Naga Manikanta
-
భార్యపై ట్రోలింగ్.. మణికంఠ రియాక్షన్ ఇదే!
బిగ్‌బాస్ కప్పు గెలవడం ముఖ్యమన్న నాగమణికంఠ ఏడోవారంలో తనకు తానే సొంతంగా బయటకు వచ్చేశాడు. ఎలిమినేట్ అయినందుకు అతడు సంతోషంగానే ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో అతడు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'నేను జనాల్ని అంత ఈజీగా నమ్మను. అందుకే మొదట్లో అందరితోనూ దూరంగానే ఉన్నాను. గౌరవం కోరుకున్నా..నేను ఏం మాట్లాడినా, ఏం చేసినా తప్పు పట్టడంతో సైలెంట్ అయిపోయాను. బిగ్‌బాస్ ద్వారా డబ్బు, గౌరవం సంపాదించుకోవాలనుకున్నాను. కానీ వారాలు గడిచేకొద్దీ నా శరీరం సహకరించలేదు. ఫిజికల్ టాస్కులు ఆడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకోవాలనుకోలేదు. కాకపోతే జీవితంలో ఎలా బతకాలనేది నేర్చుకున్నాను. నేను మారానని నా భార్య తెలుసుకుంది. అందుకు సంతోషంగా ఉన్నాను.నెగెటివ్ కామెంట్స్..తేడా, గే అనే కామెంట్లపై స్పందిస్తూ.. బిగ్‌బాస్‌కు ముందు ప్రతి చిన్నదాన్ని పట్టించుకునేవాడిని, బాధపడేవాడిని. కానీ ఇప్పుడు ఇలాంటి నెగెటివ్ కామెంట్లను అస్సలు లెక్క చేయను. నా పెళ్లి వీడియో వైరలయినప్పుడు కూడా నా భార్య ప్రియపై నెగెటివ్ కామెంట్లు చేశారు. కాస్తయినా జ్ఞానం ఉండాలి. తెలివితక్కువవాళ్లు ఇలాంటి పనికిమాలిన పనే చేస్తూ ఉంటారు. కానీ నా భార్య నాకు అందగత్తె. తన మనసు ఎంతో అందమైనది. నన్ను బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లే భరించలేకపోయారు. కానీ తను జీవితాంతం భరిస్తోంది. తను చాలా గొప్పది' అని చెప్పుకొచ్చాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా
బిగ్‌బాస్ 8లో విచిత్రమైన క్యారెక్టర్ అంటే మణికంఠనే. ఎప్పుడేం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడనేది అస్సలు అర్థం కాదు. వచ్చిన కొత్తలో భార్యబిడ్డలు కావాలి అని నానా హంగామా చేశాడు. ఇప్పుడవన్నీ పక్కనబెట్టి సరిగా ఆడుతున్నాడేమో అనుకుంటే.. ఆరోగ్యం బాగోలేదని చెప్పి తనకు తానుగా బయటకొచ్చేశాడు. తీరా ఇప్పుడేమో మాటలు మార్చేస్తున్నాడు. బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నకు తిన్నగా సమాధానం చెప్పకుండా అర్జున్‌కే ఝలక్స్ ఇచ్చాడు.గెలవాలనే ఆలోచనతో వచ్చిన మీరు.. కనీసం చీఫ్ అవ్వకుండానే బయటకు ఎందుకొచ్చారు? అని హోస్ట్ అర్జున్ అడగ్గా.. విన్నర్ అవ్వాలనే ఆలోచనతో అయితే నేను రాలేదని అన్నాడు. దీంతో అర్జున్ నోరెళ్లబెట్టాడు. అదెంత పెద్ద కంటెంటో తెలుసా అని ఆశ్చర్యపోయాడు. 'నా పెళ్లాం బిడ్డ నాకు కావాలి. నా రెస్పెక్ట్ నాకు కావాలి' అని మణికంఠలా ప్రవర్తించి అర్జున్ చూపించాడు. అప్పటివరకు నవ్వు ముఖంతో ఉన్న మణికంఠ కాస్త దెబ్బకు డీలా పడిపోయాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కేరింత' సినిమా హీరో)గోరంత దాన్ని కొండంత చేస్తావ్ అని హౌస్మేట్స్ అభిప్రాయం.. దీనిపై ఏమంటావ్ అని అడగ్గా.. నేను ఆలోచించే విధానం అలా ఉంటుంది కాబట్టి రియాక్ట్ అయ్యే విధానం కూడా అలానే ఉంటుందని మణికంఠ చెప్పాడు. సరే ఇవన్నీ కాదు గానీ హౌస్‌లో నువ్వు చేసిన పాజిటివ్ విషయం ఒకటి చెప్పు అని అర్జున్ అడగ్గా.. నేను నాలా ఉండటమే పాజిటివ్ అని మణికంఠ తలతిక్క సమాధానం చెప్పాడు.నీకు సాయం చేసిన వాళ్లనే నువ్వు వెన్నపోటు పొడిచావ్ అంటే ఏమంటావ్? అని అడగ్గా.. ఇదైతే అస్సలు అంగీకరించను అని మణికంఠ ససేమిరా అన్నాడు. హౌస్‌లో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని మీకు అనిపించిందా? అంటే తడముకోకుండా నిఖిల్ పేరు చెప్పాడు. ఇక పృథ్వీ-విష్ణుప్రియ మధ్య రెండు వైపుల నుంచి ప్రేమ చిగురిస్తోందని చెప్పి షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. 'ఇది మాకు తెలీదయ్యో' అని హోస్ట్ అర్జున్ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?) -
పాపం గౌతమ్.. వెళ్లిపోయేముందు వాళ్లను ముంచేసిన మణికంఠ
బిగ్‌బాస్ అనేది గోల్డెన్ ఛాన్స్. ప్రేక్షకులకు దగ్గరచేసే సాధనం, ఫ్రీ పబ్లిసిటీ! అలాంటిది.. ప్రేక్షకులు తనను సేవ్ చేసినా కాదనుకుని వెళ్లిపోయాడు. షో గెలుస్తానన్న అతడు ఏడువారాలకే తన వల్ల కావట్లేదని చేతులెత్తేశాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..రెండు జంటల డ్యాన్స్ హైలైట్బిగ్బాస్ హౌస్‌లో అందరూ సమానమే.. లింగబేధం, కమ్యూనిటీ బేధాలుండవని నాగార్జున హౌస్‌మేట్స్‌కు నొక్కి చెప్పాడు. దీంతో కమ్యూనిటీ గురించి మాట్లాడిన నబీల్, మెహబూబ్ ముఖం వాడిపోయింది. తర్వాత నాగ్.. యష్మిని సేవ్ చేసి హౌస్‌మేట్స్‌తో చిత్రం భళారే విచిత్రం గేమ్ ఆడించాడు. ఇందులో అబ్బాయిల టీమ్ విజయం సాధించింది. ఈ గేమ్‌లో విష్ణు-పృథ్వీ, యష్మి- గౌతమ్ జంటల డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. తర్వాత నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.డైలాగ్ డెడికేషన్హౌస్మేట్స్పై సోషల్ మీడియాలో వైరలవుతున్న కొన్ని మీమ్స్ చూపించడంతో అందరూ పగలబడి నవ్వారు. నబీల్ను సేవ్ చేసిన అనంతరం డైలాగ్ డెడికేషన్ అని మరో గేమ్ ఆడించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా కొన్ని డైలాగులను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. అలా మొదటగా నిఖిల్.. నువ్వు ఊరుకోమ్మా.. ఊరికే తుత్తుత్తు అంటావ్.. అన్న డైలాగ్ బోర్డును ప్రేరణ మెడలో వేశాడు. హరితేజ.. వీడిని ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా డైలాగ్ నాగమణికంఠకు అంకితమచ్చింది. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారుతేజ.. అదంతా అప్పుడండి.. ఇప్పుడు నేను మారిపోయాను డైలాగ్ అవినాష్‌కు సూట్ అవుతుందన్నాడు. విష్ణుప్రియ.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు డైలాగ్ గంవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందంది. తు సమ్జా.. నై సమ్జా డైలాగ్ పృథ్వీకి సరిపోతుందన్నాడు మెహబూబ్. ఇక నయని.. నవ్వాపుకుంటున్నావ్ కదరా డైలాగ్ బోర్డును విష్ణు మెడలో వేసింది. అన్న రూల్స్ పెడ్తాడు కానీ ఫాలో అవడు డైలాగ్ నిఖిల్‌కు సెట్ అవుతుందన్నాడు గౌతమ్. సరె సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి? అన్న డైలాగ్‌ను విష్ణు మెడలో వేసింది రోహిణి. బేసిక్ సెన్స్ ఉండదునాకు అర్థం కాలేదు సార్ డైలాగ్ పృథ్వీకి సెట్ అవుతుందన్నాడు మణి. నువ్వు అంత హార్ష్‌గా మాట్లాడకు, ఫీల్ అవుతాను డైలాగ్ తేజకు డెడికేట్ చేసింది యష్మి. నబీల్ వంతు రాగా.. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం డైలాగ్‌ను గౌతమ్‌కు అంకితమిచ్చాడు. గంగవ్వ.. బేసిక్ సెన్స్ ఉండదు, అంటే ఏమో హర్ట్ అయిపోతారు అన్న డైలాగ్ నయనికి డెడికేట్ చేసింది. ఓవరాక్షన్ చేస్తున్నావేంట్రా, ఓవరాక్షన్ అన్న బోర్డును అవినాష్.. పృథ్వీకి ఇచ్చాడు. నాకు ఇంట్రస్ట్ పోయింది సర్ అన్న డైలాగ్‌ను మణికి డెడికేట్ చేసింది ప్రేరణ. మండుతున్నట్లుంది డైలాగ్‌ను మెహబూబ్‌కు అంకితమిచ్చాడు పృథ్వీ. మణికంఠ ఎలిమినేట్తర్వాత నాగ్.. పృథ్వీని సేవ్ చేశాడు. చివర్లో గౌతమ్, మణికంఠ మిగిలారు. ఈ క్రమంలో మణి తనవల్ల కావట్లేదు, వెళ్లిపోతానన్న వీడియను హౌస్‌మేట్స్‌కు ప్లే చేసి చూపించాడు నాగ్. అతడు ఉండాలా? వద్దా? అని హౌస్‌మేట్స్‌ను అడగ్గా మెజారిటీసభ్యులు మణి వెళ్లడమే బెటర్ అన్నారు. చివరిసారి మణికంఠను అడిగి చూశాడు నాగ్. అప్పటికీ అతడు వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. దీంతో మణికంఠ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అయితే మణికంఠ కంటే గౌతమ్‌కు తక్కువ ఓట్లు పడ్డాయన్నాడు. నిజానికి ఎలిమినేట్ కావాల్సింది గౌతమ్ అని చెప్పాడు. ఎక్కడ తప్పు జరుగుతోందని గౌతమ్ ఆలోచనలో పడిపోయాడు. ఆ ఐదుగురినీ బోటు ఎక్కించాడుఅటు మణికంఠ.. జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలా నవ్వుతూ వెళ్లిపోయాడు. పోరాడలేకపోయాను, నా ఓపిక అయిపోయిందంటూ హౌస్మేట్స్ దగ్గర సెలవు తీసుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన మణికంఠతో నాగ్ ఓ గేమ్ ఆడించారు. అందులో భాగంగా మణి.. నయని, విష్ణుప్రియ, నబీల్, హరితేజ, మెహబూబ్ ఫోటోలను బోటు ఎక్కించాడు. మెహబూబ్‌కు విన్నర్‌కు కావాల్సిన లక్షణాలున్నాయన్నాడు. అనంతరం ఆటలో ఒకప్పుడు ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు, ఫినాలే వరకు వస్తావని ఆశిస్తున్నానంటూ నిఖిల్ ఫోటోను నీటిలో ముంచేశాడు. మునిగిపోతావ్, జాగ్రత్త..తేజ ఎనర్జీ చూపించకపోతే ముగిపోతాడన్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆడితే బెటర్ అంటూ పృథ్వీని ముంచాడు. అవసరమైనప్పుడే నోరు విప్పు.. వచ్చిన మొదటివారమే చీఫ్ అయ్యావ్.. ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయకపోతే ఆటలో మునిగిపోతావని గౌతమ్‌ను హెచ్చరించాడు. అనవసరమైన చోట నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం వల్ల నీ ఆటకే ఎసరు పడుతుందని ప్రేరణ ఫోటోను ముంచాడు. చివర్లో ప్రేక్షకుల ఓట్లను కాదని వెళ్లిపోయినందుకు తనను క్షమించమని వేడుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?
బిగ్‌బాస్ షో నాకు ఎంత ముఖ్యమో మీకు తెలియదు, నా పెళ్లాంబిడ్డలు తిరిగి రావాలన్నా, అత్తామామ దగ్గర గౌరవం దక్కాలన్నా ఈ షో గెలవాలి అని నాగమణికంఠ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరైనా నామినేట్ చేస్తే చాలు ఆ వారమంతా తెగ టెన్షన్ పడిపోయేవాడు. తను హౌస్‌లో ఉండాలని తపించిపోయాడు. ప్రతి గేమ్‌లో తానే ఉండాలనుకున్నాడు. కానీ ఈ వారం సీన్ మారిపోయింది. హౌస్‌లో ఉండలేనన్నాడు. ఇంటికి వెళ్లిపోతానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన మైండ్ పని చేయట్లేదన్నాడు.పారితోషికం..శరీరం కూడా సహకరించలేదన్నాడు. దీంతో డాక్టర్ దగ్గరకు కూడా పంపించగా వాళ్లు బాగానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అయినా సరే మణి హౌస్‌లో సర్దుకోలేకపోయాడు. అతడు కోరుకున్నట్లుగానే ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. అతడి పారితోషికం విషయానికి వస్తే.. వారానికి రూ.1.20 లక్షల చొప్పున మేర సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఏడువారాలకుగానూ రూ.8.40 లక్షలు వెనకేసినట్లు సమాచారం. -
మణిని అలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా!
ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమినేషన్ కాస్త వింతగా జరగనుంది. పృథ్వీ స్థానంలో మణికంఠ ఎలిమినేట్ కానున్నాడు. తను ఫిట్‌గా ఉన్నాడని వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చినా సరే చేతనైతలేదంటూ పంపించేయమని వేడుకున్నాడు. అతడు అంతలా అడిగితే కాదనలేక గేట్లు ఎత్తి మరీ బయటకు తీసుకొచ్చేశారని సమాచారం.డైలాగ్ డెడికేషన్..ఇక ఈ ఎలిమినేషన్ కంటే ముందు ఫన్ టాస్కులు జరిగాయి. అందులో ఒకటే డైలాగ్ డెడికేషన్. ఈ క్రమంలో నిఖిల్.. నువ్వు ఊరుకోమ్మా.. అన్నింటికీ తుత్తుత్తు అంటావ్.. అన్న డైలాగ్‌ను ప్రేరణకు అంకితం చేశాడు. వాడినలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా.. అన్న డైలాగ్‌ను హరితేజ మణికి అంకితమిచ్చింది. డైలాగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందని అందరూ చప్పట్లు కొట్టారు.మస్తు షేడ్స్ ఉన్నయ్..అవును మరి మణి వాలకం అలా ఉంది.. భార్యాబిడ్డలు తిరిగి తన దగ్గరకు రావాలంటే ఈ షో గెలవాలి, ఈ బిగ్‌బాస్ తనకు చాలా ముఖ్యం అంటూ ఎన్నోసార్లు ఏడ్చాడు. కట్ చేస్తే ఈ వారం శరీరం సహకరించడం లేదంటూ, మైండ్ కూడా పని చేయట్లేదంటూ ఇంటికెళ్లిపోతానన్నాడు. తనకు ఓట్లు వేయొద్దని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఇదే వారం తాను సేవ్ అయితే అరతులం బంగారం ఇస్తానని గంగవ్వకు మాటిచ్చాడు. అంతలోనే ఇన్ని షేడ్స్ చూపించాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చేతనైతలే.. వెళ్లిపోతా, ఓట్లు వేయకండి: ఏడ్చేసిన మణికంఠ
హౌస్మేట్స్ ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో తెలియజేసేందుకు నాగార్జున ఓ టాస్క్ పెట్టాడు. మరోవైపు హౌస్‌లో గౌతమ్ కృష్ణ.. యష్మి అంటే తనకు క్రష్ అంటున్నాడు. అటు బిగ్‌బాస్ కప్పు గెలుస్తానన్న మణి.. ఇంటికి వెళ్లిపోతానని ఏడ్చాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (అక్టోబర్ 19) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..వెళ్లిపోతా..ఈ గొడవలు, కొట్లాటలు నావల్ల కావడం లేదు, వెళ్లిపోతానంటూ కెమెరాల ముందు మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. దయచేసి ఓట్లు వేయొద్దని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉందామనుకున్నా.. కానీ నా వల్ల కావట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై గౌతమ్ క్రష్అటు గౌతమ్.. 'నేను సింగిల్, నీపై నాకు క్రష్ ఉంది.. ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్‌లా ఉందాం. మన మధ్య బాండింగ్ ఎటువైపు వెళ్తుందో చూద్దాం.. అందరిలో నువ్వు నాకు స్పెషల్' అని యష్మితో మాటలు కదిపాడు. తర్వాత నాగార్జున బీబీటైమ్స్ హెడ్‌లైన్స్ అని ఓ గేమ్ ఆడించాడు. అందులో భాగంగా కంటెస్టెంట్లకు సరిపోయే హెడ్‌లైన్స్‌ను బోర్డ్‌పై పెడతాడు. అది నిజంగా ఎంతమేరకు సూట్ అవుతుందన్నది హౌస్మేట్స్ చెప్పాలి. నిన్న హీరో- ఈరోజు జీరోఅలా మొదటగా కండబలం ఎక్కువ- బుద్ధిబలం తక్కువ అన్న హెడ్డింగ్ గౌతమ్‌కు సరిగ్గా సరిపోతుందన్నారు. ఈ క్రమంలో నిఖిల్, గౌతమ్ కొట్లాడుకున్న వీడియో చూపించిన నాగ్.. కసిగా ఆడండి కానీ ఉన్మాదంగా ఆడొద్దని హెచ్చరించాడు. నిఖిల్‌కు నిన్న హీరో- ఈరోజు జీరో అన్న ట్యాగ్ కరెక్ట్‌గా సరిపోతుందన్నాడు. హరితేజ.. ఒకప్పుడు ఫైర్- ఇప్పుడు ఫ్లవర్‌లా మారిపోయిందన్నారు.ఆట కంటే నాకు నేనే ముఖ్యంపృథ్వీకి.. 'కింగ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్- వాంట్స్ రెస్పెక్ట్ (అగౌరవపరుస్తాడు కానీ తనను గౌరవించాలనుకుంటాడు)', 'ఆట కంటే నాకు నేనే ముఖ్యం' అన్న రెండు ట్యాగులు సరిగ్గా సూటవుతాయన్నారు. గడ్డం, మీసం తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేశావని నాగ్ ఆరా తీశాడు. పోనీ రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేస్తా, గడ్డం తీసుకుంటావా? అన్నాడు. పృథ్వీ ఒప్పుకోకపోవడంతో దాన్ని రూ.8 లక్షలకు పెంచాడు. అయినా అడ్డంగా తలూపడంతో నామినేషన్స్‌తో పని లేకుండా నేరుగా పదో వారంలోకి అడుగుపెట్టేందుకు ఛాన్స్ ఇస్తానన్నాడు. అయినా పృథ్వీ అంగీకరించలేదు.అశ్వత్థామ 3.0ఇక నామినేషన్స్‌లో పృథ్వీ- ప్రేరణపై రివేంజ్ నామినేషన్ చేయడాన్ని నాగ్ సమర్థించడం విశేషం. అనంతరం అవినాష్‌కు పైకి నవ్విస్తా- వెనక ప్లాన్ వేస్తా అన్న హెడ్డింగ్ సరిగ్గా సరిపోతుందన్నారు. ఆ వెంటనే భార్య అనూజ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పిన ఆడియో ప్లే చేయగా అవినాష్ ఎమోషనలయ్యాడు. ఇక గౌతమ్ అశ్వత్థామ 3.0 అని చెప్తూ నాగ్ అతడిని మెచ్చుకున్నాడు. ముందు ఒక ఆట-వెనక ఒక ఆట హెడ్డింగ్ యష్మికి కాస్త సూట్ అవుతుందన్నారు. ఆటలో వీక్- డ్రామాలో పీక్తర్వాత నాగ్.. ప్రేరణ, తేజను నాగ్ సేవ్ చేశాడు. 'ఆటలో వీక్- డ్రామాలో పీక్' హెడ్డింగ్ మణికంఠకు సెట్ అవుతుందని హౌస్మేట్స్ అన్నారు. ఈ సందర్భంగా మణి.. కూర్చుంటే లేవలేకపోతున్నా.. నా శరీరం నా కంట్రోల్లో లేదు, ఇంకా ఆడాలని ఉంది.. కానీ ఇలాగే ఉంటే నా శరీరం, మెదడు సహకరించదు. నేను వెళ్లిపోతాను సర్. నాకు నేనే వీక్ అయిపోయాను అని తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే ప్రేక్షకుల ఓటింగ్ ఎలా ఉందో చూద్దామని నాగ్ అతడిని కూర్చోబెట్టాడు.మత్తు వదలరా..తేజకు హౌస్ అంతా కలిసి మత్తు వదలరా ట్యాగ్ ఇచ్చేసింది. ప్రేరణకు.. గుంపులో గుర్తింపు కోరుకోవద్దని చెప్పారు. నయని పావనికి క్రై బేబీ అన్న ట్యాగ్ ఇచ్చారు. మెహబూబ్.. ఈ సీజన్‌కు ఫ్లాప్ చీఫ్ అని నిర్ణయించారు. కత్తిలాంటి నా నాలుక.. కాదు మీకు తేలిక శీర్షిక గంగవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అయిందన్నారు. ఈ సందర్భంగా గంగవ్వ.. తనను ఎవరూ నామినేట్ చేయొద్దని మీరైనా చెప్పండని నాగార్జునను వేడుకుంది.మాటలో పులి- ఆటలో పిల్లిఇక రోహిణికి.. మనసులే కాదు ఆట కూడా గెలవాలన్నారు. విష్ణుప్రియకు 'రివేంజ్ నా సరికొత్త ఆట', 'వీకెండ్లో ఆట, మిగతా రోజులు టాటా' అన్న రెండు హెడ్‌లైన్స్ కరెక్ట్‌గా సరిపోయాయన్నారు. నబీల్.. 'మాటలో పులి- ఆటలో పిల్లి' అన్నారు. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఊహించని ట్విస్ట్.. నాగమణికంఠ ఎలిమినేట్!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ఏడోవారం ముగింపుకు వచ్చింది. ఈ వారం గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, తేజ, నబీల్, మణికంఠ, ప్రేరణ, హరితేజ నామినేషన్లో ఉన్నారు. వీళ్లందరిలో నిఖిల్ ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంటాడన్న విషయం తెలిసిందే! నబీల్‌కు కూడా ఢోకా లేదు. యష్మి, ప్రేరణ, గౌతమ్‌కు కూడా బాగానే ఓట్లు వచ్చినట్లు సమాచారం. ఊహించని ఎలిమినేషన్చివర్లో మణికంఠ, తేజ, పృథ్వీ ఉన్నారు. అయితే తేజ, పృథ్వీ.. వీళ్లిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అవొచ్చని ప్రచారం నడిచింది. దాదాపు పృథ్వీ బయటకు వెళ్లడం ఖాయని అంతా డిసైడయ్యారు. కానీ ఇక్కడే ఎవరూ ఊహించనిది జరిగింది. నాగమణికంఠను ఎలిమినేట్ చేశారు. నిజానికి ఈ వారం మణి ఆడిందేమీ లేదు. టాస్క్ ప్రారంభానికి ముందే నాకు ఆడటం చేతకాదని చేతులెత్తేశాడు. ఎలిమినేట్అసలే ఫిజికల్ టాస్క్.. నా బొక్కలిరిగితే, ఫ్రాక్చర్ అయితే ఎలా? అని భయంతో వెనకడుగు వేశాడు. గేమ్‌లో ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. ఫిజికల్‌గా, మెంటల్‌గా వీక్ కాదంటూనే తాను బలహీనుడిని అని తనకు తెలియకుండానే ఒప్పేసుకున్నాడు. పైగా సండే ఎపిసోడ్ షూటింగ్‌లోనూ మణికంఠ.. తాను వెళ్లిపోతా అని నాగార్జుననే అడిగేశాడంటున్నారు. మరి ఇదెంత నిజమో తెలియాల్సి ఉంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రతివారం అరతులం బంగారమిస్తా.. గంగవ్వకు మణి బంపరాఫర్
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అంతా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు నబీల్. అయితే ఇది గొంతెమ్మ కోరికగా భావించిన బిగ్‌బాస్ ఈ వారం మాత్రమే కావాల్సినంత ఫుడ్ ఇస్తానన్నాడు. కానీ ఓ తిరకాసు పెట్టాడు. అదేంటో తెలియాలంటే నేటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నా జీవితంలో జరిగిన ఘోరంవిష్ణుప్రియ తన మనసులోని బాధను చెప్పడంతో గంగవ్వ ఎమోషనలైంది. అమ్మకు ఇష్టం లేదని చిన్నప్పటినుంచి నాన్నతో మాట్లాడేవాళ్లం కాదు. నాన్నపై ఎంత ప్రేమ ఉన్నా, అమ్మ కోసం ఆయనతో మాట్లాడలేదు. చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు.. అది నా జీవితంలో జరిగిన ఘోరం.. ఇది ఎవరికీ జరగకూడదు. అమ్మ చనిపోయాక ఇప్పుడిప్పుడే తనతో మాట్లాడుతున్నాం అని చెప్పింది. ఇది విని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.హౌస్మేట్స్ కోసం నబీల్ త్యాగంఇకపోతే ఇన్ఫినిటీ రూమ్‌లో నబీల్ అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్న సంగతి తెలిసిందేగా! దాని గురించి బిగ్‌బాస్ ప్రస్తావిస్తూ.. ఇంట్లో ఉన్నంతకాలం నబీల్ స్వీట్లు, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు త్యాగం చేస్తే ఈ ఒక్క వారం అన్లిమిటెడ్ రేషన్ లభిస్తుందన్నాడు. ఇంటిసభ్యులందరికోసం ఆ కండీషన్‌కు నబీల్ ఓకే చెప్పాడు. దీంతో మెహబూబ్.. సూపర్ మార్కెట్లో ఉన్న రేషన్ అంతా ఊడ్చేశాడు.బంగారం ఇస్తానన్న మణికంఠతర్వాత నాగమణికంఠ.. తాను నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయితే గంగవ్వకు బంగారు ముక్కుపుడక ఇస్తానన్నాడు. సేవ్ అయిన ప్రతివారం అరతులం ఇస్తానంటూ గంగవ్వ మీద ఒట్టేశాడు. మరి నాకేం ఇస్తావని రోహిణి అనగా ఒక ముద్దిస్తానన్నాడు. ఇక అవినాష్-రోహిణి నామినేషన్స్‌ను రీక్రియేట్ చేసి నవ్వించారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్ కిచెన్‌లో మరో రెండు గంటలు ఎక్కువ సేపు వంటచేసుకునే ఛాన్సిచ్చాడు. మెగా చీఫ్ కంటెండర్‌గా గంగవ్వఅనంతరం రాయల్ టీమ్ గెలుపొందిన మెగా చీఫ్ కంటెండర్ షీల్డ్‌ను గంగవ్వకిచ్చారు. బిగ్‌బాస్.. రాయల్ టీమ్‌ను ఓవర్ స్టార్ట్ఫోన్లుగా, ఓజీ టీమ్‌ను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభజించారు. హౌస్ అంతా రాయల్ టీమ్ ఆధీనంలో, గార్డెన్ ఏరియా ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందన్నాడు. కిచెన్, బెడ్రూమ్, వాష్‌రూమ్ వంటి వసతులు అందిస్తూ చార్జింగ్ పొందవచ్చని తెలిపాడు.బెంబేలెత్తిపోయిన మణికంఠటాస్క్ పూర్తయ్యేలోపు బతికున్న సభ్యులే మెగాచీఫ్ కంటెండర్లవుతారన్నాడు. టాస్క్ ప్రారంభానికి ముందే మణి బెంబేలెత్తిపోయాడు. నాకంటూ ఫ్యామిలీ ఉంది. బొక్కలిరగ్గొట్టుకుని బయటకు వెళ్లలేను. ఆరోగ్యం ముఖ్యం.. టీమ్‌కు ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అంతే ఇస్తానని చెప్పాడు. ఆట మొదలవగానే అవినాష్.. నబీల్‌కు తెలియకుండా అతడి చార్జర్‌ను తన ప్లగ్‌కు కనెక్ట్ చేశాడు. హరికథ చెప్పి చార్జింగ్హరితేజ.. హరికథతో మణికంఠను మెప్పించి అతడి దగ్గర నిమిషం పాటు చార్జింగ్ పొందింది. నయని కూడా యష్మి దగ్గర బలవంతంగా చార్జ్ పొందడానికి ట్రై చేసింది. కానీ నిఖిల్ ఆమెను అడ్డుకుని అవతలకు విసిరేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ముగ్గుర్ని బ్యాగులు సర్దమన్న నాగ్.. వాళ్లు పతనం, వీళ్ల ఎదుగుదల
నాలుగువారాలు చీఫ్‌గా కొనసాగిన నిఖిల్ ఈ వారం గేమ్‌లో కనిపించకుండా పోయాడు. అటు యష్మి హోటల్ టాస్క్‌ను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరిదే కాదు.. అందరి ఆట గురించి నాగ్ విశ్లేషించాడు. మరి ఆయన ఏమేం చెప్పాడో నేటి (అక్టోబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రైజింగ్ స్టార్స్బిగ్బాస్ హోటల్ టాస్క్‌లో అవినాష్, తేజ దొంగతనంగా గులాబ్ జామ్ తిన్నారు. అందుకని నాగార్జున ఓ గిన్నె నిండా గులాబ్ జామ్స్ పంపించి అవి ఆ ఇద్దరితో మాత్రమే తినిపించాడు. ఇక హౌస్మేట్స్ ఆటను బట్టి వారిని రైజింగ్ స్టార్స్, ఫాలింగ్ స్టార్స్‌గా నాగ్ విభజించాడు. గంగవ్వ, మెహబూబ్, అవినాష్, రోహిణి, నాగమణికంఠ, నయని, యష్మి.. రైజింగ్ స్టార్స్ అని పేర్కొన్నాడు.నాతో గేమ్స్ద్దునువ్వు బచ్చా అన్నందుకు మణికంఠ ఫీలయ్యాడని నాగ్ రోహిణితో అన్నాడు. అయితే మణి మాత్రం.. నేను మరీ అంత ఫీల్ అవలేదన్నాడు. దీంతో నాగ్.. ఇప్పుడు కవరింగ్ చేయకు, నా దగ్గర ఆటలాడొద్దంటూ అతడి నోరు మూయించాడు. నువ్వు గేమ్ సీరియస్‌గా తీసుకోకపోతే నిన్ను ఆడియన్స్ కూడా సీరియస్‌గా తీసుకోరని విష్ణుప్రియకు మరోసారి గుర్తు చేశాడు. మణికంఠలో ఎనర్జీ, ఫన్ మరో లెవల్లో ఉందంటూ ఓ వీడియో చూపించాడు.తేజకు పనిష్మెంట్నబీల్, గౌతమ్, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, నిఖిల్, సీతలను ఫాలింగ్ స్టార్స్‌గా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ.. నబీల్‌కు ఏదైనా సమస్య ఉంటే నేరుగా అందుకు కారణమైన వ్యక్తితోనే మాట్లాడాలన్నాడు. గతం గురించి ఆలోచించుకుంటే వర్తమానం మిస్ అయిపోతావ్ అని గౌతమ్‌కు సలహా ఇచ్చాడు. తేజ.. నయనిపావనిపై నోరు పారేసుకున్న వీడియోను ప్లే చేసి మరీ క్లాస్ పీకాడు. 10 పుషప్స్ తీయమని పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రేరణ వంతు రాగా ఆమె సగం రైజింగ్, సగం ఫాలింగ్ అని తెలిపాడు.అవినాష్ దృష్టిలో అతడు స్ట్రాంగ్ కాదట!ఇంట్లో ఉండేందుకు అర్హత లేని కంటెస్టెంట్ల బ్యాగుని ఎగ్జిట్ గేట్ దగ్గర పెట్టాలన్నాడు నాగ్. అయితే ఎవరి టీమ్‌లో నుంచి వాళ్లు కాకుండా.. అవతలి టీమ్‌లోని వారి పేర్లను మాత్రమే చెప్పాలన్నాడు. మొదటగా తేజ.. ఇంటి పనులు చేయట్లేదంటూ పృథ్వీ బ్యాగును పెట్టాడు. హరితేజ.. నబీల్‌కు క్లారిటీ తక్కువగా ఉందంది. అవినాష్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదంటూ నిఖిల్ బ్యాగు గేటు దగ్గర పెట్టాడు. గంగవ్వ.. మణి పేరును, రోహిణి.. ప్రేరణ, గౌతమ్.. సీత, మెహబూబ్.. పృథ్వీ పేర్లను సూచించారు. నయని.. విష్ణుప్రియలో ఇంప్రూవ్మెంట్ కనిపించలేదని పేర్కొంది.చివర్లో ముగ్గురి బ్యాగులుతర్వాత ఓజీ టీమ్సభ్యుల వంతు వచ్చింది. నాగమణికంఠ.. నా అంచనాలు అందుకోలేకపోయాడంటూ తేజ బ్యాగు ఎగ్జిట్ దగ్గర పెట్టాడు. సీత.. హోటల్ టాస్క్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేదంటూ గౌతమ్ పేరు చెప్పింది. పృథ్వీ, యష్మి.. బాగా ఆడలేదని తేజను, నిఖిల్, నబీల్.. గౌతమ్‌ను, విష్ణుప్రియ, ప్రేరణ.. నయని పేర్లను సూచించారు. చివర్లో ఎక్కువ ఓట్లు పడ్డ పృథ్వీ, తేజ, గౌతమ్ బ్యాగుల్ని సర్దేసి స్టోర్ రూమ్‌లో పెట్టాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తయింది. ఇక రేపటి ఎపిసోడ్లో సీత ఎలిమినేట్ కానుంది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణి హగ్గుల పిచ్చి.. ఈ చెండాలం చూడలేకున్నాం సామీ!
ప్రేక్షకులు సున్నిత మనస్కులు.. నిజ జీవితంలో ఎవరు ఎటు పోయినా పట్టించుకోరు కానీ స్క్రీన్‌పై ఎవరైనా కన్నీళ్లు పెట్టుకున్నా, గోడు వెల్లబోసుకున్నా ఇట్టే కరిగిపోతారు. పోనీ, అవి నిజమైన కన్నీళ్లేనా? మొసలి కన్నీళ్లా? అని కూడా ఆలోచించరు.సింపతీ గేమ్బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో కన్నీళ్లు పెట్టుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్ మణికంఠ. ఒకసారి ఏడిస్తే ఓకే, రెండోసారికీ ఓకే.. కానీ మూడోసారి, నాలుగోసారి.. హుష్.. తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకుని పదేపదే ఏడుస్తుంటే హౌస్‌మేట్స్‌కు విసుగొచ్చింది. ఇతడేదో సింపతీ ట్రై చేస్తున్నాడని నామినేట్ చేశారు. కానీ ఆడియన్స్.. అతడి బాధకు చలించిపోయి సేవ్ చేసుకుంటూ వస్తున్నారు.హగ్గు కోసం నిస్సిగ్గుగా..భార్యాబిడ్డ కావాలంటూ కెమెరాల ముందు బోరున ఏడ్చేసిన ఇతడు హౌస్‌లో అమ్మాయిలతో ప్రవర్తించే తీరు అసభ్యంగా ఉంటోంది. ఆ మధ్య యష్మి ఇబ్బందిగా ఫీలవుతున్నా సరే వినిపించుకోకుండా హగ్ చేసుకున్నాడు. సోనియాను సైతం చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసుకుని హగ్ కావాలంటూ అడుక్కుని మరీ తనను హత్తుకున్నాడు. క్లాస్ పీకిన నాగ్దీనికి బ్రేక్ వేయాల్సిందేనని భావించిన నాగార్జున.. మణిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మరీ క్లాస్ పీకాడు. నీ లక్ష్యం ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంటి? అంటూ హగ్గుల వీడియో చూపించి మరీ కడిగిపారేశాడు. దీంతో తప్పయిపోయిందని, ఇంకోసారి అలా చేయనని మాటిచ్చాడు. అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు.. ఎప్పటిదాకా అంటే.. వైల్డ్ కార్డుల ఎంట్రీదాకా!గాల్లో తేలిన మణికొత్తగా వచ్చిన వైల్డ్‌కార్డులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తనపై జాలి చూపిస్తున్నట్లుగా, తనకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడటంతో అతడిలో కొత్త శక్తి ప్రవేశించింది. పైగా ప్రతివారం నామినేషన్స్‌లో ఉండే అతడు ఈవారం వైల్డ్ కార్డుల పుణ్యమా అని నామినేషన్స్‌లో కూడా లేకుండా పోయాడు. ఇంకేముంది, గాల్లో తేలినట్లుందే అని పాటలు పాడుకున్నాడు. అదీ బాగానే ఉంది.. తర్వాతే మళ్లీ రెచ్చిపోయాడు.మళ్లీ మొదటికి..రోహిణిని వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. నయని పావనిని కూడా వదల్లేదు. ఆమెను కూడా వెనకనుంచి వచ్చి హత్తుకున్నాడు. తనకెలా ఉందో కానీ చూసే ఆడియన్స్‌కు మాత్రం మహా చెండాలంగా ఉంది. అవతలి వ్యక్తికి తెలియకుండా వెనక నుంచి హత్తుకోవడమనేది చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ఈ సెకలే తగ్గించుకోమని నాగ్ చెప్పినా మణి మళ్లీ అదే దారిలో వెళ్తున్నాడు. మరి ఇతడికి నాగ్ ఈసారి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలి!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎప్పుడో, ఎవరో ట్రోల్ చేసినదాని గురించి ఇప్పుడెందుకు?: నాగార్జున
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (పాత కంటెస్టెంట్లు) ఎవరో చెప్పండని నాగార్జున హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. దీంతో తేజ.. పృథ్వీ పేరు, హరితేజ.. నబీల్, గంగవ్వ.. మణికంఠ, రోహిణి.. ప్రేరణ, నయని.. విష్ణుకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదన్నారు.రైజింగ్ స్టార్స్ ఎవరంటే?అలాగే రాయల్ టీమ్‌లో కూడా హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్ల పేర్లను సూచించమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నబీల్.. గౌతమ్ పేరు చెప్పాడు. ఇకపోతే మరో ప్రోమోలో నాగ్.. రైజింగ్ స్టార్, ఫాలింగ్ స్టార్ అంటూ ఓ బోర్డు ముందు పెట్టాడు. మెహబూబ్, హరితేజ, మణికంఠ, అవినాష్, గంగవ్వను రైజింగ్ స్టార్లుగా పేర్కొంటూ నబీల్, తేజ, విష్ణుప్రియ, గౌతమ్‌ను ఫాలింగ్ స్టార్స్‌గా అభివర్ణించాడు. ఇప్పుడెందుకు?ఈ సందర్భంగా ఎప్పుడో, ఎవడో ట్రోల్ చేసినదాని గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావ్.. అశ్వత్థామ 2.0 అనేది నువ్వు పెట్టుకున్నావా? లేదా మేము పెట్టామా? అని గౌతమ్‌ను సూటిగా ప్రశ్నించాడు. అటు తేజ.. నయనిపావనితో ర్యాష్‌గా మాట్లాడిన వీడియో చూపించి మరీ తేజకు క్లాస్ పీకాడు. రోహిణి తనను బచ్చా అనడంతో మణికంఠ ఫీలైన విషయాన్ని కూడా నాగ్ ప్రస్తావించాడు. అమాయకంగా ఫేస్ పెట్టిన మణిరోహిణి.. మణికంఠ నీకు బచ్చాలా కనిపిస్తున్నాడా? అని సెటైరికల్‌గా అడిగాడు. తన శక్తిసామర్థ్యాలను నువ్వు అవమానించావని అనుకున్నాడు అని పేర్కొన్నాడు. అందుకు మణి నోరు తెరుస్తూ.. అమ్మో, అంత పెద్ద మాట అన్లేదు సర్ అని అమాయకంగా అన్నాడు.నాతో గేమ్స్ వద్దుదీంతో నాగ్.. ఫీలయ్యావన్నదే చెప్పాను.. ఇప్పుడు కవరింగ్ వద్దు, నాతో గేమ్స్ ఆడొద్దు అని సీరియస్ అయ్యాడు. ఇక విష్ణును నువ్వు గేమ్ సీరియస్‌గా తీసుకోకపోతే ఆడియన్స్ కూడా నిన్ను సీరియస్‌గా తీసుకోరని తెలిపాడు. నబీల్.. మనుషుల ఎదుట కాకుండా వారి వెనకాల మాట్లాడటం ఏమాత్రం బాగోలేదన్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గతాన్ని తల్చుకుని కుంగిపోయిన గౌతమ్.. ఈసారి కప్పు కొడతా!
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడుతోంది. బిగ్‌బాస్ 8లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. వీరితో కలిసి ఫన్ గేమ్ ఆడించాడు. అదే బిగ్‌బాస్ హోటల్. ఈ టాస్క్‌లో పాతవాళ్లంతా హోటల్ సిబ్బందిగా, కొత్తవాళ్లంతా గెస్టులుగా ఉన్నారు. మరి ఈ టాస్క్ ఏమేరకు వర్కవుట్ అయిందో నేటి (అక్టోబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఫన్ టాస్క్బిగ్బాస్ అమ్మాయిలను ఒక టీమ్‌గా, అబ్బాయిలను ఒక టీమ్‌గా విభజించి ఫన్నీ టాస్కు ఇచ్చాడు. ఆడాళ్ల టీమ్‌కు ముక్కు అవినాష్, అబ్బాయిల టీమ్‌కు రోహిణిని లీడర్‌గా పెట్టారు. గేమ్ ఏంటంటే.. టీమ్సభ్యులంతా వారి నోటిని నీటితో నింపుకోవాలి. వీళ్లను ఇతర టీమ్‌లోని వారు నవ్వించి ఆ నీళ్లు బయటకు వచ్చేలా చేయాలి. ఈ గేమ్‌లో అబ్బాయిలను నవ్వించే క్రమంలో అవినాష్.. మణికంఠ దగ్గరకు వెళ్లి పాట పాడాడు. కప్పు కొడతా: గౌతమ్తర్వాత గౌతమ్ దగ్గరకు వెళ్లి అశ్వత్థామ 2.0 అని ఇమిటేట్ చేశాడు. అది విని హర్టయిపోయిన గౌతమ్.. అయిపోయినదాన్ని మళ్లీ మళ్లీ తీసి ఇరిటేషన్ తెప్పించొద్దు. వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. అని మైక్ విసిరేసి ఇంట్లోకి వెళ్లి ఏడ్చాడు. నాన్న ఐయామ్ సారీ, నీతో గొడవపడి మాట్లాడకుండా వచ్చేశా.. కానీ ఈసారి నన్ను నేను నిరూపించుకుంటాను. కప్పు కొడతాను అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు.ఉప్పు గెల్చుకున్న అవినాష్, రోహిణిమరోవైపు తనను నవ్వించమని అవినాష్, రోహిణికి బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్ వీరికి కొట్టిన పిండి కావడంతో ఇరగదీశారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్.. ఇంటిసభ్యులు రేషన్‌లో మర్చిపోయిన ఉప్పును కానుకగా ఇచ్చాడు. ఇక తర్వాతి రోజు ఉదయం విష్ణు ధ్యానం చేస్తుంటే గంగవ్వ చెడగొట్టేందుకు ప్రయత్నించడం భలే సరదాగా అనిపించింది. అనంతరం బిగ్‌బాస్ హోటల్ టాస్క్ పెట్టాడు. ఇందులో ఓల్డ్ కంటెస్టెంట్లు హోటల్ సిబ్బంది కాగా రాయల్ టీమ్ అతిథులుగా ఉంటారు. ఎవరెవరు ఏ పాత్రలో..పాత్రల విషయానికి వస్తే.. నబీల్.. అప్పుల్లో కూరుకుపోయిన హోటల్ యజమాని, ప్రేరణ.. మతిమరుపు మేనేజర్, నిఖిల్.. హెడ్ చెఫ్, సీత.. అసిస్టెంట్ చీఫ్, పృథ్వీ.. అందరినీ ఫ్లర్ట్ చేసే గార్డ్, విష్ణు.. పృథ్వీతో లవ్‌లో ఉండే పర్సనల్ బట్లర్, యష్మి.. హౌస్ కీపింగ్, మణికంఠ.. హౌస్ కీపింగ్(దొంగిలించడం, దాన్ని తిరిగిచ్చేయడం)గా వ్యవహరిస్తారు.తికమక మనిషిగా హరితేజగంగవ్వ.. రాజవంశానికి చెందిన మహారాణి, నయని పావని.. మహారాణి అసిస్టెంట్, అవినాష్.. సూపర్‌స్టార్, రోహిణి- పొగరుబోతు రిచ్ కిడ్ (అవినాష్ గర్ల్‌ఫ్రెండ్), మెహబూబ్.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ (రోహిణి తండ్రి అపాయింట్ చేస్తాడు) హరితేజ.. మెహబూబ్ అసిస్టెంట్(తికమక మనిషి), తేజ.. పాపులర్ ఫుడ్ బ్లాగర్, గౌతమ్.. పోలీసుల నుంచి దాక్కుని తిరుగుతున్న క్రిమినల్‌గా పాత్రలు పోషించారు.మణిని ఆడుకున్న రోహిణిటాస్కు ప్రారంభానికి ముందే సీత.. ఒక పర్సు కొట్టేయడం గమనార్హం. ఈ టాస్కులో హౌస్మేట్స్ తమ పర్ఫామెన్స్ చూపించారు. నన్నెవరూ పట్టించుకోవట్లేదని రోహిణి అనగా.. మణి.. నువ్వో మాడియపోయిన కందిపప్పు, మీ ఆయనో పెసరపప్పు అని సెటైర్ వేశాడు. దీంతో రోహిణి సీరియస్ అయింది.. ఒకసారి, రెండుసార్లు ఓకే.. కానీ మూడోసారి ఒప్పుకోను. నీ క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి నీకు నచ్చినట్లు మాట్లాడటం ఫన్ కాదు.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతలోనే జోక్ చేశానంటూ నవ్వేసింది. నీ కళ్లలో భయమే నాకు కావాలంటూ నవ్వుతూ చెప్పడంతో మణి ఊపిరి పీల్చుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణికంఠ కుళ్లు జోకులు.. రోహిణి వార్నింగ్..
బిగ్‌బాస్ షోలో 'హోటల్ టాస్క్' ఎవర్గ్రీన్. ఇప్పుడా టాస్కునే తిరిగి తీసుకొచ్చారు. అయితే ఈసారి ఓజీ(ఓల్డ్ కంటెస్టెంట్స్) టీమ్‌ను హోటల్ స్టాఫ్‌గా, రాయల్ టీమ్ (వైల్డ్ కార్డ్స్)ను ఆ హోటల్‌కు వచ్చే అతిథులుగా నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికీ ఒక్కో పాత్ర ఇచ్చారు. గంగవ్వ రాజవంశానికి చెందిన మహారాణి కాగా అవినాష్-రోహిణి లవ్ బర్డ్స్.ఫన్ టాస్క్తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే అవినాష్, రోహిణి, యష్మి పర్ఫామెన్స్లో రెచ్చిపోయారు. డబ్బు కోసం స్టాఫ్ పడే తంటా అంతా ఇంతా కాదు. రాయల్ టీమ్ సభ్యులు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు కానీ ఒక్క రూపాయి కూడా విదల్చడం లేదు. అయినా సరే హోటల్ సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు.(చదవండి: దమ్ము కొట్టిన విష్ణు ప్రియ.. సోనియా చెప్పింది తన గురించేనా?)నువ్వో మాడిపోయిన కందిపప్పుచివర్లో రోహిణి.. తన అభిప్రాయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని అరిచేసింది. దీంతో మణికంఠ.. నువ్వో మాడిపోయిన కందిపప్పు.. మీ ఆయనో పెసరపప్పు అని సెటైర్ వేశాడు. ఈ కామెంట్‌పై చిర్రెత్తిన రోహిణి.. నీ క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి నచ్చినట్లు మాట్లాడేందుకు ఇది ఫన్ కాదు అని సీరియస్ అయింది. మరి ఇది నిజమైన గొడవేనా? ప్రాంకా? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణికంఠ చెల్లి చెప్పిన సంచలన నిజాలు.. చిన్నప్పటి నుంచీ
ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ 8వ సీజన్ టెలికాస్ట్ అవుతుంది. రీసెంట్‌గానే దాదాపు 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చారు. అయితే అందరిలో కాస్త విచిత్రమైన క్యారెక్టర్ ఎవరా అంటే చాలామంది చెప్పే పేరు మణికంఠ. ఒక్కో టైంలో ఒక్కోలా ప్రవర్తించే ఇతడికి సపోర్ట్ చేసేవాళ్లు ఉన్నట్లే.. విమర్శించేవాళ్లు కూడా బోలెడుమంది ఉన్నారు. ఇప్పుడు మరిన్ని నిజాలని మణికంఠ చెల్లి కావ్య బయటపెట్టింది.(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్.. అమ్మాయిని గర్భవతి చేశాడు: పూనమ్ కౌర్)అనవసరంగా బిగ్‌బాస్ షోకి వెళ్లి ఫ్యామిలీ విషయాలన్నీ రోడ్డు మీద పెట్టేశాడని అనుకున్నారా? అని యాంకర్ అడగ్గా.. 'అవును ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే చెప్పాకుండా ఉండాల్సింది కదా అనిపించింది. రీసెంట్గా నాకు నిశ్చితార్థం జరిగింది. మా అత్తయ్య వాళ్ల ఫ్యామిలీకి కూడా కాల్స్ రావడం, వాళ్ల బంధువులు ఫోన్ చేసి.. ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎందుకు అమ్మాయిని తెచ్చుకున్నారని అని అందరూ అడగడం మొదలుపెట్టారు''అంత లో క్లాస్ అయినప్పుడు ఎందుకు తెచ్చుకున్నారు ఇలాంటి అమ్మాయిని మా అత్తమ్మని అడిగారు. కానీ ఆమెకు నా గురించి ముందే తెలుసు కాబట్టి మాకు లేని ప్రాబ్లమ్ మీకేంటి అని వాళ్లని అడిగి, నాకు సపోర్ట్‌గా నిలిచింది. ఈ విషయంలో ఆమె చాలా గ్రేట్' అని మణికంఠ చెల్లి కావ్య చెప్పింది.(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)'చిన్నప్పటి నుంచి వాడు(మణికంఠ) అంతే. నాదే, నా ఒక్కడితే బాధ అని అనుకుంటాడు. పక్కనోళ్లు బాధ గురించి వాడికి సంబంధం లేదు. ఇవన్నీ పక్కనబెడితే వాడు గెలిచి రావాలి. ఎందుకంటే వెళ్లిందే దానికోసం. మేమందరం ఇన్ని అవమానాలు తీసుకున్నాం. ఎందుకంటే వాడు గెలిచి వస్తాడనే కదా. బయటనే కాదు హౌసులో కూడా చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాడు' అని మణికంఠ చెల్లెలు తన ఆవేదన బయటపెట్టింది.మణికంఠ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో.. ఇతడి తల్లి రెండో పెళ్లి చేసుకుంది. సవతి తండ్రి వల్ల.. అలానే పెళ్లయి, పాప పుట్టిన తర్వాత భార్య తనకు విడాకులు ఇచ్చిందని.. ఈ రెండింటి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డాడని బిగ్‌బాస్ షోలో చెప్పాడు. ఇది విని బాధపడే వాళ్లు కొందరైతే. సింపతీ గేమ్ ఆడుతున్నాడని ట్రోల్ చేసేవాళ్లు లేకపోలేదు. దీని వల్ల మణికంఠనే కాదు ఇతడి తీరు వల్ల బయట ఉన్న చెల్లి, భార్య కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా?) -
హింటిస్తే అర్థం చేసుకోరే..! మణిని చెడుగుడు ఆడుకున్న గంగవ్వ
వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడిపోయింది. సీజన్ ప్రారంభం అయినప్పుడు 14 మంది ఉన్నారు. కానీ వైల్డ్ కార్డ్స్ రాకతో కంటెస్టెంట్ల సంఖ్య 16కు చేరుకుంది. మరి వీళ్ల నామినేషన్స్ ఎలా ఉన్నాయో నేటి (అక్టోబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..గంగవ్వా.. మజాకా!వైల్డ్ కార్డ్స్‌ను చూసి హౌస్‌మేట్స్‌కు భయం పట్టుకుంది. ఎవరు ఎలాంటివాళ్లు, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చర్చించుకున్నారు. తర్వాతి రోజు ఉదయం గంగవ్వ మణికంఠను ఓ ఆటాడుకుంది. నీ పెండ్లాం, పిల్ల యాదొచ్చిందని ఏడ్చినవ్.. అంత యాదికొస్తే ఎందుకొచ్చినవ్ ఇక్కడికి అని కౌంటర్ వేసింది. నా బాధ తట్టుకోలేకున్నా అని మణి అంటే మరి ఈ వారం పోతవా అని మరో పంచ్ వేసింది. ఇకపోతే ప్రైజ్‌మనీ రూ.38 లక్షలకు చేరుకుంది.తేజకు శిక్షఓజీ టీమ్ పాలు సహా కొన్ని రేషన్ సామానును రాయల్ టీమ్‌కు ఇచ్చేందుకు తటపటాయించింది వచ్చీరావడంతోనే తనతో బోళ్లు తోమించారని అవినాష్ తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. దీంతో అతడికి హరితేజ, మణికంఠ సాయం చేశారు. ఆడుతూపాడుతూ బోళ్లన్నీ తోమేశారు. మరోవైపు టేస్టీ తేజ కూర్చోవడంతో కుర్చీ విరిగిపోయింది. బిగ్‌బాస్ ప్రాపర్టీ ధ్వంసం చేసిన పాపానికి కాసేపు అతడు కుక్కలా నటించాడు.మణికంఠను టార్గెట్ చేశావ్..తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రాయల్ టీమ్‌కు మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. మొదటగా హరితేజ.. గ్రూపిజం చేస్తున్నావు, మణికంఠను టార్గెట్ చేశావంటూ యష్మిని నామినేట్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావ్, సొంతంగా ఆడటం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. గౌతమ్.. నీ గేమ్ వదిలేసి వేరొకరి వెనకాల పడుతున్నావంటూ విష్ణుప్రియను, మణికంఠపై ప్రతీకారం తీర్చుకోవడం బాగోలేదని యష్మిని నామినేట్ చేశాడు. మణిని టార్గెట్ చేయడం వల్లే అతడికి సింపతీ వస్తోందని రాయల్ టీమ్ హింటిస్తోంది. కానీ దాన్ని యష్మీ అర్థం చేసుకోలేకపోయింది.మెహబూబ్ సిల్లీ నామినేషన్స్నయని వంతురాగా.. నీకసలు సీరియస్‌నెస్, ఇంట్రస్ట్ లేదంటూ విష్ణు మెడలో నామినేటెడ్ బోర్డు వేసింది. సీత మెడలోనూ బోర్డు వేస్తూ.. నామినేట్ చేయడం దేనికి? బయటకు వెళ్లిపోతుంటే ఏడ్వడం దేనికని ఆమె ఎమోషన్‌ను ప్రశ్నించింది. మెహబూబ్ వంతురాగా.. నువ్వు నాతో సరిగా మాట్లాడలేదంటూ సీతను నామినేట్ చేశాడు. మా రాకను జీర్ణించుకోలేకపోతున్నారంటూ యష్మి మెడలో బోర్డు వేశాడు. తేజ మాట్లాడుతూ.. చీఫ్‌గా ఫెయిలయ్యావంటూ సీతను నామినేట్ చేశాడు. ఒక్కో పాయింట్ కూడా తూటామణికంఠ మెడలో బోర్డు వేస్తూ కరెక్ట్ పాయింట్లు చెప్పాడు. 1. ఎప్పుడు చూసినా నీ గోడు చెప్పుకుంటూనే ఉంటావ్.. అది నీ గేమా? 2. సీత నీకు ఫ్రెండ్ అన్నావ్, కానీ బిగ్‌బాస్ అడిగినప్పుడు నబీల్, విష్ణు పేర్లు మాత్రమే చెప్పావ్, అంటే సీత నీ ఫ్రెండ్ కాదా? 3. తన ఫుడ్ వస్తే తీసుకోవద్దని పృథ్వీ మరీ మరీ చెప్పాడు, అయినా సరే యష్మిది పక్కనపెట్టి మరీ అతడికే ఫుడ్ తీసుకెళ్లావ్.. దీన్నెలా అర్థం చేసుకోవాలంటూ మణికంఠను నామినేట్ చేశాడు. యష్మి సైకోయిజం!ఈ నామినేషన్ జరుగుతున్నప్పుడు యష్మి ఆనందం అంతా ఇంతా కాదు. చప్పట్లు కొట్టి మరీ సంతోషించింది. మణికంఠ ఎప్పటిలాగే తడబడకుండా సమాధానాలిచ్చాడు. పదేపదే ఏడ్వడం మానుకుంటున్నానని, సీత ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాదని, మదర్ సెంటిమెంట్ వల్లే పృథ్వీకి ఫుడ్ ఇచ్చానని మూడింటికీ ఆన్సరిచ్చాడు. మిగతావారి నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లో ప్రసారం కానుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణికంఠపై రెచ్చిపోయిన ఆదిత్య.. దగ్గరుంటే కొట్టేసేవాడేమో!
బిగ్‌బాస్ 8 మరీ చప్పగా సాగుతోంది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఆదిత్య ఓంని బయటకు పంపేశారు. ఆదివారం కూడా నైనిక ఎలిమినేట్ కాబోతుందని చెబుతున్నారు. అలానే 'రీలోడెడ్' పేరుతో స్పెషల్ ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ కానుంది. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఆదివారమే ఉన్నాయి.సరే ఇదంతా పక్కనబెడితే వారం మధ్యలో ఎలిమినేట్ అయి బయటకొచ్చిన ఆదిత్యని బిగ్‌బాస్ బజ్ కోసం అర్జున్ ఇంటర్వ్యూ చేశాడు. పలు విషయాల్ని చర్చించుకున్నారు. హౌస్‌లో ఉన్న నాలుగు వారాల జర్నీ గురించి ఏం చెబుతారని ఆదిత్యని అడగ్గా.. అది పెద్ద సైకాలజీ, మెంటల్ టెస్ట్ అని చెప్పుకొచ్చాడు. మరి అందులో పాసయ్యారా అంటే సమాధానం చెప్పలేకపోయిన ఆదిత్య నవ్వి తప్పించుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా)ఇక హౌస్‌లో గొడవల గురించి కూడా మాట్లాడిన ఆదిత్య.. కావాలని గొడవ పడుతున్న వాళ్లు, యాక్ట్ చేస్తున్న వాళ్లు చాలామందే ఉన్నారని చెప్పుకొచ్చాడు. గొడవలు పడే కంటెంటే ముఖ్యమని వాళ్లు అనుకుంటున్నారని ఆదిత్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక మణికంఠపై ఫుల్ ఫైర్ అయిపోయాడు. మనిషివా జంతువువా అని పట్టరాని కోపాన్ని ప్రదర్శించాడు.'మణికంఠ.. అసలు నువ్వు మనిషివా జంతువా? ఎన్నిసార్లు మీ దగ్గరు వచ్చి చెప్పాను మీకు, కరెక్ట్ సలహా ఇచ్చాను. కానీ ప్రతిసారీ నేను ఇచ్చిన సలహా సరిగా తీసుకోలేదు. ఎప్పుడు నేర్చుకుంటారు లైఫ్‌లో? అసలు బుర్ర ఉందా మీకు?' అని ఆదిత్య తెగ ఫైర్ అయిపోయాడు. ఒకవేళ మణికంఠ దగ్గరుంటే కొట్టేసేవాడేమో అన్నంతగా ఆవేశపడిపోయాడు.(ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్’ ఫేం శుభశ్రీకి యాక్సిడెంట్.. తుక్కుతుక్కైన కారు) -
మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి
బిగ్‌బాస్ 8లో ఐదో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆదిత్యని ఇంటికి పంపించేశారు. ఆదివారం ఎవరిని పంపిస్తారో చూడాలి. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట దాదాపు ఎనిమిది హౌసులోకి రాబోతున్నారు. ఇలా సందడిగా ఉంది. శనివారం కావడంతో నాగార్జున వచ్చేశాడు. హౌస్‌మేట్స్‌కి ఓ వైపు ప్రశంసలు, మరోవైపు వార్నింగ్‌లు ఇచ్చాడు. మణికంఠని అయితే పూర్తిగా గాలి తీసేశాడని చెప్పాలి.తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో భాగంగా సీత, నైనిక తప్పుల గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడాడు. వీళ్ల తర్వాత మణికంఠతో ముచ్చటించాడు. సీత బాడీ లాంగ్వేజ్‌లో నీకు సమస్య ఏంటి? అని అడగ్గా.. తను వెక్కిరించినట్లు అనిపించిందని మణికంఠ అన్నాడు. మధ్యలో మాట్లాడిన సీత.. మణినే తమందరినీ కార్నర్ చేస్తున్నాడనిపిస్తోందని చెప్పింది. దీని తర్వాత నాగార్జు, మణికంఠని యాక్షన్ రూమ్‌లోకి రమ్మన్నాడు.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లి పేరుతో అందరినీ ఫూల్ చేసిన నటి వనిత)మణికంఠ.. నీకు 8 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను, నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావో అంత ఏడ్చేసేయ్ అని నాగ్ చెప్పాడు. ఆల్మోస్ట్ అయిపోయింది సర్ అని మణి ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో మాట్లాడిన నాగ్.. ఒకవేళ కన్నా నా దగ్గరికి రావొద్దు, అక్కడే ఉండిపో అని ప్రియ చెప్పిందనుకో అని నాగ్ అనగానే.. నాకు భయమేస్తుంది సర్ అని భార్య గుర్తొచ్చి మణికంఠ ఏడుపు మొదలుపెట్టాడు.నీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి కూడా ఉందని నాగ్ బాంబు పేల్చాడు. ఏడవటం నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు. హౌస్ అందరికీ తెలుసు అని మణికంఠ గాలి మొత్తం తీసేశాడు. ఒకరకంగా చెప్పాలంటే ఎమోషన్ చూపిస్తూ, ఏడుస్తూ హౌస్‌లో ఉండిపోవాలనేది మణికంఠ ప్లాన్. దీన్నే ఇప్పుడు నాగార్జున బయటపెట్టాడా అనిపించింది. అలానే ఇకపై ఏడిస్తే కుదరదు అని స్మూత్ వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది.(ఇదీ చదవండి: మీ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుంటా.. అభిమానులపై ఎన్టీఆర్) -
యష్మిని ఆడుకున్న బిగ్‌బాస్.. ఏడ్చినా కరుణించలేదు!
ఆదిత్య ఎలిమినేషన్‌తో హౌస్‌లో తొమ్మిది మందే మిగిలారు. వీరికోసం బిగ్‌బాస్ అదిరిపోయే డీల్ తీసుకొచ్చాడు. ఇంటి వంటను కళ్లముందుంచాడు. కానీ దాన్ని తినే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. మరి ఎవరెవరు ఇంటి భోజనం అందుకున్నారో తెలియాలంటే నేటి (అక్టోబర్ 04) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..జాతకం చెప్పిన మణిమణికంఠకు సపోర్ట్ చేస్తే ఆడియన్స్ దృష్టిలో మనల్నే విలన్ చేస్తున్నాడని సీత అభిప్రాయపడింది. అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడంది. ఇదిలా ఉంటే తర్వాతి రోజు మార్నింగ్ మస్తీ పేరిట బిగ్‌బాస్ మణికంఠతో హౌస్‌మేట్స్‌కు జ్యోతిష్యం చెప్పించాడు. ఈ సందర్భంగా మణి తనలోని ఫన్ యాంగిల్‌ను బయటపెట్టాడు. తర్వాత హౌస్మేట్స్ మణి జాతకం చెప్పారు. ఈ వారం వెళ్లిపోయేలా ఉన్నావని నబీల్, ప్రతిదానికి ఏడవొద్దని యష్మి సెటైర్లు వేశారు.భార్య మెసేజ్ కోసం మణి ఆరాటంఅనంతరం అసలైన ఆట మొదలుపెట్టాడు. మొదటగా యష్మిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. నిఖిల్ కోసం అతడి అమ్మ చేసిన వంటను, నాగమణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను ముందు పెట్టాడు. వీరికి మెసేజెస్ కూడా వచ్చాయన్నాడు. అయితే ఇద్దరిలో ఒకరినే సెలక్ట్ చేసుకుని వారికి ఫుడ్, లెటర్ ఇవ్వాలన్నాడు. యష్మి.. క్షణం ఆలోచించకుండా నిఖిల్ పేరు చెప్పింది. అది విని మణికంఠ గుండె బద్ధలయ్యింది. తన భార్య ఏమని మెసేజ్ పంపిందోనని దిగులు చెందాడు. అంతలోనే తనకోసం బిర్యానీ చేసి పంపినందుకు తినకపోయినా మనసు నింపుకున్నాడు.నువ్వు వారియర్‌వి..అమ్మ చేతి వంట తిన్న తర్వాత నిఖిల్.. 'ఎవరి కోసమూ మారాల్సిన అవసరం లేదు, లక్ష్యాన్ని మర్చిపోకు' అంటూ తల్లి పంపిన మెసేజ్ చూసుకుని మురిసిపోయాడు. తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన పృథ్వీ విష్ణుప్రియకు బదులుగా నైనిక కోసం ఆమె తల్లి చేసిన ఇడ్లీసాంబార్ తీసుకెళ్తానన్నాడు. విష్ణు ముందుగానే త్యాగం చేసేందుకు రెడీ అని హింటివ్వడంతోనే పృథ్వీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు వారియర్‌వి, నీ బలం చూపించు అంటూ అమ్మ పంపిన మెసేజ్ చూసి నైనిక మురిసిపోయింది.యష్మి ఎమోషన్స్‌తో ఆడుకున్న బిగ్బాస్మణికంఠ వంతురాగా యష్మీని పక్కన పెట్టేసి పృథ్వీ ఫుడ్ తీసుకెళ్లిచ్చాడు. దీంతో యష్మి బోరుమని ఏడ్చేసింది. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అంటూ తల్లి నుంచి వచ్చిన మెసేజ్ చూసి పృథ్వీ ఖుషీ అయ్యాడు. ఇంతలో బిగ్‌బాస్ యష్మి కోసం తండ్రి పంపిన మెసేజ్‌ను సైతం టీవీలో వేశాడు. కానీ ఒక లైన్ చదివేలోపే దాన్ని తీసేయడంతో యష్మి ఒక్కసారి మెసేజ్ చూపించు బిగ్‌బాస్ అని ఏడుస్తూ వేడుకుంది. కానీ బిగ్‌బాస్ కనికరించలేదు. ఒంటరి పోరాటం..ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముందంటే.. హాయ్ అమ్మూ, నువ్వు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే నీ పోరాటాలను ఎదుర్కొన్నావు.. ఆ సమయంలో నీకు తోడుగా లేను. నీ కలలను సాకారం చేసుకునేటప్పుడు కుటుంబంలో ఎవరమూ నీకు సపోర్ట్ చేయలేదు. అయినా నువ్వు వారియర్‌లా పోరాడావు, మేము తప్పని నిరూపించావు. మేము గర్వపడేలా చేశావు. ధైర్యంగా ఉండు, మిస్ యూ మగలే.. ఇట్లు నీ పప్పా అని రాసి ఉంది.పెళ్లయి 10 నెలలే..తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన నిఖిల్.. ప్రేరణ, నబీల్, సీత.. ముగ్గురిలో ప్రేరణను సెలక్ట్ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన పావ్ బాజీని ప్రేరణ ఆవురావురుమని ఆరగించింది. 'మన పెళ్లయి పది నెలలే అవుతోంది.. నీకు ఈ షో ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నిన్ను కలవలేనప్పటికీ టీవీలో సంతోషంగా చూస్తున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను. మిస్ యూ.. ఇట్లు నీ పుట్టు' అని భర్త మెసేజ్ చదివి సంతోషించింది.విష్ణుకు మెసేజ్చివరగా ఇంటి నుంచి భోజనం అందుకోలేకపోయినవారికోసం బిగ్‌బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. నిఖిల్, నైనిక, ప్రేరణ, పృథ్వీ కలిసి.. మిగతా హౌస్‌మేట్స్‌లో ఒకరికి ఫుడ్ తీసుకెళ్లొచ్చనగా అందరూ విష్ణుప్రియ పేరు చెప్పారు. చెల్లి పంపిన చికెన్ బిర్యానీ చూసి విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఏమని మెసేజ్ వచ్చిందంటే. ఆట మీద దృష్టి పెట్టి రేసుగుర్రంలా ఆడు, సైలెంట్‌గా ఉండటం వల్ల నీ గేమ్ డల్ అవుతుంది. టాస్కుల్లో ఫైర్ చూపించు.. ప్రేక్షకుల మనసు గెలుచుకో అని రాసుంది. మరి ఇప్పుడైనా విష్ణు.. పృథ్వీపైనే కాకుండా గేమ్‌పై ఫోకస్ పెడుతుందేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణికంఠకు భార్య నుంచి సర్ప్రైజ్.. దక్కనివ్వని యష్మి
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలై నెలరోజులైపోయింది. అయినవాళ్లను వదిలేసి వచ్చిన హౌస్‌మేట్స్‌కు ఇంటి మీద ఆల్రెడీ బెంగ మొదలైంది. ఈ బెంగను ఎంతోకొంత తీర్చేందుకు బిగ్‌బాస్ ఇంటి భోజనం ప్లాన్ చేశాడు. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి రుచిరకమైన భోజనం తెప్పించాడు. అలాగే ప్రియమైనవారి లేఖలు సైతం వచ్చాయని గుడ్‌న్యూస్ చెప్పాడు.ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్..కానీ అంతలోనే మరో బ్యాడ్‌న్యూస్ చెప్పాడు. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లే ప్రతి కంటెస్టెంట్.. తన ముందు ఇద్దరికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది. అందులో ఒక్కరి ఫుడ్ మాత్రమే తీసుకుని మరొకరిది తిరస్కరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యష్మి ఎదుట నిఖిల్ కోసం అతడి తల్లి చేసిన వంటను, మణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను రెడీగా పెట్టారు. వీరికి ఇంటి నుంచి లెటర్స్ కూడా వచ్చాయని బిగ్‌బాస్ తెలిపాడు.మణికంఠ టెన్షన్అయితే మణికంఠపై పీకలదాకా కోపం పెంచుకున్న యష్మి.. నిఖిల్‌కే ఇస్తానంది. దీంతో మణి.. విదేశాల్లో ఉన్న తన భార్య ఇండియాకు ఎందుకొచ్చేసిందో అర్థం కావట్లేదు, ఈ షో వల్ల ఏమైనా జరిగుంటుందా? అని ఏడ్చేశాడు. అటు మణికంఠకు పృథ్వీ, యష్మి ఫుడ్ ఎదురుగా పెట్టి ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోమన్నాడు.సోనియాను మర్చిపోని నిఖిల్అందుకు మణి.. పృథ్వీకే ఇంటి భోజనం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నిర్ణయం విని యష్మి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఇక ఈ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం? అని నిఖిల్‌ను ప్రశ్నించగా అతడు సోనియా పేరు చెప్పాడు. మరి ఎవరెవరు ఇంటి భోజనాన్ని ఆస్వాదించారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తిట్టుకుని మరీ ఏడ్చిన యష్మి, పృథ్వీ.. మణి పరిస్థితి ఇలా అయిందేంటి?
హౌస్‌మేట్స్‌ను కూల్ చేసేందుకు ఫన్ గేమ్ ఇచ్చిన బిగ్‌బాస్ తర్వాత చీఫ్ కంటెండర్ కోసం మరో గేమ్ పెట్టాడు. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఎవరు చీఫ్ అయ్యారు? మళ్లీ ఎలాంటి రభస జరిగిందనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..మార్నింగ్ మస్తీ..బిగ్‌బాస్ ఇంటిసభ్యులతో ఉదయాన్నే కాస్త ఫన్ గేమ్ ఆడించాడు. కలర్.. కలర్.. విచ్ కలర్? అంటూ చిన్నపిల్లల ఆట ఆడించాడు. మధ్యమధ్యలో హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు కూడా చేయించాడు. అనంతరం సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్ ముగిసిందని బిగ్‌బాస్ వెల్లడించాడు. ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయని ప్రకటించాడు. ఎక్కువ టాస్కులు గెలిచిన శక్తి టీమ్ నుంచి ఒకర్ని నేరుగా చీఫ్ కంటెండర్‌గా సెలక్ట్ చేయమని బిగ్‌బాస్ ఆదేశించాడు.ఏడ్చిన యష్మి, పృథ్వీదీంతో యష్మి, పృథ్వీ.. తాను కంటెండర్ అవుతానంటే తాను అవుతానని వాదించుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీ.. నువ్వు మణికంఠను అబ్బాయి కాదని కామెంట్ చేయలేదా? అని నెగెటివ్ ఎత్తి చూపడంతో యష్మి ఏడ్చేసింది. అమ్మతోడు అలా అనలేదని దాని గురించి మాట్లాడొద్దని అడిగింది. ఇక యష్మిని ఓదార్చబోయి పృథ్వీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు. పైకి కఠినగా కనిపించే ఇద్దరూ కంటతడి పెట్టుకోవడంతో నిఖిల్ ఆశ్చర్యపోయాడు.పప్పీ గేమ్పృథ్వీ ఏడుస్తున్నాడని తెలిసి విష్ణుప్రియ మనసు కళుక్కుమంది. నువ్వు రోజూ దిష్టి తీయించుకో అంటూ అతడిపై ప్రేమ ఒలకబోసింది. నానా రభస తర్వాత నిఖిల్.. పృథ్వీని చీఫ్ కంటెండర్‌గా సెలక్ట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. మరో చీఫ్ కంటెండర్ ఎంపిక కోసం బిగ్‌బాస్ హ్యాపీ పప్పీ గేమ్ పెట్టాడు. ఇందులో కుక్కపిల్ల బొమ్మల మీద ఇంటిసభ్యుల పేర్లుంటాయి. ప్రతిఒక్కరూ తమపేరుకు బదులుగా వేరే పేరున్న పప్పీనే సెలక్ట్ చేసుకుని ఆడాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్‌కు కొత్త సంచాలక్పప్పీని చివరగా ఇంటికి తీసుకొచ్చిన కంటెస్టెంట్‌తో పాటు పప్పీ మెడలోని ట్యాగ్‌పై ఎవరి పేరుంటుందో ఆ కంటెస్టెంట్ ఇద్దరూ డేంజర్ జోన్లో నిలబడతారు. వారిలో ఒకరిని సంచాలకుడు అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్లో నుంచి అవుట్ అయిన కంటెస్టెంట్ సంచాలకుడిగా మారుతూ ఉంటారు. మొదటి రౌండ్లో మణి, యష్మి.. డేంజర్ జోన్లో నిలబడ్డారు. సంచాలకుడు పృథ్వీ.. యష్మిని గేమ్‌లో ఉంచుతూ మణిని అవుట్ చేశాడు. కావాలనే తనను రేసు నుంచి పక్కన పెట్టేశారని మణి ఫీలయ్యాడు. మణిని టార్గెట్ చేశారా?రెండో రౌండ్లో యష్మి, ప్రేరణ డేంజర్ జోన్లో నిలబడ్డారు. ప్రేరణకు చీఫ్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని మణి.. యష్మిని అవుట్ చేశాడు. నన్ను టార్గెట్ చేశావని యష్మి అనగా.. తాను టార్గెట్ చేయలేదని మణి వాదించాడు. నీతో ఎవడ్రా మాట్లాడతాడు, పోరా.. నీకయితే చీఫ్ అయ్యే అర్హతే లేదు. నువ్వు ఎలా ఆడతావో చూస్తా.. అని ఛాలెంజ్ చేయగా ఏదో ఒకరోజు చీఫ్ అవుతానని మణి శపథం చేశాడు. తర్వాత మణి వెళ్లి బొమ్మలు సర్దుతుంటే దాన్ని సీత తప్పుపట్టింది. అతడిపైకి గట్టి గట్టిగా అరుస్తూ క్లాస్ పీకింది.విష్ణు అవుట్ దీంతో మణి అందరూ కలిసి కార్నర్ చేస్తున్నట్లుగా ఉందని కన్నీళ్లు పెట్టుకోగా యష్మి వెళ్లి ఓదార్చడం విశేషం. సీతూ అంటే ఇష్టం.. తనను తప్పుగా అర్థం చేసుందని ఎమోషనల్ అవడంతో వెంటనే ఆమె కూడా వెళ్లి ఓదార్చింది. మూడో రౌండ్లో ప్రేరణ, విష్ణుప్రియ డేంజర్ జోన్లో నిలబడ్డారు. వీరిలో నుంచి యష్మి.. విష్ణును గేమ్ నుంచి అవుట్ చేసింది. నాలుగో రౌండ్లో నైనిక, సీత నిలబడగా విష్ణు సీతను అవుట్ చేసింది. అతడే చీఫ్ఐదో రౌండ్లో నైనిక తన పప్పీ తనే తెచ్చేసుకోవడంతో గేమ్‌లో నుంచి అవుట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్లో గేమ్ పూర్తవలేదు కానీ ఆల్రెడీ నబీల్ చీఫ్ కంటెండర్‌గా, ఆ తర్వాత చీఫ్‌గానూ సెలక్ట్ అయ్యాడట! ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆదిత్య ఓంను సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రెచ్చగొట్టిన యష్మి.. ఛాలెంజ్ చేసిన మణికంఠ
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు తుఫానులా రాబోతున్నాయంటూ కంటెస్టెంట్లకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. మంచి కంటెంట్ లేకపోవడంతో బోర్‌గా ఫీలవుతున్న బిగ్‌బాస్ ప్రేక్షకులకు మాత్రం ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఇక హౌస్‌లో కొత్త చీఫ్ కోసం బిగ్‌బాస్ ఓ పోటీ పెట్టాడు. పోయిన సీజన్‌లోని టాస్కునే మళ్లీ రిపీట్ చేశాడు. మొత్తం 10 మంది పేర్లు ఉన్న కుక్కబొమ్మలుంటాయి. బజర్ మోగగానే వాటిని తీసుకొచ్చి వాటికి కేటాయించిన హౌస్‌లో పెట్టాలి. ఫెయిల్ అయినట్లేగా?ఎవరైతే పప్పీని చివరగా తీసుకొస్తారో, ఆ సభ్యుడు.. అలాగే పప్పీ మెడలో ఎవరి పేర్లైతే ట్యాగ్ ఉందో ఆ సభ్యుడు.. ఇద్దరూ డేంజర్ జోన్లో నిలబడాల్సి ఉంటుంది. అలా మణికంఠ, యష్మి డేంజర్ జోన్లో నిలబడగా.. పృథ్వీ.. యష్మికి సపోర్ట్ చేసి మణిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావంటూ యష్మి.. అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అందరూ కలిసి తనను కార్నర్ చేస్తున్నారని మణి ఆవేదన వ్యక్తం చేశాడు.మణికి దొరకని సపోర్ట్తర్వాత ప్రేరణ, యష్మి.. డేంజర్ జోన్లో నిలబడ్డారు. తనకు చీఫ్‌గా మళ్లీ ఛాన్స్ వస్తే తనను కరెక్ట్ చేసుకునే ఛాన్స్ వస్తుందని యష్మి చెప్పింది. దీంతో మణికంఠ.. నిన్ను నువ్వు సరిదిద్దుకుంటాను అంటున్నావంటే ఇంతకుముందు చీఫ్‌గా ఫెయిలయ్యావా? అని సూటిగా అడిగాడు. ఆల్రెడీ చీఫ్ అని నన్ను రేసు నుంచి తీసేయడం ఎంతవరకు కరెక్ట్? అని యష్మి అడగ్గా.. యష్మి గేమ్‌లో నుంచి అవుట్ అని మణికంఠ తన నిర్ణయం చెప్పాడు. సవాల్మణికంఠపై పీకలదాకా కోపం పెంచుకున్న యష్మి.. ఈ హౌస్‌కు చీఫ్ అయ్యే అర్హతే ఇతడికి లేదనేసింది. ఏదో ఒకరోజు నేను చీఫ్ అయి చూపిస్తానని మణి సవాల్ చేయగా.. అవ్వరా అవ్వు, ఎట్లా ఆడతావో నేనూ చూస్తానంటూ సవాలు చేసింది. మొత్తానికి చీఫ్ అవ్వాలన్న మణి ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. ఇకపోతే నబీల్ కొత్త చీఫ్‌గా ఎంపికయ్యాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆదిత్య పిచ్చిపని.. బిగ్‌బాస్ వార్నింగ్.. నిజం ఒప్పుకున్న విష్ణు
ఈ రోజు నామినేషన్స్‌లో అంత ఫైర్ ఏం కనిపించలేదు. కారణాలు వెతుక్కుని మరీ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లు కనిపించింది. మెజారిటీ సభ్యులు నాగమణికంఠపైనే పడ్డారు. యష్మి.. నిఖిల్ టీమ్‌కు షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అలా వెళ్లి ఇలా వచ్చేశాడుఈ సీజన్లో జైల్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా నాగమణికంఠ నిలిచాడు. అయితే కాసేపటికే అతడిని బయటకు పంపించి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను మంటలో వేయాలన్నాడు. మొదటగా నాగమణికంఠ మాట్లాడుతూ.. మొదటి వీక్‌లో ఉన్నంత స్ట్రాంగ్‌గా ఇప్పుడు లేవంటూ నైనికను నామినేట్ చేశాడు. తనపై జోకులు వేయడం నచ్చలేదంటూ యష్మి ఫోటోను మంటల్లో వేశాడు.నామినేషన్స్తర్వాత నైనిక..నబీల్, విష్ణుప్రియను; సీత.. మణికంఠ, విష్ణుప్రియను; నబీల్.. నైనిక, విష్ణుప్రియను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా విష్ణు.. నేను అనుకున్నంత ఈజీగా ఈ జర్నీ లేదు. నేను ప్రతిరోజు బెస్ట్ ఇవ్వలేను.. కానీ ట్రై చేస్తాను అంటూ తను పెద్దగా ఆడలేదన్న విషయాన్ని ఒప్పేసుకుంది. ఆదిత్య ఓం.. నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటే బాగుంటుందని నైనిక ఫోటోను అగ్నిలో వేశాడు. ఆచితూచి మాట్లాడంటూ విష్ణును నామినేట్ చేశాడు.నీకే నోటిదురుసునిఖిల్ వంతురాగా.. నువ్వు చేసే కామెడీ ఎదుటివారిని బాధపెట్టేలా ఉండకూడదు అని విష్ణును నామినేట్ చేశాడు. అప్పుడు విష్ణు.. నాకన్నా నీకే పెద్ద నోటిదూల, అలాంటిది నువ్వు వచ్చి చెప్తున్నావా? అని సెటైర్లు వేయడంతో లేడీ గ్యాంగ్ ఫక్కుమని నవ్వింది. సింపతీ గేమ్ ఆడుతున్నావంటూ నాగమణిని నామినేట్ చేశాడు. తర్వాత ప్రేరణ.. త్యాగం చేయడం తప్పు అంటూ మణి ఫోటోను మంటల్లో వేసింది. మీలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతోందంటూ ఆదిత్యను నామినేట్ చేసింది. ఆవేశపడ్డ ఆదిత్యఆమె మాటలతో ఆవేశపడ్డ ఆదిత్య.. మంటల్లో చేయి పెట్టి తన ఫోటోను బయటకుతీస్తూ ఇదీ నా కాన్ఫిడెన్స్ అన్నాడు. దీంతో బిగ్‌బాస్.. మంటల్లో చేయి పెట్టడం ఆటలా? అని క్లాస్ పీకడంతో ఆదిత్య క్షమించమని కోరాడు. తర్వాత విష్ణుప్రియ.. నీ పర్ఫామెన్స్ ఇంకా మెరుగవ్వాలంటూ నైనికను నామినేట్ చేసింది. సంచాలకుడిగా సరిగా వ్యవహరించలేదంటూ నబీల్ ఫోటోను మంటల్లో వేసింది. మాట మార్చావ్..యష్మి.. మణికంఠను నామినేట్ చేస్తూ నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అర్థం కావట్లేదు... నువ్వు నా ఫ్రెండ్ కానందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సమయంలో మణి, యష్మి.. చాలాసేపు వాదులాడుకున్నారు. అనంతరం యష్మి.. మీలో క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తోందని ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది. పృథ్వీ.. నైనికను నామినేట్ చేశాడు. నాలుగు గోడల దగ్గర త్యాగం చేశానని చెప్పి అందరిముందు త్యాగం చేయలేదని మాట మార్చావంటూ మణికంఠను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కాసేపు గొడవపడ్డారు. నామినేషన్స్‌లో ఎవరంటే?చివర్లో హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ సూపర్ పవర్ ఇచ్చాడు. ఇద్దరు చీఫ్స్‌లో ఒకరిని నామినేట్ చేయొచ్చన్నాడు. యష్మి, పృథ్వీ మినహా మిగతా అందరూ సీతను సేవ్ చేయడానికే మొగ్గు చూపడంతో నిఖిల్ నామినేషన్లోకి వచ్చాడు. అలా ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబీల్ నామినేషన్లో ఉన్నారు.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణికంఠకి మెంటలెక్కించారు.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నదెవరు?
ఆదివారం ఎపిసోడ్లో సోనియా ఎలిమినేట్ అయిపోయింది. అలా బిగ్‌బాస్ షో ఐదోవారంలోకి అడుగుపెట్టేసింది. సోమవారం వచ్చింది కాబట్టి ఎప్పటిలానే నామినేషన్స్ హడావుడి మొదలైంది. ఈసారి ఫొటోని మంటల్లో వేసే కాన్సెప్ట్‌తో నామినేషన్స్ సాగింది. ఎప్పటిలానే మణికంఠ టార్గెట్ అయ్యాడు. సీత అయితే మణిని ఓ రేంజులో రెచ్చగొట్టి వదిలేసింది.(ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?)ప్రోమో ప్రకారం మణికంఠ.. సరిగా ఆడట్లేదని నైనికని నామినేట్ చేశాడు. అలానే యష్మిని మళ్లీ టార్గెట్ చేశారు. నైనిక-నబీల్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. సీత-మణికంఠ మధ్య అయితే చిన్నపాటి యుద్ధమే జరిగింది. గత వారాల్లో జరిగిన పాయింట్స్ తెచ్చేసరికి మణి సైలెంట్ అయిపోయాడు. ఓ సందర్భంగా అతడిలా సీత ఇమిటేట్ చేసినట్లు అనిపించింది. దీంతో మణికంఠకి మెంటలెక్కిపోయింది.బాడీ లాంగ్వేజ్ మార్చుకో అని సీతతో మణికంఠ చెప్పగా.. ఇది నా బాడీ లాంగ్వేజ్, నేను ఎలా అయినా చేసుకుంటా అన్నట్లు సీత అంతే ధీటుగా సమాధానమిచ్చింది. ఇలా హోరాహోరీగానే సాగినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే నామినేషన్స్ షూటింగ్ పూర్తవగా ఎవరెవరు లిస్టులో ఉన్నారనేది బయటకొచ్చింది. ఈ వారం విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య, నబీల్, మణికంఠ, నిఖిల్.. నామినేషన్స్‌లో ఉన్నారు. అలానే ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?) -
సోనియా ఎలిమినేట్, ఏడ్చిన నిఖిల్.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగ్!
ఎంతోమంది బిగ్‌బాస్ ప్రియులు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సోనియా ఎలిమినేట్ అయింది. తను వెళ్లిపోతుంటే నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. వెళ్లిపోయేముందు కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెలిబుచ్చింది సోనియా.. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ముందే ఊహించిన సోనియాఈ వారం తానే ఎలిమినేట్ అవుతానని సోనియా ముందే పసిగట్టింది. హౌస్ మొత్తం తనను తప్పుగా అర్థం చేసుకుంటోందంటూ తొలిసారి ఏడ్చేసింది. నాగ్ ఓదార్చే ప్రయత్నం చేయగా సోనియా తన కన్నీళ్లను దిగమించుకునేందుకు యత్నించింది. దీంతో యష్మి లేచి.. సోనియా ఒక సోదరిలా పృథ్వీ, నిఖిల్‌కు సలహాలు ఇస్తోందని, అక్కడ ఈమె తప్పే లేదని వెనకేసుకొచ్చింది. తర్వాత నాగ్ చిన్న ఫన్ గేమ్ ఆడించగా ఇందులో కాంతార టీమ్ గెలిచింది. సోనియా టాక్సిక్అనంతరం మీకే అంకితం అనే చిట్టీల గేమ్ ఆడించాడు. కంటెస్టెంట్లు ఓ చీటీ తీసి అందులో ఉన్న వాక్యాన్ని ఒకరికి అంకితం చేసి వారిని చెంపదెబ్బ కొట్టాలన్నాడు. అలా మొదటగా ప్రేరణ.. హౌస్‌లో సోనియా టాక్సిక్ అని ఆమెను కొట్టింది. నైనిక.. విష్ణుప్రియను లౌడ్ స్పీకర్ అంది. సీత.. మణికంఠ విక్టిమ్ కార్డ్ వాడతాడంది. ఆదిత్య.. మణికంఠ నెగెటివ్‌గా ఆలోచిస్తాడని పేర్కొన్నాడు. నబీల్.. నిఖిల్ సేఫ్ ప్లేయర్ అని తెలిపాడు. పృథ్వీ.. మణికంఠ మానిప్యులేట్ చేస్తాడన్నాడు.కంటెస్టెంట్ల చేతికి ఎలిమినేషన్ పవర్ యష్మి.. పృథ్వీ అటెన్షన్ సీకర్ అని తెలిపింది. నిఖిల్.. మణికంఠకు ఏ లక్ష్యం లేదన్నాడు. మణికంఠ వంతురాగా నిఖిల్ బయాస్డ్ అని పేర్కొన్నాడు. విష్ణు.. నైనిక ఇమ్మెచ్యూర్ అని అభిప్రాయపడింది. సోనియా.. విష్ణుకు సెల్ఫిష్ అన్న ట్యాగ్ ఇచ్చింది. తర్వాత నాగ్ ప్రేరణను, ఆదిత్యను సేవ్ చేశాడు. చివర్లో సోనియా, మణికంఠ మాత్రమే మిగిలారు. మణికంఠ హౌస్‌లో ఉండేందుకు పనికిరాడని మీరన్నారు. కానీ, సోనియాకు తక్కువ ఓట్లు పడ్డాయి.. మరి వీరిద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండాలనేది మీరే నిర్ణయించాలంటూ కంటెస్టెంట్లకే పవర్ ఇచ్చాడు నాగ్.జైలుకు మణికంఠఈ క్రమంలో నిఖిల్, పృథ్వీ, నైనిక మాత్రమే సోనియాకు సపోర్ట్ చేయగా మిగతా అందరూ మణికంఠకు మద్దతిచ్చారు. దీంతో నాగ్.. అటు ప్రేక్షకుల ఓట్ల ప్రకారం, మెజారిటీ హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం సోనియా ఎలిమినేట్ అని ప్రకటించాడు. డేంజర్ జోన్లో ఉన్న మణి ఈ ఎపిసోడ్ అయిపోగానే జైల్లో ఉండాలన్నాడు. ఇక సోనియా ఎలిమినేట్ అవడంతో నిఖిల్, పృథ్వీ భావోద్వేగానికి లోనయ్యారు. (చదవండి: సోనియా ఎలిమినేషన్‌కు కారణాలివే!)నేనెవరికీ నచ్చనుస్టేజీపైకి వచ్చిన సోనియా.. నేను ఉన్నదున్నట్లు మాట్లాడటం వల్ల ఎవరికీ నచ్చను. కాలేజీలోనూ అంతే, ఇక్కడా అంతే.. కానీ, ఎవరికోసమూ నా స్వభావాన్ని మార్చుకోలేను. నిఖిల్, పృథ్వీకి సలహాలు ఇస్తాను. కానీ, వారు నా మాటలు వినరు, నేను వాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేయలేదు అని నొక్కి చెప్పింది. హౌస్మేట్స్ గురించి మాట్లాడుతూ.. విష్ణుప్రియ పులిహోర కలుపుతుందని, సీత.. కాకరకాయలా చేదుగా మాట్లాడుతుందని చెప్పింది. ప్రేరణ.. ఆవకాయ అని, నబీల్.. సాఫ్ట్ కుర్రాడు అని తెలిపింది. పృథ్వీ.. స్వీట్ పాయసం అని, యష్మి.. పెరుగన్నం అని పేర్కొంది. మిడ్ వీక్ ఎలిమినేషన్అన్నం లేకపోతే ఏదీ లేదు, అలాగే నిఖిల్ లేకపోతే బిగ్‌బాస్ హౌసే లేదంది. నైనిక.. అప్పడంలా ఈజీగా బ్రేక్ అవుతుందని చెప్పింది. సోనియా వెళ్లిపోతుండటంతో నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మిస్ యూ అంటూ ఒకరినొకరు కళ్లతోనే సంభాషించుకున్నారు. సోనియాను పంపించేశాక.. నాగ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పాడు. అంటే.. వచ్చే ఆదివారం (అక్టోబర్ 5న) వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీరితోపాటే సోనియా కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాగ్‌తో అడ్డంగా వాదించిన సోనియా.. హౌస్‌లో జీరో అతడే!
మాటలు హద్దులు దాటడంతో యష్మి, విష్ణు, సోనియాకు నాగ్ గట్టిగానే క్లాస్ పీకాడు. మణికంఠను అబ్బాయే కాదంటావా? నిఖిల్ చేతికి గాజులు ఒక్కటే తక్కువయ్యాయా? యష్మి దృష్టి ఎంతసేపూ ఇద్దరబ్బాయిల మీదే ఉందా? అని ముగ్గురిపైనా విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఎవరిపై ఏ రేంజులో ఫైర్ అయ్యాడో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హీరోగా నబీల్నాగార్జున వచ్చీరావడంతోనే హీరో-జీరో గేమ్ ఆడించాడు. మొదటగా మణికంఠ.. సీత హీరోలా గేమ్ ఆడుతుందని, నైనిక గేమ్‌లో జీరోలా అయిపోతోందని చెప్పాడు. మణికంఠ కరెక్ట్‌గా చెప్పాడని నాగ్ మెచ్చుకున్నాడు. తర్వాత యష్మి.. నబీల్ను హీరో, నైనికను జీరో అనేసింది. ఇక్కడ నాగ్.. నబీల్ ఆటకు చప్పట్లు కొట్టడమే కాకుండా ఆడియన్స్‌తోనూ సూపర్ అనిపించాడు. ఇతడు పృథ్వీ హీరో, మణిని జీరో అని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా మణికంఠ డబుల్ యాక్షన్ చేసిన వీడియోలు ప్లే చేశారు. గేమ్‌లో త్యాగం చేయలేదని ఓసారి, తనే త్యాగం చేశానని మరోసారి చెప్పాడు. ఏదైనా ఒక్కదానిపైనే నిలబడు, అతిగా ఆలోచించకు అని నాగ్ మణికి సలహా ఇచ్చాడు.సీత హీరో, మణి జీరోఆదిత్య వంతురాగా.. నిఖిల్ హీరో, మణి జీరో అని పేర్కొన్నాడు. నైనిక.. సీత హీరో, మణి జీరో అని తెలిపింది. ప్రేరణ వంతురాగా.. నబీల్‌కు హీరోగా కిరీటం పెట్టింది. పప్పులా ఆడుతున్నాడా? ఎవరి వల్లయినా ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడా? అనేది అర్థం కావట్లేదంటూ నిఖిల్‌ను జీరోగా అనేసింది. ఎందుకలా? అని నాగ్ అడగ్గా మిస్ బ్యాలెన్స్ అయ్యానని నిఖిల్ చెప్పాడు. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? అని నిలదీశాడు. అంతేకాకుండా నీ క్లాన్లోకి రావడానికి హౌస్ అంతా ఇష్టపడలేదు, ఎందుకో తెలుసా? నీ ఆట నువ్వు ఆడట్లేదు, ఈజీగా ఇన్ఫ్లూయెన్స్ అయిపోతున్నావు.. అనే ఎవరూ ఇష్టపడలేదు అని అర్థమయ్యేలా వివరించాడు. చదవండి: సోనియా ఎలిమినేట్.. సీక్రెట్ రూంలాంటి ట్విస్టులేమైనా..?నా ఆట నేనే ఆడతాసోనియా, నిఖిల్.. పృథ్వీని హీరోగా, మణికంఠను జీరోగా అభిప్రాయపడ్డారు. సీత.. నబీల్ను హీరోగా పేర్కొనగా.. ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ నిఖిల్‌ను జీరోగా అభిప్రాయపడింది. నెమ్మదిగా విషయం బోధపడుతున్న నిఖిల్.. ఇకమీదట నా ఆట నేనే ఆడతా, నా నిర్ణయాలు నేనే తీసుకుంటా అని మాటిచ్చాడు. పృథ్వీ.. నబీల్ను హీరోగా.. మణికంఠను జీరోగా పేర్కొన్నాడు. తర్వాత నాగ్ సోనియాకు క్లాస్ పీకాడు.. విష్ణును అడల్ట్రేటెడ్ కామెడీ అన్నావ్.. మరి నామినేషన్లో నువ్వు చేసిందేంటి? అని వీడియో ప్లే చేశాడు.నాగ్‌తో వాదించిన సోనియాఅందులో సోనియా.. ఎంతసేపు పృథ్వీ, నిఖిల్‌నే చూస్తే ఎలా? మమ్మల్ని కూడా చూడు అంటూ యష్మిపై సెటైర్లు వేసింది. ఇది తప్పు కాదా? అని నిఖిల్, పృథ్వీని ప్రశ్నించగా అబ్బే, తన ఉద్దేశం అది కాదంటూ వీళ్లు ఆమెను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో ప్రేరణ అందుకుని.. ఇందుకే, ఇలా తప్పు చేసినా సరే వారిని వారే సమర్థించుకోవడం వల్లే ఎవరూ ఆ క్లాన్లోకి వెళ్లలేదని ఉన్నమాట అనేసింది. తర్వాత సోనియా లేచి.. గేమ్‌లో వాళ్లతో పాటు నన్ను కూడా చూడు అని చెప్పానే తప్ప అందులో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదని వాదించింది. ఇది జోక్ కాదువిష్ణుప్రియ.. ప్రేరణకు హీరోగా కిరీటం ఇవ్వగా, సోనియా జీరో అని తేల్చింది. ఈ సందర్భంగా విష్ణు.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువ అని హేళన చేసిన వీడియోను నాగ్ ప్లే చేశాడు. అది సరదాగా అన్నానని విష్ణు నవ్వడంతో.. ఇది జోక్ కాదు, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావ్? ఇలాంటివి మళ్లీ రిపీట్ కావొద్దని నాగ్ హెచ్చరించాడు. అనంతరం మణికంఠను అబ్బాయిల లిస్టులో నుంచి పక్కనపడేసిన వీడియో ప్లే చేశారు.యష్మిపై ఫైర్అందులో.. ఇంట్లో నలుగురు అబ్బాయిలే ఉన్నామా? అయినా మణికంఠ ఉన్నాడుగా అని పృథ్వీ అనగా వాడు లెక్కలో లేడు అని యష్మి అనేసింది. ఇది చూసి నోరెళ్లబెట్టిన యష్మి.. అమ్మతోడు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, గేమ్పరంగా అతడు లెక్కలో లేడు అన్నానే తప్ప మరే ఉద్దేశం లేదంటూ క్షమాపణలు చెప్పింది. ఫైనల్‌గా నాగ్ ఈ రోజు నబీల్ ఒక్కడినే సేవ్ చేశాడు. రేపు సోనియా ఎలిమినేట్ అన్న విషయం అందరికీ తెలిసిందే!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ ఆమెకు పడిపోయాడు, తనను చూస్తే భయమేస్తోంది: సోనియా
సీరియస్ టాస్క్‌లకు చెక్ పెడుతూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరి పాత్రల్లో మరొకరు దూరి మిమిక్రీ చేయాలన్నాడు. ఇంకేముంది.. హౌస్మేట్స్ దొరికిన ఛాన్స్‌ను బీభత్సంగా వాడుకున్నారు. నబీల్ అయితే నెక్ట్స్ లెవల్.. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 27) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పృథ్వి మాయలో విష్ణుపృథ్వి, విష్ణుప్రియకు ఒకరంటే ఒకరికి ఇష్టం. నిన్న టాస్కులో కూడా పృథ్వి.. విష్ణుకోసం ప్రేమపాట పాడటం.. అది విని ఆమె పరవశించిపోవడం చూశాం. వారి ఇష్టాన్ని గ్రహించిన సోనియా.. పృథ్విగాడిని చూస్తే భయం వేస్తుంది. ఆమె (విష్ణు)కు పడిపోతున్నాడు. నాకు ఏది నిజం? ఏది అబద్ధమో తెలియదుగానీ అలా అనిపిస్తుంది అని నిఖిల్‌తో చెప్పుకొచ్చింది. అటు విష్ణుప్రియ కూడా.. తన లేడీ గ్యాంగ్‌కు పృథ్వీ అంటే ఇష్టమని చెప్పి అతడితోనే ఎంచక్కా ఉంటోంది.రేషన్ టాస్క్తర్వాత బిగ్‌బాస్ రేషన్ టాస్క్ పెట్టాడు. అందులో భాగంగా తాను వినిపించే శబ్దాలను వరుస క్రమంలో రాయాలన్నాడు. ఈ గేమ్‌లో శక్తి టీమ్ గెలవగా తమకు కూరగాయలు, పండ్లు, కూల్‌డ్రింక్ తీసుకునేందుకు ఎక్కువ గడువు దొరికింది. కాంతార టీమ్‌కు వాటిని సంపాదించుకునేందుకు తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు.టీమ్ మార్చేసిన మణిఅనంతరం బిగ్‌బాస్.. గార్డెన్ ఏరియాలో ఓ బంగారు గాజును పెట్టాడు. దాన్ని ఉపయోగించుకుని వేరే టీమ్‌లోకి మారొచ్చని చెప్పాడు. నబీల్ను లాక్కోవాలని శక్తి టీమ్.. పృథ్విని లాక్కోవాలని కాంతార టీమ్ ప్రయత్నించింది. కానీ ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ నాగమణికంఠ గోల్డెన్ బ్యాంగిల్ ధరించాడు. అలా శక్తి టీమ్‌ను వదిలేసి కాంతార టీమ్‌లో చేరాడు. అయితే కాంతార టీమ్‌లో నుంచి ఒకరిని స్వాప్ చేయాలనడంతో ఆదిత్యను శక్తి టీమ్‌కు పంపించాడు.పరకాయ ప్రవేశంతర్వాత బిగ్‌బాస్.. ఇంట్లో ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరిని ఒకరు ఇమిటేట్ చేయాలన్నాడు. ప్రేరణ.. మణి పాత్రలో జీవించేసింది. ఆదిత్య.. సోనియాను అచ్చుదింపేశాడు. నబీల్.. ఆదిత్య పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఎవరూ తగ్గలేదు. అందరిలో నబీల్ను బెస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించారు. ఇక ఈ ఇమిటేషన్ టాస్కులో నిఖిల్, సోనియా, పృథ్వీలను ఒక గ్రూపుగా పేర్కొంటూ వారిపైనే ఫోకస్ పెట్టడంతో సోనియా తెగ సంతోషపడిపోయింది. తమ ముగ్గురి గురించే హౌస్ అంతా మాట్లాడుకుంటోందని మురిసిపోయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గోల్డెన్ ఛాన్స్‌తో మోక్షం పొందిన మణి.. పాపం ఆదిత్య!
గ్రూప్ గేమ్స్ అంటూ నిఖిల్‌ను మొదటిరోజే విమర్శించిన సోనియా.. ఇప్పుడు అతడితోనే జతకట్టి గేమ్ ఆడుతోంది. పృథ్వీ, నిఖిల్, సోనియా.. ఈ ముగ్గురూ ఓ బ్యాచ్. వీళ్ల మధ్యలోకి ఎవరూ వెళ్లలేరు. వెళ్లినా ఉండలేరు. నాగమణికంఠ విషయంలో ఇదే జరిగింది.శక్తి టీమ్‌లో ఒకరిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయాలన్నప్పుడు సోనియా, పృథ్వి, యష్మి.. మణి పేరు సూచించారు. ఆల్రెడీ ఫలితం నిర్ణయించుకున్నాక, తననే మెడపట్టి గెంటేయాలని ఫిక్సయ్యాక వాదించడం అనవసరమని మణి తనే త్యాగం చేస్తానన్నాడు. పోరాటానికి బదులు త్యాగానికే మొగ్గు చూపాడు.(ఇది చదవండి: దేవర మూవీ రివ్యూ)తానేం కావాలని త్యాగం చేయలేదని మణి అనగానే శక్తి టీమ్ ఒంటికాలిపై లేచింది. అబద్ధాలు ఆడుతున్నావంటూ మణిపై విరుచుకుపడింది. ఓరకంగా చెప్పాలంటే మెంటల్ టార్చర్ చూపించింది. నిజానికి ఈ టీమ్‌లోకి వెళ్లడం అతడికి ఇష్టమే లేదు.అయితే తాజాగా బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. టీమ్ నుంచి స్వాప్ అయ్యే ఆప్షన్ కల్పించాడట. ఆ గోల్డెన్ బ్యాండ్ అందుకున్న మణి కాంతార టీమ్‌లోకి వెళ్లగా.. తన స్థానంలో ఆదిత్యను శక్తి టీమ్‌లో పంపించాడు. బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆడాళ్ల ప్రతాపం.. మాట్లాడాలంటే భయమేస్తోందని ఏడ్చిన మణి
పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని బాంబు పేల్చిన బిగ్‌బాస్.. వాటిని వీలైనంతవరకు తగ్గించవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అలా ఐదు ఛాలెంజ్‌లు ఇచ్చాడు. కానీ అందులో మూడు మాత్రమే గెలవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్యను తొమ్మిది వరకే నరుక్కుంటూ రాగలిగారు. ఈ ఛాలెంజ్‌ల మధ్యలో బోలెడు గొడవలు. అవేంటో నేటి (సెప్టెంబర్ 26) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అదుర్స్ అనిపించిన నబీల్, పృథ్వీవైల్డ్కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు బిగ్‌బాస్ మూడో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో నబీల్, పృథ్వి పోటీపడ్డారు. పావుగంటసేపు బెలూన్ పగలకుండా చూసుకోమంటే వీళ్లు ఏకంగా మూడుగంటలకుపైగా అలానే ధ్వజస్థంభాల్లా నిలబడి ఔరా అనిపించారు. ఈ గేమ్‌లో పృథ్వి (శక్తి) టీమ్ విజయం సాధించడంతో 11 మందిలో ఒక వైల్డ్‌కార్డ్ ఎంట్రీని అరికట్టారు. అంతేకాదు, అవతలి టీమ్‌లో నుంచి ఒకరిని గేమ్‌లో నుంచి తీసేసే పవర్‌ను శక్తి టీమ్‌కు ఇచ్చాడు. చిల్లర గేమ్..దొరికిందే ఛాన్స్ అనుకున్న శక్తి క్లాన్.. కాంతార టీమ్‌లో నుంచి నబీల్ను అవుట్ చేసింది. బాగా ఆడే వ్యక్తిని ఎలా గేమ్‌లో నుంచి తీసేస్తారని కాంతార టీమ్ ఉడికిపోయింది. చిల్లర గేమ్ ఆడుతున్నారని ప్రేరణ మండిపడింది. సీత అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కలిసి ఆపుదామనుకున్నాక మళ్లీ నీ టీమ్ కోసం స్వార్థంగా ఆలోచించావని నిఖిల్‌ను తప్పుపట్టింది. విష్ణుప్రియ అయితే.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువైంది.. అలా అని ఆడవాళ్లను తక్కువ చేయట్లేదు అంటూనే నిఖిల్ మీద సెటైర్లు వేసింది. బలవంతమైన త్యాగం!అసలు శక్తి టీమ్‌లో మణిని ఎలా సైడ్ చేశారన్న డౌట్ ప్రేరణకు వచ్చింది. అదే ప్రశ్నను ముక్కుసూటిగా అడగ్గా మణికంఠయే స్వయంగా త్యాగం చేశాడని సోనియా అంది. అందుకు మణి.. అది నిజం కాదంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో శక్తి టీమ్ బిక్కముఖం వేసింది. మన టీమ్‌లోని ముగ్గురు నేను సైడ్ అవ్వాలని కోరుకున్నారు. అందుకే నేను కూడా పక్కకు తప్పుకున్నానే తప్ప నా అంతట నేనుగా త్యాగం చేయాలనుకోలేదని మణి క్లారిటీ ఇచ్చాడు. కన్నీళ్లు పెట్టుకున్న మణికంఠఅయినా వెనక్కు తగ్గని సోనియా, యష్మి .. అప్పటిదాకా త్యాగం అని చెప్పి ఇప్పుడేమో మాట మార్చేశాడంటూ నోరేసుకుని పడిపోయారు. నీ వయసెంత? చిన్నపిల్లాడిలా ప్రవర్తించకు. ఎవర్నీ బ్యాడ్ చేయొద్దంటూ యష్మి వార్నింగే ఇచ్చింది. దీంతో ఎమోషనలైన మణి.. తప్పంతా నాదే! ఇకమీదట నోరు మూసుకుని కూర్చుంటాను అంటూ ఎమోషనలయ్యాడు. వీళ్ల అరుపులతో పసిపిల్లాడిలా భయపడిపోయిన మణికంఠ.. మాట్లాడాలంటేనే భయమేస్తోందంటూ ఏడ్చేశాడు. ధైర్యం నూరిపోసిన నబీల్అతడి బాధను అర్థం చేసుకున్న నబీల్.. ఎవరికీ భయపడాల్సిన పని లేదు, నీకు మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడాలంతే. అని తనకు ధైర్యం చెప్పాడు. ఇక బిగ్‌బాస్ రంగురంగుల పజిళ్లు అనే నాలుగో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో ఏ టీమ్ గెలవకలేకపోయింది. నచ్చిన స్టెప్పులేసుకోండి అంటూ ఐదో ఛాలెంజ్ ఇవ్వగా ఈ గేమ్‌లో శక్తి టీమ్ గెలుపొందింది. దీంతో 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కాస్తా తొమ్మిదికి చేరాయి. 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా..అప్పుడే బిగ్‌బాస్ ఓ బాంబు పేల్చాడు. ఇంతటితో ఛాలెంజ్‌లు పూర్తయ్యాయని, ఇప్పటివరకు మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మాత్రమే ఆపగలిగారని చెప్పాడు. అంటే ఇంకా తొమ్మిదిమంది హౌస్‌లోకి వచ్చేస్తున్నారని హౌస్మేట్స్ గుండెల్లో గుబులు పుట్టించాడు. వీరిలో ఆరేడుగురు మాజీ కంటెస్టెంట్లు కాగా మరో ఇద్దరు ఈ సీజన్లో ఎలిమినేట్ అయినవారితో రీఎంట్రీ ప్లాన్ చేయిస్తున్నట్లు టాక్!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణికి పట్టపగలే చుక్కలు.. నోరు మూసుకుంటా ప్లీజ్ అంటూ ఎమోషనల్
ఇప్పటిదాకా కంటెస్టెంట్లు తాము ఎలిమినేట్ కాకుండా మరిన్ని వారాలు హౌస్‌లో ఉండేందుకు ఆటాడారు. ఇప్పుడేమో బయట నుంచి వచ్చే వైల్డ్‌కార్డ్ ఎంట్రీలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ పెట్టిన రెండు ఛాలెంజ్‌లలో కాంతార ఒకటి గెలిచి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కాస్తా 11కి తీసుకొచ్చింది. ఈ సంఖ్యను ఇంకా తగ్గించుకునే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్.లవ్ సాంగ్..పట్టుకుని ఉండు, పగిలిపోతుంది అని మూడో టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో పృథ్వీ, నబీల్ హోరాహోరీగా పోరాడారు. చివరికి పృథ్వీ శక్తి టీమ్‌ను గెలిపించాడు. ఈ టాస్క్ మధ్యలో బిగ్‌బాస్.. పృథ్వీని ఓ పాట పాడమన్నాడు. అతడు లవ్ సాంగ్ పాడగా ఇది ఎవరికోసమో? అని నబీల్ అడిగాడు. అందుకు పృథ్వీ క్షణం ఆలోచించకుండా విష్ణుప్రియ పేరు చెప్పాడు. ఇంకేముంది.. ఆ మాటకు విష్ణు సిగ్గుపడుతూనే తెగ మురిసిపోయింది.త్యాగం చేయలేదన్న మణిమరో ప్రోమోలో గెలిచిన శక్తి టీమ్.. కాంతార టీమ్‌లో ఒకరిని తొలగించాలన్నాడు. అందుకు వాళ్లంతా స్ట్రాంగ్ ప్లేయర్ నబీల్ను సైడ్ చేశాడు. ఈ నిర్ణయం కాంతార టీమ్‌కు ఏమాత్రం నచ్చలేదు. ఈ క్రమంలో పెద్ద రభసే జరిగింది. అసలు మీ టీమ్‌లో నుంచి మణిని ఎందుకు తీసేశారని ప్రేరణ అడగ్గా అతడే త్యాగం చేశాడని సోనియా అంది. అవునా? అని ప్రేరణ ప్రశ్నించగా లేదని మణి బోర్డు తిప్పేశాడు. నోరు మూసుకుని కూర్చుంటాదీంతో సోనియా, యష్మి.. అతడికి చుక్కలు చూపించారు. నీ అంతట నువ్వే తప్పుకుంటానన్నావ్, ఇప్పుడేమో మాట మారుస్తూ అందరినీ బ్యాడ్ చేస్తున్నావని ఫైర్ అయ్యారు. దీంతో మణి.. ఏదీ మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చుంటా అని ఎమోషనల్ అవుతూ మైక్ నేలకేసి కొట్టాడు. నలుగురు కలిసి మణిపై ఎగబడటం చూసిన ప్రేరణ.. వారిని చెత్త ఫెల్లోస్ అని తిట్టింది. మరోవైపు సీత. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను ఆపాలంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ గేమ్‌లో ఉండాలంది. నిజమే, కానీ ఆ మాటను ఎవరైనా పట్టించుకుంటారో? లేదో!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎవడిని కొడతానో నాకే తెలీదు.. పూనకంతో ఊగిపోయిన సోనియా
చీఫ్ పోస్ట్ పోయాక యష్మిలో చాలామార్పు వచ్చింది. ఆటలోనే కాదు మాటలోనూ రాటు తేలింది. అటు ప్రేరణ.. విష్ణుప్రియతో గొడవకు చెక్ పెడదామనుకుంటే అందుకు విష్ణు దాన్ని సాగదీసే పనిలో పడింది. మణికంఠకు హౌస్‌లో బొమ్మరిల్లు సినిమా కనిపిస్తోందట.. నామినేషన్స్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఆదిత్యపై సోనియా సెటైర్లుఇంట్లో ఉండటానికి అనర్హులనుకున్న వారి ముఖాలకు ఫోమ్ కొట్టి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా ఆదిత్య ఓం.. పృథ్వీని నామినేట్ చేశాడు. మైక్ పక్కనపెట్టి గుసగుసలు పెడుతున్నావ్, నీ ఫ్రెండ్ అయిన పృథ్వీ ఆవేశంతో ఉంటే తనను కూల్ చేసేందుకు ప్రయత్నించలేదని సోనియాను నామినేట్ చేశాడు. అందుకామె ఏదో ట్రై చేశావ్ కానీ ఫెయిలయ్యావ్ అని వెటకారంగా మాట్లాడింది.గొంతు పెంచితే తప్పా?నైనిక.. నేను సేఫ్ అయినప్పుడు నీ ముఖంలో సంతోషం కనిపించలేదంటూ నాగమణికంఠను నామినేట్ చేసింది. టాస్క్ సరిగా ఆడటం లేదంటూ ఆదిత్య ముఖంపై ఫోమ్ స్ప్రే చేసింది. నబీల్ వంతురాగా.. నువ్వు గట్టిగా మాట్లాడితే తప్పు లేదు కానీ నేను గట్టిగా రిప్లై ఇస్తే మాత్రం తప్పా? పైగా నీతో మాట్లాడితే నిఖిల్, పృథ్వీ నామీదకు దూసుకురావడమేంటోనని సోనియాను నామినేట్ చేశాడు. అతడు తన పాయింట్లు చెప్తున్నప్పుడు కూడా పృథ్వీ, నిఖిల్ సోనియా బాడీగార్డుల్లా నబీల్‌పై ఎగబడటం గమనార్హం. వెన్నుపోటు..తర్వాత అతడు పృథ్వీని నామినేట్ చేశాడు. అప్పుడు సోనియా మధ్యలో దూరి ఫెయిల్డ్ సంచాలక్ అంటూ పదేపదే అతడిపై ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. ప్రేరణ.. నువ్వు అందరితో బాగానే ఉండి ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తావో తెలియడం లేదంటూ మణికంఠను నామినేట్ చేసింది. నీ గేమ్ కనిపించడం లేదంటూ నైనికను నామినేట్ చేసింది. మనిషిగా కూడా ఫెయిల్ సోనియా వంతురాగా.. సంచాలకుడిగానే కాదు ఒక మనిషిగా కూడా నువ్వు ఫెయిల్ అని నబీల్ను నామినేట్ చేసింది. అవునా, నిన్ను నామినేట్ చేసినందుకు నేను తప్పు, ఫేక్ కదా అని కౌంటరిచ్చాడు. తర్వాత ఆమె ఆదిత్య గురించి మాట్లాడుతూ.. మీ పర్ఫామెన్స్ ఏం లేదు కాబట్టి పెద్దగా పాయింట్లులేవు. ఈ వారం వెళ్తానని మీరు ఫిక్సయ్యారు కాబట్టి ప్లీజ్, వెళ్లిపోండి అని నామినేట్ చేసింది.బొమ్మరిల్లు సిద్దు సీన్ రిపీట్నాగమణికంఠ వంతురాగా.. నీ వల్ల దెబ్బలు తగులుతాయేమోనని భయంగా ఉందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. మీరు బొమ్మరిల్లు సినిమాలో ప్రకాశ్ రాజ్‌లా ఎక్కువ గైడ్ చేసేస్తున్నారు, అది వద్దంటూ ఆదిత్యకు హీరో సిద్దార్థ్లా క్లాసు పీకాడు. విష్ణుప్రియ.. నిన్నొకరు(పృథ్వీ) బూతు తిడితే సైలెంట్‌గా ఉండటం నచ్చలేదని ప్రేరణను నామినేట్ చేసింది. అతడు తిట్టింది నన్నుకాదని నాకు తెలుసు.. నువ్వు కావాలని ఇలా ప్రతీకారం తీర్చుకుటున్నావని అసలు విషయం బయటపెట్టింది. నేను వీక్ కాదు: మణిపృథ్వీ.. నబీల్, నాగమణికంఠను; సీత.. ప్రేరణ, మణికంఠను నామినేట్ చేశారు. యష్మి వంతు రాగా హౌస్‌లో నువ్వు చాలా వీక్ అంటూ మణిని నామినేట్ చేసింది. నేను వీక్ అయితే ఎప్పుడో గేట్లు తీయండని చెప్పి బయటకు వెళ్లిపోయేవాడిని అని వాదించాడు. సోనియాను నామినేట్ చేస్తూ.. నిఖిల్, పృథ్విని ఆయుధంలా వాడుకుంటున్నావ్, ఆ ఇద్దరి సపోర్ట్ లేకుండా గేమ్ ఆడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఎవర్ని కొడతానో తెలీదుఅందుకు సోనియా.. నేను అందరికంటే అగ్రెసివ్.. నేను గ్రౌండ్లో దిగాక ఎవడిని కొడతానో నాకే తెలియదు. నా వల్ల ఎవరికీ ఇబ్బంది కావొద్దని ఆలోచించి నేను గుడ్ల దగ్గరే కూర్చున్నాను. నా గేమ్ నేను ఆడాను అని బదులిచ్చింది. ఫైనల్‌గా ఈ వారం పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్, నైనిక నామినేట్ అయ్యారు. అయితే నిఖిల్ చీఫ్ అయినందున అతడికి ఒకర్ని సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో అతడు నైనికను సేవ్ చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: మణికంఠకి క్లాస్ పీకిన నైనిక.. నామినేషన్స్ రచ్చ
బిగ్‌బాస్ 8లో మూడు వారాలు గడిచిపోయాయి. తాజాగా అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో ఎప్పటిలానే సోమవారం వచ్చేసింది. నామినేషన్స్ రచ్చ రచ్చ అయింది. ఈసారి పృథ్వీ, సోనియా, మణికంఠ ఎక్కువగా టార్గెట్ అయినట్లు కనిపించారు. హౌస్మేట్స్ ఒకరిపై ఒకరు గట్టిగట్టిగా అరుస్తూ రెచ్చిపోయాడు. ఇంతకీ ప్రోమోలో ఏముంది?పృథ్వీ టార్గెట్ప్రోమోలో చూపించిన దాని ప్రకారం ఆదిత్య ఓం, నబీల్.. పృథ్వీని నామినేట్ చేశారు. అవమానించేలా గట్టిగా మాట్లాడుతావ్ గానీ సారీ మాత్రం మెల్లగా చెబుతావ్ అని ఆదిత్య తన పాయింట్ చెప్పాడు. దీనికి బదులిచ్చిన పృథ్వీ.. మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేనెందుకు తీసుకోవాలని రిటర్న్ కౌంటర్ ఇచ్చాడు. ఇక నబీల్ కూడా పృథ్వీనే నామినేట్ చేశాడు. గట్టి గట్టిగా అరుస్తున్నావని, నరాలన్నీ కనిపిస్తున్నాయని, ఆ అరుపుల వల్ల నా మాట నీకు వినిపించడం లేదని కారణం చెప్పాడు.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఎలిమినేషన్‌పై అభయ్ వీడియో.. అందుకే ఇలా)పృథ్వీ కూడా ఫైర్ఇక నబీల్ చెప్పిన కారణానికి బదులిచ్చిన పృథ్వీ.. నా ప్రకారం నువ్వు ఫెయిల్, బయాస్డ్(కొందరికే సపోర్డ్) అని కౌంటర్ ఇచ్చాడు. ఎలా కావాలంటే అలా మాట్లాడతా, మెడ దగ్గర నరాల్ని చూపిస్తూ.. ఇవి బయటకు పడినా పర్లేదు నేను ఇలానే మాట్లాడుతా అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఈ మధ్యలోనే సోనియా-నబీల్ మధ్య వాగ్వాదం జరిగింది. అలానే తొలి మూడు రోజులు కనిపించిన సోనియా ఇప్పుడు కనిపించట్లేదని ఆదిత్య ఆమెని నామినేట్ చేశాడు.మణికంఠకి క్లాస్గత వారాల్లో ప్రతిదానికి ఓవర్ చేసిన మణికంఠ.. ఈసారి నామినేషన్స్‌లో మాత్రం కాస్త సైలెంట్‌గా ఉన్నట్లున్నాడు. నైనిక అతడిని నామినేట్ చేస్తూ.. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే వేరేవాళ్ల కాన్ఫిడెన్స్ తగ్గించొద్దని అతడికి క్లాస్ పీకింది. అలా ప్రోమో మొత్తం మాటలతో కొట్టేసుకుంటారా అనే రేంజులో సాగింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్) -
కుమ్మేసిన లేడీస్.. ప్రైజ్‌మనీ డబుల్! అభయ్, మణికి వార్నింగ్
ఈ వారం ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవకుండా చూసినవాళ్లకు నాగార్జున ఎవరికి క్లాస్ పీకనున్నాడనేది ముందే తెలుసు. అయితే అందరూ ఊహించినదానికన్నా రెట్టింపు స్థాయిలో నాగ్ ఫైర్ అయ్యాడు. అభయ్ నవీన్‌ను మెడ పట్టి బయటకు గెంటినంత పని చేశాడు. కానీ బూతులు మాట్లాడిన పృథ్వీని సుతిమెత్తగా మందలించడం గమనార్హం. మరి ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అభయ్కు రెడ్ కార్డ్నాగార్జున వచ్చీరాగానే అభయ్‌ను వాయించడం మొదలుట్టాడు. మొదట బెలూన్ గేమ్ గురించి, తర్వాత బిగ్‌బాస్‌ను చులకన చేస్తూ తిట్టిన వీడియో ప్లే చేశాడు. సైకోలా ఉన్నావ్.. మనిషి పుట్టుక పుట్టావా? అన్నీ నీమాటలే అంటూ నాగ్.. అభయ్‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు. బిగ్‌బాస్‌కు గౌరవం ఇవ్వకపోతే నేను సహించను. ఇది మళ్లీ రిపీట్ అవకూడదు అంటూ అభయ్కు రెడ్ కార్డ్ చూపించాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోమన్నాడు. దీంతో అభయ్ మోకాళ్లపై కూర్చుని తనను క్షమించమని వేడుకున్నాడు.అభయ్ తరపున నాగార్జున క్షమాపణ..ఒక్క ఛాన్స్ ఇవ్వండి సర్.. నేను ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు అనేది నేర్చుకోవడానికి లైఫ్‌లో దొరికిన అదృష్టం సర్ ఇది అని దండం పెట్టి బతిమాలాడు. బిగ్‌బాస్ హౌస్‌లో నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలేనన్న నాగ్ ఇక్కడ బిగ్‌బాస్ కంటే ఎవరూ తోపు కాదని నొక్కి చెప్పాడు. అభయ్ తరపున నాగార్జున బిగ్‌బాస్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇంట్లో వాళ్లందరూ అభయ్కు ఒక్క ఛాన్స్ ఇద్దామనడంతో నాగ్ శాంతించాడు.రూ.6 లక్షలు గెలుచుకున్న లేడీస్తర్వాత ఎగ్ టాస్క్ గురించి ప్రస్తావించాడు. లేడీస్‌లో ఎవరు బాగా ఆడారన్న ప్రశ్నకు నిఖిల్.. సీత పేరు చెప్పాడు. దీంతో నాగ్.. కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకు ఇచ్చావని కౌంటరిచ్చాడు. ఎగ్స్ టాస్క్ లేడీస్ అందరూ కుమ్మేశారని నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంతేకాదు వారి పర్ఫామెన్స్ మెచ్చి ఏకంగా రూ.6 లక్షల్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.11,60,000కు చేరుకుంది. క్లాస్ పీకిన నాగ్తర్వాత ప్రేరణ, విష్ణు మధ్య గొడవను నాగ్ లేవనెత్తాడు. ముందుగా ప్రేరణ మాట్లాడుతూ..నేను పర్సనల్‌గా కనెక్ట్ అయింది విష్ణుతో! కానీ, తనను నామినేట్ చేసినప్పటి నుంచి ఆమెలో చాలా మార్పులు కనిపించాయి. నాపై ద్వేషం పెంచుకుంది. ఆ ద్వేషంతోనే గేమ్‌లో నాపై రక్కింది అని చెప్పింది. అప్పుడు.. సీతను తన్నిన, విష్ణుప్రియను క్యారెక్టర్‌లెస్ అన్న వీడియో ప్లే చేసి మరీ ప్రేరణకు నాగ్ క్లాస్ పీకాడు.పతివ్రత..పంపులదగ్గర కొట్టుకున్నట్లు ఆ మాటలేంటి? అని గద్దించగా ప్రేరణ.. తప్పు పదం వాడేశానని, అందుకు సారీ చెప్పానంటూనే మరోసారి క్షమాపణలు చెప్పింది. అటు విష్ణుప్రియ కూడా పతివ్రత పదం వాడిందని, మరోసారి అలాంటి పదాలు రిపీట్ కావద్దని నాగ్ హెచ్చరించాడు. గుడ్డు దగ్గరే గొడవ మొదలు కావడంతో వీళ్లిద్దరికీ కలిపి ఐదు గుడ్లు పంపించి శత్రువులను మిత్రువులు చేశారు.ఎందుకంత సీన్ చేశారు?తర్వాత దోస వివాదానికి చెక్ పెడుతూ ఓ వీడియో ప్లే చేశారు. అందులో ప్రేరణ.. విష్ణుకు మామూలుగానే దోస వేసి ఇచ్చింది. అడుక్కునేవారికి వేసినట్లు వేయలేదుగా.. దానికి మణి, విష్ణు ఎందుకంత సీన్ చేశారని నాగ్ అడిగాడు. మధ్యలో నువ్వు ఉండటం వల్లే ఆ గొడవ పెద్దదైందని, నీ గేమ్ నువ్వు ఆడు అని మణికి సలహా ఇచ్చాడు.ఆడపిల్ల ఇబ్బందిపడితే..తర్వాత అతడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి తన హగ్గుల వల్ల యష్మి ఇబ్బందిపడుతున్న విషయాన్ని వీడియో ద్వారా చూపించారు. నీ వల్ల ఆడపిల్ల ఇబ్బందిపడితే బయటకు పంపించేస్తానని నాగ్ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఈ షోకి ఎందుకు వచ్చావన్నది గుర్తుపెట్టుకుని ఆడమని చెప్పాడు. ఒక్క యష్మి విషయంలోనే కాదని, ఇది చాలాసార్లు రిపీట్ అవుతోందని తెలిపాడు.తప్పు తెలుసుకున్న మణిమొత్తానికి తప్పు తెలుసుకున్న మణి.. ఇంకోసారి అలా జరగదని మాటిచ్చాడు. కొత్తగా చాలామంది ఫ్రెండ్స్ అయ్యేసరికి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయానన్నాడు. పృథ్వీకి తన కోపమే బలహీనతగా మారిపోతుందని, బూతులు తగ్గించుకోవాలన్నాడు. వరుసగా చీఫ్ అవుతున్న నిఖిల్‌ను అభినందించాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ గెలవాలంటే ఈ ఐదు తప్పనిసరి!
తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని ఏలవచ్చని అందరూ చెప్తుంటారు. కానీ జీవితంలో గెలవాలంటే తెలివితేటలు (Intelligence Quotient) మాత్రమే ఉంటే సరిపోదని భావోద్వేగ ప్రజ్ఞ/ ఈక్యూ (Emotional Intelligence) అవసరమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఐక్యూ వ్యక్తి మేధస్సును, విశ్లేషణా సామర్థ్యాలను, సమస్యలను పరిష్కరించే ప్రతిభను కొలుస్తుంది. ఈక్యూ భావోద్వేగాలను గుర్తించడం, నియంత్రించడం, ఇతరులతో సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఐక్యూ ఉంటే విద్య, వృత్తి రంగాల్లో గొప్ప విజయాలు సాధించవచ్చేమో కాని సంతోషంగా జీవిస్తారన్న గ్యారంటీ లేదని టర్మన్ (1921) అధ్యయనంలో తెలిసింది. ఈక్యూ ఉంటే నాయకులుగా ఎదుగుతారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2001లో నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈక్యూ ఉన్న వ్యక్తులు వృత్తిలో నాలుగురెట్లు ఎక్కువ విజయం సాధిస్తారని గోల్మన్ పరిశోధన పేర్కొంది. ఉద్యోగుల విజయంలో ఈక్యూ 30శాతం ప్రభావం చూపగా, ఐక్యూ 20శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని మరొక పరిశోధనలో వెల్లడైంది. అంటే, ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా, బిగ్ బాస్లోనైనా నిలవాలంటే, గెలవాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినవారు సుఖంగా, సంతోషంగా జీవిస్తారు.ఈక్యూలో ఐదు ప్రధాన అంశాలు ఉంటాయని డేనియల్ గోల్మన్ తన ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ పుస్తకంలో ప్రతిపాదించాడు. 1. స్వీయ అవగాహన: వ్యక్తి తన భావోద్వేగాలను తెలుసుకోవడం.2. స్వీయ నియంత్రణ: కఠిన పరిస్థితుల్లో భావాలను నియంత్రించడం.3. ప్రేరణ: బాహ్య ప్రేరణ కంటే అంతర్గత విలువల ద్వారా ప్రేరేపించడం.4. సహానుభూతి: ఇతరుల భావాలను అర్థం చేసుకొని స్పందించడం.5. సామాజిక నైపుణ్యాలు: సంబంధాలను నిర్వహించడం, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం.ఈక్యూ ఉన్నవారే బిగ్ బాస్..సరే, ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చేద్దాం. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి వాతావరణంలో పార్టిసిపెంట్స్ ప్రవర్తన, నిర్ణయాలు, మాటలు వారి భావోద్వేగ ప్రజ్నను ప్రతిబింబిస్తాయి. మూడో వారం జరిగిన సంఘటనల్లో గ్రూప్ డైనామిక్స్, నిర్ణయం తీసుకోవడం, గొడవల పరిష్కారంలో ఈక్యూ ఎలాంటి పాత్ర పోషించిందనే విషయం తెలుసుకుందాం.స్వీయ అవగాహన (Self-Awareness)మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోవడమే స్వీయ అవగాహన. ఈ అవగాహన లేకనే విష్ణుప్రియ అనుమతి లేకుండా గుడ్లు తినేసింది. ఆ విషయంలో ప్రేరణతో గొడవకు దారితీసింది. యష్మి, మణికంఠల మధ్య గొడవలకు కూడా ఇదే కారణం. ఒక వ్యక్తి తన ఎమోషన్స్ ను అర్థం చేసుకుని, ఎలా స్పందించాలో తెలుసుకుంటే బిగ్ బాస్ షోలోనైనా, జీవితంలోనైనా గొడవలు తగ్గుతాయి.స్వీయ నియంత్రణ (Self-Regulation)పృథ్వి ప్రతి ఆటలోనూ ఆవేశంగా కనిపించాడు. అతని భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో అతని ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కోసారి అదుపుతప్పి బూతులు కూడా మాట్లాడుతున్నాడు. విష్ణుప్రియ ‘పతివ్రత’ అనే పదాన్ని మళ్లీ వాడేసింది. మరోవైపు మణికంఠ తరచూ ఎమోషన్స్ వాడి ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనివల్ల మొదట్లో కొంత సానుభూతి ఏర్పడినా, తరచూ ప్రదర్శించడం చిరాకుకు దారితీస్తుంది. ఇక అభయ్ నేరుగా ‘బిగ్‌బాస్ వరస్ట్’ అంటూ కామెంట్స్ చేయడం అతనికి ఎమోషనల్ రెగ్యులేషన్ లేదనే విషయాన్ని సూచిస్తుంది. అందుకే ఎమోషన్స్ ను నియంత్రించుకోవడం, సరైన స్థాయిలో, సరైన రీతిలో ప్రదర్శించడం అవసరం.సహానుభూతి (Empathy)నిఖిల్ తన ప్రతి నిర్ణయం కోసం సోనియాను సలహా అడగడం సహానుభూతిని సూచిస్తుంది. కానీ, దాన్ని బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల సోనియాపట్ల పక్షపాతం చూపిస్తున్నాడనే అభిప్రాయం ఏర్పడుతోంది. మరోవైపు సోనియా గొడవలకు దూరంగా ఉండి సేఫ్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఆమె ఎమోషనల్ బ్యాలెన్స్‌తో ఉన్నట్లు కనిపించినా, ప్రేక్షకులు ఆమెను బలహీనంగా భావించే ప్రమాదం ఉంది. ఇతరులపట్ల సహానుభూతి ఉండాలి, కానీ అది బలహీనతగా మారకూడదు.సామాజిక నైపుణ్యాలు (Social Skills)ప్రేరణ, విష్ణుప్రియల మధ్య వాగ్వాదంలో 'బ్రెయిన్లెస్', 'యూజ్లెస్' వంటి పదాలను ఉపయోగించడం సంఘర్షణలను మరింత పెంచుతుంది. మరోవైపు క్లాన్ లీడర్ కంటెస్టెంట్‌గా తనను పరిగణించనందుకు సీత బాధపడింది. కానీ ఆ విషయం నేరుగా నిఖిల్ కు చెప్పకుండా మరొకరితో చెప్పుకుని బాధపడింది. వ్యక్తి తన ఎమోషన్స్‌ను వ్యక్తీకరించాలి. కానీ వ్యక్తిగత దూషణలు లేకుండా. ఇదో ముఖ్యమైన సోషల్ స్కిల్. ఇది గొడవలు రాకుండా నిరోధిస్తుంది.ప్రేరణ (Motivation)అనేక నామినేషన్లు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ యష్మి తన నాయకత్వ శైలి సరైనదేనని కట్టుబడి ఉంది. ఇది తనలో మోటివేషన్ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. కానీ తన మోటివేషన్ తో పాటు క్లాన్ ఎమోషనల్ ఫీలింగ్స్ ను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే అనేక నామినేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. పృథ్వి హై కాంపిటీటివ్ నైజం అతని తపనను చూపిస్తుంది. కానీ నియంత్రణ లేకపోవడం గ్రూప్ లో విభేదాలకు, గొడవలకు కారణమవుతుంది.ఎవరు ఎలిమినేట్ కావచ్చు? ప్రేక్షకులు సాధారణంగా భావోద్వేగ పరిపక్వత కలిగిన ఆటగాళ్లను కోరుకుంటారు. ఎక్కువ ఆవేశంగా ప్రవర్తించే పృథ్వి వంటి ఆటగాళ్లను నెగెటివ్‌గా పరిగణించే అవకాశం ఉంది. అదే విధంగా, మణికంఠ లాంటి ఆటగాళ్లు ఎమోషనల్ డ్రామాను ఉపయోగించడం వల్ల నమ్మకం కోల్పోతారు. ఇతరుల కేరక్టర్ పై తరచూ తప్పుడు కామెంట్స్ చేయడం విష్ణుప్రియకు నెగెటివ్ గా మారవచ్చు.నా పరిశీలన మేరకు నిఖిల్ లో మంచి ఐక్యూ కనిపిస్తోంది. షో చివరి వరకూ ఇలాగే ఉంటుందో లేదో పరిశీలించాలి. కోపం అందరికీ వస్తుంది. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో ప్రదర్శించాలన్నది తెలుసుకున్నవారే సంతోషంగా జీవిస్తారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. జీవితంలోనైనా, బిగ్ బాస్ షోలోనైనా ఈక్యూ ఉన్నవారే విజేతగా నిలుస్తారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comబిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కొట్టుకు చస్తుంటే సినిమా చూస్తాడేంట్రా బాబూ.. చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్!
లీడర్ అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ముందుండి నడిపించాలి. అంతేకానీ ఏదైతే నాకేంటి? ఎవరెటు పోతే నాకేంటి? అనుకోకూడదు. కానీ అభయ్ అచ్చంగా అదే చేశాడు. తన టీమ్ కష్టపడి సంపాదించిన గుడ్లను కాపాడటం కూడా చేతకాలేదు. పైగా తమ గుడ్లు పోతున్నాయని టీమ్ మెంబర్స్ లబోదిబోమంటే అరవకుండా ఊరుకోమని చెప్తున్నాడు. ఇంకా హౌస్‌లో ఏమేం వింతలు, విశేషాలు జరిగాయో నేటి (సెప్టెంబర్ 19) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..కాంతార టీమ్‌పై విరుచుకుపడ్డ శక్తి టీమ్బిగ్బాస్ హౌస్‌లో నిన్నటి గుడ్ల టాస్క్ నేడు కూడా కొనసాగింది. కోడికూత వినబడగానే కంటెస్టెంట్లు ముందూవెనకా చూసుకోకుండా పరిగెత్తి మరీ గుడ్లను సంపాదిస్తున్నారు. వాటిని జేబుల్లో, టీషర్ట్స్‌లో.. ఎక్కడపడితే అక్కడ దాచేసుకున్నారు. తర్వాత తీరికగా బుట్టల్లో భద్రపరుస్తున్నారు. ఇంతలో కాంతార టీమ్ దగ్గరి నుంచి శక్తి టీమ్ గుడ్లు దొంగిలించింది. ఈ విషయాన్ని టీమ్ సభ్యులు తమ చీఫ్ అభయ్కు చెప్పినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. నబీల్‌పై నింద వేశా: విష్ణుప్రియకానీ యష్మి, ప్రేరణ మాత్రం దాన్ని అలాగే వదిలేసి ఉండలేకపోయారు. నువ్వానేనా చూసుకుందామన్నరీతిలో పోట్లాడారు. ఈ రౌండ్లో శక్తి 66, కాంతార 30 గుడ్లు సంపాదించింది. తర్వాత పెట్టిన గేమ్‌లో కాంతార టీమ్ గెలిచి 90 గుడ్లు సంపాదించింది. ఇక నబీల్ తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడన్న విష్ణుప్రియ ఈరోజు దానిపై క్లారిటీ ఇచ్చింది. అతడు తనను టచ్ చేయలేదని, ఎక్కడ టచ్ చేస్తాడోనన్న భయంతో అలా అరిచానంది. నబీల్ మంచి బాలుడు అని సర్టిఫికెట్ ఇస్తూ సారీ చెప్పింది. సైకోగాళ్లు.. బిగ్‌బాస్‌నే తిట్టిన అభయ్కిచెన్ విషయంలో బిగ్‌బాస్ మరిన్ని ఆంక్షలు విధించాడు. ఒక సమయంలో ఒక టీమ్‌కు సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్‌లో వంట చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. వారిది పూర్తయ్యాకే మరో టీమ్ కిచెన్‌లో అడుగుపెట్టాలన్నాడు. ఈ నిర్ణయం విన్న అభయ్.. వీళ్లేమైనా మనిషి పుట్టుక పుట్టారా? దిమాక్ లేదు, సైకోగాళ్లు అంటూ బిగ్‌బాస్‌నే ధిక్కరించాడు. కానీ బిగ్‌బాస్ ఆదేశించాక ఇంకా ఆలోచించాల్సిందేం ఉండదు గనుక హౌస్మేట్స్ వెంటనే ఆ రూల్ ఫాలో అయిపోయారు.రాక్షసుడిలా పృథ్వీతర్వాతి రోజు నిఖిల్ ప్రభావతి కోడి దగ్గర ఎర్రగుడ్డు ఉండటం చూశాడు. అదే విషయం తన టీమ్ దగ్గరకు వెళ్లి చెప్పగా వెంటనే వెళ్లి తీసుకోమని సీత తొందరపెట్టింది. ఆమె సూచనతో ఎవరికీ కనబడకుండా ఎగ్ తీసుకొచ్చాడు. అటు సోనియాకు ఏమైందో ఏమో కానీ సడన్‌గా నైనిక మీదకెళ్లి ముద్దులు పెట్టింది. అనంతరం గేమ్ మొదలవగానే పృథ్వీ మళ్లీ రాక్షసుడిగా మారిపోయాడు. ఎటుపడితే అటు తోసేసి, రక్కేసి, లాగేసి, నెట్టేసి చూసేవారినే భయపెట్టించేశాడు.చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్అటు కాంతార చీఫ్ అభయ్ మాత్రం మరోసారి తన టీమ్‌కు సపోర్ట్ చేయడం మానేసి ఏం జరిగినా సరే ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించాడు. తనటీమ్ కష్టపడి సాధించిన గుడ్లకు కాపలాగా ఉన్న అభయ్.. తన కళ్లముందే ఎగ్స్ ఎత్తుకుపోతుంటే కూడా పోతే పోనీ అని చూస్తూ ఊరుకుండిపోయాడు. పోయినవాటిని తిరిగి తీసుకొద్దామని యష్మి, ప్రేరణ ప్రయత్నిస్తే కూడా అందుకు అభయ్ ఒప్పుకోలేదు. తన టీమ్ ఓడిపోవడానికి అభయే ప్రత్యక్ష కారకుడయ్యాడు. అతడి నిర్లక్ష్యం వల్ల అవతలి టీమ్ మరింత రెచ్చిపోయారు.తన్నుకున్న లేడీ కంటెస్టెంట్లుఆడాళ్లు అయితే కిందపడి కొట్టుకున్నారు, తన్నుకున్నారు, జుట్టు పీక్కున్నారు. ప్రేరణపై విష్ణుప్రియ, సీత దాడి చేయడంతో ఆమె ఆవేశంలో విష్ణును క్యారెక్టర్‌లెస్ అనేసింది. అటు సోనియా మీద నబీల్ అరవడంతో పృథ్వీ, నిఖిల్ అతడి మీదకు దూసుకెళ్లిపోయారు. చివరగా ఈ రౌండ్లో శక్తి టీమ్ దగ్గర 263, కాంతార టీమ్ దగ్గర 25 గుడ్లు మాత్రమే మిగిలాయి. లీడ్‌లో ఉన్న శక్తి టీమ్ కాంతార టీమ్‌లో నుంచి ప్రేరణను గేమ్‌లో నుంచి ఎలిమినేట్ చేసింది. అయితే ఈ రోజు గేమ్‌లో యష్మి, ప్రేరణ శివంగిలా ఫైట్ చేశారని తప్పకుండా చెప్పుకుని తీరాల్సిందే!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లాంబిడ్డ కావాలంటావ్, అంతలోనే హగ్గుకోసం వెంటపడ్తావ్!
నాకు బంధాలు, బాధ్యతలు నచ్చవు. నన్ను ఒంటరిగానే వదిలేయండి.. అని బిగ్‌బాస్ 8 ప్రారంభంలోనే మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. పెళ్లాం బిడ్డ దూరమయ్యారని, వారిని తిరిగి తనదగ్గరకు తెచ్చుకోవడం కోసమే ఈ షోకు వచ్చానని మొదటిరోజే ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు.సింపతీ వద్దు!నామినేషన్స్‌లోనూ అదే కథ మళ్లీ వినిపించాడు. సింపతీ గేమ్ ఆడుతున్నాడన్న కామెంట్స్ రావడంతో కాస్త పద్ధతి మార్చుకున్నాడు. ఇంటి నుంచి తన తల్లి శాలువా వచ్చినప్పుడు కూడా సింపతీ కోసమైతే తనకు ఇవ్వొద్దు అని నాగమణికంఠ కరాఖండిగా చెప్పాడు. అప్పుడతడిలో మెచ్యురిటీ చూసి జనాలు ముచ్చటపడిపోయారు.అపరిచితుడిలా మణికంఠటాస్కులు వస్తే చాలు పట్టుదల, ఏకాగ్రత చూపించే అతడి అంకితభావాన్ని మెచ్చి ఓట్లు గుద్ది నామినేషన్స్ నుంచి సేవ్ చేశారు. అంతా ఓకే అనుకునేలోపే మణికంఠ అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి ఏడుస్తూ, మరోసారి అమ్మాయిలతో సరదాలు చేస్తూ, ఇంకోసారి తన ముందు తప్పు చేస్తే సహించకుండా ఉంటూ ఎవరికీ అంతుచిక్కకుండా ప్రవర్తిస్తున్నాడు.హగ్గుల పిచ్చిఈ మధ్యే యష్మి ఇబ్బందిపడుతున్న విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆమెను వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. ఈ విషయంలో తను చాలా చిరాకుపడింది. మరోసారైతే తనకెవరూ ముద్దు ఇవ్వడం లేదు, ముద్ద(తిండి) పెట్టడం లేదని తనకు తానే ఏవేవో మాట్లాడుకున్నాడు. ఈసారైతే ఏకంగా తను అక్క అని పిలిచే సోనియాను ఒక హగ్ కావాలని అడుక్కున్నాడు. నీకో భార్య ఉంది, తెలుసా?ఎటు చూసినా కెమెరాలున్నాయని నిరాశపడుతూనే తనను హత్తుకున్నాడు. ఇతడి ప్రవర్తన అర్థమైపోయిన నైనిక మణికంఠను ముఖం పట్టుకుని అడిగేసింది. 'నువ్వు ఇక్కడ అందరితో ప్రేమలో ఉన్నావు, కానీ అంత వద్దమ్మా! నీకు భార్య ఉన్నప్పుడు తనతో మాత్రమే ప్రేమలో ఉండాలి. ఇలా అందరికీ ముద్దులు పెట్టడమేంటి? పెళ్లయ్యాక అసలు అవతలివారిని ఫ్లర్టింగే చేయకూడదు' అని క్లాస్ పీకింది.ఏదైనా చేసేయొచ్చా?చాలా తప్పుగా మాట్లాడుతున్నావని మణి అనగా.. నేను నిజం మాట్లాడుతున్నా అని నైనిక కుండ బద్ధలు కొట్టింది. దీంతో అతడు.. ఇక్కడే కదా చిల్ అయ్యేది.. ఇంటికెళ్లాక ఎలా కుదరదుగా అని డ్యాన్స్ చేశాడు. ఈ హగ్గులు, ముద్దుల గోల తగ్గించుకుంటేనే మణి ఇంకొన్నాళ్లయినా బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగలుగుతాడు. లేదంటే జనాలే తనను బయటకు నెట్టేయడం ఖాయం! ఇప్పటికే మణి వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. రానురాను రాజు గుర్రం గాడిద అయిందట.. నీ పేరు నువ్వే చెడగొట్టుకుంటున్నావ్ అని కామెంట్లు చేస్తున్నారు. Meeru friends eppudu aiyaru ante adulterated comedy annadhi Mari veedu hug adigithe tittalsindhi poyi task vundhi anatam enti 😬Girls meedha noru vesukoni padipothadhi mari veedini endhuku analedhu nee pempakam.baledhu ani#BiggBossTelugu8pic.twitter.com/6zorDLx77Y— anushkafan (@Anushkafan07) September 18, 2024Nainika deserves a big round of applause 👏🏻👏🏻👏🏻E #NagaManikanta gadu healthy flirting perutho intlo vese pervert veshalu meedha gatti rod vesindi vadikiAbba Sai Ram #BiggBossTelugu8 #Nainika pic.twitter.com/fCOi5O7BKF— Vamc Krishna (@lyf_a_zindagii) September 19, 2024 చదవండి: బెదిరించకు, మంచిగా అడిగితే చెప్తా.. సోనియాకు నబీల్ కౌంటర్ -
నబీల్ అభ్యంతరకరంగా టచ్ చేశాడన్న విష్ణుప్రియ
బిగ్‌బాస్ ఐదో సీజన్లో వచ్చిన ప్రభావతి అలియాస్ కోడిగుడ్డు టాస్క్ మళ్లీ రిపీట్ అయింది. గుడ్డు పోయిందని కంటెస్టెంట్లు అరిచిగోల చేయలేదు, ఏకంగా కిందపడేసి రక్కి మరీ అవతలివారి దగ్గరనుంచి సాధించారు. ఈ గుడ్డు కంటే ముందు దోస గురించి ప్రేరణ, విష్ణుప్రియ పంచాయితీ పెట్టుకున్నారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..'శక్తి'కి లగ్జరీ రేషన్ఆడింది అయిదునిమిషాలైతే అరుచుకోవడం అరగంట.. కాదు, హాఫ్‌డే అన్నట్లుంది బిగ్‌బాస్ హౌస్ పరిస్థితి. రేషన్ కోసం పెట్టిన గేమ్ శక్తి టీమ్ గెలవడంతో వారికి లగ్జరీ రేషన్ అందింది. ఓడిన కాంతార టీమ్ కేవలం ఆకుకూరలు, కూరగాయలతోనే సరిపెట్టుకుంది. మరోవైపు వంటరాని విష్ణుప్రియ ఒక దోసె అడిగితే చేసివ్వడానికి ప్రేరణ ఒప్పుకోలేదు. తనకు దోసె వేసుకోవడం రాదు, కాబట్టి ఒకటి వేసిస్తే తప్పేంటని మణి నచ్చజెప్పడంతో ప్రేరణ అయిష్టంగానే దోసె వేసిచ్చింది.ఏడుపందుకున్న విష్ణుఇలా ముఖం మాడ్చుకుని ఫుడ్ విసిరేయడం నచ్చలేదంటూ విష్ణు శోకమందుకుంది. తిండి విషయంలో ఎందుకీ గొడవలు? అని మణి, నిఖిల్ చెప్పడంతో ప్రేరణకు మరింత చిరాకెత్తిపోయింది. అటు విష్ణుప్రియ తనకొద్దని మారాం చేయడంతో పృథ్వీ వెళ్లి ప్రేమగా తినిపించడంతో కూల్ అయింది. తర్వాత కాసేపటికి ప్రేరణ కూడా వెళ్లి తాను కావాలని అలా చేయలేదని విష్ణుకు క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా మణి వల్లే ఈ గొడవ పెద్దదైందని అతడిని చులకన చేస్తూ మాట్లాడింది.సోనియాకు దూరంగా పృథ్వీ?ఇదిలా ఉంటే 'నువ్వెవడివిరా నాకు చెప్పడానికి..' అని సోనియా అన్న మాటను మర్చిపోలేక పృథ్వీ బాధపడుతూనే ఉన్నాడు. తన వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుందని ఏకంగా సోనియానే దూరంగా పెట్టాలనుకున్నాడు. కానీ నిఖిల్ అది జరగనిస్తాడా? తెల్లారే సోనియా చెవిలో జారేశాడు. అలా ఆమె పృథ్వీని ఎలా కూల్ చేయాలా? అన్న ఆలోచనలో పడింది.సోనియా ప్రేమ కబుర్లుతర్వాత సోనియా.. ప్రేరణతో తన ప్రేమవిషయాలను పంచుకుంది. మేము మూడేళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. నేను ప్రారంభించిన ఒక ఎన్జీవోకు అతడు వెబ్ డిజైనింగ్‌లో సహాయపడ్డాడు, అలాగే అమెరికా నుంచి తనొక స్పాన్సర్ కూడా! అయితే ఇంతవరకు నేను ప్రపోజ్ చేయలేదు. తను నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఇప్పటికీ ఆయన నా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు అని చెప్పింది.14 గంటల టైమ్లైన్అనంతరం బిగ్‌బాస్ కిచెన్ విషయంలో ఓ బాంబు పేల్చాడు. కిచెన్‌లో వంట చేసుకునేందుకు వారమంతా కలిపి కేవలం 14 గంటలు మాత్రమే కేటాయిస్తునట్లు తెలిపాడు. ఆ సమయం గడిచిపోయాక వంటగ్యాస్ ఆన్ చేసేదే లేదన్నాడు. తర్వాత బంగారుకోడిపెట్ట ప్రభావతి 2.0 హౌస్‌లోకి వచ్చింది. ప్రభావతి వదిలే గుడ్లు పట్టుకునేందుకు, పట్టుకున్నవాళ్ల దగ్గర లాక్కునేందుకు రెండు టీమ్స్ బాగానే కష్టపడ్డాయి. తోసుకుని, నెట్టేసుకుని, లాగేసి, కిందామీద పడేసి నానాతంటాలు పడ్డారు.చలనం లేకుండా పడి ఉన్న మణిమొదటి రౌండ్లో శక్తి టీమ్ 21, కాంతార టీమ్ 10 గుడ్లు సంపాదించింది. కామన్సెన్స్, బ్రెయిన్ వాడని ఒకే ఒక్క వరస్ట్ పర్ఫామర్ పృథ్వీ అని అభయ్ మండిపడ్డాడు. నిఖిల్ అయితే నాగమణికంఠను లాగి పడేయడంతో అతడు కొద్ది క్షణాలపాటు లేవలేకపోయాడు. అతడి పరిస్థితి చూసి తలపగిలిందేమోనని కాంతార టీమ్ లీడర్ అభయ్ పరిగెత్తుకు వచ్చాడు. తనకేదైనా అవుతుందేమోనన్న భయంతో గేమ్‌లో నుంచి పక్కన పెట్టాలనుకున్నాడు. దీంతో హర్ట్ అయిన మణి కెమెరాలకు కనిపించకుండా గోడకు అతుక్కుని వెక్కివెక్కి ఏడ్చాడు. బిగ్‌బాస్ షో.. నా జీవితంనీకేమైనా అయితే ఎలా? నిన్ను నమ్ముకుని ఇద్దరున్నారని అభయ్ అనడంతో ఈ షోయే నా జీవితం, నా పెళ్లాంబిడ్డలు కావాలంటే ఈ షో విన్ అవ్వాలి అని ఏడుపు కొనసాగించాడు. సరే, ఆడుదువులేనని అభయ్ సముదాయించాడు. అటు నబీల్ తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడని విష్ణుప్రియ అనగా.. తాను కేవలం గుడ్లు తీసుకునేందుకు మాత్రమే ప్రయత్నించానని, అనవసరంగా నిందలు వేయొద్దని నబీల్ మండిపడ్డాడు. అటు పృథ్వీ ఆవేశంలో బూతులు అనేసి తలపట్టుకున్నాడు.నబీల్ అవుట్ఇంతలో బిగ్‌బాస్ రెండు టీమ్స్ ఎగ్స్ లెక్కపెట్టమన్నాడు. అలా శక్తి టీమ్ దగ్గర 66, కాంతార వద్ద 34 గుడ్లు ఉన్నాయి. దీంతో కాంతార టీమ్‌లో ఒకర్ని సైడ్ చేసే ఛాన్స్ శక్తి టీమ్‌కు ఇచ్చాడు. అలా వాళ్లు నబీల్ను గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడంతో ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు పెళ్లాంబిడ్డలు దక్కాలంటే షో గెలవాలి.. ఏడ్చేసిన మణి
బిగ్‌బాస్ హౌస్‌లో చిన్నదానికి, పెద్దదానికి గొడవలు, ఏడుపులు సహజమే! ఇవి కోడిగుడ్డు టాస్క్‌లోనూ జరిగాయి. ఎగ్స్ దొంగిలించడం, కాపాడుకునే క్రమంలో శక్తి, కాంతార టీమ్స్ మధ్య చాలా ఫైటింగ్సే జరిగాయి. తనమీద ఇద్దరు అబ్బాయిలు పడ్డారని యష్మి చెప్పగా.. పృథ్వీ లఫూట్ గేమ్ స్టార్ట్ చేశాడని, బిగ్‌బాస్ హౌస్‌లోనే అతడొక వరస్ట్ ప్లేయర్ అని అభయ్ అభిప్రాయపడ్డాడు.కన్నీళ్లు ఆపుకోలేకపోయిన మణికంఠఒక రౌండ్లో శక్తి టీమ్ లీడ్‌లో ఉండటంతో కాంతార టీమ్‌లో నుంచి ఒకర్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో వాళ్లు మణికంఠను సైడ్ చేశారు. తనను ఆట నుంచి పక్కకు తప్పించడంతో మణికంఠ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఒక మూలకు వెళ్లి గోడకు తల ఆనించి బోరుమని ఏడ్చాడు. అతడిని ఓదార్చేందుకు అభయ్ ప్రయత్నించగా.. నా పెళ్లాంబిడ్డలు నాక్కావాలంటే షో విన్ అవ్వాలని మణి ఏడుస్తూనే ఉన్నాడు.షో గెలవాలినిన్ను నమ్ముకుని బయట ఇద్దరున్నారని అభయ్ అంటుంటే ఎవరూ లేరు, వాళ్లు నా లైఫ్‌లోకి రావాలంటే షో గెలవాలి అని కంటతడి పెట్టుకున్నాడు. పర్సనల్స్, గేమ్ రెండూ వేరని చెప్పే మణి.. ఇలా ప్రతిసారి తన ఫ్యామిలీ గురించి చెప్పడం చూసి విసుగెత్తిన జనాలు సింపతీ స్టార్ట్ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: కుర్చీ మడతపెట్టి సాంగ్.. నా లుక్ చూసి ట్రోల్ చేస్తారనుకున్నా! -
వాడు హగ్ చేసుకుంటే కంఫర్టబుల్‌గా లేదు.. ఫైర్ అయిన యష్మి
బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ మూడో వారం చేరుకుంది. సోమవారం (సెప్టెంబర్ 16) నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత రెండువారాలుగా చీఫ్ పోస్ట్‌లో ఉన్న యష్మి తొలిసారి నామినేషన్ల ప్రక్రియలో అడుగుపెట్టింది. దీంతో ఆమెను టార్గెట్ చేస్తూ నామినేషన్ చేశారు.మణికంఠ, యష్మిల మధ్య నామినేషన్స్‌లో భాగంగా భారీ ఫైట్ నడిచింది. ఇద్దరూ కూడా గట్టిగట్టిగా అరిచారు. యాటిట్యూడ్ చూపించొద్దంటూ యష్మిపై మణికంఠ ఫైర్ అయ్యాడు. ఫ్రెండ్‌గా డ్రామాలు చేస్తున్నావా అంటూ మణిపై యష్మి విరుచుకుపడింది. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో తాను హౌస్‌లో ఉన్నంత కాలం మణిని నామినేట్ చేస్తూనే ఉంటానని యష్మి చెప్పింది. వారిద్దరి మధ్య జరిగిన గొడవ ఇప్పట్లో చల్లారేలా లేదు. తాజాగా విడుదలైన (డే-16) మంగళవారం ఎపిసోడ్లో యష్మి వద్దకు వెళ్లి సారీ చెప్పే విధంగా మాట్లాడుతాడు. అదంతా నామినేషన్ వరకే అంటూ హగ్ చేసుకుంటాడు. కానీ, యష్మి మాత్రం తన హగ్‌ను రిజక్ట్ చేస్తుంది. వదిలేయ్ అంటూ కాస్త గట్టిగానే చెబుతుంది. ఈ సమయంలో యష్మి బాగా ఎమోషనల్ అవుతుంది. ఆపై కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనంతరం పృథ్వీ వద్దకు వెళ్లి మణికంఠ ఇచ్చిన హగ్ గురించి చెబుతుంది. 'అతని హగ్ కంఫర్టబుల్‌గా లేదు.. అంతా ఫేక్.. నేను ఉన్నంత వరకు వాడిని (మణి) నామినేట్ చేస్తూనే ఉంటాను' అని చెబుతుంది. -
విష్ణుప్రియ స్వార్థాన్ని బయటపెట్టిన ప్రేరణ.. యష్మి మైండ్‌లో విషం!
శేఖర్ బాషా ఎలిమినేషన్‌తో హౌస్‌లో పన్నెండుమంది మిగిలారు. వీరిలో మళ్లీ ఒకర్ని పంపించడానికి అవసరమైన నామినేషన్ నేడు వాడివేడిగా జరిగింది. ఎప్పుడూ ఎదుటివాళ్లమీద నోరు పారేసుకునే సోనియాకు యష్మి చుక్కలు చూపించింది. అటు మణికంఠ మీద కూడా బాగానే ఫైర్ అయింది. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఇంట్లో ఉండి వ్యర్థంఇంట్లో ఉండి వేస్ట్ అనుకునేవాళ్లపై చెత్త గుమ్మరించి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా సీత.. మీ టీమ్ సభ్యుల ప్రవర్తన లేదంటూ యష్మిని, పక్కవాళ్లను తొక్కేసి గెలవాలనుకోవడం నచ్చలేదని పృథ్వీపై చెత్త గుమ్మరించింది. విష్ణుప్రియ వంతురాగా.. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, అలాగే నేను పిలుస్తుంటే కూడా పలకట్లేదని ప్రేరణను నామినేట్ చేసింది. మీ టీమ్‌సభ్యులు తొండాట ఆడారని, చీఫ్‌గా నువ్వు దాన్ని ఆపలేదంటూ యష్మిని నామినేట్ చేసింది.ప్రతిదాంట్లో జోక్యం అవసరమా?నాగమణికంఠ మాట్లాడుతూ.. ప్రతిదాంట్లో దూరడం నచ్చడం లేదదని యష్మిని నామినేట్ చేశాడు. అందుకు యష్మి.. అప్పుడు చీఫ్‌గా ఉన్నాను కాబట్టే ప్రతి విషయంలోనూ కలగజేసుకున్నానంది. నువ్వు ఫ్రెండ్ అంటూ డ్రామాలు చేశావు, ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావు, నువ్వు ఫేక్ అని అరిచేసింది. ఫ్రెండ్ అయినా సరే నాకు ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్తానన్నాడు మణికంఠ. పృథ్వీలో క్షణికావేశం నచ్చడం లేదని అతడిపై మణి చెత్త గుమ్మరించాడు. అయినా సరే తన కోపాన్ని మార్చుకునేదే లేదన్నాడు పృథ్వీ.విష్ణుప్రియ స్వార్థబుద్ధిఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయని సీతను ప్రేరణ నామినేట్ చేసింది. ఎమోషన్స్ లేకుండా బండరాయిలా ఉండాలా? అని సీత సెటైర్ వేయగా నీకసలు కామన్సెన్స్ లేదంటూ ఏదేదో అరిచింది. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ.. ఉన్నవే ఐదు గుడ్లు అయితే ఎవరి గురించి ఆలోచించకుండా అందులో రెండు గుడ్లు ఒక్కదానివే తినేశావంది. ఈ క్రమంలో బ్రెయిన్లెస్ పీపుల్ అని విష్ణు, యూజ్లెస్ పీపుల్ అని ప్రేరణ ఒకరినొకరు తిట్టుకున్నారు.నువ్వసలు కాంపిటీషనే కాదుఆదిత్య వంతురాగా.. ఎవరితో కలవనంత మాత్రాన నాలో నాయకత్వ లక్షణాలు లేవనడం బాధేసిందని విష్ణుప్రియను నామినేట్ చేశాడు. నీకు ఎంతో సపోర్ట్ చేస్తే విక్టిమ్ కార్డ్ వాడుతున్నావని మణికంఠను నామినేట్ చేశాడు. నైనిక మాట్లాడుతూ.. నాకసలు కాంపిటీషనే అనిపించడం లేదని సోనియాను, సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. యష్మి వంతురాగా.. ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసి నా హార్ట్ బ్రేక్ చేశావు కాబట్టి ఈ హౌస్‌కే నువ్వు డేంజరస్‌గా కనిపిస్తున్నావు అంటూ మణికంఠపై చెత్త వేసింది. చిన్నపిల్లల్లా వెక్కిరింతలేంటో!ఇందుకు మణికంఠ స్పందిస్తూ.. ఫ్రెండ్షిప్ను, గేమ్‌ను తాను మిక్స్ చేయను అని క్లారిటీ ఇచ్చాడు. తర్వాత యష్మి.. పనులు సరిగా చేయడం లేదంటూ నైనికను నామినేట్ చేసింది. నబీల్ వంతురాగా.. ఒక గేమ్‌లో సంచాలకురాలు ప్రేరణను మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించావంటూ యష్మిపై చెత్త గుమ్మరించాడు. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, నీ వల్ల నేను రూ.1 లక్ష గెలిచే ఛాన్స్ కోల్పోయానని ప్రేరణను నామినేట్ చేశాడు.నీ మైండ్‌లో విషం.. ఈ క్రమంలో ప్రేరణ, నబీల్ ఒకరినొకరు వెక్కిరించుకుంటూ వాదించుకున్నారు. తర్వాత పృథ్వీ.. సీత, నైనికలను నామినేట్ చేశాడు. సోనియా వంతురాగా.. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్, లీడర్‌గా నీకు మంచి లక్షణాలు లేవంటూ నైనికను నామినేట్ చేసింది. తర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. నీ మైండ్‌ను పాజిటివ్ వైపు తీసుకెళ్తే బాగుంటుంది, లేదంటే అది విషంగా మారుతుందని, అది ఎవరికీ మంచిది కాదని పేర్కొంది. ఏడ్చేసిన యష్మిఆమె మాటలతో షాకైన యష్మి.. నువ్వు నిఖిల్, పృథ్వీ, అభయ్ మీద చూపించిన ఇంట్రస్ట్ టీమ్‌పై చూపించలేదు అని ఉన్నమాట అనేసింది. ఎప్పుడూ సంచాలకురాలిగా ఉంటానన్నావే తప్ప ఎక్కడా గేమ్ ఆడేందుకు ముందుకు రాలేదు అంటూ ఇచ్చిపడేసింది. ఇంత మాట్లాడిన యష్మి.. సోనియా అన్న సూటిపోటి మాటలకు హర్టయి ఏడ్చేసింది. దీంతో సోనియా వెళ్లి తనను ఓదార్చడం గమనార్హం. నామినేషన్స్‌లో అభయ్చివర్లో నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్‌లలో ఒకరికే నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు బిగ్‌బాస్. దీంతో అభయ్.. తనకు సేవ్ అవుతానన్న నమ్మకం ఉందంటూ నామినేషన్స్‌లోకి వచ్చేందుకు అంగీకరించాడు. అలా ఈ వారం ప్రేరణ, పృథ్వి, మణికంఠ, విష్ణుప్రియ, సీత, నైనిక, యష్మి, అభయ్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.చదవండి: జరిగింది చూపించలేదు.. శేఖర్ బాషా ఎలిమినేషన్ వెనక అసలు రహస్యం -
Bigg Boss 8: అంతా ఫేక్.. నామినేషన్స్‌లో మణికంఠ vs యష్మి
సోమవారం వచ్చేసింది. అంటే బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరూ మాటలతో కొట్టేసుకునే రోజు. అందుకు తగ్గట్లే ఈ వారం కూడా ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో పేరు, కారణం చెప్పి వాళ్ల తలపై చెత్త పోసే కార్యక్రమం పెట్టాడు బిగ్ బాస్. దీంతో ఒకరిపై ఒకరు రెచ్చిపోయి మరీ అరిచేసుకున్నారు.తొలుత సీత.. యష్మి, పృథ్వీని నామినేట్ చేసింది. ఏ టాస్క్ జరిగినా సరే యష్మిది డామినేటింగ్ వాయిస్‌లా అనిపించిందని కారణం చెప్పింది. అలానే గేమ్‌లో ప్రవర్తించిన తీరుపై సీత-పృథ్వీ మధ్య మాటల యుద్ధమే సాగింది.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)మణికంఠ.. యష్మి, పృథ్వీని నామినేట్ చేశాడు. అయితే యష్మితో పెద్ద గొడవే పెట్టేసుకున్నాడు. మణికంఠ మాట్లాడుతున్నప్పుడు యష్మి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. నేను మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకో లేడీ అని వేలు చూపించి మరీ మణికంఠ సీరియస్ అయ్యాడు. దీంతో యష్మి రెచ్చిపోయింది. 'ఫ్రెండ్‌గా నా దగ్గరికొచ్చి నువ్వు డ్రామాలు చేస్తావ్ చూడు. అన్నీ ఫేక్' అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది.అలానే తన పాయింట్ ఆఫ్ వ్యూని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నావ్ అని మణికంఠ చెప్పగా.. నీకు దమ్ము లేదా అని యష్మి రెచ్చిపోయింది. ఇక చివర్లో విష్ణుప్రియ.. ప్రేరణని నామినేట్ చేసింది. ప్రోమో చూస్తుంటేనే హోరాహోరీగా ఉంది. ఇక ఫుల్ ఎపిసోడ్ ఇంకేలా ఉంటుందో ఏంటో?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?) -
నాన్నతో మనసారా మాట్లాడా.. అదే ఆఖరి రోజు.. పృథ్వీ ఎమోషనల్
నిన్న గొడవలతో వేడెక్కిన బిగ్‌బాస్ హౌస్ నేడు ఎమోషనల్‌గా మారనుంది. కంటెస్టెంట్లకు సంబంధించిన గిఫ్టులను ముందుపెట్టిన బిగ్‌బాస్ ఇవి అందరికీ కాదని, కొందరికి మాత్రమేనని తిరకాసు పెట్టాడు. దీంతో హౌస్మేట్స్ తమకు వచ్చిన గిఫ్టులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ బహుమతుల వెనక ఉన్న స్టోరీని బయటపెట్టారు.మణికంఠ సూపర్..తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. ఆదిత్య తన తండ్రి ఫోటో చూసి ఎమోషనల్ అయ్యాడు. నాలో ఉన్న చెడు లక్షణాలు నేనే నేర్చుకున్నాను.. కానీ మంచి లక్షణాలు మాత్రం తన తండ్రి నుంచే వచ్చాయన్నాడు. మణికంఠకు శాలువా లాంటిది వచ్చింది. అయితే కంటెస్టెంట్లు దాన్ని ఏదో సింపతీతో తనకు ఇవ్వాలని మాత్రం కోరుకోవడం లేదన్నాడు.కరోనా టైంలో నాన్న..ఇప్పటికే సింపతీ గేమ్ అన్న ముద్ర పడటంతోనే తను గిఫ్టును సైతం ఆశించకుండా గుండె రాయి చేసుకుని నిలబడ్డాడు. నబీల్ వంతు రాగా.. మా నాన్నతో దిగిన చివరి ఫోటో ఇదే.. ఆయన కరోనా వల్ల చనిపోయారని తెలిపాడు. పృథ్వీ మాట్లాడుతూ.. ఆగస్టు 15న నేను మా నాన్నతో చాలా సేపు మాట్లాడాను. అదే ఆయన చివరి రోజు అవుతుందనుకోలేదు అని చెప్పాడు. నాన్న ప్రేమ తెలీదుఇక చివర్లో బాషా తండ్రి గొప్పదనం గురించి చెప్తూ ఏడ్చేశాడు. మనందరికీ నాన్నంటే చాలా ఇష్టం. కానీ నాన్నకు మనమంటే ఎంతిష్టమనేది చాలామందికి తెలియదు. మీరు నాన్నయితే తప్ప ఆ ప్రేమ తెలియదు అని ఏడ్చేశాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిజంగానే ఎమోషనల్ ఫూల్, ఇలాగైతే కష్టమే! మణి అదుర్స్!
బిగ్‌బాస్ హౌస్‌లో రెండోవారమే ఆకలికేకలు మొదలయ్యాయి. మూడు టీములకు పోటీపెట్టగా రెండు టీమ్స్ గెలిచి రేషన్ పొందింది. కానీ ఒక్క టీమ్ మాత్రం మంచి తిండి దొరక్క అల్లాడిపోయింది. ఓడిపోయేవారితో ఉండనంటూ నిఖిల్‌కు హ్యాండిచ్చింది సోనియా. తనను లూజర్ అని పదేపదే అనడంతో అతడు ఉండబట్టలేక ఏడ్చేశాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్న బిగ్బాస్వారానికి సరిపడా ఆహారాన్ని బిగ్‌బాస్(#BiggBoss8Telugu) సూపర్ మార్కెట్ నుంచి తీసుకోమని చీఫ్స్‌ను ఆదేశించాడు బిగ్‌బాస్. అలా చీఫ్స్ యష్మి, నైనిక, నిఖిల్ తమకు ఇచ్చిన గడువులో వీలైనంత ఆహారాన్ని తమ ట్రాలీలలో వేసుకున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ మూడు టీమ్స్ సంపాదించిన రేషన్‌ను వాడుకోవాలంటే తాను ఇచ్చే టాస్కులు గెలవాలని మెలిక పెట్టాడు. మొదటగా మూడు టీమ్స్‌కు లెమన్ పిజ్జా టాస్క్ ఇచ్చాడు. ఇందులో యష్మి టీమ్ గెలిచింది.సోనియా ఏడుపు.. హగ్గులతో ఓదార్పుఇక వేరే టీమ్స్‌కు ఫుడ్ దొరకదనుకుందో, ఏమో కానీ ఆహారం అనేది అందరూ షేర్ చేసుకోవాలంటూ సోనియా ఏడ్చేసింది. దీంతో అభయ్, నిఖిల్, పృథ్వీ వరుసగా ఆమెకు హగ్గులిచ్చి ఓదార్చారు. తర్వాత నిఖిల్, నైనిక టీమ్స్‌కు బిగ్‌బాస్ పోటీపెట్టాడు. తాను అడిగే వస్తువులను తీసుకురావాలని ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఆడేందుకు నిఖిల్ రెడీ అవగా అందుకు మణికంఠ ఒప్పుకోలేదు. తాను నామినేషన్లో ఉన్నానని, తానే ఆడతానని మంకుపట్టు పట్టాడు. ఆ ఒక్క నిర్ణయంతో కెరటం ఓటమిఅలా నిఖిల్ టీమ్ నుంచి మణి, నైనిక టీమ్ నుంచి సీత బరిలోకి దిగారు. పప్పులు, పిండి, నెయ్యి, యాపిల్.. ఇలా ఒక్కో వస్తువు చెప్పినకొద్దీ ఎవరు ముందు తీసుకొస్తే వారు ఆ రౌండ్లో గెలిచినట్లు! మరమరాలు పావుకిలో తెమ్మన్నప్పుడు మణికంఠ దానికి దగ్గర్లో (290 గ్రాములు) పట్టుకొచ్చాడు. అయితే సరిగ్గా 250 గ్రాములు ఉంటే మాత్రమే అంగీకరిస్తానని, ఈ రౌండ్లో ఎవరూ విజేతలు కాదని ప్రకటించింది యష్మి. సంచాలకురాలిగా తన నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించింది. వారమంతా రాగి ముద్దతోనే..ఫైనల్‌గా ఈ ఛాలెంజ్‌లో సీత తన అంతులేని వీరులు టీమ్‌ను గెలిపించింది. కెరటం టీమ్‌లోని నిఖిల్, మణికంఠకు రేషన్ లేదని బిగ్‌బాస్ తెలియజేయడంతో సీత ఏడ్చేసింది. రేషన్‌కు బదులుగా వారమంతా రాగిపిండితోనే సర్దిపెట్టుకోమన్నాడు. దీంతో యష్మి కూడా కంటతడి పెట్టుకుంది. ఇక రాత్రి యష్మి.. టీమ్ అన్నాక అందరూ ఒకే దగ్గర పడుకోవాలని ఆదేశించింది. దొంగతనం షురూఅందుకు సోనియా సరేనంటూ తలూపుతూనే నిఖిల్ దగ్గరకొచ్చి దానిపై అభ్యంతరం తెలిపింది. ఉదయాన్నేమో.. అందరూ దోసె చేద్దామనుకుంటే కుదరదు ఎగ్ రైసే చేయాలని యష్మి ఆదేశించింది. ఇంత కఠినంగా ఉండటం దేనికని తన టీమ్ సభ్యులే గుసగుసలాడారు. అప్పటిదాకా ఫుడ్ అందరికీ రాలేదని బాధపడిపోయిన ఇంటిసభ్యులు కాస్త ఫుడ్ కడుపులో పడగానే దొంగతనం మొదలుపెట్టేశారు. అటు బిగ్‌బాస్ పంపిన కూరగాయలు ఉడికించుకుని తిని నిఖిల్, మణి కడుపు నింపుకున్నారు.ఎమోషనల్ ఫూల్మరోవైపు నిఖిల్ నామినేషన్స్‌లో జరిగిన తంతు నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. ఒంటరిగా కూర్చుని తనలో తానే బాధపడుతున్నాడు. అది చూసిన నైనిక.. నువ్వొక ఎమోషనల్ ఫూల్ అనేసింది. హౌస్‌లో ఏం చేసినా ప్రాబ్లమేనంటూ ఏడ్చేశాడు. నిజానికి ఆ ఏడుపు సోనియా అన్న మాటల వల్లేనని మనకు తర్వాత తెలుస్తుంది. అభయ్‌తో సోనియా.. నిఖిల్గాడిని చూస్తేనే కోపమొస్తుందని చెప్పింది. లూజర్స్‌తో ఉండనన్న సోనియాఅందుకు అభయ్.. నువ్వు నిఖిల్‌ను పదేపదే లూజర్ అన్నావంటగా.. లూజర్స్‌తో ఉండను అన్నావంట.. అలా అన్నప్పుడు తనతో ఇంకెలా మాట్లాడతానని నిఖిల్ ఫీలయ్యాడని ఆ సమాచారం సోనియాకు చేరవేశాడు. అందుకు సోనియా.. మరీ అంత కాకపోయినా, క్యాజువల్‌గా మాట్లాడితే అయిపోతుందిగా అని లైట్ తీసుకుంది. ఇక హౌస్‌లో అవతలివారిని రెచ్చగొట్టేది ప్రేరణ, విష్ణుప్రియ వీళ్లిద్దరు మాత్రమేనంది. అయినా మొన్నటి నామినేషన్స్‌తో రెచ్చగొట్టడంలో ఎవరు తోపు? అనేది జనాలకు ఈజీగా అర్థమైపోయిందిలే!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్.. 'మా వదిన తల్లిలాంటిది'
బిగ్‌బాస్ షోలో కొన్నాళ్లు ఉన్న తర్వాత ఒక్కొక్కరి చరిత్ర బయటకు వస్తూ ఉంటుంది. కానీ నాగమణికంఠ మాత్రం తన ఏవీ(బిగ్‌బాస్ లాంచింగ్ రోజు వేసిన వీడియో)లోనే కష్టాలన్నీ బయటపెట్టాడు. అలాగే భార్యతో గొడవలు కావడంతో కూతుర్ని సైతం వదిలేసి వచ్చినట్లు పేర్కొన్నాడు. తనకు భార్యాకూతురు కావాలి, అత్తామామ దగ్గర గౌరవం కావాలని బోరున విలపించాడు. భార్యకు దూరంగా..మొదట్లో అతడు చెప్పిన మాటల్ని బట్టి తన భార్య విలన్ అని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదు.. మణికంఠ బిగ్‌బాస్‌కు రావడానికి తనే ఎంకరేజ్ చేసింది. షాపింగ్ కోసం డబ్బులు కూడా ఇచ్చింది. ఈ విషయాల్ని మణి హౌస్‌మేట్స్‌తో చెప్తూ తనను గట్టిగా హగ్ చేసుకోవాలనుందన్నాడు. ఈ క్రమంలో అతడి పెళ్లి వీడియో బయటకు వచ్చింది. మణి బక్కపలుచన.. భార్య బొద్దుగాఅందులో అతడు వేలు పట్టుకుని ఏడడుగులు వేసిన అమ్మాయి పేరు శ్రీప్రియ అని ఉంది. తను కాస్త బొద్దుగా ఉండటంతో నెటిజన్లు ఆమెపై దారుణంగా సెటైర్లు వేశారు. ఈ అమ్మాయి కోసమా ఇంతలా ఏడ్చావు, కితకితలు సినిమా చూసినట్లుంది.. అని హేళన చేశారు. ఇప్పటికీ ఆమెను బాడీ షేమింగ్ చేస్తూనే ఉన్నారు.హీనమైన చర్యఈ వ్యవహారంపై మణికంఠ సోదరి కావ్య అమర్నాథ్ ఫైర్ అయింది. మా అన్నవదినల వీడియో ఒకటి వైరలవుతుండటం నా దృష్టికి కూడా వచ్చింది. ఆ వీడియోకు వచ్చిన నెగెటివ్ కామెంట్లు చూస్తే ఎంతో బాధేసింది. కితకితలు సినిమా రెండో పార్ట్ చూసినట్లుంది అంటూ తన శరీరం గురించి జోకులు వేయడం సరదా కాదు. ఇది హీనమైన చర్య.తల్లిలా నిలబడిందిమా వదిన సౌందర్యవతి. తన మనసు ఎంతో అందమైనది. ఆమె ప్రేమ, బలం, దయాగుణం.. ఇలాంటి ఎన్నో లక్షణాలు తనను మరింత అందంగా మలిచాయి. నా కోసం ఎప్పుడూ ఒక తల్లిలా నిలబడింది. బాడీ షేమింగ్ చేయడం ఆపేయండి. ప్రతి ఒక్కరూ ఆయా కోణంలో అందంగానే ఉంటారు. ప్రేమను పంచండిబరువు తగ్గమని చెప్పడం వల్ల వారికి నష్టమే ఎక్కువ జరగొచ్చేమో! ఆ మాటలు వారి మనసును బాధిస్తాయి. గాయపరుస్తాయి. ఈ నెగెటివిటీని పక్కనపెట్టి ప్రేమను పంచండి. అవతలివారు ఎలా ఉన్నరన్నదానికి బదులుగా ఎలాంటివారో తెలుసుకుని మెచ్చుకోండి అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Kavya Amarnadh (@kavya_amarnadh) View this post on Instagram A post shared by @nagamanikanta_bb8_ మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ ఇద్దరి కడుపు కొట్టిన బిగ్‌బాస్, నిఖిల్ కోసం సోనియా ఏడుపు!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో అన్నీ అన్లిమిటెడ్ అంటూనే కొన్ని మాత్రం గెలిచి సంపాదించుకోవాలని ట్విస్ట్ ఇచ్చాడు. అందులో రేషన్ ఒకటి. ఇంటిసభ్యుల కడుపు నిండాలంటే వారే కష్టపడి టాస్కులు గెలిచి రేషన్ గెలిచి వండుకుని తినాలి. లేదంటే పస్తులుండాల్సిందే!ఆకలి పోరాటంఇందుకోసం టీముల మధ్య పోటీ పెట్టాడు బిగ్‌బాస్. మొదట లెమన్ పిజ్జా టాస్క్ పెట్టారు. ఇందులో యష్మి టీమ్ గెలిచినట్లు సమాచారం. తర్వాతి ఛాలెంజ్‌లో కందిపప్పు తెమ్మనగానే సీత పరుగెత్తుకుంటూ వెళ్లి తెచ్చేసింది. నెక్స్ట్ టమాట బుట్టలో ఒక యాపిల్‌ను తీయండనగానే మణికంఠ దాన్ని కనిపెట్టి క్యాచ్ చేశాడు. ముచ్చటగా మూడో గేమ్‌లో పావుకిలో మరమరాలు తేవాలన్నాడు బిగ్‌బాస్.మణికంఠ వర్సెస్ యష్మికరెక్టుగా 250 గ్రాములే తేవడానికి వీళ్లేమైనా కిరాణా షాపులో పని చేశారా? దీంతో కాస్త అటూఇటుగా తీసుకొచ్చారు. కానీ సంచాలకురాలు యష్మి కరెక్ట్‌గా తేలేదంటూ ఇద్దర్నీ అనర్హులుగా ప్రకటించింది. పావుకిలోకు దగ్గర్లో (290 గ్రాముల మరమరాలు) తెచ్చిన తాను గెలిచినట్లే కదా అని మణికంఠ వాదించాడు. అందుకు యష్మి ఒప్పుకోలేదు. మొత్తానికి ఈ గేమ్‌లో నైనిక టీమ్ గెలిచినట్లు తెలుస్తోంది.చాలా బాధగా ఉంది బిగ్బాస్అందరికంటే చిన్నదైన నిఖిల్ టీమ్ ఎందులోనూ గెలవకపోవడంతో ఈ వారమంతా నో రేషన్ అని చెప్పాడట బిగ్‌బాస్. అలాగని పస్తులుంచకుండా.. కేవలం రాగి పిండి పంపించి దానితోనే అడ్జస్ట్ అయిపోమన్నాడట! కేవలం రాగిముద్దతోనే కడుపు నింపుకుని టాస్కులు ఆడాలంటే కష్టమే కదా! అందుకే సీత.. ఫుడ్ గురించి కొట్టుకోవడం చాలా బాధగా ఉంది. వారికి కూడా ఆహారాన్ని ఇవ్వండని బిగ్‌బాస్‌ను అభ్యర్థించింది. అటు సోనియా మాత్రం.. నిఖిల్ కడుపు మాడుతే తాను భరించలేనంటూ ఏడ్చేసింది. -
Naga Manikanta: బిగ్‌బాస్ ఫేమ్ నాగమణికంఠ వెడ్డింగ్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
గుండె కొట్టుకునేది నీ కోసమే.. మణికంఠ భార్య, కూతుర్ని చూశారా?
బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ల ఆటను బట్టి, వారి వ్యక్తిత్వాలను బట్టి ఫ్యాన్స్ ఏర్పడుతుంటారు. ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరి కదలికను క్షుణ్ణంగా గమనిస్తూ నచ్చినవారికి ఓటేస్తుంటారు. అయితే ఈ సీజన్లో మాత్రం ఇందుకు విభిన్నంగా బ్యాక్‌గ్రౌండ్ చూసి ఓటేశారు. అవును, మొదటివారం తన గతాన్ని తవ్వుతూ.. భార్యాబిడ్డల కోసం, వారి దగ్గర గౌరవంగా బతకడం కోసం బోరుమని ఏడ్చిన నాగ మణికంఠకు జనాలు ఓట్లు గుద్దారు.గుండె కొట్టుకునేది నీ కోసమే..కేవలం అతడి బాధకు చలించిపోయే ఓట్లేశారు తప్ప ఆటను చూసి కాదు. ఈ క్రమంలో నాగమణికంఠ భార్య శ్రీ ప్రియ, కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నా గుండె కొట్టుకునేది నీ కోసమేనంటూ మణికంఠ ఇన్స్టాగ్రామ్ నుంచి ఓ వీడియో వదిలారు. అందులో మణి.. అతడి కూతురితో ఆప్యాయంగా కలిసున్నాడు. మరో ఖాతా నుంచి ఏకంగా నాగమణికంఠ పెళ్లి వీడియో వచ్చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు కలిసే ఉంటారని, తప్పకుండా ఫ్యామిలీ వీక్‌లో మీ భార్య, కూతురు వస్తారని కామెంట్లు చేస్తున్నారు.ఎన్నో కష్టాలుఇకపోతే బిగ్‌బాస్ 8 ప్రారంభమైన రోజు మణికంఠ ఎన్నో కష్టాలు పడినట్లు చూపించారు. వైవాహిక బంధం కూడా సరిగా లేనట్లు చూపించారు. మణికంఠ సైతం.. భార్యతో విడిపోయినట్లుగా మాట్లాడాడు. తనవల్లే కూతురికి దూరమైనట్లు తెగ బాధపడిపోయాడు. కానీ హౌస్‌లోకి వెళ్లాక మాత్రం తన భార్య బంగారమని చెప్పాడు.పెద్ద ప్లానే..బిగ్‌బాస్‌కు వెళ్లమని భార్య సపోర్ట్ చేసిందని, షాపింగ్ కోసం డబ్బులు కూడా ఇచ్చిందని ఆమె గొప్పతనాన్ని బయటపెట్టాడు. కేవలం తన కాళ్లపై నిలబడటానికే భార్య, కూతుర్ని వదిలేసి ఇండియాకు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఇదంతా చూస్తుంటే మణికంఠ ఫ్యామిలీ వీక్ వరకు బిగ్‌బాస్‌లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by @nagamanikanta_bb8_ View this post on Instagram A post shared by @nagamanikanta_bb8_ బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏడ్చిన సోనియా.. విష్ణుప్రియకు క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ప్రోమో రానే వచ్చింది. వినాయక చవితి సందర్భంగా నాగార్జున హౌస్‌మేట్స్‌కు స్వీట్లు పంపించాడు. అలాగే ప్రతి వీకెండ్లో తప్పొప్పులు ఎత్తి చూపే నాగ్ మీ పొరపాట్లు ఏంటో మీరే చెప్పండని కంటెస్టెంట్లను ఆదేశించాడు. దీంతో అందరూ లేచి నిలబడ్డారు.మణిని గుచ్చిన బాషాతనలో తను మాట్లాడుకోవడం ఒంటరితనమో ఏంటో అర్థం కావడం లేదంటూ నాగమణికంఠను కత్తితో పొడిచాడు బాషా. ఆ ఒంటరితనం ఎందువల్ల ఏర్పడిందనేది తర్వాత చెప్పాడుగా అని నాగ్ బదులివ్వగా వాటిని నేను ఆమోదించలేనన్నాడు బాషా. తర్వాత విష్ణుప్రియ.. సోనియాకు కోపంలో అనే మాటలు మనసుకు బాధ కలిగిస్తున్నాయంది. దీంతో ఓ వీడియో ప్లే చేశారు. ఉన్నమాట అడిగిన విష్ణుప్రియఅందులో విష్ణుప్రియ.. నీకు ముందునుంచి నిఖిల్ అంతగా నచ్చలేదు. అలాంటిది మీ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది? అని ఉన్నమాట అడిగింది. ఇది కేవలం విష్ణుప్రియకు వచ్చిన డౌటే కాదు.. బిగ్‌బాస్ చూసే ఆడియన్స్‌కు వచ్చిన డౌట్ కూడా! కానీ ఆ ప్రశ్నకు సోనియా సమాధానం దాటవేసింది. అంతేకాకుండా ఇలాంటి అడల్ట్రేటెడ్ కామెడీ తన మీద ప్రయోగించొద్దని సీరియస్ అయింది. దీంతో విష్ణుప్రియకు చిర్రెత్తుకొచ్చింది. నువ్వొక్కదానివే పుణ్య స్త్రీవా?మీ మధ్య ఏమైనా నడుస్తుందా? అని ఆ టైప్‌లో ఏమైనా జోకులు వేశానా? లేదు కదా? అని నిలదీసింది. ఆ మాటతో సోనియా.. ఇక ఆపేయ్ అని అరుచుకుంటూ బయటకు వెళ్లి ఏడ్చేసింది. అది చూసిన విష్ణుప్రియ.. నేను కూడా ఏడుస్తాను.. నువ్వొక్కదానివే పుణ్య స్త్రీవా? అని నోరుపారేసుకుంది. ఇది చూసిన నాగార్జున.. తను ఏడుస్తున్నప్పుడు మళ్లీ గుచ్చేలా మాట్లాడటం అవసరమా? అని కోప్పడ్డాడు. మరి ఇంకా ఎవరెవరికి క్లాసులు పీకాడో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈమె ఓ బిందు మాధవి, అతడో పల్లవి ప్రశాంత్ మరి!
అందరూ ఏదో పగబట్టినట్లు ఒక్కరినే నామినేట్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి బాధనిపించడం ఖాయం. కానీ అంత బాధలోనూ నా గతం మీకు తెలీదంటూనే తన చరిత్రనంతా మళ్లీ చదివి వినిపించాడు నాగమణికంఠ. కష్టాలన్నీ తనకు మాత్రమే ఉన్నాయంటూ ఓరకంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. సింపతీ గేమ్దీంతో బిగ్‌బాస్ అతడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఓదార్చాడు. చూస్తుంటే ఇతడు పల్లవి ప్రశాంత్‌లా సింపతీ గేమ్ ఆడి గెలుద్దామనుకుంటున్నాడని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నాడు. మరోవైపు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సోనియా తనకు తానే ఆడపులి అన్న ట్యాగ్‌లైన్ ఇచ్చేసుకుంది. సెల్ఫ్ డబ్బా..ఈ మాట జనాలు చెప్పుంటే బాగుండేది కానీ మరీ రెండు రోజుల్లోనే తనను తాను పొగుడుకోవడం చూసిన బిగ్‌బాస్ ప్రియులు ఇది సెల్ఫ్ డబ్బా అని కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సీజన్లో బిందుమాధవిలా ఫీలవుతుందని సెటైర్లు వేస్తున్నారు. -
నా భార్య నాక్కావాలి, అత్తామామ దగ్గర గౌరవం కావాలి: మణి
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో మొదటివారం నామినేషన్ ప్రక్రియలోనే కన్నీళ్ల వరద పారింది. తాను ఏడుస్తూ పక్కవాళ్లను కూడా ఏడిపించాడు మణికంఠ. అసలేం జరిగిందో, నేటి(సెప్టెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి..పని చేయట్లేదంటూ..ఆదిత్య ఓం.. వాలంటీర్‌గా పనులు చేయడం లేదని శేఖర్ బాషాను, తక్కువ పని చేస్తున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ ఇద్దరిలో చీఫ్ యష్మి.. శేఖర్ బాషా నామినేషన్‌కు మద్దతిచ్చి పృథ్వీని సేవ్ చేసింది. సీత.. బేబక్క, ప్రేరణను నామినేట్ చేసింది. వీరిలో బేబక్క నామినేషన్‌ను చీఫ్ నైనిక ఫైనల్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. తర్వాత విష్ణుప్రియ.. బాషా, సోనియాను నామినేట్ చేయగా చీఫ్ నిఖిల్ బాషా నామినేషన్నే ఫైనలైజ్ చేసి సోనియాను సేవ్ చేశాడు. అన్‌ఫిట్ అయితే పోతా..అనంతరం అభయ్ నవీన్.. నాగమణికంఠను నామినేట్ చేశాడు. ఎవ్వరి ఫ్లాష్‌బ్యాక్ ఎవడికీ అవసరం లేదు. నీకు ఎన్ని సమస్యలున్నా నాకనవసరం. గేమ్‌లో నాకేదైనా నచ్చలేదంటే చెప్పే హక్కు నాకుంది. ఈ గేమ్‌లో ఏం జరిగినా తీసుకోవడానికి రెడీ అనుకునేవాళ్లే హౌస్‌లో ఉండాలి. నీలో ఆ లక్షణం లేదని తేల్చాడు. దీంతో నాగమణికంఠ.. నేను అన్‌ఫిట్ అయితే ఈ వారమే వెళ్లిపోతానని ఫ్రస్టేట్ అయ్యాడు. అనంతరం అభయ్.. బేబక్కను నామినేట్ చేశాడు. పుండు మీద కారం చల్లినట్లు చీఫ్ యష్మి.. నాగమణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది.మళ్లీ బాధలు చెప్పుకున్న మణితర్వాత ప్రేరణ.. నాగమణికంఠ పేరెత్తడంతో అందరూ నాపై ఇలా పడ్డారేంటని బోరుమని ఏడ్చేశాడు. ఏడో తరగతి నుంచి నానాకష్టాలు పడ్డాను. కన్నతండ్రిని పోగొట్టుకున్నా, సవతి తండ్రి చేతిలో అవమానాలు ఎదుర్కొన్నా. అమ్మ చనిపోతే అందరి దగ్గర డబ్బు అడుక్కుని అంత్యక్రియలు చేశాను. నాకు అందరి మీదా నమ్మకం పోయింది. నా కూతురు దూరమైన సమయంలో, చచ్చిపోదామనుకుంటున్న క్షణంలో నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఇది నాకు చాలా అవసరం. అది మీకెవరికీ అర్థం కావడం లేదు. నేనెక్కడా విక్టిమ్ కార్డ్ వాడటం లేదు.నా జీవితం దగ్గరుండి చూశారా? నా కర్మ కాలి మొదటి రోజు నిజంగా ఎలిమినేట్ చేస్తున్నారన్న బాధలో మీకు నా గురించి తెలీదు, నేను వెళ్లిపోతున్నానంటూ కోప్పడ్డాను. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని పదేపదే నా మీద పడుతున్నారు. మీరేమైనా నా జీవితం చూశారా? అని అందరినీ నిలదీస్తూనే.. ఎమోషనల్‌గా ఉన్నప్పుడు మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు. మిమ్మల్ని ఏమైనా అనుంటే సారీ.. అని అపరిచితుడిలో రాములా మారిపోయాడు.ఏడిపించేసిన మణినేను గేమ్ గెలవాలనుకున్నాను. కనీసం ఐదు వారాలైనా ఉండాలనుకున్నానంటూ ఏడుస్తూనే మాట్లాడాడు. నాగమణికంఠ పడ్డ బాధలు విన్నాక అతడి కంటే కూడా యష్మినే ఎక్కువ గుక్కపెట్టి ఏడ్చింది. తర్వాత ప్రేరణ.. సోనియాను నామినేట్ చేసింది. ఇద్దరికి చెప్పిన కారణాలు విన్నాక చీఫ్.. నాగమణికంఠను సేవ్ చేసి సోనియాను నామినేట్ చేశాడు.అందుకే తిరిగావా?నాగమణికంఠ.. నేను క్యూట్‌గా ఉన్నాను, నాలో ఫెమినిజం ఉందని విష్ణుప్రియ చెప్పిన మాట నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు. పైగా విష్ఱుప్రియ ఏమైనా పదాలు జారుతుందేమోనని మూడురోజులుగా తనతో తిరుగుతున్నానని చెప్పాడు. అంటే ఇన్నిరోజులు ఫ్రెండ్‌గా ఉండలేదా? నన్ను చెక్ చేస్తున్నావా? అని విష్ణుప్రియ ఎమోషనలైంది.సింపతీ కార్డ్అనంతరం బాషాను నామినేట్ చేస్తూ తినే పండ్లతో ఆడటం నచ్చలేదన్నాడు. అలాగైతే నువ్వు నిద్రపోతే కుక్క మొరిగిందిగా, అది తప్పు కాదా అని బాషా కౌంటరిచ్చాడు. ప్రతి ఒక్కరికీ ఫ్లాష్‌బ్యాక్ ఉంది, అందరూ అది చెప్పుకుని ఏడవట్లేదు.. నువ్వు ఏదో సింపతీ, రాజకీయం క్రియేట్ చేస్తున్నావని ఇచ్చిపడేశాడు. ఈ వాదనలు విన్న చీఫ్ యష్మి.. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ బాషాను సేవ్ చేశాడు.నామినేషన్లో ఎవరంటే?తర్వాత పృథ్వీ.. నీకు సీరియస్‌నెస్ లేదంటూ బేబక్కను, సింపతీ కార్డ్ వాడుతున్నావు, రెండు నాలుకలు ఉన్నాయంటూ నాగమణికంఠను నామినేట్ చేశాడు. మొత్తంగా మొదటివారం బేబక్క, సోనియా, శేఖర్ బాషా, విష్ణుప్రియ, పృథ్వీ, నాగమణికంఠలు నామినేట్ అయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కూడా మణికంఠ ఏడుపు ఆపలేదు. నా చివరి యుద్ధండ్యాం గేట్లు ఎత్తినట్లు ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు. నాకు ఏ దిక్కూ లేదు, నా దగ్గర ఒక్క రూపాయి లేదు, రేపు నేను బయటకు వెళ్లాక నన్ను నెగెటివ్ అనుకుంటారు. ఇది నా చివరి యుద్ధం. గేమ్ ఎలా ఆడాలో అర్థం కావట్లేదని కన్నీళ్లు పెట్టుకుంటూనే విగ్ నేలకేసి కొట్టాడు. దీంతో నిఖిల్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు.నా భార్య నాక్కావాలిఅతడు కన్నీళ్ల టాప్‌ను కట్టేయకపోవడంతో బిగ్‌బాస్ నను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు. అక్కడ.. నా భార్య నాక్కావాలి, అత్తామామ దగ్గర నాకు గౌరవం కావాలి. నా సవతి తండ్రి నాక్కావాలి. నా పాప నాకు కావాలి. నాకు మనుషులు కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను.. నాపై నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నా మైండ్ సెట్ మార్చుకోవాలనుకున్నాను. కానీ నా వల్ల కావట్లేదంటూ మళ్లీ విలపించాడు. దీంతో బిగ్‌బాస్.. నిన్ను నువ్వు నమ్ము, ధైర్యాన్ని కోల్పోకు అని నాలుగు మంచి మాటలు చెప్పి పంపించేశాడు.మరిన్నిబిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: చావు వరకు వెళ్లొచ్చా.. ఏడిపించేసిన నాగ మణికంఠ!
కిరాక్ సీత, బేబక్కని నామినేట్ చేసింది. రాత్రి చేసిన కూరల గురించి తిక్క పంచాయతీ పెట్టుకున్నారు. సోనియా.. విష్ణుప్రియని నామినేట్ చేసింది. అభయ్ నవీన్.. నాగ మణికంఠని నామినేట్ చేశాడు. ఇక ప్రేరణ కూడా నాగ మణికంఠనే నామినేట్ చేసింది. 'మీరు సీరియస్‌గా తీసుకోవట్లేదని నువ్వు ఎవరు చెప్పడానికి మా సీరియస్‌నెస్ మాకు తెలుసు' అని ప్రేరణ కౌంటర్ వేసింది.ఇక అభయ్‌తో మాట్లాడుతూ.. నేను అన్‌ఫిట్ అయితే ఈ వారమే హౌస్ నుంచి వెళ్లిపోతాను అని మణికంఠ అన్నాడు. విష్ణుప్రియని నామినేట్ చేసిన నాగమణికంఠ.. ఈ మూడు రోజులతో నీతో ఎందుకు ట్రావెల్ చేశానంటే.. నువ్వు అసలు ఎలా మాట్లాడుతున్నావ్ అనేది చూస్తున్నా అని చెప్పగానే విష్ణుప్రియ షాకయింది. ఇందుకు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావ్ అని అవాక్కయింది.(ఇదీ చదవండి: Bigg Boss 8 Day 2 Highlights: మొదటి వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే!)శేఖర్ భాషా అయితే నాగమణికంఠ అసలు రంగు బయటపెట్టాడు. ప్రతిదాన్ని రాజకీయం చేద్దామని చూస్తున్నావ్ అని చెప్పాడు. ఇలా అనేసరికి మనోడు కాస్త సైలెంట్ అయిపోయాడు. దీని తర్వాత నాగమణికంఠ ఎమోషనల్ అయ్యాడు. 'చావు దాకా వెళ్లి వచ్చా. మీరు చూడలేదు. నాన్నని పోగొట్టుకున్నా. సవతి తండ్రితో తిట్లు తిన్నాను. అమ్మ చనిపోయింది. కాల్చడానికి కట్టెలు లేక డబ్బులు అడుక్కున్నా' అని మణికంఠ ఎమోషనల్ కావడంతో యష్మి, ప్రేరణ ఏడ్చేశారు. అలా గొడవతో మొదలైన ప్రోమో.. ఏడుపులతో ఎండ్ అయింది.ప్రోమో బట్టి చూస్తుంటే బుధవారం నాగమణికంఠ హైలైటె అయ్యేలా ఉన్నాడు. అలానే అందరి టార్గెట్ కూడా మనోడే అయ్యాడనిపిస్తోంది. ఓవరాల్‌గా చూస్తే కష్టాలు పదే పదే చెప్పుకొని సింపతీ గేమ్ ఆడుతున్నాడనిపిస్తోంది. అసలేం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.(ఇదీ చదవండి: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్.. రెండు కిడ్నీలు ఫెయిల్) -
Bigg Boss 8: మొదటి వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే!
బిగ్‌బాస్ హౌస్‌ను కంటెస్టెంట్లు మొదటిరోజే చేపలమార్కెట్ చేసేశారు. టాస్కులు గెలిచి చీఫ్లుగా అధికారంలోకి వచ్చిన నిఖిల్, సోనియా.. ఏకాభిప్రాయంతో యష్మిని మూడో చీఫ్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే! స్నేహితురాలన్న కారణంతోనే యష్మిని చీఫ్‌గా ఎన్నుకున్నారని సోనియా చాలాసేపు వాదించింది.గగ్గోలు పెట్టిన సీతమరోవైపు ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే బేబక్క ఒప్పుకోవడం లేదని సీత బుంగమూతి పెట్టింది. అలాగే తనను కిచెన్ టీమ్‌లో నుంచి కావాలనే సైడ్ చేశారని గగ్గోలు పెట్టింది. అలాంటిదేమీ లేదని నిఖిల్ నచ్చజెప్పినా అస్సలు వినిపించుకోలేదు. ఇంతలో బిగ్‌బాస్ నామినేషన్ అనే ప్రక్రియతో అసలైన గొడవ మొదలుపెట్టాడు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను బండరాయికి తగిలించాలని చెప్పాడు.చీఫ్‌లకు మినహాయింపుచీఫ్లకు నామినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చాడు. అలాగే హౌస్మేట్స్ ఇద్దరిని చొప్పున నామినేట్ చేస్తే అందులో ఒకరి సేవ్ చేస్తూ మరొకిరిని నామినేట్ చేసే అధికారం చీఫ్‌లకు ఉందని పేర్కొన్నాడు. మొదటగా సోనియా... కిచెన్‌లో బాధ్యతారాహిత్యంగా ఉన్నారంటూ బేబక్కను నామినేట్ చేసింది. కుక్కర్ పని చేయకపోయినా అది నా తప్పేనా? అని బేబక్క సమాధానమిస్తుంటే తననసలు మాట్లాడనివ్వలేదు. బేబక్కను పూర్తిగా మాట్లాడనివ్వు అని చీఫ్‌లు కలగజేసుకున్న పాపానికి మీరేమీ జడ్జిలు కాదంటూ వారి నోరు కూడా మూయించింది.సోనియా వర్సెస్ ప్రేరణఅనంతరం ప్రేరణను నామినేట్ చేస్తూ.. ఇదేం పిక్నిక్ కాదు, ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావేమో.. కానీ, అవతలివారికి కోపం వచ్చినప్పుడు మధ్యలో వచ్చి ఆపే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ క్రమంలో ప్రేరణ.. తనతో పెద్ద గొడవే పెట్టుకుంది. చీఫ్ యష్మి.. వారిద్దరిలో బేబక్క నామినేషన్‌కు పచ్చజెండా ఊపింది.నాగమణికంఠకు ఎక్కువ ఓట్లునబీల్.. ఎవరితో కలిసిపోవట్లేదంటూ నాగమణికంఠను, తనతో ఎక్కువ కనెక్ట్ కాలేదంటూ బేబక్కను నామినేట్ చేశాడు. యష్మి పరిగెత్తుకుంటూ వచ్చి నాగమణికంఠ ఫోటోపై కత్తిగుచ్చి అతడి నామినేషన్‌ను ఫైనలైజ్ చేసింది. అనంతరం శేఖర్ బాషా.. నాగమణికంఠ, బేబక్కల ఫోటోలను బండరాయిపై అతికించాడు. చీఫ్ నైనిక.. వీరిలో నాగమణికంఠను నామినేట్ చేసింది.సాయం చేయలేదంటూతర్వాత బేబక్క.. నబీల్ను నామినేట్ చేసింది. తనకు కిచెన్‌లో సాయం చేయలేదంటూ పృథ్వీ ఫోటోను బండరాయికి అతికించింది. అయితే సీత.. అతడు కిచెన్‌లో బోళ్లు తోమాడంటూ పక్కనుంచి ఉప్పందించింది. ఇది చూసిన నిఖిల్.. మధ్యలో నువ్వు మాట్లాడొద్దని ఫైరయ్యాడు. అనంతరం అతడు పృథ్వీ నామినేషన్‌ను ఫైనల్ చేశాడు.నామినేషన్స్‌లో ఎవరంటే?ఈ నామినేషన్ పర్వం రేపటి ఎపిసోడ్‌లోనూ కొనసాగనుంది. అయితే ఈపాటికే బిగ్‌బాస్ హౌస్‌లో ఈ ప్రక్రియ ముగియడంతో నామినేషన్ లిస్టు బయటకు వచ్చేసింది. అందులో పృథ్వి, నాగమణికంఠ, శేఖర్ బాషా, విష్ణుప్రియ, సోనియా, బేబక్క ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ వీరిలో ఒకరిని సేవ్ చేసే అధికారం ఏమైనా చీఫ్స్‌కు ఇస్తారా? లేదంటే వీళ్లే నామినేషన్లో ఉంటారా? అనేది రేపు తేలనుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: స్టేజీపై భార్యను విలన్‌గా.. కానీ ఆమె బంగారం!
ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో పద్నాలుగు మంది అడుగుపెట్టారు. వారి మాటలు, స్టేజీపై వేసిన ఈవీ వీడియోల ప్రకారం ఎక్కువ కష్టాలు పడింది నాగమణికంఠనే! పుట్టిన మరుసటి ఏడాదికే తండ్రి చనిపోవడం, తల్లే ప్రపంచం అనుకుంటున్న సమయంలో ఆమె క్యాన్సర్‌తో కన్నుమూయడం.. గుండెనిండా ఆ బాధనే నింపుకున్న అతడు ఇంటి నుంచి ఏకాకిగా బయటకు వచ్చేశాడు.భార్య విలన్ కాదు, బంగారంపోనీ పెళ్లి చేసుకున్నాకైనా సంతోషంగా ఉన్నాడా? అంటే అక్కడ కూడా గొడవలు, కూతుర్ని సైతం వదిలేసి ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఇదంతా చూసిన జనాలు మణికంఠకు ఎన్ని కష్టాలో అనుకున్నారు. అతడి భార్య విలన్ అని అభిప్రాయపడ్డారు. కానీ తన భార్య బంగారం అంటున్నాడు మణికంఠ. లైవ్ ఎపిసోడ్లో ఆర్జే శేఖర్ బాషాతో.. తమ మధ్య గొడవలేం లేవని, ఇప్పటికీ భార్యతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నట్లు తెలిపాడు.ఎంకరేజ్ చేసిందే తనుబిగ్బాస్కు వచ్చే ముందు కూడా భార్య ఫోన్ చేసి కచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావ్, నీకు కావాల్సిన డబ్బు కూడా ఏర్పాటు చేస్తానందట. అయితే ఆ డబ్బును మణికంఠ అప్పుగా ఇమ్మంటే భార్యాభర్తల మధ్య అప్పేంటని తోసిపుచ్చింది. అలా తనను బిగ్‌బాస్‌కు వెళ్లమని ఎంకరేజ్ చేసింది కూడా భార్యేనని, షాపింగ్‌కు డబ్బులు కూడా పంపిందని తెలిపాడు. విడిపోలేదు, గొడవపడ్డారంతే!కప్పు కొట్టేద్దామన్న ఆశ లేదు కానీ కొట్లాడైనా, ఏడ్చయినా, నవ్వయినా సరే.. వీలైనన్ని రోజులు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అతడు భార్యతో గొడవపడి అమెరికా నుంచి వచ్చేశాడే తప్ప విడిపోయి కాదని తన మాటలతో స్పష్టమైపోయింది. కూతురి కోసం సంపాదించాలన్న ఆలోచనతోనే అతడు ఇండియాకు వచ్చాడని తేలిపోయింది. -
Bigg Boss 8: ఏడో వారం నాగమణికంఠ ఎలిమినేట్
నాగమణికంఠ సీరియల్ యాక్టర్. ఇతడు పుట్టిన రెండేళ్లకే నాన్న చనిపోయాడు. దీంతో అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. ఊహ తెలిసేసరికి తన ముందున్న తండ్రి కన్నవాడు కాదని తెలిసి జీర్ణించుకోలేకపోయాడు. ఇంట్లో కొట్లాటలు మొదలయ్యాయి. ఇవి చాలవన్నట్లు తన తల్లికి క్యాన్సర్ అని తేలింది. తనను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు కానీ అమ్మను బతికించుకోలేకపోయాడు. 2019లో తల్లిని కోల్పోయాడు. ఆమెకు తలకొరివి పెట్టిన పదకొండే రోజే ఇంటి నుంచి బయటకు వచ్చాడు.దేవుడు ఒకటి లాక్కుంటే మరొకటి ఇస్తాడన్నట్లు మంచి ఉద్యోగం దొరికింది. కానీ ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. పెళ్లి చేసుకుంటే అమ్మ మళ్లీ తన కూతురిగా పుడుతుందని ఆశించాడు. వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. తల్లే తనకు కూతురిగా పుట్టిందని సంతోషించాడు. అంతలోనే గొడవలు మొదలవడంతో ఇండియాకు ఒంటరిగా తిరిగొచ్చాడు. ఇన్ని కష్టాలు చూసిన ఇతడు తర్వాత నటుడిగా బుల్లితెరపై స్థానం సంపాదించాడు. బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. కప్పు గెలుస్తానన్న ఇతడు ఏడోవారం హౌస్‌లో ఉండలేనంటూ తనే స్వయంగా ఎలిమినేట్ అయ్యాడు.