బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం | Bigg Boss Telugu Nutan Naidu Father Passed Away | Sakshi
Sakshi News home page

Nutan Naidu: బాధలో బిగ్‪‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడు

Published Sun, Oct 13 2024 7:22 AM | Last Updated on Sun, Oct 13 2024 8:33 AM

Bigg Boss Telugu Nutan Naidu Father Passed Away

బిగ్‌బాస్ పలువురు గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్లలో నూతన్ నాయుడు ఒకరు. వైజాగ్‌కి చెందిన ఇతడు ఒకటి అరా సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ 2వ సీజన్‌లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. కుటుంబం గురించి మాట్లాడొద్దు అని కౌశల్‌తో గొడవపెట్టుకున్నది ఇతడే. ఇప్పుడు ఈయన ఇంట్లోనే విషాదం చోటుచేసుకుంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8: కిర్రాక్‌ సీత ఎలిమినేట్‌)

గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడిన నూతన్ నాయడు తండ్రి సన్యాసి రావు నాడు.. పండగపూట అంటే శనివారం ఉదయం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. ఉత్తరాంధ్ర తరఫున కాంగ్రెస్ సీనియర్ నేతగా ఈయనకు గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ ప్రముఖులు ఈయన సంతాపాన్ని తెలియజేశారు.

బిగ్‌బాస్ షోలో వచ్చిన గుర్తింపుతో కమెడియన్, విలన్‌గా ఛాన్సులు అందుకున్నాడు. కానీ వాటి ద్వారా పెద్ద ఫేమ్ తెచ్చుకోలేకోయాడు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నాడు.

(ఇదీ చదవండి: మణి హగ్గుల పిచ్చి.. ఈ చెండాలం చూడలేకున్నాం సామీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement