50 సెకండ్ల యాడ్ కోసం రూ. 5 కోట్లు?
100 కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ ఇల్లు
ఇతర రంగాలతో పోలిస్తే చిత్ర పరిశ్రమలో పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. తెరమీద ఎలివేషన్లు, బీజీఏంలు హీరోల కున్నంతగా హీరోయిన్లకు ఉండవు. ఇక రెమ్యునరేషన్ల సంగతి సరే సరి. అయితే ఈ అడ్డుగోడల్ని బద్దలుకొట్టి చాలా కొద్దిమంది అయినా కథానాయకలుగా, డైరెక్టరులుగా తమ సత్తాచాటుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు, బాక్సాఫీసు వసూళ్లతో మేమూ సూపర్ స్టార్లమే అని నిరూపించుకుంటున్నారు. డైరెక్టర్లు, నిర్మాతల ఫేవరెట్స్‌గా అవత రిస్తున్నారు. అలాంటి వారిలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ లేడి సూపర్ స్టార్‌గా పాపులర్ అయిన నయనతార ఒకరు.
పార్ట్ టైమ్ మోడల్‌గా మొదలై, టెలివిజన్ ప్రెజెంటర్‌నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తార నయనతార. స్టార్ హీరోలని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్, అంతకుమించిన క్రేజ్‌తో నయనతారనా మజాకానా అనిపించుకుంటోంది. కరియర్‌లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా డిజాస్టర్స్ వెక్కిరించినా వరుస సినిమాలతో ప్రేక్షకులను మదిలో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది.
తాజాగా నయన్ 50 సెకన్ల యాడ్‌కు రూ. 5 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిందన్న వార్త హాట్ టాపిక్‌గా నిలిచింది. పలు మీడియా కథనాల ప్రకారం నయనతార 50 సెకన్ల ఒక కార్పొరేట్ ప్రకటన కోసం ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసిందట. అంతేకాదు నయనతార ప్రతీ మూవీకి రూ. 10 కోట్లు వసూలు చేస్తుందనే ప్రచారం కూడా ఉంది.
అంతేకాదు ముంబైలో లగ్జరీ బంగ్లాతో సహా 4 విలాసవంతమైన ఇళ్లున్నాయి. రూ 100 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లాలో భర్త విఘ్నేష్‌తో, ఇద్దరు ప్లిలలతో నివస్తోంది. ఇంకా ఖరీదైన కార్ల కలెక్షన్, లగ్జరీ ప్రైవేట్ జెట్స్‌కూడా నయన్, విఘ్నేష్ సొంతం. ఇటీవల ఇద్దరూ విడిపో బోతున్నారన్న వార్తలను కూడా ఖండించారు ఈ స్వీట్ కపుల్.
కాగా గత ఏడాది అట్లీ దర్శకత్వంలో వచ్చి జవాన్ మూవీతో షారుఖ్‌తో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. యాక్షన్-ప్యాక్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసింది. అయితే ఆమె నటించిన అన్నపూరణి చిత్రం మాత్రం వివాదంలోచిక్కుకుంది. ఈ వివాదంపై క్షమాపణలు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment