పడగవిప్పిన ర్యాగింగ్ భూతం కాటుకు బలైన రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో ప్రధాన కారకులను రాజకీయ శక్తులు కాపాడుతున్నట్లు వైఎస్ఆర్ సీపీ నిజనిర్థారణ కమిటీ పరిశీలనలో తేలిసింది. రిషితేశ్వరి ఘటనపై వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలోని బృందం సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీని సందర్శించింది. ర్యాగింగ్ విషయంలో యాజమాన్యం వివక్షాపూరితంగా వ్యవహరించడం వల్లే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని, తప్పుడు పనులు చేసిన ప్రిన్సిపల్ సహా మరికొందరిని కొన్ని రాజకీయ శక్తులు కాపాడుతున్నట్లు అర్థమవుతున్నదని కమిటీ సభ్యులు చెప్పారు.