sucide case
-
భరత్ నగర్ బస్తిలో బాలిక అనుమానాస్పద మృతి
-
బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వలేదని భార్య క్షణికావేశంతో..
ఓ మహిళ చిన్న విషయానికి క్షణికావేశంలో పెద్ద నిర్ణయం తీసుకుని విగత జీవిగా మారింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటున్న 34 ఏళ్ల మహిళ బ్యూటీపార్లర్‌కు వెళ్లాలనుకుంది. అందుకు భర్త అంగీకరించకపోగా అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఈ మేరకు ఆ మహిళ క్షణికావేశంలో కోపంతో ఫ్యాన్‌కి ఉరివేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. బాధితురాలి భర్త విచారణలో.. తాను బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా అడ్డుకోవడంతోనే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పాడు. మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి అయిన తదనంతరం అన్ని కోణాల్లో ఈ కేసును విచారిస్తామని పోలీసు అధికారి యాదవ్ తెలిపారు. (చదవండి: శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్ విషయాలు వెల్లడించిన సీపీ) -
నీ జీవితం నువ్వు చూసుకో, నా జీవితం ముగిస్తున్నా అంటూ భార్యకు మెసేజ్
సాక్షి, అన్నానగర్: కళ్లకురిచ్చి జిల్లా త్యాగతురుగం సమీపంలోని మెల్విలి గ్రామానికి చెందిన ఆంథోని రాజ (33) చిన్న సేలం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. కళ్లకురిచ్చి పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. భార్య శీల పౌరిమేరి, ఆరేళ్ల కుమార్తె, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. శనివారం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. శీలపౌరిమేరి బయటకు వెళ్లింది. ఆంథోని రాజ విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య ఇంటిలో లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. తన భార్యకు నీ జీవితం చూసుకో.. నేను నా జీవితాన్ని ముగించుకుంటున్నాను అని మెసేజ్ పంపాడు. ఇది చూసి శీలపౌరిమేరి ఇంటికి వచ్చి చూడగా తలుపు గెడియపెట్టి ఉంది. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు తెరిచిచూడగా ఆంథోని రాజ ఉరి వేసుకుని మృతి చెందాడు. కళ్లకురిచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం) -
భార్యపై చేయి చేసుకున్నానని.. ఆవేదనతో భర్త..
సాక్షి, అల్వాల్: క్షణికావేశంలో భార్యపై చేయి చేసుకున్నానని మనస్తాపానికిలోనైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన సురేంద్రకుమార్ (35) బసంతి దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చారు. సురేంద్రకుమార్ జీడిమెట్లలోని సూపర్ మార్కెట్లో ఉద్యోగం చేస్తుండగా అతడి భార్య బసంతి ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేసేది. ఇటీవల బసంతి ఉద్యోగం మానేసింది. అప్పటికే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో భార్య ఉద్యోగం మానేయడంతో ఆగ్రహానికిలోనైన సురేంద్రకుమార్ ఆదివారం చేయి చేసుకున్నాడు. దీంతో మానసిక వేధనకు లోనైన అతను భార్య, కుమార్తెలను బెడ్రూంలో వేసి బయటి నుంచి గడియ పెట్టి హాల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బసంతి తెలిసిన వారికి ఫోన్ చేసి సమాచారం అందించింది. వారు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్‌లో కాళ్లను దాచి..) -
విద్యార్థి ఆత్యహత్య కేసు: చనిపోవడానికి ముందు వేరే గదికి!
సాక్షి, అనంతపురం శ్రీకంఠంసర్కిల్: రెండు రోజుల క్రితం అనంతపురం జేఎన్టీయూలో కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య కేసు దర్యాప్తును వన్‌టౌన్ పోలీసులు ముమ్మరం చేశారు. జేఎన్టీయూ (ఏ)లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన రమణారెడ్డి, విజయ దంపతుల కుమారుడు చాణిక్య నందరెడ్డి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు వర్సిటీలోని ఎల్లోరా హాస్టల్లో చాణిక్య ఉంటున్న నంబర్ 131 గదిలోని నలుగురు విద్యార్థులతో పాటు చాణిక్య ఆత్మహత్య చేసుకునే ముందు నిద్రించిన గదిలోని అత్యంత సన్నిహితున్ని శుక్రవారం విచారణకు పిలిచారు. ఎవరితో పెద్దగా విభేదాలు లేవని, ప్రేమ వ్యవహారాలు కూడా నడవలేదని, ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకున్నాడన్న దానిపై తమకూ స్పష్టత లేదని వారు చెప్పినట్లు సమాచారం. అయితే, డిసెంబరు 31 రాత్రి నుంచి చాణిక్య మూడీగా ఉన్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందు 134 గదిలోకి.. చాణిక్య తను ఉండాల్సిన 131 నంబరు గదిలో కాకుండా 134లోకి రావడానికి కారణాన్ని కూడా పోలీసులు తెలుసుకున్నారు. తనతో పాటు ఇంటర్ నుంచి కలసి చదువుతున్న విద్యార్థి నరేంద్ర సీఈసీ తీసుకున్నాడు. తను 134 గదిలో ఉంటున్నాడు. దీంతో ఎక్కువగా చాణిక్య కూడా అతనితో గడిపేవాడు. చనిపోయే ముందు కొన్ని గంటల ముందు కూడా చాణిక్య అక్కడే పడుకున్నాడు. కాగా తను ఎప్పుడు నిద్ర లేచి వెళ్లాడో తెలియదని నరేంద్ర అంటున్నాడు. తను చనిపోయిన విషయం హాస్టల్లో విద్యార్థులకు కూడా ఆరు గంటల దాకా తెలియదంటున్నారు. ఇదిలా ఉండగా హాస్టల్ టెర్రస్ పైభాగాన చాణిక్య చెప్పులు వదిలేసి ఉండటం పోలీసులకు అనుమానాన్ని పెంచుతోంది. సెల్ఫోన్లోనూ నో క్లూ.. చాణిక్యనందరెడ్డి సెల్‌ఫోన్‌ను తనిఖీ చేసిన పోలీసులకు అందులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రేమ వ్యవహారాలుంటే అందులో ఏదో ఒక చోట సంభాషణ, లేదా పంపిన సందేశాలుండేవి. అయితే, అలాంటివి లేవంటున్నారు. గతంలో జేఎన్టీయూలో జరిగిన ర్యాగింగ్ బ్యాచ్‌ల్లో చాణిక్య ఉన్నాడా? అని కూడా ఆరా తీయగా, వాటితో ఎలాంటి సంబంధం లేదని విచారణలో తెలిసినట్లు సమాచారం. ఆర్థిక సమస్యలుండవచ్చనే కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవముండవచ్చని కూడా పోలీసులు అనుమానించారు. కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉందేమోగాని.. చాణిక్య వరకు అలాంటి ఇబ్బంది లేదు. కారణం తను దుబారా ఖర్చులు చేసేవాడు కాదట. చదువు మినహా మరో వ్యాపకం కూడా లేదని అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా తనకు వచ్చిన రూ. 60 వేల స్కాలర్ షిప్ కూడా తండ్రి ఖాతాలోకి మళ్లించాడు. లోన్‌యాప్స్, క్రెడిట్‌కార్డులు లాంటి అవకాశం కూడా లేదని పోలీసులు చెబుతున్నారు. సెల్ఫోన్లో ఎక్కడా ఆ జాడలు లేవు. కాని చాణిక్య తను చనిపోయే ముందు సెల్ఫోన్లో టైప్ చేసి ఉంచిన మైఫైల్స్ సందేశంలో మాత్రం.. వ్యక్తిగత సమస్యలతోనే చనిపోతున్నట్లు ఉంది. తన సోదరి గీతారెడ్డికి పంపిన సందేశంలోని సారాంశాన్ని పరిశీలించిన పోలీసులు కుటుంబ ఆర్థిక పరిస్థితితోనే చాణిక్య ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు. (చదవండి: మేనమామతో పెళ్లి.. భర్త తీరు బాగోలేదంటూ వివాహిత షాకింగ్ ట్విస్ట్) -
డ్యూటికి వెళ్లి వచ్చేసరికి ఘోరం...షాక్‌లో భర్త
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళ ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ కె.భాస్కర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మహేశ్, అనిత(22) దంపతులకు వర్షిణి(22 నెలలు), శ్రీహాన్ (9నెలలు) సంతానం. వారు గత నాలుగేళ్లుగా బాలానగర్ డివిజన్ గౌతంనగర్‌లో నివాసం ఉంటున్నారు. మహేష్ వృత్తిరీత్యా డ్రైవర్. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మహేష్ డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చేసరి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. పలుమార్లు పిలిచినా అనిత తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన మహేష్ కిటికీ లోంచి చూడగా అనిత ఉరేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా అనిత ఉరేసుకుని ఉండగా ఇద్దరు పిల్లలు మృతి చెంది ఉన్నారు. మృతదేహాలను స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు. (చదవండి: పెళ్లై మూడేళ్లే అంతలోనే....ప్రాణం తీసిన కట్నపిశాచి) -
ప్రేమించలేదని గొంతు కోసుకున్నాడు
సాక్షి, అనంతపురం: ‘పెళ్లయినా ఫర్వాలేదు. కానీ నన్ను ప్రేమించాలి. చిన్ననాటి నుంచి నిన్నే ప్రేమిస్తున్నా. నువ్వు నాతో మాట్లాడడం మానేస్తే ఎలా? ప్రేమించకపోతే కత్తితో గొంతు కోసుకుంటా’ అని ఓ వివాహితను బెదిరిస్తున్న యువకుడు చివరకు అన్నంత పనీ చేశాడు. కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన శుక్రవారం అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డు పాపంపేటలో చోటు చేసుకుంది. అనంతపురం రూరల్ పరిధిలోని ఎల్బీ నగర్‌కు చెందిన గోపాల్‌నాయక్ కుమారుడు బాలాజీ నాయక్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. అతని చిన్ననాటి స్నేహితురాలు పాపంపేటలో ఉంటోంది. ఆమెకు నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. కానీ, బాలాజీ నాయక్ ప్రేమ పేరుతో ఆమెను వేధించేవాడు. విసిగిపోయిన ఆమె రెండు నెలల నుంచి మాట్లాడడం మానేసింది. బాలాజీనాయక్ శుక్రవారం పాపంపేట చేరుకుని ఆమె స్నేహితురాలి భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లగానే లోపలికి వెళ్లి తనను ప్రేమించాలని మరోసారి వేధించాడు. తనకు వివాహమైందని, వేధించడం మానుకోవాలని చెప్పినా వినలేదు. చివరకు అదే ఇంట్లోని కత్తి తీసుకుని గొంతు కోసుకున్నాడు. భయాందోళనలకు గురైన ఆమె విషయాన్ని బాలాజీ నాయక్ సోదరులు ఎం.రవీంద్ర నాయక్, మని నాయక్‌కు తెలియజేసింది. వారు వెళ్లి చూడగా బాలాజీ నాయక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఆర్జీఎఫ్.. ఇది మన కేజీఎఫ్) -
ఈ విద్యార్థులకేమైంది!
ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే విద్యార్థులు విషాద గీతికలను ఆలపిస్తున్నారు. గోరంతలను కొండంతలుగా ఊహించుకుని ఊపిరి తీసుకుంటున్నారు. చిన్న విషయానికే మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు తల్లిదండ్రు అశనిపాతంలా పరిణమిస్తున్నాయి. మంగళవారం నాగోల్‌లో 6వ తరగతి విద్యారి్థని వర్షిత అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మరువకముందే గురువారం సైదాబాద్‌లో ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థి భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఓల్బోయిన్పల్లిలో పన్నెండో తరగతి చదువుతున్న బాలిక పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వ్యూస్ రావడం లేదని.. సైదాబాద్: ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ విద్యార్థి అపార్టుమెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్రాంతినగర్‌లోని ఆదర్శ్ అపార్టుమెంట్స్‌లో నివసించే చంద్రశేఖర్ రైల్వే ఉద్యోగి. అతని భార్య కేంద్ర రక్షణ రంగ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి కుమారుడు ధీనా (23) గ్వాలియర్‌లో ట్రిపుల్ ఐటీ ఫైనలియర్ చదువుతున్నాడు. గురువారం తెల్లవారుజామున ధీనా నగరంలోని తాము నివసించే రెండో అంతస్తు నుంచి అపార్టుమెంట్ అయిదో అంతస్తు పైకి చేరుకొని అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధీనా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడని తెలుస్తోంది. అతను సెల్ఫో పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. తనకు తల్లిదండ్రుల నుంచి సరైన మార్గదర్శనం లేదని, తన యూట్యూబ్ చానల్‌కు వీక్షకులు తగ్గుతున్నారని భావించేవాడు. తన వీడియోలకు స్పందన కూడా సరిగా రావడం లేదని మనస్తాపం చెందుతున్నాడని సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి తెలిపారు. కొంతకాలంగా మానసిక పరిస్థితి సరిగా లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆయన తెలిపారు. తనకు జీవితంపై విరక్తి కలుగుతోందంటూ ఆత్మహత్యకు ముందు సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. విదేశాలకు పంపించలేదని.. కంటోన్మెంట్: స్కూలు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ విద్యార్థిని. బోయిన్పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఓల్డ్ బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్‌కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్ జయచంద్రా రావు కుమార్తె స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో పన్నెండో తరగతి చదువుతోంది. గురువారం స్కూలు రెండో అంతస్తు పైనుంచి కిందకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్కూలు యాజమాన్యం వెంటనే సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలిక సోదరుడు కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తుండగా, తాను కూడా అక్కడే చదువుకుంటానని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రులు వారించగా, మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. బిల్డింగ్ పై నుంచి కిందకు దూకడానికి ముందు తన తండ్రికి సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. వర్షిత ఆత్మహత్యపై విచారణ నాగోలు: ఎల్బీనగర్ పరిధిలోని చంద్రపురి కాలనీలో మంగళవారం అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన వర్షిత (12) కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని గురువారం ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. చిన్నారి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు, ఇంటి పరిసరాల్లో ఉండే వారిని విచారిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారం వచ్చిందని తెలిపారు. (చదవండి: ఆ తేడా తెలియని కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరం: కేటీఆర్) -
ఎంత పని చేశావు తల్లీ..
అమ్మా.. నవమాసాలు మోసి మాకు జన్మనిచ్చావు. అల్లారుముద్దుగా పెంచావు. గోరుముద్దలు తినిపించావు. ఏ చిన్న జబ్బు చేసినా నీవు తల్లడిల్లి పోయావు. నీవే కొండంత అండ అని భావించాము. నీళ్లు చూస్తుంటే భయమేసింది.. అయినా నువ్వున్నావన్న ధైర్యంతో నీవెంటే నడిచాము. నీటిలో ఊపిరి ఆడలేదు. బయటకు తీయమ్మా... అని వేడుకున్నాం. కానీ అప్పటికే అంతా అయిపోవడంతో చిన్నారులు తల్లితో పాటు ప్రాణాలు విడిచారు. శింగనమల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. వారి మృతదేహాలు బుధవారం శింగనమల రంగరాయల చెరువులో బయటపడ్డాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన బి.రామాంజినేయులుకు పదేళ్ల క్రితం పామిడి మండలం ఎదురూరు గ్రామానికి చెందిన కవిత(27)తో వివాహమైంది. వీరికి సంతోష్ (7), భార్గవి (3) సంతానం. గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే..నాలుగు నెలల క్రితం తాడిపత్రి పట్టణానికి మకాం మార్చారు. రామాంజినేయులు గుజిరీ షాపులో పనికి వెళుతుండగా.. భార్య ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకునేది. రామాంజనేయులు మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై రోజూ దంపతులు రోజూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా వాదులాడుకున్నారు. భర్త ప్రవర్తనలో మార్పు కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. మంగళవారం ఉదయం 11 గంటల తరువాత పుట్టింటికి వెళుతున్నానని భర్తకు చెప్పిన కవిత కుమారుడు, కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వచ్చింది. బస్సులో బయల్దేరి శింగనమల క్రాస్ వద్ద దిగింది. అక్కడి నుంచి పిల్లలతో కలిసి రంగరాయల చెరువు మరవకట్టపైకి నడుచుకుంటూ వెళ్లింది. జీవితం నరకప్రాయంగా అనిపించడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. పిల్లలు దిక్కులేని వారు కాకూడదని.. వారినీ తనవెంటే తోడు తీసుకెళ్లాలని నిర్ణయించుకుని చెరువులోకి దూకారు. బుధవారం మధ్యాహ్నం ముగ్గురి మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీనివాసులు, శింగనమల సీఐ అస్రార్ బాషా, ఎస్ఐ వంశీకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీయించి..పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య, పిల్లలు చనిపోయినా భర్త సంఘటన స్థలం వద్దకు రాలేదు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. (చదవండి: ఉడేగోళంలో విషాదం... అన్నదమ్ములని బలిగిన్న కరెంట్) -
ఎల్బీ నగర్ ఘటన: చిన్నారి వర్షితది ఆత్మహత్యే
నాగోలు: అనేక ప్రశ్నలు.. ఎన్నో అనుమానాల బాలిక వర్షిత మృతి కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరో తరగతి విద్యార్థిని వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బాలిక మృతి పట్ల వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఆయన చెప్పారు. బాలికను తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ దుర్గేష్‌ను విచారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏసీపీ కథనం ప్రకారం వివరాలు.. మన్సురాబాద్‌లోని మధురానగర్‌లో కాలనీ రోడ్డు నంబర్– 5లో ఉంటున్న సత్యనారాణరెడ్డి, ప్రభావతి దంపతుల కూతురు వర్షిత. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన బాలిక చిప్స్ కొనుకుంటానంటూ దుకాణానికి వెళ్లింది. మన్సూరాబాద్ చౌరస్తాకు వచ్చి ఆటో ఎక్కింది. అక్కడ నుండి ఎల్బీనగర్ చౌరస్తా మీదగా చంద్రపూరి కాలనీ రోడ్డునెం. 2/బీ కు వెళ్లి ఆటో అతని రూ. 50 ఇచ్చి అక్కడ దిగింది. ఆటోలో వెళ్లే క్రమంలో తన తండ్రికి ఫోన్ చేయాలని డ్రైవర్‌కు నంబర్ చెప్పింది. ఫోన్ బిజీగా రావడంతో ఆటో డ్రైవర్ వర్షితను అపార్ట్మెంట్ వద్ద దించేశాడు. అక్కడ ఉన్న వాచ్‌మన్ వెంకటమ్మ వర్షిత బిల్డింగ్‌పైకి వెళ్తుండగా.. ఎవరు కావాలని అడిగింది. మా నాన్న కోసం వచ్చానంటూ చెప్పి బిల్డింగ్‌పైకి వెళ్లింది. వాచ్‌మన్ తన కుమారుడైన రాజున బిల్డిండ్‌పైకి పంపగా ఎవరూ కనిపించలేదు.. ఇంతలోనే వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి కావాలనే నాలుగో అంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాలిక వర్షితపై లైంగిక దాడి జరిగిందా? అనే కోణంలో వైద్య పరీక్షలు చేయగా.. అలాంటిదేమీ లేదని వెల్లడైందన్నారు. చదువులో ముందుండే వర్షిత.. అందరితోనూ కలుపుగోలుగా మసలుకునేదని కాలనీవాసులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబంలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో సున్నిత మనస్కురాలైన వర్షిత కొంత ప్రభావితమై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సమాచారం. (చదవండి: మిస్టరీగా చిన్నారి మృతి.. ఆటోడ్రైవర్ ఫోన్ కాల్ కీలకం!) -
ప్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
మణికొండ: ప్లైఓవర్‌పై నుంచి ఔటర్‌రింగ్ రోడ్డుపైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నారాయణపేట్ జిల్లా, మద్డూరు మండలం, చింతల్‌పేట్ గ్రామానికి చెందిన భీమప్ప(30) గత కొంత కాలంగా నార్సింగి మున్సిపల్ కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి అతను స్థానిక ఫ్లై ఓవర్‌పై నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుపైకి దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ప్రాణాలు తీసిన వేగం) -
జస్టిస్ ఫర్ శ్రీమతి: పోస్ట్‌మార్టం పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడులో సంచలనం సృష్టించిన పాఠశాల విద్యార్థి ఆత్మహత్య కేసుకి సంబంధించి ఘటన జరిగిన మరుసటి రోజే మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి మృతి నిరశిసిస్తూ మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని ఆదేశించింది. అంతేగాక అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఐతే మెడికల్ ప్యానెల్లో తమకు తెలిసిన వైద్యుడిని చేర్చాలన్న తల్లిదండ్రుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారు తమకు తెలిసిన వైద్యుడితోనే శవపరీక్షలు నిర్వహించాలంటూ బాలిక తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అంతేగాదు ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టుని బాలిక కుటుంబం పట్టుబట్టింది. ఐతే ధర్మాసనం రెండోసారి నిర్వహించే పోస్ట్‌మార్టం పై స్టే ఇచ్చేందుకు నిరాకరిచడమే కాకుండా రేపు విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. ఐతే బాలిక తండ్రి తరపు న్యాయవాది రాష్ట్రంలో ఈ విషయమై చాలా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది, పైగా ఈ రోజే పోస్ట్‌మార్టం ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి దానిపై స్టే విధించండి అంటూ పట్టుబట్టారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ స్పందిస్తూ...‘ఈ అంశాన్ని ఇప్పటికే హైకోర్టు సీజ్ చేసింది. మీకు హైకోర్టుపై నమ్మకం లేదా? అని మందలించడమే కాకుండా వారి అభ్యర్థనను తిరస్కరించారు. అదీగాక మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లకు సంబంధించి దాదాపు 300 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: జస్టిస్ ఫర్ శ్రీమతి: టీచర్లు హరిప్రియ, కృతిక అరెస్ట్) -
Justice for Srimathi: ఇద్దరు టీచర్ల అరెస్టు
చెన్నై: తమిళనాడులోని సేలం జిల్లాలో 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. విద్యార్థి మృతికి కారణం స్కూల్ యజమాన్యమే కారణమని ఆరోపిస్తు ఆమె కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. అంతేగాక పలువురు గ్రామ ప్రజలు వందల సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని ఆ విద్యార్థికి న్యాయం చేయాలంటూ నిరసనలు చేశారు. పైగా వారంతా స్కూల్లోని ఫర్నీచర్‌ని ధ్వంసం చేయడమే కాకుండా పోలీసు వాహనాలను కూడా తగలు బెట్టారు. దీంతో తమిళనాడులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ స్కూల్ కెమిస్ట్రీ టీచర్ హరిప్రియ, మ్యాథమెటిక్స్ టీచర్ కృతికను అరెస్ట్ చేశారు. అదీగాక ఆ విద్యార్థి తీవ్రగాయాలు, రక్తస్రావం కారణంగా చనిపోయిందని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. ఈ కేసుకి సంబంధించి ప్రిన్సిపాల్, స్కూల్ మేనేజ్మెంట్ అధికారులతో సహా ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ విద్యార్థి ఉపాధ్యాయుల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం స్టాలిన్ కూడా స్పందించి నిరసనలు శాంతియుతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ విద్యార్థి మృతిపై సత్వరమే విచారణ జరిపించడమే కాకుండా నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు కూడా. (చదవండి: తమిళనాడులో టెన్షన్.. టెన్షన్.. స్కూల్ బస్సులను తగలబెట్టారు: సీఎం వార్నింగ్) -
ప్రేమవద్దన్నందుకు బాలిక ఆత్మహత్య
జీడిమెట్ల: ప్రేమ వద్దని తల్లిదండ్రులు మందలించినందుకు మైనర్ బాలిక చెరువులో దూకి అత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు, బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. దర్గయ్య, లలిత దంపతులు కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్‌లో ఉంటున్నారు. వీరి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో శివ, ఇందిర దంపతుల కుమారుడు (14) 9వ తరగతి చదువుతున్నాడు. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం తల్లిదండ్రులకు తెలియడంతో బాలికను ఇంటి వద్దనే ఉంచుతున్నారు. బుధవారం ఉదయం బాలిక అపార్ట్మెంట్లో పని చేస్తున్న తండ్రి దర్గయ్యకు టిఫిన్ బాక్సు ఇచ్చి సుభాష్‌నగర్‌లో బాలుడిని కలిసింది. ఇద్దరు కలిసి వీరితో చదివే వేరే బాలుడి ఇంటికి వెళ్లి అక్కడ బాలుడి స్కూల్ బ్యాగును ఉంచారు. మద్యాహ్నం సైకిల్‌పై ఇద్దరూ వెళ్లారు. రాత్రైనా ఇద్దరు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వేర్వేరుగా జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు బాలిక, బాలుడి చెప్పులు, బాలుడి సైకిల్‌ను జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ వద్ద గుర్తించారు. ఇద్దరు చెరువులో దూకి ఉంటారనే అనుమానంతో గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం బాలిక(14) మృతదేహం చెరువు నీటిపై తేలడంతో ఒడ్డుకు తీసి మృతదేహాన్ని పోస్టుమార్డమ్ నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. లభించని బాలుడి ఆచూకీ? బాలుడు బాలికతో పాటు నీటిలో దూకాడన్న అనుమానంతో పోలీసులు చెరువులో వెతకడం మొదలుపెట్టారు. ఎంతసేపైనా బాలుడి అచూకీ లభించకపోవడంతో పాటు బాలుడి తండ్రి సదరు బాలుడికి ఈత వచ్చని తెలిపారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. గురువారం చీకటి పడటంతో బాలుడికోసం గాలింపు చర్యలు సైతం చేపట్టారు. (చదవండి: కిడ్నాపర్ల చెరలో నందగిరి వాసి) -
కులాలకు ఎదురెళ్లలేక రైలుకు ఎదురెళ్లి..
నవాబుపేట: రైలుకింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణం చెందింది. మృతు లిద్దరూ మైనర్లే. ఈ సంఘటన గురువారం వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం కడ్చర్లలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పవన్‌కుమార్ (18), ధారూర్ మండలం ఎబ్బనూర్‌కు చెందిన అభినయ (17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పవన్ ఇంటర్ సెకం డియర్ ఆపేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. అభినయ ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నప్పుడు పవన్, అభినయ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారి విషయం కుటుంబ పెద్దలకు తెలిసింది. ఈ వయసులో ప్రేమలు ఏమిటంటూ మం దలించారు. అయినా ఇద్దరి కులాలు వేర్వేరని చెప్పారు. తమ పెళ్లికి వయసు, కులాలు అడ్డుగా ఉన్నాయని మనస్తాపం చెందిన పవన్, అభినయ.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి ఇద్దరూ బయట కలుసుకొని ద్విచక్ర వాహనంపై కడ్చర్ల సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి 12:30 సమయంలో హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌కు ఎదురెళ్లి బలవన్మరణం చెందారు. రైలు వేగం ధాటికి పవన్ తల 200 మీటర్ల దూరంలో పడింది. గమనించిన రైలు డ్రైవర్ వికారాబాద్ స్టేషన్ మాస్టర్‌కి సమాచారం ఇచ్చారు. మృతదేహాలను చూసి ఇరువురి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతురాలి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఇరువురి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్ఐ నర్సింగ్ రాథోడ్ తెలిపారు. -
దిగుబడి రాదని దిగులుతో..
కారేపల్లి: దిగుబడి వచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో దిగులుపడి న ఓ మిర్చి రైతు పురుగులమందు తాగి చేనులో నే విగతజీవిగా మారాడు. మిర్చి పంటను తా మర పురుగు, ఇతర తెగుళ్లు ఆశించడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యం లో ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోగా, సోమవారం మరొకరు బలవనర్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటురేలకాయలపల్లికి చెందిన వాంకుడోతు పుల్లు(58) తనకున్న నాలుగెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ.5 లక్షల అప్పు చేశాడు. అయితే తెగుళ్ల కారణంగా మిర్చి దిగుబడి వచ్చే పరి స్థితి లేకపోవడం, అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో ఆవేదన చెందిన పుల్లు సోమ వారం ఉదయం చేను వద్దే పురుగులమందు తాగాడు. ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య
ఖమ్మం క్రైం: ప్రేమ పేరుతో మైనర్ బాలికను ఓ వ్యక్తి వేధిస్తుండటంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని తల్లాడ గ్రామానికి చెందిన కుసుమరాజు వర్షిత (17) తండ్రి మృతిచెందగా కుటుంబపోషణ నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఇదే ఆస్పత్రిలో తిరువూరు మండలం మునుకోళ్లకు చెందిన మల్లవరపు మధుకుమార్ కూడా పనిచేస్తున్నాడు. తనను ప్రేమించమని, కోరిక తీర్చాలని మధు ఆమెను వేధించేవాడు. దీనికితోడు ఆమె జీతం నుంచి డబ్బు తీసుకున్నాడు. వేధింపులు పెరగడంతో వర్షిత ఇటీవల మరో ఆస్పత్రిలో చేరింది. అయినా అప్పటికే పెళ్లి అయిన మధుకుమార్ వేధింపులు ఆగకపోగా.. ఆమెతో ఫోన్లో మాట్లాడినప్పుడు రికార్డు చేసిన వాయిస్‌ను బయటపెడతానని బెదిరించసాగాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఉదయం తన స్నేహితురాలికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వెంటనే స్నేహితురాలు వర్షిత తల్లికి ఫోన్ చేయగా ఆమె ఖమ్మం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహం పక్కన ఇంజక్షన్, సిరంజీ ఉండడంతో విషం ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. టూటౌన్ సీఐ శ్రీధర్, ఎస్ఐ రాములు మృతదేహన్ని అన్నం ఫౌండేషన్ బాధ్యుల సహకారంతో మార్చురీకి తరలించారు. మధుకుమార్‌పై పోక్సోతోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. -
2018లో బాడీగార్డు మృతి.. బీజేపీ నేత సువేందుకు సమన్లు
కోల్‌కతా: పశి్చమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారికి రాష్ట్ర సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. సువేందుకు బాడీగార్డుగా పని చేసిన సబ్ ఇన్స్పెక్టర్ సుభభ్రత చక్రవర్తి మరణానికి సంబంధించిన కేసులో ఆయనకు సీఐడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని భవాని భనవ్ సీఐడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా చెప్పింది. 2018లో బాడీగార్డు చక్రవర్తి మరణించారు. తుపాకీతో తనకు తానే కాల్చుకొని మరణించినట్లు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఏడాది జూలైలో తన భర్త కేసును మళ్లీ దర్యాప్తు చేయాల్సిందిగా చక్రవర్తి భార్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో కేసు సీఐడీ చేతికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సువేందు అధికారికి సీఐడీ సమన్లు జారీ చేసింది. (చదవండి: వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ) -
పిల్లలతో సహా.. గోదావరిలో దూకిన దంపతులు
-
వివాహేతర సంబంధం: కుటుంబం బలి
‘డాడీ.. నేను ఒకడి చేతిలో మోసపోయాను. నా జీవితాన్ని నాశనం చేశాడు.. ఫలితంగా నేను, నా భర్త, పిల్లలు ఇద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాం..’ చనిపోయే ముందు.. ఆ ఇల్లాలి ఆడియో సందేశం ఇది. వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. దీనిని బట్టి చెప్పొచ్చు.. వివాహేతర సంబంధం మూలంగా ఆమె ఎంత క్షోభ అనుభవించిందో. ఎంత మానసిక వేదనకు గురైందో. చివరికి తను, భర్త, ఇద్దరు పిల్లల ప్రాణాలను మూల్యంగా చెల్లించుకుంది.. యలమంచిలి/మామిడికుదురు/మలికిపురం: వివాహేతర సంబంధం ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లా మొగలికుదురుకు చెందిన కంచి సతీష్ (32) కంచి సంధ్య (22)లు తమ పిల్లలు జశ్వన్ (4), ఇందుశ్రీదుర్గ (2)లతో కలిసి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో సతీష్, ఇందుశ్రీదుర్గ మృతదేహాలు ఆదివారం పోలీసులకు లభించగా తల్లి, కుమారుడి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట గ్రామానికి చెందిన సంధ్యకు తూర్పుగోదావరి జిల్లా మొగలికుదురుకు చెందిన సతీష్‌తో ఆరేళ్ల కిందట వివాహమైంది. తాపీ పని చేసుకునే సతీష్ రెండేళ్ల కిందట గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో సంధ్యకు కేశవదాసుపాలేనికి చెందిన ఫణీంద్రతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫణీంద్ర సంధ్య నుంచి బంగారం, నగదు కూడా తీసుకున్నాడు. విషయం బయటకు పొక్కడంతో పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగాయి. కొంత బంగారం, నగదు వెనక్కి వచ్చాయి. దీంతో సంధ్య అత్తమామలు.. పిల్లల్ని వారి దగ్గర ఉంచుకుని కోడల్ని పుట్టింటికి పంపేశారు. ఇదిలా ఉండగా గత నెల 20న గల్ఫ్ నుంచి వచ్చిన సతీష్‌కు జరిగిన విషయం తెలియడంతో మానసికంగా కుంగిపోయాడు. మద్యానికి బానిస కావడంతో తల్లిదండ్రులు అతనిని కేశవదాసుపాలెంలో ఉన్న పెద్దక్క ఇంటికి పంపారు. అక్కడ నుంచి సతీష్ ఈ నెల 29న భార్యకు ఫోన్ చేశాడు. పాలకొల్లు మండలం వెలివెలలోని తన పెద్దమ్మ నాగలక్ష్మి ఇంటి వద్ద ఉన్నానని భార్య చెప్పడంతో పిల్లలతో కలిసి అక్కడకు వెళ్లాడు. జరిగిన సంగతి మరచిపోయి కలిసి బతుకుదామని చెప్పడంతో సంధ్య కూడా ఒప్పుకుంది. ఆ తర్వాత భార్యను అత్మహత్యకు సిద్ధం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మొగలికుదురుకు బయలుదేరారు. చించినాడ వంతెన మీద బైక్ పెట్టి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు తండ్రికి సంధ్య వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ చేసింది. సతీష్ కుటుంబం అదృశ్యమైనట్టు శనివారమే కలకలం రేగింది. వారి బైక్, పిల్లల దుస్తులు ఘటనా స్థలంలో లభించడంతో వాటిని గుర్తు పట్టిన సతీష్ పెద్ద బావ కుడుపూడి పల్లయశెట్టి.. పాలకొల్లు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాలకొల్లు రూరల్ సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫణీంద్ర, వాళ్ల కుటుంబ సభ్యుల కారణంగానే తామంతా చనిపోతున్నట్టు సంధ్య రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అర్నబ్‌కు దక్కని ఊరట
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామికి న్యాయస్థానం నుంచి ఊరట దక్కలేదు. 2018 నాటి కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అయితే, ఈ విచారణ అసంపూర్తిగా ముగియడంలో అర్నబ్‌కు బెయిల్ లభించలేదు. శనివారం విచారణ కొనసాగిస్తామని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ను కించపర్చేలా టీవీలో చర్చ నిర్వహించారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు ప్రారంభిస్తామంటూ అర్నబ్‌కి మహారాష్ట్ర శాసనసభ గతంలో నోటీసిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకెక్కారు. నోటీసుపై కోర్టుకు వెళ్లడం చెల్లదని, జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ అసెంబ్లీ సెక్రెటరీ గతంలో అర్నబ్‌కి లేఖ రాశారు. విచారణ సందర్భంగా కోర్టు.. ‘పిటిషనర్‌ను బెదిరించేలా లేఖ ఎందుకు రాశారు? రెండు వారాల్లోగా వివరణ ఇవ్వండి’ అని అసెంబ్లీ సెక్రెటరీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. -
అర్నబ్ గోస్వామి అరెస్ట్
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని రాయగఢ్ జిల్లా అలీబాగ్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయిక్ (53) ఆత్మహత్యకు సంబంధించి అర్నబ్‌ను అరెస్టు చేసినట్టు అలీబాగ్ పోలీసులు పేర్కొ న్నారు. తననెందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నిస్తూ, అరెస్టువారెంటు చూపాలని అర్నబ్ వాదించారని పోలీసులు తెలిపారు. అరెస్టు వారంటును చూపించబోగా, అర్నబ్ భార్య ఆయా పేపర్లను చించేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత అర్నబ్‌ను అలీబాగ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచారు. గోస్వామిని అలీబాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ ఆయనను కోర్టులో హాజరుపరచాలని చెబుతూ ఈనెల 18 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గోస్వామి ని పోలీసులు అరెస్టు చేసే సమయంలో పోలీసులు అర్నబ్‌పై చేయి చేసుకున్నారని, అర్నబ్‌తోపాటు ఆయన న్యాయవాది గౌరవ్ పార్కర్లు ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఆయన్ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసుల బృందంలో ఉన్న మహిళా పోలీసుపై అర్నబ్ చేయి చేసుకున్నారన్న అభియోగాలతో ఆయనపై మరో ఎఫ్ఐఆర్ దాఖలైంది. మహిళా పోలీసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. తన భర్తకు ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఉంటే నేడు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్ నాయక్ భార్య అక్షతా పేర్కొన్నారు. చట్టం ముందు అంతా ఒక్కటే.. చట్టం ముందు ఎవరూ గొప్పవారు కాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. అన్వయ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకే ఈ కేసును తిరిగి విచారణ చేపట్టేందుకు కోర్టులో దరఖాస్తు చేసినట్టు చెప్పారు. అనంతరం కోర్టు అనుమతితోనే ఈ అరెస్టు జరిగిందని చట్టప్రకారం పోలీసులు తమ పని తాము చేస్తున్నారన్నారని అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. -
రియాకు బెయిల్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకి సంబంధించిన డ్రగ్స్ కేసులో నటి రియాచక్రవర్తికి ముంబై హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 28 రోజుల జైలు జీవితం తరువాత, రియా చక్రవర్తి బైక్యులా మహిళా జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. రూ.1లక్ష వ్యక్తిగత బాండు, ప్రతిరోజూ పోలీస్ స్టేషన్లో సంతకం చేయడం, ఆరు నెలల పాటు, ప్రతినెలా ఒకటవ తారీకున ఎన్సీబీ ముందు హాజరుకావడంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేయరాదని హైకోర్టు షరతులు విధించింది. రియా ఎన్సీబీ అనుమతి లేకుండా, ముంబై వీడి వెళ్ళరాదని, విదేశాలకు వెళ్ళాలనుకుంటే స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు అనుమతి తీసుకోవాలని హైకోర్టు షరతులు విధించింది. రియాకు నేర చరిత్ర లేదని, కనుక రియా సాక్ష్యాలను తారుమారు చేస్తారని తాము భావించడం లేదని బెయిలు ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానమేనని, సెలబ్రిటీలకీ, రోల్ మోడల్స్కీ ప్రత్యేక హక్కులేవీ ఉండవని హైకోర్టు వ్యాఖ్యానించింది. రియా విడుదల సందర్భంగా, మీడియా ఆమె వెంటబడటం, ఆమె వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించడం సహించబోమని ముంబై పోలీసులు మీడియాని హెచ్చరించారు. రాజ్‌పుత్ వ్యక్తిగత సహాయకులు దీపేష్ సావంత్, సామ్యూల్ మిరిండాలకు హైకోర్ట్ బెయిలు మంజూరు చేసింది. రియా సోదరుడు షోవిక్, డ్రగ్ స్మగ్లర్ అబ్దెల్ బాసిత్ పరిహార్‌లకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. -
సుశాంత్‌ది ఆత్మహత్యే: ఎయిమ్స్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ మెడికల్ బోర్డ్ స్పష్టతనిచ్చింది. ఆయన ఉరివేసుకోవడం వల్లే మరణిం చారని, హత్య కాదని ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్యుల బృందం ధృవీకరించింది. సుశాంత్ మృతికి విషప్రయోగం, లేదా గొంతు నులిమి చంపడం కారణమన్న వాదనని, ఆరుగురు సభ్యుల ఫోరెన్సిక్ వైద్యుల బృందం తోసిపుచ్చింది. ఇది కచ్చితంగా ఆత్మహత్యేనంటూ తమ నివేదికను సీబీఐకి అందజేసినట్లు ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా చెప్పారు. ఇదే తమ బృందం ఇచ్చే చివరి నివేదిక అని పేర్కొన్నారు. ఉరివేసుకోవడం వల్ల గొంతు దగ్గర రాపిడి తప్ప, సుశాంత్ శరీరంపై గాయాలు లేవని, పెనుగులాటకు సంబంధించిన గుర్తులు లేవని ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ ఛైర్మన్ గుప్తా వెల్లడించారు. -
సుశాంత్ కేసులో మరో మలుపు
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుని విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐపీసీలో సెక్షన్ 302ని (హత్య) చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ సీబీఐకి సమర్పించిన నివేదికలో సుశాంత్‌పై విష ప్రయోగం జరగలేదని చెప్పినప్పటికీ, ఆయనది ఆత్మహత్యా, హత్యా అన్నది తాము నిర్ధారించలేమని పేర్కొంది. సుశాంత్‌ని విష ప్రయోగం ద్వారా కాకుండా మరో రకంగా హత్య చేసి ఉండే అవకాశాలను కొట్టి పారేయలేమని పేర్కొంది. ఊపిరాడకే సుశాంత్ మరణించారని అందువల్ల అది కచ్చితంగా ఆత్మహత్య అని నిర్ధారించలేమని కూడా ఎయిమ్స్ వైద్యుడు ఒకరు చెప్పినట్టుగా ప్రచారంలో ఉంది. దీంతో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సెక్షన్ 302ని చేర్చాలని యోచిస్తున్నట్టుగా సీబీఐ వర్గాలు గురువారం వెల్లడించాయి. సుశాంత్ సింగ్ మృతి కేసులో భవిష్యత్ విచారణపై సీబీఐ త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందించనుంది. జూన్ 14 ఉదయం సుశాంత్ సింగ్ శవమై కనిపించిన రోజు ఆయన అపార్ట్మెంట్లో ఉన్న దీపేష్ సావంత్ , సిద్ధార్థ్ పితాని ఇతర సిబ్బందిని మరోసారి విచారించడానికి సిద్ధమవుతోంది. ఈ కేసులో పితాని, సుశాంత్ కుక్ నీరజ్ కూడా సాక్షులుగా మారే అవకాశాలున్నాయి. 13 రాత్రి సుశాంత్, రియా కలుసుకున్నారా? సుశాంత్ మృతి చెందడానికి ముందు రోజు రాత్రి జూన్ 13న సుశాంత్, నటి రియా చక్రవర్తిని కలుసుకున్నారని ముంబైకి చెందిన బీజేపీ స్థానిక నాయకుడు వివేకానంద గుప్తా చెబుతున్నారు. వాళ్లిద్దరూ తెల్లవారు జామున 3 గంటల వరకు కలిసే ఉన్నారని, ఆ తర్వాత సుశాంత్ రియాను ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేశారని తనకి కొంత మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారని వెల్లడించారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారుల వద్ద చెబుతానని వివేకానంద తెలిపారు.