PV ramesh
-
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
-
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు చంద్రబాబు వదిలిన బుల్ బుల్ పిట్ట బోల్తా కొట్టింది. టీడీపీ గూటి చిలుక, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌తో సోషల్ మీడియాలో చంద్రబాబు సాగించిన దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే పచ్చ ముఠా సభ్యుడైన ఆయన చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగి అడ్డంగా దొరికిపోయారు. తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న భూములకు మ్యుటేషన్ చేయడంలేదని, అందుకు ల్యాండ్ టైట్లింగ్ చట్టమే కారణమనే భావన కలిగిస్తూ అసత్య ఆరోపణలు చేశారు. దీంతో నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. అసలు ఇంకా అమలులోకి రాని చట్టం దుర్వినియోగం కావడం ఏమిటంటూ మండిపడ్డారు. మరోవైపు తీగ లాగితే డొంక కదిలింది. ఆయన చెబుతున్న 11.04 ఎకరాల భూమిని పీవీ రమేశ్ కుటుంబం కబ్జా చేసిందన్న విషయం ఆధారాలతో సహా బయటç³డింది. ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు భూమలు కబ్జా చేసేసి, న్యాయస్థానం తీర్పును కూడా ధిక్కరిస్తున్న పీవీ రమేశ్ బరితెగింపు బట్టబయలైంది.పీవీ రమేశ్ కుటుంబమే భూ దొంగపీవీ రమేశ్ చేసిన దుష్ప్రచారం ఆయన కుటుంబం భూ కబ్జాను కూడా వెలుగులోకి తెచ్చింది. ఏ భూమి గురించి అయితే పీవీ రమేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారో.. ఆ భూమి ఆయన కుటుంబం కబ్జా చేసిందన్న విషయం కూడా బయటపడిపోయింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోటలో 25ఏళ్ల క్రితం పలువురు రైతులు తమ భూములను కలిపి దాదాపు 100 ఎకరాల్లో చెరువు తవ్వి సహకార వ్యవసాయం తరహాలో చేపల సాగు చేపట్టారు. ఈ భూముల్లో పీవీ రమేశ్ తండ్రి పెనుమాక సుబ్బారావుకు చెందినవి 11.04 ఎకరాలు ఉన్నాయి. కానీ వాటిలో 3.29 ఎకరాల అసైన్డ్ భూమి, 0.29 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు తన భూమి కూడా ఉందని గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి న్యాయస్థానంలో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం పెనుమాక సుబ్బారావు ఆక్రమించిన భూమిని తిరిగి ఇచ్చేయాలని 2022లోనే తీర్పునిచ్చింది. పీవీ రమేశ్ పరపతికి భయపడి ఆ తీర్పును అధికారులు అమలు చేయలేకపోయారు. దాంతో బాధితుడు నాగేంద్ర కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. అంటే పీవీ రమేశ్ ఆయన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ భూమిగా చెబుతున్న 11.04 ఎకరాలు ఆయన కుటుంబం కబ్జా చేసిన భూమి అన్న విషయం బయటపడింది.కబ్జా భూమికి మ్యుటేషన్ సాధ్యం కాదన్న అధికారులుఅయినా సరే తమ కుటుంబం కబ్జా చేసిన భూములను తమ పేరిట మ్యుటేషన్ చేయాలని పీవీ రమేశ్ యత్నించడం గమనార్హం. ఆ మేరకు ఆయన 2023 డిసెంబర్ 16న రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. తన తండ్రి పెనుమాక సుబ్బారావు మరణించినందున ఆయన పేరిట ఉన్న భూములను తమ పేరిట మ్యుటేషన్ చేయాలని కోరారు. అప్పటికే ఆ భూములపై న్యాయ వివాదం ఉందన్న విషయం రెవెన్యూ అధికారులకు తెలుసు. కబ్జా భూములను ఖాళీ చేయాల్సింది పోయి, మ్యుటేషన్ చేయాలని కోరడంతో పీవీ రమేశ్ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు 2023 డిసెంబర్ 30న అధికారులు ఆయనకు లిఖితపూర్వకంగా తెలిపారు.తొందరపడి అబద్ధం కూసి.. ఆపై మరోపోస్టు పెట్టివైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే చంద్రబాబు కుట్రలో పాత్రధారి అయిన పీవీ రమేశ్ సోమవారం ఉదయం సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు. ‘తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములను మ్యుటేషన్ చేయడానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే ఆర్డీవో తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఓ ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేసిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితి ఊహించలేం’ అంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూహక్కు చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్)పై దుష్ప్రచారం చేయాలన్న చంద్రబాబు కుట్రను పక్కాగా అమలు చేశారు. ప్రజల్ని తప్పుదారి పట్టించాలన్న దుర్బుద్ధితో పీవీ రమేశ్.. అసలు ఆ చట్టం రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రాలేదన్న అసలు విషయాన్ని విస్మరించారు. వెంటనే నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చట్టం ఇంకా అమల్లోకి రాకముందే ఎలా దుర్వినియోగం అవుతోందని అంటారు అంటూ నిలదీశారు. దాంతో బండారం బయటపడుతుందన్న ఆందోళనతో పీవీ రమేశ్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో తన పోస్టును ఎడిట్ చేశారు. ‘చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులేకుండా చేస్తున్నారు’ అంటూ పోస్టులో మార్పు చేశారు.ఆయన తండ్రిపై వరకట్న వేధింపుల కేసు కూడాపీవీ రమేశ్ తండ్రి పెనుమాక సుబ్బారావు భూముల కబ్జాకు పాల్పడటమే కాదు.. ఆయనపై క్రిమినల్ కేసులు కూడా గతంలో నమోదు కావడం గమనార్హం. కట్నం కోసం కోడల్ని మానసికంగా, శారీరకంగా హింసించారన్న కారణంతో ఆయనపై విజయవాడ పోలీసులు 2018లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పీవీ రమేశ్ సోదరుడు రాజశేఖర్ జోషి భార్య పెనుమాక సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 1999లో తన పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం, నాలుగు ఎకరాల మామిడి తోట, కారు కట్నంగా ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల తల్లినైన తనను వేధిస్తున్నారంటూ భర్త పెనుమాక రాజశేఖర్ జోషి, మామగారు పెనుమాక సుబ్బారావు, అత్తగారు పెనుమాక మణిలపై ఆమె ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ముగ్గురిపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. భూముల రీ సర్వేకు పీవీ రమేశ్ కుటుంబం హాజరు కాలేదని, కబ్జా చేసిన భూమిని పీవీ రమేశ్ పేరిట మ్యుటేషన్ చేయటం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు రీసర్వేకు ముఖం చాటేసిన పీవీ రమేశ్అంతేకాదు.. తమ భూకబ్జా బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతోనే పీవీ రమేశ్ రెవెన్యూ అధికారుల రీ సర్వేకు ముఖం చాటేశారు. పీవీ రమేశ్ చెబుతున్న చెరువు భూముల్లో కూడా రీసర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా ఆ రైతుల భూములకు హద్దులను నిర్ణయించి వారి పేరిట పత్రాలు ఇవ్వాలని భావించారు. అందుకోసం ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 26న కృష్ణా జిల్లా కలెక్టర్ జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని కూడా నియమించారు. దాంతో గుడివాడ ఆర్డీవో ఆ చెరువు భూముల్లో 2024 మార్చి 5న నిర్వహించనున్న ఉమ్మడి సర్వేకు హాజరుకావాలని, ఇందుకు భూముల ఒరిజినల్ పత్రాలను తీసుకురావాలని భూ యజమానులు, రిట్ పిటిషన్లు దాఖలు చేసినవారందరికీ నోటీసులు జారీ చేశారు. పీవీ రమేశ్ కుటుంబానికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆ రోజున రైతులందరూ వచ్చారు. వారి భూముల పత్రాలను చూపించి రీ సర్వేకు సహకరించారు. కానీ పీవీ రమేశ్ గానీ ఆయన కుటుంబ సభ్యులుగానీ ఆ రీ సర్వేకు హాజరు కాలేదు. రెవెన్యూ అధికారులు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా, వాట్సాప్ ద్వారా సందేశాలు పంపినా వారు హాజరుకాలేదు. దాంతో అందరు రైతులు వచ్చి పత్రాలు చూపించే వరకు రీసర్వే పూర్తి చేయడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అదీ పీవీ రమేశ్ కుటుంబ భూకబ్జా బాగోతం. -
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ట్వీట్.. అడ్డంగా బుక్కైన పీవీ రమేష్
నిజం బయటకు వచ్చే లోపు అబద్దం ఊరంతా చుట్టేసి వస్తుందన్న సామేత టీడీపీ, పచ్చమీడియాకు సరిగ్గా సరిపోతుంది. భూయజమానులకు రక్షణ కల్పించే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ ఆడుతున్న డ్రామానే ఇందుకు నిదర్శనం. గతంలో ఇదే చట్టంపై ఎంతో గొప్పగా కితాబిచ్చిన టీడీపీ.. ఇప్పుడు దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది.ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అడ్డుపెట్టుకుని సీఎం జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ల్యాండ్ టైట్లింగ్ చట్టం రాష్ట్రంలో అమలైతే తమ ఉనికే ప్రమాదమని భావిస్తున్న ప్రతిపక్ష కూటమి.. తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దీనికితోడు తమ బ్యాండ్ బాజా బ్యాచ్‌ని సైతం బరిలోకి దించింది. తమ అనుకూల వ్యక్తులతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్‌యే ఉదాహరణ. కానీ పాపం అడ్డంగా దొరికిపోతానని గుర్తించలేదేమో.IAS అధికారిగా పని చేసిన పీవీ రమేష్.. ఇవ్వాళ ఉదయం ఓ ట్వీట్ వేశారు. అత్యంత కీలకమైన ఎన్నికల వేళ.. ప్రభుత్వం మీద, అధికారంలో ఉన్న వైఎస్సార్సిపి మీద బురద జల్లేలా ఈ ట్వీట్ ఉంది. దీని పూర్వపరాలు ఏంటంటే.. లాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు తానే బాధితుడినని చెప్పుకుంటూ పీవీ రమేష్ తెరమీదకి వచ్చేశారు. ఆయన తన భూమికి సంబంధించిన కొన్ని వివరాలను పేర్కొన్నారు. పీవీ రమేష్ ట్వీట్ చేయగానే.. వెంటనే టిడిపి నేతలు రంగంలోకి దిగారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ ఓ అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. సరే, పీవీ రమేష్ చేసిన ఆరోపణల్లో ఎంత నిజముందన్న విషయంపై కాస్తా తీగ లాగితే డొంక అంతా కదిలింది. పీవీ రమేష్ తనది అని చెప్పుకుంటున్న భూమి గురించి వివరాలు సేకరించగా... అది గత మూడేళ్లుగా కోర్టులో నడుస్తోన్న కేసు గురించి తెలిసింది. హైకోర్టులో WRIT PETITION No.31186 of 2022గా దాఖలైన పిటిషన్లో న్యాయస్థానం ఈ భూమిపై విచారణ జరపాలని కూడా ఆదేశించింది. సర్వే నంబర్లు 61, 62, 66, 486/1, 487/1, 489/1 and 490/1 , విన్నకోట గ్రామం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లాలోని ఈ భూముల్లో.. కొందరు ప్రైవేటు వ్యక్తులు.. కొంత ప్రభుత్వ భూమిని, అలాగే కొన్ని అసైన్డ్ భూములను కబ్జా చేసి చేపల చెరువులను నిర్మించారని తేల్చింది. 2021లో రిట్ పిటిషన్ 10556 కింద దాఖలు కాగా.. అప్పట్లోనే కోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా.. చేపల చెరువులను నిర్మించారని, పైగా ఈ భూముల్లో ప్రభుత్వ భూములున్నాయని తప్పు పట్టింది. 2021లో దాఖలైన రిట్ పిటిషన్ 3582 ద్వారా తెలిసింది ఏంటంటే.. తక్షణం భూములు ఆక్రమించిన వారిపై ఇంకా చర్యలు చేపట్టలేదని తేలింది. ఆ భూముల్లో ఏర్పాటైన ఆక్వా చెరువులు అన్నీ అనధికారమైనవని, అక్రమంగా నిర్మించినవని తేల్చింది. ఈ భూముల్లోకి ఎవరిని అనుమతించవద్దని కోర్టు సూచించింది. ప్రభుత్వం తరపున ఒక జాయింట్ సర్వే నిర్వహించాలని కోర్టు సూచిస్తే... ఈ వాస్తవాలన్నింటిని దాచి పెట్టి పీవీ రమేష్ నంగనాచిలా తనకు అన్యాయం జరిగిందంటూ ట్వీట్ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతెందుకు పీవీ రమేష్ ట్వీట్ పెట్టడంలోనూ నాలుక మడతేశారు. ఉదయం 9.37కు ట్వీట్ చేసిన పీవీ రమేష్.. దాన్ని వెంటనే 10.23గంటలకు ఎడిట్ చేసేశారు. తొలుత ట్వీట్ చేసినప్పుడు నేరుగా ఈ యాక్టుకు తాను ప్రత్యక్ష బాధితుడిని అని చెప్పుకున్నారు. అయితే ఇంతలో ఎవరైనా ప్రశ్నించారేమో.. అసలు అమలులో లేని చట్టానికి మీరు ఎలా బాధితుడు అయ్యారని?!. వెంటనే ట్వీట్‌ను ఎడిట్ చేసేశారు. ఎడిట్ చేసి ట్వీట్లో ''చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి.’’ అనే లైన్ జత చేశారు.ఇక ఈ ట్వీట్‌పై పీవీ రమేష్‌ను నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. సార్ మీరంటే ఎంతో గౌరవం ఉంది, కానీ నిజంగా ‘ప్యాకేజ్ మెటీరియల్’ కాకపోతే భూమి టైటిల్ వివాదం గురించిన పూర్తి వరాలు పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి అంటూ సూచించారు. మరికొందరు మీ కేసుకు, ఈ చట్టానికి సంబంధం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మీ‘ భూముల మ్యూటేషన్ దరఖాస్తును తహసీల్దార్ సరదాగా ఏమీ తిరస్కరించి ఉండరు. ఏదో వివాదం ఉండే ఉంటుంది. అది బయటకు వస్తే అసలు విషయం ఏమిటన్నది తేలుతుంది’ అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. ‘ఇంకా చట్టం అమలులోకి రాలేదు. మరి అమలులో లేని చట్టానికి మరి పీవీ రమేష్ ప్రత్యక్ష బాధితుడిగా ఎలా మారారు’ అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబు దుర్మార్గమైన కుట్రలు చేస్తున్నాడు: పేర్ని నానితాజాగా ఈ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బాబు చెప్పినట్లు.. పీవీ రమేష్ ఆడుతున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తన భూమి మ్యూటేషన్ జరగలేదని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేస్తున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు.‘పీవీ రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టారు.. కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా భూమి లీజుకిచ్చారు. 70 ఎరనాల పొలాన్ని 25 ఏళ్ల క్రితమే చెరువు చేశారు.పీవీ రమేష్ ఏడాదిక్రితం మ్యూటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రైతు నాగేంద్రకు, పీవీ రమేష్‌కు సరిహద్దు వివాదం ఉంది. జనవరిలో కలెక్టర్, ఆర్డీవో సమక్షంలో విచారణ జరిగింది.పీవీ రమేష్ తన గుమస్తాతో ఒరిజనల్స్ కాకుండా జిరాక్స్ పంపించారు. 70 ఎకరాల చెరువులో పీవీ రమేష్ పొలం ఎంతో తెలియదు.చెరువు సరిహద్దులు ఫిక్స్ చేస్తే ఆయన భూమి ఎంతో తేలుతుంది.పోలింగ్ అయ్యాక సర్వే చేస్తారు. పీవీ రమేష్ విన్నకోటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు. -
పచ్చవన్నె మేధావులు
ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగులో కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు నిత్యం సీఎం వైఎస్ జగన్ పైనా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా కక్ష పూరితమైన ఆరోపణలు చేస్తూ ప్రజాస్వామ్య భక్షకులుగా మారడం మేధావులను నివ్వెరపరుస్తోంది. వీళ్లు నిజంగా సివిల్ సర్వీసుల్లో పనిచేసిన అధికారులేనా అని అనుమానం వచ్చేలా వారి వ్యవహారశైలి ఉంటోంది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో చంద్రబాబుకు అనుకూలంగా, వైఎస్ జగన్‌పై మితిమీరిన అక్కసుతో వారు చేస్తున్న ఆరోపణలు సమాజాన్నే తప్పుదోవ పట్టించడానికేనన్నది స్పష్టమవుతోంది. రాజకీయ నాయకులు, గల్లీ లీడర్ల మాదిరిగా ఎల్లో మీడియాలో వారు చేస్తున్న రచ్చను చూసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకాలం తాము కలిసి పనిచేసింది ఇంతలా దిగజారిన మనుషులతోనా అని ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై అదే పనిగా అక్కసు వెళ్లగక్కుతున్న వీరి నిజస్వరూపం తెలుసుకోండి. – సాక్షి, అమరావతి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ 2021 వరకు మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలకు సిఫార్స్ చేశారు. అప్పట్లో పంచాయతీల సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగిసినప్పటికీ.. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయోనని నిమ్మగడ్డ అప్పట్లో వాటిని నిర్వహించలేదు. ఇక 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ ఒకే విడతలో నిర్వహించాలని 2020 ఫిబ్రవరి–మార్చి నెలల్లో నోటిఫికేషన్ జారీచేయగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి అధికారిక వైఎస్సార్సీపీకే దాదాపు సగం స్థానాలు ఏకగ్రీవంగా గెలిచే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వానికి కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా కరోనా పేరుతో వాటిని అర్ధంతరంగా వాయిదా వేసి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. ఇక జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీర్లు–గ్రామ సచివాలయాల వ్యవస్థల ద్వారా నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజల గడప వద్దకే తీసుకొస్తే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరున వలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుతో పాటు రాష్ట్ర హైకోర్టులోనూ కేసులు వేశారు. ఈయన ఫిర్యాదు కారణంగా అవ్వాతాతల పింఛన్లను ఇంటివద్దే పంపిణీ చేసే ప్రక్రియకు బేకులు పడ్డాయి. మన్నెం నాగేశ్వరరావు ఈయన అత్యంత అవినీతిపరుడు.. వాదాస్పద రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా చేసిన ఈయన యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారు. బీహార్‌లో ఓ ప్రభుత్వ వసతి గృహంలో బాలికపై అత్యాచారం కేసులో దర్యాప్తు అధికారిని హఠాత్తుగా బదిలీ చేయడం ద్వారా నిందితులకు ఈయన కొమ్ముకాశారన్నది తేలింది. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మరీ ఈయన దర్యాప్తు అధికారిని బదిలీ చేయడం గమనార్హం. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించి ఫైర్ సర్వీసెస్, హోంగార్డు విభాగానికి బదిలీ చేసింది. నిజానికి.. ♦ నాగేశ్వరరావు ఎక్కడ ఏ పోస్టులో ఉన్నా యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ♦ ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ ‘ద వైర్’తోపాటు జాతీయ మీడియా ఆయన అవినీతి బాగోతాలను ఎన్నోసార్లు బయటపెట్టింది. ♦ అప్పట్లో సీబీఐ డీజీగా ఉన్న అలోక్ శర్మ, ప్రత్యేక డైరెక్టర్‌గా రాకేశ్ ఆస్తానా మధ్య విభేదాలు ఏర్పడటంతో మధ్యేమార్గంగా ఎం.నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్‌గా నియమించారు. అప్పట్లో చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా ఉన్న కేవీ చౌదరి అండదండలతోనే ఈయనకు ఆ పదవి దక్కిందని కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం. ♦ ఇక ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పటి నుంచే ఈయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. పీవీ రమేష్ తాను ఆశించిన విధంగా సర్వీసు పొడిగింపు ఇవ్వలేదని అక్కసుతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సీఎం జగన్‌పై కక్ష పెంచుకుని నిమ్మగడ్డ బృందంతో చేతులు కలిపారు. తనను తాను మేధావిగా ఊహించుకునే ఈయన రిటైరైన వెంటనే సిగ్గూఎగ్గూ లేకుండా ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే ఒక కార్పొరేట్ కంపెనీలో చేరాడు. తన పలుకుబడిని ఆ కంపెనీ కోసం ఉపయోగిస్తానని చెప్పి ఉద్యోగం దక్కించుకున్న ఈయన ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి చిలక పలుకులు చెబుతున్నారు. ♦ అలాగే, 2018లో సీబీఐ చెన్నై జోన్ డైరెక్టర్‌గా ఉండగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న 70మంది ఐఆర్ఎస్ అధికారుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని వారికి అనుకూలంగా వ్యవహరించారనే తీవ్రమైన ఆరోపణలు ఈయనపై వచ్చాయి. దీంతో ఆయన్ని అప్పట్లోనే హఠాత్తుగా బదిలీచేశారు. ♦ ఇక నాగేశ్వరరావు తన భార్య పేరుతో ఏకంగా ఓ షెల్ కంపెనీలో భాగస్వామిగా భారీగా అక్రమ నిధులు తరలించారు. వాటితో ఆమె గుంటూరు జిల్లాలో భూములు కొనుగోలు చేశారన్నది వెలుగులోకి రావడం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. ఆమె ఆ షెల్ కంపెనీలోని 100 షేర్లను కేవలం రూ.వెయ్యికి కొనుగోలు చేసి వాటిని వెంటనే భారీ విలువకు విక్రయించడం గమనార్హం. ఆ షెల్ కంపెనీ షేర్ల ముసుగులోనే భారీ అవినీతికి పాల్పడినట్టు వెల్లడైంది. ♦ అంతేకాదు.. ఒడిశాలోని ఖుర్దాలో ఫోర్జరీ పత్రాలతో ఓ ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసినట్లు చూపించి భూకబ్జాకు తెగబడ్డారు. ♦ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కూడా నిందితులకు అనుకూలంగా నాగేశ్వరరావు వ్యవహరించడంతోనే ఆయన్ని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ♦ సీబీఐ డైరెక్టర్ పోస్టుకు నాగేశ్వరరావు అనర్హుడని కోర్టు తేల్చడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించింది. ♦ ఇలా తన పదవిని దుర్వినియోగం చేశాడని కోర్టు ఛీవాట్లు పెట్టిన ఆ అధికారి రిటైర్ అయ్యాక ప్రజాస్వామ్య పరిక్షరణ ఉద్ధారకుడి అవతారమెత్తి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తుండడం, అది కూడా చంద్రబాబుకి మద్దతుగా చేస్తుండడాన్ని ఎలా చూడాలి? వీళ్ల నినాదం సేవ్ ఫర్ డెమోక్రసీ.. కానీ, వీరు సేవ్ ఫర్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. -
నిజాలకు పాతర.. 'అబద్ధాల జాతర'
సాక్షి, అమరావతి: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీ పరిస్థితి. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి, అబద్ధాల కథనాలు అచ్చోస్తే ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లోనే ఆయన ఇంకా ఉన్నారు. ఇదే భ్రమలతో ఏది రాసినా చెల్లుతుందని గుడ్డిగా నమ్ముతూ రోజుకో అంశంపై ఆయన విషం కక్కుతున్నారు. పాఠకులు ఏమనుకుంటారనే ఇంగిత జ్ఞానం, సిగ్గూఎగ్గూ లేకుండా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడెప్పుడో ఈట్ క్రికెట్.. స్లీప్ క్రికెట్.. డ్రింక్ క్రికెట్ అన్న ప్రకటన మాదిరిగా రామోజీ ఏ పనిచేస్తున్నా అందులో భూతద్దం పెట్టి జగన్ వ్యతిరేకతపై రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ఇందులో భాగమే ఆయన కనుసన్నల్లో సాగిన తాజా పచ్చపైత్యం ‘బందిపోటు పాలన’ కథనం. డొంకతిరుగుడు రాతలతో ఎప్పటిలాగే సీఎం జగన్ పాలనపై రామోజీ అక్షరం అక్షరంలో తన అక్కసునంతా వెళ్లగక్కారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అక్కడక్కడ బందిపోటు పాలన కొనసాగుతోందని వ్యాఖ్యానిస్తే దాన్ని వక్రీకరించి రాష్ట్రానికి అంటగడుతూ రామోజీ బందిపోటు ‘గోల’ చేస్తూ పండగ చేసుకున్నారు. నేను సీఎం అయితే ఏ చట్టమైనా చేస్తా, కేసులు పెట్టిస్తా, జైల్లో వేస్తాం, భూములు లాక్కుంటాం అంటే కుదరదని.. అది బందిపోట్లు చేసే పనవుతుందని.. అక్కడక్కడ బందిపోటు పాలకులను చూస్తున్నామని పీవీ రమేష్ వ్యాఖ్యానిస్తే దాన్ని ఈనాడు రామోజీ సీఎం జగన్ పాలనకు ఆపాదిస్తూ పైశాచికానందం పొందారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో.. నిజానికి.. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ అధికారైనా రాజ్యాంగం, చట్టాల మేరకే పాలన సాగిస్తారని.. కానీ, ఏపీలో అందుకు విరుద్ధంగా పాలన సాగుతున్నట్లు పీవీ రమేష్ చెప్పారంటూ ఈనాడు తన వక్రబుద్ధిని, సీఎం జగన్‌పై తన అక్కసును మరోసారి బయటపెట్టుకుంది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో వందిమాగధులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్టి పేరుతో సీఎం జగన్ పాలనపై ఈనాడు రామోజీ విమర్శలు చేయించి వాటిని వక్రీకరించీ మరీ అనైతికంగా అచ్చువేశారు. ఏ ప్రభుత్వమైనా దోచుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు బందిపోట్ల పాలన అవుతుందని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించేందుకు ఈనాడు రామోజీ తెగ ఆరాటపడిపోయారు. మరోవైపు.. సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదు ఒక్కటే.. రెండూ అవసరమేనని, డబ్బులు పంచడం సులభతరమేనని, అందుకు బటన్ నొక్కితే సరిపోతుందని, అలాగే ఇంటర్నెట్ ఉంటే చాలంటూ పేదలకు నగదు బదిలీ చేయడాన్ని పీవీ రమేష్ అవహేళన చేస్తూ తన పెత్తందారీ ధోరణిని బయటపెట్టుకున్నారు. ఈనాడు రామోజీ కూడా పెత్తందారే కాబట్టి పీవీ రమేష్ మాటలు చాలా రుచికరంగా ఉండటంతో ఆయన మాటలకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చి ప్రముఖంగా అచ్చువేశారు. గురవింద గింజలా పీవీ రమేష్.. ఇక ప్రజలకు అవసరమైన సేవలందించడమే ప్రభుత్వ పాలనంటూ పీవీ రమేష్ చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్ జగన్ కూడా ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. గత ప్రభుత్వాల తరహాలో గ్రామీణ, పట్టణ ప్రజలు తమకు అవసరమైన సేవలకు రాజకీయ నేతలు, మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరంలేకుండా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల ముంగిటికే పాలనందిస్తున్న విషయం రిటైర్ట్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్‌కు కనిపించడంలేదా? కనిపించినా ఈనాడు రామోజీ తనకు కావాల్సినట్లు రాసుకున్నారా? అసలు రమేష్ రిటైర్ కాగానే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగంలో చేరిన ఆయన ఇతరులకు నీతులు చెప్పడం అంటే తన కింద నలుపు చూసుకోకపోవడమే అవుతుంది. ఈనాడు రామోజీ వంటి పెత్తందారుకు కావాల్సినట్లు మాట్లాడాలి కాబట్టి పీవీ రమేష్ కూడా ఆ ముసుగు ధరించారు. ఏ గణాంకాలు చూసినా రాష్ట్రం ప్రగతిపథంలో వెళ్తున్నట్లు కనిపించడంలేదని.. రివర్స్ ఇంజన్లో రాంగ్ రూట్లో వెళ్తున్నామనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గణాంకాలను ఈయన చూడలేకపోతున్నట్లు ఉన్నారు. అందుకే గణాంకాలపై కూడా పెత్తందార్లకు ఏదీ కావాలో అదే ఎంపిక చేసుకుని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోలోని 99 శాతం అంశాలను అమలుచేసి పేదవర్గాలకు పైసా లంచం లేకుండా నగదు బదిలీచేస్తే దాన్ని కూడా పీవీ రమేష్ తప్పుపట్టారంటే పేదలు అభివృద్ధి చెందకూడదనే ధోరణిని ఆయన కూడా చాటుకున్నారు. ఇవేవీ అభివృద్ధి కావా రమేష్..? మరోపక్క.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడితే ఇది అభివృద్ధిగా రమేష్‌కు కనిపించడంలేదా? ఇదే పీవీ రమేష్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు నాడు–నేడు పేరుతో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని కూడా మరిచిపోయి ఇప్పుడు పెత్తందారుల పంచన చేరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాగే.. ► నాలుగు పోర్టులను, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇది అభివృద్ధి కాదా పీవీ రమేష్? ► పేదలందరికీ ఇళ్లు పేరుతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇంటి నిర్మాణాలను చేపట్టారు. ఇది పేదలు అభివృద్ధి చెందడం కాదా? ► గతంలో చంద్రబాబు వ్యవసాయ రుణాలన్నీ మాఫీచేస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ఆ సమయంలో ఇదే పీవీ రమేష్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రుణమాఫీకి తూట్లుపొడవడంలో రమేష్ పాత్ర కూడా ఉంది. ఆయన దీనిని మర్చిపోతే ఎలా? ► 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ఆధారంగా జీఎస్డీపీలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత చంద్రబాబు పాలన కన్నా జీఎస్డీపీ పెరుగుదల ఇప్పుడే ఎక్కువగానే ఉంది. దీనిని ఆయన ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించారా లేక రామోజీ ఇచ్చిన స్క్రిప్ట్‌ను బట్టీపట్టారా? ఏం పీవీ రమేష్? ► ఇక రాష్ట్ర అప్పులు కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే ఉన్నాయి. జీఎస్డీపీతో సమానంగా అప్పులున్నాయంటూ పీవీ రమేష్ పచ్చమీడియా వల్లిస్తున్న అబద్ధాలనే వల్లించారు. కార్పొరేషన్ల పేరుతో అప్పులుచేయడం తప్పుగా పీవీ రమేష్ అనడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. ► ఎందుకంటే.. గత ఎన్నికల ముందు ఇదే పీవీ రమేష్ కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్ధలో పనిచేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు కోరిక మేరకు 2019 ఎన్నికలకు ముందు పసువు–కుంకమ పేరుతో డబ్బులు పంచేందుకు సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి అప్పు మంజూరు చేసిన విషయం మరిచిపోతే ఎలా? ► కానీ, ఇందుకు భిన్నంగా సంక్షేమం, అభివృద్ధి సమతుల్యతతో సీఎం జగన్ ఐదేళ్ల పాలన సాగింది. -
జైలులో ఖైదీలు ఉండక.. స్వామీలు ఉంటారా?: సాక్షితో AAG
-
దారి మళ్లించేందుకే అవాస్తవాలు ప్రచారం
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో పూర్తి ఆధారాలతోనే కేసు నమోదు చేసి మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసు దర్యాప్తు ప్రక్రియలో అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ వాంగ్మూలం కేవలం ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేశాయి.అన్ని కోణాల్లో పరిశోదించి పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు వెల్లడించాయి. తన వాంగ్మూలంతోనే చంద్రబాబును సిట్ అరెస్టు చేశారని చెప్పడం హాస్యాస్పదమని, పూర్తిగా ఫైళ్లు చూడకుండా ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తారని, తాను అప్రూవర్‌గా మారలేదని పీవీ రమేశ్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను సీఐడీ వర్గాలు ఖండించాయి. సిట్ విచారణను ప్రభావితం చేసే ఉద్దేశంతో ఆయన అవాస్తవాలను ప్రచారంలోకి తెస్తున్నారని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా డిజైన్ టెక్ కంపెనీకి ప్రభుత్వ నిధులు మంజూరు చేయడాన్ని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత అభ్యంతరం తెలిపారని సిట్ వర్గాలు వెల్లడించాయి.ఆమె అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ చంద్రబాబు ఆదేశాలతో నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంటూ పీవీ రమేశ్ డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారని సిట్ తెలిపింది. అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ.371 కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు దర్యాప్తులో ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యిందని పేర్కొంది.దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో పీవీ రమేశ్ ఉద్దేశపూర్వకంగానే మీడియా ద్వారా అవాస్తవాలను ప్రచారంలోకి తెస్తున్నారని సిట్ స్పష్టం చేసింది. ప్రజల్ని అయోమయానికి గురి చేయడంతోపాటు దర్యాప్తును తప్పుదారి పట్టించాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. పీవీ రమేశ్ చెబుతున్నట్లుగా హాస్యాస్పదంగానో పేలవంగానో ఈ కేసును దర్యాప్తు చేయడం లేదని సిట్ పేర్కొంది. పక్కా ఆధారాలతో నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నందునే చంద్రబాబు అరెస్ట్‌ను న్యాయస్థానం సమర్థించి ఆయనకు రిమాండ్ కూడా విధించిందని సీఐడీ వర్గాలు తెలిపాయి. -
పీవీ రమేశ్ స్టేట్‌మెంట్‌తోనే కేసు నడవలేదు: CID
సాక్షి, విజయవాడ: తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో కేసు పెట్టారని.. ఇది దిగ్భ్రాంతి కలిగే అంశమని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ వ్యాఖ్యానించడంపై ఏపీ సీఐడీ స్పందించింది. పీవీ రమేశ్ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌తోనే కేసు మొత్తం నడవడం లేదని సీఐడీ వర్గాలు బదులిచ్చాయి. దర్యాప్తు ప్రక్రియలో పీవీ రమేశ్ స్టేట్ మెంట్ ఒక భాగం మాత్రమే. ఈ కేసులో ఆరోపణలకు సంబంధించి అన్నిరకాల ఆధారాలున్నాయి. అధికార దుర్వినియోగం సహా నిధుల మళ్లింపునకు సంబంధించి ఆధారాలున్నాయి. పక్కా ఆధారాలతోనే కేసును ముందుకు తీసుకెళ్లాం అని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. కేసు కోర్టు పరిధిలో ఉండగా పీవీ రమేశ్ వ్యాఖ్యలు చేయడం అయోమయానికి గురిచేసే ప్రయత్నమే. ఇది దర్యాప్తును, విచారణను ప్రభావితం చేయడమే అవుతుంది. నిధుల విడుదలలో తన దిగువ స్థాయి అధికారి చేసిన సూచనను పీవీ రమేశ్ పట్టించుకోలేదు. రూ.371 కోట్లు విడుదలచేసేముందు, అంతమొత్తం ఒకేసారి విడుదల చేయడం కరెక్టుకాదని ఆమె వారించారు. పైలట్ ప్రాజెక్టుగా ఒక స్కిల్ హబ్‌కు ముందుగా విడుదలచేద్దామని గట్టిగా సూచించారు. ఎక్కడో గుజరాత్లో చూసి వచ్చాం, అంతా కరెక్టు అనుకోవడం సమంజసంగా లేదని ఆమె అన్నారు. ఈ అభ్యంతరాలను, సూచనలను పీవీ రమేశ్ పక్కనపెట్టారు. ఇలా ఎన్నో అంశాలు కేసులో ఉన్నాయి. పీవీ రమేశ్ చెప్పినట్టుగా హాస్యాస్పదంగానో, పేలవంగానో కేసును బిల్డ్ చేయలేదు అని సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి. -
మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ వ్యాఖ్యలపై సీఐడీ వర్గాల కామెంట్స్
-
మూడు రోజుల కస్టడీకి నూతన్ నాయుడు
సాక్షి, విశాఖ : మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరిట పలువురికి ఫోన్ చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత, బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడుని విశాఖ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అతడిని మరింత లోతుగా విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని విశాఖ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శని, ఆది, సోమవారాల్లో విచారించదానికి న్యాయమూర్తి పోలీసులకు అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసులు ఇవాళ ఉదయం విశాఖ సెంట్రల్ జైలు నుంచి పెందుర్తి తీసుకు వచ్చి నూతన్ నాయుడిని విచారిస్తున్నారు. దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. (విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు) -
నూతన్ నాయుడు చేసింది తీవ్రమైన నేరం..
సాక్షి, అమరావతి : శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడుపై ఏపీ సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పేరు చెప్పి అధికారుల నుంచి సహాయం పొందేందుకు నూతన్ నాయుడు యత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరు చెప్పి పలువురి అధికారులకు ఫోన్ చేశాడని.. డబ్బులు, ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని పీవీ పేర్కొన్నారు. తన పేరు ప్రతిష్టలను కూడా నాశనం చేశాడని మండిపడ్డారు. తన పేరుతో అధికారులకు ఫోన్ చేయడాన్ని ఆయన ఖండించారు. నూతన్ నాయుడు చేసింది తీవ్రమైన నేరమని ఆయన అన్నారు. ‘ఆగస్ట్ 29న నా పేరును ఉపయోగించి, నా మాటను అనుకరిస్తూ ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు కాల్ చేశారు. ఒక పేషేంట్ వస్తున్నారు, 15 రోజులు పాటు ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ ప్రిన్సిపాల్‌తో చెప్పారు. నా గొంతును అనుకరిస్తూ మాట్లాడటంతో అనుమానం వచ్చి ప్రిన్సిపాల్ సుధాకర్ నాకు కాల్ చేశారు. ఎవరో నా మాట అనుకరిస్తున్నారు అనే విషయాన్ని డీజీపీ, అడిషనల్ డీజీపీ, విశాఖ సీపీకి ఫిర్యాదు చేశాను. ఆ ఫోన్ నెంబర్ హైదరాబాద్ అడ్రస్ ఉందని విచారణలో తేలింది. ఆ నంబర్‌కు కాల్ చేస్తే‘అడిషనల్ సీఎస్ సీఎం’ అని వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నా మాట అనుకరిస్తూ ఫోన్ చేస్తున్న వారి మాటలు నమ్మకండి’అని రమేష్ పేర్కొన్నారు. (చదవండి : శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్) కాగా, నూతన్ నాయుడు గురువారం అరెస్టయిన విషయం తెలిసిందే. శిరోముండనం కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. కాగా, దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
ఏపీ అప్రమత్తంగా ఉంది: పీవీ రమేశ్
-
‘అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్రమత్తంగా ఉంది’
సాక్షి, తాడేపల్లి: కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా అప్రమత్తంగా ఉందని సీఎంవో అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేశ్ అన్నారు. కోవిడ్-19 అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్నరాత్రి నుంచి కేవలం ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదు అయింది. దీన్ని బట్టి కేసుల పెరుగుదల చివరి దశకు వచ్చిందని భావించవచ్చు. అలాగని నిర్లక్ష్యం వద్దు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ల్యాబ్ టెస్టుల సౌకర్యం మరింత పెంచేందుకు పుణె నుంచి మరిన్ని కిట్లు తెప్పిస్తున్నాం. విదేశీ యూనివర్సిటీలతో కూడా అక్కడక్కడ కొన్ని టెస్టులు చేయిస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,000 ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేశాం. వివిధ దశల్లో ఎప్పటికప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షిస్తున్నారు. కోవిడ్-19 ను ఆరోగ్యశ్రీ కిందకు కూడా తీసుకువచ్చాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనాకు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. వీటికి తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఏర్పాటు చేశాం. ఇకపై కేసుల్లో క్రమేణా తగ్గుదల కనిపించవచ్చని నిపుణులు చెప్తున్నారు’ అని రమేశ్ పేర్కొన్నారు. -
వారికోసం ప్రత్యేకంగా ఇద్దరు ఐఏఎస్‌లు!
సాక్షి, తాడేపల్లి: కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్న వారిని సరిహద్దుల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతున్నారు. దీంతో అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఏపీ వారికోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రెటరీ డాక్టర్ పీవీ రమేష్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారన్నారు. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ వారు అక్కడే ఉండండి. ఎవరూ సొంత ప్రాంతాలకు రావాలని ప్రయత్నించవద్దు. అది మీకు, మీ కుటుంబ సభ్యులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారు. సతీష్ చంద్ర, పీయూష్ కుమార్ లను ఈ వ్యవహారాల కోసం సీఎం నియమించారు. దయచేసి ఎవరు సొంత ప్రాంతాలకు రావద్దని సీఎం ప్రత్యేకంగా కోరారు’ అని ఆయన తెలిపారు. ఇది చదవండి: ( చేతులెత్తి నమస్కరిస్తున్నా.. అర్థం చేసుకోండి) ఇప్పటి వరకు భారతదేశంలో 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ పీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. శనివారం రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కరోనాపై విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఆయన వెల్లడించారు. ఈ రోజు 22 మందికి పరీక్షలు నిర్వహిస్తే అన్ని నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 428 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఏపీలో విదేశాల నుండి వచ్చిన వారికి.. వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. -
వైద్యుల సూచన మేరకే మందులు వాడాలి
సాక్షి, అమరావతి: వైద్యులను సంప్రదించకుండా కరోనా వ్యాధికి ఎలాంటి మందులు వాడకూడదని ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం.హరికృష్ణతో కలిసి సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కట్టడి కోసం పనిచేస్తున్న సిబ్బందికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలపమని చెప్పారన్నారు. ఇంకా ఏమన్నారంటే.. - రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 7 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. - విదేశాల నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు 13,894 మంది వచ్చారు. వారిలో 11,421 మందికి పరీక్షలు నిర్వహించాం. వారిలో 2,473 మందికి పరీక్షల్లో ఎటువంటి సమస్యలు లేకపోవడంతో ఇంటివద్దనే ఉంటున్నారు. 53 మంది హాస్పిటల్ ఐసోలేషన్‌లో ఉన్నారు. - రాష్ట్రంలో 800 వెంటిలేటర్స్ ఉన్నాయి. మరో 200 వెంటిలేటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. - సాధారణ వ్యక్తులు మాస్క్‌లు వాడాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారికి దగ్గరగా ఉండేవారు, సంబంధీకులు మాత్రమే మాస్క్‌లు వాడితే సరిపోతుంది. - రిటైరైన వైద్యులు, నర్సులను గుర్తిస్తున్నాం. వారి సేవలను వైరస్ నియంత్రణ చర్యల్లో ఉపయోగించుకుంటాం. - నిత్యావసర సరుకులను ఎక్కువ ధరకు అమ్ముతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు. - నిత్యావసర సరుకులు తోపుడు బండ్ల ద్వారా రోజంతా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కొందరికే.. వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టీకరణ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తే కరోనా రాదంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సాధారణ వ్యక్తులెవ్వరూ ఈ మందును వినియోగించరాదని పేర్కొంది. అలా వినియోగిస్తే దుష్పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. - కరోనా వైరస్ సోకిన వారికి మాత్రమే ఈ మందును వాడాలని అఖిల భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. ఇది కూడా ప్రత్యామ్నాయంలో భాగమే. - కరోనా సోకిన రోగులకు, సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో జరుగుతోంది. - కరోనా రాకుండా ఉండాలంటే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వాడితే సరిపోతుందన్న భావనలోకి ప్రజలెవ్వరూ వెళ్లకూడదు. - కరోనా వైరస్ సోకిన వారికి, వారితో ఉన్నందువల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వారికి మాత్రమే పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఈ మందు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. -
సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి:
-
సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి: పీవీ రమేష్
సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు ఏపీలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ సీఎంవో అడిషనల్ సీఎస్ పీవీ రమేష్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 220 మందికి వైద్య పరీక్షలు చేశామని.. 168 రిపోర్టులు నెగిటివ్ వచ్చాయన్నారు. మిగిలిన రిపోర్టులు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి రోజు రెండు సార్లు సమీక్ష చేస్తున్నారని వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యలను పరిశీలించేందుకు ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో నియంత్రణ చర్యలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. (‘లాక్డౌన్ ఉల్లంఘనులను ఉపేక్షించొద్దు’) లాక్‌డౌన్‌కు ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని పీవీ రమేష్ కోరారు. సామాజిక బాధ్యతతో స్వీయ నియంత్రణ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అనవసరంగా రోడ్లపై తిరగడంతో మీ వల్ల వైరస్ వ్యాపించే అవకాశముందన్నారు కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే 104కు కాల్ చేయాలని తెలిపారు. శుభ్రత పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చన్నారు. ప్రతి గంటకోసారి చేతులు కడుక్కోవాలని ఆయన సూచించారు. నిత్యావసరాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిత్యావసరాలకు ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని.. ప్రజలెవరూ గుంపులుగా రావొద్దని పీవీ రమేష్ విజ్ఞప్తి చేశారు. (భారీ ఊరట : త్వరలో మహమ్మారి తగ్గుముఖం) -
‘నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ’
సాక్షి, అమరావతి : కరోనావైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎంఓ అడిషినల్ సీఎస్ పీవీ రమేష్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏపీకి ఉందని, వారంతా ఇంటింటికి వెళ్లి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో కరోనా నియంత్రణకు ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నామని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను పెంచుతామన్నారు. నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని, మెడికల్ స్టోర్స్ సహా అన్నింటిని మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య, పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో సహా ప్రభుత్వ ముఖ్యమైన శాఖలు అన్ని కష్టపడి పనిచేస్తున్నారని, ప్రజలు కూడా సహకరించాని కోరారు. -
కరోనాకు వాతావరణానికి సంబంధం లేదు
-
ఏపీ: కరోనా కట్టడికి పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం అదనపు కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. ఆయన గురువారం ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు గ్రామస్థాయిలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. దేశంలో అందరికంటే ముందే ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారి సమాచారాన్ని ముందే సేకరిస్తున్నామని చెప్పారు. ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నామని.. తిరుపతి, విజయవాడలో ఇప్పటికే ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. త్వరలోనే కాకినాడ, కర్నూలు, విశాఖలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ, అనంతపురంలో 100 పడకలతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. (ఏపీలో మరో కరోనా కేసు నమోదు..) బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రెండు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. ఇద్దరి బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ వస్తువులపై పడితే 5 గంటల నుంచి 3 రోజుల వరకు బతికి ఉంటుందని.. ఏదైనా ముట్టుకున్న తర్వాత చేతులను 30 సెక్షన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఎవరితోనైనా మూడు అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలన్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యక్తిగతంగా ప్రజలు తమను తాము నియంత్రించుకోవడం మంచిదని రమేష్ తెలిపారు. (తల్లి.. బిడ్డలు.. మధ్య కరోనా!) ఇంటికే పరిమితం కావాలి.. విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజులపాటు ఇంటికే పరిమితం కావాలన్నారు. ఎవరినీ కలవకుండా స్వీయ నిర్బంధంలో ఉంటే అందరినీ కాపాడినవాళ్లు అవుతారని పీవీ రమేష్ సూచించారు. పారాసెట్మాల్ ట్యాబ్లెట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వివరించారు. 102 కంటే ఎక్కువ జ్వరం, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటే ఆస్పత్రికి వెళ్లాలన్నారు. 104 కు ఫోన్ చేస్తే ప్రభుత్వాధికారులే ఆస్పత్రులకు చేరుస్తారని తెలిపారు. గురుకుల పాఠశాలలు, హాస్టల్లో ఉన్న విద్యార్థులను.. వైద్యశాఖ, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారి ఇళ్లకు పంపిస్తున్నామన్నారు. అందరం మాస్క్‌లు వేసుకోవాల్సిన అవసరం లేదని పీవీ రమేష్ పేర్కొన్నారు. (స్వీయ గృహ నిర్బంధమే మేలు) -
కరోనా అలర్ట్: ‘104కు సమాచారం ఇవ్వండి’
సాక్షి, అమరావతి: కరోన వైరస్ (కోవిడ్-19) వ్యాప్తిపై ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎవరికీ సోకలేదని వెల్లడించారు. మరో నాలుగు కేసుల విషయంలో కరోనా ఉందో లేదో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీలో కరోనా వైరస్ కేసులపై శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతిలో కరోన అనుమానిత కేసు నెగెటివ్ వచ్చిందని గుర్తు చేశారు. (చదవండి: కరోనా: హృదయ విదారక చిత్రం..) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు మూడు గంటలు పాటు కరోన వైరస్‌పై సమీక్షించారని అన్నారు. అన్ని ఆస్పత్రుల్లో మందులు, మాస్కులు అందుబాటులో ఉన్నాయని, అధిక ధరలకు మాస్కులు అమ్ముతున్న వారిపై నిన్న ఉదయం నుంచి అధికారులు దాడులు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కరోనా లక్షణాలుగా భావించిన 24 కేసుల్లో 20 కేసులు కరోన కాదని తేలిందని చెప్పారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక శిక్షణకు ఏపీ నుంచి అధికారులను పంపామని తెలిపారు. వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు. (చదవండి: కోవిడ్‌ను జయించిన శతాధిక వృద్ధుడు) వదంతులు నమ్మొద్దు.. కరోన వైరస్‌పై ముఖ్యమంత్రి వైస్ జగన్ ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారని సీఎం ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేశ్ తెలిపారు. ఈ వైరస్‌ను ఎదుర్కోనేందుకు రాష్ట్ర యంత్రాంగం అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని అన్నారు. కరోన సోకితే జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు వస్తాయని, వైరస్ బారిన పడిన వ్యక్తి మన రాష్ట్రానికి వస్తే అతని ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. చికెన్ సహా ఇతర మాంసాహరాల ద్వారా కరోనా వ్యాపిస్తుందనే వదంతులు నమొద్దని చెప్పారు. విదేశాలకు వెళ్లిన వారికి ఈ వ్యాధిని సంక్రమిస్తే.. ఊపిరిత్తులు, గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయని తెలిపారు. వైరస్ సోకిన వారికి జలుబు చాలా తక్కువ ఉంటుందని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ముఖ్యంగా ఫిబ్రవరి 10 తరువాత రాష్ట్రానికి వచ్చినవారు 104 కు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని, కనీసం 14 నుంచి 28 రోజులు ఇంట్లోనే ఉండాలని సూచించారు. 104కు సమాచారం ఇవ్వండి.. పీపీ రమేశ్ మాట్లాడుతూ.. ‘మీ ఇంటివద్ద నుంచే రక్త నమూనాలను తీసుకుని పంపిస్తాం. తుమ్మడం, దగ్గడం వల్ల కరోన వైరస్ వ్యాపించవచ్చు. రోగి చేతులు వేసిన బల్లపై చేతులు వేయడం.. వాటిని ముఖానికి తాకించుకోవడంతో వైరస్ సోకుతుంది. డోర్ నోబ్స్, ఎస్కలేటర్ వంటివి వ్యాధి సోకిన వారు ముట్టుకోవద్దు. అంబులెన్స్‌ను కూడా పూర్తిగా డిస్ఇన్ఫెక్ట్ చేసి మరో రోగిని తీసుకురావడానికి వాడుతున్నాం. మీడియా, సోషల్ మీడియా వాస్తవాలనే రిపోర్టు చేయాలి. పేషంట్ పేరు, ఫోటోలు, వారి ఊరు పేర్లు వెల్లడించకూడదు. విపరీతమైన దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నవారు 104 కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి’అని పేర్కొన్నారు. (చదవండి: కరోనా అలర్ట్: కేంద్ర సిబ్బంది శాఖ కీలక నిర్ణయం!) -
ప్రజారోగ్యంపై ప్రభుత్వ చర్యలు భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాలపై చూపుతున్న శ్రద్ధ దేశానికే ఆదర్శమని పలువురు వైద్య నిపుణులు కొనియాడారు. అత్యంత వ్యయంతో కూడుకున్న ప్రాణాంతకమైన క్యాన్సర్, తలసేమియా, సికిల్‌సెల్ అనీమియా వంటి వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించడం కోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయంలో తలసేమియా, సికిల్‌సెల్ అనీమియా, లిక్విడ్ క్యాన్సర్ నివారణపై జరిగిన వర్క్‌షాప్‌లో బెంగళూరు, చెన్నైలతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు అంకాలజీ వైద్య నిపుణులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ప్రముఖ హెమటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అలోక్ శ్రీవాస్తవ్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యాధుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించి నిపుణుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించారు. పేదవాడి ఆరోగ్యం కోసం, ప్రాణాంతక వ్యాధులను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడ్పాటు అందించేందుకు సిద్ధమని వైద్య నిపుణులు హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం: డాక్టర్ పీవి రమేష్ పేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. తలసేమియా, సికిల్‌సెల్ వంటి వ్యాధుల బారిన పడినవారికి చికిత్స అందించడమే కాకుండా పెన్షన్ ఇవ్వడం ద్వారా వారికి ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తోందన్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఎంత ఖర్చు అయినా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్యం అందించాలని సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలు అనేకమంది పేదలకు కొత్త జీవితాన్ని ఇచ్చాయని తెలిపారు. గ్రామాల్లో వుండే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్సీ వైద్యులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణాంతక వ్యాధి లక్షణాలు వున్న వారిని గుర్తించి, నోడల్ ఆస్పత్రులకు వివరాలను పంపించాలన్నారు. ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో ఈ డేటాబేస్ ఆధారంగా వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలకు అన్ని వసతులు: జవహర్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులు, జిల్లా కేంద్ర వైద్యశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు, వసతులను ప్రభుత్వం సిద్ధం చేసిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. ఖాళీగా వున్న అంకాలజీ వైద్య నిపుణుల నియామకాలను చేపట్టిందని చెప్పారు. ప్రాణాంతక వ్యాధుల లక్షణాలపై మారుమూల గ్రామాల్లో కూడా ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని వెల్లడించారు. ఈ వర్క్‌షాప్‌లో ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శివారెడ్డి, డీఎంఈ డాక్టర్ వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి, కమిషనర్ డాక్టర్ యూఆర్కే రావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ పి.శ్యాంప్రసాద్, చెన్నై, బెంగుళూరుతోపాటు రాష్ట్రంలోని వైద్య నిపుణులు పాల్గొన్నారు. -
సీఎం కార్యాలయంలో అధికారుల శాఖలు ఇవే
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులకు శాఖలు కేటాయించారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఇతర అధికారులు అందరికీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం ఈ కేటాయింపులు చేశారు. అజేయ కల్లం, సీఎం ముఖ్య సలహాదారు: సాధారణ పరిపాలన, హోంశాఖ, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ, శాంతిభద్రతల అంశాలు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యకలాపాలు. పీవీ రమేష్, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ: వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యాశాఖ(పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు,వాణిజ్యం, మౌళిక వసతులు, పెట్టుబడులు,ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఇన్ఫ్రా, ఇంధన శాఖ. సొల్మన్ ఆరోక్య రాజ్, సీఎం కార్యదర్శి: ట్రాన్స్పోర్ట్ రహదారులు, భవనాల శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార,పౌరసరఫరాల, వినియోగదారుల సమస్యలు, పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, అన్ని సంక్షేమ శాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడలు. కె.ధనుంజయరెడ్డి, సీఎం అదనపు కార్యదర్శి: నీటి వనరులు, పర్యావరణం, అటవీ,సాంకేతిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, సీఆర్డీఏ, వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పర్యాటకం. జె.మురళి, సీఎం అదనపు కార్యదర్శి: పశుసంవర్థక, పాడి పరిశ్రమ,మత్స్యశాఖ, సహకారం, సంస్కృతి. డాక్టర్ ముక్తాపురం హరికృష్ణ, సీఎం ప్రత్యేక అధికారి: ఆరోగ్య శ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్), విజ్ఞాపనలు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజల విజ్ఞప్తులు). పి.కృష్ణమోహన్‌రెడ్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ): ముఖ్యమంత్రికి సంబంధించిన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, అపాయింట్మెంట్స్, విజిటర్స్ అపాయింట్మెంట్స్.