రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పలువురు సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేసింది.
ఆర్థికశాఖ హెడ్‌గా పీవీ రమేశ్
⇒ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా పూనం
⇒ సీనియర్ ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పలువురు సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేసింది. రెవెన్యూ శాఖ(వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ కల్లాంను నియమించింది. ప్రస్తుతం ఆయన ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఆయన్ను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తూ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆర్థికశాఖలో ప్రస్తుతం ముఖ్యకార్యదర్శిగా(రెవెన్యూ రాబడి) పనిచేస్తున్న పీవీ రమేశ్‌ను ఆర్థిక శాఖ హెడ్‌గా అజయ్ కల్లాం స్థానంలో నియమించారు. పోస్టింగ్‌కోసం ఎదురుచూస్తున్న పూనం మాలకొండయ్యను వైద్య ఆరోగ్య(ప్రాథమిక ఆరోగ్య) శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు.
అలాగే సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న సుజాతా శర్మను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. రాష్ట్ర ఆరోగ్య వైద్య గృహ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్(ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ) వైస్ చైర్మన్ అండ్ ఎండీగా పనిచేస్తున్న ఎం.రవిచంద్రను ఆర్థికశాఖ(వ్యయం) కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర ఆరోగ్య వైద్య గృహ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ అదనపు బాధ్యతలను పూనం మాలకొండయ్యకు అప్పగించారు.