ఆ తప్పే సోనియా కొంప ముంచింది! పారితోషికం లెక్కలివే! | Bigg Boss 8 Telugu: Sonia Akula Elimination Reasons And Her 4 Weeks Remuneration Details | Sakshi
Sakshi News home page

Soniya Elimination Reasons: సోనియా ఎలిమినేషన్‌కు కారణాలివే! రెమ్యునరేషన్‌ ఎంతంటే?

Published Sun, Sep 29 2024 10:08 PM | Last Updated on Mon, Sep 30 2024 11:03 AM

Bigg Boss 8 Telugu: Sonia Akula Elimination Reasons And Remuneration Details

తానే గొప్ప.. ఎదుటివాళ్లు తనముందు పిల్లబచ్చాలు.. అని విర్రవీగితే మొదటికే మోసం వస్తుంది. హౌస్‌లో చాలామందిని బయటకు పంపించేయాలని ఎదురుచూసింది ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల. కానీ నాలుగోవారానికే ఎలిమినేట్‌ అయ్యింది. అందుకుగల కారణాలు చాలానే ఉన్నాయి.

గ్రూప్‌ గేమ్‌
ఈ సీజన్‌లో కెప్టెన్సీకి బదులుగా చీఫ్స్‌ ఉంటారని బిగ్‌బాస్‌ ముందే వెల్లడించాడు. షో మొదలైన రెండు రోజుల్లోనే ఎవరి సత్తా ఏంటో తెలుసుకోవడం కష్టం కాబట్టి నిఖిల్‌.. తన ఫ్రెండ్‌ యష్మిని చీఫ్‌గా సెలక్ట్‌ చేశాడు. అందుకు సోనియా పెద్ద రాద్దాంతమే చేసింది. గ్రూప్‌ గేమ్‌ అంటూ నింద వేసింది.. కట్‌ చేస్తే వారానికే నిఖిల్‌ను అతడి గ్రూపులో నుంచి వెలేసి తనతో కొత్త టీమ్‌ ఏర్పాటు చేసుకుంది.

విష్ణుతో వైరం
చిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ, నిఖిల్‌తోనే ఎక్కువ ముచ్చట్లు పెడుతూ సోఫాలో సెటిలైపోయింది. వారితో ఆమె ప్రవర్తించిన తీరుకు జనాలు తలకు జండూభామ్‌ రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిఖిల్‌తో స్నేహం ఎలా కుదిరింది? అని విష్ణుప్రియ క్యాజువల్‌గా అడిగిన పాపానికి అడల్ట్రేటెడ్‌ కామెడీ అంటూ ఆమెను నిందించింది.

మితిమీరిన హగ్గులు
కట్‌ చేస్తే నిఖిల్‌తో మితిమీరిన హగ్గులు, అతడిని అభ్యంతరకరంగా టచ్‌ చేయడం చూసి జనాలు చీదరించుకున్నారు. పైగా నిఖిల్‌ను గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పడం కూడా జనాలకు మింగుడుపడలేదు. ఈమె తన గేమ్‌ పాడుచేసుకోవడమే కాక నిఖిల్‌ గేమ్‌ కూడా చెడగొడుతోందని పేరు తెచ్చుకుంది. 

గేమ్‌లో వెనుకంజ
పైగా యష్మిని. ఎంతసేపూ నిఖిల్‌, పృథ్వీనే చూస్తే ఎలా అని సెటైర్లు వేసిన ఈమె మరి ఎంతసేపూ ఆ ఇద్దరినే వెంటేసుకుని తిరుగుతే జనాలేమనుకుంటారోనని కాస్తైనా ఆలోచించకపోవడం గమనార్హం. టాస్కుల్లోనూ పెద్దగా ఆడింది లేదు, కానీ ఆడినంత బిల్డప్‌ ఇచ్చింది.

పారితోషికం ఎంతంటే?
ఆడపులి అన్న ట్యాగ్‌కు కాస్తయినా న్యాయం చేయలేదు. వెరసి నాలుగోవారమే ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. ఈ నాలుగు వారాలకుగానూ సోనియా దాదాపు రూ.6 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement