారని అర్థం అవుతోంది. లోకేష్ మాత్రం కోటయ్యకు పొలమే లేదంటున్నారు. పంట నష్టపోతే రైతు ప్రశ్నించకుండా ఉంటాడా?. కోటయ్య మద్యానికి బానిసని, మరో మహిళతో పరిచయం ఉందని, అందుకే మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నారు. కోటయ్యను కొట్టారని కుటుంబసభ్యులు నిన్న మీడియాకు చెప్పారు. పోలీసుల భుజాలపై తీసుకెళ్లింది కోటయ్య శవాన్ని మాత్రమే. బతికున్న మనిషిని ఎవరైనా పరిగెత్తుకుంటు తీసుకెళ్తారా?. ముఖ్యమంత్రి సభ ఉంటే..అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. మరి పోలీసులు భూజాన వేసుకుని పరిగెత్తాల్సిన అవసరం ఏంటి?. కోటయ్య మృతదేహాన్ని పోలీసు జీపులోనే ఎందుకు పెట్టారు?. అతడిని తీసుకెళ్లిప్పుడు దుస్తులు.. గ్రామస్తులకు అప్పగించిన దుస్తులు మధ్య తేడా ఉంది. కోటయ్య దగ్గర పనిచేస్తున్న పున్నారావును పోలీసులు ఎందుకు బెదిరించారు. కోటయ్య, పున్నారావు ఫోన్లు ఎందుకు మాయం చేశారు. కోటయ్య అర ఎకరం ఇచ్చారని ఓసారి, 4 ఎకరాలు ఇచ్చారని మరోసారి పోలీసులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. జ్యుడీషియల్ విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి’ అని పేర్కొన్నారు. -
ఆత్మహత్య చేసుకున్నాడని అసత్య ప్రచారం
-
ఇంటికి వచ్చి బేరం చేయాల్సిన అవసరమేంటి?
సాక్షి, అమరావతి : రైతు కోటయ్య విషయంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, ప్రభుత్వం కూడా ఈ విషయంలో వాస్తవాలను కప్పిపెడుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసుల దెబ్బలు తాళలేకే కోటయ్య మృతి చెందాడని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ సందర్భంగా గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో పోలీసుల దౌర్జన్యం వల్ల బీసీ రైతు పిట్టల కోటేశ్వరరావు సోమవారం మరణించిన సంగతి తెలిసిందే. రైతు కోటయ్య మరణంపై మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి పూర్తి భరోసా ఇచ్చేందుకు ఉమ్మారెడ్డి నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ బుధవారం కొండవీడును సందర్శించింది. కోటయ్య కుటుంబాన్ని పరామర్శించిన పార్టీ నేతలు వైఎస్సార్ సీపీ తరఫున లక్ష ఆర్థిక సాయం అందించారు. (చంద్రబాబు సర్కారుకు రైతంటే ఇంత అలుసా?) అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...‘రైతు కోటయ్య పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. అతడి తోటను ధ్వంసం చేశారు. పంట పాడు చేయొద్దన్న కోటయ్యను పోలీసులు కొట్టారు. పోలీసుల దెబ్బలు తాళలేకే కోటయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే పోలీసులు మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతో మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వాస్తవాలు తెలుసుకునేందుకు కోటయ్య మృతిపై నిజనిర్థారణ కమిటీ వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ కుటుంబానికి మొత్తం రూ.10 లక్షలు సాయం అందిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అన్నమాటకు కట్టుబడి ఉండాలి. పోలీసులు పెట్టిన ఇబ్బందుల వల్ల కూడా ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అన్నారు. నిజం కోటయ్య పురుగుల మందు తాగి చనిపోయాడా? లేక పోలీసులు కొట్టిన దెబ్బలతో చనిపోయాడా? అనే దానిపై విచారణ జరపాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవమా? పోలీసులు చెప్పింది నిజమా అనే దానిపై జ్యుడీషియల్ విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలి. పోలీసుల తప్పు ఏమీ లేకుంటే జరిగిందే జరిగిపోయింది... రూ.3 లక్షలు ఇస్తామంటూ కోటయ్య ఇంటికి వచ్చి బేరం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?. పోలీసుల భిన్నవాదనలపై విచారణ చేయించి, కోటయ్య వద్ద పనిచేసే పున్నారావును విచారణ చేయాలి’ అని డిమాండ్ చేశారు. కోటయ్య పిరికివాడు కాదు: పార్థసారధి రైతు కోటయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి అన్నారు. అతడి మరణానికి ముఖ్యమంత్రి, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేయించి వాస్తవాలు వెలికితీయాలని, కోటయ్య మృతిపట్ల పోలీసులు అసత్యాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. (కోటయ్య మృతిపై నిజనిర్ధారణ కమిటి వేసిన వైఎస్ జగన్) నిజనిర్ధారణ కమిటీలో బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ తదితరులు సభ్యులుగా ఉన్నారు. -
కొండవీడులో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: జిల్లాలోని కొండవీడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీసీ రైతు కోటయ్య మృతికి గల వాస్తవాలను వెలికితీసేందుకు యడ్లపాడు మండలం పుట్టకోట పర్యటనకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు వారిని గ్రామంలోకి వెళ్లనీయలేదు. దీంతో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్ సీపీ నేతలు తమ వాహనాలను అక్కడే వదిలేసి గ్రామంలోకి నడుచుకుంటూ వెళ్లారు. వైఎస్సార్ సీపీ నేతలు వెళ్లిన పావుగంట తర్వాత పోలీసులు కొండవీడులోకి వాహనాలను అనుమతిచ్చారు. (రైతును మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ..) బీసీ రైతు కోటయ్య ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్లిన నిజనిర్థారణ కమిటీ సభ్యులు.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. అంతేకాకుండా కోటయ్య మృతికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండవీడు పర్యటన రోజు రైతు కోటయ్య అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కోటయ్య మృతిపై ఎన్నో రకాల అనుమానాలు తలెత్తడంతో.. వాస్తవాలను గుర్తించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఉమ్మారెడ్డి ఆధ్వర్యంలోని ఈ నిజనిర్ధారణ కమిటీలో పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ సభ్యులుగా ఉన్నారు. -
వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ నియామకం
సాక్షి, అమరావతి : గురజాల అక్రమ గనుల తవ్వకాలపై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. కమిటీ కన్వీనర్‌గా కాసు మహేశ్ రెడ్డి, సభ్యులుగా బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మహ్మద్ ఇక్బాల్‌తో పాటు నరసరావు పేట పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఎఫ్సీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు
-
పాలకమండలి నోరు నొక్కిన ముఖ్యమంత్రి
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తాంత్రిక పూజలపై నమోదైన కేసును మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. అర్థరాత్రి దుర్గగుడిలో అసలు పూజలే జరగలేదని నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అయితే నివేదికపై వస్తున్న లీకులపై తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు చేసిన ఆలయ పాలకమండలి సభ్యులు మౌనం వహిస్తున్నారు. తాంత్రిక పూజల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకమండలి సభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై పాలకమండలి సభ్యులు నోరు మెదపవద్దని ఇప్పటికే చంద్రబాబు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. అసలేం జరిగింది.. దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయనే ఆరోపణలు రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురి చేశాయి. స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఈ ఘటనతో సంబంధముందనే మరో ఆరోపణ మరింత విస్తుపోయేలా చేసింది. అయితే ఈవో సూర్యకుమారి ...ఆలయంలో పూజలు జరగలేదని వివరణ ఇస్తే...పాలకమండలి సభ్యులు మాత్రం తాంత్రిక పూజలు జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టి.. రెండు రోజుల నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పూజలు జరిగాయని తేలితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. సీన్ రివర్స్.. రెండు రోజుల పాటు తాంత్రిక పూజలపై విచారణ చేయాల్సిన కమిటీ ఒక రోజుతోనే విచారణను ముగించింది. అంతేకాదు అర్థరాత్రి ఆలయంలో అసలు పూజలే జరగలేదనే లీకులు ఇచ్చింది. వాస్తవానికి నిర్ధారణ కమిటీ సభ్యులు నివేదికను ఆదివారం కమిషనర్‌కు సమర్పించాల్సివుంది. అయితే, నివేదికపై ముందుగానే కమిటీ సభ్యులు లీకులు ఇవ్వడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమ్మవారి ముందు అలాంటి పూజలు చేసే ధైర్యం ఎవరికీ లేదని విచారణ కమిటీలోని సభ్యుడు ఒకరు అన్నట్లు తెలిసింది. దీంతో కేసును మూసేసేందుకు కమిటీని ప్రభుత్వం పావుగా వాడుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రపతి పేరు.. మరోవైపు దుర్గ గుడిలో జరిగిన తాంత్రిక పూజల వ్యవహారంపై చర్చలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేరును వాడినట్లు సమాచారం. అయితే, ఏ విషయంపై రాష్ట్రపతి పేరును తీసుకువచ్చరన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం చేసింది చిన్న అపచారం కాదు కనకదుర్గమ్మ ఉగ్రరూపంలో ఇంద్రకీలాదిపై స్వయంభూగా వెలసింది. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలను తన చల్లని చూపులతో కటాక్షించాలని అమ్మవారిని వేడుకుంటూ మూలవిరాట్‌ను కళాన్యాసంతో పరిపుష్టం చేశారు. స్మార్త వైదిక ఆగమం ప్రకారం కళాన్యాసంలో 10 విభాగాల కింద మొత్తం 96 కళలు ఉంటాయి. ఈ కళలను అమ్మవారి మూలవిరాట్‌లో పరిపుష్టం చేసి, కవచం తొడిగారు. ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు మహిమాన్వితమైన ఆ కవచాన్ని కదిపి ఘోర అపరాధానికి పాల్పడ్డారు. -
మన కమిటీ.. మన నివేదిక!
సాక్షి, అమరావతి: వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదు అనే సామెత అక్షరాలా సరిపోతుంది దుర్గగుడి వ్యవహారంలో. వివాదం ఏదైనా కమిటీ వేసేది మనమే.. వచ్చే నివేదిక మనకు అనుకూలంగానే అన్న చందంగా తయారయ్యింది ప్రస్తుత పరిస్థితి. నిజనిర్థరణ కమిటీని వేసి విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇందుకోసం ముందుగానే తాంత్రిక పూజలు జరగలేదని నిజనిర్థారణ కమిటీతో చెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, కీలక నిందితుడు పార్థసారథితో పాటు అర్చకులు, దేవస్థానం ఇద్దరు ప్రధాన అర్చకులు, స్థానాచార్య, ఇతర అర్చకులను పిలిచి విచారణ చేశారు. ఈ విచారణలో కొంత మంది తాంత్రిక పూజలు జరిగాయని నిర్థారించి చెప్పగా, మరికొంత మంది అర్చకులు కూడా తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవేమని అభిప్రాయ పడ్డారు. అయితే ఆలయ అధికారులు, అర్చకులు విచారణలో చెప్పిన మాటలను కమిటీ పరిగణలోకి తీసుకోకుండా నివేదిక సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల ఒత్తిడికి లోబడి నివేదిక రూపుదిద్దకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు, నివేదికను ఎలా రూపొందించాలి అనే విషయంపై నిజనిర్థారణ కమిటీతో పలుపార్లు చర్చలు జరిపారు. ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా తాంత్రిక పూజలు జరగలేదనే విధంగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. దేవస్థానంలోని విషయాలు బయటకు పొక్కడం వల్ల ఎవరూ నోరు ఎత్తవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. నిజ నిర్ధారణ కమిటీ తీరుపై హిందూ ధర్మకర్తలు, పీఠాధిపతులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాలను వెల్లడించాల్సిన కమిటీ ప్రభుత్వం ఒత్తుడులకు లోబడి పనిచేసిందని విమర్శించారు. దుర్గాదేవి, మహిషాసురమర్దిని అవతారాలు ఒక్కటేనని మీరు ఎలా నిర్ణయిస్తారంటూ కమిటీ సభ్యులపై స్వామీజీలు మండిపడ్డారు. -
అంతా తూచ్!
‘డిసెంబర్ 26వ తేదీ దుర్గగుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదు. ఆలయ ప్రధాన అర్చకుడు బదిరీనాథ్‌బాబు అలాంటి వారు కాదు. ఇతర అర్చకుల సహాయం తీసుకున్నారు. అంతే..’ అంటూ దుర్గగుడి ఉద్యోగుల సంఘం నిజనిర్ధారణ కమిటీ ముందు వాపోయింది. శుక్రవారం ఉదయం నుంచి 11 గంటల పాటు సాగిన విచారణలో దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటోందని వారంతా ఆవేదన చెందారు. అనంతరం ఉద్యోగులంతా కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా గప్‌చుప్‌గా వెళ్లిపోయారు. సాక్షి,విజయవాడ: దుర్గగుడిలో డిసెంబర్ 26వ తేదీ రాత్రి ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదంటూ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగులు, అర్చకుల సంఘం నిర్ధారించింది. శుక్రవారం ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌లో ఉన్న నిజనిర్ధారణ కమిటీ సభ్యులు రఘునా«థ్, చిర్రావూరి శ్రీరామశర్మను వారు కలిసి మాట్లాడి ఒక విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆరోజు తాంత్రిక పూజలు జరిగే అవకాశమే లేదని, దేవాలయం ప్రతిష్ట దెబ్బతినడం తమకు ఎంతో బాధ కలిగిస్తోందంటూ ఆ పత్రంలో వివరించారు. ఏ తప్పు జరగలేదు : ఆలయ సిబ్బంది వేద పండితుడు గురునాథ ఘనాపాటి మాట్లాడుతూ ప్రధాన అర్చకుడు బదిరీనాథ్‌బాబు తాంత్రిక పూజలు ఎప్పుడు చేసే అవకాశం లేదన్నారు. ఆయన పూర్వీకులు ఐదు తరాలుగా అమ్మవారి సేవలోనే ఉన్నారని, ఇప్పటికీ ఏ దేవాలయంలోనైనా స్వామివార్లకు, అమ్మవార్లకు అలంకారం చేయాలంటే ఆయనే వెళ్తారని చెప్పారు. అలాంటి వ్యక్తి తాంత్రిక పూజలు చేసేందుకు సహకరించే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. బదిరీనాథ్‌బాబు ఒక్కరే పూజా కార్యక్రమాలు నిర్వహించలేరని, ఇతర అర్చకుల సహాయం తీసుకుంటారని చెప్పారు. మహిషాసురమర్దనీదేవి అలంకారం చేయాలంటే సామగ్రి కావాలని, అవేమి అక్కడ లేవని గుర్తుచేశారు. ఈ ఘటనలో దేవస్థానం సూపరింటెండెంట్, టెంపుల్ ఇన్స్పెక్టర్, ఎస్పీఎఫ్ సిబ్బంది ఏ తప్పు చేయలేదని ఆలయ సిబ్బంది, ప్రతినిధులు తెలిపారు. దేవస్థానంలో సిబ్బంది, అర్చకుల్లో గ్రూపులు ఉన్నాయని, వాటివల్లే ఏదో జరిగిందనే ప్రచారం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయని, అయితే తామంతా ఒకటేనని నిజనిర్ధారణ కమిటీకి వివరించారు. యూనియన్ నాయకుడు రాజు, వైదిక కమిటీ సభ్యులు ఎం.షణ్ముఖేశ్వరశాస్త్రి, కోటా ప్రసాద్, రంగాబత్తుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. గతంలో ఈ సఖ్యత ఏమైంది? నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల్ని కలిసి బయటకు వచ్చిన అనంతరం అర్చకుల్లో విభేదాలు వచ్చాయి. గతంలో ఐదుగురు అర్చకులను దేవస్థానం నుంచి బలవంతంగా బయటకు పంపినప్పుడు ఈ సఖ్యత ఏమైందంటూ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు లేని ఐక్యత ఇప్పుడు ఎందకంటూ ప్రశ్నించారు. అన్ని విషయాల్లోనూ దేవస్థానం సిబ్బంది ఏకతాటిపై ఉండాలనేదే తన ఆవేదనంటూ గట్టిగా చెప్పారు. 11 గంటల పాటు విచారణ ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు విచారణ చేశారు. ఆరోజు వ్యవహారంలో బాధ్యులైన పార్థసారథితో పాటు అర్చకులు, దేవస్థానం ఇద్దరు ప్రధాన అర్చకులు, స్థానాచార్య, ఇతర అర్చకులను పిలిచి విచారణ చేశారు. గప్‌చుప్‌గా.. విచారణ ఎదుర్కొని వచ్చిన వారంతా మౌనంగా వెళ్లిపోయారే తప్ప లోపల ఏమీ జరిగిందో మీడియాకు చెప్పేందుకు నిరాకరించారు. దేవస్థానంలోని విషయాలు బయటకు పొక్కడం వల్ల ఎవరూ నోరు ఎత్తవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో అందరూ మౌనంగానే వెళ్లిపోయారు. పాలకమండలి సభ్యులు కూడా అక్కడ కనిపించలేదు. చైర్మన్ యలమంచిలి గౌరంగబాబును ఆయన చాంబర్లో రఘునాథ్, శ్రీరామ్‌శర్మ కలిశారు. ఆరోజు జరిగిన దానిపై ఆయన అభిప్రాయం కోరగా, పోలీసు నివేదిక వచ్చాక చెబుతానని అన్నట్లు తెలిసింది. -
పాతకక్షలతోనే దళిత యువకులపై దాడి?
రాజ్‌కోట్: దేశవ్యాప్తంగా నిరసలతోపాటూ, పార్లమెంట్‌ను సైతం దద్దరిల్లేలా చేసిన ఉనా ఘటనలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. నలుగురు దళితులను చితక్కొట్టిన ఘటనలో పాతకక్షలే కారణమని తెలుస్తోంది. అహ్మదాబాద్‌కు చెందిన ధళిత్ అధికార్ మంచ్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ, సంఘటన జరిగిన ప్రాంతాల్లో వివరాలు సేకరించింది. 8మంది సభ్యులతో కూడిన ఈ బృందం ఉనా సమీపంలోని మోటా సమదియాల గ్రామంలో పర్యటించింది. బాధితుల్లో ఒకరి తండ్రి బాలు భాయ్‌ను కలుసుకుంది. ఆరు నెలల కిందట అదే గ్రామంలోని అగ్ర కులానికి చెందిన సర్పంచ్, తమ వృత్తి నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడని బాలు భాయ్ పేర్కొన్నారు. గోవులతో వ్యాపారం చేయకూడదని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తమ ఇంటిని కూడా కూల్చివేస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్టు నిజనిర్ధారణ బృందం సభ్యులకు బాలు భాయ్ తెలిపారు. 'జూలై11న చనిపోయిన గోవులను తీసుకెళ్లాల్సిందిగా రెండు గ్రామాలను నుంచి సమాచారం రావడంతో నా కుమారుడితో పాటూ మరో ముగ్గురిని పంపంపించాను. వారు తిరిగి వస్తుండగా రెండు వాహానాల్లో కర్రలు, ఐరన్ పైపులతో వచ్చిన కొందురు నా కుమారిడితోపాటూ ముగ్గురుపై దాడికి దిగారు. వారు వచ్చిన వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ డీడీ 03 ఎఫ్ 1294గానూ, వాహనం వెనక వైపు ప్రెసిడెంట్- శివసేన- గిర్ సోమనాథ్ అని రాసి ఉంది' అని నిజనిర్ధారణ బృందం సభ్యులకు తెలిపారు. అనంతరం వారిని వాహనానికి కట్టేసి, అసభ్య పదజాలంతో దూషించారని, తాము ఆవులను చంపలేదు, చచ్చిన గోవుల చర్మాన్ని వలవడమే మా వృత్తి అని దళిత యువకులు ఎంత మొత్తుకున్నా వారిని విడిచి పెట్టకుండా నాలుగు గంటలపాటు బట్టలూడదీసి కొట్టారని తెలిపారు. నేను, నా భార్య సంఘటన స్థలం చేరుకోగానే మమ్మల్ని కూడా దూషిస్తూ, దాడికి పాల్పడ్డారని బాలు బయ్యా వారికి వివరించారు. -
'పాల్మన్‌పేట ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి'
విశాఖ: పాల్మన్‌పేట ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్థారణ కమిటీ డిమాండ్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్థారణ కమిటీ శుక్రవారం పాల్మన్‌పేట గ్రామాన్ని సందర్శించి బాధితుల్ని పరామర్శించింది. ఈ సందర్భంగా నిజనిర్థారణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏ-1 ముద్దాయిగా మంత్రి యనమల రామకృష్ణుడిని చేర్చాలని డిమాండ్ చేశారు. 307 సెక్షన్ కింద నిందితులపై కేసు నమోదు చేయాలన్నారు. పాయకరావుపేట ఎస్ఐని సస్పెండ్ చేయాలని, బాధితులకు తక్షణమే పునరావాసం ఏర్పాటు చేయాలన్నారు. కమిటీ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు, కోలా గురువులు తదితరులు ఇవాళ పాల్మన్‌పేటలో పర్యటించారు. కాగా టీడీపీలో చేరడం లేదన్న కారణంతో తమపై దాడి చేశారని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అంతకుముందు పాల్మన్‌పేట పర్యటనకు వెళ్తున్న నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు తుని వద్ద అడ్డుకోవడంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. -
నేడు చెన్నైకి వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ
చెన్నై: ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని సదావతి సత్రం భూముల స్వాహా ఉదంతంపై వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పడిన నిజ నిర్ధారణ కమిటీ చెన్నైశివార్లు ఓఎమ్ఆర్ రోడ్డులోని సత్రం భూముల్లో ఆదివారం పర్యటించనుంది. భూముల వేలం వ్యవహారంపై కమిటీ ఆరా తీయనుంది. అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై ఓఎమ్ఆర్ రోడ్డులోని 471 ఎకరాలు ఓ దాత నుంచి సంక్రమించాయి. ఇందులోని 83.11 ఎకరాలను ఏపీ ప్రభుత్వ ఎండోమెంటు శాఖ ఈ ఏడాది మార్చిలో వేలం పాట ద్వారా రూ.23 కోట్లకు అమ్మి వేసింది. వెయ్యికోట్ల రూపాయల ఆస్తులను కారుచౌకగా అమ్మివేయడంపై పెద్ద దుమారమే రేగింది. పెదబాబు, చినబాబు సూత్రధారులుగా ఏపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు పాత్రధారులుగా వ్యవహరించి ఈ భూములను కాజేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ పత్రికల్లో ప్రకటన ఇస్తే పాట పెరుగుతుందన్న కుట్రతో ఎవ్వరి కంటపడని రీతిలో ప్రచురింపజేశారు. తద్వారా చెన్నై మహానగరంలో పేరెన్నిగన్న బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవ్వరూ ఓఎమ్ఆర్ రోడ్డులోని భూముల వేలంలో పాల్గొనకుండా చేశారు. మొత్తం నలుగురు వ్యక్తులు మాత్రమే పాటల్లో పాల్గొనగా, వీరిలో ముగ్గురు వ్యక్తులు అమరావతి సత్రం ఉన్న గుంటూరు జిల్లా నుంచే రావడం గమనార్హం. పైగా ముగ్గురు వ్యక్తులూ వేలం పాటల్లో పోటీపడినా, ముగిసిన తరువాత ఏకమై ధరావత్తు సొమ్మ చెల్లించడం నేతల, అధికారుల కుమ్మక్కుకు నిదర్శనం. పేరుకే బహిరంగ వేలమైనా అంతా గోప్యంగా సాగింది. భూములు కాజేయదలుచుకున్న పెద్దలు తెరవెనుక ఉండి నడిపించగా పాత్రధారులు మాత్రమే పాటల్లో పాల్గొన్నారు. వేలం పాటల నిర్వహణలో పాటించాల్సిన ప్రభుత్వ నిబంధనలను తుంగలోతొక్కి మమ అనిపించారు. ఓఎమ్ఆర్ రోడ్డులో ఎకరా రూ.6 కోట్ల వరకు పలుకుతుండగా కేవలం రూ.27 లక్షలకు అమ్మివేశారు. ఎకరా రిజిస్ట్రేషన్‌కు రూ.30లక్షల చెల్లించాల్సిన భూములను రూ.27లక్షలకు అమ్మడం ద్వారా భారీ కుంభకోణం బైటపడింది. 83 ఎకరాల ద్వారా రూ.1000 కోట్లు రాబట్టుకోవాల్సిన ఎండోమెంటు అధికారులు రూ.23 కోట్లకే సరిపెట్టుకోవడం ఉత్తుత్తి వేలం పాటల వ్యవహారాన్ని చెప్పకనే చెప్పాయి. వేలం పాటలు మొత్తం ఒక తంతులా సాగడంతో విస్తుపోయిన ఎండోమెంట్ శాఖ ఉన్నతాధికారిణి ఇదేమని ప్రశ్నించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా అమరావతి ఎమ్మెల్యేకు ఎండోమెంటు అధికారులు వెండి కిరీటం తొడిగి సంబరం జరుపుకున్నారు. చెన్నై లో జరిగింది భూముల వేలం పాటనా, సినిమా పాటల కచ్చేరీనా అనేలా హాస్యాస్పదంగా సాగాయి. ఓ దాత ఎంతో ద యాద్ర హృదయంతో సదావర్తి సత్రానికి ఇచ్చిన కోట్లాది రూపాయల విలువైన భూములు దారి మళ్లడాన్ని అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వేలం పాటల ను రద్దు చేయడం ద్వారా సదావర్తి సత్రానికి సత్వరం న్యా యం జరగాలనే ఉద్దేశంతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పడింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్దన రెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, కృష్ణా జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు అదివారం చెన్నై చేరుకుంటున్నారు. ఉద యం ఓఎమ్ఆర్ రోడ్డులోని పలు ప్రాం తాల్లో ఉన్న సదావర్తి సత్రం భూములను సందర్శిస్తారు. -
వీఐపీలేనా భక్తులు ?
సాధారణ భక్తుల పరిస్థితి ఏమిటంటూ ఆగ్రహం కాటేజీలను పరిశీలించిన బీజేపీ కమిటీ విజయవాడ : దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పేరుతో అమ్మవారి మూల ధనాన్ని వృథా చేయడంతో పాటు సాధారణ భక్తులకు వసతి లేకుండా చేస్తున్నారని బీజేపీ నిజ నిర్దారణ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో మాస్టర్‌ప్లాన్ పేరుతో జరుగుతున్న పలు పనులను బుధవారం నిజ నిర్దారణ కమిటీ సభ్యులు, బీజేపీ నగర నాయకులు శివకుమార్ పట్నాయక్, నగర ప్రధాన కార్యదర్శి బబ్బూరి శ్రీరామ్, నగర ఉపాధ్యక్షులు కొరగంజి భాస్కరరావు, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ పదిలం రాజశేఖర్, 31, 39వ డివిజన్ అధ్యక్షులు మానేపల్లి మల్లేశ్వరరావు, బచ్చు రమేష్ పరిశీలించారు. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్, మాడపాటి సత్రాలు, అన్నదాన సత్రం తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇష్టానుసారంగా పనులు దుర్గగుడికి ఏ అధికారి వచ్చినా ఆ అధికారి సొంత నిర్ణయాల మేరకే పనులు చేయిస్తున్నారని, దీని వల్ల భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని కమిటీ సభ్యులు శివకుమార్ పట్నాయక్ తెలిపారు. ఇదే పరిస్థితి మరి కొంత కాలం కొనసాగితే అమ్మవారి దర్శనంతో పాటు వసతి వీఐపీలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. సత్రాలలో ఉన్న గదులను తొలగించి వీఐపీలకు మాత్రమే గదులను నిర్మించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. పుష్కరాలకు అమ్మవారి ఆలయానికి ప్రభుత్వం ఎటువంటి నిధులను కేటాయించకుండా అమ్మవారి మూలధనం నుంచి డబ్బులు డ్రా చేసి పనులు చేయడం సరికాదన్నారు. రాష్ర్టంలో అన్ని దేవాలయాలకు కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం దుర్గగుడికి కమిటీని ఏర్పాటు చేయకపోవడం వల్లే అధికారులు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేసి సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనంతో పాటు వసతి కల్పించేలా దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకు వెళతామని కమిటీ సభ్యులు వివరించారు. -
కృష్ణాపై కర్ణాటక బ్యారేజీ నిజమే!
- పొడవు 1,170 మీటర్లు... గేట్ల సంఖ్య 194 - ప్రభుత్వానికి నిజనిర్ధారణ కమిటీ నివేదిక - కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని - అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం - కేంద్రమంత్రి ఉమాభారతికి - వివరించాలంటూ ఎంపీ జితేందర్‌కు ఫోన్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై రాయచూర్ జిల్లాలో గిరిజాపూర్ గ్రామం వద్ద కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా బ్యారేజీ చేపట్టడం నిజమేనని పేర్కొంటూ నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక అందగానే శనివారం సాగునీటి శాఖ మంత్రి మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై వెంటనే కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేయాలని ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషిని, ఇంటర్ స్టేట్ చీఫ్ ఇంజనీర్ నాగేందర్‌ను మంత్రి ఆదేశించారు. సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు, న్యాయ నిపుణులను సంప్రదించి ఫిర్యాదును తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఈ అంశాన్ని కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత జితేందర్‌రెడ్డికి ఫోన్లో సూచించారు. ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపేయడానికి చర్యలు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. జూరాలకు వరద కష్టమే! కృష్ణాపై కర్ణాటక బ్యారేజీ నిర్మాణానికి సమాయత్తమవుతుందన్న సమాచారంపై మంత్రి హరీశ్‌రావు నిజ నిర్ధారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారుల కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి ఫోటోలతో సహా నివేదికను సమర్పించింది. కమిటీ నివేదిక ప్రకారం బ్యారేజీని కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌పీటీఎస్) నిర్మిస్తోంది. ‘‘బ్యారేజీ పొడవు 1,170 మీటర్లు. గేట్ల సంఖ్య-194. 24 నెలల కాల పరిమితితో రఘు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ ఏడాది జూలై 28న ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బ్యారేజీలో సుమారు రెండు టీఎంసీల నీరు నిలువ చేసే అవకాశం ఉంది’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల జూరాల ప్రాజెక్టుకు వరద నీరు రావడం కష్టంగా మారుతుందని అభిప్రాయపడింది. దానికి తోడు నారాయణపూర్ నుంచి రావాల్సిన రీజనరేటెడ్ ఫ్లో కూడా రాకుండా పోతుందని తెలిపింది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి దిగువ రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తెలుపలేదు. కేంద్ర జల సంఘానికి, కేంద్ర విద్యుత్ అథారిటీకి అయినా తెలిపిందా, వారి నుంచి సూత్రప్రాయమైన అనుమతులైనా ఉన్నాయా అన్న విషయం తెలియరాలేదని కమిటీ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో ప్రొక్లైన్లు, టిప్పర్లు కనిపించాయని, పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలిపింది. -
రిషితేశ్వరి కేసులో ముగిసిన విచారణ
-
న్యాయం జరిగే వరకు పోరు
రిషితేశ్వరి కేసులో దోషుల్ని రక్షించేందుకు కొందరి ఆరాటం * వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు * పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏఎన్‌యూ గేటు వద్దే నిలిపివేత * నిరసనగా ధర్నా చేసిన నేతలు * సిటింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ ఏఎన్‌యూ: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో అసలు దోషులను రక్షించేందుకు యూనివర్సిటీ, ప్రభుత్వ అధికారులు ఆరాటపడుతున్నారని, అందుకే ఆంక్షలు విధిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ కేసులో న్యాయం జరిగేవరకు పోరాడతామని స్పష్టంచేశారు. రిషితేశ్వరి మృతిపై వైఎస్సార్ సీపీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కె.పార్థసారథి, వంగవీటి రాధాకృష్ణ, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా అధికారులను కలిసేందుకు సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)కి వచ్చారు. వీరిని ప్రధాన ద్వారం వద్ద పోలీసులు, వర్సిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పార్టీ నేతలు అక్కడే ధర్నా చేసి, యూనివర్సిటీ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసుల అనుమతితో లోపలికి వెళ్లిన నేతలు ఇన్చార్జి వీసీ ఆచార్య కె.ఆర్.ఎస్.సాంబశివరావును, రిజిస్ట్రార్‌ను కలసి పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సెలవుల్లో ఉండగా కమిటీలు విచారణ జరపడం ఏమిటని ప్రశ్నించారు. ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావును రక్షించేందుకు ప్రభుత్వ డెరైక్షన్‌లో వర్సిటీ అధికారులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. వర్సిటీ నిజనిర్ధారణ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని నివేదిక ఇస్తామని విసీ తెలిపారు. రిషితేశ్వరి మృతిపై సిటింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని, దీనికి వెంటనే వర్సిటీ పాలకమండలి ఆమోదం తెలపాలని నేతలు డిమాండ్ చేశారు. ఈనెల 6వ తేదీన తమపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరోసారి యూనివర్సిటీలో పర్యటిస్తారని, అదేరోజు బాలసుబ్రహ్మణ్యం కమిటీ ముందు వాదనలు, అనుమానాలు తెలియజేస్తారని ఇన్చార్జి వీసీకి తెలిపారు. -
'రిషితేశ్వరి ఆత్మహత్య' కారకులకు రాజకీయ అండ
-
సీడీలు చూస్తుంటే.. కరెంటు పోయింది!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ భూతానికి బలైపోయిన రిషికేశ్వరి మరణంపై విచారణలో హైడ్రామా చోటుచేసుకుంది. రిషికేశ్వరి మరణంపై వర్సిటీలో నిజనిర్ధారణ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం జరిగింది. ఈ సమయంలో ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపల్ గతంలో సాగించిన లీలలకు సంబంధించి సీడీల రూపంలో విద్యార్థులు కమిటీకి ఆధారాలు సమర్పించారు. కానీ ఆ సీడీలు చూస్తుండగా మధ్యలో రెండుసార్లు కరెంటు పోయింది. సరిగ్గా.. ఈ సమయంలోనే ప్రిన్సిపల్ అనుకూల వర్గానికి చెందిన విద్యార్థులు అక్కడకు ప్రవేశించారు. అక్కడే ఉన్న మీడియాపైన, విద్యార్థి సంఘాల నేతలపైన వాళ్లు దాడి చేశారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. నిజనిర్ధారణ కమిటీ సమావేశం తూతూ మంత్రంగా కొద్దిసేపట్లోనే ముగిసిపోయింది. ప్రిన్సిపల్ బాబూరావుపై సస్పెన్షన్ ఎత్తేయాలంటూ ఆయన అనుకూల విద్యార్థులు నినాదాలు చేశారు. -
ఠాణాకు చేరిన ‘ముద్దు’ల రగడ!
గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రగులుతున్న ‘ముద్దుల’ రగడ గచ్చిబౌలి ఠాణాకు చేరింది. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ రామబ్రహ్మం ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై సోమవారం రాత్రి కేసు నమోదు చేశామని గచ్చిబౌలి సీఐ రమేశ్ తెలిపారు. ‘కిస్ ఆఫ్ లవ్’ పేరుతో విద్యార్థులు అశ్లీలంగా వ్యవహరించారని, క్యాంపస్ లోపలికి బయటి వ్యక్తులు ప్రవేశించారని రిజిస్ట్రార్ ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. నాలుగు రోజుల క్రితం కిస్ ఆఫ్ లవ్ యూనివర్సిటీలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంతో దీనిని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు క్యాంపస్ లోపలికి వెళ్లి నిరసన తెలిపిన విషయమూ విదితమే. ముద్దులు పెట్టుకున్న విద్యార్థులతో పాటు ఇటు క్యాంపస్ లోపలికి అక్రమంగా ప్రవేశించిన బీజేవైఎం కార్యకర్తల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు వివిధ చానళ్ల ఫుటేజీలను పరిశీలించి బాధ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇరు వర్గాలపై ఐపీసీ 297, 447 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజ నిర్ధారణ కమిటీ.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ‘కిస్ ఆఫ్ లవ్’ నిర్వహించారని ఏబీవీపీ, బయటి వ్యక్తులు క్యాంపస్ లోపలికి ప్రవేశించి ప్రశాంత వాతావరణానికి భంగం కల్గించారని ఎస్ఎఫ్ఐతో పాటు ఇతర విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడంతో ఘటనపై విచారణకు నిజ నిర్ధారణ కమిటీ నియమించారు. కమిటీ ఛెర్మైన్‌గా స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ డీన్ ప్రొఫెసర్ అనంత కృష్ణన్, సభ్యులుగా ఫ్రొఫెసర్లు ప్రకాశ్ బాబు, మీనా హరిహరన్, వాసంతి, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు విన్సెంట్లు ఉన్నా రు. విచారణ జరిపి 20 రోజుల్లో వీసీ రామకృష్ణ రామస్వామికి నివేదిక అందజేస్తారు. కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుంటామని సీఐ ర మేశ్ తెలిపారు. -
భర్తను హత్య చేయించిన రెండో భార్య?
ప్రియుడితో కలిసి దారుణం అనంతరం ప్రియుడిపైనే ఫిర్యాదు ఇద్దరిపై ఫిర్యాదు చేసిన మొదటి భార్య తలలు పట్టుకున్న పోలీసులు దొడ్డబళ్లాపురం : ప్రియుడి వ్యామోహంలో పడిన ప్రియరాలు తన భర్తనే దారుణంగా హత్య చేయించిన సంఘటన తాలూకాలో చోటు చేసుకుంది. విచిత్రం ఏమిటంటే హత్య తరువాత ప్రియుడిపై హత్య ఆరోపణ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో విచిత్రం ఏమిటంటే హతుడి మొదటి భార్య తన భర్తను రెండవ భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసారని కౌంటర్ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎవరి ఫిర్యాదు నమోదు చేసుకోవాలో, ఎవరి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. వివరాలు... తాలూకా పరిధిలోని సొణ్ణమారనహళ్లి గ్రామం నివాసి మునిస్వామి (45) హత్యకు గురయ్యాడు. మునిస్వామి రెండో భార్య శోభ (35), ఆమె ప్రియుడు మధు (26) హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరిపై హతుడి మొదటి భార్య దేవనహళ్లి తాలూకా కరుబరకంటలోని జనతా కాలనీ నివాసి లక్ష్మమ్మ (40) కౌంటర్ ఫిర్యాదు చేసింది. హతుడు మునిస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మ దేవనహళ్లిలో నివసిస్తుండగా, రెండో భార్య శోభ గార్మెంట్స్‌లో పనిచేస్తూ సొణ్ణమారనహళ్లిలో నివాసం ఉంటోంది. మునిస్వామి ఒక్కోవారం ఒక్కో భార్య దగ్గర ఉండేవాడు. ఈ క్రమంలో ఏడాది క్రితం శోభకు తాను నిత్యం ఫ్యాక్టరీకి వెళ్లే ఆటో డ్రైవర్ మధుతో సన్నిహితం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం మునిస్వామికి తెలిసి శోభను తానే దగ్గరుండి ఫ్యాక్టరీలో దిగబెట్టడం, తీసుకురావడం చేయనారంభించాడు. దీన్ని జీర్ణించుకోలేని మధు, శోభలు మునిస్వామి హత్యకు కుట్ర పన్నారు. కుట్రలో భాగంగా ఆదివారం సాయంత్రం మునిస్వామి శోభను బైక్‌లో సొణ్ణమారనహళ్లికి తీసుకువస్తుండగా మార్గం మధ్యలో శోభ ద్వారా సమాచారం తెలుసుకున్న మధు ఆటోలో లింగనహళ్లి గ్రామం శివారులోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద అడ్డగించి గొడవకు దిగాడు. ఈ క్రమంలో ముందస్తుగానే మధు వెంట తెచ్చుకున్న వేటకొడవలితో మునిస్వామిని తలపై, భుజాలపై న రికాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సుమో వాహనం డ్రైవర్ నరసింహ ఏం జరిగిందని ప్రశ్నించడంతో కొడవలి దాచి, ఏదో వాహనం ఢీకొని వెళ్లి పోయిందని ఇద్దరు బుకాయించారు. ఆస్పత్రికి తీసుకెళ్దామని పిలవగా మధు పరారయ్యాడు. మునిస్వామి ప్రాణాపాయంలో ఉండటంతో హుటాహుటిన నరసింహ శోభ సాయంతో పట్టణంలోని మాసన ఆస్పత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ మునిస్వామి అర్ధరాత్రి మృతి చెందాడు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం శోభ తన భర్తను మధు నరికి చంపాడని గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మధును అరెస్టు చేసి విచారణ చేయడంతో శోభతో తనకు వివాహేతర సంబంధం ఉందని వివరించాడు. మధ్యాహ్నానికి కథ మరో మలుపు : దేవనహళ్లిలో ఉన్న మునిస్వామి మొదటి భార్య గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన భర్తను శోభ, మధులు పథకం ప్రకారం హత్య చేశారని పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. ఈమెకు దళిత సం ఘాల నేతలు పలవురు మద్దతుగా నిలిచారు. పోలీసులు ఇద్దరి ఫిర్యాదులూ స్వీకరించారు. నిందితురాలి ఫిర్యాదు ఎలా తీసుకుంటారు? : ఈ ఘటనకు సంబంధించి దళిత సంఘర్ష సమితి దేవనహళ్లి నాయకుడు కారహళ్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ హత్యకు కారణం శోభ కాగా ఆమె ఫిర్యాదును ఎలా స్వీకరిస్తారని ప్రశ్నిం చారు. తక్షణం శోభను రెండో నిందితురాలిగా చేర్చాలని డిమాండ్ చేశారు.