shilpa
-
సిల్వర్ స్క్రీన్ శిల్పం
‘ఒక్క చాన్స్..ఒకే ఒక్క చాన్స్’ కొందరిని స్టార్‌గా నిలబెడుతుంది. మరికొందరిని అడ్రస్ లేకుండా చేస్తుంది. అలా ఒక్క చాన్స్‌తో మెరిసి.. అపజయాలతో తడబడి.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన నటే శిల్పా మంజునాథ్. ఆ వివరాలే ఇక్కడ..⇒ శిల్పా మంజునాథ్.. బెంగళూరులో పుట్టిపెరిగింది. నటన మీదున్న ఆసక్తితో చదువు పూర్తయిన వెంటనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే, మరోవైపు ఆడిషన్స్ ఇచ్చేది.⇒ విజయ్ ఆంటోని నటించిన ‘కాళీ’ తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఇదే సినిమా అదే పేరుతో తెలుగులోనూ డబ్ అయింది. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడి, వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. ఒకేసారి కన్నడ చిత్రం ‘మగ 2’, మలయాళ చిత్రం ‘రోసాపూ’లలో నటించింది.⇒ ఇలా ఒకే ఏడాది తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సినీ ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయింది. కాని, వరుస అపజయాలతో తడబడింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుంది.⇒ ‘హైడ్ అండ్ సీక్’ అనే థ్రిల్లర్ చిత్రంతో విజయం సాధించి, తిరిగి ఫామ్‌లోకి వచ్చింది శిల్పా. త్వరలోనే ఈ చిత్రం ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది.ఏ క్యారెక్టర్‌నైనా సులభంగా ఆకళింపు చేసుకోగలను. అదే నా బలం. పాత్రను డైరెక్టర్ నరేట్ చేస్తున్నప్పుడే, నేను ఆ క్యారెక్టర్ మూడ్‌లోకి వెళ్లిపోతా. అలా తీసుకెళ్లగలిగే స్క్రిప్ట్‌లనే సెలెక్ట్ చేసుకుంటా. – శిల్పా మంజునాథ్. -
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం: ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు పొందడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్–2024 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి గురువారం విడుదల చేశారు. ఏపీ ఈసెట్ నిర్వహించిన జేఎన్టీయూ(అనంతపురం)లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. 8 దఫాలుగా ఏపీ ఈసెట్‌ను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ(ఏ) ఈసెట్ నిర్వహణ కమిటీని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అభినందించారు.ఏపీ ఈసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 37,767 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,369 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 32,881 మంది(90.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిలు 27,787 మంది దరఖాస్తు చేసుకోగా 26,693 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 23,849(91.68 శాతం) మంది అర్హత సాధించారు. అమ్మాయిలు 9,980 మంది దరఖాస్తు చేసుకోగా, 9,676 మంది హాజరయ్యారు. వీరిలో 9,032(93.34 శాతం) మంది ఉత్తీర్ణలుయ్యారు. ఈసెట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,071 మంది పరీక్ష రాయగా 1,002 (93.56 శాతం) మంది అర్హత సాధించారు. ఉదయం సెషన్లో మొత్తం 145 ప్రశ్నలకు గాను 272 అభ్యంతరాలు రాగా.. నాలుగు ఆమోదం పొందాయి.మధ్యాహ్నం సెషన్లో మొత్తం 171 ప్రశ్నలకు గాను 444 అభ్యంతరాలు రాగా 19 ఆమోదం పొందాయి. ఈ ప్రశ్నలకు జవాబు రాసిన వారికి మార్కులు లభించాయి. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఏపీ సెట్స్ స్పెషల్ ఆఫీసర్ ఎం.సుధీర్‌రెడ్డి, ఏపీ ఈసెట్ చైర్మన్ జీవీఆర్ శ్రీనివాసరావు, కన్వీనర్ పీఆర్ భానుమూర్తి, జేఎన్టీయూ(ఏ) రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, పాలకమండలి సభ్యులు బి.దుర్గాప్రసాద్, డాక్టర్ ఎం.రామశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.వలంటీర్ శిల్ప స్టేట్ ఫస్ట్రణస్థలం: సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థలో చేరి ప్రజలకు సేవ చేస్తున్న ఓ యువతి ఏపీ ఈసెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో వలంటీర్‌గా సేవలందిస్తున్న మైలపల్లి శిల్ప రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. శిల్ప ప్రస్తుతం శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డీ–ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది.ఇంజనీరింగ్ చదవాలనే ఆశయంతో ఆమె ఈసెట్ రాయగా.. బయో టెక్నాలజీ విభాగంలో ఫస్ట్ ర్యాంకు వచ్చిందని ఆమె తెలిపింది. ఆమె తండ్రి పేరు పోలీసు.. టైలర్‌గా పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి గృహిణి. కుమార్తెకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. గ్రామస్తులు శిల్పను అభినందించారు. శిల్ప మాట్లాడుతూ.. బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసి అత్యుత్తమంగా రాణించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. -
చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్
-
యాదాద్రి కలెక్టరేట్లో దంపతుల ఘర్షణ
భువనగిరి క్రైం: కొద్దికాలంగా తనతో సఖ్యతగా ఉండటంలేదన్న కోపంతో భర్తపై కత్తితో దాడి చేసింది ఓ భార్య. శుక్రవారం యాదాద్రి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కలెక్టరేట్లో ఆత్మకూర్(ఎం) మండల వ్యవసాయశాఖ అధికారిణిగా పనిచేస్తున్న నర్ర శిల్ప, అదే కార్యాలయంలో తన కిందిస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న మాటూరి మనోజ్‌గౌడ్‌ను గతేడాది జూన్ 7న ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా 3నెలల క్రితం మనోజ్‌గౌడ్ యాదగిరిగుట్టకు డిప్యూటేషన్‌పై వెళ్లి అనంతరం సెలవుపై వెళ్లాడు. శుక్రవారంతో సెలవులు పూర్తికావడంతో విధులకు హాజరుకావడానికి రిపోర్ట్ చేసేందుకు కలెక్టర్‌ట్‌కు వచ్చాడు. అదేసమయంలో భర్తతో మాట్లాడేందుకు శిల్ప దగ్గరకు వెళ్లింది. గొడవల నేపథ్యంలో వారిద్దరిమధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో శిల్ప కత్తి తీసుకుని మనోజ్‌పై దాడి చేయగా..అతడి వీపు, మెడపై తీవ్రగాయాలయ్యాయి. సహోద్యోగులు వెంటనే వారిని అడ్డుకుని మనోజ్‌ను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడ్నుంచి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శిల్పను వివరణ కోరగా..మనోజ్ కొంతకాలంగా తనతో సఖ్యతగా ఉండటం లేదని ఇదే విషయం మాట్లాడేందుకు రాగా తనపై కత్తితో దాడి దిగాడని చెప్పారు. దీంతో ఆత్మరక్షణార్థం అతడి వద్ద ఉన్న కత్తిని లాక్కుని దాడి చేసినట్లు చెప్పారు. శిల్ప, మనోజ్ తండ్రి ఉపేందర్ వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఘటనపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని భువనగిరి కలెక్టర్ హనుమంతు కె.జడంగే చెప్పారు. -
శిల్ప ఎస్టేట్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం
-
మావోయిస్టులతో లింకులపై... ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తిజేస్తూ యువత మావోయిస్టుల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారన్న అభియో గంపై చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్కా శిల్పను జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) గురువారం అరెస్టు చేసింది. వారిలో శిల్ప హైకోర్టు న్యాయవాది. ఏపీలోని విశాఖపట్నంలో 2017 డిసెంబర్లో అదృశ్యమైన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బృం దాలు సికింద్రాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్న నిందితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశాయి. దాదాపు 4 గంటలపాటు సోదాలు చేపట్టి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం వారిని అరెస్టు చేశాయి. ఇదీ కేసు... పోలీసుల కథనం ప్రకారం కాప్రాలోని సాయిబాబా కాలనీకి చెందిన పల్లెపాటి పోచమ్మ చిన్న కుమార్తె రాధ నర్సింగ్ విద్యార్థిని. మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్క శిల్ప తదితరులు తరచూ రాధను కలిసేవారు. 2017 డిసెంబర్లో రాధను కలిసిన దేవేంద్ర... కొందరికి వైద్యం చేయాల్సి ఉందంటూ బలవంతంగా ఆమెను తీసుకుకెళ్లాడు. అప్పటి నుంచి రాధ తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె కోసం పోచమ్మ అనేక ప్రాంతాల్లో గాలించి చివరకు తన కుమార్తె మావోయిస్టు పార్టీలో చేరిందని... విశాఖపట్నం జిల్లా పెద్దబయలు అటవీ ప్రాంతంలో అగ్రనేతలు ఉదయ్, అరుణలతో కలసి పనిచేస్తున్నట్లు తెలుసుకుంది. రాధ అదృశ్యంపై ఈ ఏడాది జనవరిలో విశాఖ జిల్లాలోని పెద్దబయలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యమైన సమయంలో రాధ మైనర్ కావడంతో దీన్ని కిడ్నాప్ కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు. బలహీన వర్గాల కేసులు వాదిస్తున్న శిల్ప... హైకోర్టు అడ్వొకేట్‌గా పని చేస్తున్న శిల్ప 6 నెలలుగా బోడుప్పల్‌లోని హేమానగర్లో భర్త కిరణ్, అత్త హేమతో కలసి అద్దెకు ఉంటోంది. పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన పలు కోర్టు కేసులను శిల్ప వాదిస్తోంది. కాగా, తన భార్యను ఎన్ఐఏ అక్రమంగా అరెస్టు చేసిందని శిల్ప భర్త కిరణ్ ఆరోపించారు. రంగంలోకి ఎన్ఐఏ... కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయింది. దీంతో ఈ నెల 3న ఈ కేసును రీ–రిజిస్టర్ చేసిన ఎన్ఐఏ... సీఎంఎస్ నాయకులే కుట్రపూరితంగా రాధను మావోయిస్టు పార్టీలో చేర్చారని, అడవిలో ఆమెను నిర్బంధించి ఉంచారని ఆరోపించింది. మావోయిస్టు పార్టీ ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అరుణ, దేవేంద్ర, స్వప్న, శిల్ప తదితరులను నిందితులుగా చేర్చింది. -
సాధనతో ఆరోగ్య యోగం
మదనపల్లె సిటీ: నాటి కాలంలో ధ్యానం, చక్కటి ఆహారపు అలవాట్లుతో జీవనం సాగేది. ప్రస్తుతం అడుగడుగునా ఆధునికత రంగులు పులుముకుంటున్న వేళ వివిధ రకాల అనారోగ్యాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు, మానసిక ప్రశాంతతకు ఇటీవల కాలంలో పలువురు యోగాపై మక్కువ పెంచుకుని సాధన అలవాటుగా మార్చుకున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది యోగాపై మక్కువ చూపుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా గురువు శిల్ప గురించి ప్రత్యేక కథనం.. 12 ఏళ్లుగా తర్ఫీదు.. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శిల్ప వివాహానంతరం మదనపల్లెలో స్థిరపడ్డారు. 2010లో శిల్ప బెంగుళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసాధన సంస్థలో ప్రత్యేక శిక్షణ పొందారు. 2011 నుంచి పట్టణంలో పలు పాఠశాలల్లో యోగాపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణిస్తున్నారు. ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులకు యోగా నేర్పిస్తూ ఆరోగ్య పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. సుమారు 12 సంవత్సరాలుగా పట్టణంలోని పలు పాఠశాలల్లో యోగాపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ►జాతీయ స్థాయిలో ఆలిండియా కల్చర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2012లో హైదరాబాదులో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. యోగాలో ప్రత్యేక ప్రతిభ కనబరిచినందుకు అప్పటి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. గురువుల పర్యవేక్షణలో ఆసనాలు సాధన చేయాలి.. యోగాసనాలు నిత్య జీవితంలో జరిగే క్రియల్లో భాగం కావాలి. అనారోగ్యం పేరుతో వేలాది రూపాయలు ఔషధాలకు వినియోగించేకంటే, రోజు కొంత సమయం వ్యక్తి గత ఆరోగ్యం కోసం కేటాయించి గురువుల పర్యవేక్షణలో ఆసనాలు సాధన చేస్తే రోగాలకు దూరంగా ఉండొచ్చు. చిన్నతనం నుంచి యోగాసనాలపై ఆసక్తితో నిష్ణాతులైన గురువుల శిక్షణలో సాధన చేశాను. – శిల్ప, యోగా గురువు, మదనపల్లె -
శిల్పా చౌదరికి బెయిల్.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదల
సాక్షి, మణికొండ: సంపన్న మహిళలను కిట్టీ పార్టీలకు పిలిచి, అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అని వారిని నమ్మించి కోట్లు దండుకున్న శిల్పాచౌదరికి ఎట్టకేలకు రాజేంద్రనగర్ కోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. ఆమెపై ఉన్న 3 కేసులలోను బెయిలు మంజూరవడంతో శుక్రవారం విడుదలయ్యారు. శిల్పాచౌదరికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10వేల రూపాయల చొప్పున ష్యూర్టీలు సమర్పించాలని చెప్పింది. సమాచారం లేకుండా విదేశీ ప్రయాణం చేయొద్దని .. నిబంధన విధించింది. ఎవరితోనూ ఫోన్లో కానీ, డైరెక్ట్‌గా కానీ, కేసు విషయం మాట్లాడకూడదని సాక్షులను బెదిరించరాదని కోర్టు ఆదేశించింది. అలాగే ప్రతీ శనివారం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని తెలిపింది. కాగా గతనెల 13న ఆమెపై దివ్యారెడ్డి అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా 25వ తేదీన శిల్పను అరెస్టు చేసి 26న రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం 3 సార్లు కస్టడీకి తీసుకుని విచారించినా మహిళల నుంచి తీసుకున్న డబ్బును ఏం చేసిందో మాత్రం నోరు విప్పలేదు. కొందరు మహిళలకు డబ్బు ఇచ్చానని, ఓ ఆసుపత్రి నిర్మాణంలో పెట్టుబడి పెట్టానని, హయత్‌నగర్‌లో ఓ ప్లాటు, గండిపేటలో ఓ విల్లా ఉందని వాటిని అమ్మి తనపై ఫిర్యాదులు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని విచారణల్లో పేర్కొంది. చదవండి: పోలీసుల విచారణ.. మౌనమే శిల్పా సమాధానం? -
‘మాయా’ శిల్పం: లాకరుంది.. డబ్బుల్లేవు
మణికొండ: అధిక వడ్డీలు, రియల్ వ్యాపారా లంటూ సంపన్న మహిళల నుంచి రూ. కోట్లు దండుకున్న శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు మూడోసారి విచారించారు. బెయిల్ పిటిషన్‌ను సోమవారం రాజేంద్రనగర్ కోర్టు రద్దు చేసి మరోసారి పోలీసు కస్టడీకి అనుమతించటంతో మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి నార్సింగికి ఆమెను తీసుకొచ్చారు. తర్వాత కోకాపేటలోని యాక్సిస్ బ్యాంక్‌కు తీసుకెళ్లి లాకర్‌ను తెరిపించారు. అందులో డబ్బు లేకపోవటంతో పోలీసులు నిరాశ చెందారు. ఓ ఆస్పత్రి సొసైటీ పత్రాలు, గండిపేటలోని తన సిగ్నేచర్ విల్లా జిరాక్స్ పత్రాలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకున్నారు. డబ్బులేం చేశావని అడిగితే.. ఫిర్యాదు చేసిన మహిళల నుంచి తీసుకున్న డబ్బును ఏం చేశావని, బినామీ పేర్లతో ఎక్కడ ఆస్తులు కొన్నావని శిల్పను పోలీసులు ప్రశ్నించారు. దానికి జవాబుగా హయత్‌నగర్‌లో తనకు 240 గజాల భూమి ఉందని, విల్లా.. బ్యాంక్ లోన్‌లో ఉందని, బయటకు రాగానే వాటిని అమ్మి డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి ఇచ్చేస్తానని చెప్పినట్టు తెలిసింది. హాస్పిటల్ సొసైటీలో పెట్టుబడులు పెట్టినట్టు, అందులో మోసపోయానని చెప్పినట్టు సమాచారం. యాక్సిస్ బ్యాంక్‌కు వచ్చిన సందర్భంగా మీడియా శిల్పను తన వాదన చెప్పాలని కోరగా వాళ్లను తప్పించుకుని పోలీసు వాహనం ఎక్కింది. ఆమెను బుధవారం తిరిగి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. పక్కా స్కెచ్‌తోనే.. సంపన్న మహిళలే టార్గెట్‌గా వారితో ఫ్రెండ్షిప్ చేసిందని, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వారిని కిట్టీ పార్టీలకు పిలిచి పక్కా స్కెచ్‌తోనే డబ్బు దండుకుని ఎక్కడ పెట్టిందో చెప్పట్లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి నుంచి డబ్బు తీసుకుని కొన్ని నెలలు వడ్డీ చెల్లించడం, తీరా విషయం పోలీసు స్టేషన్‌కు వచ్చిందనగానే అకౌంట్లు, లాకర్లలో డబ్బుల్లేకుండా చేయటం, విచారణలో నోరు విప్పకపోవటం వాటికి బలం చేకూరుస్తున్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. తనకు డబ్బులు ఇచ్చే వారిని ముంచాలనే తరచూ కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసి వాటిల్లో తనకు లేని దర్పాన్ని ప్రదర్శించగా ఆ ఎత్తుకు కొందరు మహిళలు చిక్కి మోసపోయారని పలువురు చెబుతున్నారు. వారికి న్యాయం చేసేందుకు పోలీసులు ఎంతలా ప్రయత్నించినా ఫలితం ఆశించినంతగా దక్కలేదని అంటున్నారు. -
మౌన శిల్పం: ప్రశ్నలడిగితే ‘మైగ్రేన్’.. ఆకలేస్తే బిర్యానీ
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశ చూపి సంపన్న మహిళల నుంచి రూ. కోట్లు దండుకున్న కేసులో అరెస్టయిన శిల్పాచౌదరి పోలీసులకు కస్టడీలో చుక్కలు చూపింది. రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ఐదు రోజులపాటు ప్రశ్నించినా బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును ఏం చేసిందో మాత్రం ఆమె బయటపెట్టలేదు. సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశ చూపి సంపన్న మహిళల నుంచి రూ. కోట్లు దండుకున్న కేసులో అరెస్టయిన శిల్పాచౌదరి పోలీసులకు కస్టడీలో చుక్కలు చూపింది. రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ఐదు రోజులపాటు ప్రశ్నించినా బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును ఏం చేసిందో మాత్రం ఆమె బయటపెట్టలేదు. ఎంత అడిగినా మౌనం దాల్చింది. గట్టిగా ప్రశ్నించగా తనకు అనారోగ్యంగా ఉందని, మనోవేదనకు గురిచేస్తే మైగ్రేన్ వస్తుందని పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. ఒక సందర్భంలోనైతే పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగినట్లు సమాచారం. పోలీసు కస్టడీకి చివరి రోజైన ఆదివారం నార్సింగి పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) శిల్పాచౌదరిని ప్రశ్నిస్తుండగా మధ్యాహ్న వేళ తనకు ఆకలిగా ఉందని, బిర్యానీ కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలియవచ్చింది. దీంతో పోలీసులు నార్సింగిలోని ఓ హోటల్ నుంచి చికెన్ బిర్యానీ తీసుకొచ్చి శిల్పకు ఇచ్చినట్లు తెలిసింది. ఆదివారంతో ఆమె కస్టడీ ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఆమెను కోర్టుకు తరలించనున్నారు. తమ క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ శిల్ప తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. (ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు) 50 శాతం సొమ్ము తిరిగిచ్చేశా.. దీవానోస్ పేరిట క్లబ్ ఏర్పాటు చేసి సంపన్న మహిళలను కిట్టీ పార్టీలకు ఆహ్వానించిన శిల్ప... తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, అందులో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు ఇస్తానని నమ్మించి వందలాది మంది మహిళల నుంచి రూ. కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. శిల్పాచౌదరికి రూ. 1.05 కోట్లు ఇస్తే తిరిగి ఇవ్వకపోవటమే కాకుండా బౌన్సర్లతో బెదిరిస్తోందంటూ పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి నార్సింగి పీఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. శిల్పాచౌదరికి రూ.2.9 కోట్లు ఇచ్చి మోసపోయానని సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె ప్రియదర్శిని, రూ. 3.1 కోట్లు ఇస్తే మోసం చేసిందంటూ మరో మహిళా వ్యాపారవేత్త రోహిణి సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శిల్ప, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస ప్రసాద్ ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఆ ముగ్గురు మహిళలకు ఇప్పటికే 50 శాతం సొమ్ము తిరిగి ఇచ్చిసినట్లు శిల్పాచౌదరి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. -
కోట్లు దండుకుని.. పొంతనలేని సమాధానాలు!
సాక్షి, మణికొండ: శిల్పా చౌదరికి మూడురోజుల కస్టడీ ముగిసింది. విచారణకు ఏ మాత్రం సహకరించలేదని పోలీసులు తెలిపారు. కిట్టీ పార్టీలకు పిలిచి సంపన్న మహిళల నుంచి కోట్లు దండుకున్న శిల్పాచౌదరి పొంతనలేని సమాధానాలు, కాలయాపనకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసింది. ఆమెను నార్సింగి పోలీసులు రెండవ సారి కస్టడీకి తీసుకుని శుక్రవారం నుంచి విచారిస్తున్న విషయం తెలిసిందే. విచారణలో రెండవ రోజు శనివారం వాట్సాప్ గ్రూపులు, నిర్వహించిన కిట్టీ పార్టీలు, వాటికి హాజరయ్యే మహిళల వివరాలు, వారి నుంచి తీసుకున్న డబ్బు, ఎక్కడకు మళ్లించారనే విషయంలో పోలీసులు ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. అయితే.. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పటం, పాత విషయాలు తనకు గుర్తు లేదని, కొందరు బ్లాక్ మనీని వైట్ చేయాలనే ఇచ్చారని, అప్పు రూపంలో ఎవరూ ఇవ్వలేని పేర్కొన్నట్టు సమాచారం. కిట్టీ పార్టీలతో పాటు పేకాట, స్పాలను నిర్వహించినట్టు తమ వద్ద సమా చారం ఉందని పేర్కొన్నారని అయినా.. మౌనమే సమాధానమైందని తెలిసింది. చదవండి: (పోలీసుల విచారణ.. మౌనమే శిల్పా సమాధానం?) -
పోలీసుల విచారణ.. మౌనమే శిల్పా సమాధానం?
సాక్షి, హైదరాబాద్(మణికొండ): పలువురు మహిళల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఎక్కడ ఏమి కొనుగోలు చేశారు? మీ బినామీలు ఎవరు? మీ ఆర్థిక వివరాలన్నీ చెప్పాల్సిందే...ఇదీ కిట్టీ పార్టీలకు పిలిచి కోట్లు దండుకుని మోసం చేసిన శిల్పాచౌదరిపై పోలీసులు సంధిస్తున్న ప్రశ్నలు. అయితే ఆమె నుంచి సమాధానాలు రాలేదని, మౌనంగానే ఉండిపోతోందని తెలిసింది. శిల్పాచౌదరిని మరోమారు శుక్రవారం కస్టడీకి తీసుకున్నారు. ఉదయం చంచల్‌గూడ జైలునుంచి ఆమెను పోలీసు వాహనంలో నార్సింగిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం ఎస్ఓటీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమెను ప్రశ్నించడంతో నిజాలను వెల్లడించేందుకు నిరాకరిస్తుందని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (శిల్పా చౌదరికి రూ.11కోట్లు ఇచ్చిన ఆ బాధితురాలెవరు..?) -
శిల్పా చౌదరికి రూ.11కోట్లు ఇచ్చిన ఆ బాధితురాలెవరు..?
సాక్షి, హైదరాబాద్: తన పేరు మీద గండిపేటలోని సిగ్నేచర్ విల్లాస్‌లో విల్లా నంబర్–17 మాత్రమే ఉందని కిట్టీ పార్టీలతో సంపన్న వర్గాల మహిళల నుంచి రూ. కోట్లు వసూలు చేసిన తెల్ల శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పెట్టుబడులు, అధిక వడ్డీల రూపంలో పలువురు బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును మరో మహిళకు ఇచ్చానని, ఆమె మోసం చేయడంతోనే ఈ ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. నగదు తీసుకున్న మహిళ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్లతో పాటు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నారని చెప్పినట్టు సమాచారం. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) శిల్ప, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్‌ల స్థిర, చరాస్తులపై విచారణాధికారులు, నార్సింగి స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రెండ్రోజులు ఆరా తీసినట్టు తెలిసింది. వందల సంఖ్యలో బాధితుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలతో బినామీ పేర్లతో స్థలాలు కొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడెక్కడ కొన్నారు.. ఆస్తులు ఎవరి పేర్ల మీదు ఉన్నాయో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. శిల్ప కస్టడీ శనివారం మధ్యాహ్నంతో ముగియడంతో ఆమెను తిరిగి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. రూ.11 కోట్లు ఇచ్చిందెవరు? దివానోస్ పేరిట క్లబ్ ఏర్పాటు చేసిన శిల్ప.. హై ప్రొఫైల్ సెలబ్రిటీలతో నెలలో రెండు సార్లు కిట్టీ పార్టీలు నిర్వహించేది. తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు ఇస్తానని ఆశ చూపి ఒక్కొక్కరి నుంచి రూ. కోటి నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే ఒక్క బాధితురాలు మాత్రం రూ.11 కోట్లు ఇచ్చినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఆమె ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదన్నారు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) బాధితులు వేలల్లో.. ఫిర్యాదులు మూడే! శిల్పా చౌదరి కాల్ డేటా ఆధారంగా ఆమె బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ముగ్గురు మహిళా బాధితులే నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుప్పాలగూడలోని మహిళ వ్యాపారవేత్త దివ్యారెడ్డి (రూ.1.05 కోట్లు) ఫిర్యాదుతో శిల్ప బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శిణి (రూ.2.9 కోట్లు) ఫిర్యాదు చేసింది. మూడో బాధితురాలు నార్సింగికి చెందిన వ్యాపారవేత్త రోహిణి (రూ.3.1 కోట్లు) కేసు నమోదు చేసింది. వీళ్ల ముగ్గురు శిల్పకు ఇచ్చిన సొమ్ము రూ.7.05 కోట్లు. శిల్ప చెప్పేదంతా అవాస్తవం తాను వసూలు చేసిన మొత్తంలో రూ.6 కోట్లు జన్వాడకు చెందిన టంగుటూరి రాధికా రెడ్డికి ఇచ్చానని పోలీసులకు శిల్ప చెప్పినట్టు తెలిసింది. ఆమెను పోలీసులు విచారిచంగా శిల్ప చెప్పేదంతా అవాస్తవమని, ఆమెనే తన దగ్గర డబ్బులు తీసుకుందని రాధిక ఆరోపించింది. శిల్ప ఇచ్చిన చెక్కులు, ఇతర పత్రాలను పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. -
బ్లాక్ మనీని వైట్ చేయమని డబ్బు ఇచ్చారు: శిల్పా చౌదరి
సాక్షి, హైదరాబాద్: తన పేరు మీద గండిపేటలోని సిగ్నేచర్ విల్లాస్‌లో విల్లా నంబర్–17 మాత్రమే ఉందని కిట్టీ పార్టీలతో సంపన్న వర్గాల మహిళల నుంచి రూ. కోట్లు వసూలు చేసిన తెల్ల శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పెట్టుబడులు, అధిక వడ్డీల రూపంలో పలువురు బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును మరో మహిళకు ఇచ్చానని, ఆమె మోసం చేయడంతోనే ఈ ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. నగదు తీసుకున్న మహిళ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్లతో పాటు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నారని చెప్పినట్టు సమాచారం. శిల్ప, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్‌ల స్థిర, చరాస్తులపై విచారణాధికారులు, నార్సింగి స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రెండ్రోజులు ఆరా తీసినట్టు తెలిసింది. వందల సంఖ్యలో బాధితుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలతో బినామీ పేర్లతో స్థలాలు కొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడెక్కడ కొన్నారు.. ఆస్తులు ఎవరి పేర్ల మీదు ఉన్నాయో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. శిల్ప కస్టడీ శనివారం మధ్యాహ్నంతో ముగియడంతో ఆమెను తిరిగి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. రూ.11 కోట్లు ఇచ్చిందెవరు? దివానోస్ పేరిట క్లబ్ ఏర్పాటు చేసిన శిల్ప.. హై ప్రొఫైల్ సెలబ్రిటీలతో నెలలో రెండు సార్లు కిట్టీ పార్టీలు నిర్వహించేది. తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు ఇస్తానని ఆశ చూపి ఒక్కొక్కరి నుంచి రూ. కోటి నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే ఒక్క బాధితురాలు మాత్రం రూ.11 కోట్లు ఇచ్చినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఆమె ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదన్నారు. బాధితులు వేలల్లో.. ఫిర్యాదులు మూడే! శిల్పా చౌదరి కాల్ డేటా ఆధారంగా ఆమె బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ముగ్గురు మహిళా బాధితులే నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుప్పాలగూడలోని మహిళ వ్యాపారవేత్త దివ్యారెడ్డి (రూ.1.05 కోట్లు) ఫిర్యాదుతో శిల్ప బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శిణి (రూ.2.9 కోట్లు) ఫిర్యాదు చేసింది. మూడో బాధితురాలు నార్సింగికి చెందిన వ్యాపారవేత్త రోహిణి (రూ.3.1 కోట్లు) కేసు నమోదు చేసింది. వీళ్ల ముగ్గురు శిల్పకు ఇచ్చిన సొమ్ము రూ.7.05 కోట్లు. శిల్ప చెప్పేదంతా అవాస్తవం తాను వసూలు చేసిన మొత్తంలో రూ.6 కోట్లు జన్వాడకు చెందిన టంగుటూరి రాధికా రెడ్డికి ఇచ్చానని పోలీసులకు శిల్ప చెప్పినట్టు తెలిసింది. ఆమెను పోలీసులు విచారిచంగా శిల్ప చెప్పేదంతా అవాస్తవమని, ఆమెనే తన దగ్గర డబ్బులు తీసుకుందని రాధిక ఆరోపించింది. శిల్ప ఇచ్చిన చెక్కులు, ఇతర పత్రాలను పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. చదవండి: శిల్పా చౌదరి కేసు: ఆ డబ్బంతా బ్లాక్‌ను వైట్ చేసేందుకే ఇచ్చారా? -
శిల్పా చౌదరి కేసు: ఆ డబ్బంతా బ్లాక్‌ను వైట్ చేసేందుకే ఇచ్చారా?
మణికొండ: కిట్టీ పార్టీల పేరుతో సంపన్న మహిళలను పరిచయం చేసుకొని వారి నుంచి భారీగా డబ్బు గుంజిన శిల్పా చౌదరిని పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. ఆమెను 2 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతించడంతో శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నార్సింగి స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) శిల్పాచౌదరిని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చింది. తొలుత విచారణలో ఆమె పెద్దగా సహకరించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణాధికారులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. అయితే ఆమె ఫోన్ కాల్‌డాటా, వాట్సాప్ చాటింగ్‌లు, బ్యాంక్ స్టేట్మెంట్లపై ప్రశ్నించడంతో విలపించినట్లు సమాచారం. చాలా మంది బ్లాక్‌మనీని వైట్ చేసేందుకు పెట్టుబడి రూపంలో ఇచ్చారని, మరికొందరు అధిక వడ్డీకి ఆశపడి అప్పుగా ఇచ్చారని పోలీసులకు వివరించినట్లు సమాచారం. బాధితుల నుంచి సేకరించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టినది, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో సమాధానం దాటవేసినట్లు తెలిసింది. సంపన్నుల డబ్బును ఎగ్గొట్టే ఎత్తుగడను శిల్పాచౌదరి అమలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. శనివారం కూడా ఆమె విచారణ సాగనుంది. -
రూ. 3 కోట్ల మోసం, శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన యంగ్ హీరో ఇతడే
Shilpa Choudhary Cheating Case: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ పలువురు సెలబ్రెటీ వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి చీటింగ్ కేసులో రోజురోజుకు కీలక విషయాలు బయట పడుతున్నాయి. ఆమె చేతిలో మోసపోయిన సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కిట్టి పార్టీల పేరుతో శిల్ప తన దగ్గర సుమారు 3 కోట్ల రూపాయలు తీసుకుని ఇవ్వడం లేదంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శిల్పను మరోసారి కస్టడిలోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని ఈ క్రమంలో శిల్ప చేతిలో మోసపోయానంటూ మరో టాలీవుడ్ సెలబ్రెటీ బయటకు వచ్చాడు. యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి శిల్ప మాయమాటలు నమ్మి నట్టేట మునిగాడు. కిట్టి పార్టీ పేరుతో మాయ మాటలు చెప్పి శిల్ప తన దగ్గర రూ. 3 కోట్లు వసూలు చేసిందట. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తొందంటూ ఈ యంగ్ హీరో పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కాగా ‘సెహరి’ సినిమాతో హర్ష్ కనుమల్లి హీరోగా పరిచయమయ్యాడు. వీరితో పాటు మరో స్టార్ హీరో కూడా శిల్ప బాధితుల్లో ఉన్నట్లు సమాచారం. కాగా కిట్టి పార్టిలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో శిల్పా చౌదరి సెలబ్రెట్రీలతో పాటు నగరానికి చెందిన ప్రముఖుల వద్ద దాదాపు రూ. 200 కోట్లు రూపాయలు వసూలు చేశారు. చదవండి: అన్నయ్యను ఇలా పరిచయం చేస్తాననుకోలేదు: హీరో ఆవేదన ఆమె మాయమాటలకు ప్రముఖ టాలీవుడ్ హీరో కుటుంబం కూడా రూ. 12 కోట్లు మోసపోయినట్లు సమాచారం. వారు టాలీవుడ్ అగ్రహీరోకు అత్యంత ఆప్తులుగా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసం ఒక్కొక్కరి వద్ద రూ. 6 కోట్ల చొప్పున మొత్తం 12 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. మరో సీనియర్ నటుడు కూడా రూ. 2.4 కోట్లు మోసపోయినట్లు సమాచారం. శిల్పా చౌదరి బాగోతాలు వెలుగులోకి రావడంతో బాధితులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర పోలీస్ స్టేషన్ల్లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో! కాగా యంగ్ హీరో సుధీర్‌బాబు భార్య ప్రియదర్శిని దగ్గర 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని మూడు నకిలీ చెక్కులు, నకిలీ బంగారాన్ని ష్యూరిటీ కింద ఇచ్చినట్టు బయట పడింది. చెక్కు మార్చేందుకు ఇండియన్ బ్యాంక్‌కు వెళ్లిన ప్రియదర్శిని.. మోసపోయినట్టు తెలుసుకుని అవాక్కయింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. శిల్పా చౌదరి 50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిల్పా చౌదరికి చెందిన 6 బ్యాంక్ అకౌంట్స్‌పై నార్సింగ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ముగ్గురు టాలీవుడ్ హీరోలకు రూ. 200 కోట్లు కుచ్చు టోపి!
Police Arrested Shilpa Who Cheats Rs 100 to 200 Crore Tollywood Heros: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ వందల కోట్ల రూపాయలు మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహరం బట్టబయలైంది. సినీ సెలబెట్రీలతో పాటు నగరానికి చెందిన ప్రముఖులను శిల్పా రూ. 100 నుంచి రూ. 200 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు శిల్ప, ఆమె భర్తను శనివారం ఉదయం అరెస్టు చేశారు. శిల్ప బాధితుల్లో టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు హీరోలు ఉండటం గమనార్హం. చదవండి: Disha Patani: దిశ పటానీకి సర్జరీ వికటించిందా? పేజ్ 3 పార్టీలతో సెలబ్రెటీలను ఆకర్షిస్తూ శిల్పా మోసపూరితంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో తాము మోసపోయామంటూ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు వరసగా పోలీసు స్టేషన్‌కు క్యూ కట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫేజ్ త్రి పార్టీలో ప్రముఖుల పేర్లు చెప్పి అధిక వడ్డికి ఇప్పిస్తానంటూ శిల్ప వందల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు శిల్ప ఆమె భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. శిల్పా మోసం చేసిన వారిలో టాలీవుడ్ హీరోలతో పాటు వ్యాపారవేత్తలు, లాయర్లు, ఫైనార్సర్లు ఉన్నారు. చదవండి: వైరల్ అవుతోన్న జెనిలియా ఎమోషనల్ పోస్ట్ -
Shilpa Yarlagadda: పింక్ రింగ్ శిల్ప!
తాజాగా టైమ్ మ్యాగజీన్ కవర్ ఫోటో మీద ప్రిన్స్ హారీ మేఘనా మెర్కెల్ జంట ఆకర్షణీయంగా కనిపించింది. అయితే వీరిద్దరూ ధరించిన డ్రెస్‌లు, ఆభరణాలలో ముఖ్యంగా మెర్కెల్ వేలికి తొడిగిన ‘డ్యూయెట్ పింక్ డైమండ్ రింగు’ ప్రత్యేకంగా ఉండడంతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక మహిళ మరొకరికి మద్దతు ఇస్తోంది అని చెప్పే ‘పింక్ వాగ్దానం’కు గుర్తుగా ఈ రింగును రూపొందించినట్లుగా ఆ ఉంగరాన్ని డిజైన్ చేసిన సంస్థ ‘శిఫాన్’ చెబుతోంది. రింగు బాగా పాపులర్ అవ్వడంతో రింగును రూపొందించిన డిజైనర్ శిల్పా యార్లగడ్డ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. శిల్ప పేరు తెరమీదకు రావడానికి ఒక పింక్ డైమండ్ రింగేగాక, చిన్న వయసులోనే డైమండ్ జ్యూవెలరీ స్టార్టప్‌ను ప్రారంభించి విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తూ, తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి వినియోగించడం మరో కారణం. ఒక పక్క తన చదువు ఇంకా పూర్తికాలేదు. కానీ తను ఒక సక్సెస్ ఫుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తూ.. తనలాంటి ఎంతోమందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా పనిచేస్తోంది శిల్పా యార్లగడ్డ. శిఫాన్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో పెరిగిన శిల్పా యార్లగడ్డ భారత సంతతికి చెందిన అమ్మాయి. శిల్ప హైస్కూల్లో ఉన్నప్పుడు నాసా, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లలో ఇంటర్న్‌షిప్ చేసింది. అప్పుడు కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంది. ఈ క్రమంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎమ్ఐటీ మొదటి ఏడాది చదివేటప్పుడు.. తన చుట్టుపక్కల ఉన్న జ్యువెలరీ సంస్థలన్నీ పురుషులే నిర్వహించడం చూసేది. ఈ రంగంలోకి మహిళలు కూడా అడుగుపెట్టాలి అని భావించి... వివిధ రకాల ఆభరణాలను ఎలా తయారు చేయాలి? తక్కువ ఖర్చులో మన్నిక కలిగిన ఆభరణాల తయారీ ఎలా... అనే అంశాలపై గూగుల్‌లో త్రీవంగా వెతికేది. త్రీడీ ప్రింటింగ్ ద్వారా తక్కువ ఖర్చులో అందమైన జ్యూవెలరీ తయారు చేయవచ్చని తెలుసుకుని స్నేహితులతో కలిసి 2017లో డైమండ్స్‌కు బాగా పేరున్న న్యూయార్క్‌లో ‘శిఫాన్’ పేరిట జ్యూవెలరీ స్టార్టప్‌ను ప్రారంభించింది. శిఫాన్ ప్రారంభానికి ‘అన్‌కట్ జెమ్స్’ సినిమా కూడా శిల్పకు ప్రేరణ కలిగించింది. వజ్రాలతో తయారు చేసిన సింగిల్ పీస్ జ్యూవెలరీని విక్రయించడం ప్రారంభించింది. 2 018లో ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో స్టైలిస్ట్ నికోల్ కిడ్మ్యాన్స్ క్లైంట్ శిఫాన్ సంస్థ రూపొందించిన రింగ్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడవడంతో అప్పుడు శిఫాన్కు మంచి గుర్తింపు వచి్చంది. అప్పటి నుంచి శిఫాన్ డైమండ్ జ్యూవెలరీ విక్రయాలు పెరిగాయి. డ్యూయెట్ హూప్స్.. గతేడాది నవంబర్‌లో ‘డ్యూయెట్ హూప్స్’ పేరుమీద రెండో జ్యూవెలరీని ప్రారంభించింది శిల్పా యార్లగడ్డ. ఆదర్శవంతమైన దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పింక్ డైమండ్ రింగును అందుబాటులోకి తీసుకొచ్చారు. పింక్ డైమండ్ రింగు స్పైరల్ ఆకారంలో అడ్జెస్టబుల్‌గా ఉంటుంది. మొదట ఒక పెద్ద సైజులో డైమండ్, దాని తరువాత చిన్న డైమండ్ ఉండడం ఈ రింగు ప్రత్యేకత. ఈ మోడల్ రింగును ఆమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ఒబామా, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ధరించడంతో ఆ మోడల్ బాగా పాపులర్ అయింది. అయితే ఈ పింక్ రింగును అమ్మగా వచ్చే ఆదాయంలో యాభై శాతం డబ్బును ‘స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్’కు శిల్ప అందిస్తోంది. ఇప్పటికే పెప్పర్, ఇటెర్నెవా, కిన్షిప్, సీ స్టార్ వంటి కంపెనీలకు నిధులు సమకూర్చింది. కాగా పింక్ రింగ్ ధర 155 డాలర్ల నుంచి 780 డాలర్లు ఉండడం విశేషం. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ ఫైనలియర్ చదువుతోన్న శిల్ప తన చదువు పూర్తయ్యాక పూర్తి సమయాన్ని శిఫాన్ కోసం కేటాయించనుంది. కాలం తిరిగి రాదు జ్యూవెలరీ తయారీ పరిశ్రమ మహిళలకు సంబంధించినది. కానీ ఈ పరిశ్రమలన్నీ పురుషులే నిర్వహిస్తున్నారు. అందుకే ఈ రంగంలో ఎక్కువమంది మహిళలు రావాలనుకున్నాను. ఈ క్రమంలోనే స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్లకు నిధులు సమకూర్చి ప్రోత్సహిస్తున్నాను. ఒక పక్క చదువుకూంటూ మరోపక్క ఒక కంపెనీ స్థాపించి దాని ఎదుగుదలకు కృషిచేయడం సవాలుతో కూడుకున్నది. కానీ ‘జీవితంలో ఏదైనా తిరిగి తెచ్చుకోవచ్చు గానీ కరిగిపోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోలేం’ అని ఒకరిచి్చన సలహా నా మనస్సుకు హత్తుకోవడంతో ఈ రెండూ చేయగలుగుతున్నాను. చదవండి: Mystery: న్యోస్ సరస్సు.. రాత్రి రాత్రే ఆ ఊళ్లన్నీ శ్మశానాలైపోయాయి! -
ఐఏఎస్‌ల మధ్య రగడ: ఇద్దరిపై బదిలీ వేటు
మైసూరు(కర్ణాటక): మైసూరు జిల్లా నూతన కలెక్టర్‌గా డా.బగాది గౌతమ్, కార్పొరేషన్ కమిషనర్‌గా జి.లక్ష్మీకాంత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్ రోహిణి సింధూరి, కమిషనర్ శిల్పా నాగ్లు పరస్పర విమర్శల పర్వంతో ఇరుకునపడిన సర్కారు ఇద్దరినీ బదిలీ చేసింది. రోహిణి సింధూరి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. గ్రామీణాభివృద్ధి– పంచాయతీ రాజ్‌లో ఈ గవర్నెన్స్ డైరెక్టర్‌గా శిల్పానాగ్‌ను నియమించారు. గౌతమ్, లక్ష్మీకాంత్‌రెడ్డి ఆదివారమే బాధ్యతలను తీసుకున్నారు. కాగా, రోహిణి సింధూరి బెంగళూరులో సీఎం యడియూరప్పను కలిసి తన బదిలీని రద్దు చేయాలని కోరగా, ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శిల్పానాగ్, మనసు మార్చుకుని కొత్త పోస్టులో చేరుతున్నట్లు తెలిపారు. (చదవండి: ఐఏఎస్‌ల మధ్య రగడ: లెక్కలు ఇవిగో..!) (చదవండి: దేశంలో లక్షకు దిగొచ్చిన కరోనా కేసులు) -
ఐఏఎస్‌ల మధ్య రగడ: లెక్కలు ఇవిగో..!
మైసూరు(కర్ణాటక): సీఎస్ఆర్ ఫండ్స్ రూ. 12 కోట్ల నిధుల లెక్కలు అడగడం తప్పా? అని కలెక్టర్ రోహిణి సింధూరి చేసిన వ్యాఖ్యలపై మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ స్పందించారు. ఆ లెక్కలకు సంబంధించిన డాక్యుమెంట్లను విడుదల చేశారు. కరోనా కట్టడికి వార్డు స్థాయిలో చేపట్టిన చర్యలు,టాస్క్ ఫోర్స్, సహయవాణి ఏర్పాటు, వివిధ సంస్థల నుంచి కొనుగోలు చేసిన సామాగ్రికి చెల్లించిన బిల్లులు తదితరాలతో 127 పేజీల నివేదికను నగరాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. ఈత కొలను అవసరామా? ప్రపంచ ప్రఖ్యాత మైసూరు ప్యాలెస్‌లోనే స్విమ్మింగ్ పూల్ లేదని, అలాంటప్పుడు కలెక్టర్ రోహిణి సింధూరి బంగ్లాలో ఎందుకని మాజీమంత్రి ఎ.మంజు అన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడుతూ మొదట తాను ఒక ప్రజా సేవకులిననే విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలన్నారు. తానే కరెక్టు, తనకే అన్ని తెలుసు అనే భావన వీడాలన్నారు. చదవండి: ఐఏఎస్ భావోద్వేగం.. ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా కరోనా మరణాల లెక్కలు.. కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే -
ఐఏఎస్‌ల మధ్య రగడ: మంత్రి ‘రాజీ’ చర్చలు
మైసూరు: జిల్లాధికారి రోహిణి సింధూరిపై ఆరోపణలు చేసి తన ఉద్యోగానికి రాజీనామ చేసిన మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్‌ను జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్టీ సోమశేఖర్ శుక్రవారం సుత్తూరు మఠానికి పిలిపించారు. సుత్తూరు మఠం స్వామీజీ నేతృత్వంలో శిల్పానాగ్‌తో చర్చించారు. తొలుత రాజీనామా ఉపసంహరించుకుని, ఇకపై ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని శిల్పానాగ్‌కు మంత్రి సూచించారు. కమిషనర్ శిల్పానాగ్ రాజీనామాను అంగీకరించొద్దని సీఎం, సీఎస్‌కు మనవి చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్టీ సోమశేఖర్ తెలిపారు. నీతి, నిజాయతీ కలిగిన అధికారి రాజీనామాను అంగీకరిస్తే వారికి ద్రోహం చేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. పాలికె కమిషనర్ శిల్పానాగ్ రాజీనామాను ఆమోదించవద్దని కోరుతూ శుక్రవారం పాలికె కార్యాలయం వద్ద సిబ్బంది సంతకాల సేకరణ చేపట్టారు. కలెక్టర్ రోహిణి సింధూరి సర్వాధికారిలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోహిణి సింధూరిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. (చదవండి: ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా) ఆలోచించే రాజీనామా చేశా: శిల్పానాగ్ తాను బాగా ఆలోచించి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు మైసూరు మహానగర పాలికె కమిషనర్ శిల్పానాగ్ స్పష్టం చేశారు. తానేమీ ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకోలేదని, కోవిడ్ వంటి సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయాల్సి రావడం బాధిస్తోందని చెప్పారు. సీఎస్ఆర్ ఫండ్స్‌కు ఎవరూ బాధ్యత తీసుకోలేదని, తానే బాధ్యత తీసుకుని కరోనా రోగులకు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. నిధుల వివరాలు అడగడం తప్పా? : కలెక్టర్ సీఎస్ఆర్ ఫండ్ కింద ఖర్చు చేసిన రూ.12 కోట్ల గురించి వివరాలు అడగడం తప్పా అంటూ జిల్లాధికారిణి రోహిణి సింధూరి ప్రశ్నించారు. శుక్రవారం నగరంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ ఈ వారం గ్రామాలకు వైద్యులు అనే కార్యక్రమానికి సీఎస్ఆర్ ఫండ్స్ వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సీఎస్ఆర్ ఫండ్స్‌ను ఎలా వ్యయం చేశారనే విషయంపై వివరాలు ఇవ్వాలని కోరగా మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ ఇప్పటివరకు బదులు ఇవ్వలేదన్నారు. తనపై అసంతృప్తి ఉంటే ఫిర్యాదు చేసేందుకు ఒక పద్ధతి, వ్యవస్థ ఉంటుందని, దాన్ని అనుసరించి వ్యవహరించాలని సూచించారు. ఈ విషయాలన్నింటి గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరిస్తానని ఆమె తెలిపారు. మైసూర్లో శిల్పా నాగ్‌కు మద్దతుగా సంతకాలు చేస్తున్న ఉద్యోగులు -
ఐఏఎస్ భావోద్వేగం.. ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా
మైసూరు: ‘మైసూరులో పనిచేసే వాతావరణం ఏమాత్రం లేదు, అందుకే నేను సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను’అని మైసూరు కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి విధి నిర్వహణలో పదేపదే అడ్డొస్తున్నారని శిల్పానాగ్ ఆరోపించారు. గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా ప్రకటన చేశారు. ఆమె మాట్లాడుతూ రోహిణి సింధూరి తనను పని చేసుకోనివ్వడం లేదన్నారు. అడగడుగునా అడ్డు వస్తున్నారని, ఇలాంటి దురంహంకార కలెక్టర్ ఎవరికీ వద్దని, తాను విసిగిపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజీనామానే మంచిదనుకున్నా ఒక ఐఏఎస్ అధికారికి, మరో ఐఏఎస్‌కు మధ్య ఇటువంటి వివాదం సరికాదని, తనను టార్గెట్ చేయడంతో ఎంతో బాధపడ్డానని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశానని ఆమె తెలిపారు. చివరికి ఇక్కడ పనిచేయడం కంటే ఉద్యోగం నుంచి బయటకు రావడం మంచిదని భావించి రాజీనామా చేసినట్లు చెప్పా రు. తాను కలెక్టర్‌కు అన్నివిధాలా గౌరవం ఇ చ్చానని, కానీ తనపై ఆమెకు ఎందుకు పగ, కోపమో అర్థం కావడం లేదని అన్నారు. కాగా, శిల్పా నాగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మైసూరు కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆమె 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మరోవైపు ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. చదవండి: ఏడేళ్ల న్యాయ పోరాటానికి తెర -
DSP Shilpa Sahu; ‘అమ్మ’ఆన్ డ్యూటీ
అవసరం అయితే తప్ప ఇళ్లలోంచి కదలవద్దని జనానికి చెప్పడానికి.. ఇంట్లో ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ బయటికి వచ్చి ఎర్రటి ఎండలో డ్యూటీ చేస్తున్నారు ఐదు నెలల గర్భిణీ అయిన దంతెవాడ డీఎస్పీ శిల్పా సాహూ!! ‘సురక్షితంగా ఉండండి, మాస్కులు ధరించండి’ అని చెప్పడానికి, నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని హెచ్చరించడానికి లాఠీ చేతపట్టి.. తన కడుపులోని బిడ్డకు ప్రమాదమేమో అని కూడా తలవకుండా కరోనా సెకండ్ వేవ్ లో, సూర్యుడి భగభగల్లో, మావోయిస్టుల కదలికల నడుమ.. ఆమె తన విధులు నిర్వహిస్తున్నారు! ఎప్పుడూ గుడిలో దర్శనమిచ్చే దంతేశ్వరీ దేవి మంగళవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో దంతెవాడ పట్టణ ప్రధాన కూడళ్లలో కర్ర పట్టి తిరుగుతూ, ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు చెబుతూ ఉన్నట్లే అనిపించి ఉండవచ్చు అక్కడి వారికి కొందరికైనా! ఆ ‘దంతేశ్వరీ దేవి’ పేరు శిల్పా సాహూ (29). దంతెవాడ డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్. దంతెవాడ చత్తీస్‌గఢ్ జిల్లాలో ఉంది. సాధారణంగా మావోయిస్టులను గుర్తుకు తెచ్చే ఈ ప్రాంతం.. కరోనా లాక్డౌన్ విధుల నిర్వహణలో డీఎస్పీ శిల్పా సాహూ చూపిన అంకితభావం కారణంగా ఎవరికైనా శక్తిమాతను గుర్తు తెచ్చి ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. దేశంలోని మొత్తం యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటైన దంతేశ్వరీదేవి ఆలయం దంతెవాడలో ఉంది. ఆ తల్లి తన బిడ్డల్ని అదిలించి, కదిలించి, సంరక్షించిన విధంగానే ఇప్పుడు శిల్ప తన పౌరుల్ని కరోనా నిర్లక్ష్యం నుంచి అదిలిస్తూ, త్వరగా చేరమని ఇళ్లకు కదిలించే డ్యూటీలో ఉన్నారు. నిజానికైతే ఆమె కూడా ఇంట్లోనే ఉండిపోవలసిన పరిస్థితే. గాలి సోకితే చాలు కరోనా వచ్చేలా ఉంది. ఎండ ఆవిర్లు వదులుతోంది. మావోయిస్టులు ఎక్కడ మాటువేసి ఎటుగా వస్తోరో తెలియదు. అయినా పోలీస్ డ్యూటీ పోలీస్ డ్యూటీనే. అన్నిటినీ తట్టుకోవాలి. పౌరుల్ని కాపాడాలి. డిఎస్పీ శిల్ప కూడా అదే డ్యూటీ ఉన్నారు కానీ, ఆమె కాస్త ప్రత్యేకమైన పరిస్థితిలో డ్యూటీ చేస్తున్నారు. ఐదవ నెల గర్భిణి ఆమె. ఇక నుంచి ఆమె మరింతగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఆమెకు చెప్పే ఉంటారు. అయితే సెకండ్ వేవ్ కరోనాలో ప్రజలు మరింతగా భద్రంగా ఉండాలని చెప్పడం కోసం ఆమె బయటికి వచ్చారు. లాఠీ పట్టుకుని దంతెవాడ ప్రధాన రహదారులలో డ్యూటీ చేశారు. మాస్క్ వేసుకోని వాళ్లను, అనవసరంగా బయటికి వచ్చినవాళ్లను ఆపి, మందలించారు. కరోనా బారిన పడకుండా, ఇతరులను పడేయకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పి పంపారు. సాటి మానవులు చెబితే కోపం వస్తుందేమో కానీ, డీఎస్పీ చెబితే వినకుండా ఉంటారా? ఇప్పుడామె చేస్తున్నది బాధ్యతల్ని గుర్తు చేసే డ్యూటీ. ఒకరు గుర్తు చేయాల్సినంతగా నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ప్రదర్శిస్తున్న పౌరులు.. గర్భిణిగా ఉండి కూడా మిట్ట మధ్యాహ్నపు ఎండలో డ్యూటీ చేయడం చూసి సిగ్గుపడే ఉంటారు. తనకు, కడుపులో ఉన్న తన బిడ్డకు కరోనా సోకుతుందేమోనన్న భయం లేకుండా శిల్ప పౌరుల క్షేమం కోసం పాటు పడటం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్నే పెంచింది. గర్భంతో ఉండి కూడా ఆమె డ్యూటీ చేస్తున్నప్పటి ఫొటోను ఐపీఎస్ ఆఫీసర్, చత్తీస్‌గఢ్ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దీపాంశు కబ్రా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయగానే ‘డ్యూటీ మైండెడ్’ శిల్పపై గత 48 గంటలుగా ట్విట్టర్లో ధారాపాతంగా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ‘సెల్యూట్ టు డీఎస్పీ శిల్పా సాహూజీ! డీజీపీ శ్రీ అవస్థిగారూ.. ఆమెకు అవార్డు ప్రకటించంది. అలాగే ఆమె కోరుకుంటే కనుక ఆమెను రాయ్‌పుర్ బదలీ చేయండి’ అని ఒకరు, ‘గుడ్ జాబ్ మేమ్, ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ’ అని ఇంకొకరు.. పదులు, వందల్లో ఆమెను అభినందిస్తూ, జాగ్రత్తలు చెబుతున్నారు. రాయ్‌పుర్ చత్తీస్‌గఢ్ రాజధాని. అక్కడికి, దంతెవాడకు ఏడున్నర గంటల ప్రయాణం. రాయ్‌పుర్‌లో అయితే శిల్పకు ఈ సమయంలో సౌకర్యంగా ఉంటుందని కూడా ట్విటిజెన్‌లు ఆలోచిస్తున్నారు. సీఎం ఆమెను ఒక ఆదర్శ మహిళా అధికారిగా కీర్తించారు. ఇంతకంటే కఠిమైన డ్యూటీలనే చేశారు శిల్పి. ఎ.కె.47 ధరించి ‘ఆపరేషన్’లలో పాల్గొన్నారు. దంతేవాడలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటైన ‘దంతేశ్వరి ఫైటర్స్’ (మహిళా కమాండోలు) కు నాయకత్వం వహించారు. వాటికంటే కష్టమైన పని.. కరోనా లాక్డౌన్ నిబంధనల్ని జనం ఉల్లంఘించకుండా చూడటం అని ఇప్పుడామె గ్రహించే ఉంటారు. ‘‘నేను బయట ఉంటేనే.. వాళ్ల లోపల ఉంటారు’’ రోడ్డు మీద వెళుతూ అధాటున చూసిన వారికి మామూలు దుస్తుల్లో ఉన్న శిల్పా సాహు మొదట సాధారణ మహిళగా అనిపించవచ్చు. కానీ, గర్జించే ఆమె స్వరం.. ఆమె పోలీసు అన్న వాస్తవాన్ని ఆ వెంటనే తెలియజేస్తుంది. ‘వాపస్ జావో, ఘర్ జావో’ (వెనక్కు వెళ్లు.. ఇంటికి వెళ్లు) అని గట్టిగా అరచి చెప్పినా వినని వారికి ఆమె చేతిలోని లాఠీ చక్కగా అర్థమయ్యేలా చెప్పేందుకు సిద్ధమౌతుంది. ఏప్రిల్ 18 నుంచి దంతెవాడ జిల్లా (దక్షిణ బస్తర్) లాక్డౌన్లో ఉంది. ఆ రోజు నుంచీ శిల్ప లాక్డౌన్ డ్యూటీలో ఉన్నారు. ‘‘గర్భిణిగా ఉండి మీరు బయటికి రావడం ఎందుకు?’’ అనే ప్రశ్నకు.. ‘‘నేను బయట ఉంటేనే వాళ్లు లోపల ఉంటారు’’ అంటున్నారు శిల్ప. -
5 నెలల గర్భంతో డ్యూటీ చేస్తున్న డీఎస్పీ
-
డాక్టర్ అందమైన జ్ఞాపకం.. రాక్చమ్ కుగ్రామం
డాక్టర్ శిల్ప న్యూఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్ హాస్పిటల్లో డాక్టర్. అది గత ఏడాది అక్టోబర్ వరకు. ఇప్పుడామె హిమాచల్ ప్రదేశ్‌లోని సంగ్లా బ్లాక్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తోంది. ఈ రెండింటి మధ్య ఓ అందమైన జ్ఞాపకం కిన్నౌర్ జిల్లా, రాక్చమ్ అనే కుగ్రామం. ఆ అందమైన జ్ఞాపకం శిల్పకు మాత్రమే కాదు ఆ గ్రామస్థులకు కూడా. డాక్టర్ లేని హాస్పిటల్ డాక్టర్ శిల్ప పుట్టింది చత్తీస్‌గడ్‌లో. అప్పటికి ఆమె తండ్రి అక్కడ కేంద్ర పరిశ్రమల భద్రత విభాగం అధికారిగా ఉన్నారు. తండ్రి బదలీలతోపాటు ఆమె అనేక ప్రదేశాలను చూసింది. ముంబయి వంటి మహా నగరాల్లో అందుబాటులో ఉన్న వైద్యసేవలను గమనించింది. ఒక మోస్తరు పట్టణాల్లో ఉండే చిన్న హాస్పిటళ్లనూ చూసింది. ఇవేకాక... ఒకసారి స్నేహితులతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లో టూర్‌కెళ్లినప్పుడు మనదేశంలో డాక్టర్ ముఖం చూడని గ్రామాలు కూడా ఉన్నాయని తెలుసుకుంది. ప్రభుత్వ వైద్యకేంద్రాలలో పోస్టింగ్ అందుకున్న డాక్టర్లు ఆ మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేయడానికి వెళ్లకపోవడమనే వాస్తవం ఆమెను కలచివేసింది. ఇదంతా ముప్పై ఏళ్ల లోపే. అందుకే న్యూఢిల్లీ నుంచి నేరుగా హిమాలయాల బాట పట్టింది. ఆ వెళ్లడం బదలీ మీద కాదు, స్వచ్ఛందంగా. న్యూఢిల్లీ ఉద్యోగాన్ని వదిలేసి సిమ్లా పరిపాలన విభాగం నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పేరు నమోదు చేసుకుంది శిల్ప. ఆమెను ఇంటర్వ్యూ చేసిన వైద్య అధికారులు హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా, రాక్చమ్ పబ్లిక్ హెల్త్ సెంటర్ పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వం అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయగలిగింది, కానీ డాక్టర్లను పంపించలేకపోతోంది. ఎవర్ని నియమించినా సెలవు మీద వెళ్లే వాళ్లే కానీ వైద్యం చేయడానికి ఆ గ్రామానికి వెళ్లేవారు కాదు. శిల్ప ఆ ఇంటర్వ్యూ వెళ్లడంలో ఉద్దేశమే వైద్యం అందని గ్రామాలకు వైద్య సేవలనందించడం. దాంతో ఆమె సంతోషంగా వెళ్లింది. రాక్చమ్లోని పీహెచ్సీ తాళాలు తీసి గ్రామస్థుల సహాయంతో శుభ్రం చేయించింది. నర్సు కానీ, ఇతర వైద్య సిబ్బంది కానీ ఎవరూ లేరు. డాక్టర్ శిల్ప అన్నీ తానే అయి వైద్య సేవలు మొదలు పెట్టింది. డాక్టర్ డ్యూటీ మానరాదు రాక్చమ్లో ఎనిమిది వందల మంది నివసిస్తున్నారు. నడి వయసు దాటిన వారిలో దాదాపుగా ఓ యాభై మందికి పైగా బీపీ, డయాబెటిస్తో బాధపడుతున్నారు. కానీ తమకు అనారోగ్యం ఉందన్న సంగతి వాళ్లకు తెలియదు. వాళ్లకు క్రమం తప్పకుండా మందులు వాడడం, హాస్పిటల్‌కు వచ్చి పరీక్షలు చేయించుకోవడం అలవాటు చేసింది డాక్టర్ శిల్ప. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు... అందరికీ వైద్య ప్రదాత ఆమె. కరోనా సమయంలో ఇంటికి రమ్మని బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులు పిలిచినప్పుడు ‘డాక్టర్ రోగానికి భయపడకూడదు. అలా భయపడి పారిపోవడం వైద్యవృత్తికే అవమానం’ అని చెప్పింది శిల్ప. ఆమె అన్నట్లుగానే... కరోనాకు వెరవకుండా రాక్చమ్ గ్రామంలో ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి ఎవరిలోనైనా వ్యాధి లక్షణాలున్నాయేమోనని పరీక్ష చేసింది. అనుమానం వచ్చిన వారికి జాగ్రత్తలు సూచిస్తూ అవసరమైన వారిని సంగ్లా గవర్నమెంట్ హాస్పిటల్‌కు పంపించేది. అలా నోటి మాట ద్వారా ఆమె సేవలు తెలుసుకున్న సంగ్లా వైద్య అధికారులు కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాల్సిన సమయంలో ప్రత్యేకమైన వైద్య సేవల కోసం శిల్పను సంగ్లాకు బదలీ చేశారు. ఇప్పుడామె సంగ్లాలో విధులు నిర్వర్తిస్తోంది. కానీ రాక్చమ్ గ్రామస్థులు అప్పుడప్పుడూ ఆమెను చూడడానికి వస్తుంటారు. అనారోగ్యంతో వచ్చిన వాళ్లు డాక్టర్ శిల్ప దగ్గరే చూపించుకుంటామని పట్టుపడుతున్నారు. వైద్యరంగం, డాక్టర్లు డబ్బు కోసం రోగి ప్రాణాలతో ఆడుకుంటున్న రోజుల్లో ఇలాంటి డాక్టర్ గురించి తెలిస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. పుట్టింటి ఆత్మీయత రాక్చమ్ నాకు డ్యూటీ స్టేషన్ మాత్రమే కాదు, పుట్టింటితో సమానం. గ్రామస్థులు నన్ను ఎంతగానో ప్రేమించేవారు. మహిళలు రోజూ ఎవరో ఒకరు హాస్పిటల్‌కు వచ్చి నేను పేషెంట్లను చూడడం పూర్తయ్యే వరకు నాకు తోడుగా ఉండేవారు. వాళ్లింటికి భోజనానికి, టీకి తీసుకెళ్లేవారు. భోజనం అయిన తర్వాత నన్ను ఇంటి దగ్గర దించి వెళ్లేవాళ్లు. నేను వాళ్లకు వైద్యం మాత్రమే చేశాను. వాళ్లు నాకు ఎప్పటికీ మర్చిపోలేని ప్రేమను పంచారు. – డాక్టర్ శిల్ప -
ఒమాక్సే పతనం- శిల్పా మెడి జూమ్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాల విడుదలకు సోమవారం(29న) నిర్వహించవలసిన బోర్డు సమావేశాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించడంతో రియల్టీ కంపెనీ ఒమాక్సే లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క కిడ్నీ క్యాన్సర్ చికిత్సకు జనరిక్ ఔషధాన్ని విడుదల చేసినట్లు వెల్లడించడంతో హెల్త్‌కేర్ కంపెనీ శిల్పా మెడికేర్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి ఒమాక్సే లిమిటెడ్ వరుసగా రెండో రోజు లోయర్ సర్క్యూట్‌ను తాకగా.. శిల్పా మెడికేర్ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. ఒమాక్సే లిమిటెడ్ ఈ నెల 29న నిర్వహించవలసిన బోర్డు సమావేశాన్ని నెల రోజులపాటు వాయిదా వేసినట్లు రియల్టీ కంపెనీ ఒమాక్సే లిమిటెడ్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. బోర్డు సమావేశంలో భాగంగా కంపెనీ గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించవలసి ఉంది. జులై 29న బోర్డును తిరిగి సమావేశపరచనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనేవాళ్లు కరువుకావడంతో రూ. 35 పతనమై రూ. 141 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. సోమవారం సైతం ఈ కౌంటర్ 20 శాతం కుప్పకూలడం గమనార్హం. కాగా.. గత రెండు నెలల్లో ఈ షేరు 44 శాతం ర్యాలీ చేసింది. ఏప్రిల్ 27న నమోదైన రూ. 153 నుంచి పెరుగుతూ వచ్చి రెండు రోజులుగా పతన బాట పట్టింది. శిల్పా మెడికేర్ కిడ్నీ క్యాన్సర్ చికిత్సకు వినియోగించగల జనరిక్ ఔషధం యాక్సిటినిబ్ను విడుదల చేసినట్లు ఫార్మా రంగ కంపెనీ శిల్పా మెడికేర్ తాజాగా పేర్కొంది. యాక్సిషిల్ బ్రాండుతో 1 ఎంజీ, 5 ఎంజీ డోసేజీలలో ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఒక బాటిల్లో 14 ట్యాబ్లెట్లను అందించనున్నట్లు వివరించింది. అడ్వాన్స్డ్ రేనల్ సెల్ కార్సినోమా(ఆర్సీసీ)తో బాధపడే రోగుల చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శిల్పా మెడి షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 496 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 498 వరకూ ఎగసింది. -
అమ్మ గెలుపు
బిడ్డ తాగే పాలలో నీళ్లు కలిపేటప్పుడు ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. తాను భవిష్యత్తులో విజేతగా నిలుస్తానని అప్పుడామె ఏ మాత్రం ఊహించలేదు. తాను చదివిన పదో తరగతి చదువుకి చిన్న ఉద్యోగం కూడా ఇవ్వలేదెవ్వరూ. అలాంటి తనను పెద్ద విద్యాసంస్థలు సగౌరవంగా ఆహ్వానించి మరీ బిజినెస్ మేనేజ్మెంట్లో లెక్చర్ ఇప్పించుకుంటాయని ఆనాడు ఆమె ఊహకు కూడా అందలేదు. ‘తన జీవితమే తానిచ్చే సందేశం’ అనే పెద్ద మాటలు చెప్పడం లేదు, కానీ తన జీవితాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తోంది శిల్ప. ‘‘శిల్ప 2009 వరకు భర్త సంరక్షణలో జీవించిన గృహిణి. ఒక బిడ్డకు తల్లి. భర్త రాజశేఖర్ వ్యాపారి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. కర్నాటక రాష్ట్రం, హసన్‌లో ఉన్న తల్లిదండ్రులు, తమ్ముడిని కూడా తన దగ్గరకు వచ్చేయమని చెప్పింది. అలా అందరూ బళ్లారిలో ఉంటున్నారు. ఓ రోజు ఉదయం ఇంటి నుంచి బెంగళూరుకు వెళ్లిన రాజశేఖర్ తిరిగి ఇంటికి రాలేదు. అతడికి ఏమైందో తెలియదు. మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది తప్ప అతడి ఆచూకీ తేలలేదు. శిల్ప మానసికంగా కుంగిపోయింది. భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియదు. ఏమయ్యాడో తెలియదు. ఆమెకి తెలిసిందల్లా తాను, తన బిడ్డ దిక్కులేని వాళ్లమయ్యామనే చేదు నిజం మాత్రమే. తనను నమ్ముకుని తనతోనే ఉంటున్న తల్లిదండ్రులు, తమ్ముడి బాధ్యత కూడా తన మీదనే ఉంది. భవిష్యత్తు అగమ్యగోచరం. పాలలో నీళ్లు రోజురోజుకీ బతుకు కష్టమవుతోంది. పిల్లవాడికి పాలు కలుపుదామని గ్లాసు తీసుకుంది. పాల గిన్నెలో అడుగున ఉన్నాయి పాలు. ఆ పాలలో అరగ్లాసు నీళ్లు పోసింది శిల్ప. ఆమె పోసిన నీళ్లతోపాటు ఆమె చెంపల మీదుగా కారిన కన్నీళ్లు కూడా ఆ పాలలో కలిసిపోయాయి. ఆ క్షణమే ఒక నిర్ణయానికి వచ్చిందామె. తన బిడ్డను పోషించుకోవడానికి తాను పని చేయాలి. రిసెప్షనిస్ట్ ఉద్యోగం కోసం ఇంటర్వూ్యకెళ్లింది. సేల్స్ ఉమన్‌గా ప్రయత్నించింది. వంట మనిషి కావాలనే ప్రకటన చూసి ఆ ఉద్యోగం కోసమూ వెళ్లింది. హౌస్ కీపింగ్ ఉద్యోగమూ రాలేదు. ఏ ఉద్యోగానికి వెళ్లినా సరే అందరూ అడిగే కామన్ ప్రశ్న ‘నీ భర్త గురించిన వివరాలేంటి’ అని. తన దగ్గర జవాబు లేని ఆ ప్రశ్నను ఎదుర్కోవడం కంటే తనకు చేతనైన మరేదో పని చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చేసిందామె. శిల్ప తమ్ముడు చిరంజీవి మంగుళూరులో సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలో చేరాడు. అందరూ మంగుళూరుకు వచ్చారు. తన తల్లి ఎప్పుడూ తాను వండినవి తింటూ ‘నువ్వు కానీ హోటల్ పెడితే వండినవి వండినట్లే ఖర్చయిపోతాయి. ఇంత రుచిగా వండడం ఎలా నేర్చుకున్నావ్’ అని మెచ్చుకుంటుండేది. అమ్మ మాటలను గుర్తు చేసుకుంది శిల్ప. పిల్లవాడి చదువు కోసమని భర్త ఉన్నప్పుడు బ్యాంకులో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ తీసింది. ఆ పెట్టుబడితో సెకండ్ హ్యాండ్ ట్రక్కు కొని మొబైల్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టింది. జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగిముద్ద, అన్నం, సంప్రదాయ కన్నడ రుచులతో మొదలైన ‘హల్లే మనే రొట్టి’కి ఉద్యోగులే ప్రధానమైన కస్టమర్లు. తమ్ముడితోపాటు రొట్టెలు చేస్తున్న శిల్ప శ్రమ ఫలించింది శిల్పకు సహాయంగా ఆమె అమ్మానాన్న కూడా పని చేసేవాళ్లు. తర్వాత తమ్ముడు కూడా సెక్యూరిటీ గార్డు ఉద్యోగం మానేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే పని చేస్తున్నారు. మంగుళూరులో సక్సెస్ఫుల్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ల ప్రస్తావన వస్తే మొదటగా శిల్ప పేరునే చెప్పుకుంటారు. మేనేజ్మెంట్ కాలేజ్‌లు ఆమె అనుభవాలనే విద్యార్థులకు పాఠాలుగా చెప్తున్నాయి. ఆహారప్రియుల మౌత్ పబ్లిసిటీతో ‘హల్లే మనే రొట్టి’ గురించి స్థానిక మీడియాలో పడింది. వార్తా పత్రికల్లో శిల్ప జీవనపోరాటాన్ని చదివిన మహీంద్ర గ్రూప్ నిర్వహకులు ఆనంద్ మహీంద్ర ఆమెను అభినందించి బొలేరో మ్యాక్సీ ట్రక్ ప్లస్‌ను బహూకరించారు. ‘తల్లి ఏదైనా సాధించ గలదు’ అంటోంది శిల్ప సంతోషంగా. -
మెంచు రమేష్, శిల్ప అరెస్టు
మల్లాపూర్: మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపిస్తూ నాచారం దుర్గానగర్‌లో ఉండే తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్‌ను గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. సోదాలు నిర్వహించి కొన్ని విప్లవ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకొని రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా రేపోని గ్రామానికి చెందిన మెంచు ఎల్లయ్య, భారతమ్మల చిన్న కుమారుడు రమేష్(36) ఉస్మానియాలో పీహెచ్డీ చేస్తున్నాడు. 8 ఏళ్ల క్రితం రాణితో వివాహం అయింది. వీరికి పాప ఉంది. మంగళవారం నాచారం దుర్గానగర్‌లోని రమేష్ ఇంట్లో గద్వాల పోలీసులు 6 గంటలపాటు సోదాలు నిర్వహించారు. అనంతరం రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 9 గంటలకు 15 మంది వచ్చి ఇంట్లో తనిఖీలు, సోదాలు చేశారని రాణి తెలిపారు. పోలీసులే విప్లవ సాహిత్య పుస్తకాలను తీసుకొచ్చి కిచెన్ రూమ్‌లో పెట్టి ఇంట్లో దొరికినట్లు ఆరోపిస్తూ తన భర్తను అరెస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు. 2 నెలల నుంచి రమేష్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. శిల్ప ఇంట్లో సోదాలు... కీసర: మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ ఎస్వీ నగర్లో ఉంటున్న చైతన్య మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిల్పను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నాగారానికి చేరుకున్న గద్వాల పోలీసులు కీసర పోలీసుల సహకారంతో శిల్ప ఇంట్లో సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించిన పోలీసులు శిల్ప ఇంట్లో నిషేధిత సాహిత్య పుస్తకాలు, లెటర్ ప్యాడ్స్, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. శిల్పను కూడా అదుపులోకి తీసుకొని గద్వాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా అరెస్టులపై పౌర హక్కుల సంఘం, ఇతర సంఘాలు నిరసన తెలిపాయి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తోందన్నారు. -
శిల్ప ఆత్మకు శాంతి కలిగేనా..?
తిరుపతి (అలిపిరి) : ఎస్వీ వైద్య కళాశాల పిడియాట్రిక్ పీజీ ఫైనలియర్ వైద్య విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకుని నేటికి తొమ్మిది నెలలు గడుస్తోంది. డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతంపై సిట్ విచారణ చేసి, ముగ్గురు వైద్యుల వేధింపులే దీనికి కారణమని నిర్ధారించింది. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. విచారణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం íపిడియాట్రిక్ విభాగాధిపతితో పాటు మరో ఇద్దరు వైద్యులపై చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. నెలలు గడుస్తున్నా ఇంతవరకు నేరస్తులకు శిక్ష పడలేదు. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో ముగ్గురు వైద్యుల్లో ఇద్దరు నిజాయితీపరులంటూ పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఇవి కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతాయేమోననే వైద్యులు చర్చించుకుంటున్నారు. డాక్టర్ శిల్ప(31) ఆత్మహత్యకు పిడియాట్రిక్ వైద్యులు డాక్టర్ రవికుమార్, డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్ లైంగిక వేధింపులే కారణమని 2018 నవంబర్ 9న సిట్ నివేదిక వెల్లడించింది. డాక్టర్ రవికుమార్‌ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. అలాగే మిగతా వైద్యులు డాక్టర్ కిరిటి, డాక్టర్ శశికుమార్‌ను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ చేసింది. అలాగే, కళాశాలలో ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై ఎస్వీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ రమణయ్య పదవి నుంచి తొలగించారు. ముగ్గురిలో ఇద్దరు వైద్యులునిజాయితీపరులా..? సిట్ దర్యాప్తులో శిల్ప ఆత్మహత్యకు ఆ ముగ్గురు వైద్యులు కారణమని తేల్చింది. అయితే కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఓ వైద్యుడు వాస్తవాలను మీడియా తెలుసుకోవాలని కోరారు. ‘‘డాక్టర్ శిల్ప పిడియాట్రిక్ పీజీ ఫైనలియర్లో ప్రాక్టికల్స్‌లో పాస్ అయ్యింది. థియరీలో మాత్రం ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యింది. థియరీ అనేది సెంట్రల్ కరెక్షన్.. ఏ పేపర్ ఎక్కడ ఉందో తెలియదు.. అలాంటప్పుడు ఆమె ఫెయిల్ కావడానికి మేం కారణం కాదు.. కలెక్టర్ కమిటీ విచారణలో డాక్టర్ కిరీటి, డాక్టర్ శశిలకు సంబంధం లేదని డాక్టర్ శిల్ప రాతపూర్వకంగా రాసిచ్చింది. మా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలో అర్థం కావడం లేదు. కోర్టులో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. త్వరలో నిజాలు వెలుగు చూస్తాయి.’’ అంటూ కేసు విచారణ ఎదుర్కొంటున్న ఓ వైద్యుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చర్చకు దారితీసింది. టీడీపీ పాలనలో దారుణమైన ఘటన టీడీపీ పాలనలో వైద్య రంగంలో శిల్ప ఆత్మహత్య అత్యంత దారుణమైన ఘటన. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని 2018 ఏప్రిల్ 3న గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తరువాత హెల్త్ వర్సిటీ వీసీ ఆధ్వర్యంలో ఏర్పాటైన వైద్యుల బృందం విచారణ నివేదిక సమర్పించక మునుపే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అనుకూలంగా ఎస్వీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ రమణయ్య(ప్రస్తుతం మాజీ) అప్పట్లో ప్రకటన చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి కలెక్టర్‌తో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. నివేదిక సమర్పిం చక మునుపే శిల్ప ఆత్మహత్య చేసుకుంది. ఇది సంచలనం çసృష్టించింది. డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు కారకులైన వారికి కోర్టులో శిక్ష పడితేనే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందని సహచర వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు. బాధ్యులకు శిక్ష పడాలి నా కుమార్తె ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదు. జరగకూడనిది జరిగింది. నా కూతురే భౌతికంగా దూరమైనప్పుడు ఏమని స్పందించాలి? అది మరచిపోలేని సంఘటన. వెంటాడుతూనే ఉంది. బాధ్యులకు శిక్ష పడాలి. ప్రస్తుతం నేను ఉద్యోగం చేసుకుంటున్నా.– రాజగోపాల్, మృతురాలి తండ్రి, పీలేరు -
మరో శిల్పం కూలకూడదు..
డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో.. సిట్ ముగ్గురు వైద్యులను దోషులుగా తేల్చడం రాష్ట్రంలోని కీచక వైద్యులకు గుణపాఠమని విశ్లేషకులు వ్యాఖ>్యనిస్తున్నారు. వైద్య విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తే శిక్ష తప్పదన్న విషయాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం తన నివేదక ద్వారా తెలియజేసిందన్నారు. ముగ్గురు వైద్యులు రాజకీయ పైరవీలు చేసినా సిట్ అధికారి ధైర్యంగా నివేదిక వెల్లడించి దోషులకు శిక్ష తప్పదని నిరూపించారు. చిత్తూరు, తిరుపతి (అలిపిరి): వైద్యరంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థిని.. కీచక పర్వానికి తనువు చాలించింది. చదువు చెప్పే ఆచార్యులే లైంగికంగా వేధించడంతో వారిని ఎదరించలేక మౌనంగా అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఆ చదువుల తల్లి ప్రాణాలైతే∙కోల్పోపోయింది గానీ.. ఆ కీచక వైద్యులకు సిట్ నివేదిక సరైన గుణపాఠమే నేర్పింది. వైద్య విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసే వారికి డాక్టర్ శిల్ప ఉదంతం భయాన్ని నింపింది. శిల్ప మృతిపై విచారణ చేపట్టిన సిట్ దర్యాప్తు సంస్థ రాజకీయ ఒత్తిడికి తలొగ్గకుండా ముగ్గురు వైద్యులను దోషులుగా పేర్కొంటూ నివేదికను వెల్లడించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దో షుల పేర్లు ప్రకటించి నెలరోజుల్లో చార్జ్‌షీట్ దాఖ లు చేస్తామని దర్యాప్తు అధికారులు తేల్చారు. నేపథ్యం ఇదీ.. శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో పిడియాట్రిక్ పీజీ ఫైనలియర్ విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పిడియాట్రిక్ విభాగానికి చెందిన వైద్యులు డాక్టర్ రవికుమార్, డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్ లైంగిక వేధింపుల కారణంగా వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యపై మూడు నెలల పాటు సాగిన దర్యాప్తులో వైద్యులే దోషులని సిట్ తేలింది. అధ్యాపకుల తీరుతో తీవ్ర మానసిక క్షోభను అనుభవించిన డాక్టర్ శిల్ప పీలేరులోని తన నివాసంలో ఆగస్టు 7న ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ శిల్ప ఆత్మహత్య తరువాత అందుకు కారకులైన డాక్టర్ రవికుమార్‌ను పిడియాట్రిక్ హెచ్ఓడీ పదవి నుంచి తొలగించారు. మరో ఇద్దరు వైద్యులు డాక్టర్ కిరీటీ, డాక్టర్ శశికుమార్‌ను నెల్లూరుకు బదిలీ చేశారు. ఎట్టకేలకు సిట్ నివేదిక వైద్యులే దోషులని తేల్చడంతో వైద్య విద్యార్థినుల పోరాటానికి భరోసా లభించింది. ఆ తరువాత నిందితులైన ముగ్గురు వైద్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా ఆ దుర్మార్గులకు తగిన శిక్ష విధించాలని విద్యార్థినులు, ప్రజలు కోరుతున్నారు.“ మానసిక క్షోభ.. ముగ్గురు వైద్యులు తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని బాధితురాలి శిల్ప అప్పట్లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణయ్య దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. పైగా ప్రిన్సిపాల్ దోషులకు అనుకూలంగా వ్యవహరిం చడంతో డాక్టర్ శిల్ప మానసిక క్షోభకు గురైంది. వైద్యులను ఎదిరించడంతో వారు ఏం చేస్తారో అన్న భయంతో ముగ్గరు వైద్యులపై డాక్టర్ శిల్ప ఏప్రిల్ 3న గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్ రుయా సీనియర్ వైద్య బృందంతో కమిటీ వేసి విచారణ జరిపించాలని హెల్త్ వర్సిటీ వీసీని ఆదేశించారు. సీనియర్ వైద్య బృందం విచారణ తరువాత తన నివేదికలో ముగ్గురు వైద్యులను ఉత్తములుగా చూపించింది. నివేదిక ప్రభుత్వానికి పంపకముందే అప్పటి ప్రిన్సిపాల్ డాక్టర్ రమణయ్య దోషులకు అనుకూలంగా ప్రకటన చేశారు. దీంతో శిల్పకు చేదు అనుభవం ఎదురుకాక తప్పలేదు. తర్వాత లైంగిక వేధింపులపై జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను.. కలెక్టర్‌కే అందజేయకుండా నాన్చారు. ఇదే సమయంలో ఫైనలియర్ ఫలితాల్లో డాక్టర్ శిల్ప ఓ సబ్జెట్లో ఫెయిల్ కావడం తదితర పరిణామాల నేపథ్యంలో ఇక ఆ ముగ్గురు వైద్యుల నుంచి తప్పించుకునే వీలులేక డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకుంది. నివేదిక లీక్ చేసిన మాజీ ప్రిన్సిపాల్ విధుల్లోకి.. డాక్టర్ శిల్పపై లైంగిక వేదింపులపై సీనియర్ వైద్య బృందం విచారించి నివేదికను అప్పటి ప్రిన్సిపాల్ డాక్టర్ రమణయ్యకు అందజేసింది. అయితే ఆ నివేదిక ప్రభుత్వానికి అందించకముందే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గు రు వైద్యులకు అనుకూలంగా ప్రిన్సిపల్ ప్రకటన చేశారు. అప్పట్లో ప్రిన్సిపాల్ వ్యవహారంపై జూడాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ శిల్ప ఆత్మహత్య తరువాత సదరు ప్రిన్సిపాల్ డాక్టర్ రమణయ్యను బాధ్యతల నుంచి తప్పిం చారు. అయితే ఆయనకున్న రాజకీయ పలుకుబడితో ఇన్చార్జ్ బాధ్యతల నుంచి మాత్రమే తప్పించేలా మేనేజ్ చేసుకున్నారు. కాగా అత్యంత గోప్యంగా నివేదికను ప్రభత్వానికి అందించాల్సిన డాక్టర్ రమణయ్య లీకులిచ్చినా ఆయనపై శాఖా పరమైన చర్యలు తీసుకోకపోడం ఆశ్చర్యం కలిగించే విషయం. కొండంత భరోసా.. కీచక వైద్యుల బారిన పడే విద్యార్థినులు ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా ధైర్యంగా పోరాడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అన్న ధైర్యాన్ని సిట్ నివేదిక వెల్లడించింది. కాగా వైద్య కళాశాల్లో డాక్టర్ శిల్పలా మరో ఘటన జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం దోషులను వెంటనే శిక్షించి విద్యార్థినులకు భరోసా ఇవ్వాల్సి ఉంది. -
ఔను.. లైంగిక వేధింపులే
చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : వైద్య రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యా శిల్పం లైంగిక వేధిపులకే బలైపోయిందని స్పష్టమైంది. పాఠాలు బోధించేవారే వేధించడంతో ఆత్మహత్య చేసుకుందని తేలింది. ఎస్వీ మెడికల్ కళాశాల (ఎస్వీఎంసీ) పీడియాట్రిక్ పీజీ విద్యార్ధిని డాక్టర్ శిల్ప మూడు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తు చేసి మిస్టరీని ఛేదించింది. పీడియాట్రిక్ విభాగానికి చెందిన ముగ్గురు వైద్యుల లైంగిక వేధింపులే కారణమని సిట్ కుండ బద్ధలు కొట్టింది. నెల రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించింది. ఆరోపణలు ఎదుర్కొంటు న్న ముగ్గురు వైద్యులు ముందస్తు బెయిలు పొం దినట్లు తెలిసింది. డాక్టర్ శిల్పపై లైంగిక వేధింపులు జరిగాయని ‘సాక్షి’ దినపత్రిక వరుస కథనాలను ప్రచురించింది. ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలని తేలింది. ఎస్వీఎంసీ పీడియాట్రిక్ పీజీ ఫైనలియర్ విద్యార్థిని డాక్టర్ శిల్ప తనపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఏప్రిల్‌లో గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణలపై ఏర్పాటైన రెండు కమిటీలు స్పష్టతనివ్వలేకపోయాయి. ఈ నేపథ్యం లో శిల్ప ఓ సబ్జెక్టులో ఉత్తీర్ణురాలు కాలేకపోయిం ది. దీంతో ముగ్గురు వైద్యులు ఏం చేస్తారన్న భయంతో ఆగస్టు 7న పీలేరులోని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై విద్యార్థిలోకం నిరసించడంతో సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 47 మంది సాక్షులను విచారించిన సిట్ ముగ్గురు వైద్యులే దోషులుగా తేల్చింది. సిట్ నివేదిక వెల్లడి కావడంతో వైద్యులపై ఎస్వీఎంసీ జూడాలు మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని జూడాల సంఘం అధ్యక్షుడు వెంకటరరమణ డిమాండ్ చేశారు. తక్షణం అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
శిల్ప అత్మహత్యకు లైంగిక వేధింపులే కారణం
-
‘శిల్ప మృతికి లైంగిక వేధింపులే కారణం’
తిరుపతి: ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల వల్లే డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందని సీఐడీ తేల్చింది. ఈ మేరకు సీఐడీ డీఎస్పీ అమ్మిరెడ్డి నివేదిక వివరాలను మీడియాకు వివరించారు. ఈ ఏడాది ఆగష్టు 7వ తేదీన తన ఇంట్లో శిల్ప ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.ఈ ఆత్మహత్య ఘటనపై డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీనిలో భాగంగా సీఐడి విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. డాక్టర్ శిల్పను ముగ్గురు ప్రొఫెసర్లు రవికుమార్, శశికుమార్, కిరీటీ లైంగికంగా వేధింపులకు గురిచేశారని సీఐడీ నివేదిక తేల్చింది. ఈ ఘటనకు సంబంధించి 47 మందిని విచారించినట్లు అమ్మిరెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో డిజిటల్ ఆధారాలు , సిట్ దర్యాప్తు బృందం, వివిధ కమిటీల రిపోర్టులను సేకరించినట్లు అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. శిల్ప మైగ్రేన్‌తో తీవ్రంగా బాధపడుతూ ఉండేదని, ఈ క్రమంలోనే వైద్యుల లైంగిక వేధింపులు తోడవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. శిల్ప మరణానికి భర్త, బంధువులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే బెయిల్ కోసం నిందితులు హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారని, ఆత్మహత్యపై త్వరలోనే ఛార్జిషీటును దాఖలు చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఇక్కడ చదవండి: ‘అలా చేసుంటే శిల్ప బతికేది’ నిర్లక్ష్యమే ఉసురు తీసిందా!? -
శిల్ప ఆత్మహత్య కేసు : సిట్ విచారణలో జాప్యం
-
ఒక్క క్షణం ఆలోచించండి
చిత్తూరు అర్బన్: ‘శిల్ప పిడియాట్రీషియన్ చదువుతున్న వైద్యురా లు. కళాశాలలో అధ్యాపకుల వేధింపులు తాళలేక వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. మానసికంగా కుంగిపోయి తన వద్దకు వచ్చేవారికి ధైర్యం చెప్పి బతుకుపై ఆశ కల్పించాల్సిన వైద్యురాలి బలవన్మరణంతో సమస్యలు తీరిపోయాయా..? తీరినా పోయిన ప్రాణం తిరిగొచ్చిందా..?’ ‘నిన్నటికి నిన్న తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీతిక ఇంట్లో ఉరేసుకుని మృతి చెందారు. పరీక్షలకు భయపడో, వ్యక్తిగత సమస్య ఏదైనా ఆమెను ఆత్మహత్మకు పురుగొలిపి ఉండవచ్చని స్నేహితులు భావిస్తున్నారు. భర్త మృతితో కుంగిపోయిన గీతిక తల్లి బిడ్డ చదువు కోసం చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదులుకుని తిరుపతి వచ్చేశారు. ప్రాణం తీసుకోవాలనుకున్న మానసిక సంఘర్షణలో తల్లి పడ్డ కష్టాన్ని గీతిక గుర్తుకు తెచ్చుకోలేకపోయారు.’ వీరిద్దరే కాదు.. చిన్నపాటి సమస్యకే కుంగిపోయి ఆత్మహత్యలవైపు అడుగులు వేస్తున్నవారి సంఖ్య జిల్లాలో ఇటీవల ఎక్కువైంది. అది కూడా విద్యావంతులు, వృత్తిపరంగా రాణిస్తున్నవారు, నలుగురికీ ధైర్యం చెప్పి సమాజాన్ని నడిపించాల్సిన వారే ఇలా ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. చదవులు, వేధింపులు, ఒత్తిడి, ప్రేమ.. కారణం ఏదైనా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతోంది. చమటోడ్చి, కష్టపడి పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే జీవితం పూలబాటగా మారుతుంది. లక్ష్యం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని విద్యతో వికసింప చేసుకోవాలని ఆశిస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చదువుల్లో ఎదుగుతూ గమ్యం వైపు నడవాలని ప్రయత్నిస్తారు. ఈ సమయంలో అడుగులు తడబడడం, ఒత్తిళ్లు, ఆకర్షణ, వేధింపులు ఇలా అనేకం ఎదురవుతాయి. జీవితమంటేనే పోరాటం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పోరాటం చేసి విజయం సాధించినప్పుడు కలిగే ఆనందం అంతాఇంతాకాదు. అంతేగాని సమస్య వచ్చిందని మానసికంగా కుంగిపోయి జీవితాన్ని అర్ధంతరంగా ముగించడం మంచిదికాదు. చనిపోవడం ఒక్కటే పరిష్కారమని భావించేవాళ్లు ఒక్క క్షణం ఆలోచిస్తే గమ్యం.. గమనం తప్పకుండా మారతాయి. జీవిత లక్ష్యాలు, తల్లిదండ్రులు, వారు పడుతున్న కష్టాన్ని తరచూ మననం చేసుకోవడం వల్ల ఆత్మహత్య ఆలోచనల నుంచి బటయపడొచ్చు. జీవితం ఆనందంగా సాగుతుంది. ఒత్తిళ్లు ఇలా దూరం.. ♦ ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉటుంది. విద్యార్థులయితే నిరంతరం ప్రణాళికతో అభ్యసనం చేయాలి. దైన్నైనా ఆశావహ దృక్పథంతో తీసుకుని ముందుకు సాగాలి. ఏదైనా ఒక అంశం సరిగ్గా రాకపోతే రెండు మూడు సార్లు ప్రయత్నించడం వల్ల ఫలితం సాధించవచ్చు. ♦ ప్రతి విషయాన్ని ఒత్తిడిగా భావించి కుంగిపోకూడదు. ఇప్పుడున్న యువత ప్రతి ఒక్క విషయాన్ని స్నేహితులు, తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. చనిపోవాలనే పరిస్థితులు ఎదురైనప్పుడు తమ భావాలను ఎవ్వరితోనూ పంచుకోలేకపోతున్నారు. మన సమస్యను నమ్మకస్తుల వద్ద పంచుకుంటే మనసు తేలికపడుతుంది. కన్నీళ్లు ఉప్పొంగి బయటికొస్తే బాధ దూరమవుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలి. ♦ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అలాగని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మనిషికి చదువు సంస్కారాన్ని నేర్పుతుందనే విషయాన్ని మరచిపోవద్దు. సమాజంలో ఎలా బతకాలో నేర్పించేది చదువు. ♦ బాధ ఉన్న సమయంలో చిన్నపిల్లలు ఉన్న చోట ఆడుకోవడం, అన్నీ మరచిపోయి వారితో కాసేపు సరదాగా గడపడం వల్ల కూడా ఒత్తిడి దూరమవుతుందని ఇటీవల పరిశోధనలు రుజువు చేశాయి. ♦ ప్రధానంగా సామాజిక మాధ్యమాలను మనకు ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. అనవసరమైన చర్యలు, సంబంధంలేని విషయాలను వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం వల్ల సమయం వృథా అవుతుంది. అంతేగాక మనపై ఒత్తిడి పెంచుతుందనే విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులే ప్రధానం దేశాన్ని మార్చే శక్తి యువతలోనే ఉంది. సమాజంలో తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించేది కూడా యువతే. అలాంటప్పుడు విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి..? లక్ష్యంవైపు అడుగులు వేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. వాటి పరిష్కారానికి ప్రయత్నించాలి. లేదంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలి. ప్రపంచంలో అమ్మానాన్నలు మాత్రమే మీ సమస్యను పరిష్కరిస్తారు, దారి చూపిస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు. – డాక్టర్ పి.సరళమ్మ,జిల్లా ప్రభుత్వ వైద్యశాలలసమన్వయాధికారిణి చర్చించండి మూడేళ్లలో మహిళలపై జరిగిన వేధింపుల కేసులు 1,372 నమోదయ్యాయి. అందులో ఈ ఒక్క ఏడాదిలోనే 2,083 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ వేధింపులు పెరిగాయని కాదు. మహిళలు ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి వారి సమస్యలు చెబుతున్నారు. పరిష్కారాలు చూపిస్తున్నాం. సమస్య ఉంటే అమ్మా, నాన్న, స్నేహితులతో చర్చించాలి. గుడికి వెళ్లి దేవుడికి దన్నంపెట్టి బాధను చెప్పుకున్నట్లే ధైర్యంగా స్టేషన్‌కు రండి. రోడ్డుపై భిక్షమెత్తుకునే 90 ఏళ్ల వృద్ధురాలికి కూడా సమస్య ఉంది. అలాగని ఆమె ఆత్మహత్య చేసుకోలేదే. దయచేసి బతుకుపై ఉన్న ధైర్యాన్ని వదలొద్దు. – నారాయణస్వామిరెడ్డి,మహిళా స్టేషన్ డీఎస్పీ, చిత్తూరు -
నిందితులను వదిలే ప్రసక్తేలేదు
చిత్తూరు అర్బన్: తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప మృతికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న తెలిపారు. ఆయన ఆదివారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడతూ శిల్ప ఆత్మహత్మకు కారకులపై ప్రాథమికంగా చర్యలు తీసుకున్నామన్నారు. అధ్యాపకులను విధుల నుంచి తొలగించామని, ప్రిన్స్‌పాల్‌ను బదిలీ చేశామన్నారు. మరికొందరు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కళాశాలలో మహిళలపై వేధింపులను నివారించడానికి ఉన్న కమిటీలు రద్దు చేసి, కొత్త వాటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మహిళలకు ఏవైనా ఇబ్బందులొస్తే వెంటనే చర్యలు తీసుకునేలా కమిటీలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. సీఐడీ నివేదిక ఆధారంగా నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కొనసాగుతున్న సీఐడీ విచారణ పీలేరు: డాక్టర్ శిల్ప ఆత్మహత్యపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది. కేసును సీఐడీకి అప్ప గించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం పీలేరు అర్బన్ సీఐ సిద్ధ తేజమూర్తి కేసుకు సంబందించిన రికార్డులను సీఐడీ డీఎస్పీ రమణకు అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ అధికారుల బృందం మృతురాలి తల్లిదండ్రులు రాధ, రాజగోపాల్, సోదరి శృతి, భర్త డాక్టర్ రూపేష్‌కుమార్‌రెడ్డి, ఇతర కుటుంబ సబ్యులను వేర్వేరుగా విచారిస్తున్నారు. మృతికి దారితీసిన వివరాలను సేకరించినట్టు తెలిసింది. అలాగే శిల్ప ఆత్మహత్య చేసుకున్న అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేశారు. ప్రొఫెసర్ల వేధింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన శిల్ప ఎటువంటి ఆరోపణలు, వాంగ్మూలం లేకుండానే ఎలా చనిపోయిందన్న కోణంలో సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. విచారణపై సీఐడీ అధికారులు ఎటువంటి వివరాలు వెల్లడించడం లేదు. విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు. -
నిన్న శిల్ప.. నేడు గీతిక
తిరుపతి అర్బన్ : మెడికోల వరుస బలవన్మరణాలతో తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఉలిక్కిపడింది. ఐదు రోజుల క్రితం పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతం మరువకముందే ఆదివారం సాయంత్రం ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీతిక బలవన్మరణం విద్యార్థులను, వైద్యులను కలవరపాటుకు గురిచేసింది. వ్యక్తిగత కారణాలతోనే గీతిక ఆత్మహత్య చేసుకుందని తల్లి అంటున్నప్పటికీ వారంలోనే ఒకే మెడికల్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అశువులు బాయటం సర్వత్రా ఆందోళనకు తావిస్తోంది. భావి డాక్టర్ల బలవన్మరణాలు సమాజాన్ని అలజడికి గురిచేస్తున్నాయి. మెడికల్ కళాశాలలో అసలు ఏమి జరుగుతోందంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఇంటర్నల్ పరీక్షలు.. మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవారం పాథాలజీ అంశంలో ఇంటర్నల్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే గీతిక మృతితో ఆ పరీక్షలు వాయిదా పడే అవకాశముందని వైద్య విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. పరీక్షలకు భయపడేంత విధంగా ఇంటర్నల్ పరీక్షలు జరగవని జూడాల నాయకులు చెబుతుండగా, పరీక్షల్లో ఏమైనా ఇబ్బందులకు భయపడి గీతిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా...? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కళాశాలలోనూ గీతిక ఎక్కువగా ఎవరితోనూ కలివిడిగా ఉండేది కాదని విద్యార్థులు అంటున్నారు. భరోసా ఇచ్చే చర్యలు శూన్యం.. ఒక్క ఎస్వీ మెడికల్ కళాశాలలోనే కాకుండా ఏ విద్యా సంస్థలోనైనా, విధి నిర్వహణ ప్రాంతా ల్లోనైనా వేధింపులు ఎదురైనప్పుడు వారికి భరోసా కలిగించే చర్యలు లేవనే చెప్పాలి. ఈ విషయంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు నిర్లక్ష్యంగానే ఉంటున్నారన్న ఆరోపణలకు ప్రస్తుత ఈ రెండు ఘటనలే నిదర్శనాలుగా నిలిచాయి. ఏదో ఘటన జరిగిన సందర్భంలో మాత్రమే హడావుడి చేసి, ఆ తర్వాత మిన్నకుండిపోవడం కూడా ఇలాంటి ఘటనలకు కారణ మవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్యలకు వ్యతిరేకంగాఅవగాహన కల్పించాలి.. కళాశాలల్లో, విధి నిర్వహణ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండేలా నిరంతరం అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ ధైర్యం నూరిపోయాలి. ఆ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలూ శ్రీకారం చుట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ ప్రద్యుమ్న సూ చించిన వేధింపుల నివారణ కమిటీల ఏర్పాటునూ వేగవంతం చేయాలన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. అవసరమైతే ఈ అంశాలను హైస్కూల్ స్థాయిలోని పాఠ్యాంశాల్లోనే చొప్పించాల్సిన అవసరముంది. -
‘అలా చేసుంటే శిల్ప బతికేది’
సాక్షి, తిరుపతి: తన భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ముందే స్పందించివుంటే ఆమె బతికేదని డాక్టర్ శిల్ప భర్త రూపేశ్ అన్నారు. ఫిర్యాదు చేసిన ప్రతిసారీ శిల్పను చిన్నచూపు చూశారని వెల్లడించారు. మానసిక సంఘర్షణకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకునివుంటే శిల్ప ఆత్మహత్య చేసుకునేది కాదని ఆమె తండ్రి రాజగోపాల్ అన్నారు. తమను పరామర్శించిన వివిధ సంఘాల నాయకులతో వారు మాట్లాడారు. ఏడాదిన్నర పోరాడింది చిన్నప్పటి నుంచి శిల్పను గారాబంగా పెంచుకున్నామని, గోల్డ్ మెడల్ విద్యార్థి కావడంతో మెడిసిన్ పూర్తి చేసిందని రాజగోపాల్ తెలిపారు. పీజీ కోర్సు కూడా అయిపోతే తమ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఆశించామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత మంది ప్రొఫెసర్లు వ్యవహరిస్తున్న తీరుపై శిల్ప ఫిర్యాదు చేసిందని, ఏ స్థాయిలోనైనా చర్యలు తీసుకునివుంటే తమకు కడుపుకోత మిగిలేది కాదన్నారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న అన్యాయాలపై ఏడాదిన్నరగా శిల్ప పోరాడుతూనే ఉందని, ఎన్నోమార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. మే నెలలో గవర్నర్ కూడా ఫిర్యాదు చేసిందని, దీంతో కక్ష కట్టి పరీక్షల్లో శిల్పను ఫెయిల్ చేశారని ఆరోపించారు. దోషులను చట్టప్రకారం శిక్షించాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాలని వేడుకున్నారు. ఇద్దరిపై కేసులు డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతంలో ఆమె సోదరి శృతి ఫిర్యాదు మేరకు రవికుమార్, కిరీటి శశికుమార్ లపై కేసులు నమోదు చేసినట్టు పీలేరు సిఐ సిద్ధ తేజోమూర్తి తెలిపారు. ఐపీసీ 354 డీ,509, 506, 306, 34 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు పెట్టినట్టు వెల్లడించారు. కాగా, శిల్ప ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని ఎస్వీ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిర్లక్ష్యమే ప్రాణం తీసింది డాక్టర్ శిల్ప ఫిర్యాదు చేసినప్పుడే స్పందించివుంటే ఇంత అమానుషం జరిగేది కాదని మహిళా ఐక్యవేదిక, సీపీఎం అనుబంధ సంస్థ ఐద్వా సభ్యులు అన్నారు. శిల్పను నమ్ముకున్న కుటుంబ సభ్యులు, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా శోకం మిగిలిందని పేర్కొన్నారు. శిల్ప కుటుంబ సభ్యులను శనివారం మహిళా సంఘాల ప్రతినిధులు పరామర్శించారు. -
నిర్లక్ష్యమే ఉసురు తీసిందా!?
తిరుపతి అర్బన్: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకెదురవుతున్న లైంగిక వేధింపులపై చేసిన ఫిర్యాదుపై సాక్షాత్తు రాష్ట్ర గవర్నరే స్పందించినా అదే స్థాయిలో ఇతర అధికారులు స్పందించకపోవడం, విచారణ చేసి నాలుగు నెలలైనా వాస్తవాలేమిటో వెల్లడించకపోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. బాధితురాలు విచారణ నివేదిక బహిర్గతం చేయాలని ఎన్నోసార్లు మొత్తుకున్నా ఆమె ఘోష అరణ్య రోదనే అయ్యింది. మరోవైపు– కాలేజీలో వేధింపుల పర్వం మరింత ఎక్కువైందని జూనియర్ డాక్టర్ల వాదన. ఈ నేపథ్యంలో పీజీ పరీక్షలు జరిగాయి. పీజీ పరీక్షల్లోనూ డాక్టర్ శిల్ప కు ముగ్గురు సమస్యలు సృష్టించారని ప్రచారంలోకి వచ్చింది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్‌తోపాటు ప్రొఫెసర్లు డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్ ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..‘‘మహిళలను వేధిస్తే కఠినంగా వ్యవహరిస్తాం..వారి రక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటాం..’ అని వివిధ సందర్భాల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినా, మహిళలను వేధిస్తే ఖబడ్దార్ అనే లెవెల్లో పోలీసులు ఊదరగొట్టినా శిల్పకు ఎవరి అండా లభించలేదని, అడుగడుగునా అవరోధాలే ఎదురయ్యాయని వైద్య విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఆమె ఫిర్యాదులపై సకాలంలో స్పందించి, విచారణ వేగవంతం చేసి, నివేదిక బహిర్గతం చేసి ఉంటే ఒక నిండుప్రాణం బలయ్యేది కాదని వైద్య విద్యార్థి లోకం ఘోషిస్తోంది. ‘అధికార’ రాజకీయ ఒత్తిళ్లు తనను వేధిస్తున్నారంటూ డాక్టర్ శిల్ప గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న డాక్టర్, ఆయనకు సహాయంగా ఉంటున్నారన్న ఇద్దరు ప్రొఫెసర్లకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆమెపై వివిధ రూపాల్లో ‘కాముకాసురులు’ రెచ్చిపోయారు. ఈ కాముకాసురులు వేధింపులు శృతి మించుతుండడంతో శిల్ప అలిపిరి పోలీసులను కూడా ఆశ్రయించారు. అయితే అధికార, రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా కావడంతో విధిలేక ఆమె ఫిర్యాదును వెనక్కు తీసుకున్నట్లు కాలేజీ వర్గాల్లో బలంగా వినబడుతోంది. అటు ఉన్నత స్థాయి అధికారులే కాకుండా చివరకు పోలీసు వ్యవస్థ కూడా ఆమెకు అండగా నిలబడకపోవడం శాపమైంది. దీంతో మానసిక ఒత్తిళ్లతో ఆమె నలిగిపోయారు. పీజీ పరీక్షల ఫలితాలతో మరింత కుంగుబాటుకు గురైనట్లు తెలుస్తోంది. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న తనకే న్యాయం జరగలేదంటే, మిగిలిన వారి పరిస్థితి ఏమిటో? అని సన్నిహితుల వద్ద ఆమె కన్నీటిపర్యంతమైనట్లు తెలియవచ్చింది. అంతటా ఆధిపత్య పోరే మెడికల్ కాలేజీలో విభాగాధిపతులు, వైద్య అధ్యాపకులు, వైద్యుల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న పోరు, ఆధిపత్యం, వివాదాలకు ప్రతిసారీ వైద్య విద్యార్థులే పావులుగా మారుతున్నారనే వాదన వినిపిస్తోంది. విభాగాధిపతులతో సన్నిహితంగా ఎవరు వ్యవహరించినా మరో వర్గం దానిని భూతద్దంలో చూపేందుకు ప్రయత్నిస్తూంటుందని మరో వాదన. ఇలాంటి కోవకే పీజీ విద్యార్థిని శిల్ప వ్యవహారం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ వైద్య విద్య కోర్సులతో పాటు ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను సుదూర ప్రాంతాల విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వారు బస చేసే హాస్టళ్లలోను వైద్య విభాగా«ధిపతులు, ప్రొఫెసర్లు రాత్రి వేళల్లో మకాం వేసి, తమకు అనుకూలంగా వ్యవహరించేలా వారిపై నయానో భయానో ఒత్తిళ్లు తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో వచ్చిన విద్యార్థులకు వీరి చర్యలు కంపరం కలిగిస్తున్నా మౌనంగా భరిస్తున్నారని, ఒకవేళ తెగించి గళం విప్పితే, ముప్పేటలా దాడి చేసి, చివరకు వారికి జీవితమే లేకుండా చేస్తున్నారనడానికి శిల్ప ఉదంతమే ఓ ఉదాహరణ అని విద్యార్థిలోకం, మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. తల్లి, తండ్రి తర్వాత గురువే దైవమని చెప్పుకునే మన సంస్కృతిలో ఇప్పుడు గురువుల స్థానం ఏమిటో ఇలాంటి ఉదంతాలు సమాజానికి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటాయని సైకాలజిస్టులు అంటున్నారు. కొందరు గురువుల తీరు మారకపోతే నష్టపోయేది సమాజమే. ఇకనైనా ప్రభుత్వం ఇబ్బందులు లేని విద్యాభ్యాసానికి భరోసా ఇచ్చే దిశగా కార్యాచరణకు పూనుకోవాలని పలువురు కోరుతున్నారు. పీలేరులో సీఐడీ అధికారుల విచారణ పీలేరులోని శిల్ప ఇంట శుక్రవారం సీఐడీ అధికారులు ఆమె తల్లిదండ్రులను కలిశారు. కుటుంబ సభ్యులను విచారణ చేశారు. శిల్ప ఆత్మహత్యకు దారితీసిన సంఘటనలు గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి డాక్టర్ శిల్ప మృతి ఘటన చిత్తూరు కలెక్టరేట్ : ఎస్వీ మెడికల్ కాలేజ్ పీజీ వైద్యవిద్యార్థిని శిల్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కలెక్టర్ ప్రద్యుమ్న తీసుకెళ్లారు. శుక్రవారం కలెక్టర్ అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. శిల్ప మృతితో ఎస్వీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న పరిణామాలు, జూనియర్ డాక్టర్ల ఆందోళనలు, శిల్ప తల్లిదండ్రుల డిమాండ్లు తదితర అంశాలను ముఖ్యమంత్రికి ఆయన నివేదించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి శిల్ప మృతి సంఘటనపై సీఐడీ విచారణను వేగవంతంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వ డాక్టర్లతో సమావేశం నిర్వహించి, నిరుపేద రోగులకు వైద్య సేవలను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రుయాలో ముదురుతున్న వివాదం
సాక్షి, తిరుపతి : ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు రోజురోజుకు ముదురుతోంది. శిల్ప మృతి ఘటనలో ప్రొఫెసర్లపై చర్యలను నిరసిస్తు రుయాలో సీనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. రోజు గంటపాటు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయనున్నట్లు డాక్టర్లు ప్రకటించారు. దీనిపై సోమవారం ప్రభుత్వం చర్చలు జరుపునున్నామని డాక్టర్లు తెలిపారు. మరోవైపు ప్రొఫెసర్లపై చర్యలు ఉపసంహరించుకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామంటూ జూడాలు హెచ్చరిస్తున్నారు. కాగా ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థి శిల్ప ప్రొఫెసర్ల వేధింపుల కారణంగా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వివాదం కారణంగా కాలేజీలో జూనియర్, సీనియర్ డాక్టర్ల్ మధ్య తీవ్ర విభేదాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో కాలేజీ ప్రిన్సిపల్ రమణయ్యను సస్పెండ్ చేయడాన్ని సీనియర్ డాక్టర్లు తప్పుపడుతున్నారు. శిల్ప ఆత్మహత్య తరువాత జరిగిన పరిణామాలపై సీనియర్ డాక్టర్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రిన్సిపల్ రమణయ్యను తిరిగి విధుల్లోకి చేర్చాలంటూ సీనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తుండగా.. అదే సమయంలో ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే ఉద్యమం తప్పదంటూ జూనియర్ డాకర్లు హెచ్చరిస్తున్నారు. జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకోవడానికి వైద్యులు కారణం కాదని, కుటుంబ వ్యవహారాలే కారణమని ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
డాక్టర్ శిల్ప మృతిపై సమగ్ర విచారణ జరగాలి
-
సీనియర్ డాక్టర్లు వర్సెస్ జూనియర్ డాక్టర్లు
సాక్షి, తిరుపతి : ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసును ప్రభుత్వం స్పేషల్ ఇన్వేష్టిగేషన్ టీం (సిట్)కు అప్పగించింది. సిట్ అధికారిగా చిత్తూరు డీఎస్పీ రమణ కుమార్‌ను నియమించారు. శిల్ప మృతికి కారణమైన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆమె కుటుంబ సభ్యులు కోరారు. కాగా ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ శిల్ప ప్రొఫెసర్ల వేధింపులు కారణంగా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సీనియర్ డాక్టర్లు వర్సెస్ జూనియర్ డాక్టర్లు డాక్టర్ శిల్ప మృతి ఘటనలో ప్రిన్సిపల్ రమణయ్యను సస్పెండ్ చేయడాన్ని సీనియర్ డాక్టర్లు తప్పుపడుతున్నారు. శిల్ప ఆత్మహత్య తర్వాత జరిగిన పరిణామాలపై సీనియర్ డాక్టర్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రిన్సిపల్ రమణయ్యను తిరిగి విధుల్లోకి చేర్చాలంటూ సీనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే ఉద్యమం తప్పదంటూ జూనియర్ డాకర్లు హెచ్చరిస్తున్నారు. శిల్ప మృతికి వైద్యుల కారణం కాదు జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకోవడానికి వైద్యులు కారణం కాదని, కుటుంబ వ్యవహారాలే కారణమని ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. శిల్ప మృతికి సంబంధించి సమగ్ర విచారణ జరగాలని అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. డాక్టర్లను కామాంధులుగా చిత్రీకరించడం బాధగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డాక్టర్లపై చర్యలు ఎమోషనల్‌గా తీసుకున్న నిర్ణయాలగా పేర్కొన్న వెంకటేశ్వర్లు.. ప్రిన్సిపల్‌ను విధులు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదన్నారు. పీలేరులో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య -
ఫలించిన విద్యార్థి పోరు
తిరుపతి అర్బన్/పీలేరు: డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతం ఎస్వీ మెడికల్ కాలేజిని కుదిపేసింది. ఎట్టకేలకు బాధ్యులైన ఇద్ద రు ప్రొఫెసర్లను ప్రభుత్వం నెల్లూరు బది లీ చేసింది. ప్రిన్సిపల్ రమణయ్యను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.బుధవారం ఉదయం బాధ్యులైన ప్రొఫెసర్లను అరెస్టు చేయాల్సిందేనని విద్యార్థులు భీష్మించారు. కలెక్టరు స్వయంగా వచ్చి తన డిమాండ్లపై చర్చించాలనంటూ నిరసించారు. వైద్యాధికారులతో, విద్యార్థులతో హైపవర్ కమిటీ తొలుత జరిపినచర్చలు ఫలప్రదం కాలేదు. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలి సింది. శిల్ప ఆత్మహత్యపై హైపవర్ కమిటీతో పాటు సీఐడీ కూడా దర్యాప్తు చేయనుంది. సీఐడీ స్పెషల్ బ్రాంచి పోలీసులు విద్యాసంస్థను సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. గత నివేదికలను పరిశీలించి ప్రిన్సిపల్ రమణయ్య నుంచి కూడా తీసుకున్న వివరాలను వీరు ప్రభుత్వానికి పంపనున్నారని భోగట్టా. కన్నీటి వీడ్కోలు.. డాక్టర్ శిల్పకు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. పీలేరు మండలం మొరవపల్లె వద్ద దహన క్రియలు నిర్వహించారు. బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల ప్రజలు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కారకులైన ప్రొఫెసర్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు కారకులైన ప్రొఫెసర్లను అరెస్ట్ చేయాలని పీలేరు ఆర్టీసీ బస్టేషన్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. శిల్ప కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరా టాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి, ప్రొఫెసర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సుంకర చక్రధర్, పురుషోత్తం, వెంకటేష్ తదితర విద్యార్థి, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేసినాన్యాయం జరగలేదు.. రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడం వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని డాక్టర్ శిల్ప తల్లిదండ్రులు రాధ, రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో హడావుడి చేసి చివరకు ప్రాణాలు బలిగొన్నారన్నారు. జీవితాంతం తలుచుకొని బాధపడాల్సిందేనని, ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. నివేదిక బయట పెట్టకుండా వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్లకు అండగా నిలవడం దారుణమన్నారు. డాక్టర్ శిల్ప భర్త, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. బుధవారం పీలేరులోని శిల్ప ఇంటికి వచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు, ప్రొఫెసర్ల వేధింపులపై వివరాలు సేకరించారు. ప్రొఫెసర్లను అరెస్ట్ చేయిస్తామని చెప్పాలని కోరగా నన్నపనేని సమాధానం దాటవేశారు. పీలేరు ఇన్చార్జి సీఐ సిద్ధతేజమూర్తి, ఎస్ఐలు పీవీ సుధాకర్‌రెడ్డి, రామస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు..
ఓ విద్యాకుసుమం రాలిపోయింది. శ్రమ.. పట్టుదలతో ఉన్నత విద్యలో సోపానాలు అధి రోహించిన ఓ యువ వైద్యురాలి కథ విషాదాంతమైంది. వేధింపుల పర్వమే ఆమె హృదయాన్ని కలచివేసి చివరికి మృత్యువు ఎదుట తలవొంచేలా చేసింది. పీలేరుకు చెందిన డాక్టర్ శిల్ప (31) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హృదయాలను ద్రవింపజేసింది. ఆమె మృతిలో తిరుపతి వైద్యకళాశాలలో నిరసన ఎగిసింది. రుయా ఆస్పత్రి హెడ్ డాక్టర్ రవికుమార్ ఈ సంఘటనకు సంబంధించి సస్పెండయ్యారు. చిత్తూరు, పీలేరు: పీలేరులో డాక్టర్ శిల్ప ఆత్మహత్య సంఘటన సంచలనం సృష్టించింది. పట్టణానికి చెందిన రాధ, రాజగోపాల్ దంపతుల కుమార్తె శిల్ప తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది. అదే సమయంలో తిరుపతికి చెందిన రూపేష్‌కుమార్ రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకుంది. వైద్యవిద్యలో శిల్ప ప్రతిభ కనబర్చింది. పట్టభద్రురాలయ్యాక ప్రభుత్వ డాక్టర్గాఎంపికైంది. తంబళ్లపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించేది. సర్వీసులో ఉండగానే పీడియాట్రిక్స్‌లో ఎండీ కోర్సు సీటు వచ్చింది. 2015–16 తిరుపతి రుయాలో చేరింది. పీజీ చేస్తుండగానే నాలుగు నెలల క్రితం ప్రొఫె సర్లు రవికుమార్, కిరీటి, శశికుమార్ తనను వేధిస్తున్నారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసేదని భోగట్టా. స్థానికంగా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఫలితం లేకపోవడంతో గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు సంఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. గవర్నర్ ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి విచారణ జరిపింది. మానసిక స్థితి సక్రమంగా లేదంటూ ఆ కమిటీ భావిస్తున్నట్లు తెలుసుకుని డాక్టర్ శిల్ప తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. కమిటీ నివేదిక రహస్యంగా ఉంచడం, తనను వేధించిన ప్రొఫెసర్లపై ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో కుంగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నెలాఖరులో విడుదలైన పీజీ పరీక్షల్లో ఫెయిలైంది. చదువులో ఉన్నతంగా రాణిస్తున్నా ప్రొఫెసర్లు ఫెయిల్ చేశారని శిల్ప ఆవేదన చెందేదని కుటుంబ çసభ్యులు చెబుతున్నారు. మరోమారు జవాబుపత్రాల దిద్దుబాటు చేయిం చినా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో శిల్ప మంగళవారం తానుంటున్న ఫ్లాట్‌లో ఉరివేసుకొని ఆత్మహ్యతకు పాల్పడింది. శిల్ప తండ్రి రాజగోపాల్ పీలేరులోని బరోడా బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తూ ఇటీవలే గుజరాత్‌కు బదిలీపై వెళ్లారు. తల్లి గృహిణి. చెల్లెలు శ్రుతి బెంగళూర్‌లో బీటెక్ చదివింది. ప్రాథమిక స్థాయి నుంచి శిల్ప బాగా చదివేది. ఎలాగైనా డాక్టర్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అనుకున్నట్లుగా ఎంబీబీఎస్ సీటు సాధించింది. వైద్యురాలైంది. భర్త రూపేష్‌కుమార్‌రెడ్డి మదనపల్లెలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో పనిచేసేవారు. రెండు సంవత్సరాల క్రితం పీలేరులోని చిత్తూరు మార్గంలో రుషి ఆర్ఢో అండ్ ట్రామా కేర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ డాక్టరు దంపతులకు నాలుగు సంవత్సాల కుమారుడున్నాడు. అనూహ్య రీతిలో డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాం తికి గురయ్యారు. ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదు... వేధింపులకు భయపడకుండా ఎంతో ధైర్యంతో ప్రొఫెసర్లపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన శిల్ప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని బంధువులంటున్నారు. శిల్ప మృతిపై వీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వేధింపులకు గురిచేసిన ప్రొఫెసర్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు.. మృతురాలి సోదరి శ్రుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు ఇన్చార్జి సీఐ సిద్ధతేజమూర్తి, ఎస్ఐ పీవీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. నేడు విచారణ కమిటీ. యూనివర్సిటీ క్యాంపస్: శిల్ప మృతితో వేసిన విచారణ కమిటీ బుధవారం కళాశాలలో విచారణ చేపట్టనుంది. కమిటీ విద్యార్థులను, అధ్యాపకులను, ఇతర అధికారులను రహస్యంగా విచారించనుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎవరూ భయపడవద్దని అధికారులు చెబుతున్నారు. -
శిల్ప ఆత్మహత్య కేసు : ప్రొఫెసర్‌పై వేటు
సాక్షి, పీలేరు : జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసుపై ప్రభుత్వం స్పందించింది. ఆత్మహత్యకు ప్రొఫెసర్ రవికుమార్ కారణమని బంధువులు ఆందోళనకు దిగడంతో రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. శిల్ప ఆత్మహత్యపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆదేశించారు. డీఎంఈ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రొఫెసర్లను కాకుండా ఒక్క రవికుమార్నుమాత్రమే సస్పెండ్ చేయడంపై జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా ఇద్దరు ఫ్రొఫెసర్లు డాక్టర్ కిరీటి, శివకుమార్లను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. శిల్పను ప్రొఫెసర్ రవికుమార్ లైంగిక వేధింపులకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా నిన్న సాయంత్రం విడుదలైన పీజీ ఫలితాల్లో శిల్ప ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారనే కోపంతోనే కావాలని ప్రొఫెసర్లు ఫెయిల్ చేశారని, ఆ బాధతోనే శిల్ప ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య
-
పీలేరులో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య
పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంటులో శిల్ప అనే జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఐదేళ్ల క్రితం రూపేశ్ కుమార్ అనే వ్యక్తితో శిల్పకు ప్రేమ వివాహం జరిగింది. శిల్ప, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలోని పీడీయాట్రిక్ డిపార్టుమెంటులో పీజీ స్టూడెంట్. తనను కొంత మంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ గత ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్‌కు శిల్ప ఫిర్యాదు కూడా చేసింది. శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిన్న సాయంత్రం విడుదలైన పీజీ ఫలితాల్లో శిల్ప ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారనే కోపంతోనే కావాలని ప్రొఫెసర్లు ఫెయిల్ చేశారని, ఆ బాధతోనే శిల్ప ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాపై దుష్ప్రచారం చేస్తున్నారు : హీరో భార్య
యశవంతపుర: సోషల్ మీడియాలో తన ఫొటో ఉంచి నాడుప్రభు కెంపేగౌడకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలను పోస్టు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీహీరో గణేశ్ భార్య శిల్ప నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘కెంపేగౌడ కంటే గొప్పపనులు చేసినవారు అనేక మంది ఉన్నారు. సిల్క్ వర్శిటీకి కెంపేగౌడకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు’ అని రాసి శిల్ప ఫొటోను జతచేసి ఫేస్బుక్లో కొందరు పోస్టు చేశారు. దీంతో శిల్పపై సోషల్‌మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. నాడుప్రభు కెంపేగౌడపై తనకు అపారమైన గౌరవం ఉందని, అయనను అవమానించాల్సిన అవసరం లేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కొందరు కావాలనే తనకు చెడ్డపేరు తేవడానికి ఇలాంటి పోస్టులు చేసిన్నట్లు, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శిల్ప పేర్కొన్నారు. -
రుణం తీర్చుకోవాలి
గోపీకృష్ట, మహేంద్ర, ప్రదీప్, శిల్ప, తేజు, ప్రియాంక ప్రధాన పాత్రల్లో ఎస్.గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుణం’. బెస్ట్ విన్ ప్రొడక్షన్ పతాకంపై భీమినేని సురేష్ జి, రామకృష్ణారావు నిర్మించారు. ఎస్.వి.మల్లిక్ తేజ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కొందరికి రుణపడుతుంటారని, ఆ రుణం తీర్చుకోవాలనే కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. సంగీత దర్శకుడు మల్లిక్ తేజ్ ఈ చిత్రంలోని అన్ని పాటలు రాయడంతో పాటు ఓ పాట పాడడం విశేషం. పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన అందరికీ మేం రుణపడి ఉంటాం. తప్పకుండా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, తొలి కాపీతో విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ, ఎస్.గుండ్రెడ్డి, ఎస్.వి. మల్లిక్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.వెంకట్. -
అత్యాశకు పోతే...
‘‘ప్రతి మనిషి జీవితంలో ఎవరికో ఒకరికి ఋణపడుతుంటాడు. ఆ ఋణం తీర్చేవాడు మనిషవుతాడు. అత్యాశ అనేది మనిషి జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలుపుతుంది. ఒక్కోసారి అథః పాతాళానికి తొక్కుతుంది. అత్యాశ వల్ల కలిగే అనర్థాలను ‘రుణం’ చిత్రంలో వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం’’ అన్నారు దర్శకుడు ఎస్. గుండ్రెడ్డి. గోపీకృష్ణ, మహేంద్ర, శిల్ప, తేజు, ప్రియాంక ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో భీమినేని సురేశ్, జి. రామకృష్ణారావు నిర్మిస్తున్న సినిమా ‘రుణం’. పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మానవ సంబంధాలు, మనస్తత్వాల నేపథ్యంలో సినిమా ఉంటుంది’’ అన్నారు. చిత్ర సమర్పకులు గాలిరెడ్డి, గోపీకృష్ణ, మహేంద్ర, ప్రియాంక, విలన్ పాత్రధారి ప్రదీప్ ప్రత్తికొండ, సంగీత దర్శకుడు ఎస్.వి. మల్లిక్ తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.వెంకట్. -
గెలుపు మాదే..!
- సవాల్‌కు మంత్రి అఖిల కట్టుబడి ఉండాలి - చైర్‌పర్సన్‌ను దించడం సాధ్యం కాదు - రోజురోజుకూ వైఎస్ఆర్సీపీ బలం పెరుగుతోంది - బ్రహ్మానందరెడ్డి భూమా వారసుడు కాదు - మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి - పార్టీలో గోపీనాథరెడ్డి, బాలపక్కీరయ్య చేరిక నంద్యాల/నంద్యాల వ్యవసాయం: ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని, సవాల్‌కు కట్టుబడి మంత్రి, ఎమ్మెల్యే పదవులకు అఖిలప్రియ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. తాను ఓడితే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ బాలపక్కీరయ్య, మాజీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి సన్నిహితుడు గోపవరం గోపీనాథరెడ్డి బుధవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. ఏడుగురు కౌన్సిలర్లు తమ వర్గంలోకి వచ్చారని.. మొత్తం 42మందిలో 26మంది తమ వైపు ఉన్నారన్నారు. చైర్ పర్సన్ దేశం సులోచనను పదవి నుంచి దించుతామని ప్రచారం చేస్తున్నారని, దీన్ని తాను సవాల్‌గా స్వీకరించానని చెప్పారు. తన వర్గానికి చెందిన వారిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని, కాని వారంతా తనకే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ నేతలు తేదీ ఎప్పుడు చెప్పినా బల ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. బ్రహ్మానందరెడ్డి భూమా వారసుడు కాదు... టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి..దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వారసుడు కాదని శిల్పా అన్నారు. భూమా నాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడు మాత్రమే వారసులన్నారు. నంద్యాలలో జరిగిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. బ్రహ్మానందరెడ్డి పేరును ప్రకటించారన్నారు. అయితే అతను భూమా వారసుడు కాకపోవడంతో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్రకటించారన్నారు. తాను వైఎస్సార్సీపీలో చేరడానికి గంట ముందు కూడా పలువురు మంత్రులు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు చేశారన్నారు. కాని తాను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని చెప్పారు. టీడీపీ నాన్పుడు ధోరణి, మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలి వల్లనే తాను టీడీపీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు. అధికార పార్టీలో కార్యకర్తలు, నేతలు చేరడం సహజమేనని, కాని ప్రతిపక్ష పార్టీలో చేరడం సాహసోపేతమన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగకుండా ఎదురీదాల్సి వస్తుందని, కార్యకర్తలు తాను అండగా ఉంటానని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరిన గోపీనాథరెడ్డి, బాలపక్కీరయ్య... దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి సన్నిహితుడు గోపీనాథరెడ్డి స్థానిక బ్రహ్మాటవర్స్‌లో జరిగిన కార్యక్రమంలో శిల్పా సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా గోనీనాథరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పతనం నంద్యాల నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్నారు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని, శిల్పామోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలుపిస్తామన్నారు. గోపీనాథరెడ్డి సేవలను వినియోగించుకుంటామని శిల్పామోహన్‌రెడ్డి తెలిపారు. అరాచకాలను అడ్డుకట్ట వేద్దాం.. శిల్పా స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాలపక్కీరయ్య ఆయన వర్గానికి చెందిన గఫూర్, రాజశేఖర్‌గౌడ్, శ్రీనివాసులుగౌడ్, 150మంది కార్యకర్తలు శిల్పా సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను అడ్డుకట్ట వేసి, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలంటే శిల్పాను గెలిపించాలన్నారు. మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ.. గోపీనాథరెడ్డి, బాలపక్కీరయ్యల చేరికతో పార్టీ బలోపేతమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు విజయశేఖర్‌రెడ్డి, రామసుబ్బయ్య, సాయినాథరెడ్డి, కౌన్సిలర్లు అనిల్ అమృతరాజ్, వెంకటసుబ్బయ్య, పున్నా రాజేశ్వరి, జాకీర్, కో ఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్‌రెడ్డి, కృష్ణమోహన్, చంద్రమోహన్, మధు పాల్గొన్నారు. -
అఖిలమ్మ.. ఇదేంటమ్మా!
– నేరుగా ఫోన్ చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు – అందరితో సఖ్యతగా ఉండాలని హితవు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారశైలిపై ఆ పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రికి కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా బుధవారం ఫోన్ చేసినట్టు సమాచారం. అందరితో సఖ్యతగా ఉండి.. కలిసి మెలిసి పనిచేసుకుపోకుండా ఒంటెద్దుపోకడలు సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. ప్రధానంగా మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డితో పాటు నంద్యాల మునిసిపాలిటీలోని మొత్తం కౌన్సిలర్లు పార్టీ మారడం.. మునిసిపాలిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరడం ప్రారంభమయ్యింది. అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కూడా పార్టీ మారడంతో నంద్యాల నియోజకవర్గంలో మెజార్టీగా టీడీపీ ఖాళీ కావడం అధికార పార్టీని కలవరపాటుకు గురిచేసింది. ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ఇది అధికార పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. పదే పదే కలిసి వెళ్లాలని.. స్వయంగా సీఎం స్థాయిలో చెప్పినప్పటికీ అందుకు భిన్నంగా మంత్రిగా ఉండి గొడవలు పెంచడం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. నంద్యాల సీటు విషయంలో పదే పదే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తం మీద అధికార పార్టీలో శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. పీఏ వ్యవహారశైలిపై ఆరా నంద్యాల రాజకీయాలతో పాటు మంత్రి పీఏ వ్యవహరశైలిపైనా అధికార పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. నీరు–చెట్టు పనులతో పాటు ఇతర నామినేషన్ పనుల విషయంలో పీఏ భారీగా అమ్యామ్యాలు తీసుకున్నట్టు ఆరోపణలు నేరుగా సీఎంకు వెళ్లినట్టు సమాచారం. ఇక ఉద్యోగుల బదిలీల విషయంలో భారీగా మంత్రి నుంచి సిఫారసు లేఖలు పోవడం ఏకంగా సీఎం చంద్రబాబు వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక భూమా నాగిరెడ్డికి ఆప్తమిత్రుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని కూడా ఎందుకు కలుపుకుని వెళ్లడం లేదన్న అంశంపైనా మంత్రిని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకుని వెళ్లాలని ఆదేశించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద శిల్పా మోహన్ రెడ్డి వ్యవహారం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
శిల్పా వర్సెస్ మాండ్ర
- పనుల కోసం టీడీపీ నాయకుల కుమ్ములాట - టెండర్లువేసి పనులను చేస్తున్న శిల్పా వర్గీయులు - అడ్డుకున్న మాండ్ర వర్గీయుల - డీఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేసిన పోతిరెడ్డిపాడు డీఈ రమేష్‌బాపూజీ పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): కాంట్రాక్ట్ పనుల విషయంలో టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ శిల్పా చక్రపాణి రెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. తమ అనుమతి లేకుండా పనులు ఎలా చేస్తారని మాండ్ర వర్గీయలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శిల్పా వర్గీయులు..పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా రూ.6.55కోట్ల పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ అప్రోచ్ కాల్వ ఆధునికీకరణ పనులకు టెండర్లు వేసి శిల్పా వర్గీయులు 26శాతం లెస్‌కు దక్కించుకున్నారు. పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లకు మాండ్ర వర్గీయులు ఫోన్‌చేసి తమ అనుమతిలేకుండా మీరెలా పనులు చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయమై.. మాండ్ర తాను చెప్పిన తరిగోపుల, తాటిపాడు గ్రామాలకు చెందిన నాయకులకు తలా రూ.2కోట్ల పనులను అప్పగించాలని డిమాండ్ చేశారు. అందుకు పనులు దక్కించుకున్న వారు అంగీకరించకపోవటంతో వాటిని నిలుపుదలచేయించాలని మాండ్ర తన అనుచరులను పురమాయించారు. దీంతో పగిడ్యాలకు చెందిన పలుచాని మహేశ్వరరెడ్డి, జయసూర్యలతో పాటు మరికొంత మంది వచ్చి పనులను నిలిపివేయించారు. దీంతో కాంట్రాక్టర్ జరిగిన విషయాన్ని నందికొట్కూరు సీఐ వెంకరటమణకు తెలియజేయటంతో ఆయన పట్టించుకోలేదు. దీంతో పోతిరెడ్డిపాడు డీఈ రమేష్ బాపూజీ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పనులను అడ్డుకున్న వారిపై ఆత్మకూరు డీఎస్పీ సుప్రజకుఫిర్యాదు చేశారు. సంఘటన సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని ఆత్మకూరు సీఐ కృష్ణయ్యయాదవ్‌ను డీఎస్పీ ఆదేశించారు. రెండోపర్యాయంగా సాయంత్రం సుమారు 20 మంది వ్యక్తులు ట్రాక్టర్లో వచ్చి పనులను అడ్డుకున్నారు. దీంతో విషయాన్ని కాంట్రాక్టర్ నేరుగా జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణకు వివరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు సీఐ, నందికొట్కూరు సీఐ వారి సిబ్బందితో పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకొని అడ్డుకుంటున్న వారిని మందిలించి పంపించారు. డీఎస్పీకి పిర్యాదు చేశాం: రమేష్‌బాపూజీ, డీఈ పోతిరెడ్డిపాడు పనులను అడ్డుకున్న వారిపై డీఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేసిన మాటవాస్తవమే. ప్రభుత్వం తలపెట్టిన పనులను అడ్డుకోవటం చట్ట రీత్యానేరం రెండునెలల్లో పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఆదిలోనే పనులను అడ్డుకుంటే పనులు మందగించే అవకాశం ఉంది. -
పోటీ తప్పదు!
సీఎంకు తేల్చి చెప్పిన శిల్పామోహన్‌రెడ్డి – కేడర్ అభిప్రాయాన్ని బట్టి నడుచుకుంటానని స్పష్టీకరణ – టీడీపీలోనే కొనసాగాలని తమ్ముడు చక్రపాణిరెడ్డి ఒత్తిళ్లు – నా రాజకీయ జీవితం నాశనం చేయవద్దని మండిపాటు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో తాను పోటీ తప్పక చేస్తానని మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తన వెనకున్న కేడర్ అభిప్రాయాన్ని బట్టే తాను నడుచుకుంటానని తేల్చిచెప్పారు. సీఎంతో విజయవాడలో గంట పాటు జరిగిన చర్చల సందర్భంగా ఇదే విషయాన్ని సీఎంకు తేల్చి చెప్పినట్లు శిల్పామోహన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో నంద్యాల అసెంబ్లీ టిక్కెట్టు తనకు వదిలేయాలని సీఎం వద్ద ఆయన ప్రతిపాదించారు. అయితే భూమా నాగిరెడ్డి మరణించడంతో జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి వారి కుటుంబానికే సీటు ఇవ్వాలని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే తాను తప్పకుండా ఇతర పార్టీ నుంచో, స్వతంత్రంగానో పోటీలో ఉంటానని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. మరోవైపు టీడీపీలోనే కొనసాగాలని తమ్ముడు చక్రపాణిరెడ్డి కోరినట్లు తెలిసింది. తన రాజకీయ జీవితం నాశనం చేయవద్దని అన్నపై ఆయన మండిపడినట్లు సమాచారం. అయితే తన వెనుక ఉన్న కేడర్ అభిప్రాయానికి భిన్నంగా నడుచుకునే అవకాశం లేదని శిల్పామోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. గత రెండు రోజులుగా... వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌పై భూమా కుటుంబం పోటీలో ఉంటుందని అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో తిరుగుతున్నాడు. కేడర్‌తో సమావేశమవుతున్నారు. దీంతో పార్టీ మారి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని శిల్పామోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తనకు అత్యంత ఆప్తులుగా ఉన్న కొద్ది మంది నేతలకు కూడా స్పష్టం చేశారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అధికార పార్టీకి తెలిసిపోయింది. ఈ పరిస్థితుల్లో శాసనమండలి చైర్మన్ పదవి రేసులో ఉన్న తమ్ముడు చక్రపాణిరెడ్డి రంగంలోకి దిగారు. తన రాజకీయ జీవితం నాశనం చేయవద్దని.. అధికార పార్టీలో కొనసాగాలని అన్నపై ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం ఇరువురి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం. తమ్ముడు ఒత్తిడితో మంగళవారం మంత్రి అచ్చెన్నాయుడుతో శిల్పామోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. అదేవిధంగా బుధవారం కూడా నేరుగా ముఖ్యమంత్రితో టిక్కెట్ విషయంపై చర్చించారు. అయితే కేడర్ నిర్ణయానికి భిన్నంగా పోలేనని, ఉప ఎన్నికల్లో స్వతంత్రంగానైనా బరిలో ఉంటానని శిల్పామోహన్‌రెడ్డి తేల్చిచెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి బుధవారం ఆయన కార్యకర్తలతో సమావేశం కావాల్సి ఉంది. సీఎంతో భేటీ సందర్భంగా ఈ సమావేశం వాయిదా పడింది. అఖిల మంత్రాంగం నంద్యాల టిక్కెట్ విషయంపై శిల్పామోహన్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారనే సమాచారంతో మంత్రి అఖిలప్రియ మంత్రాంగం మొదలుపెట్టారు. శిల్పా సోదరుల కంటే ముందుగానే సీఎంతో భేటీ అయ్యారు. తన తండ్రి మరణించడంతో జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి తమ కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలని మరోసారి కోరారు. ఈనెల 24న శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తమ కుటుంబ అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎంకు తేల్చిచెప్పారు. దీనికి సీఎం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు శిల్పామోహన్‌రెడ్డిని బుజ్జగించేందుకు సీఎం శతవిధాలా ప్రయత్నించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌తో పాటు మోహన్‌రెడ్డి కుమారునికి ఎంపీ టిక్కెట్ కూడా ఆఫర్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాకుండా మంత్రి పదవిని కూడా ఇస్తామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. అయితే భూమానాగిరెడ్డి మంత్రి పదవి ఉదంతం నేపథ్యంలో సీఎం మాటలను నమ్మేందుకు మోహన్‌రెడ్డి సుముఖంగా లేరని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తం మీద మరో నాలుగు రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం విషయంలో అధికార పార్టీ వ్యవహారం తేటతెల్లం కానుంది. -
టీడీపీలో ఉంటే భవిష్యత్తు శూన్యం
– పార్టీని వీడాలని శిల్పాకు కౌన్సిలర్ల సూచన – త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానన్న శిల్పా నంద్యాల: టీడీపీలో ఉంటే భవిష్యత్ ఉండదని.. పార్టీ మారాలని మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డికి టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు సూచించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి, మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. రాజకీయ భవిష్యత్‌పై మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి శిల్పా... సోమవారం ఇంట్లో సన్నిహితులతో రహస్య చర్చలు జరిపారు. మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ పీపీనాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచనతో పాటు 26మంది కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు ఆయనను కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, పార్టీ మారాలని పలువురు కౌన్సిలర్లు శిల్పాపై ఒత్తిడి తెచ్చారు.టీడీపీలో భూమా చేరినప్పటి నుంచి తమకు ప్రాముఖ్యత తగ్గిందని, కనీసం పింఛన్లను తెప్పించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో.. ఎంపీ ఎస్పీవైరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ కూడా తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని..ఇంత మంది శత్రువుల మధ్య, మైనార్టీల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పార్టీలో ఉండటం సరికాదని.. తక్షణమే రాజీనామా చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొన్న శిల్పా..నాలుగైదు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ చర్చలపై విలేకరులు శిల్పాను ప్రశ్నించగా.. అప్పుడే తొందర ఎందుకని సమాధానాన్ని దాటవేశారు. -
అట్టహాసంగా ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా నామినేషన్
– రెండు సెట్ల నామినేషన్ పత్రాల దాఖలు కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి కర్నూలు స్థానిక నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి మంగళవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సహా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత శిల్పా చక్రపాణిరెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జేసీ హరికిరణ్‌కు అందజేశారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ నేతలు పాదయాత్రంగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. నామినేషన్ పత్రాల దాఖలుకు రిటర్నింగ్ అధికారి చాంబర్లోకి అభ్యర్థితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి, మరో మగ్గురిని మాత్రమే అనుమతించారు. అభ్యర్థి శిల్పా రెండు సెట్ల పత్రాలను దాఖలు చేశారు. అనంతరం శిల్పా చక్రపాణిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే శిల్పాను అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు. గతంలో జరిగిన ఎన్నికల నాటితో పోలిస్తే ఇప్పుడు తమ పార్టీకి ఎక్కువ మెజార్టీ వస్తుందన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్సీగా శిల్పాను మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించుకునేందుకు అందరం కలసికట్టుగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీసీ జనార్ధన్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, టీడీపీ నేతలు కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్, తగ్గలి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. పోలీసు దిగ్బంధంలో కలెక్టరేట్ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సోమవారం గౌరు వెంకటరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మీడియాను అనుమతించారు. అయితే శిల్పా నామినేషన్‌కు మీడియాను అనుమతించలేదు. జేసీ, రిటర్నింగ్ అధికారి హరికిరణ్ ఆదేశాల మేరకు అన్ని దారులను మూసివేశారు. -
శిల్పాయే మా అభ్యర్థి
– ప్రకటించిన ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు – కలిసి పని చేయాలని భూమాకు సూచన సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డేనని అధికార పార్టీ ప్రకటించింది. ఆ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఎన్నికల్లో కలిసి పనిచేయాలని భూమా నాగిరెడ్డికి మంత్రి సూచించారు. అంతేకాకుండా శిల్పాచక్రపాణిరెడ్డి కుమారుడి పెళ్లిపత్రికను భూమాకు ఇప్పించారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి బరిలో నిలిచారు. సోమవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇద్దరు పార్టీ అధ్యక్షుల మధ్య నెలకొన్న పోరులో అధికారపార్టీ అభ్యర్థికి కలిసికట్టుగా మద్దతిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పైకి నేతలు కలిసినా.. కిందిస్థాయిలో నేతలు కలిసే అవకాశం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సీటును ఆశించిన కేఈ ప్రభాకర్‌తో పాటు ఇతర అభ్యర్థులు కూడా శిల్పా ఎన్నిక పట్ల గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరు కూడా శిల్పాకు సహకరించే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. నిజంగా కలిసి పనిచేసేరా? వాస్తవానికి భూమా–శిల్పాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు నిన్నటివరకు ఫిర్యాదులు చేసుకున్నారు. భూమాకు మంత్రి పదవి ఇస్తే పార్టీలో ఉండేది లేదని నేరుగా అధిష్టానానికే ఖరాఖండిగా తేల్చిచెప్పారు. నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తే తాము స్వతంత్య్రంగానైనా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ స్థాయిలో బహిరంగంగా విభేదాలు నెలకొన్న ఈ రాజకీయ ప్రత్యర్థులు కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేస్తారంటే జిల్లాలో ఏ ఒక్కరూ నమ్మలేకపోతున్నారు. అంతేకాకుండా పైస్థాయిలో వాళ్లిద్దరూ చేయి కలిపితే తాము ఇన్ని రోజుల విభేదాలను మరచిపోయి ఎలా ఓటు వేస్తామని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ కోవలో నంద్యాల ఘటననే వారు ఉదాహరణగా పేర్కొంటున్నారు. మేమెలా ఓటు వేసేది...! నంద్యాల టీడీపీ వాట్సాప్ గ్రూపులో అసభ్యకర మెసేజ్ పంపారంటూ భూమా అనుచరుడు.. కౌన్సిలర్ గంగిశెట్టిపై శిల్పా వర్గీయులైన మిగతా సభ్యులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు కూడా పెట్టారు.ఆయనపై పార్టీ తగిన చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం మొత్తం శిల్పా సోదరులు దగ్గరుండీ నడిపించారని భూమా వర్గం భావిస్తోంది. అయితే, సున్నితమైన అంశం కావడంతో ఏమీ మాట్లాడకుండా కిమ్మనకుండా ఉండిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము శిల్పాకు ఎలా ఓటు వేస్తామని తమ అనుచరుల వద్ద వారు మాట్లాడుతున్నారు. తమ నాయకుడు వెళ్లి చేయి కలిపినంత మాత్రాన.. ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డ తాము ఎలా మర్చిపోగలమని వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శిల్పా ఓటమి కోసం ఆ పార్టీలోని నేతలే కృషి చేసే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. -
ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న ప్రయోగాత్మక ‘శిల్ప'o!
► నాలుగేళ్లుగా చెరకుతోపాటు వరి, కూరగాయ పంటల సాగు ►భూసారంతోపాటు ఏటేటా పెరుగుతున్న పంటల దిగుబడి, నికరాదాయం.. ►ఎకరానికి 2 టన్నుల సేంద్రియ బెల్లం, బెల్లం పొడి ఉత్పత్తి.. రూ. లక్ష వరకూ నికరాదాయం ►ప్రయోగాత్మకంగా బోదెలపై ఆరుతడి వరి, అంతర పంటగా మినుము సాగు.. ఆసక్తి, ఓర్పు ఉంటే ప్రకృతి సేద్యం యువ మహిళలకూ సుసాధ్యమేనని నిరూపిస్తున్నారు యువ మహిళా రైతు శిల్ప. పుస్తక పఠనం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో కలిగిన పరిచయం.. నాలుగేళ్ల అనుభవంతో పరిపుష్టమైంది. ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం, పంటల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులు ఆమెను మరింత ఉత్సాహపరుస్తున్నాయి. ప్రయోగాత్మకంగా బోదెలపై ఆరుతడి వరి సాగుకు శ్రీకారం చుట్టారు. సేంద్రియ బెల్లం, బెల్లంపొడి తయారీపై దృష్టి పెట్టారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏటేటా భూసారంతోపాటు దిగుబడి, నికరాదాయంతోపాటు సంతోషమూ ఇనుమడిస్తోందని భరోసాగా చెబుతున్నారు శిల్ప. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగిన రైతులకు శిక్షణ ఇస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారామె. కరవంటే అనంతపురం, అనంతపురం అంటే కరవు.. రెండూ వేరు వేరు కాదు... గుక్కెడు నీటికి కటకటలాడే చోటది. అలాంటి చోట వ్యవసాయానికి ఉపక్రమించటం ఎండమావిలో నీరు వెతకటమే. దానికి తోడు ఎలాంటి ఫలితాలిస్తాయో తెలియని కొత్త పద్ధతులను న మ్ముకోవటమంటే నేల వదిలి సాము చేయటమే. ఆ రెండు పనులను అత్యంత చాకచక్యంతో నిర్వహించి ఒంటిచేత్తో సాగు చేస్తూ... పచ్చ బంగారాన్ని తన పొత్తిళ్లలో పొదివిపట్టిన భూదేవి అనుపతి శిల్పా కాళేశ్వర్. అనంతపురం జిల్లా పెనుకొండ ఆమె స్వగ్రామం. ఎంబీఏ వరకు చదువుకున్న ఆమెకు వ్యవసాయం బొత్తిగా తెలియదు. సుభాష్ పాలేకర్ పుస్తకాల పఠనంతో ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా చూసి స్ఫూర్తిని పొందారు. తొలుత పెరటి తోటను సాగు చేసి.. సత్ఫలితాలు రావడంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం విశేషం. ప్రకృతి సేద్యంలో విభిన్న పద్ధతులను అనుసరిస్తూ కరువు సీమ రైతు లోకానికి మార్గదర్శిగా నిలుస్తున్నారావిడ. బోదెలపై ఆరుతడి వరి.... గత నాలుగేళ్లుగా శిల్ప ప్రకృతి సేద్యంలో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది బోదెలపైన వరిని సాగు చేసి అందరినీ అబ్బురపరిచారు శిల్ప. సాగు నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఈ ప్రయోగాత్మక పద్ధతికి శ్రీకారం చుట్టారు. పాకిస్థాన్ బాస్మతీ, లోయా, నవారా వరి రకాలను 30 సెంట్ల పొలంలో బోదెలపై సాగు చేశారు. ముందుగా పొలాన్ని దుక్కి దున్ని 50 సెం. మీ. ఎడం ఉండేలా బోదెలు చేసుకున్నారు. 21 రోజుల వయసున్న నారును బోదెలపై నాటించారు. 50 సెం. మీ. దూరంలో పాదుకో మొక్క చొప్పున నాటారు. సాధారణంగా 20 పిలకలు వస్తే ఎక్కువ.. కానీ ఈ మొక్కలకు 40–50 వరకు పిలకలు వచ్చాయి. ప్రతి 15 రోజులకోసారి 500 లీటర్ల జీవామృతాన్ని నీటితో కలిపి పారించేవారు. నాటిన 20 రోజులకు, పొట్ట దశలో నీమాస్త్రాన్ని.. గింజ దశలో పులిసిన మజ్జిగను పిచికారీ చేయటంతో ఎలాంటి చీడపీడలు పంటను ఆశించలేదు. అయితే, గింజ దశలో బోరు చెడిపోవడంతో దిగుబడి దెబ్బతిన్నదని, వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో బోదెలపై ఆరుతడి వరిని సాగు చేస్తామని శిల్ప తెలిపారు. రెండు వరి మొక్కల మధ్య అదే బోదెపై మినుము (ఉద్దులు)ను సాగు చేశారు. ఎకరాకు కిలో విత్తనాలు విత్తారు. ఇది 90 రోజుల పంట కావటంతో వరితో పాటే సాగు పూర్తయింది. ఊదల సాగుకు అదనంగా రూపాయి ఖర్చు కాలేదు. చెరకులో అంతరపంటలుగా పసుపు, కూరగాయలు.. నాలుగు ఎకరాల్లో చెరకును నాలుగేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కార్శి పంటగా చెరకుతో పాటు అంతర పంటలుగా పసుపు, ఉల్లితో పాటు వంగ, మిరప వంటి పంటలను శిల్ప సాగు చేస్తున్నారు. ఈ ఆరెకరాలకు రెయిన్ గన్ల ద్వారా నీటినందిస్తున్నారు. చెరకులో ఏటా ఎకరాకు మూడు ట్రక్కుల పశువుల ఎరువు, 3 క్వింటాళ్ల వేపపిండి దుక్కిలో వేస్తారు. ప్రతి 15 రోజులకోసారి జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. సాధారణంగా కార్శి పంటగా సాగు చేసే చెరకులో మూడేళ్ల తరువాత మళ్లీ కొత్త విత్తనం నాటుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తే 30–40 ఏళ్ల వరకు చెరకును కార్శి పంటగా సాగు చేయవచ్చని చెపుతున్నారు. దీని వల్ల రైతుకు వేల రూపాయల ఖర్చు ఆదా అవుతుంది. ముందుగా నిద్రావస్థను తొలగించేందుకు విత్తన పసుపు కొమ్మును నేలపై కుప్పగా వేస్తారు. విత్తనాన్ని వేపాకు, ఎర్ర మన్నుతో గాలి చొరబడకుండా కప్పి నెల రోజులు ఉంచుతారు. చెరకు కోత కోసిన 2–3 నెలల వ్యవధిలో చెరకు 3 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అప్పుడు చెరకు సాళ్ల మధ్యలో బోదెను ఏర్పాటు చేసి విత్తన పసుపును నాటుకుంటారు. చెరకులో అంతరపంటగా ఉల్లిని సాగు చేస్తున్నారు. బోదె పక్కన ఉలి ్ల నారును నాటుతారు. చెరకు కోతకొచ్చేసరికి అంతర పంటలు కూడా చేతికొస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా యాజమాన్య చర్యలు చేపట్టటం, ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రైతుకు అదనపు ఆదాయం లభించింది. కంచె పంటగా సాగు చేసే కందితో ఎకరాకు 2 క్వింటాళ్ల కందుల దిగుబడి వస్తోంది. ఎకరానికి 2 టన్నుల సేంద్రియ బెల్లం, బెల్లం పొడి.. చెరకును సొంతగా గానుగాడించి సేంద్రియ బెల్లాన్ని తయారు చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఎకరాకు చెరకు 2 టన్నుల వరకు బెల్లం లేదా బెల్లం పొడి దిగుబడి వస్తోంది. గానుగ ఆడించేందుకు రూ. 70 వేల వ్యయంతో క్రషింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. చెరకును క్రషర్లో వేస్తే రసం వస్తుంది. దీన్ని బాణలిలో పోసి బాగా మరగబెడతే పాకం తయారవుతుంది. వేడిమీదున్నప్పుడే దీన్ని రకరకాల అచ్చులలో పోసి వివిధ ఆకృతుల్లో బెల్లం దిమ్మలను తయారు చేస్తారు. కిలో రూ. 60 చొప్పున విక్రయిస్తున్నారు. అంతరపంటల ద్వారా ఎకరానికి రూ. 30 నుంచి 40 వేల వరకు ఆదాయం వస్తోంది. ఎకరానికి కనీసం రూ. లక్షకు తగ్గకుండా నికరాదాయం లభిస్తోంది. బెల్లం పొడిని కూడా తయారు చేస్తూ.. కిలో రూ. 150 చొప్పున విక్రయిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సాగు చేయటం, బెల్లం తయారీ ప్రక్రియలో ఎలాంటి రంగులనూ వాడటం లేదు. అందువల్ల ఈ బెల్లం మంచి రుచిగా ఉండటమే కాక ఆరోగ్యకరం కూడా. ఎక్కువ తీపి ఉండడం, ఏడాది కాలానికి Sపైగా నిల్వ ఉండటం సేంద్రియ బెల్లం ప్రత్యేకత. దీంతో ముందుగానే వ్యాపారుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. వీటిని విజయవాడ, హైదరాబాద్, బొంబాయి వంటి నగరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చెరకు ఇతర పంటల సాగు.. సేంద్రియ బెల్లం, బెల్లం పొడి తయారీలో ఆసక్తి కలిగిన రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తుండడం విశేషం. మరిన్ని వివరాలకు.. తిప్పన్న 94943 67890, చంద్ర 80192 44100లను సంప్రదించవచ్చు. – తలారి మల్లికార్జున, సాక్షి, పెనుకొండ, అనంతపురం జిల్లా ఇనుమడిస్తున్న సంతోషం! గతంలో వ్యవసాయం గురించి తెలియకపోయినా ప్రకృతి వ్యవసాయం నేర్చుకొని నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. మొదటి రెండేళ్లు చీడపీడలు కనిపించాయి. తర్వాత ఆ సమస్య లేదు. భూసారం ఏటేటా పెరుగుతోంది. పంట ఆరోగ్యంగా ఉంటున్నది. ఏటేటా దిగుబడితోపాటు నికరాదాయం పెరుగుతోంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేయడం వల్ల చోటుచేసుకుంటున్న ప్రకృతిపరమైన మార్పు మాకు బాగా తెలుస్తోంది. వానపాములు, పక్షులు, పిచ్చుకలు, కొంగలకు మా తోట ఆలవాలంగా మారింది. బెల్లం, బెల్లంపొడి ఎకరానికి రెండు టన్నుల వరకు వస్తోంది. ఎకరానికి రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు నికరాదాయం వస్తోంది. రాయలసీమలో రైతులు బోదెల పద్ధతిలో ఆరుతడి వరి సాగు చేసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయాన్ని ధైర్యంగా చేపడితే చక్కని దిగుబడి, ఆదాయం కూడా పొందవచ్చని రైతులు గ్రహించాలి. ఆసక్తి కలిగిన వారికి మా తోటలో శిక్షణ ఇస్తున్నాం.. – శిల్ప, ఆదర్శ యువ రైతు, పెనుకొండ, అనంతపురం జిల్లా -
బహిరంగ విమర్శలు మానుకోండి
– భూమా, శిల్పాల మధ్య రాజీకి అచ్చెన్న యత్నం – నాలుగు నియోజకవర్గాల్లో విభేదాలు వాస్తవమే కర్నూలు/నంద్యాల: పార్టీకి నష్టం కలిగించేలా బహిరంగ విమర్శలు మానుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, పార్టీ ఇన్చార్జి శిల్పా మోహన్‌రెడ్డిలకు జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. టీడీపీ జన చైతన్యయాత్ర కార్యక్రమాల్లో భాగంగా బేతంచెర్ల, పాణ్యం నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన ఆదివారం రాత్రి నగరంలోని మౌర్యా ఇన్‌లో బస చేశారు. సోమవారం ఉదయం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణి రెడ్డి, ఆయన సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు ఏవీ సుబ్బారెడ్డిని పిలిపించి రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు. పార్టీ మారినప్పటి నుంచి భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డిలు పరస్పరం దూషించుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఇరువురినీ పిలిపించి రాజీ చేసేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గీయులు బహిరంగ విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని నచ్చజెప్పినట్లు సమాచారం. ఇరువురి మధ్య సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని.. లేదా, ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై పరిష్కరించుకోవాలని సూచించారు. గోడదూకిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఉన్న మాట వాస్తవమేనని ఈ సందర్బంగా మీడియాతో ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు అంగీకరించారు. కోడుమూరు, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. ఆయా నియోజకవర్గాల్లో జనచైతన్య యాత్ర కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహించుకుంటున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకురాగా వాస్తవమేనని.. త్వరలో అవన్నీ పరిష్కారం అవుతాయన్నారు. -
సీఎంతోనే తేల్చుకుంటా
– వలస నేతతో సమన్వయంపై మాజీ మంత్రి శిల్పా నంద్యాల: పార్టీలో కొత్తగా చేరిన నేత, ఆయన వర్గీయులతో కలిసి పని చేసే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి, టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి చెప్పారు. స్థానిక శిల్పా సహకార్‌లో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కొత్తవారు చేరడంతో గందరగోళ పరిస్థితినెలకొందని, కార్యకర్తలు కలిసి పని చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆయనతో సమన్వయం కుదరకపోవడంతో మంత్రులు వద్ద కాకుండా నేరుగా చంద్రబాబునాయుడినే కలిసి చర్చిస్తానని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లలేకున్నాం: అధికార పార్టీలో రెండున్నర సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఎలాంటి పనులు చేయలేకపోయామని, ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నామని కౌన్సిలర్లు జాకీర్, అనిల్ అమృతరాజ్, మాజీ కౌన్సిలర్ పున్నాశేషయ్య అసంతృప్తిని వ్యక్తం చేశారు. జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఇచ్చినా ఇప్పటి వరకు మంజూరు కాలేదని, మళ్లీ జనచైతన్య యాత్రల పేరిట ప్రజల వద్దకు వెళ్లలేమని చెప్పారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పింఛన్లను రూ.200 పెంచడంతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారని, కాని టీడీపీ పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచినా ప్రజల్లో ఎలాంటి ఆదరణ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ దేశలం సులోచన, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ పీపీనాగిరెడ్డి, టౌన్ టీడీపీ అధ్యక్షుడు ఇషాక్, మండల టీడీపీ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, మాజీ చైర్మన్ కైపరాముడు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహిళ మృతి
రొద్దం: మండలంలోని సుబ్బరాయప్పకొట్టాలకు చెందిన వివాహిత శిల్ప(30) ఈనెల 5న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తీవ్రగాయాలతో అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు జమేదర్ గోవిందప్ప తెలిపారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం?
రొద్దం: రొద్దం మండలం సుబ్బరాయప్పగారి కొట్టాలకు చెందిన శిల్ప(30) అనే వివాహిత బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు బంధువులు తెలిపారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో భర్త ఇంట్లో ఉండగా ఈ ఘటన జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరుగుపొరుగు వారు వెంటనే ఆమెను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోవిందప్ప కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవాలు ఏమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
సిక్స్‌ప్యాక్... కాకతీయుడు
‘విద్య, వైద్య వ్యవస్థలను ప్రైవేటీకరించడం వల్ల మధ్యతరగతి వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? స్వార్థ రాజకీయ నాయకుల వల్ల సమస్యలేంటి?’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కాకతీయుడు’. తారకరత్న, శిల్ప, యామిని, రేవతి ప్రధాన పాత్రల్లో వి. సముద్ర దర్శకత్వంలో లగడపాటి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రంలో తార కరత్న తొలిసారి సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్ఆర్ శంకర్, కెమేరా: పి.సహదేవ్, సహ నిర్మాతలు: గుర్రం మహేశ్‌చౌదరి, గూడూర్ గోపాల్‌శెట్టి, పొందూరు కాంతారావు. -
చదివింపు
మంచి మార్కులతో పాస్ అవ్వాలంటేబాగా చదవాలి. మరి డాక్టర్ అవ్వాలంటే?చదివింపు తప్పేట్టులేదు!ఒక గుడి.. అక్కడో స్వామీజీ.. ఓ కొబ్బరికాయ..దాంట్లో పూలు!ఇంత మహిమ చూశాక‘చదివింపు’ తప్పుతుందా?ఈ చదివింపు ఏమిటో మీరూ చదవండి.జాగ్రత్త పడండి... జాగృతం అవండి. పూలెలా వచ్చాయి? కొబ్బరికాయకు మూడు కళ్లుంటాయి. అందులో ఒకటి మెత్తగా ఉంటుంది. మొలక వచ్చేది ఆ కన్ను నుంచే. పీచును తొలగించకుండా జాగ్రత్తగా సందు చేసి మెత్తని కన్నుకు రంధ్రం చేస్తారు. నీరంతా ఒంపేసి స్ట్రాతో సన్న మల్లెమొగ్గలను దూర్చి కర్పూరం అతికించి పీచును సరిచేస్తారు. అలాగే... రక్తం కూడా. పూలకు బదులు ఎర్ర రంగు నీటిని సిరంజితో ఇంజెక్ట్ చేస్తారు. ఈ కొబ్బరికాయలను పూజసామగ్రి అమ్మే వారి చేతనే అమ్మిస్తారు. కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది శిల్ప. ఉదయం పదిన్నరకు విద్యాశాఖ మంత్రి టెన్త్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు. ఆ ఫలితాల కోసమే ఆమె ఆందోళన. పరీక్ష బాగా రాశాననే నమ్మకం ఎంతగా ఉన్నప్పటికీ ఏదో మూల భయం. టీవీ పెట్టుకుని చూస్తోంది. ఎంతకీ పదిన్నర కావడం లేదు. ఒకచోట కూర్చోబుద్ధి కావడం లేదు. ఇంటి బయటకు వచ్చింది. ఇంతలో శిల్ప స్నేహితురాలు లలిత పరుగెత్తుకు వస్తోంది. అల్లంత దూరం నుంచే ‘శిల్పా! మన సైన్స్ మాస్టారు చెప్పారు... మనిద్దరం ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాం. సునీతకేమో సెకండ్ క్లాస్... ఇంకా..’’ అంటూ వగరుస్తూ జాబితా వల్లిస్తోంది. శిల్ప ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ‘‘నాన్నా! నన్ను డాక్టర్ చదివిస్తావు కదా!’’ అని గారంగా అడుగుతోంది. ముందెప్పుడో ఇచ్చిన మాటను తండ్రి ఎక్కడ తేలిగ్గా తీసుకుంటాడోనని, మరింత నిర్థారణ చేసుకునే ప్రయత్నం ఆ అమ్మాయిది. ‘‘శిల్పా! మాట తీసుకోవాల్సింది మీ నాన్న దగ్గర కాదు. మల్లోని చెన్రాయుని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టు. డాక్టర్ కావాలని ఆ దేవుణ్నే కోరుకో’’ అన్నది వాళ్లమ్మ సరస్వతి. మరుసటి రోజు ఉదయాన్నే తలంటుకుని శిల్ప, లలిత ఇద్దరూ ఊరికి కనుచూపు మేరలో కొండ మీద ఉన్న ఆలయానికి బయల్దేరారు. బాలికా.. ఇదేనా నీ కోరిక?! ఆలయం పరిసరాల్లో కొబ్బరికాయలు, కర్పూరం, అగరుబత్తీలు అమ్మేవాళ్లు వరుసగా కూర్చుని ఉన్నారు. కొబ్బరికాయలు కొన్ని ముదురు రంగులో కొన్ని తాజాగా లేతగా కనిపిస్తున్నాయి. ‘‘ఈ పెద్ద కాయ తీసుకోవే శిల్పా! డాక్టర్ కావాలనే నీ కోరిక పెద్దది కదా మరి’’ అంటూ ఆటపట్టించింది లలిత. ‘‘నీకు మంచి కాయ ఇస్తానుండు’’ అంటూ బుట్టలో అటు కదిలించి ఇటు కదిలించి ఓ కాయను ఇచ్చింది పూజ సామగ్రి అమ్మే ఆమె. ఆలయంలోకి వెళ్లగానే పూజారికంటే ముందే ఓ స్వామీజీ కనిపించాడు. ‘చెన్రాయునికి దణ్ణం పెట్టుకుని ఇక్కడ కూర్చోండి’ అంటూ వారిని అప్పటికే అక్కడ ఉన్న వారి పక్కన కూర్చోబెట్టాడు. వరుసలో శిల్ప వంతు రాగానే లేచి వెళ్లి, తాను తెచ్చిన పూజ సామగ్రిని స్వామీజీ ముందు పెట్టింది. ‘‘డాక్టర్ కావాలని ఉందా? నీ కోరిక నెరవేరుతుంది’’ అంటూ కళ్లు మూసుకుని టెంకాయను నుదుటి మీద ఆనించి మంత్రాలు చదివాడు. క్షణాల్లో స్వామీజీ ముఖం ప్రసన్నంగా మారిపోయింది. ప్రశాంతంగా కళ్లు తెరిచి శిల్పను ఆదరంగా చూశాడు. ‘‘ఈ టెంకాయను దేవుడి దగ్గర కొట్టు’’ అని ఇచ్చాడు. శిల్ప కొబ్బరికాయ కొట్టగానే... అక్కడున్న అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. కళ్లు ఇంతింత చేసుకుని చూశారు. టెంకాయ కొట్టగానే మల్లెపూలు జలజలారాలాయి! గమనించి, మైండ్ గేమ్ ఆడతారు! ఇది అనంతపురం జిల్లా, బుక్కపట్నం మండలం, మల్లోని చెన్రాయుని పల్లెలో జరిగింది. కొండ మీద చెన్రాయుని గుడి ఉండడంతో ఆ ఊరికి ఆ పేరే వచ్చింది. చెన్రాయుని గుళ్లో పూజారులు ఈ పని చేయరు. అక్కడికి దొంగ స్వాములు వస్తూ కొన్నాళ్లు ఉండి వెళ్లిపోతుంటారు. ఓ స్వామీజీ ఈ కొబ్బరికాయల తంత్రంతో జనాన్ని మోసం చేయసాగాడు. అతడి దగ్గరకు వచ్చే వాళ్లు కారులో వచ్చారా, ఖరీదైన దుస్తులు వేసుకున్నారా, ఒంటి మీద ఆభరణాలున్నాయా... వంటివన్నీ గమనిస్తారు. వచ్చిన వాళ్ల తాహతుకు తగ్గట్లు టోకరా వేసేవాడు. ముందుగా కొబ్బరికాయలో రక్తం చిందిస్తారు. లక్షలు గుంజిన తర్వాత పూలు తెప్పిస్తారు. బయటి ఊళ్ల వాళ్లకు జరిగినవి పెద్దగా బయటకు తెలిసేవి కాదు. అయితే శిల్ప విషయంలో... స్వామీజీ అత్యుత్సాహపడ్డట్లున్నాడు. మొదటి ప్రయత్నంలోనే పూలు తెప్పించి గొలుసు కాజేశాడు. టెంకాయలో పూలు తెప్పించి గొలుసు కాజేశాడనే సంగతి ఊరంతా పొక్కిపోయింది. మేము టెంకాయలు తీసుకెళ్లి పూలెలా తెప్పిస్తారో, రక్తం ఎలా తెప్పిస్తారో చేసి చూపించాం. తర్వాత ఊళ్లోని యువకులు సరదాగా ఈ ప్రయోగాలు చేసి నవ్వుకునేవారు. ఇప్పుడా ఊళ్లో ఎవరూ మంత్రాలు, తంత్రాలను నమ్మడం లేదు. - ఎస్. శంకర శివరావు, జెవివి జాతీయ మేజిక్ కమిటీ కన్వీనర్ పూలొచ్చాయి కదా.. ఆశ నెరవేరినట్లే... భక్తుల ఆశ్చర్య వదనాలను ఆనందంగా చూస్తున్నాడు స్వామీజీ. ‘‘నీ కోరికను స్వామి మన్నించాడు. నువ్వు డాక్టర్ అవుతావు’’ అని శిల్పతో చెప్పాడు. ఇదంతా చూస్తున్న ఒక భక్తురాలు ‘‘స్వామీ! పోయిన వారం నేను కొట్టిన కొబ్బరికాయ నుంచి రక్తం చిందింది. నాకు పూలెప్పుడు వస్తాయి?’’ ఆశగా అడిగింది. మరో మూడు వారాలకు మీ ఇంటిని పట్టిన పీడ తొలగిపోవాలి. ఐదో వారానికి నీ కొబ్బరికాయలోనూ పూలు రావచ్చు’’ సాలోచనగా చెప్పాడు స్వామీజీ. ఆమె గాల్లోకి చూస్తూ అంతా తమ దయ అని దండం పెట్టుకుంది. మిగిలిన భక్తులు వారి వారి వినతులు వెలిబుచ్చుతున్నారు. తాను వచ్చిన పని పూర్తి కావడంతో శిల్ప ఇంటికి వెళ్లడానికి లేచింది. ఆ పక్కనే ఉన్న స్వామి అనుచరులు ‘‘స్వామి వారికి దక్షిణ ఇవ్వాలి’’ అనడంతో హుండీలో వేయడానికి తన దగ్గరున్న డబ్బులు తీసింది. ‘‘స్వామి ఉన్న ఫళాన నీ కోరిక నెరవేరేటట్లు చేశారు. ఇంత చిన్న దక్షిణ ఇస్తావా?’’ అన్నారు. మా అమ్మ ఇచ్చిన డబ్బులో పూజ సామాను కొనగా ఇక నా దగ్గర ఇంతే ఉంది’’ అన్నదామె నిస్సహాయంగా. ‘‘నీ మెడలో బంగారు గొలుసుందిగా అమ్మా. నువ్వు డాక్టర్ అయితే ఇలాంటి గొలుసులు ఎన్నో కొనుక్కోవచ్చు. అసలు మీ అమ్మానాన్న అందరూ వారం వారం వస్తుంటే మీ ఇంటికి డబ్బు ఇబ్బడిముబ్బడిగా వచ్చి చేరుతుంది.’’ అని ఊదరగొట్టారు స్వామీజీ శిష్యులు. గత్యంతరం లేనట్లు, తాను చేస్తున్నది తప్పా, ఒప్పా అనే మీమాంసలోనే మెడలోని గొలుసు తీసి హుండీలో వేసి ఇంటి దారి పట్టింది శిల్ప. ఊరు నోరు తిరిచింది! ఇంటికెళ్లగానే శిల్ప మెడ బోసిగా ఉందని గుర్తించింది సరస్వతి. జరిగింది తెలుసుకున్నాక ఇంట్లో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలే ఆడపిల్ల. ఆ స్వామీజీ గొలుసుతో సరిపెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది... అనుకుని అంతటితో ఆ సంగతిని వదిలేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా తెలిసింది. తెలిసిన వాళ్లంతా వచ్చి పరామర్శిస్తున్నారు. జనవిజ్ఞానవేదిక కార్యకర్తలకూ తెలిసింది. వారొచ్చి ఇందులో తంత్రాలను తెలియచేయడంతో ఊరుఊరంతా స్పందించింది. స్వామీజీకి దేహశుద్ధి చేయాలన్నంత ఉద్రిక్తత ఏర్పడింది ఊరివాళ్లలో. ఇది తెలిసిన స్వామీజీ రాత్రికిరాత్రి పరారయ్యాడు. బంగారు గొలుసు తీసుకున్న చేతులకు ఇనుప గొలుసులు పడేలోపు అప్రమత్తమయ్యాడు స్వామీజీ. ఈ సంఘటనతో గ్రామం చైతన్యవంతమైంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అనాథ పిల్లల నేపథ్యంలో...
అనాథ పిల్లలకు సరైన గెడైన్స్ లేకపోతే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘వేటపాలెం’. ప్రశాంత్, శిల్ప, లావణ్య ప్రధాన పాత్రల్లో హని, ప్రణి ఫిలింస్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో డా. ఎ.వి.ఆర్ నటించి, నిర్మించారు. ఈ చిత్రం పాటల సీడీని బేబి శ్లోక ఆవిష్కరించి, దైవజ్ఞ శర్మకు ఇచ్చారు. ‘‘క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మనుసును తాకే సన్నివేశాలుంటాయి’’ అని దర్శక-నిర్మాతలు అన్నారు. ఎం.ఎం. రెడ్డి, సంగీత దర్శకుడు ఎ.ఆర్. సన్నీ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తంగిరాల అపర్ణ, సమర్పణ: మాస్టర్ అమరావతి సురోచన్. -
పోరు బాటలో...
పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారిన ఉచిత విద్యాపథకాలపై ఓ యువకుడు సాగించిన పోరు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కాకతీయుడు’. నందమూరి తారకరత్న, శిల్ప, యామిని జంటగా శ్రీ ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై లగడపాటి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ సముద్ర దర్శకుడు. ఎస్.ఆర్. శంకర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఇందులో డ్యుయెల్ రోల్ చేశానని తారకరత్న చెప్పారు. తారకరత్న బాగా నటించారని, డైలాగ్స్ చాలా బాగా చెప్పారనీ అని దర్శకుడు అన్నారు. సీనియర్ దర్శకుడు బి.గోపాల్, హీరో రాజశేఖర్, సంగీత దర్శకుడు ఎస్.ఆర్ శంకర్ తదితరలు పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
తిరుమలాయపాలెం : విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు సాం ఘిక సంక్షేమ హాస్టల్‌కు వచ్చిన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం హాస్టల్ నుంచి అదృశ్యమైన ఆ బాలిక హాస్టల్ ఆవరణలోని బావిలోనే మృతి చెంది ఉండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, స్థానిక విద్యార్థుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన బాణోత్ వీరన్న, మంగమ్మల మూడోకుమార్తె శిల్ప(13) మూడు సంవత్సరాలుగా ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న శిల్పను ఇటీవల హాస్టల్ ఎదురుగా ఉంటున్న కస్తూరి అనే మహిళ తన భర్తతో మాట్లాడుతున్నావంటూ తోటి విద్యార్థినుల ముందు అసభ్యకరంగా ధూషించింది. దీంతో మనస్తాపానికి గురైన శిల్ప తన తల్లిదండ్రులకు ఫోన్ చేస్తానని చెప్పి బయటకువచ్చి తిరిగి హాస్టల్‌కు వెళ్ల లేదు. దీంతో హాస్టల్ వార్డెన్ శశిరేఖ గ్రామంలో శిల్ప గురించి విచారించినా ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రుల వద్దకు కూడా చేరకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు విద్యార్థినిని ధూషించిన కస్తూరిని, ఆమె భర్త ఉపేందర్‌ను విచారించారు. ఈ క్రమంలో హాస్టల్ ఆవరణలోని బావి నుంచి దుర్వాసన వస్తుండడంతో సిబ్బంది వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ వెంకటనర్సయ్య, ఏఎస్డబ్ల్యూఓ యూసఫ్ అలీ, తహశీలాదర్ శివదాసు, ఎంపీడీఓ సన్యాసయ్య, ఎంపీపీ కొప్పుల అశోక్‌లు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్సై జాన్‌రెడ్డిలు విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు... హాస్టల్ నుంచి బయటకువెళ్లిన బాలికతిరిగి హా స్టల్‌లోకి ఎలావచ్చింది.. ఆదివారం ఉదయం విద్యార్థినులంతా హాస్టల్లో ఉండగా బావిలో దూకి ఎలా ఆత్మహత్యకు పాల్పడింది.. అనే విషయాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బావికి పైకప్పుగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసినప్పటికీ రెండువైపులా మనుషులు ప్రవేశించే విధంగా వదిలేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళన తమ కుమార్తె మృతి చెందిందనే సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. తండ్రి వీరన్న కుమార్తె మృతదేహం ఉన్న బావిలో దూకేందు కు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తో టి విద్యార్థులు కూడా హాస్టల్లో జరిగిన సంఘటనతో భయబ్రాంతులకు గురయ్యారు. తమ కుమార్తె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ తల్లిదండ్రులతో పాటు బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ ఎదుట బైఠాయించారు. తమ కుమార్తెను ఓ మహిళ కొట్టి, తిట్టిందనే విషయంపై హాస్టల్ అధికారులు తప్పుడు సమాచారం అందించారని ఆరోపించారు. హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మరణించిందని, రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ధర్నా చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమించాలని నచ్చజెప్పినా వినలేదు. దీంతో సోషల్ వెల్ఫేర్ డీడీ వెంకటనర్సయ్య ప్రభుత్వ పరంగా విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేసే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తెస్తామని, హాస్టల్ వార్డెన్‌తో పాటు వాచ్‌మెన్‌ను సస్పెండ్ చేస్తామని తెలిపారు. దీంతో వారు ఆందోళన విరమించారు. కాగా ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకపోవడంతో ఇంతకు ముందు నమోదు చేసి విద్యార్థిని అదృశ్యం కేసుతోనే పోలీసులు విచారణ చేపట్టారు. -
బుల్లెట్ రైలు నమూనా తయారు చేసిన శిల్ప
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి బుల్లెట్ రైలు నమూనాను తయారు చేసింది. హమీర్పూర్ జిల్లా సుదియల్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగది చదువుతున్న శిల్ప ఈ ఘనత సాధించింది. ఈ నమూనా జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లో ప్రదర్శకు ఎంపికకావడం విశేషం. అయస్కాంత సజాతి ధృవాల వికర్షణ సిద్ధాంతం ఆధారంగా శిల్ప ఈ నమూనాను రూపొందించింది. రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఎంపికైన ఈ నమూనాను అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయిలో ప్రదర్శించనున్నారు. తనకు వచ్చిన వినూత్న ఆలోచనలతో ఈ నమూనాను రూపొందించానని, సాంకేతికంగా మరింత అభివృద్ధి చేసేందుకు దృష్టిసారిస్తానని శిల్ప చెప్పింది. -
దర్యాప్తు మిస్సింగ్
అనంతపురం జిల్లా కేంద్రంలోని నారాయణరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న పెద్దన్నకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో ఒకరైన శిల్ప కర్నూలు దేవనగర్లోని నారాయణమ్మ వసతిగృహంలో ఉంటూ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. డిసెంబర్ 21, 2012న కాలేజీకి వెళ్లిన ఈ యువతి అదృశ్యమైంది. జనవరి 2, 2013న తల్లిదండ్రులు కర్నూలు మూడో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే కళాశాలలో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్న చిట్టిబాబుపై అనుమానం వ్యక్తం చేసినా.. ఇతను కానిస్టేబుల్ కుమారుడు కావడంతో దర్యాప్తును తొక్కిపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిల్ప తల్లిదండ్రులు నవంబర్ 11, 2013న ప్రజాదర్బార్‌లో జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వినిపించారు. ఇప్పటికీ ఆ కేసు మిస్టరీ వీడకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం. అదృశ్యం కేసుల్లో పోలీసుల అలసత్వానికి ఇదో ఉదాహరణ మాత్రమే. కర్నూలు, న్యూస్‌లైన్: మతిస్థిమితం సరిగా లేకపోవడం..చదువుపై అనాసక్తి.. ప్రేమించిన వారిని విడిచి ఉండలేకపోవడం.. కారణం ఏదైతేనే ఇంట్లో నుంచి వెళ్లిపోయేవారు ఇటీవల ఎక్కువయ్యారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లలో అదృశ్యం కేసులు నమోదవుతున్నాయి. అయితే వాటిని ఛేదించడంలో ఆ శాఖ సిబ్బంది ఉత్సాహం చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో గతేడాది 119 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 388 మంది మహిళలు తప్పిపోగా తిరిగి ఇళ్లకు చేరుకున్న సంఖ్య అంతంత మాత్రమే. కేసు నమోదు చేసుకుని పత్రికా ప్రకటన ఇవ్వడం తప్ప విచారణపై పోలీసులు ఆసక్తి చూపడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో వివాహితలు ఎక్కువగా కనిపించకుండా పోతున్నారు. పట్టణాల్లో ఉపాధి కల్పిస్తామని ఆశ పెట్టి కొందరు దళారులు వ్యభిచార కూపంలోకి మహిళలను నెడుతున్నారు. వివిధ కారణాల రీత్యా ఇంటి నుంచి బయటికి వెళ్లి అష్టకష్టాలు పడి కొద్ది మంది మాత్రమే కుటుంబ సభ్యుల శ్రమతో ఇంటికి చేరుతున్నారు. పోలీసులు విచారణ జరిపి తప్పిపోయిన వారిని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించిన కేసులు చాలా తక్కువ. ఇటీవలి కాలంలో విద్యార్థినులు ఎక్కువ సంఖ్యలో కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్ల నుంచి పరారీ అవుతున్నారు. గత నాలుగేళ్లలో 364 మంది ఆడపిల్లలు తప్పిపోగా 324 మంది తిరిగి ఇంటికి చేరుకున్నారు. 40 మంది బాలికలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆందోళనలతో పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.