![Bigg Boss Telugu 8: Buzz, Naga Manikanta Eliminated From BB House](/styles/webp/s3/article_images/2024/10/19/Naga-Manikanta-E.jpg.webp?itok=XZhXIMEb)
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ఏడోవారం ముగింపుకు వచ్చింది. ఈ వారం గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, తేజ, నబీల్, మణికంఠ, ప్రేరణ, హరితేజ నామినేషన్‌లో ఉన్నారు. వీళ్లందరిలో నిఖిల్ ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంటాడన్న విషయం తెలిసిందే! నబీల్‌కు కూడా ఢోకా లేదు. యష్మి, ప్రేరణ, గౌతమ్‌కు కూడా బాగానే ఓట్లు వచ్చినట్లు సమాచారం.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/naa.jpg)
ఊహించని ఎలిమినేషన్
చివర్లో మణికంఠ, తేజ, పృథ్వీ ఉన్నారు. అయితే తేజ, పృథ్వీ.. వీళ్లిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అవొచ్చని ప్రచారం నడిచింది. దాదాపు పృథ్వీ బయటకు వెళ్లడం ఖాయని అంతా డిసైడయ్యారు. కానీ ఇక్కడే ఎవరూ ఊహించనిది జరిగింది. నాగమణికంఠను ఎలిమినేట్ చేశారు. నిజానికి ఈ వారం మణి ఆడిందేమీ లేదు. టాస్క్ ప్రారంభానికి ముందే నాకు ఆడటం చేతకాదని చేతులెత్తేశాడు.
ఎలిమినేట్
అసలే ఫిజికల్ టాస్క్.. నా బొక్కలిరిగితే, ఫ్రాక్చర్ అయితే ఎలా? అని భయంతో వెనకడుగు వేశాడు. గేమ్‌లో ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. ఫిజికల్‌గా, మెంటల్‌గా వీక్ కాదంటూనే తాను బలహీనుడిని అని తనకు తెలియకుండానే ఒప్పేసుకున్నాడు. పైగా సండే ఎపిసోడ్ షూటింగ్‌లోనూ మణికంఠ.. తాను వెళ్లిపోతా అని నాగార్జుననే అడిగేశాడంటున్నారు. మరి ఇదెంత నిజమో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment