మూడు రోజుల కస్టడీకి నూతన్ నాయుడు | Sakshi
Sakshi News home page

మూడు రోజుల కస్టడీకి నూతన్ నాయుడు

Published Sat, Sep 12 2020 2:08 PM

Three days police custody for Nuthan Naidu - Sakshi

సాక్షి, విశాఖ :  మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ పేరిట పలువురికి ఫోన్‌ చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత, బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్‌ నాయుడుని విశాఖ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అతడిని మరింత లోతుగా విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని విశాఖ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శని, ఆది, సోమవారాల్లో విచారించదానికి న్యాయమూర్తి పోలీసులకు అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసులు ఇవాళ ఉదయం విశాఖ సెంట్రల్ జైలు నుంచి పెందుర్తి తీసుకు వచ్చి నూతన్ నాయుడిని విచారిస్తున్నారు. దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. (విశాఖ సెంట్రల్‌ జైల్‌కు నూతన్‌ నాయుడు)

Advertisement
 
Advertisement
 
Advertisement