Nutan
-
బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం
బిగ్‌బాస్ పలువురు గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్లలో నూతన్ నాయుడు ఒకరు. వైజాగ్‌కి చెందిన ఇతడు ఒకటి అరా సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ 2వ సీజన్లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. కుటుంబం గురించి మాట్లాడొద్దు అని కౌశల్‌తో గొడవపెట్టుకున్నది ఇతడే. ఇప్పుడు ఈయన ఇంట్లోనే విషాదం చోటుచేసుకుంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: కిర్రాక్ సీత ఎలిమినేట్)గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడిన నూతన్ నాయడు తండ్రి సన్యాసి రావు నాడు.. పండగపూట అంటే శనివారం ఉదయం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. ఉత్తరాంధ్ర తరఫున కాంగ్రెస్ సీనియర్ నేతగా ఈయనకు గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ ప్రముఖులు ఈయన సంతాపాన్ని తెలియజేశారు.బిగ్‌బాస్ షోలో వచ్చిన గుర్తింపుతో కమెడియన్, విలన్‌గా ఛాన్సులు అందుకున్నాడు. కానీ వాటి ద్వారా పెద్ద ఫేమ్ తెచ్చుకోలేకోయాడు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నాడు.(ఇదీ చదవండి: మణి హగ్గుల పిచ్చి.. ఈ చెండాలం చూడలేకున్నాం సామీ!) -
రొమాంటిక్ డ్రామాతో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు హిందీ తెరను ఏలిన అలనాటి తారల్లో నూతన్కి ప్రముఖ స్థానం ఉంది. 1950లలో చిత్రసీమలోకి అడుగుపెట్టి, 40 ఏళ్ల కెరీర్లో దాదాపు 80 చిత్రాల్లో నటించి, చెరగని ముద్ర వేసుకున్నారు నూతన్. ఆమె వారసురాలిగా ప్రనూతన్ బహల్ హిందీ చిత్రం ‘నోట్‌బుక్’ (2019)తో నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘హెల్మెట్’(2021) చిత్రంలో నటించిన ప్రనూతన్ బహల్ ఇప్పుడు హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అమెరికన్ యాక్టర్ రహ్సాన్ నూర్ నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించనున్న సినిమా ‘కోకో అండ్ నట్’. ఇంగ్లిష్, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ లవ్‌స్టోరీ సినిమా చిత్రీకరణ జూన్‌లో చికాగోలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఇండియన్, ఇంగ్లిష్ నటీనటులు నటించనున్నారు. ‘‘ఓ రొమాంటిక్ డ్రామాతో హాలీవుడ్‌కు పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు ప్రనూతన్. ‘‘నోట్‌బుక్’లో ప్రనూతన్ యాక్టింగ్ ప్రతిభను చూసినప్పట్నుంచి ఆమెతో కలిసి నటించాలనుకుంటున్నాను. ఈ సినిమాలో తన పెళ్లి విషయంలో కొంతమందితో పోరాడే అమ్మాయి పాత్రలో ప్రనూతన్ కనిపిస్తారు’’ అని పేర్కొన్నారు రహ్సాన్ నూర్. -
బెయిల్.. అంతలోనే అరెస్టయిన ప్రియామాధురి
-
బెయిల్.. అంతలోనే అరెస్టయిన ప్రియామాధురి
సాక్షి, పెందుర్తి: ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగిని మోసం చేసిన కేసులో సినీ నిర్మాత, జనసేన పార్టీ సానుభూతి పరుడు నూతన్‌నాయుడు భార్య ప్రియామాధురిని పెందుర్తి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. దాదాపు 40 రోజుల క్రితం దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన ప్రియామాధురి గురువారమే బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే, కొద్దిసేపటికే పెందుర్తి పోలీసులు చీటింగ్ కేసులో అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. విశాఖ లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నూతన్‌నాయుడు దంపతులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడి వద్ద సుమారు రూ.25 లక్షలు వసూలు చేశారు. దీనిపై బాధితుడు రెండేళ్లుగా ఉద్యోగం కోసం అడుగుతున్నా ప్రియామాధురి పట్టించుకోలేదు. దీంతో కొద్దిరోజుల క్రితం బాధితుడు పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసి ఆమెను గురువారం అరెస్ట్ చేసినట్లు సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపారు. (12 కోట్లు వసూలు చేసిన నూతన్ నాయుడు) -
నూతన్ నాయుడుకు చుక్కెదురు
విశాఖ లీగల్: పెందుర్తి దళిత యువకుడు శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ కుమార్ నాయుడుతో పాటు ఆయన భార్య ప్రియ మాధురితో సహా మరికొందరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ని న్యాయస్థానం తిరస్కరించింది. నగరంలోని ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వెంకట నాగేశ్వరరావు మంగళవారం తీర్పు నిచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసు ప్రాథమిక స్థాయిలో ఉన్నందున బెయిలు మంజూరు సాధ్యం కాదన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాసు తమ వాదనలు వినిపించారు. కాగా, పసిపిల్లలను విక్రయించిన కేసులో సృష్టి ఆస్పత్రి వైద్యులకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. (12 కోట్లు వసూలు చేసిన నూతన్ నాయుడు) చదవండి: కడుపులో నొప్పి అంటూ నూతన్ డ్రామాలు! -
పోలీసులకు సహకరించని నూతన్‌నాయుడు
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ పేరిట పలువురు అధికారులకు ఫోన్లు చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేం నూతన్‌నాయుడునుసోమవారం సాయంత్రం పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. విశాఖ పోలీసులు ఇటీవల ఆయనను అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్‌కు ఆరిలోవ సెంట్రల్ జైల్‌కు పంపిన విషయం తెలిసిందే. అయితే శని, ఆది, సోమవారాల్లో విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి కోర్టు అనమతిచ్చింది. విచారణ అనంతరం తిరిగి జైలుకు పంపారు. మూడు రోజుల విచారణలో శిరోముండనం కేసులో పోలీసులకు నూతన్‌నాయుడు సహకరించలేదని తెలిసింది. శిరోముండనం చేసిన సమయంలో తాను రాజమండ్రిలో ఉన్నట్టు నూతన్‌నాయుడు చెప్పినట్టు సమాచారం. దళిత యువకుడు శ్రీకాంత్‌పై దాడి, శిరోముండనానికి ముందు తన భార్యతో మాట్లాడినట్టు తేలడంతో పోలీసులు ఆ కోణంలో ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పకుండా కడుపులో నొప్పిగా ఉందంటూ తప్పించుకునే యత్నం చేసినట్టు పోలీసులు చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట ప్రభుత్వ వైద్యులకు ఫోన్ చేసిన కేసుల్లో, ఉద్యోగం ఇప్పిస్తానని నూకరాజు నుంచి రూ.12 కోట్లు వసూలు చేసినట్టు మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుపైనా విచారించారు. మళ్లీ పోలీస్ కస్టడీ కోరతాం.. బ్యాంక్ ఉద్యోగం ఇస్తామని రూ.12 కోట్లు తీసుకుని మోసం చేసినట్టు నమోదైన కేసులో అవసరమైతే నూతన్‌నాయుడిని మళ్లీ పోలీస్‌కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతామని డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగి మీడియాతో చెప్పారు. -
12 కోట్లు వసూలు చేసిన నూతన్ నాయుడు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్ నాయుడు బాగోతాలు ఒక్కొక్కటీ బయపడుతున్నాయి. అతనిపై ఇప్పటికే పలు కేసులు బయటపడగా.. తాజాగా మరో మోసం వెలుగుచూసింది. ఉద్యోగం పేరిట నూతన్‌నాయుడు 12 కోట్ల రూపాయలను వసూలు చేశాడని ఆరోపిస్తూ మహారాణి పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్బీఐలో రీజినల్ డైరెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి 12 కోట్లు వసూలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన విశాఖ డీసీపీ ఐశ్వర్య రస్తోగి ఫిర్యాదుపై లోతైన విచారణ జరుపుతామన్నారు. అవసరమైతే మరోసారి కస్టడీలోకి తీసుకుంటామని తెలిపారు. కాగా పి.వి.రమేశ్ పేరుతో పైరవీలు చేయడంపై కంచరపాలెం, గోపాలపట్నం, గాజువాక పోలీస్ స్టేషన్లలోనూ నూతన్‌పై కేసులు నమోదయ్యాయి. (కాల్ హిస్టరీ ఆధారంగా నూతన్ మోసాలపై దర్యాప్తు) నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేసి మానివేసిన దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌ను సెల్‌ఫోన్ పోయిందనే నెపంతో ఇంటికి పిలిపించి శిరోముండనం చేయడంతో పాటు దారుణంగా హింసించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన 24 గంటల వ్యవధిలోనే నూతన్ భార్యతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. శ్రీకాంత్‌పై చేసిన అకృత్యాలను సెల్ఫీలు తీసి పైశాచిక ఆనందం పొందిన నిందితులు అక్కడితో ఆగకుండా వీడియోలు తీశారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. (విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు) -
కడుపులో నొప్పి అంటూ నూతన్ డ్రామాలు!
సాక్షి, విశాఖపట్నం: పోలీసుల విచారణలో నూతన్‌నాయుడు మోసాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తామని నూతన్‌నాయుడు చేసిన మోసాలపై పోలీసులు ఆరా తీశారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ డైరెక్టర్ పదవి ఇప్పిస్తామని రియల్టర్ దగ్గర రూ.12 కోట్లు స్వాహా చేసినట్టు పోలీసులు విచారణలో తెలిసింది. దాంతోపాటు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఇక పోలీసులు కస్టడీలోకి తీసుకునే ముందు.. నూతన్ నాయుడును అతని నివాసంలోనే పోలీసులు విచారించారు. ఈక్రమంలో అతను డ్రామాకు తెరతీశాడు. తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ నాటకమాడాడు. అయితే, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన విశాఖ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కాగా, దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్‌నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. (చదవండి: మధుప్రియను కస్టడీకి తీసుకున్న పోలీసులు) -
మూడు రోజుల కస్టడీకి నూతన్ నాయుడు
సాక్షి, విశాఖ : మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరిట పలువురికి ఫోన్ చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత, బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడుని విశాఖ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అతడిని మరింత లోతుగా విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని విశాఖ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శని, ఆది, సోమవారాల్లో విచారించదానికి న్యాయమూర్తి పోలీసులకు అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసులు ఇవాళ ఉదయం విశాఖ సెంట్రల్ జైలు నుంచి పెందుర్తి తీసుకు వచ్చి నూతన్ నాయుడిని విచారిస్తున్నారు. దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. (విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు) -
పోలీసుల కస్టడీకి మధుప్రియ
సాక్షి, విశాఖపట్నం: నూతన్ నాయుడు భార్య మధుప్రియను విశాఖ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మధుప్రియతో పాటు బాధితుడు శ్రీకాంత్‌ను తీవ్రంగా హింసించిన ఇందిరాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నూతన్ నాయుడు ఇంటి సూపర్వైజర్ను పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. ఇప్పటికే నూతన్ నాయుడు ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా.. శాస్త్రీయమైన సాక్ష్యాలు సేకరించే క్రమంలో ముగ్గురు నిందితులను రెండు రోజుల పాటు విశాఖ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. (విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు) -
విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేశ్ పేరిట పలువురికి ఫోన్ చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత నూతన్ నాయుడికి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను విశాఖ సెంట్రల్ జైల్‌కు తరలించారు. దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య ప్రియామాధురి సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. ► శ్రీకాంత్‌పై దాడి చేసేటప్పుడు, శిరోముండనానికి ముందు నూతన్ తన భార్యతో వీడియో కాల్ మాట్లాడినట్లు నిర్ధారణ కావడంతో ఘటనలో ఆయన పాత్ర ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. ► తన పేరిట పైరవీలకు పాల్పడుతున్నారని మాజీ ఐఏఎస్ అధికారి పి.వి రమేశ్ విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పారిపోతున్న నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపిలో పట్టుకుని అక్కడ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ► అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై శనివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో విశాఖకు తీసుకొచ్చారు. ► అనంతరం కరోనా టెస్ట్‌తో పాటు వైద్యపరీక్షలు నిర్వహించారు. ► కరోనా టెస్ట్ నెగిటివ్ రావడంతో ఆదివారం ఆయనని కోర్టులో హాజరుపర్చగా కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ► పి.వి.రమేశ్ పేరుతో పైరవీలు చేయడంపై కంచరపాలెం, గోపాలపట్నం, గాజువాక పోలీస్ స్టేషన్లలోనూ నూతన్‌పై కేసులు నమోదయ్యాయి. -
చెప్పేది ఒక్కటి చేసేది మరొకటి
-
గాజువాక సీఐకి నూతన్ నాయుడు ఫోన్..
సాక్షి, విశాఖపట్నం : కొందరు చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నట్లు ఉంటారు. దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్ట అయిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వీరాభిమాని, బిగ్‌బాస్ ఫేమ్, సినీ దర్శకుడు నూతన్ నాయుడి తీరు అలానే ఉంది. పెందుర్తి సమీపంలోని సుజాతనగర్లో ఆయన ఇంటి చుట్టు పక్కల నీతి వాక్యాలతో కూడిన ప్లెక్సీలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘కోపం.. అసూయ.. అబద్ధాలు.. మోసం.. ఇలాంటి వ్యవహారాలు చేస్తే జీవితం మొత్తం పతనమవుతుంది’ అంటూ ఫ్లెక్సీలు కనిపిస్తాయి. కలశ ఫౌండేషన్ పేరిట తన ఇంటి చుట్టూ ఆశ్యర్యపరిచేలా ఫ్లెక్సీలుంటున్నాయి. కానీ ఆయన చేసే మోసాలు లెక్క కట్టలేని విధంగా ఉన్నాయి. దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన 24 గంటల్లోనే గాజువాక పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ పేరిట సుమారు 30 మందికి పైగా అధికారులకు ఫోన్లు చేసి పైరవీలకు పాల్పడిన నూతన్ నాయుడు మోసాలు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్‌కి చేసిన ఫోన్‌తో బట్టబయలైన విషయం తెలిసిందే. ఒకవైపు శ్రీకాంత్‌కు శిరోముండనం సంఘటనలో నూతన్ నాయుడు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా స్పష్టం చేయగా... మరోవైపు మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ పేరిట పైరవీలకు పాల్పడిన కేసులను పోలీసులు ఒక్కోకటి దర్యాప్తు చేస్తూ బయటపెడుతున్నారు. గాజువాక సీఐకి నూతన్ నాయుడు ఫోన్ గతంలో గాజువాక పోలీస్‌స్టేషన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యారు. నూతన్‌నాయుడు తాను మాజీ ఐఏఎస్ అధికారినని అరెస్టయిన వ్యక్తిని వదిలేయమని గాజువాక సీఐకి ఫోన్ చేశాడు. అతడు ట్రాఫిక్ సీఐకి కాల్ ట్రాన్స్ఫర్ చేయగా.. అది సీఎంఓ ఆఫీస్ నెంబర్ కాదనేసరికి ఫోన్ కట్చేసేశారు. ఈ కేసులో కూడా నూతన్ నాయుడిపై కేసు నమోదు చేశారు. అలాగే శ్రీదేవి కేబుల్ టీవీలో షేర్స్ కావాలని.. ఆ సంస్థ ఉద్యోగికి ఫోన్ చేశాడు. మిగతా కాల్స్‌ను కూడా ఒక్కొక్కటి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖకి నూతన్ నాయుడు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి నూతన్‌నాయుడిని అరెస్ట్ చేసి శుక్రవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచారు. శనివారం విశాఖకు బయలుదేరారు. ఆదివారం ఉదయానికి నూతన్నాయుడుని విశాఖకు తీసుకురానున్నారు. -
నూతన్ నాయుడు చేసింది తీవ్రమైన నేరం..
సాక్షి, అమరావతి : శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడుపై ఏపీ సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పేరు చెప్పి అధికారుల నుంచి సహాయం పొందేందుకు నూతన్ నాయుడు యత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరు చెప్పి పలువురి అధికారులకు ఫోన్ చేశాడని.. డబ్బులు, ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని పీవీ పేర్కొన్నారు. తన పేరు ప్రతిష్టలను కూడా నాశనం చేశాడని మండిపడ్డారు. తన పేరుతో అధికారులకు ఫోన్ చేయడాన్ని ఆయన ఖండించారు. నూతన్ నాయుడు చేసింది తీవ్రమైన నేరమని ఆయన అన్నారు. ‘ఆగస్ట్ 29న నా పేరును ఉపయోగించి, నా మాటను అనుకరిస్తూ ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు కాల్ చేశారు. ఒక పేషేంట్ వస్తున్నారు, 15 రోజులు పాటు ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ ప్రిన్సిపాల్‌తో చెప్పారు. నా గొంతును అనుకరిస్తూ మాట్లాడటంతో అనుమానం వచ్చి ప్రిన్సిపాల్ సుధాకర్ నాకు కాల్ చేశారు. ఎవరో నా మాట అనుకరిస్తున్నారు అనే విషయాన్ని డీజీపీ, అడిషనల్ డీజీపీ, విశాఖ సీపీకి ఫిర్యాదు చేశాను. ఆ ఫోన్ నెంబర్ హైదరాబాద్ అడ్రస్ ఉందని విచారణలో తేలింది. ఆ నంబర్‌కు కాల్ చేస్తే‘అడిషనల్ సీఎస్ సీఎం’ అని వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నా మాట అనుకరిస్తూ ఫోన్ చేస్తున్న వారి మాటలు నమ్మకండి’అని రమేష్ పేర్కొన్నారు. (చదవండి : శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్) కాగా, నూతన్ నాయుడు గురువారం అరెస్టయిన విషయం తెలిసిందే. శిరోముండనం కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. కాగా, దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
నూతన్ నాయుడు అరెస్ట్
-
శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం కేసులో బిగ్ బాస్ ఫేమ్, సినీ నిర్మాత నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపి రైల్వేస్టేషన్లో గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగిన నాటి నుంచి నూతన్ నాయుడు పరారీలో ఉన్నాడన్నారు. ఘటన జరిగాక మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ పేరు చెప్పి పైరవీలు చేశాడని చెప్పారు. దీంతో నూతన్ నాయుడిపై చీటింగ్ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశామన్నారు. శుక్రవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. ► శిరోముండనం కేసులో ఆగస్టు 29న ఏడుగురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేయగా కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌కి ఫోన్ చేసి తాను మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్‌నని ప్రియా మాధురి (నూతన్ భార్య)కి రెండు వారాలపాటు ఆస్పత్రిలో వైద్యం అందించాల్సి ఉందంటూ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరాడు. ► కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌కి పి.వి.రమేష్ పరిచయం ఉండడంతో అనుమానం వచ్చి ఆయనకు ఫోన్ చేసి మీ పేరుతో ఎవరో ఫోన్ చేస్తున్నారని చెప్పారు. ► దీంతో పి.వి. రమేష్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ నంబర్ని ట్రేస్ చేయగా.. ముంబై వెళుతున్న నూతన్ నాయుడు ఉడిపి రైల్వేస్టేషన్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
నూతన్ నాయుడు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం : శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు పాత్ర ఉందని తేలిన తరువాతనే అతన్ని అరెస్ట్ చేశామన్నారు. దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇదివరకే ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్ విధించింది (శిరోముండనం కేసు: దాడి దృశ్యాలు ఎవరికి పంపారు?) తన మధుప్రియను భార్యను కేసు నుంచి తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవి రమేష్ పేరిట నూతన్ నాయుడు పలువురు అధికారులకు ఫోన్‌చేసి మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. శిరోమండనము ఘటనకు ముందు వెనుక నూతన్ నాయుడు భార్యతో వీడియో కాల్లో మాట్లాడినట్లు తేలింది. కేసు వివరాల ప్రకారం.. నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేసి మానివేసిన దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌ను సెల్‌ఫోన్ పోయిందనే నెపంతో ఇంటికి పిలిపించి శిరోముండనం చేయడంతో పాటు దారుణంగా హింసించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన 24 గంటల వ్యవధిలోనే నూతన్ భార్యతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. శ్రీకాంత్‌పై చేసిన అకృత్యాలను సెల్ఫీలు తీసి పైశాచిక ఆనందం పొందిన నిందితులు అక్కడితో ఆగకుండా వీడియోలు తీశారు. అయితే శిరోముండనం, దాడి దృశ్యాలను ఎవరికైనా పంపించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. (శిరోముండనం కేసులో నిందితులకు రిమాండ్) -
శిరోముండనం కేసు: దాడి దృశ్యాలు ఎవరికి పంపారు?
సాక్షి, విశాఖపట్నం: పవన్ కల్యాణ్ వీరాభిమాని అలియాస్ బిగ్‌బాస్ ఫేం అలియాస్ సినీ దర్శక నిర్మాత.. వీటన్నింటికీ మించి వివాదాస్పద వ్యక్తిగా ఉన్న నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన దురాగతం కేసులో సెల్‌ఫోన్ వీడియో కాల్ కీలకం కానుంది. నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేసి మానివేసిన దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌ను సెల్‌ఫోన్ పోయిందనే నెపంతో ఇంటికి పిలిపించి శిరోముండనం చేయడంతో పాటు దారుణంగా హింసించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన 24 గంటల వ్యవధిలోనే నూతన్ భార్యతో సహా ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు కేసు విచారణను వేగవంతం చేశారు. శ్రీకాంత్‌పై చేసిన అకృత్యాలను సెల్ఫీలు తీసి పైశాచిక ఆనందం పొందిన నిందితులు అక్కడితో ఆగకుండా వీడియోలు తీసి ఎవరికైనా పంపించారా? అన్న అనుమానాలను పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. (శిరోముండనం కేసులో నిందితులకు రిమాండ్) ఆ ఘటన సమయంలో ఎవరికైనా వీడియో కాల్ చేశారా.. శిరోముండనం, దాడి దృశ్యాలను ఎవరికైనా పంపించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో దాడి దృశ్యాలను చిత్రీకరించిన సెల్‌ఫోన్ ఇప్పుడు కీలకం కానుంది. అయితే వీడియో షూట్ చేసిన తర్వాత నిందితురాలు బ్యూటీషియన్ ఇందిరారాణి సెల్ ఫోన్లోని దృశ్యాలను వెంటనే తొలగించేశారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తిరిగి సమాచారాన్ని పొందేందుకు పోలీసులు సదరు సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వస్తే నిందితులు ఆ ఘటన సమయంలో వీడియో కాల్ ఎవరికైనా చేశారా.. దాడి దృశ్యాలను ఎవరికైనా ఫార్వార్డ్ చేశారా... అన్న విషయాల్లో స్పష్టత వస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. (శిరోముండనం : దోషులకు కఠిన శిక్ష తప్పదు) అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ప్రస్తుతం నూతన్ నాయుడు చేస్తున్న వ్యాపారాలు ఏమిటి... అసలు ఇంట్లో అంత మంది పని వాళ్లను పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంతమంది పని వాళ్లనైనా పెట్టుకోవడమనేది... ఎవరి వ్యక్తిగత హోదా, ఆర్థిక స్థాయిని బట్టి ఉంటుంది కానీ.. ఏకంగా బ్యుటీషియన్, సూపర్ వైజర్లు సహా ఐదుగురు పనివాళ్లను పెట్టుకున్న వ్యవహారంపై పోలీసులు కాపీ లాగుతున్నారు.(శిరోముండనం కేసులో నిందితులకు 2 వారాల రిమాండ్) -
శిరోముండనం : దోషులకు కఠిన శిక్ష
సాక్షి, విశాఖపట్నం : శిరోముండనం ఘటన బాధితుడైన దళిత యువకుడికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అరాచకాలకు అవకాశం లేదని, ఇలాంటి ఘటనలు జరగడం దుదరృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజీ చూస్తే ఆ యువకుడిపై ఎంత అహంకారంతో ప్రవర్తించారో అర్ధమవుతుందన్నారు. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని తెలిపారు. నూతన్‌నాయుడు భార్యతోపాటు ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని, శిరోముండనం ఘటనపై టీడీపీ నేతలు నోరుమెదపడలేదని ప్రశ్నించారు. (నీతిలేని ‘నూతన్’) నూతన్‌నాయుడు భార్యతోపాటు ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని, శిరోముండనం ఘటనపై టీడీపీ నేతలు నోరుమెదపడలేదని ప్రశ్నించారు. నూతన్‌నాయుడితో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయని, జనసేనకూ సన్నిహితుడు అన్నారు. ఈ ఘటనలో దోషులకు కఠినశిక్ష తప్పదు ఎమ్మెల్యే హెచ్చరించారు. మరోవైపు శిరోముండనం ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (శ్రీకాంత్‌కు మంత్రి అవంతి పరామర్శ) -
శ్రీకాంత్‌కు మంత్రి అవంతి పరామర్శ
సాక్షి, విశాఖ : శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళితులపై దాడులను ప్రభుత్వం సహించదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఘటన జరిగిన తీరుతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రీకాంత్ కు బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. (చదవండి: తలబిరుసు.. లెక్కలేనితనం..) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన లో దళితులు, బలహీన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్‌కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్‌కు అందజేశారు. ఈ ఘటనలో ఇప్పటికే నిందితులు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి అవంతి తెలిపారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న నూతన్ నాయుడు భార్య మధు ప్రియతో పాటు మిగతా వారికి న్యాయస్థానం రెండువారాలు రిమాండ్ విధించింది. -
అనారోగ్యం నాటకమాడిన మధుప్రియ
సాక్షి, విశాఖపట్నం: శిరోముండనం కేసులో నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్ విధించింది. దీంతో నూతన్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిని పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితులను విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు శిరోముండనం వ్యవహారంలో నూతన్ నాయుడు ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక జ్యుడీషియల్ రిమాండ్ నుంచి తప్పించుకునేందుకు మధుప్రియ అనారోగ్యం అంటూ నాటకం ఆడారు. అయితే కేజీహెచ్ వైద్య పరీక్షల్లో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: దళిత యువకుడికి శిరోముండనం) చదవండి: (కర్రలు విరిగేటట్లు కొట్టి.. వీడియో తీశారు) -
దళితుడిపై దాడి
-
శిరోముండనం కేసులో నిందితులకు 2 వారాల రిమాండ్
-
తలబిరుసు.. లెక్కలేనితనం..
పెందుర్తి: యువకుడి శిరోముండనం ఘటనపై దళితులు భగ్గుమన్నారు. న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. తక్షణం స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిందితుల్ని కొద్ది గంటల్లో అరెస్ట్ చేసింది. భర్త అనుమతి తీసుకోకుండా నూతన్ భార్య మధుప్రియ ఈ దాష్టీకానికి ఒడిగడుతుందా..? అని దళిత సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. లెక్కలేనంత డబ్బుందని.. సమాజం అంటే ఆయనకు లెక్కలేదని గతంలో ఆయన వ్యవహార శైలిని ఈ ఘటనతో గుర్తు చేసుకున్నారు స్థానికులు. సెలబ్రిటీ హోదాను ఇచ్చిన ప్రజల్ని మరిచి విచక్షణా రహితంగా ప్రవర్తించడం ఆయనకు కొత్తేమీ కాదని చెబుతున్నారు గోపాల్కృష్ణనగర్ వాసులు. (చదవండి: కర్రలు విరిగేటట్లు కొట్టి.. వీడియో తీశారు) ‘తమ ప్రాంతానికి నూతన్‌నాయుడు వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాం.. అతడిది అంతా హైఫ్రొఫైల్. ఎవరినీ లెక్క చేయడు. ఇతరులంటే చాలా చులకన. కనీసం మానవత్వం ఉండదు.’ తన ఇంటి గార్డెన్ కోసం ఇంటి ముందు ఉన్న 40 అడుగుల రోడ్డులో చాలా భాగం ఆక్రమించేశాడు. ఈ విషయంపై అడుగుదాం అని ఇంటికి వెళితే కనీసం లోపలకు కూడా వెళ్లనివ్వలేదు. సమాజంపై పూర్తిగా నిర్లక్ష్యం భావంతో ఉంటాడు’ ఇవీ సుజాతనగర్‌లోని గోపాలకృష్ణనగర్ వాసులు ఆరోపణలు. తన ఇంట్లో పని మానేశాడన్న నెపంతో ఏకంగా దళిత యువకుడు శ్రీకాంత్‌పై తన మనుషులు దాడి చేసి శిరోముండనం చేయించిన ఘటనతో నూతన్‌నాయుడు వ్యవహారశైలి స్థానికంగా చర్చకు వచ్చింది. సినీ నిర్మాతగా.. దర్శకుడిగా చెలామణి అవుతున్న నూతన్ నాయుడు నగరంలోని మాజీ మేయర్, టీడీపీ నేతకు వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు. 2014 వరకు సమాజానికి పెద్దగా పరిచయం లేని నూతన్‌నాయుడు జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా వెలుగులోకి వచ్చాడు. నాటి ఎన్నికల సమయంలో నూతన్‌నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పుడు నూతన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో కొన్ని తప్పుడు పత్రాలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అతడి ప్రభావం అంతగా లేకపోవడంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు అతడ్ని ‘లైట్’ తీసుకున్నారు. తరువాత కొన్నాళ్ల అజ్ఞాతంలో ఉన్న నూతన్ బిగ్‌బాస్–2తో మళ్లీ బాహ్యప్రపంచంలోకి వచ్చాడు. ఆ తరువాత చిన్నాచితకా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా ప్రముఖ సినీదర్శక నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ తీసిన పవర్‌స్టార్ సినిమాకు కౌంటర్‌గా పరాన్నజీవి సినిమాతో దర్శక అవతారం ఎత్తాడు. (చదవండి: శిరోముండనం కేసు: ఏడుగురు అరెస్ట్) రోడ్డును ఆక్రమించి తీర్చిదిద్దిన గార్డెన్.. నాడు అధికారంతో.. నేడు డబ్బుమదంతో మూడేళ్ల క్రితం పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో ఓ దళిత మహిళను టీడీపీ నాయకులు ఘోరాతిఘోరంగా అవమానించారు. ఆ ఘటనతో టీడీపీ పతనం ప్రారంభమైంది. మళ్లీ ఇప్పుడు నూతన్‌నాయుడు ఇంట్లో జరిగిన తాజా ఘటన మరింత సంచలనం రేపింది. తన ఇంట్లో పని మానేశాడన్న నెపంతో సెల్‌ఫోన్ దొంగతనం అంటగట్టిన నూతన్నాయడు భార్య మధుప్రియ, బ్యుటీషియన్ ఇందిర సహా ఏడుగురు వ్యక్తులు శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించారు. డబ్బుందన్న అహంకారంతో సభ్యసమాజం తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. నిజంగా శ్రీకాంత్ సెల్‌ఫోన్ దొంగతనం చేసుంటే అతడు పనిమానేసి దాదాపు నెల రోజులు కావస్తుంది. మరి ఇన్నాళ్ళు నూతన్ కుటుంబ సభ్యులు, పనివారు అతడిపై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.. అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే హోదా ఉందన్న తలబిరుసు.. బాధితుడికి ఎవరూ లేరన్న ఆలోచనతో ఈ దాడికి పాల్పడినట్లు తేటతెల్లం అవుతుంది. ఇందులో నూతన్‌నాయుడు పాత్ర నేరుగా లేకపోయినా.. భర్త అనుమతి తీసుకోకుండా నూతన్ భార్య మధుప్రియ ఈ దాష్టీకానికి ఒడిగడుతుందా..? అని దళిత సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. -
కర్రలు విరిగేటట్లు కొట్టి.. వీడియో తీశారు
సాక్షి, విశాఖపట్నం: ‘సెల్‌ఫోన్ దొంగలించాడన్న అనుమానంతో దళితుడైన పర్రి శ్రీకాంత్‌ను దారుణంగా హింసించారు. కర్రలు విరిగేటట్టు కొట్టారు. చిత్రహింసలు పెడుతూ వీడియోలు తీశారు. శిరోముండనం చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు సేకరించాం. ఈ దారుణ ఘటనలో ఉన్నవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. ఏడుగురిని అరెస్టు చేశాం’ అని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిమాని, బిగ్‌బాస్ ఫేమ్, సినీ దర్శకుడు నూతన్‌నాయుడు ఇంట్లో 20 ఏళ్ల దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌కు శిరోముండనం చేసి దారుణంగా హింసించిన సంఘటనకు సంబంధించిన వివరాలు కమిషనర్ శనివారం మీడియాకు వివరించారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి పిలిచి కొట్టారు.. ► విశాఖలోని గోపాల్కృష్ణనగర్లో నివాసం ంటున్న నూతన్‌నాయుడు ఇంట్లో శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ నాలుగు నెలల క్రితం పనికి చేరాడు. వ్యక్తిగత కారణాలతో నెల రోజుల క్రితం పని మానేశాడు. ► తమ ఇంట్లో ఐఫోన్ పోయిందని.. దాని గురించి మాట్లాడాలి ఇంటికి రావాలని నూతన్‌నాయుడి భార్య ప్రియామాధురి గతంలో శ్రీకాంత్‌ని పిలిచి విచారించారు. ► మళ్లీ శుక్రవారం మధ్యాహ్నం మరోసారి శ్రీకాంత్‌ను ఇంటికి పిలిచి తన సిబ్బందితో కొట్టించారు. బార్బర్‌ను పిలిపించి గుండు గీయించారు. ఈ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ► అనంతరం అక్కడ నుంచి బయటపడిన శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఆధారాల సేకరణ ► ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు నూతన్‌నాయుడి ఇంటికి వెళ్లి సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను సేకరించారు. ► వీటి ఆధారంగా నూతన్‌నాయుడి భార్య ప్రియా మాధురి, బ్యూటీషియన్ ఇందిరారాణి, సూపర్వైజర్ వరహాలు, బార్బర్ రవికుమార్, పనిమనుషులు బాల గంగాధర్, సౌజన్య, ఝాన్సీలను అరెస్టు చేశారు. ► వీరికి కోవిడ్ పరీక్ష అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తామని సీపీ తెలిపారు. ► ఈ సంఘటనలో నూతన్‌నాయుడి ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ► మీడియా సమావేశంలో డీసీపీ(క్రైం) సురేష్‌బాబు, ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ ఏసీపీ త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. పగబట్టి కొట్టారు తాను వాళ్ల ఇంట్లో ఉద్యోగం మానేసి వేరోచోట చేరాననే పగతోనే తనను కొట్టి, గుండు గీయించారని బాధితుడు శ్రీకాంత్ మీడియాతో చెప్పాడు. సెల్‌ఫోన్‌తో తనకేమీ సంబంధం లేదంటున్నా వినకుండా ఇందిరారాణి దారుణంగా కొట్టిందన్నారు. తన ఫోటోలు స్కాన్ చేసి బయట పెట్టావంటూ ఇందిర ఆరోపించిందని తెలిపాడు. తానిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టడం సంతోషంగా ఉందన్నాడు.