Police Custody
-
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీస్ కస్టడీ
-
లగచర్ల ఘటన.. పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీ విధించడంతో ఆయనను పోలీసులు విచారించనున్నారు. లగచర్ల దాడి కేసులో నరేందర్ రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.వివరాల ప్రకారం..లగచర్ల దాడి కేసులో విచారణ చేసేందుకు పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం, నరేందర్ రెడ్డిని రెండు రోజుల పోలీసు కస్టడీకీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం ఉదయం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్‌కు తరలించనున్నారు. అక్కడే రెండు రోజుల పాటు పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అయితే, న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం నరేందర్ రెడ్డి.. చర్లపల్లి జైలులో ఉన్నారు. -
కస్టడీ కాలం పెంచడం సబబేనా?
కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చట్టాలలో తెచ్చిన మార్పులు మంచివేనా? కొత్త చట్టాల వల్ల సమస్యలు తీరు తాయా? అనే ప్రశ్నలు న్యాయనిపుణులనే కాదు, సాధారణ పౌరులనూ వేధి స్తున్నాయి. అందుకే ఈ విషయాలపై లోతుగా పరిశోధించవలసిన అవసరం ఉంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ ఎస్ఎస్)లోని సెక్షన్ 187 కింద నిందితుల కస్టడీ కాలాన్ని పాత చట్టం అనుమతిస్తున్న దానికన్నా కొన్ని రెట్లు పెంచుతారు. అంటే నిందితులు ఎక్కువ కాలం కస్టడీలో ఉండాలి అని దర్యాప్తు అధికారి భావిస్తే కస్టడీ కాలం పెరుగుతుందని దీనర్థం. అంటే పోలీసులు నిందితుడి జీవితాన్ని సాధ్యమైనంత వరకు లాకప్‌కు పరిమితం చేయాలనుకుంటే చేయ వచ్చన్నమాట. మరో సమస్య ఏమంటే ఎక్కువ కాలం పోలీసు కస్టడీ తర్వాత... కోర్టు కస్టడీ మొద లవుతుంది. కోర్టు కస్టడీ అంటే పోలీసు కస్టడీ కన్నా గొప్పది, సహించగలిగినది అనుకోవలసిన పనిలేదు. లాకప్‌లో ఉంటే పోలీసులు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఆ తరువాత జైలు కస్టడీ ప్రారంభమయితే పోలీసు అధికారుల బదులు, జైలు అధికా రులు పెట్టే బాధలు కొనసాగుతాయి. దర్యాప్తు కోసం మొదట ఒక రోజన్నా పోలీసు కస్టడీలో ఉండి తీరాల్సిందే. అయితే కచ్చితంగా దర్యాప్తు 24 గంటల్లో పూర్తవ్వదు. లెక్కబెట్టి 24 గంటలు కాగానే ఇంటికి పంపిస్తారని దీనర్థం కాదు. అబద్ధపు ఆరోపణలను భరిస్తూ, అక్రమ నిర్బంధాన్ని అనుభవిస్తూ చట్ట వ్యతిరేకంగా పోలీస్‌లు అను కున్నంత కాలం లాకప్‌లో ఉండవల్సిందే. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం దర్యాప్తు సమయం లేక లాకప్‌లో ఉండే సమయం 40 రోజులు లేదా 60 రోజులకు పెరుగుతూ ఉంటుంది. అది గొప్ప సంస్క రణ అంటే... ఆలోచించాల్సిందే! చట్టం ప్రకారం 40 లేదా 60 రోజుల లాకప్ కస్టడీ తరువాత మరింత చట్ట వ్యతిరేక (అక్రమ) నిర్బంధం మొదలవుతుందన్న మాట. ఈ సంస్కరణ వల్ల పోలీసు అధికా రాలు విస్తారంగా పెరిగిపోయాయి. దీంతో అధికా రుల మధ్య నిందితుడు దిక్కులేని పక్షి అవుతాడు. దాని పర్యవసానం ఏమిటంటే మేజిస్ట్రేట్‌కి బెయిల్ ఇచ్చే అధికారం తగ్గిపోయింది. పోలీసులు నింది తుణ్ణి వదిలిపెట్టడం అనేది అతడి అదృష్టం తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చట్టం ప్రకారం కస్టడీకి ఎంతో కొంత పరిమితి ఉంటుంది. కాని, పోలీసుల అక్రమ కస్టడీలపై ఏ పరిమితీ ఉండదు. నిందితుల అదృష్టం, దేవుడి దయ! 15 రోజుల కస్టడీ మంచిదా కాదా అని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చర్చించింది. ఎట్టి పరిస్థితిలో 15 రోజులు కస్టడీ (లాకప్ లేదా జైల్ నిర్బంధం) దాట డానికి వీల్లేదని అనుపమ్ కులకర్ణీ వర్సెస్ సీబీఐ కేసుకు సంబంధించిన తీర్పులో అత్యున్నత న్యాయ స్థానం పేర్కొంది. ఇప్పుడు పార్లమెంట్‌లోని ఉభయ సభలు తెచ్చిన కొత్త నేర చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ తీర్పు ఇక ఎంతమాత్రం చెల్లనే రదు. ఇదన్నమాట సంస్కరణంటే. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులను ఎవ్వరూ చదవరు, అర్థం చేసుకోరు. పార్లమెంట్ సభ్యులు ఆ యా పార్టీల విప్ల ఆధారంగా చట్టసభల్లో ఓటింగ్‌లో పాల్గొని ఓటేస్తారు. ఇలా క్రిమినల్ చట్టాలు చేసుకుంటూ పోతే మరి పౌర హక్కుల మాటేమిటి? రాజ్యాంగానికి ఉన్న విలువెంత?బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 కింద అంత తీవ్రం కాని నేరాల పరిశోధనలో 40 రోజుల కస్టడీ సమయం ఉంటుంది. తీవ్రమైన నేరాల పరిశోధనకు 60 రోజుల సమయాన్ని ఇస్తున్నారు. 10 సంవత్స రాల జైలు శిక్ష విధించదగిన కేసులలో 40 రోజుల దర్యాప్తుకు అవకాశం ఇస్తారు. ఇంత కన్న తక్కువ శిక్షలు విధించే నేరాలకు ఇంతకు ముందు 15 రోజుల కస్టడీ ఉండేది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 167 కింద మొదటి కస్టడీ కాలం 15 రోజులతో మొదలయ్యేది. ప్రజాహిత స్నేహపూరిత సంస్కరణలంటే ఇవేనా? ఈ ప్రభుత్వం ప్రజల ప్రేమాభిమానాలను కోరుకునేదే అయితే... జనం లాకప్పులు, కోర్టు కస్టడీ కాలాన్ని పెంచడం ఎందుకు? ఇందులో సంస్కరణ ఏముంది? వికాస్ మిశ్రా వర్సెస్ సీబీఐ కేసులో అధికారులు లాకప్ లేదా కస్టడీ నిర్బంధ సమయం పెంచాలని కోరారు. లంచం ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ కస్టడీ పొడిగింపును కోరింది సీబీఐ. అప్పడికి ఏడురోజుల కస్టడీ పూర్తయింది. నిందితులు హాస్పిటల్‌కు రావలసి వచ్చింది. ఆ తరువాత బెయి ల్‌పై విడుదల చేశారు. సెంతల్ బాలాజీ కేసులో 15 రోజుల కస్టడీని విడి విడి భాగాలుగా మార్చుకోవచ్చు అని సుప్రీంకోర్టు వివరించింది. అప్పుడు ఈ లిటిగేషన్లు కొన సాగుతూ సుప్రీం కోర్టుదాకా పోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 40 నుంచి 60 రోజులు ఇచ్చే కస్టడీని మరింత దారుణంగా వాడుకుంటారనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల సుప్రీం కోర్టుదాకా లిటిగేషన్ నడుపుతూ ఉంటే 15, 40, 60 రోజులకు కస్టడీ పెంచుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఇదే రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రశ్నించాల్సి ఉంది.మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
మరికాసేపట్లో నార్సింగి పోలీస్ కస్టడిలో జానీ మాస్టర్
-
జానీ మాస్టర్ కి.. 4 రోజుల పోలీస్ కస్టడీ
-
జానీ మాస్టర్ కి 4 రోజుల పోలీస్ కస్టడీ
-
పోలీస్ కస్టడీకి జానీ
హైదరాబాద్, సాక్షి: లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. బుధవారం జానీ కస్టడీకి రంగారెడ్డి కోర్టు పోలీసులకు అనుమతించింది. దీంతో చర్లపల్లి జైల్లో ఉన్న జానీని.. నేటి నుంచి నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జానీ తన నేరాన్ని అంగీకరించారు. అయితే కస్టడీలో జానీ అఘాయిత్యాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. అంతకు ముందు.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ‘‘2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2020లో ముంబయిలోని హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16ఏళ్లు. నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు’’ అని రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. యువతి ఫిర్యాదు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన జానీని.. నాలుగు రోజుల తర్వాత గోవాలోని ఓ హోటల్లో తెలంగాణ ఓఎస్టీ అదుపులోకి తీసుకుంది. గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌కు తరలించింది. ఆపై ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
పోలీసుల అదుపులో ఆరెకపూడి గాంధీ
-
అస్సాంలో ఆ కిరాతకుడు మృతి
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మరణించాడు. నాగావ్ జిల్లాలోని ధింగ్ గ్రామంలో శనివారం ఉదయం అతడు చెరువులో దూకి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని శుక్రవారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు అతడికి బేడీలు వేసి, అత్యాచార ఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లారు. నిందితుడు హఠాత్తుగా పోలీసులపై దాడి చేసి తప్పించుకొని సమీపంలోని చెరువులో దూకాడని నాగావ్ జిల్లా ఎస్సీ చెప్పారు. చెరువులో రెండు గంటలపాటు గాలించి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి దాడిలో ఒక పోలీసుకు గాయాలయ్యాయని, అతడిని ఆసుపత్రిలో చేర్చామని వెల్లడించారు.మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని ఎస్పీ వెల్లడించారు. చెరువులో దూకి చనిపోయిన నిందితుడి అంత్యక్రియలను తమ గ్రామ ఖబ్రస్తాన్లో నిర్వహించడానికి వీల్లేదని అతడి సొంత గ్రామమైన బార్భేటి ప్రజలు తేలి్చచెప్పారు. అంతేకాకుండా అతడి కుటుంబానికి సామాజిక బహిష్కరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంత్యక్రియలకు ముందు జరిగే ప్రార్థనలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. పదో తరగతి చదువుతున్న బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు బంధించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు, హింసను సహించే ప్రసక్తే లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శనివారం తేలి్చచెప్పారు. మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ముంబై బీఎండబ్ల్యూ ఘటన.. మిహిర్ షాకు పోలీస్ కస్టడీ
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను జూలై 16 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు. దీంతో నేటి నుంచి ఏడు రోజులపాటు మిహిర్ షాను ముంబై పోలీసులు విచారించనున్నారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలను నిందితుడి నుంచి రాబట్టనున్నారు. అయితే మిహిర్ మొబైల్ ఇంకా రికవరీ కాలేదని పోలీసులు తెలిపారు.కాగా జులై 7న (ఆదివారం తెల్లవారుజామున) మద్యం మత్తులో మిహిర్ షా బీఎండబ్ల్యూ కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 45 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి మిహిర్ షా పరారీలో ఉన్నాడు. దాదాపు 72 గంటల తర్వాత నిందితుడిని విహార్‌లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడు తండ్రి, శివసేన నాయకుడు రాజేష్ షాను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక ప్రమాదం తర్వాత మిహిర్ తన ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను కారుతో గుద్ది చంపిన తర్వాత కారును విడిచిపెట్టి ఆటో ఎక్కి ఆమె ఇంటికి వెళ్లిన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవచ్చని పేర్కొన్నారు.చదవండి: ముంబై బీఎండబ్ల్యూ ఘటన... నిందితుడి తండ్రిపై శివసేన చర్యలు -
ఖాకీ కస్టడీలో హీరో
సినిమాలో కంటే నిజజీవితంలో జరిగే సంఘటనలే మరింత నాటకీయంగా ఉంటాయని మళ్లీ రుజువైంది. షూటింగ్లో ఉండగా ప్రముఖ నటున్ని పోలీసులు అరెస్టు చేయడం, తరువాత ఆయన సన్నిహితురాలిని కూడా నిర్బంధించడం సినీ ఫక్కీలో జరిగిపోయింది. గతంలో కుటుంబ కలహాలతో వార్తల్లోకెక్కిన దర్శన్ ఇప్పుడు హత్య కేసులో నిందితుడు అయ్యాడు.దొడ్డబళ్లాపురం: ఓ యువకుని హత్యకు సంబంధించి ప్రముఖ హీరో, చాలెంజింగ్ స్టార్ దర్శన్, మరో నటి, ఆయన సన్నిహితురాలు పవిత్రగౌడతో పాటు 10 మంది బౌన్సర్లను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రేణుకాస్వామి అనే యువకుని హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉందని కామాక్షిపాళ్య పోలీసులు మంగళవారం మైసూరులో దర్శన్‌ను అరెస్టు చేసి రాజధానికి తరలించారు. దర్శన్ అరెస్టు విషయం తెలుసుకున్న అభిమానులు కామాక్షిపాళ్య పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బాస్.. బాస్.. ది బాస్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ నగరలోని దర్శన్ నివాసంతో పాటు పలుచోట్ల పోలీసులు భద్రతను పెంచారు. పవిత్రపై అసభ్య మెసేజ్‌లు... పోలీసు కమిషనర్ బి.దయానంద చెప్పిన ప్రకారం... సోషల్ మీడియాలో పవిత్రగౌడ ఫోటోలపై రేణుకాస్వామి తరచూ అసభ్యంగా మెసేజ్‌లు పెట్టేవాడు. ఆమె దర్శన్‌కు చెప్పడంతో రేణుకాస్వామిని గుర్తించి పట్టుకుని జూన్ 8న రాత్రి కామాక్షిపాళ్య వద్ద ఉన్న దర్శన్ అనుచరుడు వినయ్‌కు చెందిన షెడ్లోకి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. అప్పుడు దర్శన్ అక్కడే ఉన్నారు. తరువాత మృతదేహాన్ని దగ్గరలో కాలువలోకి విసిరేశారు. జూన్ 9న సుమ్మనహళ్లి వద్ద ఉన్న రాజకాలువలో రేణుకాస్వామి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని రేణుకాస్వామిదిగా గుర్తించి విచారణ చేపట్టారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు డబ్బు గొడవలతో ఈ హత్య చేసినట్టు చెప్పుకుని పోలీసుల వద్ద లొంగిపోయారు. అయితే వారి వాంగ్మూలాలలో తేడా గమనించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించగా దర్శన్ పేరు చెప్పారు. చిత్రదుర్గ నుంచి ఇలా రప్పించారు చిత్రదుర్గలో కేఈబీ రిటైర్డ్ ఇంజినీర్ కాశినాథ్ శివనగౌడ, రత్నప్రభ దంపతుల కుమారుడు రేణుకాస్వామి. గత ఏడాది సహనా అనే యువతితో పెళ్లయింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణీ. అతడు కూడా దర్శన్‌కు అభిమాని. ఈ నేపథ్యంలో రేణుకాస్వామిని మాయమాటలతో బెంగళూరులో నిందితుల వద్దకు తీసుకువచ్చిన చిత్రదుర్గ దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రను కూడా పోలీసులు అరెస్టు చేసారు. గత శనివారం దర్శన్ పిలుస్తున్నాడని చెప్పి రేణుకాస్వామిని రాఘవేంద్ర బెంగళూరుకు తీసుకువెళ్లాడు. శనివారం మధ్యాహ్నం తల్లితండ్రులకు ఫోన్ చేసిన రేణుకాస్వామి తాను స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి వెళ్తున్నట్టు తెలిపాడు. ఆ తరువాత రేణుకాస్వామి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబసభ్యుల్లో భయం నెలకొంది. చిత్రదుర్గ చెళ్లకెరె గేట్ వద్ద బాలాజీ బార్ వద్ద బైక్ లభ్యమైంది. సోమవారం మధ్యాహ్నం కామాక్షిపాళ్య పోలీసులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కుమారుని హత్య వార్త తెలిసి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పలుచోట్ల భద్రత పెంపు పోలీసులు దర్శన్, పవిత్ర, ఇతర నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య బౌరింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపి తరువాత తమ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 మంది నిర్బంధంలో ఉన్నారు. దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేయలేదని, విచారణ కోసం మాత్రమే తీసుకెళ్లారని ఆయన లాయర్ నారాయణస్వామి మీడియాకు తెలిపారు. దర్శన్‌ను వెస్ట్ డీసీపీ గిరీశ్ విచారిస్తున్నారని తెలిపారు. మొత్తం ఈ వ్యవహారం రాష్ట్ర సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర సంచలనానికి కారణమైంది. పలువురు సెలబ్రిటీలు విస్మయం వ్యక్తంచేశారు.దర్శన్ ప్రమేయంపై విచారణ : హోంమంత్రిశివాజీనగర: ఓ హత్య కేసులో నటుడు దర్శన్ పాత్ర గురించి విచారణ జరుగుతోంది, ఆ తరువాతనే స్పష్టత వస్తుందని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం నగరంలో ఆయన మాట్లాడుతూ చిత్రదుర్గకు చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో దర్శన్ పేరు వినిపించింది. అందుచేత విచారణ కోసం ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందుగా అరెస్ట్ అయిన నిందితులు దర్శన్ పేరు చెప్పారు. ఏ కారణానికి హత్య జరిగింది? దర్శన్ పేరు ఎందుకు వచ్చింది అనేది దర్యాప్తు తరువాతనే స్పష్టమవుతుంది అని చెప్పారు. -
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.. ఈ మేరకు అశ్లీల వీడియో కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం ఆరురోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది.ఇక మైసూర్‌లోని కేఆర్ నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్డీ రేవణ్ణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సిట్ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రేవణ్ణ కస్టడీలోనే ఉండాలని, అందుకే బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును కోరింది. దీనిపై విచారణను హైకోర్టు జూన్ 3కి వాయిదా వేసింది.కాగా జర్మనీ నుంచి బయల్దేరిన ప్రజ్వల్ రేవణ్ణ.. గురువారంయ అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిన వెంటనే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను భారీభద్రత మధ్య విచారణ నిమిత్తం సీఐడీ కార్యాయానికి తరలించారు. శుక్రవారం ఉదయం రేవణ్ణకు బెంగళూరులోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజ్వల్‌ను సిటీ సివిల్ కోర్టుకు తరలించారు. అక్కడ అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి.. ప్రజ్వలను 14 రోజులపాటు తమ కస్టడికి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది.మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవణ్ణ 2014-19లో హాసన నుంచి జీడీఎస్ తరపున ఎంపీగా గెలుపొందారు. ఈ లోక్‌సభల్లోనూ ఎన్డీయూ కూటమి తరపున. హాసన నుంచి మళ్లీ ఎంపీగా బరిలోకి దిగారు. అయితే పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన ఆచూకి కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే కోరారు.ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న ‘సిట్’ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. -
బెంగళూరులో బిగ్ ట్విస్ట్.. ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు.చదవండి: ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్ రేవణ్ణSuspended #JDS leader #PrajwalRevanna Returns From #Germany, Arrested In Sex Crimes Case.#Hassan MP Prajwal Revanna - who fled to Germany last month, shortly after sex crimes allegations by women who said he forced them into sexual acts that were then filmed - was arrested just… pic.twitter.com/xvDR0Q8qBA— Hate Detector 🔍 (@HateDetectors) May 30, 2024 అక్కడ దిగిన వెంటనే ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్‌ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు.చదవండి: మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవణ్ణపలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయమం తెలిసిందే. దీంతో ప్రజ్వల్ గత ఏప్రిల్‌లో భారత్ విడిచి జర్మనీ పరారయ్యారు. ఇక.. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి.Nearly a month after JD(S) suspended #Hassan MP Prajwal Revanna lands at Kempegowda International Airport, #BengaluruSecurity was tightened at the airport.Revanna to face a probe by SIT, for allegedly assaulted several women and filmed.#PrajwalRevanna #Karnataka pic.twitter.com/L7VT5SPIkP— Surya Reddy (@jsuryareddy) May 30, 2024 అదేవిధంగా ప్రజ్వల్‌కు నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు కూడా చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే ప్రజ్వల్‌ను కోరిన విషయం తెలిసిందే.చదవండి: ప్రజ్వల్‌కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్యచదవండి: ప్రజ్వల్ రేవణ్ణకు తాత దేవెగౌడ వార్నింగ్.. వెంటనే భారత్‌కు రావాలి -
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు పోలీసు కస్టడీకి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసిన కేసులో ప్రధాన నిందితుడు (ఎ1) వేముల సతీష్ కుమార్‌ను గురువారం నుంచి మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్మేజిస్ట్రేట్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో సతీష్‌ను అతని తరపు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించారు.దీంతో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్‌ను గురువారం ఉదయం 10 గంటలకు కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్‌ను ప్రతి రోజూ ఉదయం 10 ఉంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని, విచారించనున్నారు. విచారణ అనంతరం రోజూ సాయంత్రం ఐదు గంటలకు తిరిగి సబ్ జైలులో అప్పగించాల్సి ఉంటుంది. సీఎం జగన్‌ను హతమార్చేందుకే దాడి మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 13వ తేదీన విజయవాడ సింగ్‌నగర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పదునైన కాంక్రీట్ రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీఎం జగన్‌కు ఎడమ కంటి పైభాగంలో బలమైన గాయమైంది. పక్కనే ఉన్న విజయవాడ సెంట్రల్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా బలమైన గాయమైంది. వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అదే ప్రాంతానికి చెందిన వేముల సతీష్‌కుమార్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో అతన్ని అరెస్ట్ చేసి ఈ నెల 18న న్యాయస్థానంలో హాజరుపర్చారు. సతీష్‌కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కొందరు టీడీపీ నాయకుల ప్రోద్బలంతో ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్‌ను హతమార్చేందుకే సతీష్ రాయితో దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. పాత్రధారులు, సూత్రధారుల గుర్తింపునకే..కొందరు టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే సీఎం జగన్‌పై తాను ముందస్తుగా సేకరించిన కాంక్రీట్ రాయితో దాడి చేశానని పోలీసుల ప్రాధమిక విచారణలో నిందితుడు సతీష్ అంగీకరించినట్లు సమాచారం. దీని అధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవరో సరిగా తేలక పోవడంతో ఈ కేసు అసంపూర్తిగానే ఉంది.కేసును మరింత సమగ్రంగా, లోతుగా దర్యాప్తు చేసి, వాస్తవాలను వెలికి తీయాల్సి ఉంది. మరికొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించాల్సి ఉంది. ఇవే విషయాలను పేర్కొంటూ నిందితుడిని ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం నిందితుడిని మూడు రోజులు పోలీస్ కస్టడికి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
కిడ్నాప్ చేసి.. బెదిరించి
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై అరెస్టయిన హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైంది. క్రియా హెల్త్‌కేర్ వివాదంలో తలదూర్చి దాని డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటిని కిడ్నాప్ చేసి, షేర్లు, యాజమాన్య బదిలీ చేయించడంతో పాటు రూ.10 లక్షలు వసూలు చేసిన ఆరోపణలపై దీన్ని రిజిస్టర్ చేశారు. ఈ కేసులో ఇన్స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్.మల్లికార్జున్ సైతం నిందితులుగా ఉన్నారు. ఇది సోమవారమే రిజిస్టర్ కాగా... బుధ వారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రాధాకిషన్‌రావుపై కూకట్పల్లి ఠాణాలో బెదిరింపుల కేసు నమోదైన విషయం విదితమే. మరోపక్క అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. వారం రోజుల పాటు ఆయ న్ను వివిధ కోణాల్లో ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. వ్యాపారవేత్త వేణును ఎలా ట్రాప్ చేశారంటే.. నగరానికి చెందిన వేణుమాధవ్ చెన్నుపాటి ప్రపంచ బ్యాంక్‌లో కొన్నాళ్లు పని చేసిన తర్వాత 2008లో తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్‌కేర్ సంస్థను స్థాపించారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 165 పట్టణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, టెలి మెడిసిన్ సౌకర్యాలు, అత్యవసర వాహనాలతో సహా ప్రధాన ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహించేది. 2016 నాటికి క్రియా హెల్త్‌కేర్ మూడు ప్రధాన ప్రాజెక్ట్‌లను చేజి క్కించుకుని ఐదేళ్లల్లో తమ ప్రాజెక్టు విలువను రూ.250 కోట్లకు పెంచుకుంది. ఇది జరిగిన కొన్నాళ్లకు గోపాల్, రాజ్, నవీన్, రవి క్రియాలో పార్ట్ టైమ్ డైరెక్టర్లుగా చేరారు. 2015లో బాలాజీ ఈ సంస్థకు సీఈఓగా నియమితులయ్యారు. 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి క్రియా హెల్త్‌కేర్‌లో ఆరుగురు డైరెక్టర్లు ఉండగా... వేణు 60, బాలాజీ 20, గోపాల్ 10, రాజ్ 10 శాతం చొప్పున షేర్లు కలిగి ఉన్నారు. వీరిలో వేణు, బాలాజీ మాత్రమే ఫుల్‌టైమ్ డైరెక్టర్లు. 2018లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాన్ ఎమర్జెన్సీ మొబైల్ హెల్త్‌కేర్ క్లినిక్‌ల ఏర్పాటుకు బిడ్డింగ్‌కు పిలిచింది. అందులో పాల్గొన్న క్రియా హెల్త్‌కేర్ 1500 మొబైల్ అంబులెన్స్ హెల్త్ క్లినిక్‌లను నడిపే ప్రాజెక్టును తీసుకునే ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ పార్ట్‌టైమ్ డైరెక్టర్లు నలుగురూ వేణుకు ఉన్న 60 శాతం షేర్లను తక్కువ విలువకు విక్రయించాలని పట్టుబట్టారు. సీఈఓ బాలాజీని కూడా వారి వైపు తిప్పుకున్నారు. రాధాకిషన్‌రావు తనదైన శైలిలో బెదిరించి.. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్బలంతో అప్పటి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన క్రియా హెల్త్‌కేర్ కంపెనీలోని షేర్లు, యాజమాన్యం వదులుకోవాలని హెచ్చరించారు. రాధాకిషన్‌రావుతో పాటు ఇతర నిందితుల సమక్షంలో నాటకీయ పరిణామాల మధ్య తుపాకులు, కర్రలతో బెదిరించడంతో గత్యంతరం లేక వేణు సెటిల్మెంట్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి వచ్చింది. వేణు నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి గట్టుమల్లు, మల్లికార్జున్‌తో కూడిన బృందం ఈ విషయాన్ని పోలీసులు, మీడియా, కోర్టుల్లో ఎవరి దృష్టికి తీసుకువెళ్లినా ప్రాణహాని ఉంటుందని హెచ్చరించి పంపింది. తాజా పరిణామాలతో ధైర్యం తెచ్చుకుని ఫిర్యాదు ప్రాణభయంతో ఇన్నాళ్లు మిన్నకుండిపోయిన వేణుమాధవ్‌కు ఇటీవల రాధాకిషన్‌రావు అరెస్టు విషయం తెలిసి ధైర్యంగా ముందుకు వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు రాధాకిషన్‌రావు, చంద్రశేఖర్ వేగే, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ తదితరులపై ఐపీసీలోని 386, 365, 341, 120 (బీ), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రాధాకిషన్‌రావుపై కోర్టు ద్వారా పీటీ వారెంట్ తీసుకుని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గట్టుమల్లు రాచకొండ ఐటీ సెల్లో, మల్లికార్జున్ ఎస్ఐబీలో ఇన్స్పెక్టర్లుగా పని చేస్తున్నారు. మల్లికార్జున్ సుదీర్ఘకాలం వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్‌లో ఎస్సైగా పని చేశారు. పదోన్నతి తర్వాత రాధాకిషన్‌రావు సిఫార్సుతోనే ప్రభాకర్‌రావు ఎస్ఐబీలోకి తీసుకున్నారు. రూ.40కోట్ల షేర్లను రూ.40 లక్షలకే బదిలీ చేయించుకుని .. ♦ ఇదిలా ఉండగా.. గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేగే చంద్రశేఖర్ తన కంపెనీలో పెట్టుబడి కోసం 2018 మార్చిలో వేణుమాధవ్‌ను సంప్రదించారు. ఆ సందర్భంలోనే క్రియా హెల్త్‌కేర్ వివాదాలు తెలుసుకుని, పార్ట్‌టైమ్ డైరెక్టర్లతో మాట్లాడి విషయం సెటిల్ చేస్తానని చెప్పారు. ఇలా మార్కెట్లో రూ.40 కోట్ల విలువైన షేర్లను కేవలం రూ.40 లక్షలకే వేణు నుంచి బదిలీ చేయించుకున్నారు. నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్లతో అతడు మరో రహస్య ఒప్పందం కేసుకుని తనను మోసం చేసినట్లు వేణుకు తర్వాత తెలిసింది. వేణు మాధవ్ తన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్ 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రాజెక్టు ప్రారంభించడానికి గడువు సమీపిస్తుండటంతో 2018 నవంబర్‌లో చంద్రశేఖర్ వేగే, గోపాల్, రాజ్ తలసిల, నవీన్, రవి అప్పటి టాస్‌్కఫోర్స్ డీసీపీ పి.రాధా కిషన్ రావును ఆశ్రయించారు. కంపెనీకి సంబంధించిన మిగిలిన షేర్లనూ తమకు ఇప్పించమని వీళ్లు కోరా రు. దీంతో రాధాకిషన్‌రావు, అప్పటి టాస్్క ఫోర్స్ ఎస్సై మల్లికార్జున్ అదే నెల 22న ఉద యం 5.30 గంటలకు వేణును తమ సిబ్బందితో కలిసి కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. -
కస్టడీలో రాధాకిషన్.. కీలక విషయాలు వెల్లడించిన వెస్ట్ జోన్ డీసీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. రాధాకిషన్ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఐబిలో హార్డ్ డిస్క్‌ల ధ్వంసం కేసులో కుట్రదారులుగా రాధాకిషన్ ఉన్నారని, కొంతమంది ప్రముఖుల ప్రొఫైల్స్ అనధికారకంగా తయారుచేసి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ‘‘ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ప్రొఫైల్స్‌ని తయారు చేశాడు. బెదిరింపులకు పాల్పడి ఒక పార్టీకి డబ్బులు చేరే విధంగా చేశాడు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయించాడు. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసిన ప్రణీతరావుకి రాధాకృష్ణ సహకరించాడు. ప్రొఫైల్స్ సంబంధించిన వ్యవహారాలు బయటి రాకుండా ఉండేందుకే ఆధారాలను ధ్వంసం చేశాడు. కోర్టు అనుమతితో రాధాకృష్ణ రావు ని తిరిగి కస్టడీలోకి తీసుకున్నాం. పదో తేదీ వరకు టాస్క్ ఫోర్స్ రాధా కిషన్‌ను విచారిస్తామని డీసీపీ వెల్లడించారు. కాగా, ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు ఒప్పుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు మేరకు ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌లోని సిబ్బందిని బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బులను సరఫరా చేసినట్లు అంగీకరించారు. టాస్క్‌ఫోర్స్ బృందానికి వాహనాలు సమకూర్చినట్లు ఒప్పుకున్నారు. ఓ ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి డబ్బులు తరలించినట్లు పేర్కొన్నారు. 2023లో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, సిబ్బంది డబ్బుల పట్టుకోవడంలో కీలక పాత్ర వహించినట్లు వెల్లడించారు. 8 సార్లు పట్టుకున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదేనని చెప్పారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలులో ... -
Phone tapping Case: రాధాకిషన్‌రావుకు జ్యుడీషియల్ రిమాండ్
సాక్షి, హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసులు గురువారం ఉదయం రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్న విషయం తెలి సిందే. అప్పటి నుంచి రాత్రి వరకు ఆయన్ను బంజారాహిల్స్ ఠాణాలో సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను శుక్రవారం ఉదయం వీరిని చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పంజగుట్ట పోలీ సులు వైద్యపరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు పోలీసులు ఈ ముగ్గురినీ కలిపి, విడివిడిగా విచారించారు. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్‌తో పాటు అక్రమ వసూళ్ల కోణంలోనూ ప్రశ్నించారు. ఆపై రాధాకిషన్ రావును గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కొంపల్లికి తీసుకు వెళ్లారు. తదుపరి విచారణ నిమిత్తం రాధాకిషన్ రావును పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. దీనికోసం అనుమతి కోరుతూ శనివారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ప్రభాకర్‌రావుతో లింకులు, వసూళ్ల కోణంలో... సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. ఏసీబీ కేసుకు రంగం సిద్ధం రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేక ల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టా రని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు.వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివా దాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తో ంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోప ణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియో గాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కార ణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. నగదు రవాణా చేసినట్టూ అంగీకరించారు.. పంజగుట్ట ఠాణాలో నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించాం. ఆయన తాను చేసిన నేరాలను అంగీకరించారు. చట్టవిరుద్ధంగా, తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేయడం, కుట్రపూరితంగా అనధికారికంగా ఆ వ్యక్తులపై నిఘా ఉంచడం చేసినట్టు బయటపెట్టారు. రాజకీయంగా పక్షపాతంతో వ్యవహరించడంతోపాటు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలో తాము అక్రమంగా డబ్బు రవాణా చేయడానికి అధికారిక వనరులను వినియోగించామని అంగీకరించారు. ఇతర నిందితులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మరియు సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారు. – ఎస్ఎం.విజయ్‌కుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ -
Parliament security breach: ఆత్మాహుతికి ప్లాన్ వేశారు!
న్యూఢిల్లీ: లోక్‌సభలో అలజడి సృష్టించిన నిందితులు తొలుత సులువుగా మంటలంటుకునే జెల్ వంటిది ఒంటినిండా పూసుకుని తమను తాము తగలబెట్టుకుందామని అనుకున్నారట. పార్లమెంటు లోపలికి చొచ్చుకెళ్లి సభ్యులందరికీ అందేలా కరపత్రాలు విసిరితే ఎలా ఉంటుందని కూడా ఆలోచించారట. ‘‘తమ నిరసనను, తాము ఇవ్వదలచిన సందేశాన్ని వీలైనంత ప్రభావవంతంగా ప్రభుత్వానికి, ప్రజలకు చేర్చేందుకు ఇలాంటి పలు అవకాశాలను పరిశీలించారు. చివరికి లోక్‌సభలోకి దూకి పొగ గొట్టాలు విసిరి అలజడి సృష్టించాలని నిర్ణయించుకుని అమలు చేశారు’’అని నిందితులను విచారిస్తున్న పోలీసు బృందంలోని అధికారి ఒకరు వెల్లడించారు. గత బుధవారం లోక్‌సభ లోపల, బయట పొగ గొట్టాలు విసిరిన కలకలం రేపిన సాగర్ శర్మ, డి.మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ప్రధాన నిందితుడు లలిత్ ఝాలను పోలీసు ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం విచారిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్‌సభ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్‌సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్ రీ కన్స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. లలిత్‌కు సహకరించిన మహేశ్ కుమావత్, కైలాశ్‌లకు క్లీన్చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. లలిత్‌ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్‌లో తలదాచుకున్న నగౌర్‌కు కూడా తీసుకెళ్లనున్నారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించనున్నారు. పార్లమెంటు భద్రతపై సమీక్షకు కమిటీ: స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటు భద్రతపై తాను కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించినట్టు లోక్‌సభ స్పీకర్ ప్రకటించారు. ఇలాంటి భద్రతా వైఫల్యాలు పునరావృతం కాకుండా అన్ని అంశాలను సమగ్రంగా సమీక్షించి దాన్ని కట్టుదిట్టం చేసేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను కమిటీ సూచిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభ సభ్యులకు ఆయన లేఖ రాశారు. దీనిపై కేంద్ర హోం శాఖ నియమించిన విచారణ కమిటీ నివేదికను కూడా సభ ముందుంచుతామని తెలిపారు. ఇల్లు వదిలి వెళ్లకండి మైసూరు: పార్లమెంటులో అలజడి సృష్టించిన కేసులో నిందితుడు మనోరంజన్ కుటుంబ సభ్యులెవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని కేంద్ర నిఘా విభాగం అధికారులు ఆదేశించారు. మైసూరు విజయనగరలోని మనోరంజన్ ఇంటిని నిఘా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి విప్లవ సాహిత్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. మనోరంజన్ కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లవద్దని ఆదేశించారు. అత్యçవసర పరిస్థితి వస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. బంధువులు, ఇతరులెవరూ ఆ ఇంటికి వెళ్లరాదని, ఎవరైనా ఫోన్లు చేస్తే సంబంధిత వివరాలను అందజేయాలని సూచించారు. మహేశ్‌కు ఏడు రోజుల కస్టడీ ఈ కేసులో అరెస్టయిన ఆరో నిందితుడు మహేశ్ కుమావత్‌ను ఢిల్లీ కోర్టు శనివారం ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. అతడు కనీసం రెండేళ్లుగా ఈ కుట్రలో నిందితులకు సహకరిస్తున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీన్ని పూర్తిగా ఛేదించాలంటే అతన్ని లోతుగా విచారించాల్సి ఉందన్నారు. దాంతో ప్రత్యేక జడ్జి హర్దీప్ కౌర్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. సాక్ష్యాలను ధ్వంసం చేయడం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై మహేశ్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత్‌తో పాటు అతను తనంత తానుగా లొంగిపోవడం తెలిసిందే. -
అంబానీకి బెదిరింపుల కేసులో ఇద్దరి అరెస్ట్
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన వ్యవహారంలో తెలంగాణ, గుజరాత్‌లకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఎనిమిది రోజుల వ్యవధిలో అంబానీకి చెందిన సంస్థకు మూడు ఈమెయిళ్లు అందాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ మొదటి మెయిల్ పంపారు. తమ వద్ద మంచి షూటర్లు ఉన్నట్లు అందులో బెదిరించారు. ఆతర్వాత మరో మెయిల్లో రూ.200 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. సోమవారం పంపిన మెయిల్లో రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ఉంది. వీటిపై అంబానీ భద్రతా అధికారి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు తెలంగాణలోని వరంగల్‌కు చెందిన గణేశ్ రమేశ్ వనపర్తి(19) కాగా, మరొకరు గుజరాత్‌కు చెందిన షాదాబ్ ఖాన్(21). శనివారం గణేశ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. షాదాబ్ ఖాన్ ఉన్నతవిద్యా వంతుడని పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మహ్సా అమినికి
స్ట్రాస్‌బర్గ్(ఫ్రాన్సు): గత ఏడాది ఇరాన్ పోలీస్ కస్టడీలో మృతి చెందిన కుర్దిష్–ఇరాన్ మహిళ మహ్సా అమిని(22)కి యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం ప్రకటించింది. మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సఖరోవ్ పురస్కారాన్ని యూరోపియన్ యూనియన్ ఏటా ప్రకటిస్తోంది. డిసెంబర్ 13న జరిగే కార్యక్రమంలో మహ్సా అమిని కుటుంబీకులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. హిజాబ్ ధరించలేదనే కారణంతో మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె గత ఏడాది సెప్టెంబర్ 16న మృతి చెందారు. ఇది ప్రభుత్వ హత్యేనంటూ దేశవ్యాప్తంగా కొన్ని నెలలపాటు తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వం వాటిని బలప్రయోగంతో అణచివేసింది. గత ఏడాది సఖరోవ్ పురస్కారాన్ని రష్యా దురాక్రమ ణను ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ పౌరులకు ప్రకటించారు. ఈ అవార్డును ఒకప్పటి సోవియెట్ యూనియన్ అసమ్మతి వాది ఆండ్రీ సఖరోవ్ పేరిట 1988లో నెలకొల్పారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సఖరోవ్ 1989లో మరణించారు -
చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్
ఢిల్లీ: ఊపా(చట్టవ్యతిరేక కార్యకలాపాల నిషేధిత) చట్టం కింద అరెస్టైన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలకు న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్ విధించింది. న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ పోలీసులు వీరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 37 మంది అనుమానిత జర్నలిస్టులను విచారించారు. తొమ్మిది మంది మహిళా జర్నలిస్టులను కూడా ప్రశ్నించారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్, ప్రబీర్ పుర్కాయస్థ, రచయితలు పరంజోయ్ గుహా ఠాకుర్తా, ఊర్మిళేష్లను దర్యాప్తులో భాగంగా దేశ రాజధానిలోని ప్రత్యేక సెల్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. అనంతరం న్యూస్క్లీక్తో సంబంధాలు ఉన్న జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేశారు. ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్స్‌తో సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 30 స్థావరాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. చైనా నిధులు.. న్యూస్‌క్లిక్ సంస్థకు ప్రముఖ అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ ఆగష్టు 10న ఓ కథనం వెలువరించింది. సోషలిస్టు భావాలను ప్రచారం చేయడం, తద్వారా చైనా అనుకూల వార్తలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం వారి ప్రధాన ఉద్దేశమని న్యూయార్క్ పోస్టు ప్రచురించింది. ఈ నెట్‌వర్క్‌లో భాగంగానే న్యూస్‌క్లిక్ సంస్థకు కూడా నిధులు అందుతున్నాయని స్పష్టం చేసింది. సింఘమ్‌కు చైనా ప్రభుత్వంతో సన్నిహత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. దీని ఆధారంగా ఆగష్టు 17న న్యూస్‌క్లిక్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే మంగళవారం సోదాలు నిర్వహించి చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు. భారీగా విదేశీ నిధులు న్యూస్ క్లిక్ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల విదేశీ నిధులను మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ద్వారా రూ. 9.59 కోట్లు, సేవల ఎగుమతి ద్వారా రూ. 28.46 కోట్లు విదేశీ రెమిటెన్స్ వచ్చినట్లు గుర్తించినట్లు తేలింది. అలా వచ్చిన నిధులను గౌతమ్ నవ్లాఖా, హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహా పలువురు వివాదాస్పద జర్నలిస్టులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. ఢిల్లీలో న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు -
Haryana Communal Clashes: 102 ఎఫ్ఐఆర్లు...200 మంది అరెస్ట్
చండీగఢ్: హరియాణాలో ఇటీవలి మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 202 మందిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ శుక్రవారం తెలిపారు. ముందు జాగ్రత్తగా మరో 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఘర్షణలపై 102 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో సగం వరకు నూహ్ జిల్లాలోని వన్నారు. మిగతావి గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాల్లో నమోదయ్యాయన్నారు. ఘర్షణలకు కారకులైన వారిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి చెప్పారు. పోలీస్స్టేషన్లపై జరిగిన దాడులకు కారకులను గుర్తించే పని మొదలయ్యిందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనలను ఇళ్ల వద్దే చేసుకోవాలని యంత్రాంగం ప్రజలకు సూచించిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీని వేశామని చెప్పారు. 250 గుడిసెలు కూల్చివేత టౌరు పట్టణంలోని ప్రభుత్వ జాగాలో నిర్మించుకున్న 250కి పైగా గుడిసెలను నూహ్ జిల్లా యంత్రాంగం శుక్రవారం కూల్చివేసింది. హరియాణా షహరి వికాస్ ప్రాధికారణ్(హెచ్‌ఎస్‌వీపీ)కి చెందిన ఎకరం భూమిలో బంగ్లాదేశీ వలసదారులు అక్రమంగా వీటిని నిర్మించుకున్నారని నూహ్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వర్ చెప్పారు. వీరంతా గతంలో అస్సాంలో నివసించారని చెప్పారు. ఇటీవలి మత ఘర్షణలకు తాజాగా గుడిసెల కూల్చివేతకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపులో భాగంగానే ఈ గుడిసెలను కూల్చివేసినట్లు వివరించారు. -
పోలీసుల అదుపులో చీకోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బంది
-
డ్రగ్స్ కేసు అప్డేట్.. నిర్మాత కేపీ చౌదరిని..!?
డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరీ కస్టడీ పూర్తయింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు రెండు రోజుల పాటు విచారించారు. రంగారెడ్డి కోర్టులో శుక్రవారం హాజరు పరచునున్నారు. కొన్నిరోజుల ముందు అంటే జూన్ 14న డ్రగ్స్ కేసులో 'కబాలి' ఫేమ్ నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియన్ గాబ్రీయల్ డ్రగ్స్ పెడ్లర్ రాకేష్ రోషన్ లతో కేపీ చౌదరికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. గోవా, హైదరాబాద్ పార్టీలో పాల్గొన్న వారి వివరాలు కస్టడీలో ఉన్న నిర్మాత దగ్గర నుంచి సేకరించారు. పలువురు సినీ తారలతో డ్రగ్స్ లింకులపై పోలీసులు ఆరా తీయడంతో పాటు డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలపైనా కేపీ చౌదరిని పోలీసులు ప్రశ్నించారు. మొబైల్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ లాంటివి ఇతడి ముందుంచి మరీ ప్రశ్నించారు. ఇది పూర్తయిన తర్వాత కేపీ చౌదరి కార్లు అన్నింటినీ సీజ్ చేశారు. (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) -
Drugs Case: పోలీసు కస్టడీకి కేపీ చౌదరి.. సినిమా వాళ్లతో లింకులు ఉన్నాయా?
డ్రగ్స్ రాకెట్లో ఇటీవల అరెస్ట్ అయిన సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్‌ను రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు కేపీ చౌదరిని చర్లపల్లి జైలు నుంచి రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు..తమదైన శైలీలో విచారణ చేస్తున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తరలిస్తుండగా కేపీ చౌదరి పోలీసులుకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. వారం రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు.. రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు ఈరోజు కేపీ చౌదరిని చర్లపల్లి జైలు నుంచి రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. (చదవండి: ఆ ఫోటోలు నావి కావు. . నాకు ట్వీటర్ ఖాతానే లేదు: జయవాణి) సినీ ప్రముఖులతో కేపీ చౌదరికి ఏమైనా లింకులు ఉన్నాయా? డ్రగ్స్‌ని ఇప్పటివరకు ఎవరెవరికి విక్రయించారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. .ఈరోజు, రేపు.. కేపీ చౌదరిని పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించనున్నారు. విచారణలో కేపీ చౌదరి ఇచ్చే సమాచారం ఆధారంగా డ్రగ్స్ వాడిన సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్ సినీ ప్రముఖులతో పరిచయం ఉన్న కే.పీ.చౌదరి ‘కబాలి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు.