కొన్నేళ్ల ముందు మయోసైటిస్ వ్యాధికి గురైన సమంత.. ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. అలా అని కొత్త సినిమాలేం చేయట్లేదు. ప్రస్తుతం యాడ్స్ చేస్తూ కాస్త బిజీగా ఉంది. మరోవైపు ఈమె అప్పుడెప్పుడో నటించిన ఓ వెబ్ సిరీస్.. త్వరలో రిలీజ్ కానుంది. సరే ఇదంతా పక్కనబెడితే సమంత రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు మరోసారి టాపిక్ వచ్చింది. ఏకంగా డబుల్ చేసిందనే టాక్ వినిపిస్తోంది.
(ఇదీ చదవండి: 'నేను అందంగా లేనని తెలుసు'.. సమంత షాకింగ్ కామెంట్స్!)
పదేళ్లకు పైగానే ఇండస్ట్రీలో ఉన్న సమంత.. దక్షిణాదిలో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లోనూ విలన్ తరహా పాత్రతో అందరికీ షాకిచ్చింది. ఆ సిరీస్ డైరెక్టర్స్ రాజ్-డీకే తీసిన 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్‍లోనూ సమంత లీడ్ రోల్ చేసింది. అయితే ఇందులో చేసినందుకు గానూ ఏకంగా రూ.10 కోట్ల వరకు తీసుకుందట.
సమంత ఇప్పుడు సినిమాలేం చేయనప్పటికీ.. కొత్తగా వచ్చే ప్రాజెక్టులకుగానూ ఒక్కో దానికి రూ.6 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అలానే ఒక్కో యాడ్‌కి రూ.1.5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోందట. మరి వీటిలో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా సమంత నిలుస్తుంది.
(ఇదీ చదవండి: సమంత జనాల్ని పిచ్చోళ్లను చేస్తోంది... డాక్టర్ ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment