పెళ్లిళ్లకు హాజరయ్యేటప్పుడు నూతన వధూవరులకు కట్నకానుకలు అందించడం కామన్. కానీ ఇందుకు భిన్నంగా పెళ్లి మండపంలోనే ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యకు వినూత్న గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ వరుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే..
అజ్లాన్ అనే వ్యక్తి వరిషా అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లిమండంలోనే వధువుకు ఓ బహుమతి ఇవ్వాలని అజ్లాన్ నిర్ణయించుకున్నాడు. దీంతో వరుడు వధువుకి ఓ గాడిద పిల్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దానిని చూసిన వధువు షాక్ అవ్వలేదు. ఎందుకంటే అతనికి ముందే తెలుసు వధువు జంతు ప్రేమికురాలని. అందుకే చిన్న గాడిద పిల్లను ఆమెకు వివాహ కానుకగా ఇవ్వాలనున్నట్లు వరుడు అజ్లాన్ చెప్పాడు.
కాబోయే భార్యకు ఈ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చే సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను వరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో పెళ్లిలో బహుమతిగా ఈ గాడిదను ఎందుకు ఎంచుకున్నావు అని వధువు అడిగితే ఒకటేమో అదంటే నీకు ఇష్టం, రెండోది గాడిద అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టపడే, అత్యంత ప్రేమగా ఉండే జంతువు అని వరుడు బదులిచ్చాడు.
అంతేగాక గాడిద పిల్లను దాని తల్లి నుంచి వేరు చేయలేదని.. తల్లి కూడా ఈ పిల్ల గాడిదతోనే ఉందని తెలిపాడు. తనకు జంతువులు అంటే చాలా ఇష్టమని, జనాలు ఏమైనా అనుకోనివ్వండి. వారిశాకు ఇదే నా బహుమతి అంటూ పేర్కొన్నాడు. అజ్లాన్ మాటలు విన్న వధువు వారిశా తాను దీన్ని కేవలం గాడిదలా చూడటం లేదని తెలిపింది.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఊహించని గిఫ్ట్‌ను చూసి కొందను నవ్వుతుంటే.. మరికొందరు మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు.. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని నూతన జంటకు శుభాకాంక్షలు తెలపుతున్నారు.. అలాగే గాడిద పిల్ల కూడా క్యూట్‌గా అందంగా ఉందంటూ, ఎవరు ఏమనుకుంటారనే దాని గురించి పట్టించుకోవద్దని కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment