హీరోలు కోట్లు సంపాదిస్తారు.. వారి కింద పనిచేసే బాడీగార్డులు కూడా లక్షలు వెనకేస్తుంటారు! స్టార్ హీరోల బాడీగార్డుల సంపాదన గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి కోట్లల్లో ఆదాయం ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. షేరా అలియాస్ గుర్మీత్ సింగ్.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు రెండు దశాబ్దాలుగా బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ఇతడికికి టైగర్ అని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ కూడా ఉంది.
బాడీగార్డు ఉంటేనే అడుగు బయటకు
రవి సింగ్ విషయానికి వస్తే.. ఇతడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు వ్యక్తిగత అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. యూసుఫ్ ఇబ్రహీం.. ఆలియా భట్, వరుణ్ ధావన్ వంటి పలువురు హీరోహీరోయిన్లకు బాడీగార్డుగా సేవలందిస్తున్నాడు. వీరు సెలబ్రిటీలు ఇల్లు దాటి బయటకు వెళ్లినప్పుడు వారికి రక్షణగా నిలుస్తారు. ఈవెంట్లకు వెళ్లినా, ఎక్కడికైనా ప్రయాణించినా సదరు నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
బాడీగార్డులకు కోట్లల్లో ఆదాయం?
సెలబ్రిటీటల పట్ల అంకితభావంతో పనిచేసే వీరు బాగానే డబ్బు కూడబెడతారని ఫిల్మీదునియాలో ఓ టాక్ ఉంది. దీనిపై హీరోయిన్ ఆలియా భట్ బాడీగార్డ్ యూసఫ్ ఇబ్రహీం(Bollywood bodyguard Yusuf Ibrahim) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముందుగా షారూఖ్ బాడీగార్డ్ రవి సింగ్ ఏడాదికి రూ.2.7 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించాడు. చూడండి.. ఎవరెంత సంపాదిస్తున్నారనేది మాకు తెలియదు. ఒకరి ఆదాయం మరొకరికి తెలియదు. తెలిసే అవకాశమే లేదు అన్నాడు. మీకు తెలియకుండా ఉంటుందా? అని యాంకర్ అడిగినప్పటికీ అతడు తెలీదనే అడ్డంగా తలూపాడు. మరి సల్మాన్ బాడీగార్డ్ షేరా రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడంటున్నారు.. ఇది నిజమేనా? అన్న రెండో ప్రశ్న ఎదురైంది.
(చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు, ఎందుకంటే?)
నెలకు రూ.10 లక్షలు ఈజీగా..
దీనికి ఇబ్రహీం స్పందిస్తూ.. షేరాకు సొంత బిజినెస్ ఉంది. అతడికంటూ ప్రత్యేకంగా సెక్యురిటీ కంపెనీ ఉంది. ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఉండొచ్చు. కాబట్టి రెండు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది అని సమాధానమిచ్చాడు. అక్షయ్ కుమార్ అంగరక్షకుడు శ్రేసయ్ తేలే ఏడాదికి రూ.1.2 కోట్లు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటన్న ప్రశ్నకు.. అతడి వ్యక్తిగత సమాచారం నా దగ్గర లేదు. అయినా నెలకు రూ.10-12 లక్షల ఆదాయం వేసుకున్నా ఏడాదికి రూ.1 కోటి ఈజీగా దాటుతుంది.
కొన్నిసార్లు లెక్క మారుతుంది
కానీ కొన్నిసార్లు అంత డబ్బు రాకపోవచ్చు. ఎందుకంటే కొందరు షూటింగ్‌కు, ఈవెంట్స్‌కు, ప్రమోషన్స్‌కు వేర్వేరుగా డబ్బు లెక్కగడుతుంటారు. దాన్ని బట్టి సెలబ్రిటీలు ఎలాంటి కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్తున్నారో దాని ఆధారంగానే డబ్బిస్తారు. పైగా ఆయా సెలబ్రిటీ నెలలో ఎన్ని రోజులు పని చేస్తున్నాడనేదానిపై కూడా మా జీతం ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ ఎవరికి నచ్చినట్లు వారు లెక్కలు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నామని ఫిక్సయిపోయారు. కానీ సాధారణ బాడీగార్డులైతే నెలకు రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది అని ఇబ్రహీం చెప్పుకొచ్చాడు.
చదవండి: చికెన్‌గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..!
Comments
Please login to add a commentAdd a comment