
వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత జరగబోయే మొదటి ఎలిమినేషన్ ఇది! ఈవారం నామినేషన్‌లో యష్మి, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, గంగవ్వ, మెహబూబ్ ఉన్నారు. వీరిలో గంగవ్వ తగ్గేదేలే అన్న రీతిలో ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిన హోటల్ టాస్క్‌లోనూ నవ్వించి టాలెంట్ చూపించింది యష్మి. ఖాళీ సమయాల్లో ఎలా ఉన్నాకానీ టాస్క్‌లో ఉన్నప్పుడు మాత్రం పూర్తిగా అందులోనే లీనమైపోతుంది.
అదే యష్మిని కాపాడుతోంది
ఈ లక్షణమే యష్మికి శ్రీరామరక్ష. అందుకే విపరీతమైన నెగెటివిటీ ఉన్నా సరే ఈ టాస్క్ పుణ్యమా అని భారీగా ఓట్లు పడ్డాయి. విష్ణుప్రియ.. ఆడినా, ఆడకపోయినా తన ఫ్యాన్స్ ఆమెను కాపాడుకుంటూ వస్తున్నారు. మెహబూబ్ అందరితో పెద్దగా కలవకపోయినా ఆటలో మాత్రం దూకుడు చూపిస్తున్నాడు. పైగా ఈ వారం మెగా చీఫ్ కూడా అయ్యాడు. కాబట్టి అతడు కూడా డేంజర్ జోన్‌లో లేడు.

సీత గ్రాఫ్ పాతాళానికి..
మిగిలింది పృథ్వీ, సీత.. ఈ ఇద్దరిలో కంటెస్టెంట్ల వెనకాల మాట్లాడే అలవాటు సీతకు ఉంది. అలాగే టాస్క్‌లోనూ ఫౌల్ గేమ్ ఆడింది. ఒకప్పుడు రాకెట్‌లా రయ్యిమని సీత గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కానీ తన ప్రవర్తన, తీసుకునే నిర్ణయాల వల్ల అంతే జెట్ స్పీడ్‌లో తన గ్రాఫ్ కిందకు పడిపోయింది. దీంతో ఈవారం సీతపైనే ఎలిమినేషన్ వేటు పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా అందులో సీతనే ఎలిమినేట్ చేసి పంపించేశారట!
Comments
Please login to add a commentAdd a comment