remuneration
-
హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ
హీరోలు కోట్లు సంపాదిస్తారు.. వారి కింద పనిచేసే బాడీగార్డులు కూడా లక్షలు వెనకేస్తుంటారు! స్టార్ హీరోల బాడీగార్డుల సంపాదన గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి కోట్లల్లో ఆదాయం ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. షేరా అలియాస్ గుర్మీత్ సింగ్.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు రెండు దశాబ్దాలుగా బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ఇతడికికి టైగర్ అని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ కూడా ఉంది. బాడీగార్డు ఉంటేనే అడుగు బయటకురవి సింగ్ విషయానికి వస్తే.. ఇతడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు వ్యక్తిగత అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. యూసుఫ్ ఇబ్రహీం.. ఆలియా భట్, వరుణ్ ధావన్ వంటి పలువురు హీరోహీరోయిన్లకు బాడీగార్డుగా సేవలందిస్తున్నాడు. వీరు సెలబ్రిటీలు ఇల్లు దాటి బయటకు వెళ్లినప్పుడు వారికి రక్షణగా నిలుస్తారు. ఈవెంట్లకు వెళ్లినా, ఎక్కడికైనా ప్రయాణించినా సదరు నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.బాడీగార్డులకు కోట్లల్లో ఆదాయం?సెలబ్రిటీటల పట్ల అంకితభావంతో పనిచేసే వీరు బాగానే డబ్బు కూడబెడతారని ఫిల్మీదునియాలో ఓ టాక్ ఉంది. దీనిపై హీరోయిన్ ఆలియా భట్ బాడీగార్డ్ యూసఫ్ ఇబ్రహీం(Bollywood bodyguard Yusuf Ibrahim) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముందుగా షారూఖ్ బాడీగార్డ్ రవి సింగ్ ఏడాదికి రూ.2.7 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించాడు. చూడండి.. ఎవరెంత సంపాదిస్తున్నారనేది మాకు తెలియదు. ఒకరి ఆదాయం మరొకరికి తెలియదు. తెలిసే అవకాశమే లేదు అన్నాడు. మీకు తెలియకుండా ఉంటుందా? అని యాంకర్ అడిగినప్పటికీ అతడు తెలీదనే అడ్డంగా తలూపాడు. మరి సల్మాన్ బాడీగార్డ్ షేరా రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడంటున్నారు.. ఇది నిజమేనా? అన్న రెండో ప్రశ్న ఎదురైంది.(చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు, ఎందుకంటే?)నెలకు రూ.10 లక్షలు ఈజీగా..దీనికి ఇబ్రహీం స్పందిస్తూ.. షేరాకు సొంత బిజినెస్ ఉంది. అతడికంటూ ప్రత్యేకంగా సెక్యురిటీ కంపెనీ ఉంది. ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఉండొచ్చు. కాబట్టి రెండు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది అని సమాధానమిచ్చాడు. అక్షయ్ కుమార్ అంగరక్షకుడు శ్రేసయ్ తేలే ఏడాదికి రూ.1.2 కోట్లు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటన్న ప్రశ్నకు.. అతడి వ్యక్తిగత సమాచారం నా దగ్గర లేదు. అయినా నెలకు రూ.10-12 లక్షల ఆదాయం వేసుకున్నా ఏడాదికి రూ.1 కోటి ఈజీగా దాటుతుంది.కొన్నిసార్లు లెక్క మారుతుందికానీ కొన్నిసార్లు అంత డబ్బు రాకపోవచ్చు. ఎందుకంటే కొందరు షూటింగ్‌కు, ఈవెంట్స్‌కు, ప్రమోషన్స్‌కు వేర్వేరుగా డబ్బు లెక్కగడుతుంటారు. దాన్ని బట్టి సెలబ్రిటీలు ఎలాంటి కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్తున్నారో దాని ఆధారంగానే డబ్బిస్తారు. పైగా ఆయా సెలబ్రిటీ నెలలో ఎన్ని రోజులు పని చేస్తున్నాడనేదానిపై కూడా మా జీతం ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ ఎవరికి నచ్చినట్లు వారు లెక్కలు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నామని ఫిక్సయిపోయారు. కానీ సాధారణ బాడీగార్డులైతే నెలకు రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది అని ఇబ్రహీం చెప్పుకొచ్చాడు.చదవండి: చికెన్‌గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! -
15 కోట్లు రెమ్యునరేషన్.. పెంచేసిన సౌత్ హీరోయిన్
-
Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!
ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే యంగ్ హీరోల్లో రామ్ చరణ్(Ram Charan) ముందు వరుసలో ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్.. తనదైన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ రేంజ్‌కు చేరాడు. ఆయన నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చినా.. చరణ్‌లో మాత్రం కించిత్తు అహం కూడా పెరగలేదు. ఆయనపై వచ్చిన రూమర్స్ కూడా చాలా తక్కువే. నిర్మాతలతో పాటు అందరితోనూ చాలా అనోన్యంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని తోటి నటీనటులు చెబుతుంటారు. తాజాగా వినిపిస్తున్న ఓ వార్త రామ్ చరణ్‌లో మంచితనం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తుంది. గేమ్ ఛేంజర్ కోసం తన రెమ్యునరేషన్‌ను భారీగా తగ్గించుకున్నట్లు తెలుస్తుంది.(చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. కేవలం పాటలకే అన్ని కోట్లా?)పెరిగిన బడ్జెట్ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత సినిమా బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్ల అనుకున్నారట. అందులో రామ్ చరణ్ రెమ్యునరేషన్‌నే దాదాపు 100 కోట్లు అని ప్రచారం జరిగింది. చరణ్ కూడా ముందే అంతే స్థాయిలో తీసుకుంటానని చెప్పారట. కానీ బడ్జెట్ పెరగడంతో రెమ్యునరేషన్ తగ్గించారట. ఈ సినిమాకు మొత్తంగా రూ. 500 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావడంతోనే బడ్జెట్ పెరిగింది.చరణ్‌తో పాటు శంకర్ కూడారామ్ చరణ్‌కు మొదటి నుంచి ఒక అలవాటు ఉందట. సినిమా ఒప్పుకున్న వెంటనే రెమ్యునరేషన్ తీసుకోడట. షూటింగ్ మొత్తం పూర్తయిన చెప్పిన అమౌంట్ తీసుకుంటాడు. గేమ్ ఛేంజర్ విషయంలోనూ రామ్ చరణ్ అదే ఫాలో అయ్యాడు. తొలుత రూ. 100 కోట్లు తీసుకుంటానని చెప్పాడు. కానీ బడ్జెట్ పెరగడంతో చరణ్ తన రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.35 కోట్లను తగ్గించి రూ. 65 కోట్లను మాత్రమే పారితోషికంగా పుచ్చుకున్నారట. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటించిన ఈ చిత్రానికి అది చాలా తక్కువ రెమ్యునరేషనే. శంకర్ కూడా తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించి రూ. 35 కోట్లతో సరిపెట్టుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. చరణ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో మనసు చాలా మంచిది..తక్కువే తీసుకొని ఉంటాడని అంటున్నారు. -
గతంలో కంటే రెట్టింపు పారితోషికం, అవేవీ ఎపిసోడ్లో వేయలేదు: గౌతమ్
అశ్వత్థామకు చావు లేదన్నది అందరికీ తెలుసు. కానీ ఈ అశ్వత్థామకు తిరుగులేదని నిరూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో తనకు తాను అశ్వత్థామ అన్న బిరుదు ఇచ్చుకున్నాడు. అప్పుడు తనపై సెటైర్లు వేసినవాళ్లే.. ఎనిమిదో సీజన్‌కు వచ్చేసరికి చప్పట్లు కొట్టారు. గౌతమ్ మాట తీరు, ఆటతీరుకు ఫిదా అయ్యారు. ఈ సీజన్ రన్నరప్‌గా నిలిచిన్నప్పటికీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న గౌతమ్ తాజాగా సాక్షి.కామ్‌తో ముచ్చటించాడు. ఆ విశేషాలు చూసేయండి..ట్రోలింగ్‌పై మీ అభిప్రాయం?గౌతమ్: గత సీజన్లో నేను కొన్ని పొరపాట్లు చేశాను. అందుకు నాపై ట్రోలింగ్ జరిగింది. తర్వాత నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకుని ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టాను. మొదటివారం ఎలిమినేషన్ అంచున నిలబడినప్పుడు బాధపడ్డాను. కానీ నాకు ఒక అవకాశం వచ్చిందన్నప్పుడు ధృడంగా నిలబడ్డాను, గట్టిగా ఆడాను. అశ్వత్థామ అంటే ట్రోల్ చేసినవారే మళ్లీ అదే పేరుతో పొగిడారు. నాకెంతో పాజటివిటీ దొరికింది. ఈ జర్నీని నేనెప్పటికీ మర్చిపోలేను.ఫినాలే వరకు రావడానికి మణికంఠ కారణమని భావిస్తున్నారా?గౌతమ్: లేదు. ఒక్క వారం మణికంఠ వల్ల సేవ్ అయ్యాను. కానీ ఫినాలే వరకు నా స్వయంకృషితో వచ్చాను.చిరంజీవి సతీమణి సురేఖగారిని ఎప్పుడు కలుస్తారు?గౌతమ్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని త్వరలోనే కలుస్తాను.గత సీజన్లో నాగార్జున గ్రూప్ గేమ్స్ తప్పన్నారు. ఈ సీజన్లో మాత్రం గ్రూప్ గేమ్స్ తప్పేం కాదని వెనకేసుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయం?గౌతమ్: నేనూ చాలా మీమ్స్‌లో చూశాను. ఫ్రెండ్స్‌గా ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆడటం తప్పు కాదు. కానీ గ్రూప్‌గా ఉంటూ వేరేవాళ్లను టార్గెట్ చేయడం తప్పు. అది నాకు నచ్చలేదు.విన్నర్ అయినందుకు నిఖిల్‌ను అభినందించారా?గౌతమ్: ఫినాలే స్టేజీపై వెంటనే కంగ్రాట్స్ చెప్పాను. కానీ ఎపిసోడ్లో వేయలేదు. అలాగే నాగార్జునగారు కూడా నేను చరిత్ర సృష్టిస్తానని మెచ్చుకున్నారు. అది కూడా ఎపిసోడ్లో వేయలేదు.రెమ్యునరేషన్ సంతృప్తికరంగా ఉందా?గౌతమ్: గత సీజన్ కంటే రెట్టింపు పారితోషికం ఇచ్చారు.చదవండి: ప్రెగ్నెంట్ అని తెలియగానే షాకయ్యా..: రాధికా ఆప్టే -
బిగ్‌బాస్: మూడు రోజులకే రూ.2.5 కోట్లు! ఎవరికో తెలుసా?
రియాలిటీ షోలకు బాస్.. బిగ్‌బాస్. ఈ షోను ఆదరించేవాళ్లు ఎంతోమంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో విజయవంతంగా రన్ అవుతోంది. షో గెలిచినవారికి కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ ఇస్తుంటారు. తెలుగులో విజేతకు రూ.50 లక్షలు ఇస్తుండగా హిందీలో మొదట్లో రూ.1 కోటి ఇచ్చేవారు. ఆరో సీజన్ నుంచి మాత్రం అది తగ్గుతూ వచ్చింది. కోట్లల్లో రెమ్యునరేషన్మధ్యలో రూ.30 లక్షలదాకా వెళ్లిన ప్రైజ్‌మనీ ప్రస్తుత సీజన్లో మాత్రం రూ.50 లక్షలుగా ఉంది. అయితే వీటితో సంబంధం లేకుండా కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ కూడా ఇస్తుంటారు. కొందరు ఈ పారితోషికం రూపంలోనే లక్షలు, కోట్లు సంపాదించారు. అలా బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్నది ఎవరో తెలుసా? కెనడియన్ నటి పమేలా ఆండర్సన్. ఈమె హిందీ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది. సెకండ్ ప్లేస్‌లో ఎవరంటే?ముచ్చటగా మూడు రోజులు హౌస్‌లో ఉండి వెళ్లిపోయింది. అందుకుగానూ రూ.2.5 కోట్ల పారితోషికం తీసుకుందట! కాగా పమేలా.. స్కూబీ డూ,స్నేరీ మూవీ 3, స్నాప్‌డ్రాగన్ చిత్రాలతో పాటు బేవాచ్ యాక్షన్ సిరీస్‌లోనూ నటించింది. చివరగా ద లాస్ట్ షోగర్ల్ అనే సినిమాతో మెప్పించింది. ఈ బ్యూటీ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న కంటెస్టెంట్ గ్రేట్ ఖాలి అని తెలుస్తోంది. ఇతడు వారానికి రూ.50 లక్షలవరకు తీసుకున్నాడట! తర్వాతిస్థానంలో కరణ్వీర్ బొహ్ర రూ.20 లక్షలు అందుకున్నట్లు భోగట్టా!చదవండి: ఆస్కార్‌లో నిరాశ.. లాపతా లేడీస్‌ను సెలక్ట్ చేయడమే తప్పంటున్న డైరెక్టర్ -
భాష మారింది.. కీర్తి సురేశ్ రెమ్యునరేషన్ డబుల్?
'మహానటి' కీర్తి సురేశ్ తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిపోయింది. పేరుకే మలయాళీ గానీ టాలీవుడ్లోనే స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసింది. రీసెంట్గా ఆంటోని తట్టిళ్ అనే బిజినెస్‌మ్యాన్ పెళ్లి చేసుకుంది. మరోవైపు ఈమె నటించిన తొలి హిందీ సినిమా 'బేబీ జాన్'.. వచ్చే వారం క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పుడు ఈ మూవీ కోసం డబుల్ రెమ్యునరేషన్ తీసుకుందనే టాక్ నడుస్తోంది.ప్రముఖ నిర్మాత సురేశ్, ఒకప్పటి హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేశ్.. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ ఏడాది రిలీజైన ప్రభాస్ 'కల్కి'లో కారుకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎంటర్టైన్ చేసింది. ఈమె నటించిన 'బేబీ జాన్' అనే హిందీ మూవీలో నటించింది. తమిళ సినిమా 'తెరి' రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త)ఒరిజినల్ సినిమాలో సమంత కనిపించిన పాత్రలో ఇప్పుడు కీర్తి సురేశ్ నటించింది. సౌత్‌లో నటిస్తే రూ.2 కోట్లు ఈమెకు ఇస్తారు. కానీ 'బేబీ జాన్'లో నటించినందుకుగానూ రూ.4 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట. బహుశా అందుకేనేమో గ్లామర్ విషయంలోనూ తగ్గేదే లే అన్నట్లు పాటల్లో కనిపించింది!ఇదే సినిమాలో నటించిన మిగతా నటీనటులు రెమ్యునరేషన్ విషయానికొస్తే హీరో వరుణ్ ధావన్‌కి రూ.15 కోట్లు పైనే ఇచ్చారట. విలన్‌గా చేసిన జాకీ ష్రాఫ్‌కి కోటిన్నర, మరో హీరోయిన్గా చేసిన వామికా గబ్బికి కోటి రూపాయలు, కీలక పాత్ర చేసిన సన్యా మల్హోత్రాకు రూ.40 లక్షల పారితోషికం ఇచ్చారట. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇతడి శిష్యుడు కలీస్ దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
బిగ్‌బాస్ విన్నర్‌గా నిఖిల్.. ప్రైజ్‌మనీతోపాటు ఏం సాధించాడంటే?
సరైనోడు, దమ్మున్నోడు, జెంటిల్మెన్.. ఇలాంటి ట్యాగులన్నీ నిఖిల్‌కు సరిగ్గా సరిపోతాయి. ఎంత కోపం వచ్చినా అది క్షణకాలం మాత్రమే! వంద రోజుల జర్నీలో అతడు కంట్రోల్ తప్పిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టుకోవచ్చు. ఎవరెన్ని నిందలు వేసినా తనలో తను బాధపడ్డాడే తప్ప తిరిగి ఒక్కమాట కూడా అనలేదు. ఫిజికల్ టాస్కుల విషయానికి వస్తే అతడిని ఢీ కొట్టేవాడే లేడన్నంతగా రెచ్చిపోయాడు. నిందలు పడ్డ చోటే నిలబడ్డాడునిఖిల్ ఆటలో అడుగుపెడితే వార్ వన్‌సైడ్ అయిపోద్ది అన్న లెవల్లో ఆడాడు. ఈ క్రమంలో తనకు దెబ్బలు తగిలినా లెక్కచేయలేదు. కంటెస్టెంట్ల సూటిపోటి మాటల వల్ల హౌస్‌ను వీడాలనుకున్నాడు. కానీ తనను ప్రేమించిన ప్రేక్షకుల కోసం మాటలు పడ్డ చోటే నిలబడాలనుకున్నాడు. ఆటతోనే సమాధానం చెప్పాడు. వేలెత్తి చూపించినవారితోనే చప్పట్లు కొట్టేలా చేశాడు. (Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)సంపాదన ఎంత?సీరియల్ యాక్టర్‌గా పేరు గడించిన నిఖిల్ బిగ్‌బాస్ ప్రియుల మనసు గెలుచుకుని ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. దీనితోపాటు మారుతి డిజైర్ కారు అదనపు బహుమతిగా లభించనుంది. ఇకపోతే నిఖిల్ వారానికి రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నాడట! ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ. 88 లక్షలు వెనకేశాడు. చదవండి: కోరిక మిగిలిపోయిందన్న తేజ.. నాగార్జున బంపరాఫర్ -
ఆడు మగాడ్రా బుజ్జి.. గౌతమ్ కృష్ణ సంపాదన ఎంతంటే?
ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి, వేలెత్తిచూపించినవారే తలదించుకునేలా చేయాలి.. తిట్టినవారితోనే పొగిడించుకోవాలి.. ఇవన్నీ చేసి చూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అతడు ఏం కోల్పోయాడో దాన్ని ఈ సీజన్లో తిరిగి సంపాదించాడు. అప్పుడు మూటగట్టుకున్న నెగెటివిటినీ తన మాటతీరుతో, ఆటతీరుతో కడిగిపారేశాడు.(Bigg Boss 8: నబీల్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నప్పుడు నవ్వినవాళ్లే ఈడు మగాడ్రా బుజ్జి అంటున్నారు! బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి వైల్డ్ ఫైర్‌లా మారాడు. టైటిల్ రేసులో ఉన్న నిఖిల్‌కు గట్టి పోటీనిచ్చాడు. గతంలో ఫైనల్స్‌కు రాకుండానే వెనుదిరిగిన గౌతమ్ ఇప్పుడేకంగా టాప్ 2లో చోటు దక్కించుకున్నాడు. వారానికి రూ.1.75 లక్షల చొప్పున సంపాదించాడు. అంటే బిగ్‌బాస్ హౌస్‌లో పారితోషికం రూపేణా పది వారాలకుగానూ దాదాపు రూ.17,50,000 వెనకేసినట్లు తెలుస్తోంది.(చదవండి: బిగ్‌బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?) -
బిగ్‌బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?
అందాల రాక్షసి.. బిగ్‌బాస్ ప్రేరణకు అంకితమిచ్చిన ట్యాగ్‌లైన్ ఇది. ఈ అందాల భామకు ముక్కు మీద కోపం. ఎవరైనా ఒక్క మాటంటే దానికి పది మాటలు తిప్పి కొడుతుంది. తనను చులకన చేస్తే బుసకొట్టిన పాములా లేస్తుంది. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడుతుంది. మగవాళ్లకు బలమైన పోటీ ఇస్తుంది. బుద్ధిబలం కూడా మెండు.విపరీతమైన నెగెటివిటీకానీ నోటిదురుసే ఎక్కువ! సిగ్గు లేదా? క్యారెక్టర్‌లెస్? ఆ ముఖం చూడు.. ఇలాంటి మాటలన్నీ తన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలే! మెగా చీఫ్ అయ్యాక నా మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తించింది. తిండి దగ్గర కూడా ఆంక్షలు పెట్టి అభాసుపాలైంది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. పారితోషికం ఎంతంటే?కానీ తప్పు ఎక్కడ జరుగుతుందో వెంటనే తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అందుకే టాప్ 5లో నిలబడిన ఏకైక మహిళగా నిలిచింది. తనకు సూట్‌కేస్ ఆఫర్ చేసినా నిర్మొహమాటంగా నో చెప్పింది. ప్రేక్షకులు తనను ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్తానని నిలబడింది. నాలుగో స్థానంలో వీడ్కోలు తీసుకుంది. ప్రేరణ వారానికి రూ.2 లక్షల చొప్పున పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.30 లక్షలు వెనకేసిందట!చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం.. -
విన్నర్ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!
బిగ్‌బాస్ షో ప్రారంభమైన ప్రతిసారి జనాల్లో మెదిలే ప్రశ్న.. ఈసారైనా లేడీ కంటెస్టెంట్ గెలుస్తారా? అని! ఈ సీజన్లోనూ ఆ చర్చ జరిగింది. భారీ ఫ్యాన్ బేస్‌తో హౌస్‌లో అడుగుపెట్టిన విష్ణుప్రియకు ట్రోఫీ గెలిచే అవకాశం పుష్కలంగా ఉండేది. కానీ తన ఆటను చెడగొట్టుకోవడానికి ఎవరూ అక్కర్లేదు, తాను చాలు అన్నట్లే ప్రవర్తించింది.స్వచ్ఛతకు మారుపేరు విష్ణుగేమ్పై కాకుండా పృథ్వీపై ఫోకస్ చేసింది. తనకంట కూడా అతడే ఎక్కువ అని బాహాటంగానే ప్రకటించింది. భూతద్దం వేసి వెతికినా ఎక్కడా తనలో గెలవాలన్న కసి కనిపించలేదు. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాక ఆటలో యాక్టివ్ అయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఆమె నిర్మొహమాటంగా, నిజాయితీగా వ్యవహరించే తీరు మాత్రం జనాలకు బాగా నచ్చేసింది.విన్నర్ కంటే ఎక్కువ సంపాదనకానీ టైటిల్ గెలవాలంటే ఆ ఒక్కటే ఉంటే సరిపోదు కదా! లేడీ విన్నర్ అవాలనుందన్న విష్ణు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఫలితంగా పద్నాలుగోవారం ఎలిమినేట్ అయింది. అయితే విన్నర్ కంటే ఎక్కువ సంపాదించేసింది. వారానికి సుమారు రూ.4 లక్షల చొప్పున పారితోషికం తీసుకుంటున్న ఈమె పద్నాలుగువారాలకు గానూ రూ.56 లక్షలు వెనకేసిందట! అంటే విన్నర్ ప్రైజ్‌మనీ కంటే కూడా విష్ణు ఎక్కువే సంపాదించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?
బిగ్‌బాస్ 8వ సీజన్ చివరకొచ్చేసింది. మరో వారంలో షో ముగిసిపోనున్న దృష్ట్యా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇందులో భాగంగా రోహిణిని శనివారం బయటకు పంపేశారు. ఫినాలేలో అడుగుపెట్టనప్పటికీ మంచి గుర్తింపుతో పాటు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ఇంతకీ రోహిణి ఎన్ని వారాలు ఉంది? ఎన్ని లక్షలు సంపాదించింది?వచ్చేవారమంతా ఫినాలే వీక్ కాబట్టి.. టాప్-5ని మాత్రమే పంపించాలి కాబట్టి ఇప్పుడు రోహిణిని పంపించారు. ఆదివారం ఎపిసోడ్లో విష్ణుప్రియని ఎలిమినేట్ చేయబోతున్నారు. కాసేపు విష్ణుప్రియ గురించి పక్కనబెడితే రోహిణి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. అప్పటివరకు నీరసంగా ఉన్న షోని కాస్త అవినాష్‌తో కలిసి ఎంటర్టైన్ చేస్తూ కాస్త రేటింగ్స్ వచ్చేలా చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ')రోహిణిని అయితే పృథ్వీ, విష్ణుప్రియ లాంటి వాళ్లు అసలు నువ్వు కామెడీ చేయడానికి తప్పితే ఎందుకు పనికిరావ్ అని నానా మాటలు అన్నారు. దీంతో తను కేవలం కామెడీకి మాత్రమే కాదని, గేమ్స్ కూడా ఆడగలనని నిరూపించింది. తనని మాటలన్నా పృథ్వీపైనే గెలిచి అదరగొట్టేసింది. అయితే టాప్-5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రోహిణి.. బిగ్ బాస్ 8వ సీజన్లో దాదాపు 9 వారాల పాటు ఉంది. హౌసులోకి వచ్చేముందు వారానికి రూ.2లక్షల చొప్పున ఈమె అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.18 లక్షల వరకు పారితోషికం సొంతం చేసుకున్నట్లే. గతంలో ఈమె బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈసారి మాత్రం అటు డబ్బు, ఇటు మరింత గుర్తింపు రోహిణికి దక్కడం విశేషం.(ఇదీ చదవండి: రోహిణితో పాటు విష్ణుప్రియ అవుట్.. ఆ తప్పిదం వల్లే ఎలిమినేట్!) -
'పుష్ప 2' రెమ్యునరేషన్.. ఎవరికెంత ఇచ్చారు?
మరికొన్ని గంటల్లో 'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. హైప్ అయితే గట్టిగానే ఉంది. మరోవైపు టికెట్ రేట్ల గురించి కాస్తంత విమర్శలు వచ్చాయి గానీ ఆ ప్రభావం, బుకింగ్స్‌పై మాత్రం కనిపించట్లేదు. తొలి భాగం తీసేటప్పుడు ఓ తెలుగు సినిమాగానే రిలీజ్ చేశారు. కానీ తర్వాత తర్వాత నార్త్‌లోనూ దుమ్మురేపింది. దీంతో అంచనాలు, బడ్జెట్, మూవీ స్కేల్ అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు నటీనటులు పారితోషికాలు కూడా గట్టిగానే ఉన్నాయండోయ్. ఇంతకీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు?'పుష్ప' తొలి పార్ట్ రిలీజ్ ముందు వరకు బన్నీ అంటే తెలుగు రాష్ట్రాలు, మహా అయితే కేరళ వరకు తెలుసేమో! కానీ ఇది సృష్టించిన ప్రభంజనం దెబ్బకు ఉత్తరాదిలోనూ బన్నీ పేరు గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత 'పుష్ప' మూవీకిగానూ జాతీయ అవార్డ్.. ఇలా రేంజ్ పెరుగుతూనే పోయింది. దీంతో సీక్వెల్ విషయంలో రెమ్యునరేషన్ బదులు లాభాల్లో షేర్ తీసుకోవాలని బన్నీ నిర్ణయం తీసుకున్నాడు. కట్ చేస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు దాటేసింది. అలా రూ.270-80 కోట్ల మొత్తం బన్నీ పారితోషికంగా అందుకున్నాడట.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ 'ప్లానెట్ స్టార్'.. ఆర్జీవీ ట్వీట్ వైరల్)బన్నీ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ది హయ్యస్ట్. తొలి పార్ట్ కోసం కేవలం దర్శకుడిగా పనిచేసిన ఇతడు.. సీక్వెల్‌కి వచ్చేసరికి తన సుకుమార్ రైటింగ్స్ సంస్థతో నిర్మాణంలోనూ భాగమయ్యాడు. అలా డైరెక్టర్ కమ్ నిర్మాతగా రూ.100 కోట్ల పైనే రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది. మిగిలిన నటీనటుల విషయానికొస్తే హీరోయిన్ రష్మికకు రూ.10 కోట్లు, ఫహాద్ ఫాజిల్‌కి రూ.8 కోట్లు, ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి రూ.5 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట.వీళ్లు కాకుండా సినిమాలోని ఇతర కీలక పాత్రలు చేసిన జగపతిబాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ లెక్కన చూసుకుంటే రూ.600 కోట్ల మేర మూవీకి బడ్జెట్ అయిందని అంటున్నారు. కానీ ఇందులో సగం బడ్జెట్, పారితోషికాలకే సరిపోయాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే అంతమంది స్టార్స్ పనిచేశారు మరి!(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్) -
'కిస్సిక్' కోసం భారీ రెమ్యునరేషన్.. స్పందించిన శ్రీలీల
ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసిన ‘పుష్ప 2’ మూవీ గురించే మాట్లాతున్నారు. ఇక ఇటీవల విడుదలైన స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ అయితే యూట్యూబ్‌లో దుమ్ము దులిపేస్తుంది. ఈ పాటకు అల్లు అర్జున్, శ్రీలీల వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పాటు ఈ పాటపై మరో ఆసక్తికర గాసిప్ కూడా నెట్టింట హల్చల్ చేస్తుంది. అదే శ్రీలీల రెమ్యునరేషన్. ఈ ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ తీసుకుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఓ భారీ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో ఈ పాటకు అంతే మొత్తంలో డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా శ్రీలీల అడిగినంత డబ్బు ఇచ్చారని నిన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకారుపై శ్రీలీలతో పాటు నిర్మాతలు స్పందించారు.వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్- శ్రీలీల జంటగా రాబిన్‌హుడ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాబిన్‌హుడ్ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నితిన్, శ్రీలీలతో పాటు దర్శకుడు వెంకీ, నిర్మాత రవి, నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్ప ఐటమ్ సాంగ్ రెమ్యునరేషన్‌పై శ్రీలీలకు ప్రశ్న ఎదురైంది. ‘కిస్సిక్’ సాంగ్ కోసం సినిమా స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారట కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘అసలు ఇప్పటి వరకు రెమ్యునరేషన్ మ్యాటరే మా మధ్య జరగలేదని అటు శ్రీలీల, ఇటు నిర్మాతలు చెప్పుకొచ్చారు. ‘అంత ఇంత అని ఏమి అనుకోలేదు. అవకాశం వచ్చింది చేసేశా. ఇంకా డబ్బుల గురించి మాట్లాడలేదు’అని శ్రీలీల అన్నారు. నిర్మాతలు, నవీన్ మాట్లాడుతూ..‘రెమ్యునరేషన్ టాపికే శ్రీలీల తీయలేదు. మీరు అనుకున్నంత రెమ్యునరేషన్ అయితే ఇవ్వలేదు’అని క్లారిటీ ఇచ్చారు.ఇక పుష్ప 2 విషయానికొస్తే.. అల్లు అర్జున్- రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
స్ట్రాంగ్ ఉమెన్.. ఆ తప్పుల వల్లే యష్మి ఎలిమినేట్!
యష్మి గౌడ.. స్ట్రాంగ్ ఉమెన్, టాప్ 5 కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. ఆ రేంజ్లో ఉండేది యష్మి ఆట. తను టాస్క్‌లో దిగితే ఎలాగైనా గెలవాల్సిందే అన్నంత కసిగా ఆడేది. ఆడపులి అన్న సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకున్న సోనియాకే చుక్కలు చూపించింది. తనలో ఫైర్ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కానీ తర్వాతి వారాల్లో యష్మి ఆట గాడితప్పింది.సంచాలక్‌గా వరస్ట్ప్లేయర్గా బెస్ట్ అనిపించుకున్నా సంచాలక్‌గా వరస్ట్ గేమ్స్ ఆడింది. ఎప్పుడైతే నిఖిల్‌పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టిందో అప్పటినుంచి తన డౌన్‌ఫాల్ మొదలైంది. అతడిని ఎవరైనా నామినేట్ చేసినా ఈవిడే తెగ ఫీలైపోయేది. అతడితో డ్యాన్స్ చేయడం కోసం విష్ణుప్రియతో విపరీతంగా గొడవపడింది.నిఖిల్ చుట్టూ గేమ్తన కోసం గేమ్ ఆడటం మానేసి ఎవరికోసమో పాకరిల్లడమేంటని ఫ్యాన్స్ సైతం హర్టయ్యారు. ఫ్రెండ్‌లా అయినా ఉండరా అంటూ అతడి వెంట పడ్డ యష్మి ఈ వారం నామినేషన్లో మాత్రం అతడిపై ఏ ఫీలింగ్స్ లేవని ప్లేటు తిప్పేయడం మరింత షాక్‌కు గురిచేసింది. ఇలా మాట మార్చడాల వల్ల ఆమె తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. పారితోషికం ఎంత?చివరకు తన ఏడుపు కూడా ఫేక్ అని జనాలు ముద్ర వేసే స్థాయికి దిగజారిపోయింది. ఫైనల్‌గా ఈ వారం ఎలిమినేట్ అయింది. ఇకపోతే యష్మి.. ఒక్కవారానికిగానూ రూ.2.50 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. 12 వారాలకుగానూ ఆమె రూ.30 లక్షలు వెనకేసిందన్నమాట!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రెమ్యునరేషన్ పెంపు.. అంత పిచ్చోడిని కాదన్న హీరో!
సినిమా హిట్టయిందంటే చాలు చాలామంది రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. అలాంటిది బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు రూ.50 కోట్లు పెట్టి తీసిన స్త్రీ 2 సినిమాతో రూ.700 కోట్లు సాధించాడు. ఇంతటి ఘన విజయం తర్వాత ఆ హీరో కూడా రేటు పెంచేశాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అందుకుంటున్న పారితోషికానికి అదనంగా మరో రూ.5 కోట్లు అడుగుతున్నాడట! అంత తెలివితక్కువవాడిని కాదుఈ పుకార్లపై రాజ్‌కుమార్ స్పందించాడు. నా నిర్మాతలను కాల్చుకుతినేంత తెలివితక్కువవాడిని కాదు. బ్లాక్‌బస్టర్ సినిమా చేసినంతమాత్రాన నేనేమీ మారిపోను. డబ్బు కన్నా నాకు ప్యాషనే ముఖ్యం. ఛాలెంజ్, సర్ప్రైజింగ్ రోల్స్ చేస్తూ మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే స్త్రీ 2 సినిమాకుగానూ రాజ్‌కుమార్ రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.సినిమా..స్త్రీ 2 విషయానికి వస్తే.. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో వచ్చిన హిట్ మూవీ స్త్రీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రం ఆగస్టు 15న విడుదలవగా.. ప్రపంచవ్యాప్తంగా వందలకోట్లు వసూలు చేసింది. స్త్రీ 2 అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చదవండి: వైల్డ్‌కార్డ్ విన్నరేంటి? ఇది అధర్మం కాదా?: అభయ్ నవీన్ -
పుష్ప-2 లో శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
-
బాలీవుడ్ ఖాన్స్ రెమ్యునరేషన్ కలిపినా ప్రభాస్ రెమ్యునరేషన్ కి సరిపోదు
-
అందులో నిజం లేదు!
‘‘జుడ్వా 2’, ‘డంకీ’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటించినందుకు పెద్ద మొత్తంలో నేను పారితోషికం అందుకున్నానని చాలామంది భావిస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు’’ అంటున్నారు హీరోయిన్ తాప్సీ. బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లలో తాప్సీ ఒకరు. ఓ వైపు హీరోలకి జోడీగా వాణిజ్య చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ దూసుకెళుతున్నారు ఈ బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ హీరో, హీరోయిన్ల మధ్య పారితోషికం వ్యత్యాసంపై స్పందించారు. ‘‘వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆలోచిస్తాను. పారితోషికం విషయంలో నటీనటుల మధ్య వ్యత్యాసం ఉంటుందని అందరికీ తెలుసు.‘జుడ్వా 2’, ‘డంకీ’ సినిమాలకు నేను భారీగా పారితోషికం అందుకున్నానని పలువురు భావిస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నప్పుడు కొందరు నిర్మాతలు ఏదో మాపై దయ చూపుతున్నట్లు వ్యవహరిస్తారు. మా సినిమాలో పెద్ద హీరో ఉన్నాడు. వేరే వాళ్లను ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నట్లు వారి ప్రవర్తన ఉంటుంది.. మరికొంతమంది ‘మేము మంచి ప్రాజెక్టులు ఇచ్చి మీ కెరీర్ ఉన్నతి కోసం సాయం చేస్తున్నాం.. డబ్బుదేముంది’ అన్నట్లు మాట్లాడతారు. ఇలాంటి మాటలపై నేను ప్రతిరోజూ పోరాటం చేస్తున్నాను. పెద్ద ప్రొడక్షన్స్‌లో హీరోయిన్ల పాత్రలపై చిన్నచూపు ఉంటుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్‌గా మారాయి. -
బిగ్‌బాస్: నయని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ వైల్డ్‌కార్డులు వచ్చాకే అంతో ఇంత ఆసక్తికరంగా మారింది. అయితే వాళ్లు వచ్చిన మొదటివారం తప్ప తర్వాత వాళ్లే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. మొదట మెహబూబ్ ఎలిమినేట్ అవగా ఇప్పుడు నయని పావని అవుట్ అయింది. ఆటపై కసి ఉన్నా ఎమోషన్స్‌పై కంట్రోల్ లేకపోవడంతో గేమ్ బోల్తా కొట్టింది. ఎంత సంపాదించిందంటే?పదేపదే ఏడుస్తూ ఉంటే చూడటానికి ప్రేక్షకులకు చిరాకు వేసింది. అలా తొమ్మిదోవారం ఎలిమినేట్ అయింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హౌస్‌లో నాలుగు వారాలు ఉంది. వారానికి రూ.1,50,000 చొప్పున మొత్తం రూ.6 లక్షల మేర సంపాదించినట్లు తెలుస్తోంది.అప్పుడు వారమే.. ఈసారి నెల!కాగా నయని గత సీజన్లోనూ వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు కేవలం వారం మాత్రమే ఉండి వెళ్లిపోయింది. ఈ సీజన్లో ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలనుకుంది. ఆటపై బాగానే ఫోకస్ పెట్టింది. కానీ ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ ఏడవడం ఆమెకు మైనస్ అయింది. పైగా ఆటలో గెలిచింది లేదు కానీ గొడవల్లో మాత్రం ముందు ఉందన్న పేరు సంపాదించుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కోటి రెమ్యూనరేషన్ అందుకున్న ఇండియన్ తొలి హీరో ఎవరు.. ఏ సినిమాకు? (ఫోటోలు)
-
CJI DY Chandrachud: జూనియర్లకు సరైన వేతనాలివ్వండి
న్యూఢిల్లీ: ‘‘న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, నైపుణ్యాలు పెంచుకోవడానికి మీ వద్ద పనిచేసే యువతకు సరైన వేతనాలు, పారితోషికాలు చెల్లించడం మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి’’ అని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచించారు. న్యాయవాద వృత్తి చాలా సంక్లిష్టమైందని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న నైపుణ్యాలే యువ న్యాయవాదులను ముందుకు నడిపిస్తాయని, అవి వారికి జీవితాంతం తోడ్పడుతాయని తెలిపారు. పునాది బలంగా ఉండాలని పేర్కొన్నారు. తాజాగా ఆలిండియా రేడియో ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ వృత్తిలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉంటాయని, ప్రారంభంలో వేతనాలు ఎక్కువగా ఉండకపోవచ్చని వెల్లడించారు. న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారు కష్టపడి పనిచేయాలని, నిజాయతీగా ఉండాలని పేర్కొన్నారు. యువ లాయర్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. జూనియర్లకు సీనియర్ లాయర్లు గురువులుగా కొత్త విషయాలు నేరి్పస్తూనే సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. తాను కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా పనిచేశానని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేసుకున్నారు. శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన తన తల్లి తనను ముంబైలోని ఆలిండియా రేడియో స్టూడియోకు తీసుకెళ్తూ ఉండేవారని చెప్పారు. 1975లో ఢిల్లీకి వచ్చాక ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లిష్ కార్యక్రమాలు నిర్వహించానని వివరించారు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి రేడియోలో హిందీ, ఇంగ్లి‹Ù, సంస్కృత కార్యక్రమాలు విన్నానని తెలిపారు. దేవకి నందన్ పాండే, పమేలా సింగ్, లోతికా రత్నం గొంతులకు తాను అభిమానినని చెప్పారు. -
బిగ్‌బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?
బిగ్‌బాస్ షో నాకు ఎంత ముఖ్యమో మీకు తెలియదు, నా పెళ్లాంబిడ్డలు తిరిగి రావాలన్నా, అత్తామామ దగ్గర గౌరవం దక్కాలన్నా ఈ షో గెలవాలి అని నాగమణికంఠ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరైనా నామినేట్ చేస్తే చాలు ఆ వారమంతా తెగ టెన్షన్ పడిపోయేవాడు. తను హౌస్‌లో ఉండాలని తపించిపోయాడు. ప్రతి గేమ్‌లో తానే ఉండాలనుకున్నాడు. కానీ ఈ వారం సీన్ మారిపోయింది. హౌస్‌లో ఉండలేనన్నాడు. ఇంటికి వెళ్లిపోతానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన మైండ్ పని చేయట్లేదన్నాడు.పారితోషికం..శరీరం కూడా సహకరించలేదన్నాడు. దీంతో డాక్టర్ దగ్గరకు కూడా పంపించగా వాళ్లు బాగానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అయినా సరే మణి హౌస్‌లో సర్దుకోలేకపోయాడు. అతడు కోరుకున్నట్లుగానే ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. అతడి పారితోషికం విషయానికి వస్తే.. వారానికి రూ.1.20 లక్షల చొప్పున మేర సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఏడువారాలకుగానూ రూ.8.40 లక్షలు వెనకేసినట్లు సమాచారం. -
బిగ్‌బాస్ 8: కిర్రాక్ సీత పారితోషికం ఎంతంటే?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో కిర్రాక్ సీత ఎలిమినేట్ అయింది. పోయిన వారం నైనిక, ఈ వారం సీత బిగ్‌బాస్ ఇంటిని వీడి వెళ్లిపోయారు. చూస్తుంటే పవర్ ఆఫ్ గర్ల్స్ గ్యాంగ్‌లో ఒక్కొక్కరూ వరుసగా ఎలిమినేట్ అవుతున్నట్లున్నారు. ఈ గ్యాంగ్‌లో ఉన్నదే ముగ్గురు. సీత, నైనిక, విష్ణు.. ఇప్పటికే ఇద్దరు వెళ్లిపోయారు. విష్ణు కంటే నయంగేమ్ను సీరియస్‌గా తీసుకోకుండా చిల్ అవుతున్న విష్ణును వచ్చేవారం పంపించాలని పలువురూ అభిప్రాయపడుతున్నారు. నిజానికి విష్ణు కన్నా సీతకు ఇంట్లో ఉండేందుకు ఎక్కువ అర్హత ఉంది. కానీ ఫ్యాన్ బేస్‌లో వెనకబడి ఉండటంతో తనకు ఓట్లు తక్కువగా వచ్చాయి. పైగా తనకు పీఆర్ టీమ్ కూడా లేనట్లుంది.నెగెటివిటీ..దీంతో ప్రచారంలోనూ ఓ అడుగు వెనకే ఉంది. వీటికి తోడు తన ప్రవర్తన కూడా ఆమెపై నెగెటివిటీ పెంచింది. కసిగా ఆడినప్పటికీ తను వేసిన తప్పటడుగులు ఎగ్జిట్ గేట్‌కు దారి చూపాయి. ఈమె రెమ్యునరేషన్ విషయానికి వస్తే వారానికి రూ.2 లక్షలు వెనకేసిందట.. ఈ లెక్కన ఆరువారాలకుగానూ దాదాపు రూ.12 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss: నైనిక ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?
బిగ్‌బాస్ షోలో ఆట ఎప్పుడు ఎటు మలుపు తిరుగుందో చెప్పలేం. అందుకు నైనిక పెద్ద ఉదాహరణ. షో ప్రారంభమైన కొత్తలో టాస్కుల్లో శివంగిలా ఆడి గెలిచింది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక కంటెస్టెంట్లా కనిపించింది. వయసులో చిన్నదైనా క్లాన్ (టీమ్) లీడర్‌గా ఎదిగింది. తన గ్రాఫ్ ఏ రేంజ్లో అయితే పైకి జుయ్‌మని ఎగబాకిందో అదే స్పీడులో కిందకు పడిపోయింది.చిచ్చుబుడ్డిలా వెలిగి చివరకు..క్లాన్ చీఫ్‌గా పెద్దగా పవర్ చూపించలేకపోయింది. ఆటలో డల్ అయిపోయింది. ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు తప్పితే హౌస్‌లో పెద్దగా కనిపించకుండా పోయింది. నైనిక నీ గేమ్ ఎటు పోయింది? నీలో ఫైర్ ఏమైపోయింది? అని నాగార్జున సైతం ఆమె ముఖం పట్టుకుని అడిగాడు. అయినా లాభం లేకుండా పోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఐదో వారం ఎలిమినేట్..ప్రేక్షకులు ఈమెను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకునే స్థాయి నుంచి హౌస్‌లో ఉంచాల్సిన అవసరం లేదనుకునే స్థాయికి వచ్చేసింది. దీంతో ఐదో వారం ఎలిమినేట్ అయింది. ఆమె రెమ్యునరేషన్ విషయానికి వస్తే ప్రతి వారం రూ.2.20 లక్షలు అందుకుందట! ఈ లెక్కన ఐదు వారాలకుగానూ 11 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ ద్వారా ఆదిత్య ఎంత సంపాదించాడంటే?
బిగ్‌బాస్ ఎనిమిదవ సీజన్లో ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు కానీ హౌస్మేట్ల గిల్లికజ్జాలు, సోదిముచ్చట్లు చూస్తుంటే ప్రేక్షకులకు కూడా అసహనం, చిరాకు అన్‌లిమిటెడ్‌గానే వస్తోంది. నెల రోజుల్లోనే మొహం మొత్తేస్తే కష్టమని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను దింపుతోంది. ఎనిమిది మందిని హౌస్‌లోకి ఒకేసారి పంపించనుంది.ఆదిత్య ఓం అవుట్ఇందుకోసం పెద్దగా కంటెంట్ ఇవ్వని కంటెస్టెంట్లను డబుల్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్న మంచి మనిషి ఆదిత్య ఓంను వారం మధ్యలోనే ఎలిమినేట్ చేసేశారు. ఈయన నాలుగున్నర వారాలపాటు హౌస్‌లో ఉన్నాడు.ఎంత సంపాదించాడంటే?హీరోగా జనాలకు సుపరిచితుడైన ఆదిత్యను ఈ షోకి తీసుకువచ్చేందుకు భారీగానే ఆఫర్ చేశారట! వారానికి రూ.3 లక్షల పారితోషికం ఇచ్చారట! ఈ లెక్కన నాలుగున్నర వారాలకుగానూ దాదాపు రూ.14 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన బేబక్క, బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల కంటే కూడా ఆదిత్యే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్లు భోగట్టా!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి