
సాక్షి, హైదరాబాద్(మణికొండ): పలువురు మహిళల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఎక్కడ ఏమి కొనుగోలు చేశారు? మీ బినామీలు ఎవరు? మీ ఆర్థిక వివరాలన్నీ చెప్పాల్సిందే...ఇదీ కిట్టీ పార్టీలకు పిలిచి కోట్లు దండుకుని మోసం చేసిన శిల్పాచౌదరిపై పోలీసులు సంధిస్తున్న ప్రశ్నలు. అయితే ఆమె నుంచి సమాధానాలు రాలేదని, మౌనంగానే ఉండిపోతోందని తెలిసింది.
శిల్పాచౌదరిని మరోమారు శుక్రవారం కస్టడీకి తీసుకున్నారు. ఉదయం చంచల్‌గూడ జైలునుంచి ఆమెను పోలీసు వాహనంలో నార్సింగిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం ఎస్‌ఓటీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమెను ప్రశ్నించడంతో నిజాలను వెల్లడించేందుకు నిరాకరిస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: (శిల్పా చౌదరికి రూ.11కోట్లు ఇచ్చిన ఆ బాధితురాలెవరు..?)
Comments
Please login to add a commentAdd a comment