సోనియా ఎలిమినేట్‌, ఏడ్చిన నిఖిల్‌.. చివర్లో పెద్ద ట్విస్ట్‌ ఇచ్చిన నాగ్‌! | Bigg Boss 8 Telugu Sep 29th Full Episode Review And Highlights: Sonia Akula Eliminated And Naga Manikanta Goes To Jail | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Day 28 Highlights: నన్నెవరూ ఇష్టపడరంటూ సోనియా ఎమోషనల్‌.. జైలుకు మణికంఠ

Published Sun, Sep 29 2024 11:19 PM | Last Updated on Mon, Sep 30 2024 11:05 AM

Bigg Boss Telugu 8: Sonia Akula Eliminated and Naga Manikanta Goes to Jail

ఎంతోమంది బిగ్‌బాస్‌ ప్రియులు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సోనియా ఎలిమినేట్‌ అయింది. తను వెళ్లిపోతుంటే నిఖిల్‌ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. వెళ్లిపోయేముందు కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెలిబుచ్చింది సోనియా.. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్‌ 29) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

ముందే ఊహించిన సోనియా
ఈ వారం తానే ఎలిమినేట్‌ అవుతానని సోనియా ముందే పసిగట్టింది. హౌస్‌ మొత్తం తనను తప్పుగా అర్థం చేసుకుంటోందంటూ తొలిసారి ఏడ్చేసింది. నాగ్‌ ఓదార్చే ప్రయత్నం చేయగా సోనియా తన కన్నీళ్లను దిగమించుకునేందుకు యత్నించింది. దీంతో యష్మి లేచి.. సోనియా ఒక సోదరిలా పృథ్వీ, నిఖిల్‌కు సలహాలు ఇస్తోందని, అక్కడ ఈమె తప్పే లేదని వెనకేసుకొచ్చింది. తర్వాత నాగ్‌ చిన్న ఫన్‌ గేమ్‌ ఆడించగా ఇందులో కాంతార టీమ్‌ గెలిచింది. 

సోనియా టాక్సిక్‌
అనంతరం మీకే అంకితం అనే చిట్టీల గేమ్‌ ఆడించాడు. కంటెస్టెంట్లు ఓ చీటీ తీసి అందులో ఉన్న వాక్యాన్ని ఒకరికి అంకితం చేసి వారిని చెంపదెబ్బ కొట్టాలన్నాడు. అలా మొదటగా ప్రేరణ.. హౌస్‌లో సోనియా టాక్సిక్‌ అని ఆమెను కొట్టింది. నైనిక.. విష్ణుప్రియను లౌడ్‌ స్పీకర్‌ అంది. సీత.. మణికంఠ విక్టిమ్‌ కార్డ్‌ వాడతాడంది. ఆదిత్య.. మణికంఠ నెగెటివ్‌గా ఆలోచిస్తాడని పేర్కొన్నాడు. నబీల్‌.. నిఖిల్‌ సేఫ్‌ ప్లేయర్‌ అని తెలిపాడు. పృథ్వీ.. మణికంఠ మానిప్యులేట్‌ చేస్తాడన్నాడు.

కంటెస్టెంట్ల చేతికి ఎలిమినేషన్‌ పవర్‌ 
యష్మి.. పృథ్వీ అటెన్షన్‌ సీకర్‌ అని తెలిపింది. నిఖిల్‌.. మణికంఠకు ఏ లక్ష్యం లేదన్నాడు. మణికంఠ వంతురాగా నిఖిల్‌ బయాస్‌డ్‌ అని పేర్కొన్నాడు. విష్ణు.. నైనిక ఇమ్మెచ్యూర్‌ అని అభిప్రాయపడింది. సోనియా.. విష్ణుకు సెల్ఫిష్‌ అన్న ట్యాగ్‌ ఇచ్చింది. తర్వాత నాగ్‌ ప్రేరణను, ఆదిత్యను సేవ్‌ చేశాడు. చివర్లో సోనియా, మణికంఠ మాత్రమే మిగిలారు.  మణికంఠ హౌస్‌లో ఉండేందుకు పనికిరాడని మీరన్నారు. కానీ, సోనియాకు తక్కువ ఓట్లు పడ్డాయి.. మరి వీరిద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండాలనేది మీరే నిర్ణయించాలంటూ కంటెస్టెంట్లకే పవర్‌ ఇచ్చాడు నాగ్‌.

జైలుకు మణికంఠ
ఈ క్రమంలో నిఖిల్‌, పృథ్వీ, నైనిక మాత్రమే సోనియాకు సపోర్ట్‌ చేయగా మిగతా అందరూ మణికంఠకు మద్దతిచ్చారు. దీంతో నాగ్‌.. అటు ప్రేక్షకుల ఓట్ల ప్రకారం, మెజారిటీ హౌస్‌మేట్స్‌ నిర్ణయం ప్రకారం సోనియా ఎలిమినేట్‌ అని ప్రకటించాడు.​ డేంజర్‌ జోన్‌లో ఉన్న మణి ఈ ఎపిసోడ్‌ అయిపోగానే జైల్లో ఉండాలన్నాడు. ఇక సోనియా ఎలిమినేట్‌ అవడంతో నిఖిల్‌, పృథ్వీ భావోద్వేగానికి లోనయ్యారు. 

(చదవండి: సోనియా ఎలిమినేషన్‌కు కారణాలివే!)

నేనెవరికీ నచ్చను
స్టేజీపైకి వచ్చిన సోనియా.. నేను ఉన్నదున్నట్లు మాట్లాడటం వల్ల ఎవరికీ నచ్చను. కాలేజీలోనూ అంతే, ఇక్కడా అంతే.. కానీ, ఎవరికోసమూ నా స్వభావాన్ని మార్చుకోలేను. నిఖిల్‌, పృథ్వీకి సలహాలు ఇస్తాను. కానీ, వారు నా మాటలు వినరు, నేను వాళ్లను ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయలేదు అని నొక్కి చెప్పింది. హౌస్‌మేట్స్‌ గురించి మాట్లాడుతూ.. విష్ణుప్రియ పులిహోర కలుపుతుందని, సీత.. కాకరకాయలా చేదుగా మాట్లాడుతుందని చెప్పింది. ప్రేరణ.. ఆవకాయ అని, నబీల్‌.. సాఫ్ట్‌ కుర్రాడు అని తెలిపింది. పృథ్వీ.. స్వీట్‌ పాయసం అని, యష్మి.. పెరుగన్నం అని పేర్కొంది. 

మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌
అన్నం లేకపోతే ఏదీ లేదు, అలాగే నిఖిల్‌ లేకపోతే బిగ్‌బాస్‌ హౌసే లేదంది. నైనిక.. అప్పడంలా ఈజీగా బ్రేక్‌ అవుతుందని చెప్పింది. సోనియా వెళ్లిపోతుండటంతో నిఖిల్‌ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మిస్‌ యూ అంటూ ఒకరినొకరు కళ్లతోనే సంభాషించుకున్నారు. సోనియాను పంపించేశాక.. నాగ్‌ పెద్ద ట్విస్ట్‌ ఇచ్చాడు. ఈ వారం మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ ఉండబోతుందని చెప్పాడు. అంటే.. వచ్చే ఆదివారం (అక్టోబర్‌ 5న) వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీరితోపాటే సోనియా కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement