సాక్షి, తిరుపతి : ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసును ప్రభుత్వం స్పేషల్ ఇన్వేష్టిగేషన్ టీం (సిట్)కు అప్పగించింది. సిట్ అధికారిగా చిత్తూరు డీఎస్పీ రమణ కుమార్‌ను నియమించారు. శిల్ప మృతికి కారణమైన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆమె కుటుంబ సభ్యులు కోరారు. కాగా ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ శిల్ప ప్రొఫెసర్ల వేధింపులు కారణంగా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
సీనియర్ డాక్టర్లు వర్సెస్ జూనియర్ డాక్టర్లు
డాక్టర్ శిల్ప మృతి ఘటనలో ప్రిన్సిపల్ రమణయ్యను సస్పెండ్ చేయడాన్ని సీనియర్ డాక్టర్లు తప్పుపడుతున్నారు. శిల‍్ప ఆత‍్మహత్య తర్వాత జరిగిన పరిణామాలపై సీనియర్ డాక్టర్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రిన్సిపల్ రమణయ్యను తిరిగి విధుల్లోకి చేర్చాలంటూ సీనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే ఉద్యమం తప్పదంటూ జూనియర్ డాకర్లు హెచ్చరిస్తున్నారు.
శిల్ప మృతికి వైద్యుల కారణం కాదు
జూనియర్ డాక‍్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకోవడానికి వైద‍్యులు కారణం కాదని, కుటుంబ వ్యవహారాలే కారణమని ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. శిల్ప మృతికి సంబంధించి సమగ‍్ర విచారణ జరగాలని అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. డాక్టర్లను కామాంధులుగా చిత్రీకరించడం బాధగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డాక్టర్లపై చర్యలు ఎమోషనల్‌గా తీసుకున్న నిర్ణయాలగా పేర్కొన్న వెంకటేశ్వర్లు.. ప్రిన్సిపల్‌ను విధులు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment