పీవీ రమేశ్‌ స్టేట్‌మెంట్‌తోనే కేసు నడవలేదు: CID | AP CID Strong Reaction On EX IAS PV Ramesh Comments | Sakshi
Sakshi News home page

పీవీ రమేశ్‌ స్టేట్‌మెంట్‌తోనే కేసు నడవలేదు.. స్కిల్‌ కేసును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలున్నాయ్‌: ఏపీ సీఐడీ

Published Mon, Sep 11 2023 2:35 PM | Last Updated on Mon, Sep 11 2023 4:41 PM

AP CID Strong Reaction On EX IAS PV Ramesh Comments - Sakshi

సాక్షి, విజయవాడ: తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌  ఆధారంగానే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో కేసు పెట్టారని.. ఇది దిగ్భ్రాంతి కలిగే అంశమని మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ వ్యాఖ్యానించడంపై ఏపీ సీఐడీ స్పందించింది. పీవీ రమేశ్‌ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌తోనే కేసు మొత్తం నడవడం లేదని సీఐడీ వర్గాలు బదులిచ్చాయి. 

దర్యాప్తు ప్రక్రియలో పీవీ రమేశ్‌ స్టేట్‌ మెంట్ ఒక భాగం మాత్రమే. ఈ కేసులో ఆరోపణలకు సంబంధించి అన్నిరకాల ఆధారాలున్నాయి. అధికార దుర్వినియోగం సహా నిధుల మళ్లింపునకు సంబంధించి ఆధారాలున్నాయి. పక్కా ఆధారాలతోనే కేసును ముందుకు తీసుకెళ్లాం అని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. 

కేసు కోర్టు పరిధిలో ఉండగా పీవీ రమేశ్‌ వ్యాఖ్యలు చేయడం అయోమయానికి గురిచేసే ప్రయత్నమే. ఇది దర్యాప్తును, విచారణను ప్రభావితం చేయడమే అవుతుంది. 
నిధుల విడుదలలో తన దిగువ స్థాయి అధికారి చేసిన సూచనను పీవీ రమేశ్‌ పట్టించుకోలేదు. రూ.371 కోట్లు విడుదలచేసేముందు, అంతమొత్తం ఒకేసారి విడుదల చేయడం కరెక్టుకాదని ఆమె వారించారు. 


పైలట్‌ ప్రాజెక్టుగా ఒక స్కిల్‌ హబ్‌కు ముందుగా విడుదలచేద్దామని గట్టిగా సూచించారు. ఎక్కడో గుజరాత్‌లో చూసి వచ్చాం, అంతా కరెక్టు అనుకోవడం సమంజసంగా లేదని ఆమె అన్నారు. ఈ అభ్యంతరాలను, సూచనలను పీవీ రమేశ్‌ పక్కనపెట్టారు. ఇలా ఎన్నో అంశాలు కేసులో ఉన్నాయి. పీవీ రమేశ్‌ చెప్పినట్టుగా హాస్యాస్పదంగానో, పేలవంగానో కేసును బిల్డ్‌ చేయలేదు అని సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement