ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పీవీ రమేష్ | PV Ramesh Appointed AP CM Special Principal Secretary | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పీవీ రమేష్

Published Fri, Jun 7 2019 3:25 PM | Last Updated on Fri, Jun 7 2019 3:38 PM

PV Ramesh Appointed AP CM Special Principal Secretary - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్‌
ఆంధ్రప‍్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్‌ నియమితులయ్యారు. ఆయన కమ్యూనికేషన్‌ సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులిచ్చారు.

కాగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఉదయం 8.49 గంటలకు సచివాలయంలోని సీఎం చాంబర్‌లో అడుగుపెట్టనున్నారు. దీంతో ముఖ్యమంత్రి చాంబర్‌ మొదటి బ్లాక్‌ను వాస్తుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. రేపు జరగనున్న మంత్రుల పదవీ ప్రమాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement