
ముంబై : సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్లు బయట కనిపిస్తే వస్తే చాలు ఫోటోగ్రాఫర్లు తమ చుట్టూ చేరి హడావిడీ చేస్తూంటారు. అయితే తారలను క్లిక్‌మనిపించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వారి ప్రవర్తనతో సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంటారు. అందుకే హీరో, హీరోయిన్లకు ఎప్పుడు కాలు బయట పెట్టినా చుట్టూ సెక్యూరిటీ గార్డులను వెంట పెట్టుకుంటారు. అయినప్పటికీ ఎంతో కొంత ఫోటో గ్రాఫర్లతో కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ దిశాపటానీ కూడా చేరిపోయారు. ఆదివారం దిశాపటానీ బాడీగార్డ్ ఓ ఫోటో గ్రాఫర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. (యాక్షన్ సినిమా చేయాలనుంది)
ఓ చోటుకు వెళ్లిన దిశాను తన బాడీగార్డ్ కారు వద్దకు తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా కారు డోర్ వద్దకు పాప్ భయానీ ఫోటోగ్రాఫర్‌క కుతభ్ వచ్చి దిశాను ఓ ఫోటో తీయడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన బాడీగార్డ్ అతనిని అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాదన కొనసాగింది. అనంతరం సహనం కోల్పోయిన అతను. ఫోటోగ్రాఫర్‌ను నెట్టేశాడు. ఇక దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. చివరగా దిశా పటానీ మేనేజర్ తమకు క్షమాపణలు కోరారని పేర్కొన్నాడు. కాగా దిశా ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే సినిమాలో సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment