
బిగ్‌బాస్ కప్పు గెలవడం ముఖ్యమన్న నాగమణికంఠ ఏడోవారంలో తనకు తానే సొంతంగా బయటకు వచ్చేశాడు. ఎలిమినేట్ అయినందుకు అతడు సంతోషంగానే ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో అతడు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'నేను జనాల్ని అంత ఈజీగా నమ్మను. అందుకే మొదట్లో అందరితోనూ దూరంగానే ఉన్నాను.
గౌరవం కోరుకున్నా..
నేను ఏం మాట్లాడినా, ఏం చేసినా తప్పు పట్టడంతో సైలెంట్ అయిపోయాను. బిగ్‌బాస్ ద్వారా డబ్బు, గౌరవం సంపాదించుకోవాలనుకున్నాను. కానీ వారాలు గడిచేకొద్దీ నా శరీరం సహకరించలేదు. ఫిజికల్ టాస్కులు ఆడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకోవాలనుకోలేదు. కాకపోతే జీవితంలో ఎలా బతకాలనేది నేర్చుకున్నాను. నేను మారానని నా భార్య తెలుసుకుంది. అందుకు సంతోషంగా ఉన్నాను.
నెగెటివ్ కామెంట్స్..
తేడా, గే అనే కామెంట్లపై స్పందిస్తూ.. బిగ్‌బాస్‌కు ముందు ప్రతి చిన్నదాన్ని పట్టించుకునేవాడిని, బాధపడేవాడిని. కానీ ఇప్పుడు ఇలాంటి నెగెటివ్ కామెంట్లను అస్సలు లెక్క చేయను. నా పెళ్లి వీడియో వైరలయినప్పుడు కూడా నా భార్య ప్రియపై నెగెటివ్ కామెంట్లు చేశారు. కాస్తయినా జ్ఞానం ఉండాలి. తెలివితక్కువవాళ్లు ఇలాంటి పనికిమాలిన పనే చేస్తూ ఉంటారు. కానీ నా భార్య నాకు అందగత్తె. తన మనసు ఎంతో అందమైనది. నన్ను బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లే భరించలేకపోయారు. కానీ తను జీవితాంతం భరిస్తోంది. తను చాలా గొప్పది' అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment