ప్రేక్షకులు సున్నిత మనస్కులు.. నిజ జీవితంలో ఎవరు ఎటు పోయినా పట్టించుకోరు కానీ స్క్రీన్‌పై ఎవరైనా కన్నీళ్లు పెట్టుకున్నా, గోడు వెల్లబోసుకున్నా ఇట్టే కరిగిపోతారు. పోనీ, అవి నిజమైన కన్నీళ్లేనా? మొసలి కన్నీళ్లా? అని కూడా ఆలోచించరు.
సింపతీ గేమ్
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్ మణికంఠ. ఒకసారి ఏడిస్తే ఓకే, రెండోసారికీ ఓకే.. కానీ మూడోసారి, నాలుగోసారి.. హుష్.. తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకుని పదేపదే ఏడుస్తుంటే హౌస్‌మేట్స్‌కు విసుగొచ్చింది. ఇతడేదో సింపతీ ట్రై చేస్తున్నాడని నామినేట్ చేశారు. కానీ ఆడియన్స్.. అతడి బాధకు చలించిపోయి సేవ్ చేసుకుంటూ వస్తున్నారు.
హగ్గు కోసం నిస్సిగ్గుగా..
భార్యాబిడ్డ కావాలంటూ కెమెరాల ముందు బోరున ఏడ్చేసిన ఇతడు హౌస్‌లో అమ్మాయిలతో ప్రవర్తించే తీరు అసభ్యంగా ఉంటోంది. ఆ మధ్య యష్మి ఇబ్బందిగా ఫీలవుతున్నా సరే వినిపించుకోకుండా హగ్ చేసుకున్నాడు. సోనియాను సైతం చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసుకుని హగ్ కావాలంటూ అడుక్కుని మరీ తనను హత్తుకున్నాడు.
క్లాస్ పీకిన నాగ్
దీనికి బ్రేక్ వేయాల్సిందేనని భావించిన నాగార్జున.. మణిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మరీ క్లాస్ పీకాడు. నీ లక్ష్యం ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంటి? అంటూ హగ్గుల వీడియో చూపించి మరీ కడిగిపారేశాడు. దీంతో తప్పయిపోయిందని, ఇంకోసారి అలా చేయనని మాటిచ్చాడు. అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు.. ఎప్పటిదాకా అంటే.. వైల్డ్ కార్డుల ఎంట్రీదాకా!
గాల్లో తేలిన మణి
కొత్తగా వచ్చిన వైల్డ్‌కార్డులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తనపై జాలి చూపిస్తున్నట్లుగా, తనకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడటంతో అతడిలో కొత్త శక్తి ప్రవేశించింది. పైగా ప్రతివారం నామినేషన్స్‌లో ఉండే అతడు ఈవారం వైల్డ్ కార్డుల పుణ్యమా అని నామినేషన్స్‌లో కూడా లేకుండా పోయాడు. ఇంకేముంది, గాల్లో తేలినట్లుందే అని పాటలు పాడుకున్నాడు. అదీ బాగానే ఉంది.. తర్వాతే మళ్లీ రెచ్చిపోయాడు.
మళ్లీ మొదటికి..
రోహిణిని వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. నయని పావనిని కూడా వదల్లేదు. ఆమెను కూడా వెనకనుంచి వచ్చి హత్తుకున్నాడు. తనకెలా ఉందో కానీ చూసే ఆడియన్స్‌కు మాత్రం మహా చెండాలంగా ఉంది. అవతలి వ్యక్తికి తెలియకుండా వెనక నుంచి హత్తుకోవడమనేది చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ఈ సెకలే తగ్గించుకోమని నాగ్ చెప్పినా మణి మళ్లీ అదే దారిలో వెళ్తున్నాడు. మరి ఇతడికి నాగ్ ఈసారి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment