విశాఖ: పాల్మన్పేట ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్థారణ కమిటీ డిమాండ్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్థారణ కమిటీ శుక్రవారం పాల్మన్పేట గ్రామాన్ని సందర్శించి బాధితుల్ని పరామర్శించింది. ఈ సందర్భంగా నిజనిర్థారణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏ-1 ముద్దాయిగా మంత్రి యనమల రామకృష్ణుడిని చేర్చాలని డిమాండ్ చేశారు. 307 సెక్షన్ కింద నిందితులపై కేసు నమోదు చేయాలన్నారు. పాయకరావుపేట ఎస్ఐని సస్పెండ్ చేయాలని, బాధితులకు తక్షణమే పునరావాసం ఏర్పాటు చేయాలన్నారు.
కమిటీ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు, కోలా గురువులు తదితరులు ఇవాళ పాల్మన్పేటలో పర్యటించారు. కాగా టీడీపీలో చేరడం లేదన్న కారణంతో తమపై దాడి చేశారని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అంతకుముందు పాల్మన్పేట పర్యటనకు వెళ్తున్న నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు తుని వద్ద అడ్డుకోవడంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.
'పాల్మన్పేట ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి'
Published Fri, Jul 1 2016 4:20 PM | Last Updated on Thu, Jul 26 2018 1:30 PM
Advertisement
Advertisement