Bodyguard
-
కోట్ల విలువైన కారును కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్!
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. అయితే ఇటీవల సల్మాన్‌ఖాన్‌కు పక్కటెములకు గాయాలు కావడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గాయం అయినప్పటికీ తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.అయితే తాజాగా సల్మాన్ ఖాన్‌కు బాడీగార్డ్ షేరా ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. 1995 నుంచి సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పనిచేసిన షేరా కొత్త రేంజ్ రోవర్‌ను కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ కారు విలువ దాదాపుగా రూ.1.4 కోట్లుగా ఉంటుందని సమాచారం. షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ కాగా.. సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పని చేయడమే కాకుండా టైగర్ సెక్యూరిటీ అనే సంస్థను స్థాపించారు. View this post on Instagram A post shared by shera (@beingshera) -
Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
నంద్యాల, సాక్షి: పోలింగ్ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్‌కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఖండించిన క్రెమ్లిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను క్రెమ్లిన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది. పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పందించారు. బాడీ డబుల్స్‌ను వాడుతున్నారని నిరాధార ఆరోపణలను కొట్టిపారేశారు. అదంతా అబద్ధంగా పేర్కొన్నారు. పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్లో వదంతులు వచ్చాయని పేర్కొంటూ ప్రశ్చ్యాత దేశాల మీడియా ప్రచురణలు వెలుగులోకి వచ్చాయి. పుతిన్ (71) క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధితో సహా తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్నట్లు 2022 నుంచే వివిధ నివేదికలు వస్తున్నాయి. బహిరంగ ప్రదర్శనలలోనూ పుతిన్ అస్థిరంగా, ఉబ్బినట్లుగా కనిపించడం ఈ పుకార్లకు అప్పట్లోనే ఆజ్యం పోసింది. తాజాగా సెప్టెంబర్‌లో రష్యాన్ టెలిగ్రామ్ ఛానెల్లో ఓ పోస్టు దర్శనమిచ్చింది.'మీరు మమ్మల్ని విడిచిపెట్టవద్దు. సజీవంగా ఆరోగ్యంగా ఉన్నారని దేవుడిని ప్రార్ధిస్తున్నాం' అంటూ ఓ పోస్టు వెలుగులోకి వచ్చింది. దీంతో మీడియా ప్రతినిధులు పుతిన్ ఆరోగ్యంపై క్రెమ్లిన్ ప్రతినిధిని తాజాగా ప్రశ్నించారు. బాడీ డబుల్స్‌కు సంబంధించి 2020లోనే పుకార్లు వచ్చాయి. భద్రతా ప్రయోజనాలు దృష్ట్యా ఓ దేహాన్ని ఉపయోగించారనే ఊహాగానాలు వచ్చాయి. ఆ పుకార్లను క్రెమ్లిన్ అప్పట్లోనే ఖండించింది. ఇదీ చదవండి: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం -
రాజుతో అంగరక్షకుడి సహగమనం
సాక్షి, హైదరాబాద్: సతీ సహగమనం గురించి అందరికీ తెలిసిందే. భర్త చితిపైనే భార్యను సజీవంగా దహనం చేసే దారుణ పద్ధతది. కానీ, రాజు చనిపోతే అంగరక్షకులను అతనితోపాటు సజీవ సమాధి చేసే మరో వికృత ఆచారం కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. స్వామి భక్తితో ఆత్మాహుతి చేసుకున్న అంగరక్షకుడు/ఆంతరంగిక సేవకుడి(లెంక) స్మృతిలో ఏర్పాటు చేసిన స్మారక ఆత్మాహుతి శిల ఇటీవల వెలుగుచూసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ శివారు ఆల్వాన్‌పల్లిలో ఉన్న అతి పురాతన జైన దేవాలయం గొల్లత్తగుడి వెనక దీన్ని గుర్తించారు. అక్కడి శిథిల శైవమఠం గోళకీ ఆలయం పరిసరాల్లో ఆరు వీరగల్లు శిలలున్నాయి. వాటిల్లో ఒకటిగా ఉన్న ఈ శిలను కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, ముచ్చర్ల దినకర్లు పరిశీలించారు. దానిపై పరిశోధన చేసి, అది చనిపోయిన రాజుతోపాటు సజీవంగా సమాధి చేయించుకున్న అంగరక్షకుడు/ఆంతరంగిక సేవకుడిదిగా తేల్చారు. స్థానికంగా ఉన్న రాజు లేదా రాజు హోదాలో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు అతని సేవకుడు కూడా ఆత్పార్పణ చేసుకోవటంతో తొలుత సేవకుడిని సమాధి చేసి, దాని మీద రాజు శవాన్ని సమాధి చేసినట్టు పేర్కొన్నారు. ఈ శిలమీద చనిపోయిన రాజు చిత్రం, దిగువ ఆ సేవకుడి చిత్రాన్ని చెక్కారు. వారు శివైక్యం చెందారనటానికి గుర్తులు చెక్కి ఉన్నాయి. యుద్ధంలో చనిపోతే... ‘శిల మీద లఘు శాసనం ఉంది. అది ఆ సేవకుడు, రాజుకు సంబంధించే ఉండి ఉంటుంది. అస్పష్టంగా ఉన్నందున చదవటం సాధ్యం కావటం లేదు’ అని హరగోపాల్ పేర్కొన్నారు. ఇక్కడికి చేరువలోని గంగాపూర్ ప్రాంతంలో గతంలో చాలా యుద్ధాలు జరిగాయని, ఓ యుద్ధంలో స్థానిక రాజు/ ఆ స్థాయి వ్యక్తి చనిపోవటంతో అతని సేవకుడు కూడా సజీవ సమాధి ద్వారా ఆత్మార్పణ చేసుకుని ఉంటాడని, దానికి గుర్తుగా స్థానిక దేవాలయం వద్ద ఈ ఆత్మాహుతి శిలను ఏర్పాటు చేసి ఉంటారని ఆయన చెప్పారు. ఏడెనిమిది శతాబ్దాల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. ఏపీలోని గుంటూరు జిల్లా ఈపూర్లో గతంలో కాకతీయ రాణి రుద్రమ మరణంతో ప్రమేయమున్న ఇలాంటి శిల్పం లభించిందని, అది చెన్నై మ్యూజియంలో ఉందని, మరోటి త్రిపురాంతకంలో ఉందని వెల్లడించారు. తెలంగాణలో తొలిసారి వెలుగు చూసిన ఈ శిల్పానికి చరిత్రలో ప్రాధాన్యముంటుందన్నారు. -
చిన్న హీరోల పారితోషికంతో సమానంగా స్టార్ సెలబ్రిటీ బాడీగార్డు జీతం!
హీరోలు కోట్లు సంపాదిస్తారు. సినిమాలతోనే కాదు సైడ్ బిజినెస్‌లతో కూడా బాగానే వెనకేస్తారు. మరి అలాంటి హీరోలకు రక్షణ కవచాల్లా పని చేసే బాడీ గార్డులకు ఎంత సంపాదన ఉంటుందనుకుంటున్నారు? వందలు, వేలల్లో కాకుండా లక్షల్లో ఉంటుందంటారా? అవును, నిజమే.. కానీ స్టార్ హీరోల బాడీ గార్డులు ఏకంగా కోట్ల రూపాయలు ఏడాది జీతంగా తీసుకుంటున్నారంటే ఆశ్చర్యపోకమానరు! ఇది కొందరు చిన్న హీరోల పారితోషికంతో సమానం! ఇంతకీ అంత రిచ్ బాడీగార్డు ఎవరనుకుంటున్నారా? రవి సింగ్.. ఇతడు స్టార్ హీరో షారుక్ ఖాన్ బాడీగార్డు. ఇతడి నెల సంపాదన సుమారు రూ.17 లక్షలు. అంటే ఏడాదికి రూ.2.7 కోట్ల పైచిలుకు సంపాదిస్తున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఉంది షేరా.. ఇతడు బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ బాడీ గార్డు. దాదాపు 29 ఏళ్లుగా సల్మాన్ దగ్గరే పని చేస్తున్నాడు. ఇతడి నెల జీతం రూ.15 లక్షలు. అంటే సంవత్సరానికి రూ.2 కోట్ల మేర సంపాదిస్తున్నాడు. అక్షయ్ కుమార్ బాడీగార్డు శ్రేయ్‌సే థెస్లె దాదాపు అందరు సెలబ్రిటీల దగ్గర పని చేశాడు. ప్రస్తుతం అక్షయ్‌కు అంగరక్షకుడిగా ఉంటున్న ఇతడు ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం అందుకున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ దగ్గర జితేంద్ర షిండే అని ఓ బాడీగార్డు ఉండేవాడు. ఇతడు ముంబై పోలీస్ కానిస్టేబుల్. ఓపక్క వృత్తిలో కొనసాగుతూనే మరోపక్క బిగ్‌బీకి బాడీగార్డ్‌గా పని చేశాడు. ఇందుకుగానూ అతడు ఏడాదికి రూ.1.5 కోట్లు అందుకున్నాడు. 2021 ఆగస్టు వరకు దాదాపు ఆరేళ్లపాటు అమితాబ్ దగ్గరే పని చేసి తర్వాత మానేశాడు. ఆమిర్ ఖాన్ దగ్గర నమ్మకంగా పని చేసే బాడీగార్డు యువరాజ్ ఘోర్పడే. ఇతడు ఏడాదికి రెండు కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె , అనుష్క శర్మ దగ్గర పని చేసే జలాల్, ప్రకాశ్ సింగ్ కూడా ఏడాదికి చెరో రూ.1.2 కోట్లు ఆర్జిస్తున్నారు. చదవండి: 25 కోట్ల టికెట్ల ఊచకోత.. అంతగా ఎగబడి చూసిన సినిమా ఏదంటే? క్యాస్టింగ్ కౌచ్.. ఆ డైరెక్టర్ రాత్రంతా తనతో ఉండిపోమన్నాడు: నటి -
మాజీ లవర్ కత్రినా కైఫ్ భర్తని అవమానించిన సల్మాన్ ఖాన్
-
కత్రినా కైఫ్ భర్తను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్..
-
కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌కు చేదు అనుభవం ఎదురైంది. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో విక్కీ కౌశల్‌పై బాడీగార్డ్స్‌తో పాటు సల్మాన్ కూడా దురుసుగా ప్రవర్తించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. IIFA 2023 అవార్డు వేడుకకి పలువురు బాడీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ఈ క్రమంలో ఓ అభిమానితో విక్కీ సెల్ఫీ దిగుతుండగా సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన అక్కడికి రావడంతో సల్మాన్ బాడీగార్డ్స్ అత్యుత్సాహంతో విక్కీ కౌశల్‌ను పక్కకు నెట్టివేశారు. అయినా సరే పెద్దగా పట్టించుకోని విక్కీ సల్మాన్‌ను పలకరించేందుకు ముందుకు వెళ్లగా సల్మాన్ మాత్రం ఏమీ పట్టనట్లుగా, సరిగా మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. సల్మాన్‌ఖాన్ బాడీగార్డ్స్ ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు. అంతేకాకుండా తోటి నటుడితో ఎలా ప్రవర్తించాలో కూడా సల్మాన్‌కు తెలియదా? అంత మర్యాద లేదా అంటూ అతడి తీరుపై కూడా ఫైర్ అవుతున్నారు. -
బాడీగార్డ్ బైక్‌పై అనుష్క శర్మ చక్కర్లు... చలాన్ వేసిన పోలీసులు
స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి అటు సినిమా, ఇటు క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'రబ్ నే బనాదే జోడీ' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఓవైపు హీరోయిన్గా నటిస్తూనే నిర్మాతగానూ పలు సినిమాలు చేస్తోంది. అలాంటి ఈమె ఇప్పుడు ఓ కాంట్రవర్సీలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఓ ప్రాంతానికి షూటింగ్ కోసం వెళ్తున్న క్రమంలో అక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది. తన కారు ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో అనుష్క బైక్‌ను ఆశ్రయించింది. బైక్‌పై తన బాడీగార్డ్‌తో కలిసి లొకేషన్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ఆమె, డ్రైవర్ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోలేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీనిపై ముంబై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అనుష్క బాడీగార్డ్ కమ్ డ్రైవర్ సోనూ షేక్‌కు రూ.10,500 జరిమానా విధించామని, ఆ డబ్బులు మొత్తం చెల్లించేశారని ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఈ మధ్యే బిగ్ బీ అమితాబ్ కూడా హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణించారు. ఆయనకు రూ.1000 జరిమానా విధించగా ఆ మొత్తాన్ని చెల్లించేశారని పోలీసులు ట్వీట్ చేశారు. Challan has been issued under Sec 129/194(D), Sec 5/180 & Sec 3(1)181 MV act to the driver along with an fine of Rs. 10500 & been paid by the offender. https://t.co/aLp6JEstLO pic.twitter.com/Br0ByHZk4T — Mumbai Traffic Police (@MTPHereToHelp) May 16, 2023 చదవండి: 11 నెలల బాబును డబ్బు కోసం వదిలేసి వెళ్లానని తిట్టారు: యాంకర్ శ్యామల -
మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్లోనే మృతి
కంపాలా: ఉగాండా దేశంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగాండా దేశ మంత్రిపై తన బాడీగార్డు కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీంతో, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఉగాండా రాజధాని కంపాలాలో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఎంగోలా నివాసంలో ఆయనకు బాడీగార్డుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బాడీగార్డ్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం, బాడీగార్జ్ కూడా అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. అయితే, మంత్రి వద్ద బాడీగార్డ్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తికి చాలా కాలంగా వేతనాలు చెల్లించడం లేదని సమాచారం. ఈ కారణంతోనే మంత్రిని బాడీగార్డు కాల్చి చంపినట్లు సమాచారం. ఇక, ఈ కాల్పుల ఘటనపై ఆర్మీ అధికారులు దురదృష్టకరమని.. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు ఆర్మీ ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్వే వెల్లడించారు. ఎంగోలా హత్యకు దారితీసిన కారణాలు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. Col Charles Engola shot dead by the Body Guard. RIP.😭 ! BREAKING NEWS ! pic.twitter.com/CVmbWzMTqU — Davic Films Bsa (@davic_films) May 2, 2023 ఇది కూడా చదవండి: డింగ్ డాంగ్ డిచ్ కేసు: ముగ్గురిని బలిగొన్న ఎన్నారై చంద్రను దోషిగా తేల్చిన కోర్టు -
బాడీగార్డ్ పెళ్లిలో స్టార్ హీరో సందడి.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ పెళ్లిలో సందడి చేశారు. తన బాడీగార్డ్ సచిన్ వివాహానికి హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 'కంగ్రాట్స్.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సచిన్ అండ్ సురేఖ' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కార్తీక్ ఆర్యన్ పోస్ట్‌పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: నా సర్వస్వం నువ్వే.. ఎప్పుడూ నీ చేయి వీడను: కోహ్లి ట్వీట్ వైరల్) కాగా.. కార్తీక్ చివరిసారిగా రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ చిత్రం తూ ఝూతి మైన్ మక్కర్లో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించాడు. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్ అయిన షెహజాదా చిత్రంలో కార్తీక్, కృతి సనన్ జంటగా నటించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం కార్తీక్ సత్యప్రేమ్ కి కథలో కియారా అద్వానీతో కలిసి నటించనున్నారు. సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత ఆషికీ -3లో నటించనున్నారు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) (ఇది చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ) -
సీఈఓల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న బాడీగార్డ్స్
సినీ ప్రముఖులకు, ప్రముఖ పారిశ్రామికవేత్తలకు, క్రికెటర్లకు సాధారణ ప్రజల మాదిరిగా బయట తిరిగే స్వేచ్ఛ ఉండదు, ఈ కారణంగా తమను తాము కాపాడుకోవడానికి బాడీగార్డ్స్‌ని నియమించుకుంటారు. ఈ బాడీగార్డ్స్ జీతాలు భారతదేశంలో ఉండే కొన్ని కంపెనీల సీఈఓల జీతాలకంటే ఎక్కువ అని తెలుస్తోంది. షారుక్ ఖాన్ బాడీగార్డ్: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో షారుక్ ఖాన్ అతిపెద్ద సూపర్‌స్టార్. అయితే ఈయన సినిమా షూటింగ్, ప్రమోషన్ వంటి వాటికోసం బయట ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో తనకు రక్షణగా రవి సింగ్ అనే బాడీగార్డ్‌ని నియమించుకున్నాడు. ఇండస్ట్రీలో ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్‌లలో రవి సింగ్ ఒకరు. ఈయన శాలరీ సంవత్సరానికి రూ. 2 నుంచి రూ. 3 కోట్లు వరకు ఉంటుంది. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్: బాలీవుడ్ టాప్ పెర్ఫార్మర్లలో ఒకరైన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ 'గుర్మీత్ సింగ్ జాలీ అకా షేరా' సంవత్సరానికి రూ. 2 కోట్లు కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు. ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్‌లలో ఈయన ఒకరు. ముంబైలో జస్టిన్ బీబర్ తన సంగీత కచేరీ సమయంలో అతను ఎస్కార్ట్ చేశాడు. అమీర్ ఖాన్ బాడీగార్డ్: ఎన్నో పాపులర్ సినిమాలతో బాలీవుడ్ సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న అమీర్ ఖాన్ కూడా తన బాడీగార్డ్‌కి ఎక్కువ జీతం ఇస్తున్నట్లు సమాచారం. యువరాజ్ ఘోర్పడే (అమీర్ ఖాన్ బాడీగార్డ్) ప్రతి సంవత్సరం 1 నుండి 2.5 కోట్లు సంపాదిస్తున్నాడు. నిజానికి యువరాజ్ బాడీబిల్డర్. అక్షయ్ కుమార్ బాడీగార్డ్: అక్షయ్ కుమార్ బాడీగార్డ్ 'శ్రేయ్‌సే తేలే' సంవత్సరానికి 1 నుంచి 2 కోట్లు సంపాదిస్తూ అత్యధిక శాలరీ తీసుకుంటున్న బాడీగార్డ్‌లలో ఒకరుగా నిలిచారు. దీపికా పదుకొనే బాడీగార్డ్: ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే బాడీగార్డ్ 'జలాల్' పబ్లిక్ ప్లేస్‌లో ఎప్పటికప్పుడు రక్షణ కల్పిస్తూ వారి కుటుంబ సభ్యులలో ఒకరుగా కలిసిపోయారు. ఈయన సంవత్సరాదాయం రూ. 90 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఉంటుంది. -
బ్రిటన్ రాజు బాడీగార్డులకు నకిలీ చేతులు! నెటిజన్ల అయోమయం
లండన్: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ బాడీగార్డులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు బాడీగార్డులు కృత్రిమ చేతులు ఉపయోగిస్తున్నారా? అనే అయోమయానికి గురౌతున్నారు. వాళ్ల అసలు చేతులను కోటు లోపల దాచుకుని ఫేక్ చేతులను బయటకు ప్రదర్శిస్తున్నారా? అని చర్చ జరుగుతోంది. ప్రముఖులకు భద్రత కల్పించే బాడీగార్డులు క్షణం ఏమరపాటుగా ఉన్నా దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే వారు కూడా కొన్ని టెక్నిక్స్ పాటిస్తూ తమ యజమానుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పిస్తుంటారు. ఇలాంటి టెక్నిక్స్‌లో ఫేక్ చేతులు ధరించడం కూడా ఒకటి కావడం గమనార్హం. అయితే ఫేక్ చేతుల విషయం కొత్తదేమీ కాదు. 2017లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సీక్రెట్ సర్వీస్ బాడీగార్డు తన చిటికెన వేలుని వింతగా పట్టుకున్నప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అది కృత్రిమ చేతి అయి ఉంటుందని అంతా అనుమానించారు. బాడీగార్డులు ఇలా కృత్రిమ చేతులు ధరించినప్పుడు కోట్ లోపల అసలు చేతులతో ఆటోమేటిక్ గన్ పట్టుకుని సిద్ధంగా ఉంటారని చెబుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఎఫ్ఎన్-పీ90 గన్ను ఊపయోగిస్తారట. ఎవరికీ అనుమానం రాకుండా కోటు లోపల పెట్టుకుని భద్రత కల్పించేందుకు ఇది అనువుగా ఉంటుందట. క్లారీటీ లేదు.. అయితే బ్రిటన్‌లో బాడీగార్డులు ఆయుధాలు కలిగిఉండటానికి వీల్లేదు. అందుకే కింగ్ చార్లెస్ బాడీగార్డులు కోటు లోపల చేతులతో గన్స్ పట్టుకునే అవకాశం లేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మాత్రం నెటిజన్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. అసలు బాడీగార్డులు కృత్రిమ చేతులు నిజంగానే ధరించారా? అనే విషయంపై స్పష్టత రావడంలేదు. కొందరేమో కింగ్ చార్లెస్ బాడీగార్డులు కచ్చితంగా కృత్రిమ చేతులు ధరించారు అంటుంటే.. మరికొందరేమే ఇవి ఫేక్ చేతుల్లా లేవని అంటున్నారు. అయితే ఈ విషయంపై బాడీగార్డులు కూడా నిజాన్ని చెప్పే అవకాశం లేదు. అసలు విషయం తెలిస్తే కింగ్ చార్లెస్ భద్రతకు ముప్పు ఉంటుందని వారు భావిస్తారు. చదవండి: చైనాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తాపడి 27మంది దుర్మరణం -
రణ్వీర్ చెంప చెళ్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే..
ఇటీవల జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఈవెంట్లో బాడిగార్డ్.. రణ్వీర్ చెంప చెళ్లుమనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ప్రతి ఏటా నిర్వహించిన ప్రతిష్టాత్మక సైమా 2022 అవార్డు కార్యక్రమాన్ని శనివారం బెంగళూరులో ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డు ఫంక్షన్‌కు దక్షిణాది చెందిన అగ్ర తారలతో పాటు బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. చదవండి: సిసింద్రి టాస్క్‌లో ట్విస్ట్.. శ్రీహాన్‌కు షాకిచ్చిన గలాట గీతూ టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, పూజా హెగ్డె, విజయ్ దేవరకొండ, సుకుమార్‌లు తదితరులు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్వీర్ సింగ్ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఆయన తనదైన స్టైల్లో సందడి చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బాలీవుడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా రణ్వీర్ ఈ అవార్డును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఫంక్షన్‌కు హజరైన రణ్వీర్ బయట సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇక వారితో సరదాగా మాట్లాడుతూ సెల్ఫీలకు ఫోజులు ఇస్తున్నాడు. చదవండి: నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్ ఈ క్రమంలో రణ్వీర్ మీదకు ఎగబడుతున్న జనాలను పక్కనే ఉన్న బాడిగార్డ్స్ కంట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాడీగార్డ్ చేయి రణ్వీర్ చెంపకు గట్టిగా తగిలింది. దాంతో రణ్వీర్ ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. గట్టిగా తగలడంతో కాసేపు చెంప మీద చేయి అలాగే ఉంచి అటూ ఇటూ చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తున్నారు. Oops! Who slapped him?#RanveerSingh #slapped #Viral pic.twitter.com/0jzekvpOMr — Payal Mohindra (@payal_mohindra) September 13, 2022 -
Col Nizamuddin: నేతాజీని కాపాడిన యోధుడు
నేతాజీ ఆంతరంగికులలో ఒకరు కల్నల్ షేక్ నిజాముద్దీన్. వీరి అసలు పేరు సైఫుద్దీన్. వీరు అప్పటి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్ జిల్లా ఢక్వా గ్రామంలో 1900లో జన్మించారు. 20 ఏళ్ల ప్రాయంలో బ్రిటిష్ సైన్యంలో చేరారు. కొంతకాలం తర్వాత సింగపూర్‌లో క్యాంటిన్ నడుపుతున్న తన తండ్రి ఇమాం అలీ వద్దకు 1926లో చేరారు. అనంతరం 1943లో నేతాజీ జాతీయ సైన్యాన్ని పునరుద్ధరించి ‘చలో ఢిల్లీ’ అంటూ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అందులో చేరారు. అప్పటివరకు ఉన్న సైఫుద్దీన్ పేరును నిజాముద్దీన్‌గా మార్చుకున్నారు. నేతాజీ కారు డ్రైవర్‌గా ఉండి, ఆ తరువాత అంగరక్షకుడిగా, వ్యక్తిగత సహాయకునిగా నిజాముద్దీన్ ఎదిగారు. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా 1943లో జరిగిన యుద్ధంలో నేతాజీతో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో అడవిలో నేతాజీతో వెళుతుండగా తుప్పల్లోంచి నేతాజీకి గురిపెట్టిన ఒక తుపాకీ గొట్టాన్ని నిజాముద్దీన్ గమనించి ఎదురెళ్ళారు. క్షణాలలో 3 గుండ్లు ఆయన శరీరంలోకి దూసుకుని వెళ్ళి కుప్పకూలారు. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ వైద్యం చేసి నిజాముద్దీన్ శరీరంలోని బుల్లెట్లను తొలగించారు. ఆయన త్యాగనిరతికి నేతాజీ చలించిపోయి కల్నల్ హోదాను కల్పించడంతో వీరు కల్నల్ షేక్ నిజాముద్దీన్‌గా ప్రసిద్ది చెందారు. నాటి నుండి 1945 వరకు నేతాజీ వెన్నంటి ఉన్నారు. సింగపూర్ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారన్న వార్తను ఆయన ఖండించారు. ఆ ప్రమాదం జరిగిన 3 నెలల తర్వాత తాను స్వయంగా నేతాజీని బర్మా–థాయిలాండ్ సరిహద్దుల్లో గల సితంగ్‌పూర్ నదీ తీరాన తీసుకెళ్ళి విడిచిపెట్టి వచ్చానని అనేవారు. నిజాముద్దీన్ తన 117 ఏట 2017లో స్వగ్రామంలోనే కన్నుమూశారు. – షేక్ అబ్దుల్ హకీం జాని, తెనాలి (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
ఇంత దారుణమేంటి పుతిన్.. స్పెషల్ బాడీగార్డుతో అలాంటి పనేంటి..?
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు వింటనే కొన్ని దేశాలు వణికిపోతున్నాయి. కాగా, రష్యా ప్రెసిడెండ్ పుతిన్ ఓ స్పెషల్ పర్సన్.. అతడి ఏది చేసిన భిన్నంగా ఉంటుందని ఇప్పటికే పలు దేశాల పత్రికలు కథనాలను ప్రచురించాయి. తాజాగా పుతిన్ గురించి మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పుతిన్ కోసం ఓ ప్రత్యేకమైన బాడీగార్డ్ ఉన్నాడనే విషయం బయటకు వచ్చింది. ఇక, పుతిన్ ఎక్కడికి వెళ్లినా ఆ బాడీగార్డ్ ఆయనేతోనే ఉంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ బాడీగార్డ్ చేసే పని తెలిస్తే ఖంగుతింటారు. పుతిన్ మలమూత్రాలను ఆ బాడీగార్డ్ సేకరిస్తుంటాడని తాజాగా ఓ రిపోర్ట్‌లో బహిర్గతమైంది. తాజాగా ఫాక్స్ న్యూస్ దీనిపై ఓ కథనాన్ని రాసింది. ఇదిలా ఉండగా.. పుతిన్ ఆరోగ్య రహస్యాలు తెలియకుండా ఉండేందుకు.. బాడీగార్డు ఇలా ఆయన మలమూత్రాలను సేకరిస్తుంటారని సదరు వార్తా సంస్థ తాజా కథనంలో రాసుకొచ్చింది. ఇక, విదేశీ ఇంటెలిజెన్స్‌కు ఆరోగ్య రహస్యాలు బహిర్గతం కాకుండా పుతిన్ ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీఐఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రెబెకా కోఫ్లర్ తెలిపారు. రష్యాకు చెందిన ఫెడరల్ గార్డ్ సర్వీస్ ప్రత్యేక సూట్‌కేసును తీసుకువెళ్తుందని, ఆ సూట్‌కేస్‌లో పుతిన్ మలమూత్రాలను తిరిగి మాస్కోకు పంపిస్తారని ఫ్రెంచ్ పత్రిక పేర్కొంది. మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి పుతిన్ ఆరోగ్య పరిస్థితులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే పుతిన్‌కు కళ్లకు సంబంధించిన వ్యాధి ఉందని మరో మూడేళ్లలో కంటి చూపు మందగించే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. Putin's bodyguards have to box up his poop and send it back to Russia https://t.co/wBlGMdVBcP — George Elis (@PeanutCaptain_) June 14, 2022 ఇది కూడా చదవండి: ఎలాన్‌మస్క్ కొత్త ఎత్తుగడ.. ఈసారి ఏకంగా ఉద్యోగులతో.. -
జర్నలిస్ట్‌పై దాడి, సల్మాన్, ఆయన బాడీగార్డ్‌కు కోర్టు నోటీసులు
బాలీవుడ్ ‘భాయిజాన్’, కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం భారత్‌లోనే విదేశాల్లో సైతం ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన పేరు సినిమాలో కంటే కూడా హీరోయిన్స్‌తో సల్మాన్ ఎఫైర్స్ అంటూ ఎక్కువగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సల్మాన్‌ను తరచూ ఏదో ఒక వివాదం వెంటాడుతూ ఉంటుంది. ఇప్పటికే కృష్ణ జింకను చంపిన కేసులో సల్మాన్‌పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: కారులో ‘సీక్రెట్ ఫ్రెండ్’తో అడ్డంగా బుక్కైన స్టార్ హీరో కూతురు దీనితో పాటు ఓ జర్నలిస్ట్‌పై దాడి వివాదంలో కూడా చిక్కుకున్నాడు. 2019లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులో సల్మాన్, ఆయన బాడీగార్డ్ నవాజ్ షేక్‌కు అంధేరి కోర్టు సమన్లు జారీ చేసింది. సదరు జర్నలిస్ట్ అశోక్ పాండే.. సల్మాన్, ఆయన బాడీగార్డ్ నవాజ్ షేక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు లోకల్ పోలీసులను ఈ కేసు విచారణ చెప్పట్టాల్సిందిగా కోర్డు ఆదేశించింది. ఇటీవల దీనిపై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ సల్మాన్, ఆయన బాడీగార్డ్‌కు ప్రతికూలంగా ఉంది. చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ను ఉద్దేశిస్తూ బాలీవుడ్‌పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్ దీంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను ఆర్ఆర్ ఖాన్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వు జారీ చేస్తూ సల్మాన్, ఆయన బాడీగార్డ్‌పై ఐపీసీ సెక్షన్ 504, 506 కింద కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు వారికి నోటిసులు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. కాగా 2019లో ముంబై రోడ్డులో సైక్లింగ్ చేస్తుండగా సల్మాన్ తన ఫోన్ లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే సమయంలో మీడియా ఆయనను ఫొటోలు తీస్తున్నారని, ఈ క్రమంలో సల్మాన్ ఖాన్, ఆయన బాడీగార్డ్ తన దగ్గరికి వచ్చి ఫోన్ లాగేసుకుని బెదరించినట్లు అశోక్ పాండే ఆరోపించాడు. -
బాడీగార్డ్‌కు అత్యధిక జీతం ఇస్తున్న హీరో ఎవరో తెలుసా ?
Bollywood Celebrities And Their Bodyguards Salaries: సినిమాల్లో హీరోయిన్స్ తమ అందచందాలతో, గ్లామర్‌తో కట్టిపడేస్తుంటారు. అందుకే వారి వెంట విలన్లు వెంటపడుతుంటారు. ఆ విలన్ల నుంచి కాపాడుతూ హీరోలు ఎప్పుడూ హీరోయిన్లను ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఇది సినిమా వరకే. మరీ రియల్ లైఫ్‌లో.. నిజ జీవితంలో హీరోయిన్లను ప్రతీక్షణం కాపాడేందుకు హీరోలకు బదులు బాడీగార్డ్లు ఉంటారు. అభిమానులు సెల్ఫీలు తీసుకునే దగ్గరి నుంచి పెద్ద పెద్ద గుంపుల్లో ఆకతాయిలు చేసే అల్లరి పనుల వరకు వారి వెంట ఉండి ప్రొటెక్ట్ చేస్తారు. హీరోయిన్లే కాదు హీరోలు సైతం తమ రక్షణార్థం బాడీగార్డ్‌లను పెట్టుకుంటారు. బాడీగార్డ్‌లను ఊరికే పెట్టుకోరుగా.. వారికి సాలరీస్ కూడా ఇవ్వాలి. ప్రస్తుతం బాలీవుడ్ హీరోహీరోయిన్ల బాడిగార్డ్స్ జీతాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ హీరోహీరోయిన్లు వారి బాడీగార్డ్స్‌కు ఏకంకా కోట్లలోనే సాలరీస్ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దామా. 1. కంగనా రనౌత్-కుమార్ (90 లక్షలు) 2. దీపికా పదుకొణె-జలాల్ (కోటి) 3. కత్రీనా కైఫ్-దీపక్ సింగ్ (కోటి) 4. అనుష్క శర్మ-ప్రకాష్ సింగ్ (1.2 కోట్లు) 5. అక్షయ్ కుమార్-శ్రేయసే తేలే (1.20 కోట్లు) 6. అమితాబ్ బచ్చన్-జితేందర్ షిండే (1.5 కోట్లు) 7. సల్మాన్ ఖాన్- షెరా (2 కోట్లు) 8. అమీర్ ఖాన్- యువరాజ్గోర్పడే (2 కోట్లు) 9. షారుక్ ఖాన్ -రవి సింగ్ (2.6 కోట్లు) -
కోటిన్నర సంపాదన గుర్తుందా? ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
‘బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బాడీగార్డు జీతం ఎంతో తెలుసా?’ ‘తెలిస్తే షాకవుతారు’, ‘మీ దిమ్మ తిరిగిపోతుంది’ అంటూ ఆమధ్య వచ్చిన మీడియా కథనాలు.. అతగాడి కొంపముంచాయి. ఏకంగా కోటిన్నర రూపాయలు వెనకేసుకుంటున్నాడని వచ్చిన కథనాలతో ఆ ముంబై పోలీస్ హెడ్ కానిస్టేబుల్ని అమితాబ్ భద్రతా పేషీ నుంచి తప్పించారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ షిండే మళ్లీ సస్పెన్షన్ వేటుతో వార్తల్లో నిలిచాడు. ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ బ్రాంచ్‌లో పని చేసే హెడ్ కానిస్టేబుల్ జితేంద్ర షిండేను బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు బాడీగార్డుగా నియమించింది ముంబై పోలీస్ శాఖ. బిగ్‌బీ అమితాబ్‌కు 2015 నుంచి 2021 ఆగష్టు(కథనాలు వచ్చేదాకా) బాడీగార్డుగా పని చేశాడు. అయితే ఈ పని చేస్తూనే అతను ఏడాదికి కోటిన్నర రూపాయలకు పైగా సంపాదించాడంటూ కథనాలు వచ్చాయి. ఈ ఆరోపణలను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్న ముంబై కమిషనర్ హేమంత్ నగరలే ఆ సమయంలో షిండేను అమితాబ్ సెక్యూరిటీ విభాగం నుంచి తప్పించి.. హడావిడిగా డీబీ మర్ పోలీస్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే ఈ ఘరానా కానిస్టేబుల్‌పై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది. పైఅధికారుల అనుమతి లేకుండా దుబాయ్, సింగపూర్‌లకు ట్రిప్‌ల మీద వెళ్లాడని, లగ్జరీగా లక్షలు ఖర్చుపెట్టాడని(వీటికి లెక్కలు లేవు).. పైగా రూల్స్ విరుద్ధంగా వ్యవహరించాడన్న ఈ కారణంతోనే అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే వేటుపడినా.. షిండేపై అవినీతిపై దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని వెల్లడించారాయన. ఇదిలా ఉంటే అమితాబ్ బచ్చన్‌కు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ కింద నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లను మొత్తం రెండు షిప్ట్‌ల వారీగా అందిస్తోంది ముంబై పోలీస్ శాఖ. గతంలో అమితాబ్‌కు బాడీ గార్డు విభాగంలో పని చేసే సమయంలో.. జితేంద్ర షిండే తన భార్య ద్వారా ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని తెరిపించాడు. ఆ ఏజెన్సీ ద్వారా బచ్చన్ కుటుంబ సభ్యులకు సేవలందిస్తూ లక్షలు గడించాడు. అయితే ఆ డబ్బంతా ఆ భార్య అకౌంట్లోకి కాకుండా.. షిండే అకౌంట్లోకి జమ కావడంతోనే ఈ అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. ప్రభుత్వ విధుల్లో ఉంటూ ప్రైవేట్‌గా డబ్బు సంపాదించడంపై ముంబై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. ఇదేకాకుండా లెక్కల్లో చూపించని కోట్ల రూపాయలతో అక్రమ ఆస్తుల్ని సైతం కొనుగోలు చేసినట్లు షిండే మీద ఆరోపణలు వినిపించాయి. షిండే అవినీతి ఆరోపణల వ్యవహారంపై ముంబై సౌత్ అదనపు కమిషనర్ దిలీప్ సావంత్ నేతృత్వంలోని ఓ కమిటీతో దర్యాప్తు నడుస్తోంది కూడా. -
బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి.. ఇద్దరు బాడీగార్డులు మృతి
రాంచీ:జార్ఖండ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ నాయక్ మావోయిస్టుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన మంగళవారం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని జినరువాన్ గ్రామంలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనపై ఒక్కసారిగా మావోయిస్టులు దాడికిదిగారు. దీంతో అప్రమత్తమైన ముగ్గురు బాడీగార్డులు ఎమ్మెల్యేను రక్షించారు. అయితే ఈ దాడిలో ఒక బాడీగార్డు మృతి చెందగా.. మరో బాడీగార్డును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన బాడీగార్డును కూడా హతమార్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురు బాడీగార్డుల నుంచి ఒక ఏకే-47, రెండు ఇన్సాస్ రైఫిళ్లను మావోయిస్టులు లాక్కేళ్లారు. ఈ ఘటనపై డీజీపీ స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే ఫుట్‌బాల్ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ముందస్తు సమాచారం అందించలేదని తెలిపారు. గురుచరణ్ నాయక్ గతంలో మనోహర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలు అందించిన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో అదనపు బలగాలను మోహరించామని, జవాన్ మృతదేహాన్ని ఇంకా వెలికితీయాల్సి ఉందని డీజీపీ తెలిపారు. -
రొనాల్డో బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్నదెవరో తెలుసా!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన రొనాల్డోకు విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ జట్టుతో పాటు.. మంచెస్టర్ యునైటెడ్ లీగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సాధారణంగా రొనాల్డో ఎక్కడికైనా వెళ్తున్నాడనే సమాచారం వస్తే చాలు.. వేల సంఖ్యలో అభిమానులు గూమికడతారు. మరి వారి నుంచి రొనాల్డోకు రక్షణ కల్పించడానికి బాడీగార్డులు అవసరం చాలా ఉంది. అయితే రొనాల్డోకు బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్న సెర్జియో, జార్జ్ల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. చదవండి: Lieonal Messi: మెస్సీ చరిత్ర.. 34 ఏళ్ల వయసులో ఏడోసారి పోర్చుగల్‌కు చెందిన సెర్జియో, జార్జ్ ఇద్దరు కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి సైన్యంలో పని చేయాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకు తగ్గట్లే.. భద్రతా విభాగంలో కీలక పదవులు నిర్వహించారు. ఆ తర్వాత ఇద్దరూ పోర్చుగల్ పోలీసు విభాగంలో చేరారు. పోర్చుగల్‌లో ప్రముఖులకు భద్రత.. బాధ్యత పోలీసులదే. అలా ఈ ఇద్దరు సోదరులు రొనాల్డో.. వారి కుటుంబానికి ముఖ్య భద్రతాధికారులుగా పని చేస్తున్నారు. రొనాల్డోతో తరుచూ బయట కనపడే ఈ ఇద్దరు అన్నదమ్ములు.. సూటు, బూటు వేసుకొని అందమైన మోడల్స్‌లాగా కనిపిస్తుంటారు. చాలా సాఫ్ట్‌గా కనిపించే అన్నదమ్ములు రొనాల్డోకు అన్ని వేళలా రక్షణగా ఉంటారు. ఎలాంటి స్థితిలో అయినా పోరాడే లక్షణాలు వీరిద్దరికి ఉన్నాయి. తమ తెలివి తేటలు ఉపయోగించి రక్షణ బాధ్యతలు చూస్తుంటారు. అందుకే రొనాల్డోకు వారిద్దరిపై అపారమైన విశ్వాసం ఉంటుంది. చదవండి: గోల్ కొట్టే అవకాశం.. ప్రత్యర్థి ఆటగాడికి గాయం -
2018లో బాడీగార్డు మృతి.. బీజేపీ నేత సువేందుకు సమన్లు
కోల్‌కతా: పశి్చమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారికి రాష్ట్ర సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. సువేందుకు బాడీగార్డుగా పని చేసిన సబ్ ఇన్స్పెక్టర్ సుభభ్రత చక్రవర్తి మరణానికి సంబంధించిన కేసులో ఆయనకు సీఐడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని భవాని భనవ్ సీఐడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా చెప్పింది. 2018లో బాడీగార్డు చక్రవర్తి మరణించారు. తుపాకీతో తనకు తానే కాల్చుకొని మరణించినట్లు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఏడాది జూలైలో తన భర్త కేసును మళ్లీ దర్యాప్తు చేయాల్సిందిగా చక్రవర్తి భార్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో కేసు సీఐడీ చేతికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సువేందు అధికారికి సీఐడీ సమన్లు జారీ చేసింది. (చదవండి: వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ) -
అమితాబ్ నాకంత జీతం ఇవ్వలేదు: బాడీగార్డు
Amitabh Bachchan Personal Bodyguard Salary: సెలబ్రిటీలు గడప దాటి బయటకెళ్లాలంటే సెక్యూరిటీ గార్డు ఉండాల్సిందే. లేదంటే అభిమానులు వారిని చుట్టుముట్టేస్తారు. సెల్ఫీలంటూ, చిట్‌చాట్ అంటూ వారిని అంగుళం కదలనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అందుకే చిన్నపాటి సెలబ్రిటీలు కూడా సెక్యూరిటీ గార్డులను మెయింటెన్ చేయాల్సిన పరిస్థితి. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా బయటకెళ్లాలంటే తన చుట్టూ సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే షూటింగ్స్ అయినా, ఈవెంట్ అయినా, విహారమైనా, వేరే ఇతర పనైనా, స్వదేశమైనా, విదేశమైనా.. ఎక్కడికి వెళ్లినా అమితాబ్‌ను నీడలా వెంటాడుతూ అతడికి రక్షణ కల్పించాడో సెక్యూరిటీ గార్డు. గతేడాది వరకు అతడు బిగ్‌బీ దగ్గరే పని చేశాడు. ఆయన పేరు జితేంద్ర షిండే. ఆయన భార్యకు సొంత సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఉంది. ఇక గతంలో అమితాబ్ కోరిక మేరకు భారత్ పర్యటనకు వచ్చిన అమెరికన్ నటుడు ఎలిజా వుడ్‌కు కూడా షిండే రక్షణ కల్పించాడని సమాచారం. తనను నిరంతరం అంటిపెట్టుకుని ఉండే జితేంద్ర షిండేకు బిగ్‌బీ అక్షరాలా కోటిన్నర రూపాయలు ఇచ్చాడని బాలీవుడ్లో వరుస కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటున్నాడు షిండే. అంతేకాదు, తను ఇప్పుడు అమితాబ్ దగ్గర పని చేయడం లేదని స్పష్టం చేశాడు. 2015లో బిగ్‌బీకు బాడీగార్డుగా నియామకమయ్యానని, ఐతే ఐదేళ్ల సర్వీసు తర్వాత తనను వేరేచోటకు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పాడు. ప్రస్తుతం తాను దక్షిణ ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నాడు. ఇక అమితాబ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో బ్రహ్మాస్త్ర, ఝండ్, గుడ్‌బై, మేడే సినిమాలున్నాయి. వీటితోపాటు అతడు కౌన్ బనేగా కరోడ్‌పతి 12వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. -
విరుష్క బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే ఔరా అనాల్సిందే..
Virat Kohli-Anushka Sharma Bodyguard: దేశంలోని ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మెయింటైన్ చేయడం సాధారణ విషయమే. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు కూడా బాడీ గార్డ్‌ను మెయింటైన్ చేస్తున్నారు. అయితే విరుష్క జోడీ తమ బాడీ గార్డ్‌కు ఇస్తున్న జీతం ఎంతో తెలిస్తే ఔరా అనాల్సిందే. ఓ ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రకారం.. ఈ టాప్ సెలబ్రిటీ జంట తమ బాడీ గార్డ్‌కు చెల్లించే వేతనం ప్రముఖ కంపెనీల సీఈవోల జీతం కంటే చాలా రెట్లు ఎక్కువట. విరుష్క కపుల్ బాడీ గార్డ్‌గా సేవలందిస్తున్న ప్రకాశ్ సింగ్ అలియాస్ సోనూకు ఏటా రూ.1.2 కోట్ల వేతనం చెల్లిస్తున్నారట. అంటే సోనూ జీతం నెలకు 8 లక్షల 50 వేలు అన్నమాట. ఈ జీతం భారత్‌లోని చాలా కంపెనీల సీఈవోల వేతనం చాలా ఎక్కువ. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాడీ గార్డ్‌కు అంత జీతమా? అంటూ నెటిజన్లు నోర్లెళ్లబెడుతున్నారు. వేల కోట్లు సంపాదించే వారికి ఇదో లెక్కనా? అని మరికొంతమంది అంటున్నారు. బాడీ గార్డ్ ఉద్యోగం చేసినా బాగుండని మరికొంతమంది నిట్టూరుస్తున్నారు. ఇక సోనూను విరుష్క జోడీ బాడీ గార్డ్ కంటే తమ కుటుంబ సభ్యుడిగానే ట్రీట్ చేస్తోంది. ఎన్నోసార్లు అతని బర్త్‌డే వేడుకులను కూడా ఈ జోడీ సెలబ్రేట్ చేసింది. షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించి జీరో సినిమా షూటింగ్ సందర్భంగా కూడా అనుష్క.. సోనూ బర్త్‌డే వేడుకలు జరిపింది. ఇక అనుష్క ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా సోనూ కుటుంబ సభ్యుడిగా ఆమెకు సేవలందించాడు. కరోనా టైమ్‌లో పీపీఈ కిట్స్ ధరించి మరీ ఆమెకు రక్షణగా నిలిచాడు. ఇప్పుడు అతని బాధ్యత రెట్టింపు అయ్యింది. విరుష్క గారాల పట్టి వామికాను కంటికి రెప్పాల కాపాడుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇప్పటి వరకు ఆమె ఫొటోను రిలీజ్ చేయని నేపథ్యంలో కెమెరాల నుంచి కూడా రక్షించాల్సిన బాధ్యత సోనూపై ఉంది. కాగా, సోనూ మొదట అనుష్క శర్మ పర్సనల్ బాడీ గార్డ్‌గా ఉన్నాడు. అయితే పెళ్లి తర్వాత అతనే కోహ్లీకి కూడా సేవలందిస్తున్నాడు. ప్రస్తుతం వీరంతా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్ నిమిత్తం టీమిండియా కెప్టెన్ కోహ్లీతో పాటు అతని కుటుంబం కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. -
దీపిక పదుకొణె బాడీగార్డ్ జీతం తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు..
బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొణెకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. 'ఓం శాంతి ఓం' అనే చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దీపిక తొలి చిత్రంతోనే స్టార్ ఇమేజ్ను సంపాదించుకుంది. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్లో అగ్ర స్థానానికి చేరుకుంది. దీంతో దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా ఈ అమ్మడికి అభిమానులున్నారు. ఇక సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు..ఇలా ఎక్కడికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తారు. దీంతో దీపిక కాలు బయటపెట్టాంటే బాడీగార్డ్ ఉండాల్సిందే. మరి దీపికకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఆమె బాడీగార్డ్ ఎవరు? అతనికి ఎంత జీతం ఇస్తారు అన్న విషయాలపై ఆరా తీయగా ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఆమె పర్సనల్ బాడీగార్డ్ పేరు జలాల్. దీపిక ఎక్కడ ఔట్‌డోర్స్‌కి వెళ్లినా జలాల్ దీపిక వెంట ఉండాల్సిందేనట. కొన్ని సంవత్సరాలుగా దీపికను కాపాడుకుంటూ వస్తున్న జలాల్ జీతం తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఎందుకంటే అతను నెలకి అక్షరాలా 6.5 లక్షల రూపాయలు జీతంగా అందుకుంటున్నాడు. అంటే ఈ లెక్కన ఏడాదికి 80 లక్షల వరకు వస్తుందట. ఓ ఎమ్ఎన్సి కంపెనీలో పనిచేసే టాప్ గ్రేడ్ ఎంప్లొయ్ కి కూడా బహుశా ఇంత శాలరీ ఉండదమో అనిపించేలా దీపిక బాడీగార్డ్‌కు లక్షల్లో నెలవారీ జీతం వస్తుందట. ఇది కాకుండా పండుగలు వంటి ప్రత్యేక రోజుల్లో దీపిక నుంచి జలాల్ కుటుంబానికి ప్రత్యేకమైన బహుమతులు కూడా వెళ్తుంటాయట. అంతేకాకుండా దీపిక జలాల్‌ను సొంత సోదరుడిలా భావిస్తుందని, ప్రతీ ఏడాది రాఖీ కూడా కడుతుందని సమాచారం. రణ్వీర్-దీపికల పెళ్లి వేడకలోనూ జలాల్ సెక్యూరిటీ హెడ్‌గా విధులు నిర్వర్తించినట్లు బీటౌన్ టాక్. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం దీపిక భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి ‘83’ బయోపిక్‌లో నటించింది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఇక ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న ఓ సినిమాకు కూడా దీపిక సైన్ చేసింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.