ఈడీ నీకెక్కడ క్లీన్‌చిట్‌ ఇచ్చింది? | YSRCP President YS Jagan condemned Chandrababu on skill scam | Sakshi
Sakshi News home page

ఈడీ నీకెక్కడ క్లీన్‌చిట్‌ ఇచ్చింది?

Published Sat, Oct 19 2024 4:51 AM | Last Updated on Sat, Oct 19 2024 5:58 AM

YSRCP President YS Jagan condemned Chandrababu on skill scam

స్కిల్‌ స్కామ్‌పై చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 

ఈ నెల 15న ఈడీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా క్లీన్‌చిట్‌ ప్రస్తావన లేదు 

స్కిల్‌ స్కామ్‌ జరిగింది వాస్తవమని ఈడీ ధ్రువీకరించింది 

మొత్తం రూ.54.74 కోట్ల ఆస్తులు జప్తు చేసింది 

చంద్రబాబే 13సార్లు 13 చోట్ల సంతకాలు చేసి డిజైన్‌ టెక్‌కు రూ.371 కోట్లు ఇచ్చేలా చేశారు  

ఆ డబ్బులనే షెల్‌ కంపెనీల ద్వారా తన జేబులో వేసుకున్నారు 

సీమెన్స్‌ అంతర్గత విచారణలో కూడా ఇదే తేలిందని నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా? 

అబద్ధాలకు రెక్కలు కట్టడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు 

ఈ నెల 15వ తేదీన ఈడీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా చంద్రబాబుకు క్లీన్‌చిట్‌ ప్రస్తావన లేదు. ఈ కేసులో నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేశామని ఈడీ స్పష్టంగా పేర్కొంది. కానీ, చంద్రబాబు మాత్రం తన అధికారిక టీడీపీ వెబ్‌సైట్‌లో ‘న్యాయం గెలిచింది. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని ఈడీ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.’ అంటూ గోబెల్స్‌ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మనిషి (చంద్రబాబు) అబద్ధానికి రెక్కలు కట్టడంలో స్పెషలిస్టు. అబద్ధానికి రెక్కలు కట్టడంలో పీహెచ్‌డీ తీసుకున్నాడు.  – వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నీకు క్లీన్‌ చిట్‌ ఎక్కడ ఇచ్చిందో చూపాలి..’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. టీడీపీ పాలనలో జరిగిన స్కిల్‌ స్కామ్‌పై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ దర్యాప్తు చేసి.. అన్ని ఆధారాలతోనే ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేసిన చంద్రబాబును అరెస్ట్‌ చేసిందని చెప్పారు. 

ఆ కేసుపై ఈడీ కూడా దర్యాప్తు చేసిందని, స్కామ్‌ జరిగినట్లు నిర్ధారించిందని, దానికి తార్కాణమే ఆ కుంభకోణంలో పాత్రధారులైన డిజైన్‌ టెక్‌ ఎండీ, సీమెన్స్‌ ఇండియా మాజీ ఎండీ సహా నలుగురిని అరెస్ట్‌ చేసి రెండు విడతల్లో రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని వివరించారు. 

ఈ కుంభకోణంపై దర్యాప్తు కొనుసాగుతోందని ఈడీ తేల్చిచెబుతూ మీడియాకు ప్రకటన విడుదల చేస్తే.. దాన్ని పట్టుకుని తనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే...  

ఆస్తులు అటాచ్‌ చేస్తే.. క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టా? 
సిల్క్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి ఈడీ ఈ నెల 15వ తేదీన విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా చంద్రబాబుకు క్లీన్‌చిట్‌ ప్రస్తావన లేదు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సీమెన్స్‌ ప్రాజెక్టులో భాగంగా డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఇతరులు కలిసి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేశారని, నిధులు దుర్వినియోగం అయ్యాయని ఈడీ గుర్తించింది. 

డిజైన్‌ టెక్‌ సంస్థ ఎండీ వికాస్‌ వినాయక్‌ కన్వేల్కర్, సీమెన్స్‌ ఇండియా మాజీ ఎండీ సుమన్‌ బోస్, ముకుల్‌ చంద్ర అగర్వాల్, సురేష్‌ గోయల్‌లు కలిసి ఏపీ ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారని, డొల్ల కంపెనీల ద్వారా బోగస్‌ ఇన్వాయిస్‌లు సృష్టించి ప్రజాధనాన్ని స్వాహా చేశారని నిర్ధారించింది. ఇందులో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారినట్టు కూడా తేల్చింది. అందుకే ఇంతకు ముందే డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ సంస్థకు సంబంధించిన రూ.31.20 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేయడమే కాకుండా నిందితులు అయిన వికాస్‌ వినాయక్‌ కన్వేల్కర్, సుమన్‌ బోస్, ముకుల్‌ చంద్ర అగర్వాల్, సురేష్‌ గోయల్‌లను అరెస్టు చేసినట్టు వెల్లడించింది. 

తాజాగా మరో రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేశామని ఈడీ స్పష్టంగా ప్రెస్‌నోట్‌లో తెలియజేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్టు కూడా ప్రకటించింది. ఆ ప్రెస్‌నోట్‌ చదివితే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఈ కేసులో చంద్రబాబుతోపాటు సుమన్‌ బోస్, వికాస్‌ వినాయక్‌ కన్వేల్కర్, ముకుల్‌ చంద్ర అగర్వాల్, సురేష్‌ గోయల్‌ నిందితులు. ఎందుకంటే చంద్రబాబే ముఖ్యమంత్రి హోదాలో 13 సార్లు.. 13 చోట్ల ఫైళ్లపై సంతకాలు పెట్టారు. వాళ్లకు రూ.371 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బు మొత్తం మళ్లీ డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. కాబట్టే నలుగురిని అరెస్టు చేసింది. ఆస్తులను అటాచ్‌ చేసింది. 

కానీ, చంద్రబాబు మాత్రం తన అధికారిక టీడీపీ వెబ్‌సైట్‌లో ‘నిజం నిలిచింది.. న్యాయం గెలిచింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అక్రమ కేసు పెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెంపపెట్టులా చంద్రబాబుకు ఎటువంటిసంబంధం లేదని క్లీన్‌ చిట్‌ ఇచ్చింది ఈడీ..’ అంటూ గోబెల్స్‌ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మనిíÙ (చంద్ర­బాబు) అబద్ధానికి రెక్కలు కట్టడంలో పీహెచ్‌డీ తీసుకున్నాడు. దీనికి చంద్ర­బాబు తనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చేసినట్టు మార్చేసుకున్నారు. అసలు ఇంకెవ్వరికీ చదువు రాదనుకుంటాడా... ఎవరికీ ఏమీ తెలియదనుకుంటాడా చంద్రబాబు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వంటి మీడియా సామ్రాజ్యాన్ని పెట్టుకుని ఎంతకైనా గోబెల్స్‌ ప్రచారం చేయగలననే అతి విశ్వాసం ఉన్నా కూడా... ఈ మాదిరిగా వక్రీకరించడం ఎవరి వల్లా కాదు!. 

ఈడీ అటాచ్‌లపై బాబు మాట్లాడరేం! 
ఈ స్కామ్‌లో ఈడీ అరెస్టు చేసిన మనుషులకు, ఆస్తులు అటాచ్‌ చేసిన సంస్థలకు డబ్బులు ఎవరు ఇచ్చారు..? చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం వాస్తవం కాదా? జర్మనీకి చెందిన ఒరిజినల్‌ సీమెన్స్‌ కంపెనీ ఆ డబ్బులు తమకు ముట్టలేదని, ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని చెప్పడం వాస్త­వం కాదా? సదరు కంపెనీ ప్రతినిధి నోయిడా మేజి­స్ట్రేట్‌ ముందు వాంగ్మూలంగా ఇవ్వడం వాస్తవం కాదా? 

సీమెన్స్‌ సంస్థ ఈ డబ్బు పక్కదారి పట్టిందనే విషయాన్ని తమ అంతర్గత పరిశోధనలో కనుగొన్నామని.. అది తమ ఇండియా విభాగానికి చెందిన మాజీ ఎండీ సుమన్‌ బోస్‌ కంప్యూటర్లు, ఫోన్లను పరిశీలిస్తే బయటకు వచ్చిందని.. డబ్బు పుణే నుంచి హైదరాబాద్‌కు వెళ్లిందని.. సాక్షాత్తు సీమెన్స్‌ తమ అంతర్గత పరిశోధనలో వెల్లడైందని రిపోర్టు ఇచ్చిందా..? లేదా?. ఈ కేసులో నిందితుల ఆస్తుల ఆటాచ్‌మెంట్‌పై మాత్రం చంద్రబాబు మాట్లాడరు. కానీ, తనకు తానే క్లీన్‌ చిట్‌ ఇచ్చేసుకుంటాడు.  

చంద్రబాబును ఈడీ అరెస్టు చేయదా?
సిల్క్‌ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబును, ఆయన పీఏ శ్రీనివాస్‌ను భవిష్యత్తులో ఈడీ అరెస్టు చేయదా? ప్రజాధనాన్ని డొల్ల కంపెనీలు సృష్టించి బయటకు పంపడం.. అలా వెళ్లిన డబ్బులు మళ్లీ తిరిగి హవాలా మార్గంలో చంద్రబాబు జేబులోకి చేరడం వాస్తవం కాదా? దొంగలు దొంగలు కలిసి ఊళ్లను పంచుకోవడం అంటే ఇది కాదా? ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు మేజిస్ట్రేట్‌ ముందు సెక్షన్‌–164 కింద వాంగ్మూలం ఇచ్చారు. తాము చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బు విడుదల చేశామని చెప్పారు. 

ఇది వాస్తవం కాదా? ఇవన్నీ కళ్ల ఎదుట కనిపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ‘న్యాయం గెలిచింది.. నిజం నిలిచింది..’ అని ఎలా అంటారు? కంటికి కనిపించే ఆధారాలు ఉన్నాయి. స్కామ్‌ నిజమే అని ఈడీ కూడా ధ్రువీకరించుకుని అరెస్టులు చేసింది... ఆస్తులు అటాచ్‌మెంట్‌ చేసింది. అయినా చంద్రబాబు లడ్డూలు విషయం మాదిరిగా.. ఇసుక, మద్యం స్కామ్‌ల తరహా అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. ఇలాంటి వాళ్లు నిజంగా మను­షులేనా.. అందరూ ఆలోచన చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement