ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ట్వీట్‌.. అడ్డంగా బుక్కైన పీవీ రమేష్‌ | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ట్వీట్‌.. అడ్డంగా బుక్కైన పీవీ రమేష్‌

Published Mon, May 6 2024 4:03 PM

PV Ramesh Mis Lead Tweet On Land Titling ACT TDP Yellow Media

నిజం బయటకు వచ్చే లోపు అబద్దం ఊరంతా చుట్టేసి వస్తుందన్న సామేత టీడీపీ, పచ్చమీడియాకు సరిగ్గా సరిపోతుంది. భూయజమానులకు రక్షణ కల్పించే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ విషయంలో టీడీపీ ఆడుతున్న డ్రామానే ఇందుకు నిదర్శనం. గతంలో ఇదే చట్టంపై ఎంతో గొప్పగా కితాబిచ్చిన టీడీపీ.. ఇప్పుడు  దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది.

ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అడ్డుపెట్టుకుని సీఎం జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం రాష్ట్రంలో అమలైతే తమ ఉనికే ప్రమాదమని భావిస్తున్న ప్రతిపక్ష కూటమి.. తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దీనికితోడు తమ బ్యాండ్‌ బాజా బ్యాచ్‌ని సైతం బరిలోకి దించింది. తమ అనుకూల వ్యక్తులతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్‌యే ఉదాహరణ. కానీ పాపం అడ్డంగా దొరికిపోతానని గుర్తించలేదేమో.

IAS అధికారిగా పని చేసిన పీవీ రమేష్‌.. ఇవ్వాళ ఉదయం ఓ ట్వీట్‌ వేశారు. అత్యంత కీలకమైన ఎన్నికల వేళ.. ప్రభుత్వం మీద, అధికారంలో ఉన్న వైఎస్సార్‌సిపి మీద బురద జల్లేలా ఈ ట్వీట్‌ ఉంది. దీని పూర్వపరాలు ఏంటంటే.. లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌కు తానే బాధితుడినని చెప్పుకుంటూ పీవీ రమేష్‌ తెరమీదకి వచ్చేశారు. ఆయన తన భూమికి సంబంధించిన కొన్ని వివరాలను పేర్కొన్నారు. పీవీ రమేష్‌ ట్వీట్‌ చేయగానే.. వెంటనే టిడిపి నేతలు రంగంలోకి దిగారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేష్‌ ఓ అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. 

సరే, పీవీ రమేష్‌ చేసిన ఆరోపణల్లో ఎంత నిజముందన్న విషయంపై కాస్తా తీగ లాగితే డొంక అంతా కదిలింది. పీవీ రమేష్‌ తనది అని చెప్పుకుంటున్న భూమి గురించి వివరాలు సేకరించగా... అది గత మూడేళ్లుగా కోర్టులో నడుస్తోన్న కేసు గురించి తెలిసింది. హైకోర్టులో WRIT PETITION No.31186 of 2022గా దాఖలైన పిటిషన్‌లో న్యాయస్థానం ఈ భూమిపై విచారణ జరపాలని కూడా ఆదేశించింది. సర్వే నంబర్లు 61, 62, 66, 486/1, 487/1, 489/1 and 490/1 , విన్నకోట గ్రామం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లాలోని ఈ భూముల్లో.. కొందరు ప్రైవేటు వ్యక్తులు.. కొంత ప్రభుత్వ భూమిని, అలాగే కొన్ని అసైన్డ్‌ భూములను కబ్జా చేసి చేపల చెరువులను నిర్మించారని తేల్చింది. 2021లో రిట్‌ పిటిషన్‌ 10556 కింద దాఖలు కాగా..  అప్పట్లోనే కోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా.. చేపల చెరువులను నిర్మించారని, పైగా ఈ భూముల్లో ప్రభుత్వ భూములున్నాయని తప్పు పట్టింది. 

2021లో దాఖలైన రిట్‌ పిటిషన్‌ 3582 ద్వారా తెలిసింది ఏంటంటే.. తక్షణం భూములు ఆక్రమించిన వారిపై ఇంకా చర్యలు చేపట్టలేదని తేలింది. ఆ భూముల్లో ఏర్పాటైన ఆక్వా చెరువులు అన్నీ అనధికారమైనవని, అక్రమంగా నిర్మించినవని తేల్చింది. ఈ భూముల్లోకి ఎవరిని అనుమతించవద్దని కోర్టు సూచించింది. ప్రభుత్వం తరపున ఒక జాయింట్‌ సర్వే నిర్వహించాలని కోర్టు సూచిస్తే... ఈ వాస్తవాలన్నింటిని దాచి పెట్టి పీవీ రమేష్‌ నంగనాచిలా తనకు అన్యాయం జరిగిందంటూ ట్వీట్‌ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అంతెందుకు పీవీ రమేష్‌ ట్వీట్ పెట్టడంలోనూ నాలుక మడతేశారు. ఉదయం 9.37కు ట్వీట్‌ చేసిన పీవీ రమేష్‌.. దాన్ని వెంటనే 10.23గంటలకు ఎడిట్‌ చేసేశారు. 

 

తొలుత ట్వీట్ చేసినప్పుడు నేరుగా ఈ యాక్టుకు తాను ప్రత్యక్ష బాధితుడిని అని చెప్పుకున్నారు. అయితే ఇంతలో ఎవరైనా ప్రశ్నించారేమో.. అసలు అమలులో లేని చట్టానికి మీరు ఎలా బాధితుడు అయ్యారని?!. వెంటనే ట్వీట్‌ను ఎడిట్ చేసేశారు. ఎడిట్ చేసి ట్వీట్‌లో ''చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి.’’ అనే లైన్‌ జత చేశారు.

ఇక ఈ ట్వీట్‌పై పీవీ రమేష్‌ను నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. సార్‌ మీరంటే ఎంతో గౌరవం ఉంది, కానీ నిజంగా ‘ప్యాకేజ్‌ మెటీరియల్’‌ కాకపోతే భూమి టైటిల్‌ వివాదం గురించిన పూర్తి వరాలు పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి అంటూ సూచించారు. మరికొందరు మీ కేసుకు, ఈ చట్టానికి సంబంధం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మీ‘ భూముల మ్యూటేషన్‌ దరఖాస్తును తహసీల్దార్ సరదాగా ఏమీ తిరస్కరించి ఉండరు. ఏదో వివాదం ఉండే ఉంటుంది. అది బయటకు వస్తే అసలు విషయం ఏమిటన్నది తేలుతుంది’ అంటూ మరో నెటిజన్‌ పేర్కొన్నాడు. ‘ఇంకా చట్టం అమలులోకి రాలేదు. మరి అమలులో లేని చట్టానికి మరి పీవీ రమేష్ ప్రత్యక్ష బాధితుడిగా ఎలా మారారు’ అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు దుర్మార్గమైన కుట్రలు చేస్తున్నాడు: పేర్ని నాని
తాజాగా ఈ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బాబు చెప్పినట్లు.. పీవీ రమేష్ ఆడుతున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తన భూమి మ్యూటేషన్ జరగలేదని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్  చేస్తున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు.

‘పీవీ రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టారు.. కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా భూమి లీజుకిచ్చారు. 70 ఎరనాల పొలాన్ని 25 ఏళ్ల క్రితమే చెరువు చేశారు.పీవీ రమేష్ ఏడాదిక్రితం మ్యూటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రైతు నాగేంద్రకు, పీవీ రమేష్‌కు సరిహద్దు వివాదం ఉంది. జనవరిలో కలెక్టర్, ఆర్డీవో సమక్షంలో విచారణ జరిగింది.పీవీ రమేష్ తన గుమస్తాతో ఒరిజనల్స్ కాకుండా జిరాక్స్ పంపించారు. 70 ఎకరాల చెరువులో పీవీ రమేష్ పొలం ఎంతో తెలియదు.చెరువు సరిహద్దులు ఫిక్స్ చేస్తే ఆయన భూమి ఎంతో తేలుతుంది.పోలింగ్ అయ్యాక సర్వే చేస్తారు. పీవీ రమేష్ విన్నకోటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement