photo grapher
-
ఏపీ: వానలే వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు (ఫొటోలు)
-
ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’కి ఆరు బహుమతులు (ఫొటోలు)
-
ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’కి ఆరు బహుమతులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల ఫలితాలను గురువారం ప్రకటించారు. ఇందులో బంగారు తెలంగాణ విభాగంలో సాక్షి దినపత్రిక సూర్యాపేట ఫొటో జర్నలిస్టు అనమల యాకయ్యకు ద్వితీయ బహుమతి, పల్లె, పట్టణ ప్రగతి విభాగంలో సాక్షి హైదరాబాద్ సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎన్.రాజేశ్‌రెడ్డి, ఇదే విభాగంలో సిద్దిపేట సాక్షి ఫొటో జర్నలిస్టు సతీశ్‌లకు కన్సోలేషన్ బహుమతి, అలాగే ఉత్తమ వార్తా చిత్రం విభాగంలో సాక్షి సంగారెడ్డి జిల్లా ఫొటో జర్నలిస్టు బి.శివప్రసాద్‌కు తృతీయ బహుమతి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో సాక్షి దినపత్రిక మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ ఫొటో జర్నలిస్టు వి.భాస్కర్ ఆచారికి తృతీయ బహుమతి, ఇదే విభాగంలో సాక్షి యాదాద్రి ఫొటో జర్నలిస్టు కె.శివకుమార్‌కు కన్సోలేషన్ బహుమతి లభించింది. సమాచార, పౌరసంబంధాల శాఖ వివిధ విభాగాల్లో పోటీలకు జూలై 9న ఎంట్రీలను ఆహ్వానించింది. దీనికి స్పందనగా 96 మంది మొత్తం 1,200 ఫొటోలను ఈ పోటీలకు పంపారు. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.నాగరాజు, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ గోవిందరాజు చక్రధర్, హిందూ దినపత్రిక మాజీ చీఫ్ ఫొటోగ్రాఫర్ హెచ్. సతీష్ సభ్యులుగా ఉన్న కమిటీ విజేతలను ఎంపిక చేసింది. మొదటి బహుమతి కింద రూ. 20,000, ద్వితీయ బహుమతికి రూ.15,000, తృతీయ బహుమతికి 10,000, కన్సోలేషన్ బహుమతికి రూ.5,000 నగదు అలాగే జ్ఞాపిక, సర్టిఫికెట్ అందచేస్తారు. ఈనెల 25న విజేతలకు బహుమతులను అందచేస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇళ్లే మిగిలాయి!
ఈ ఫొటోలోని ఇళ్లను చూస్తున్నారుగా. కొండపైన భలే కట్టుకున్నారు కదా. యెమెన్ హధర్మట్ ప్రాంతంలోని డవన్ లోయలో ఉంది ఈ ప్రాంతం. దీనికి సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఇదో గ్రామం. పేరు హైద్ అల్ జజిల్. వందలాది మంది నివసించేవారు. కానీ 2004 నాటి జనాభా లెక్కల్లో ఇక్కడ 17 మందే ఉన్నారని తేలింది. ఇప్పుడు ఇక్కడ ఒక్కరంటే ఒక్కరే ఉంటున్నారు. మంచి వేతనాలు వస్తున్న, అన్ని సౌకర్యాలున్న సౌదీ అరేబియాకు అనేక మంది వలస వెళ్లారు. దీంతో వరదలు వచ్చి ఇక్కడి ఇళ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో మరింత శిథిలమయ్యాయి. కొన్నాళ్లుగా కాల్పుల మోతతో దద్దరిల్లిన యెమెన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఫొటోగ్రాఫర్ తారిక్ జైదీ ఇటీవల ఈ ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితులను తన కెమెరాలో బంధించారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
పక్షులన్నీ కలిసి రాకాసి పక్షిలా.. ఎందుకిలా..?
రోబో–2 చూశారుగా.. అందులో చిన్నచిన్న పక్షులన్నీ కలిసి ఓ భారీ రాకాసి పక్షిగా మారుతాయి.. ఇది కూడా దా దాపు అలాంటిదే.. ఇటీవల ఐర్లాండ్‌లోని లాక్ ఎనెల్ సరస్సు వద్ద మందలుమందలుగా ఎగురుతున్న ఈ బుల్లి పిట్టలు ఇలా ఓ భారీ పక్షి ఆకారాన్ని తలపించాయి. ఈ చిత్రాన్ని ఐరిష్ ఫొటోగ్రాఫర్ జేమ్స్ క్రాంబీ క్లిక్‌మని పించారు. పిట్టలు గుంపులుగా ఎగరడాన్ని ఆంగ్లంలో మర్మురేషన్ అంటారు. ఇంతకీ ఇవి ఎలా ఎందుకు కలిసి ఎగురుతాయో తెలుసా? ముఖ్యంగా తమను వేటాడే భారీ పక్షుల నుంచి భద్రత కోసమట.. వేలాదిగా ఉండటంతో.. ఒక్కదాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వాటికి కష్టమవుతుందట. అంతేకాదు.. రాత్రి వేళల్లో వెచ్చదనం కోసం.. మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందన్న సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా ఇలా గుంపుగా ఎగురుతాయట. చదవండి: (ఈ మగ దోమలు చాలా మంచివి.. యవ్వనంలోకి వచ్చేలోపే చనిపోతాయట) -
ఆ ఫొటోలు తీసినందుకు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు..
రవి చూడని బ్రిటీష్ పాలన గురించి విని ఉంటారు.. కానీ నేటికీ అక్కడి నిరంకుశ పాలనలో అభివృద్ధికి, టెక్నాలజీకి ఆమడ దూరంలో ఉన్నారీ దేశ ప్రజలు. అక్కడ పర్యటించాలన్నా, కనీసం మనసును కదిలించిన ఫొటోలు తీసుకోవలన్నా అడుగడుగునా ఆంక్షలే. ఇలాంటి వాటిని కూడా నిషేధిస్తారా అనే అనుమానం కలుగుతుంది ఇది చదివితే. ఎరిక్ లాఫోర్గ్ ఈ ఫొటోలు తీసినప్పుడు అసలూహించి ఉండడు. కేవలం ఆ ఫొటోలు మూలంగా ఆ దేశం నుంచి శాశ్వతంగా భహిష్కరించబడతాడని. మర్మదేశంగా పేర్కొనే నార్త్ కొరియాకు సంబంధించిన ఫొటోలే అవి. అక్కడి అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ వీటిని తీవ్రంగా వ్యతిరేకించాడట. కిమ్ అనుమతి లేకుండా ఆ దేశానికి సంబంధించి చిన్న చీపురుపుల్ల కూడా ప్రపంచాన్ని చూడదు. అటువంటి అక్కడి పేదరికాన్ని, ప్రజల దుర్భర జీవనాన్ని గురించి ఫొటోలు తీస్తే ఊరుకుంటాడా! అయినప్పటికీ ఆ ఫొటోలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఫొటోగ్రాఫర్ ఎరిక్ లాఫోర్గ్ మాటల్లోనే.. 2008 నుంచి ఆరు సార్లు ఉత్తర కొరియాను సందర్శించాను. వాళ్లు నా దగ్గరి ఫొటోలు డిలీట్ చేయమన్నప్పుడు, వాటిని సేవ్ చేసి, డిలీట్ చేశాను. థ్యాంక్స్ టు డిజిటల్ మీడియా!! పోషకాహారలోపంతో బాధపడే ఈ విధమైప పిల్లల ఫొటోలు తీయడం ఉత్తర కొరియాలో నిషేధం. అంతేకాదు పేదరికాన్ని తెలియజేసే ఏ విధమైన ఫొటోలు తీయకూడదు. రాళ్లపై నిద్రపోతున్న ఇతని ఫొటోను కూడా డిలీట్ చేయమన్నారు. ఎందుకంటే ఈ ఫొటోలో అతను మృతి చెందినట్టు కనిపిస్తున్నాడు. ఈ ఫొటో తీస్తున్నప్పుడు కరెంట్ పోయింది. దీన్ని కూడా డిలీట్ చేయమన్నారు. పైగా అమెరికా ఆంక్షల వల్లనే కరెంట్ కోతలని చెప్పారు. పనులకు వెళ్లడానికి గంటల తరబడి సైకిళ్లను తొక్కేవారి ఫొటోలు తీయడం కూడా నిషేధమే. చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. నార్త్ కొరియాలో ప్రతీచోట కనిపించే సైనికులకు సంబంధించిన ఫొటోలు అస్సలు తీయకూడదు. మరీ ముఖ్యంగా ఆగిపోయిన బస్సులను తోసే సమయంలో అస్సలు తీయకూడదు. క్రమశిక్షణలేని పిల్లల ఫొటోలు కూడా తీయకూడదు. పేదరికంలో మగ్గుతున్నవారి జీవనవిధానాన్ని ఫొటోల్లో బంధించడం అక్కడి చట్టం ప్రకారం నేరం. వాక్ వే సరిహద్దులను రిపేర్ చేస్తున్న మహిళలు, పిల్లలకు సంబంధించిన ఇలాంటి ఫొటోలు తీయడం కూడా చట్టవిరుద్ధమే. నాయకుల చిత్రాల ముందు నవ్వుతున్నవారి ఫొటోలు తీయడం అగౌరవంగా భావిస్తారు. చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! సైనికులు కనిపించకుండా జంతువుల ఫొటోలు తీసుకోవచ్చు. కానీ అక్కడ ఇది పూర్తిగా అసాధ్యం. ఎందుకంటే ప్రతీచోట పోగయ్యే ప్రజలకన్నా సైనికులే 99 శాతం ఉంటారు. తినటానికి గడ్డిని సమకూర్చుకునే నార్త్ కొరియన్ ఫొటోలు తీయకూడదు. ఇది కూడా చట్ట విరుద్ధమే. ప్యోంగ్యాంగ్ రోడ్లపై అరుదుగా కార్లు కనిపిస్తాయి. కార్లు ఓ వైపు వెళ్తున్నారోడ్డు మధ్యలో పిల్లలు ఆడుకుంటారు. ఈ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు కూడా తీయకూడదు. సాంగ్డౌన్లో ఎస్కలేటర్‌ను చూసి భయపడుతున్న పిల్లలు వీళ్లు. ఈ దేశ ప్రజల్లో చాలా మందికి అది ఏమిటో కూడా తెలియదు. మరమ్మత్తులు అవసరమైన ఈ పాత బిల్డింగ్, ఆహారం కోసం చేపలు పట్టే వ్యక్తి, కాలుష్యంతో నిండిన నదిలో స్నానం చేసే వ్యక్తి, గుండీలు ఊడిన వ్యక్తి ఫొటోలు, విశ్రాంతి తీసుకునే సైనికులు, నిరాశ్రయులైన వ్యక్తులకు సంబంధించిన ఫొటోలు, మురికి దుస్తులతో ఉన్న వ్యక్తుల ఫొటోలు తీయడం అక్కడి చట్టం ప్రకారం నేరం. చాలా మటుకు నార్త్ కొరియా దేశంలో పేరదికమే కనిపిస్తుంది. ఇతర ప్రపంచదేశాలు తమను తక్కువచేసి చూస్తారనే భయం, ఆంధోళన అక్కడి నాయకుడిలో స్పష్టంగా కనిపిస్తోంది. నిరంకుశ పాలన పరాకాష్టకు చేరితే ఉత్తర కొరియాలా ఉంటుందనడానికి ఈ ఫొటోలపై ఉన్న నిషేధమే నిదర్శనం. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
పెళ్లి కూతురు నవ్వింది.. అసలు నిజం ఇదే!
ఆ పెళ్లి కూతురు పగలబడి నవ్వింది. నేల మీద పడి దొర్లుతూ నవ్వింది. 45 సెకన్ల ఈ వీడియోని వారం రోజుల్లో మిలియన్ మంది చూశారు. ఒక పెళ్లి కూతురు పెళ్లిపీటల మీద ఫొటోలు తీస్తుండగా, పగలబడి నవ్విన వీడియో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ వీడియోను రేణుక మోహన్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఎంత నిజం ఉందో, అంత అబద్ధం ఉంది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు.. ఫొటోగ్రాఫర్‌కి పోజులిస్తున్నట్లుగా ఈ వీడియో మొదలవుతుంది. అమ్మాయి ఒక్కర్తికే ఫొటోలు తీయటంతో అసలు కష్టాలు మొదలయ్యాయి. తనకు కావలసిన యాంగిల్స్ కోసం ఫొటోగ్రాఫర్ పెళ్లికూతురు ముఖాన్ని పదేపదే ముట్టుకుంటూండటంతో, పెళ్లికొడుకులో అసహనం బయలుదేరింది. వెంటనే ఫొటోగ్రాఫర్‌ని తోసేస్తూ, స్టేజ్ దిగి కిందకు వెళ్లిపోమన్నాడు. ఒక పక్కన పెళ్లికొడుకు కోపంతో ఊగిపోతుంటే, ఈ పక్కన పెళ్లికూతురు పగలబడి నవ్వటం ప్రారంభించింది. ఈ నవ్వుని ఆ ఫొటోగ్రాఫర్ వీడియో తీశాడు. ఆమె నేల మీద దొర్లుతూ పడీపడీ నవ్వుతూనే ఉంది. ఈ వీడియో ట్వీట్‌కి పదహారువేల రీట్వీట్లు వచ్చాయి. ఈ వీడియో వైరల్ కావటం చూసిన పెళ్లికూతురు స్పందిస్తూ, ఇది నిజం పెళ్లి వీడియో కాదనీ, సినిమా షూటింగ్ అనీ చెప్పారు. ఆ పెళ్లికూతురు ఛత్తీస్‌ఘడ్ నటి అనుకృతి చౌహాన్. సినిమా పేరు ‘డార్లింగ్ ప్యార్ ఝుక్తా నహీ’. రేణుకా మోహన్ ట్వీట్ చేసినందుకు సంతోషపడుతూ, ‘యే మేరీ మూవీ షూట్ కే టైమ్ కీ వీడియో హై’ అని కామెంట్ బాక్స్‌లో రాశారు అనుకృతి చౌహాన్. ఏమైతేనేం, ట్వీట్ చూసిన వారంతా హాయిగా నవ్వుకున్నారు. చదవండి: ఫోటో గ్రాఫర్ ఓవరాక్షన్.. వరుడి రియాక్షన్: వైరల్ I just love this Bride 👇😛😂😂😂😂 pic.twitter.com/UE1qRbx4tv — Renuka Mohan (@Ease2Ease) February 5, 2021 -
‘సాక్షి’ ఫొటో జర్నలిస్టుపై దాడి
సాక్షి, చార్మినార్ (హైదరాబాద్): సాక్షి దినపత్రిక ఫొటో జర్నలిస్టు గాలి అమర్‌పై బుధవారం సిటీ కాలేజీ చౌరస్తా వద్ద ఐదుగురు దుండగులు దాడి చేసి గాయపరిచారు. విధి నిర్వహణలో ఉన్న అమర్‌పై స్థానికులు అకారణంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. పేట్లబురుజు సిటీ కాలేజీ చౌరస్తా వద్ద సిగ్నల్స్ పనితీరు, వాహనాల రాకపోకలపై ఫొటోలు చిత్రీకరిస్తుండగా స్థానికంగా నివాసముంటున్న కొందరు అమర్‌ను అడ్డుకుని చితకబాదారు. కెమెరాతో పాటు సెల్‌ఫోన్ లాక్కున్నారు. అక్కడి వాహనదారులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఆగలేదు. చదవండి: మాజీ ఎమ్మెల్యే ‘వరద’ కుమారుడు, అల్లుడిపై కేసు చార్మినార్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకుని దుండగుల దాడి నుంచి ఫొటో జర్నలిస్టును కాపాడాడు. లాక్కున్న కెమెరాతో పాటు సెల్‌ఫోన్‌ను దుండగుల నుంచి తిరిగి ఇప్పించాడు. బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చార్మినార్ ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్ తెలిపారు. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి: ‘సాక్షి’ బాల ఎడిటర్లు 301 మంది నిందితులపై చర్యలు తీసుకోవాలి.. ‘సాక్షి’ఫోటో జర్నలిస్టు గాలి అమర్‌పై అకారణంగా దాడికి పాల్పడిన దుండగులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సిరిగిరి విజయ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, జనరల్ సెక్రటరీ కేఎన్ హరి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగు వెంకటేశ్ గౌడ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్ దాడిని ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఫోటోగ్రాఫర్‌తో దిశాపటానీ బాడీగార్డ్ వాగ్వాదం
-
ఫోటోగ్రాఫర్‌తో హీరోయిన్ బాడీగార్డ్ వాగ్వాదం
ముంబై : సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్లు బయట కనిపిస్తే వస్తే చాలు ఫోటోగ్రాఫర్లు తమ చుట్టూ చేరి హడావిడీ చేస్తూంటారు. అయితే తారలను క్లిక్‌మనిపించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వారి ప్రవర్తనతో సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంటారు. అందుకే హీరో, హీరోయిన్లకు ఎప్పుడు కాలు బయట పెట్టినా చుట్టూ సెక్యూరిటీ గార్డులను వెంట పెట్టుకుంటారు. అయినప్పటికీ ఎంతో కొంత ఫోటో గ్రాఫర్లతో కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ దిశాపటానీ కూడా చేరిపోయారు. ఆదివారం దిశాపటానీ బాడీగార్డ్ ఓ ఫోటో గ్రాఫర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. (యాక్షన్ సినిమా చేయాలనుంది) ఓ చోటుకు వెళ్లిన దిశాను తన బాడీగార్డ్ కారు వద్దకు తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా కారు డోర్ వద్దకు పాప్ భయానీ ఫోటోగ్రాఫర్క కుతభ్ వచ్చి దిశాను ఓ ఫోటో తీయడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన బాడీగార్డ్ అతనిని అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాదన కొనసాగింది. అనంతరం సహనం కోల్పోయిన అతను. ఫోటోగ్రాఫర్‌ను నెట్టేశాడు. ఇక దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. చివరగా దిశా పటానీ మేనేజర్ తమకు క్షమాపణలు కోరారని పేర్కొన్నాడు. కాగా దిశా ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే సినిమాలో సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్నారు. -
రండి.. కూర్చోండి
ఫొటోగ్రాఫర్లు వెంట పడుతున్నప్పుడు సినీ సెలబ్రిటీలు వీలైనంతవరకు నవ్వుముఖంతో ఉండేందుకే ప్రయత్నిస్తారు. మరీ ఇబ్బందిగా అనిపించినప్పుడే కాస్త రుసరుసలాడతారు. దీపికా పడుకోన్ సోమవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయి, తన కారు సిద్ధంగా ఉన్న చోటుకు నడుచుకుంటూ వెళుతున్నంతసేపూ ఫొటోజర్నలిస్టులు తమ కెమెరాలను క్లిక్.. క్లిక్ మనిపిస్తూనే ఉన్నారు. సిల్వర్ కలర్ ప్యాంట్, వైట్ టీ షర్ట్‌లో ‘టక్’ చేసుకుని, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని స్టెయిల్‌గా అడుగులు వేస్తున్న దీపిక.. వాళ్ల వైపు చూసీ చూడనట్లు, నవ్వీ నవ్వనట్లు నడుస్తూ కారు దగ్గరికి రాగానే.. కారు వైపు చేతిని చూపిస్తూ.. నవ్వు ముఖంతో ‘‘ఆజా.. బైట్ జా’’ అని అనడంతో ఫొటో జర్నలిస్టుల ముఖాలు కూడా ఫ్లాష్ అయ్యాయి. ఈ వీడియో గత ఇరవై నాలుగు గంటలుగా వైరల్ అవుతోంది. ఎక్కువ శాతం మంది దీపిక గొప్పతనాన్ని ప్రశంసిస్తుంటే.. కొంతమంది మాత్రమే ‘దీపిక.. ఫొటో జర్నలిస్టులను అవమానించారు. తన కోపాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేశారని ఈజీగా తెలిసిపోతోంది. ‘ఎంతసేపని నన్ను ఫాలో అవుతారు. వచ్చి కారులో కూడా కూర్చుంటారా ఏంటీ..!’ అని అర్థంలో దీపిక అలా ‘రండి.. వచ్చి కూర్చోండి’ అన్నారు’’ అని ఆమెను విమర్శిస్తున్నారు. -
సాక్షి ఫొటోగ్రాఫర్‌కు గాయాలు
సాక్షి, వైఎస్సార్ కడప : సాక్షి మీడియా సంస్థలో పనిచేస్తున్న ఫొటోగ్రాఫర్ రమేష్‌ను బైక్ ఢీకొట్టింది. నూతన సంవత్స వేడుకల సందర్భంగా కడప పట్టణంలోని ఏడురోడ్ల కూడలి వద్ద ఫొటోలు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం సేవించి వాహనం నడిపిన యువకులు అతివేగంగా వచ్చి రమేష్‌ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని తిరుమల ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. -
అవార్డుల్లో ‘క్లిక్’ అయింది..
అద్భుతంగా ఉంది కదూ.. ఇటలీలో మిరుమిట్లు గొలిపేలా కనిపించిన మన పాలపుంత (మిల్కీవే)ను ఇవాన్ అనే ఫొటోగ్రాఫర్ ఇలా కెమెరాలో బంధించాడు. పాలపుంత అందాలను కళ్లకు కడుతున్న ఈ ఫొటో అద్భుతంగా ఉంది కాబట్టే.. సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డు-2014 ఓపెన్ కేటగిరీలో మొదటి స్థానాన్ని గెలుచుకుంది. 70 వేల ఎంట్రీలను తోసిరాజని ఈ ఫొటో అవార్డును దక్కించుకుంది. అన్నట్టూ... విశ్వంలో కోట్ల గెలాక్సీలు ఉండగా.. అందులో మన పాలపుంత కూడా ఒకటి. పాలపుంతలో సూర్యుడితో సహా సుమారు పది వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయట. -
చావు లేకుండా జీవించడం ఎలా?
పంచమి ఓ మంచి ఫొటోగ్రాఫర్. ఫొటోలు తీయడానికి అడవుల్లోకి వెళ్లి, అనుకోకుండా అక్కడే రెండు రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తుంది. ఆ అడవిలో ఏం జరిగింది? పంచమి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది? అనే కథాంశంతో మేఘన మరియు హర్ష సమర్పణలో డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘పంచమి’. టైటిల్ రోల్‌ని అర్చన చేయగా, సుజాత భౌర్య దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు తెలుగులో రాని కథ, కథనాలతో ఈ చిత్రం చేశాం. సైంటిఫిక్‌గా మనిషి మరణం లేకుండా జీవించడం ఎలా? అనేది ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. తనికెళ్ల భరణిగారి వాయిస్ ఓవర్, శ్రీకోటి స్వరపరచిన పాటలు, గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో సుజాత ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. -
ధర్మాస్పత్రిలో.. దారుణం
రామగుండం, న్యూస్‌లైన్ : యైటింక్లయిన్‌కాలనీలోని అల్లూరు ప్రాంతానికి చెందిన ఏగోలపు స్వామిగౌడ్ ప్రైవేట్ బస్సు డ్రైవర్, ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుంటాడు. అతడి భార్య కావ్య(24) ఉరఫ్ సుమతి గర్భం దాల్చడంతో ప్రతీనెలా పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్హోంల్లో చికిత్స చేయిస్తున్నారు. కావ్యకు తొమ్మిది నెలలు నిండడంతో ఈ నెల 28న డెలివరీ అవుతుందని వైద్యులు చెప్పారు. గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి లో ప్రసవాలు మంచిగా చేస్తున్నారని అల్లూరులోని ఏఎన్ఎం, ఆశావర్కర్ సూచించారు. దీంతో కుటుంబసభ్యులు కావ్యను శనివారం ఉదయం 7గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యు లు కావ్యకు ప్రసవం చేయడం హైరిస్క్ అని చెబుతూనే వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని సూచించారు. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పి, లేబర్ రూంలో రాత్రి 10.30 గంటలకు డాక్టర్లకు బదులు నర్సులే ప్రసవం(చిన్నాపరేషన్) చేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో కావ్య, భర్త స్వామి, కావ్య తల్లి రాజేశ్వరి ఆనందపడ్డారు. పిల్లలను చూసిన కావ్య నవ్వుతూ సంతోషంతో వారిని ముద్దాడింది. అర్ధరాత్రి దాటాక ఇద్దరు పిల్లలను పిల్లల వైద్యనిపుణుడి పర్యవేక్షణ కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో కావ్యకు రక్తస్రావం ఎక్కువైంది. ఆస్పత్రిలో అత్యసవర మందులు లేవని చెప్పిన వైద్య సిబ్బంది ప్రైవేట్ మెడికల్ షాపులో ఒక ఇంజక్షన్, ఆరు టాబ్లెట్లు తీసుకురావాలని చిట్టి రాసి పంపించారు. అర్ధరాత్రి తర్వాత ఒక్క మెడికల్ షాపు కూడా తెరిసి ఉండకపోడంతో నగరం మొత్తం మందుల కోసం పరుగులు తీశారు. చివరికి ఓ మెడికల్ షాపు నుంచి కొనుగోలు చేసి ఆస్పత్రికి రాగా అప్పటికే కావ్య చనిపోయిందని సిబ్బంది చెప్పారు. దీంతో ఒక్కసారిగా స్వామి, కావ్య తల్లి కుప్పకూలారు.. మృతురాలి బంధువులు ఆగ్రహంతో ఆస్పత్రిలోని అద్దాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు వేకువజామున ఆస్పత్రికి వచ్చి భద్రత చర్యలు తీసుకున్నారు. విషాదం స్వామికి కావ్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 14న పెళ్లయింది. స్వామి తల్లిదండ్రులు గతంలోనే చనిపోగా కావ్య తండ్రి చిన్నప్పుడే చని పోయాడు. కవల పిల్లలకు జన్మనిచ్చి కావ్యకూడా దూరం కావడంతో స్వామితోపాటు ఆమె తల్లి గుండెలవిసేలా రోదిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే... డెలివరీ అయ్యాక అందరితో మంచిగా మాట్లాడిన కావ్య రక్తస్రావంతో చనిపోవడానికి వైద్యులే కారణమని భర్త స్వామి, మృతురాలి తల్లి రాజేశ్వరి ఆరోపించారు. ప్రసవం కోసం వస్తే నరకం చూపించి కావ్య ప్రాణం తీశారని విలపించారు. ఉదయం 7 గంటలకు ఆస్పత్రికి తీసుకొస్తే, రాత్రి 10.30 గంటలవరకు పురిటినొప్పులతో తల్లడిల్లిందన్నారు. ప్రసవం చేయడానికి ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరని రోదించారు. ఎలా చనిపోయిందని నిలదీస్తే, ఎక్కడెక్కడ వైద్యం చేయించుకున్నారో వివరాలెందుకు చెప్పలేదని పొంతలేని ప్రశ్నలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావ్య ప్రసవించిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది రూ.1,800 వసూలు చేశారని బంధువులు ఆరోపించారు. ఎవరిని వదలం ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింత చనిపోయిందని తెలియడంతో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించి వివరా లు తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యమని తేలితే ఎవరిని వదిలిపెట్టేది లేదని, న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. వైద్యులు, నర్సులపై కేసు వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. స్వామి ఫిర్యాదు మేరకు... ప్రసవం చేసిన నర్సులు నాన్సీ, పుష్ప, స్వాతితోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వచ్చిన ఆరోపణలపై సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు, డ్యూటీ డాక్టర్ సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వలీబాబా తెలిపారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు మృతదేహానికి పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.