సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ. శనివారం ఉదయం నంద్యాలలో హైడ్రామా తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ఆపై విజయవాడకు తరలించే యత్నం చేసింది. తన కాన్వాయ్‌లోనే వస్తానని చెప్పడంతో ఏపీ అధికారులు అంగీకరించారు.
చంద్రబాబు నాయుడు వెంట కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. తొలుత విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చంద్రబాబును తరలిస్తారని సమాచారం. ఆపై సీఐడీ పోలీసులు, మూడో అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబు నాయుడ్ని హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉదయం పది గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ డీజీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ వివరాలను ఆయన మీడియాకు వ్యవహరించనున్నారు.
ఇక నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో పెద్ద డ్రామానే నడిచింది. తొలుత సీఐడీ అధికారులతో చంద్రబాబు, ఆయన లాయర్లు వాదనకు దిగారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి అడ్డుకునే యత్నం చేశారు. అయితే అధికారుల వివరణతో చివరకు అరెస్టుకు అంగీకరించారాయన. ఆపై శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కార్యకర్తలు అక్కడి నుంచి పంపించివేసి.. చంద్రబాబును విజయవాడకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment