మణిని అలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా! | Bigg Boss Telugu Today Episode Promo: Dialogue Dedication Game For Contestants In BB House, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: మణికంఠనలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా!

Published Sun, Oct 20 2024 4:05 PM | Last Updated on Sun, Oct 20 2024 5:14 PM

Bigg Boss Telugu 8: Dialogue Dedication Game in BB House

ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలిమినేషన్‌ కాస్త వింతగా జరగనుంది. పృథ్వీ స్థానంలో మణికంఠ ఎలిమినేట్‌ కానున్నాడు. తను ఫిట్‌గా ఉన్నాడని వైద్యులు సర్టిఫికెట్‌ ఇచ్చినా సరే చేతనైతలేదంటూ పంపించేయమని వేడుకున్నాడు. అతడు అంతలా అడిగితే కాదనలేక గేట్లు ఎత్తి మరీ బయటకు తీసుకొచ్చేశారని సమాచారం.

డైలాగ్‌ డెడికేషన్‌..
ఇక ఈ ఎలిమినేషన్‌ కంటే ముందు ఫన్‌ టాస్కులు జరిగాయి. అందులో ఒకటే డైలాగ్‌ డెడికేషన్‌. ఈ క్రమంలో నిఖిల్‌.. నువ్వు ఊరుకోమ్మా.. అన్నింటికీ తుత్తుత్తు అంటావ్‌.. అన్న డైలాగ్‌ను ప్రేరణకు అంకితం చేశాడు. వాడినలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా.. అన్న డైలాగ్‌ను హరితేజ మణికి అంకితమిచ్చింది. డైలాగ్‌ పర్ఫెక్ట్‌గా సెట్‌ అయిందని అందరూ చప్పట్లు కొట్టారు.

మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌..
అవును మరి మణి వాలకం అలా ఉంది.. భార్యాబిడ్డలు తిరిగి తన దగ్గరకు రావాలంటే ఈ షో గెలవాలి, ఈ బిగ్‌బాస్‌ తనకు చాలా ముఖ్యం అంటూ ఎన్నోసార్లు ఏడ్చాడు. కట్‌ చేస్తే ఈ వారం శరీరం సహకరించడం లేదంటూ, మైండ్‌ కూడా పని చేయట్లేదంటూ ఇంటికెళ్లిపోతానన్నాడు. తనకు ఓట్లు వేయొద్దని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఇదే వారం తాను సేవ్‌ అయితే అరతులం బంగారం ఇస్తానని గంగవ్వకు మాటిచ్చాడు. అంతలోనే ఇన్ని షేడ్స్‌ చూపించాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement