Truth Behind Viral Video Of Groom Slaps Photographer During Wedding Photoshoot - Sakshi
Sakshi News home page

పెళ్లి కూతురు నవ్వింది.. అసలు నిజం ఇదే!

Published Thu, Feb 11 2021 8:12 AM | Last Updated on Thu, Feb 11 2021 12:19 PM

Groom Slaps Photographer In Wedding Photoshoot, what Is Real - Sakshi

ఆ పెళ్లి కూతురు పగలబడి నవ్వింది. నేల మీద పడి దొర్లుతూ నవ్వింది. 45 సెకన్ల ఈ వీడియోని వారం రోజుల్లో మిలియన్‌ మంది చూశారు. ఒక పెళ్లి కూతురు పెళ్లిపీటల మీద ఫొటోలు తీస్తుండగా, పగలబడి నవ్విన వీడియో కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఆ వీడియోను రేణుక మోహన్‌ ట్వీట్‌ చేశారు. ఈ వీడియోలో ఎంత నిజం ఉందో, అంత అబద్ధం ఉంది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు.. ఫొటోగ్రాఫర్‌కి పోజులిస్తున్నట్లుగా ఈ వీడియో మొదలవుతుంది. అమ్మాయి ఒక్కర్తికే ఫొటోలు తీయటంతో అసలు కష్టాలు మొదలయ్యాయి. తనకు కావలసిన యాంగిల్స్‌ కోసం ఫొటోగ్రాఫర్‌ పెళ్లికూతురు ముఖాన్ని పదేపదే ముట్టుకుంటూండటంతో, పెళ్లికొడుకులో అసహనం బయలుదేరింది. వెంటనే ఫొటోగ్రాఫర్‌ని తోసేస్తూ, స్టేజ్‌ దిగి కిందకు వెళ్లిపోమన్నాడు.

ఒక పక్కన పెళ్లికొడుకు కోపంతో ఊగిపోతుంటే, ఈ పక్కన పెళ్లికూతురు పగలబడి నవ్వటం ప్రారంభించింది. ఈ నవ్వుని ఆ ఫొటోగ్రాఫర్‌ వీడియో తీశాడు. ఆమె నేల మీద దొర్లుతూ పడీపడీ నవ్వుతూనే ఉంది. ఈ వీడియో ట్వీట్‌కి పదహారువేల రీట్వీట్‌లు వచ్చాయి. ఈ వీడియో వైరల్‌ కావటం చూసిన పెళ్లికూతురు స్పందిస్తూ, ఇది నిజం పెళ్లి వీడియో కాదనీ, సినిమా షూటింగ్‌ అనీ చెప్పారు. ఆ పెళ్లికూతురు ఛత్తీస్‌ఘడ్‌ నటి అనుకృతి చౌహాన్‌. సినిమా పేరు ‘డార్లింగ్‌ ప్యార్‌ ఝుక్తా నహీ’. రేణుకా మోహన్‌ ట్వీట్‌ చేసినందుకు సంతోషపడుతూ, ‘యే మేరీ మూవీ షూట్‌ కే టైమ్‌ కీ వీడియో హై’ అని కామెంట్‌ బాక్స్‌లో రాశారు అనుకృతి చౌహాన్‌. ఏమైతేనేం, ట్వీట్‌ చూసిన వారంతా హాయిగా నవ్వుకున్నారు. 
చదవండి: ఫోటో గ్రాఫర్‌ ఓవరాక్షన్‌.. వరుడి రియాక్షన్‌: వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement