wedding gift
-
హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
హీరోయిన్ సోనాక్షి సిన్హా రీసెంట్గా పెళ్లి చేసుకుంది. గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్న రైటర్ జహీర్ ఇక్బాల్‌తో ఒక్కటైంది. జూన్ 23న జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే మతాల వేరు కావడంతో ఈ వివాహం సోనాక్షి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని రూమర్స్ వచ్చాయి. ఇందుకు తగ్గట్లే పెళ్లిలో సోనాక్షి అన్నదమ్ములు కనిపించలేదు.(ఇదీ చదవండి: 'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా?)ఇకపోతే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సోనాక్షి-జహీర్ ఇక్బాల్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే సోనాక్షితో వివాహం జరగడానికి ముందే జహీర్ ఖరీదైన బహుమతి ఇచ్చాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీని ఖరీదు దాదాపు రూ.2 కోట్లకు పైనే అని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.పెళ్లి తర్వాత సెలబ్రేషన్స్ కోసం సోనాక్షి-జహీర్ కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి బీఎండబ్ల్యూ ఐ7 కారులో వచ్చారు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు.. జహీర్, సోనాక్షికి బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది. మార్కెట్లో దీని ధర రూ.2 నుంచి రూ.3 కోట్ల మధ్యలో ఉంది. ఏదేమైనా పెళ్లికి వేరే వాళ్లు గిఫ్ట్స్ ఇవ్వడం కామన్. కానీ భర్త నుంచి ఇంత కాస్ట్ లీ బహుమతి రావడం మాత్రం సోనాక్షికి మరపురాని బహుమతిగా మిగిలిపోతుంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' సరికొత్త రికార్డులు.. ఆ సినిమాల్ని దాటేసి ఏకంగా!) -
నూతన దంపతులకు శ్రీవారి సేవ, దర్శనం
-
మహిళను పరిచయం చేసుకుని.. పెళ్లి గిఫ్ట్ అంటూ షాకింగ్ ట్విస్ట్
బనశంకరి(కర్ణాటక): సిలికాన్‌సిటీలో సైబర్ కేటుగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయక ప్రజలను వంచించి లక్షలు దోచేస్తున్నారు. ఫేస్బుక్లో మహిళను పరిచయం చేసుకున్న సైబర్ కేటుగాళ్లు మ్యారేజ్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి రూ.3.71 లక్షలు వంచనకు పాల్పడ్డారు. ఫేస్బుక్లో పరిచయం.. బాధితురాలు అమరావతికి ఫేస్బుక్లో గుర్తు తెలియని యువకుడు పరిచయమయ్యాడు. అతనికి ఆమె తన వాట్సాప్ నెంబర్ ఇచ్చింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఇదే క్రమంలో సైబర్ మోసగాడు నీకు విలువైన మ్యారేజ్ కానుక ఇస్తానని నమ్మించాడు. చదవండి: ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఎవిడెన్స్.. కొద్దిరోజుల తరువాత అమరావతికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరుతో విలువైన కానుకలు వచ్చాయని, వాటిని పొందడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పాడు. దీంతో దశల వారీగా ఆమె రూ. 3.71 లక్షలు వారు చెప్పిన ఖాతాలకు జమ చేశారు. ఇక ఎన్ని రోజులైన గిఫ్ట్ రాకపోవడంతో పరిచయమైన వ్యక్తి ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయినట్లు భావించి సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. -
పెళ్లిలో వధువుకు ‘గాడిద’ను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. ఎందుకో తెలుసా!
-
Video: పెళ్లిలో వధువుకు ‘గాడిద’ను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. ఎందుకో తెలుసా!
పెళ్లిళ్లకు హాజరయ్యేటప్పుడు నూతన వధూవరులకు కట్నకానుకలు అందించడం కామన్. కానీ ఇందుకు భిన్నంగా పెళ్లి మండపంలోనే ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యకు వినూత్న గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ వరుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.. అజ్లాన్ అనే వ్యక్తి వరిషా అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లిమండంలోనే వధువుకు ఓ బహుమతి ఇవ్వాలని అజ్లాన్ నిర్ణయించుకున్నాడు. దీంతో వరుడు వధువుకి ఓ గాడిద పిల్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దానిని చూసిన వధువు షాక్ అవ్వలేదు. ఎందుకంటే అతనికి ముందే తెలుసు వధువు జంతు ప్రేమికురాలని. అందుకే చిన్న గాడిద పిల్లను ఆమెకు వివాహ కానుకగా ఇవ్వాలనున్నట్లు వరుడు అజ్లాన్ చెప్పాడు. కాబోయే భార్యకు ఈ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చే సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను వరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో పెళ్లిలో బహుమతిగా ఈ గాడిదను ఎందుకు ఎంచుకున్నావు అని వధువు అడిగితే ఒకటేమో అదంటే నీకు ఇష్టం, రెండోది గాడిద అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టపడే, అత్యంత ప్రేమగా ఉండే జంతువు అని వరుడు బదులిచ్చాడు. అంతేగాక గాడిద పిల్లను దాని తల్లి నుంచి వేరు చేయలేదని.. తల్లి కూడా ఈ పిల్ల గాడిదతోనే ఉందని తెలిపాడు. తనకు జంతువులు అంటే చాలా ఇష్టమని, జనాలు ఏమైనా అనుకోనివ్వండి. వారిశాకు ఇదే నా బహుమతి అంటూ పేర్కొన్నాడు. అజ్లాన్ మాటలు విన్న వధువు వారిశా తాను దీన్ని కేవలం గాడిదలా చూడటం లేదని తెలిపింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఊహించని గిఫ్ట్‌ను చూసి కొందను నవ్వుతుంటే.. మరికొందరు మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు.. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని నూతన జంటకు శుభాకాంక్షలు తెలపుతున్నారు.. అలాగే గాడిద పిల్ల కూడా క్యూట్‌గా అందంగా ఉందంటూ, ఎవరు ఏమనుకుంటారనే దాని గురించి పట్టించుకోవద్దని కామెంట్ చేస్తున్నారు. -
ఎలిజబెత్-2 వివాహానికి ఖరీదైన డైమండ్ నెక్లెస్‌ను గిఫ్గ్‌గా ఇచ్చిన నిజాం నవాబు
క్వీన్ ఎలిజబెత్2.. పేరుకు తగ్గట్టే జీవితాంతం మహారాణిలా బతికారు. 75 ఏళ్లపాటు బ్రిటన్ రాణిగా ఉన్న ఎలిజబెత్.. సుదీర్ఘకాలం ఆ హోదాలో కొనసాగిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. స్కాట్లాండ్లోని బాల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచారు. క్వీన్ ఎలిజబెత్‌కు భారత్‌తో ఎంతో అనుబంధం ఉంది. భారత్‌ను 200 ఏళ్లపాటు పాలించిన బ్రిటిషర్లు.. దేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించిన అయిదేళ్ల తర్వాత క్వీన్ ఎలిజబెత్ మహారాణిగా ఎంపికయ్యారు. 1952లో బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించారు. రాణి అయ్యాక ఆమె మూడుసార్లు భారత్‌ను సందర్శించారు. 1961లో తొలిసారి భారత్‌ను సందర్శించగా.. 1983, 1997లోనూ క్వీన్ ఎలిజబెత్ భారత్‌లో పర్యటించారు. క్విన్ ఎలిజబెత్ వివాహానికి హైదరాబాద్ నిజాం నవాబు తన హోదాకు తగ్గట్టు అత్యంత విలువైన బహుమతిని ఇచ్చారు. 1947లో క్వీన్ ఎలిజబెత్ వివాహం జరగగా.. 300 వజ్రాలు పొదిగిన ఐకానిక్ ప్లాటినమ్ నెక్లెస్ సెట్‌ను అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యువరాణిగా గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రిన్సెస్ ఎలిజబెత్ తన వివాహ కానుకను స్వయంగా ఎంచుకోవాలని నిజాం లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల తయారీ సంస్థ కార్టియర్ ప్రతినిధులను ఆమె వద్దకు పంపించాడు. దీంతో ఆమె తనకెంతగానో నచ్చిన ప్లాటినం నక్లెస్‌ను ఎంపిక చేసుకున్నారని రాయల్ ఫ్యామిలీ స్వయంగా వెల్లడించింది. చదవండి: King Charles: బ్రిటన్ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) తన 70 ఏళ్ల పాలనలో ఎంతో మంది నుంచి ఎన్నో విలువైన వస్తువులను, అభరణాలను కానుకగా స్వీకరించినప్పటికీ.. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘కార్టియర్’ తయారు చేసిన 300 వజ్రాలతో పొదిగిన ప్లాటినం నెక్లెస్ సెట్ బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ దగ్గరున్న అత్యంత ప్రసిద్ధ ఆభరణాలలో ఒకటి. ఎంతో ఇష్టంగా తీసుకున్న ఈ నెక్లెస్‌ను క్వీన్ ఎలిజబెత్ తరచుగా ధరించేవారు. ప్రస్తుతం దీని విలువ 66 మిలియన్ పౌండ్లకు పైగా ఉంటుందని అంచనా. రాణి నెక్లెస్ ధరించి దగిన ఫోటోలను ది రాయల్ ఫ్యామిలీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో జూలై 21న పోస్ట్ చేశారు. ఇందులో క్వీన్ ఎలిజబెత్ 1952 ఫిబ్రవరిలో బ్రిటన్ రాణి హోదా స్వీకరించిన కొద్ది రోజుల తర్వాత తీసిన ఫోటో ఉంది. ఈ నెక్లెస్‌ను ఎలిజబెత్ తన మనవడి భార్యకు అప్పుగా కూడా ఇచ్చారు. ఆమె దానిని 2014లో నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీలో, 2019లో డిప్లొమాటిక్ కార్ప్స్ రిసెప్షన్లో ధరించింది. -
భయంకరమైన వాట్సాప్ సందేశం!..నా చావు నీ పెళ్లి కానుక..
My death is your wedding gift: కొంతమంది తమకు నచ్చినట్లు జీవితం లేదనో లేక తమకు కావల్సింది దక్కలేదనో డిప్రెషన్‌తో ఆత్మహత్యయత్నానికి పాల్పడుతుంటారు. అంతేకాదు నచ్చిన వ్యక్తి దొరక్కపోతే ఇక జీవితం అయిపోయిందనుకుని మూర్ఖంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మరికొంతమంది వాళ్లు ఆత్మహత్య చేసుకోవడమే కాక దానికి కారణం వీళ్తే అంటూ బతికి ఉన్నవాళ్లని జీవచ్ఛవాలుగా చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడోక యువకుడు దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే... ఛత్తీస్‌గఢ్‌లో బలోద్ జిల్లాకి చెందిన ఒక యువకుడు తను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం నిశ్చయం అయ్యిందని తెలుసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆత్మహత్యయత్నానికి ముందు.. అతను ఉరి వేసుకున్న వీడియోని వాట్సాప్ స్టేటస్ పెట్టి మరీ.. నా చావే నీ పెళ్లి కానుక అంటూ ఒక భయంకరమైన సందేశాన్ని కూడా తను ప్రేమించిన అమ్మాయికి పంపాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఆ యువకుడు తన ప్రేమించిన యువతికి పెళ్లి నిశ్చయమైందని తెలుసుకుని తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ ప్రతీక్ చతుర్వేది తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com (చదవండి: పోలీసుల దాష్టీకానికి యువకుడు బలి!) -
ఏం ఐడియా సామీ! పెళ్లిలో వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు
పెళ్లికి వెళితే బహుమతులు తీసుకెళ్లడం తెలిసిన విషయమే. సాధారణంగా డబ్బులను కట్నాలుగా రాపించడం.. లేదా ఏదైనా ఖరీదైన గిఫ్ట్‌లను అందజేస్తారు.అయితే ఈ మధ్య కాలంలో యువత వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ స్నేహితులు, బంధువుల పెళ్లిళ్లో చిన్నపిల్లల పాల బాటిళ్లు వంటి ఢిఫరెంట్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. తాజాగా తమిళనాడులోనూ కొంతమంది స్నేహితులు కొత్త దంపతులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వారంలో కనీసం నాలుగు రోజులు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ పెళ్లికి విచ్చేసిన అతిథులు వధూవరులకు పెట్రోల్, డీజిల్ నింపినబాటిళ్లను కానుకగా అందించారు. చెంగల్పట్టు జిల్లా చెయ్యూరుకు చెందిన గిరీశ్ కుమార్, కీర్తన పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి స్నేహితులు పెట్రోల్, డీజిల్‌ను లీటర్ బాటిళ్లలో నింపి, వాటిని వధూవరులకు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా తమిళనాడులో గత 15 రోజుల్లో 9 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ. 110.85 ఉండగా, డీజిల్ ధర రూ. 100.94గా ఉంది. చదవండి: ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది -
గిఫ్ట్‌తో వధూవరులకు షాకిచ్చిన కమెడియన్: నవ్వులే నవ్వులు!
చెన్నె: ప్రస్తుతం దేశంలో బంగారం మాదిరి పెట్రోలియం ధరలు పెరిగిపోతున్నాయి. నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోల్ ధర దేశంలోని పలు ప్రాంతాల్లో రూ.110కి చేరువగా ఉంది. ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలోనే ఓ ప్రముఖ హాస్య నటుడు పెట్రోల్ ధరల పెరుగుదలపై ఓ వినూత్న నిరసన మాదిరి చేశారు. నవ దంపతుల వద్దకు వెళ్లి ఓ కవర్ తీసి రెండు డబ్బాలు ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా వధూవరులతో పాటు బంధుమిత్రులు షాకయ్యారు. అనంతరం నవ్వుకున్నారు. ఆయన ఇచ్చింది ఏమిటో తెలుసా? ఐదు లీటర్ల పెట్రోల్. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: తనయుడి గిఫ్ట్‌కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి ) తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడు మయీల్ సామి. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇటీవల జరిగిన ఓ వివాహానికి మయిల్ సామి హాజరయ్యాడు. కొత్త దంపతులను ఆశీర్వదించి కానుకగా పెట్రోల్ అందించాడు. ఈ ఫొటోలు ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. మయీల్ సామి చర్యను అందరూ అభినందిస్తున్నారు. మండుతున్న పెట్రోల్ ధరలపై ఇదో వింత నిరసన అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలను తమిళ కాలమిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. అనంతరం నటుడు మయీల్ సామి మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ ధరలకు నిరసనలో భాగంగా పెళ్లి కానుకగా పెట్రోల్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 తగ్గించడాన్ని అభినందించారు. దివంగత జయలలిత, ఎంజీ రామచంద్రన్‌కు వీరాభిమానిగా ఉన్న మయీల్ సామి సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటారు. గతంలో ఓ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. చదవండి: కరెంట్ షాక్‌తో భర్తను ఆడుకున్న భార్య.. తీరా కట్టుకథ అల్లి -
అచ్చం నాన్న లానే!
తమిళనాడులో ఉంటున్న లక్ష్మీప్రభకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి సమయం దగ్గరపడుతున్నా చెల్లెలు బాధగా ఎందుకు ఉంటోందో అక్క భువనేశ్వరి అర్థం చేసుకుంది. తన పెళ్లి చూడకుండానే తండ్రి మరణించాడనే కారణంగా చెల్లెలు ఏ మాత్రం సంతోషం లేదని భువనేశ్వరికి తెలుసు. పెళ్లి సమయానికి తండ్రి మైనపు విగ్రహాన్ని 6 లక్షలు వెచ్చించి, తయారు చేయించి మండపంలో ఉంచింది. మండపంలో తండ్రి(విగ్రహాన్ని)ని చూసిన లక్ష్మీ ప్రభ ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. పెళ్లి తర్వాత తండ్రి ఆశీర్వాదం తీసుకుంది. చెల్లెలు ఆనందమే తనకు కావాల్సింది అని లక్ష్మీప్రభను దీవిస్తూ అక్క భువనేశ్వరి చెప్పిన మాటలు అతిథులనూ ఆనందింపజేశాయి. అక్కాచెల్లెళ్ల అనుబంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలంటూ అతిథులు వారికి అభినందనలు తెలిపారు. కొత్త ఇంటిలో తన గృహలక్ష్మితో కలిసి గృహప్రవేశం వేడుక జరుపుకోవాలనుకున్న పారిశ్రామికవేత్త శ్రీనివాస్ గుప్తా తన దివంగత భార్య మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో జరిగిన ఈ వేడుక వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. ఇలాగే చాలా మంది తాము పోగొట్టుకన్న ప్రియమైనవారిని విగ్రహాల ఏర్పాటుతో బాధను తగ్గించుకుంటున్నారు. ఇటీవల తమిళనాడు వాసి అయిన లక్ష్మీ ప్రభ వివాహంలో ఆమె తండ్రి మైనపు విగ్రహం సమక్షంలో పెళ్లి జరగడం, ఆ వేడుక భావోద్వేగాలకు ప్రతీకగా నిలవడం అందరినీ ఆకట్టుకుంది. డబ్బు కన్నా ఆనందం మిన్న లక్షీప్రభ తండ్రి ఈ ప్రపంచంలో లేరు. తండ్రి లేకపోవడంతో ఆమె రోజూ బాధపడేది. ఇంతలో, ఆమె ఇంట్లో వివాహానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె ఇంకా నిరాశకు గురైంది. తండ్రి లేకుండా ఈ పెళ్లి అవసరమా అంటూ మాట్లాడేది. లక్ష్మీప్రభ అక్క భువనేశ్వరి చెల్లెలికి ఆనందాన్ని తిరిగి ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది. తమ తండ్రి మైనపు విగ్రహాన్ని తయారుచేయించి లక్ష్మీప్రభ పెళ్లికి బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహ తయారీకి భువనేశ్వరి 6 లక్షలు ఖర్చు చేసింది. విగ్రహానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పినా, ‘నా చెల్లెల ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను, ఆ ఆనందం ముందు ఈ ఖర్చు ప్దెదది కాదు’ అంది భువనేశ్వరి. పెళ్లి రోజున తండ్రితో కలిసి ఉన్నారనే భావనతో లక్ష్మీప్రభ ఆనందంతో పొంగిపోయింది. అక్క ఇచ్చిన అపురూపమైన కానుకకు ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. పెళ్లి కాగానే తన భర్తతో కలిసి తండ్రి ఆశీర్వాదం కూడా తీసుకుంది లక్ష్మీ ప్రభ. చెల్లెలు ఆనందం కోసం భువనేశ్వరి చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది. -
నిహారికకు చిరంజీవి ఖరీదైన బహుమతి
మెగా వారింట పెళ్లి సందడి షురూ అయింది. మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక ఓ ఇంటికి కోడలు కాబోతోంది. బుధవారం(ఈ నెల 9న) జొన్నలగడ్డ చైతన్యతో ఆమె మూడు ముళ్లు వేయించుకోనున్నారు. ఈ అపూర్వ ఘట్టానికి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ అతి సుందరంగా ముస్తాబవుతోంది. మెగా కుటుంబ సభ్యులంతా సోమవారమే రాజస్తాన్ చేరుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం మంగళవారం సాయంత్రం పెళ్లి వేదికకు చేరుకున్నారు. (చదవండి: నిహారిక సంగీత్ వేడుక.. డ్యాన్స్ ఇరగదీశారు) మరోవైపు ఇప్పటికే ప్రీవెడ్డింగ్ వేడుకలు జోరందుకున్నాయి. కాబోయే భర్తతో కలిసి నిహారిక సంగీత్‌లో ఆనందంతో చిందులేస్తోంది. ఈ జంటను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదని మెగా అభిమానులు సంతోషిస్తున్నారు. ఇదిలా వుంటే తన పిల్లలతోపాటు, తమ్ముడు, చెల్లెల పిల్లలను కూడా సమానంగా చూసే చిరంజీవి కొత్తపెళ్లి కూతురు కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ తీసుకున్నారట. పెళ్లికి ముందే ఆ ఖరీదైన బహుమతిని ఇచ్చేసినట్లు సమాచారం. రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక ఆభరణాన్ని భార్య సురేఖతో కలిసి నిహారికకు అందించారట. అలా నిహారిక మీదున్న కొండంత ప్రేమని చిరు కానుకతో చాటుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం) -
పెళ్లి కానుక : పెళ్ళికి ముందే యువతి ఖాతాలో జమ..
తుమ్మపాల (అనకాపల్లి): తెల్లరేషన్ కార్డు గల పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందించే పెళ్లికానుక నగదును సీఎం జగన్మోహన్రెడ్డి రెండింతలు పెంచారు. సాధారణంగా ఇల్లు, పెళ్లి అనేవి ప్రతి కుటంబంలో ఆర్థిక పరిస్థితులపై ప్రభావితం చేస్తాయి. వీటికోసం ఆస్తులైనా అమ్ముకోవాలి లేదంటే అప్పులైనా చేసి ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వివాహం చేసుకునే యువతి కుటుంబానికి వైఎస్సార్ పెళ్లికానుక పథకంలో ఆర్థికసాయం అందించి బాసటగా నిలుస్తోంది. అర్హత ఇలా.. తెల్లరేషన్ కార్డు గల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. వివాహం చేసుకుంటున్న యువతీ, యువకుడు ఇద్దరు వారి వారి రేషన్ కార్డుల్లో పేర్లు కలిగి ఉండాలి. ప్రజాసాధికార సర్వేలో కూడా నమోదై ఉండాలి. తొలిసారి వివాహం చేసుకుంటున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. వితుంతువుకు రెండో దఫా కూడా అర్హత కలిగించారు. వివాహం చేసుకుంటున్న యువతి 18, యువకుడు 21 ఏళ్లు నిండి ఉండాలి. మండల పరిధిలో గల వెలుగు కార్యాలయాల్లో వివాహనికి 15 రోజులు మందుగానే ధరఖాస్తు చేసుకోవాలి. కనీస గడువులోగా గ్రామపరిధిలోని కల్యాణమిత్రలు వచ్చి వివరాలు పరిశీలన చేస్తారు. అందించే ఆర్థికసాయంలో 20 శాతం మొత్తాన్ని వివాహనికి ముందు యువతి ఖతాలో జమ చేస్తారు. తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి తెల్లరేషన్ కార్డు గల ప్రతి కుటుంబానికి వైఎస్సార్ పెళ్లికానుక పథకం వర్తిస్తుంది. గతంలో కన్నా అధికంగా రెట్టింపు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. వివాహ తేదీకి కనీసం 15 రోజులు ముందుగా వెలుగు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఆమోదం పొందితే వివాహానికి ముందు 20 శాతం సొమ్ము, తరువాత మిగిలిన సొమ్ము నేరుగా పెళ్లి కుమార్తె బ్యాంక్ ఖాతాలో జమ అవుతంది. ఈ ఏడాది 45 మంది పథకం ద్వారా లబ్ధి పొందారు. – ఆర్.రామకృష్ణనాయుడు, వెలుగు ఏపీఎం, అనకాపల్లి మండలం ఇవి తప్పనిసరి 1.లబ్ధిదారుల వయసు ధ్రువీకరణ పత్రం (టెన్త్ మార్కుల జాబితా) 2.ఆధార్ కార్డు 3.తెల్లరేషన్ కార్డు, పెళ్లి పత్రిక 4.పెళ్లి కుమార్తె బ్యాంకు ఖాతా పుస్తకం 5.వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం 6. రెండవ పెళ్లి చేసుకునే మహిళకు వితంతు పింఛను ఉంటే వాటి పత్రాలు -
వధూవరులకు శుభవార్త !
సాక్షి, అమరావతి: పెళ్లి చేసి చూడు...ఇళ్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. నిరుపేద కుటుంబాలలో పెళ్లి చేసి అప్పులు పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇవ్వటానికి గత ప్రభుత్వం ఏప్రిల్ 20, 2018న ప్రవేశపెట్టిన పథకం చంద్రన్న పెళ్లి కానుక. ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టి కేవలం దాన్ని ప్రచారం కోసమే వాడుకున్నారు. పథకానికి అన్ని అర్హతలు ఉండి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి అయిన దంపతులు ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సంక్షేమ పథకాలద్వారా ప్రజలకు అందాల్సిన డబ్బును ఎన్నికల ప్రచారానికి వాడుకున్న గత ప్రభుత్వం వారికి రిక్త హస్తమే చూపింది. రూ. 23.34 కోట్ల బకాయిల విడుదల ఏపీలోని పేదింటి ఆడపడుచులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కానుకుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.270 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 22 నెలలగా ఎదురు చూస్తున్న జంటల వ్యక్తిగత అకౌంట్లలలోకి డబ్బులు జమకానున్నాయి. గుంటూరు జిల్లా పరిధిలో ఏప్రిల్ 20, 2018 నుంచి ఫిబ్రవరి 12, 2020 వరకు పెళ్లి కానుక పథకానికి 9,910 జంటలు ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత అర్హత సాధించాయి. వారి వారి కులాలు, వర్గాల వారీగా ఆయా జంటలకు రూ.41.12 కోట్ల చెల్లించాలి. గతం ప్రభుత్వం ప్రచారం చేసుకోవటానికి, తన వర్గాల వారి కోసం కేవలం రూ.17.78 కోట్లను విడుదల చేసింది. జిల్లాలో మరో రూ.23.34 కోట్ల బకాయిల కోసం ఎదురు చూస్తున్న వారికి జగనన్న ప్రభుత్వం నిధులను విడుదల చేసింది . ఈ తాజా నిర్ణయంతో 5,861 జంటలకు లబ్ధి చేకూరనున్నది. శ్రీరామనవమి నుంచి పెంచిన నగదు అందజేత... పేదింటి పిల్లల పెళ్లిళ్లలకు మరింత సాయం చేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం కార్యరూపం దాల్చింది. ఎన్నికల ప్రచారం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచి పథకాన్ని సరికొత్తగా వైఎస్సార్ పెళ్లి కానుకగా మార్చారు. పెంచిన నగదును రానున్న శ్రీరామ నవమి నుంచి అమలు చేయనున్నారు. గతంలో ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు పెళ్లి కానుక కింద ఇచ్చేవారు. ప్రస్తుతం వైఎస్సార్ పెళ్లి కానుక కింద వారందరికీ ఏకంగా లక్ష రూపాయలను ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు ఇస్తున్న రూ.75 వేల ను ఇప్పుడు రూ.1.20 లక్షలకు పెంచారు. బీసీ ఆడపడుచులకు ఇస్తున్న రూ.35 వేలను రూ.50 వేలకు, కులాంతర వివాహాలు చేసుకొనే ఆడపడుచులకు రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. మైనార్టీలకు రూ.50 నుంచి రూ.లక్షకు, దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఐదింతలు పెంపు... భవన నిర్మాణ కార్మికుల పెళ్లి కానుకను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భారీగా పెంచింది. ఏకంగా ఐదు రెట్లు పెంచి రూ.20 వేల నుంచి రూ.లక్షకు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు ఆగ్రవర్ణ పేదలు ఎవరైనా భవన నిర్మాణ కార్మికులగా పనిచేస్తూ, కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే వారి కూతుర్లకు కూడా పెళ్లి కానుకను అమలు చేస్తున్నారు. అయితే భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకొనే వారి సంఖ్య తక్కువగా ఉందని ఆధికారులు చెబుతున్నారు. పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 52 జంటలు మాత్రమే పెళ్లి కానుక దరఖాస్తు చేసుకున్నారు, అందులో ముగ్గురు అనర్హత పొందారు. అవగాహన లేకపోవటంతో ప్రభుత్వ సాయానికి వీరు దూరం అవుతున్నారంటున్నారు. భవన నిర్మాణ కార్మికులు దగ్గర్లోని ఆసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత పత్రాలు, తగిన రుసుం చెల్లించి గుర్తింపు కార్డు పొందవచ్చని ఆధికారులు చెబుతున్నారు. పెంచిన పెళ్లి కానుక వివరాలు ► ఎస్సీలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష ► ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75 వేల నుంచి రూ. లక్షా 20 వేలు ► ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ.లక్ష ► బీసీలకు రూ.35వేల నుంచి రూ.50 వేలు ► బీసీ కులాంతర వివాహానికి రూ.50 వేల నుంచి రూ.75 వేలు ► మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష ► దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర ► భవన నిర్మాణ కార్మికులకు రూ.20 వేల నుంచి రూ.లక్ష ► వైఎస్సార్ పెళ్లి కానుకకు ఏప్రిల్ 20, 2018 నుంచి ఫిబ్రవరి 12, 2020 వరకు దరఖాస్తు చేసుకొని అర్హత సాధించిన జంటలు – 9,910. ► 9,910 జంటలకు అందజేయాల్సిన మొత్తం – రూ.41.12 కోట్లు ► ఇప్పటి వరకు పెళ్లి కానుక పొందిన జంటలు –4,049 ► పెళ్లి కానుక రూపంలో ప్రభుత్వం చేసిన సాయం –రూ.17.78 కోట్లు ► తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసిన బకాయిలు – రూ.23.34 కోట్లు ► ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్న జంటలు –5,861 -
పెళ్లి విందు సరే.. బిర్యానీలో ఉల్లి సంగతేంటి..?
చెన్నై: పెళ్లి అంటేనే సందడి.. చుట్టాలు, స్నేహితులతో నిండిపోయే మండపంలో ఉన్న కోలాహలం చూస్తే అందరు అక్కడ బిజీబిజీగా కనిపిస్తారు. ఆ హడావుడి అంతా ఇంతా కాదు. ఇకపోతే ఏదైన ఫంక్షన్స్‌కు ఖాళీ చేతులతో వెళ్లకూడదని బంధువులు, స్నేహితులు వివిధ కానుకలు తీసుకొచ్చి నూతన వధూవరులకు వాటిని అందజేసి సర్ప్రైజ్ చేస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉల్లి బాగా పాపులర్ అయింది. దాన్ని కొనాలంటే సామాన్యుడు హడలిపోతున్నాడు. ఇంకేముంది కొత్త జంటలకు ఉల్లిని గిఫ్ట్‌గా ఇచ్చి వినూత్నంగా తమ నిరసన తెలపడంతో పాటు.. వాటినే గిఫ్ట్‌గా అందిస్తూ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. చదవండి: హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.200 వివరాల్లోకెళ్తే.. తాజాగా బెంగళూరులో ఓ నూతన జంటకు ఉల్లి గిఫ్ట్ ఇచ్చినట్టుగానే తమిళనాడులో జరిగిన పెళ్లిలో స్నేహితులు ఉల్లి గిఫ్ట్‌గా ఇవ్వడం వైరల్‌గా మారింది. కడలూరులోని మంజకుప్పంలో ఆదివారం ఓ పెళ్లిలో ఇది జరిగింది. నూతన జంట షాహుల్, సబ్రినా వివాహాన్ని ఇరు కుటుంబ సభ్యులు వైభవంగా నిర్వహించారు. పెళ్లికి వచ్చిన బంధువుల కోసం మంచి విందు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి బిర్యానీ చేయించి వడ్డించారు. కానీ.. దాంట్లోకి ఉల్లిపాయలకు బదులు రైతా, కీరాతో సరిపెట్టారు. ఉల్లి కొరత కారణంగా ఇలా చేసినట్టు వధువు కుటుంబం చెప్పడంతో దీనిని గమనించిన వరుడి స్నేహితులు ఉల్లిపాయలను గిఫ్ట్‌గా ఇచ్చి నూతన జంటను ఆశ్చర్యపరిచారు. కడలూరులోని ఒక దుకాణం నుండి 2.5 కిలోల ఉల్లిని రూ.500లకు కొని దంపతులకు గిఫ్ట్‌గా ఇవ్వడం గమనార్హం. -
వాళ్లుండేది అక్కడే.. రూ.450 కోట్ల బంగ్లాలో..!
ముంబై : ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ, పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్ వివాహం డిసెంబర్ 12న ముంబయ్‌లో జరునున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ ఇటలీ లేక్ కోమోలో ఇటీవలే అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ తారాగణమంతా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. మరో నెల రోజుల్లో ఒక్కటి కాబోతున్న ఇషా, ఆనంద్‌ల పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత రిచ్‌గా రూపొందిన వీరి వెడ్డింగ్ కార్డు అందర్నీ ఔరా అనిపించగా.. తాజాగా.. ఈ సంపన్నుల పెళ్లి వేడుకకు సంబంధించి మరో విషయం వైరల్ అయింది. (ఇషా అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌కార్డు.. వైరల్) 2012లోనే కొనుగోలు వివాహానంతం ఇషా, ఆనంద్ 50 వేల అడుగుల విస్తీర్ణం గల ‘గులితా’ అనే భారీ బంగ్లాలో కాపురం ఉండబోతున్నారని సమాచారం. అరేబియన్ సముద్రం ఒడ్డున గల ఈ ‘గులితా’ బిల్డింగ్ హిందుస్థాన్ యునిలివర్ అధీనంలో ఉండగా.. రూ.450 కోట్లు పెట్టి పిరమాల్ సంస్థ 2012లో కొనుగోలు చేసింది. ఆనంద్‌కు వెడ్డింగ్ గిఫ్ట్‌గా అతని తల్లి దండ్రులు స్వాతి, అజయ్ పిరమాల్ ఈ ఖరీదైన భవనాన్ని కొనిపెట్టారట. ఇక బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ నివాసముండే బకింగ్‌హామ్‌లోని ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసం. కాగా, భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ‘అంటిల్లా’ ప్రపంచంలోనే రెండో ఖరీదైన ఇల్లుగా గుర్తింపు పొందిన విషయం విదితమే. ‘అంటిల్లా’నిర్మాణ వ్యయం 14 వేల కోట్లు. -
పీటలెక్కని పెళ్లికానుక
నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జంటలకు అండగా నిలుస్తాం.. చంద్రన్న పెళ్లికానుక అందించి ఆర్థికంగా ఆసరా కల్పిస్తామని చెప్పిన మాటలింకా కార్యరూపం దాల్చలేదు. పెళ్లి చేసుకుని ప్ర«భుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న జంటలు పెరిగిపోతున్నాయి. పెళ్లి కానుక మాత్రం వారికి ఇంకా చేరడం లేదు. బడుగు, బలహీన వర్గాలు ఈ పథకంపై ఎన్నో ఆశలు పెంచుకున్నా అధికారవర్గాల్లో స్పందన కనిపించడం లేదు. దరఖాస్తు చేసుకున్న కొత్త జంటల ఖాతాలకు టెస్టింగు కోసమంటూ ఒక రూపాయిజమ చేయడం వారిని విస్మయానికి గురి చేస్తోంది. ఒక్క రూపాయి మాత్రమే జమయిందని ప్రశ్నిస్తే అకౌంటు సరిగా ఉందోలేదో చేక్ చేయడానికి జమ చేశామని అధికారులు తెలుపుతున్నారు. త్వరలోనే మొత్తం ఒకేసారి జమ చేసేస్తామంటున్నారు. చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక అందని ద్రాక్షలా తయారైంది. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్లు సర్కారు ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు, కులాం తర వివాహాలు చేసుకున్న జంటలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. ప్రతి మండలంలోనూ డ్వాక్రా సంఘాల నుంచి వివాహ మిత్రలను నియమించారు. పెళ్లి కుది రిన 15 రోజుల ముందే చంద్రన్న పెళ్లి కానుకకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌తోపాటు 1100కు కాల్ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేయాలి. కొందరు తమ వివరాలను అప్లోడ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వివాహ మిత్రలు వెళ్లి వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపర్చారు. వాటిని ప్రజాసాధికార సర్వేతో అనుసంధానం చేసి సరిపోల్చారు. గడచిన మూడు నెలల్లో పెళ్లి కానుక కోసం 804 జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 604 మాత్రం ఇప్పటికి పరిశీలన పూర్తి చేసి అర్హులుగా గుర్తించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 327, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు 208, ఎస్టీలు 27, ముస్లింలు 30, వికలాంగులు 12 జంటలు ఉన్నారు. కులాంతర వివాహం చేసుకున్న 87 జంటల నుంచి దరఖాస్తులు అందాయి. అందించాల్సిన మొత్తాలు.... ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలైతేరూ.50వేలు, బీసీలైతే రూ.35వేలు, ముస్లింలకు రూ.50 వేలు ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులైతే ఏ కులానికి చెందిన వారికైనా రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. 20 శాతం పెళ్లి నిశ్చయమైన రోజున..మిగిలిన 80శాతం పెళ్లిరోజున పెళ్లి కుమార్తె ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ముస్లిం జంటలకు రూ.15 లక్షలు, ఎస్టీ జంటలకు రూ.12.50 లక్షలు, బీసీ జంటలకు రూ.1.02 కోట్లు, ఎస్సీ జంటలకు రూ.62.80లక్షలు, వికలాంగ జంటల కు రూ.12లక్షలు, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.38.25 లక్షలు, ఎస్టీలకు రూ.1.50లక్షలు, బీసీలకు రూ.17 లక్షల మేరకు అందించాల్సి ఉంది. రూ.2.61 కోట్లు జమ చేయాల్సి ఉంది. మూడునెలలు కావస్తున్నా పెళ్లికానుక జమకాలేదు. వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. అకౌంట్లోకే జమవుతాయనే సమాధానం వారికి వినిపిస్తోంది. ఒక్క రూపాయి మాత్రమే కొందరికి జమైంది. దీంతో వారంతా విస్తుపోయారు. తీరా అధికారులను అడిగితే కంగారు పడకండి టెస్టింగ్ అని చెప్పారు. పెళ్లి కానుక మొత్తాలు జమవుతాయి చంద్రన్న పెళ్లికానుక మొత్తాలు ఈ వారంలోనే జమవుతా యి. ఖాతాకు ఒక్క రూపాయి టెస్టింగ్ కోసం జమచేశాం. ఇప్పటికి 375 ఖాతాలకు జమచేసి టెస్టింగ్ చేయగా 60ఖాతాలు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిసింది. తిరిగి వాటిని యాక్టివేషన్ చేసి ని ధులు జమచేస్తాం. యాక్టివ్‌గా ఉన్న ఖాతాల కు రెండు రోజుల్లో జమ చేయనున్నాం. – రవిప్రకాష్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ -
పెళ్లికానుకకు పల్స్ పోటు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుకకు ఆంక్షలు గుదిబండగా మారాయి. పథకం ప్రకటన సమయంలో పెళ్లి చేసుకునే ప్రతి జంటకు కానుక అందుతుందనే ఆశలు కల్పించారు, తీరా దరఖాస్తు చేసుకున్న వారిలో పదోవంతుకు కూడా కానుక అందుతుందనే నమ్మకం లేకోయింది. చంద్రన్న పెళ్లి కానుక పథకం ఈ నెల 11వ తేదీన అమలులోకి వచ్చింది. ఇందుకోసం ప్రతి మండలానికి డ్వాక్రా సంఘాల నుంచి ముగ్గురు వివాహ మిత్రలను నియమించారు. వీరికి ఆ మండల పరిధిలో జరిగే వివాహాలను బట్టి కమిషన్ చెల్లించేలా నియమించారు. పుట్టిన తేదీ ధ్రువీకరించే పదో రగతి సర్టిఫికెట్ లేదా మీ సేవా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్, దివ్యాంగులైతే వైకల్య నిర్థారణ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ కోసం తెల్లకార్డు లేదా మీసేవ ద్వారా తీసుకునే ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్, వధువు బ్యాంకు ఖాతా, ఇరువురి ఆధార్ కార్డులు ఇలా అన్ని వివరాలు ప్రత్యేకంగా రూపొందించే యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత వివాహ మిత్రలు వారి ఇళ్లకు వెళ్లి చుట్టుపక్కల వార్ని నిర్ధారించుకొని ఆన్లైన్లో పొందుపర్చిన వివరాలన్ని సరిపోల్చుకున్న తర్వాత అన్ని అర్హతలుంటే పెళ్లి రోజున 20 శాతం, ఆ తర్వాత వారం రోజుల్లో మిగిలిన 80 శాతం పెళ్లి కుమార్తె ఖాతాకు ఆ మొత్తం జమవుతుంది. అందుబాటులోకి రాని యాప్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన యాప్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో 1100కు కాల్ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేస్తే వివాహమిత్రలు వారి ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తారు. వాటిని గతేడాది జరిగిన ప్రజాసాధికారిత సర్వేలో ఉన్న వివరాలతో అనుసంధానిస్తారు. నిన్న..మొన్నటి వరకు రేషన్ కార్డు కావాలన్నా..పింఛన్ కావాలన్నా పల్స్ (ప్రజా సాధికార) సర్వేయే ఆధారం. లంతేనా: ఆ సర్వే ఆధారంగా సంక్షేమ పథకాలకు అర్హత కోసం నిర్దేశించిన 13 అంశాల ప్రాతిపదికన అర్హతను నిర్ధారిస్తారు. వాటిలో ఏ ఒక్కటి ఉన్నా కానుకకు దూరమైనట్టే. 819 జంటల్లో 239 మందికే.. ఈ నెల 11వ తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లాలో అల్పాదాయ వర్గాలకు చెందిన 819 జంటలకు వివాహాలు జరగగా వారంతా 1100 ద్వారా ఆన్లైన్లో పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకున్నారు. 109 మంది పెళ్లికుమార్తెలు, 171 మంది పెళ్లి కుమారులను సర్వేలో పేర్కొన్న పుట్టిన రోజు తేదీ, ఆధార్‌లో పేర్కొన్న తేదీ వేర్వేరుగా ఉందన్న సాకుతో తిరస్కరించారు. అలాగే 120 మంది పెళ్లి కుమార్తెలు, 200 మంది పెళ్లి కుమారులకు ఇదే రీతిలో సర్వేలోనూ, ఆధార్‌లోనూ, ఇతర రికార్డుల్లో ఉన్న కుల ధ్రువీకరణ పత్రాల్లో తేడాలున్నాయన్న కారణంతో తిరస్కరిం చారు. ఈ విధంగా మొత్తం 680 జంటలు కానుకకు దూరమయ్యాయి. కేవలం 239 జంటలను అర్హులుగా తేల్చారు. వారికి మాత్రమే ఇప్పటి వరకు పెళ్లి కానుక అందజేశారు. మొత్తమ్మీద పల్స్ సర్వే పింఛన్, రేషన్‌కేకాదు కానుకకు గండంగానే మారింది. పథకం ఇదీ..చంద్రన్న పెళ్లి కానుక ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలైతే రూ.50వేలు, బీసీలైతే రూ. 35వేలు, ముస్లీంలకు 50వేలు ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులైతే ఏ సామాజిక వర్గానికి చెందిన వారికైనా రూ.లక్ష వరకు ఇస్తారు. త్వరలోనే యాప్ మే 5వ తేదీన పెళ్లి కానుక యాప్ రానుంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని పెళ్లి చేసుకునే జంట వివరాలను అప్లోడ్ చేయాలి. పల్స్ సర్వేలో నమోదై ఉండి అర్హత గల వారికి మాత్రమే కానుకలు మంజూరవుతాయి. అవకతవకలకు, అవినీతికి ఆస్కారం లేని రీతిలో చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. – సత్యసాయి శ్రీనివాస్,పీడీ, డీఆర్డీఎ -
చింతల వారి ‘పెళ్లి కానుక’
పంజగుట్ట: ‘బడి–గుడి’ కార్యక్రమంతో ప్రజల కు చేరువైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తన నిమి ఫౌండేషన్ ద్వారా ‘పెళ్లి కానుక’ పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలో వివా హం చేసుకునే జంటకు రూ.50 వేలు విలువ చేసే కానుకలు అందిస్తున్నారు. అర్హులైన 22 జంటలకు గురువారం ఎర్రమంజిల్‌లోని హోట ల్ ఎన్‌కేఎం గ్రాండ్లో పెళ్లికానుకలు అందించారు. అన్ని మతాల వారికీ అమలు చింతల రామచంద్రారెడ్డి తన నియోజకవర్గమైన ఖైరతాబాద్‌కు చెందిన అన్ని మతాల వారికీ ఈ కానుకలు అందిస్తున్నారు. ఇందులో అర తులం పుస్తెలు, అర తులం ఉంగరం, రెండు తులాల వెండి మెట్టెలు, వరుడికి సూటు, వధువుకు పట్టుచీర అందిస్తున్నారు. గురువారం ముస్లి, క్రిస్టియన్లకు కూడా ఇవే అందిచారు. అయితే, ఆ మతస్తులకు పుస్తెలు, మెట్టెల స్థానంలో అంతే ధరలో ఏం ఇవ్వాలనే త్వరలోనే నిర్ణయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వధూవరులు ఇద్దరు అదే నియోజకవర్గం వారైతే ఒక్కరికే ఈ పధకం వర్తిస్తుందన్నారు. ఈ నెల 11వ తేదీన ఈ పథకం ప్రకటించగానే 73 ఆహ్వాన పత్రికలు వచ్చాయని, అందులో ముగ్గురు మైనర్లు కావడంతో అవి తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించాకే.. వివాహం చేసుకునేవారు స్థానిక బూత్ ప్రెసిడెంట్‌ను గాని, డివిజన్ ప్రసిడెంట్ను గాని కలిసి దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ, శుభలేఖ జతచేసి ఇవ్వాలి. ఎమ్మెల్యేనే స్వయం గా వాటిని పరిశీలించి స్వయంగా పెండ్లివారి ఇంటికి వెళ్లి కానుక ఇస్తారు. ‘గతేడాది ‘‘బడి–గుడి’’ కార్యక్రమం ద్వారా 11 వేల మంది విద్యార్థులకు చేరువయ్యాం. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశాం. నియోజకవర్గం ప్రజలకు ఏదైనా చేయాలన్న తపనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నా. నేను బతికున్నత కాలం ఈ పథకాన్ని కొనసా’నని చింతల తెలిపారు. తండ్రిలా అండగా నిలిచారు.. ఈ నెల 22న మా వివాహం ఉంది. ఎమ్మెల్యే తండ్రి పాత్ర పోషిస్తూ పుస్తెలు, మెట్టెలు, ఉంగరం, దుస్తులు అందించారు. మా వివాహానికి కూడా హాజరై మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుటున్నాం. – వందన, సాగర్ ఆయనకు రుణపడి ఉంటాం.. మా కొడుకు పెళ్లికి సుమారు రెండున్నర లక్షల వరకు ఖర్చవుతుంది. అందులో రూ.50 వేల వస్తువులు ఎమ్మెల్యే అందిస్తున్నారు. ఆయనకు రుణపడి ఉంటాము. చేసిన మేలు ఎప్పటికీ మరవలేం. – సయ్యద్ ఉస్మాన్, రహీమా బేగం -
పెళ్లి గిఫ్ట్ ప్యాక్‌లో బాంబు!
భువనేశ్వర్: వివాహం సందర్భంగా వచ్చిన ఓ కానుక.. వరుడు, అతని నాయనమ్మ ప్రాణాలు బలిగొన్నాయి. ఈ ఘటనలో నవవధువుకు తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశాలోని బోలంగిర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 21న వివాహ విందు సమయంలో నవదంపతులకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ కానుక వచ్చింది. ఇంటికొచ్చాక దీన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తుండగానే అందులోని బాంబు భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ తీవ్రతకు అక్కడే ఉన్న వరుడి నాయనమ్మ ఘటనాస్థలంలోనే చనిపోగా.. వధువు, వరుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రూర్కేలా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం వరుడు కన్నుమూయగా.. వధువు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. వివరాలు, సాక్ష్యాలు సేకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
దుల్హన్ సాయం దూరం
పేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దుల్హన్ పథకం అధికారుల నిర్లక్ష్యంతో విమర్శల పాలవుతోంది. అర్జీలు చేయడంలోనే ఆటంకాలు ఎదురవుతుండటంతో అర్హులకు ఈ పథకం ఫలాలు అందడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో, జిల్లాలో రెండు వందల మందికి పైగా పెళ్ళైన పేద ముస్లిం జంటలు ఈ పథకంలో లబ్ధిపొందకుండా, ఇబ్బందులు పడుతున్నారు. ఈ నగదు అందితే కొంత వరకూ ఇబ్బందులు నుంచి ఉపశమనం పొందవచ్చన్న ఆశ ఆడియాశలుగానే మిగిలి పోతున్నాయి. ఒంగోలు సెంట్రల్: నిరుపేద ముస్లిం యువతులు వివాహానంతరం రెండు నెలలలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటే వారు దుల్హన్ పథకం ద్వారా లబ్ధిపొందడానికి అర్హులవుతారు. లేకుంటే అనర్హులవుతారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్లైన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్య తలెత్తుతున్నాయి. తరచూ ఈ సమస్య తలెత్తుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.అన్లైన్ పోర్టల్‌లో చిన్నపాటి మార్పులు చేస్తే సరిపోతుంది. సమస్య రాష్ట్ర స్థాయిలో పరిష్కారించాల్సి ఉండటంతో జిల్లా అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. పథకం లక్ష్యం... పేద ముస్లిం యువతులకు వివాహానికి రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది ముస్లింలు లబ్ధిపొందారు. అయితే వివాహం జరిగిన రెండు నెలల్లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. వధూవరుల ఆధార్‌కార్డులు, వివాహ ధ్రువీకరణ పత్రం, వధువు బ్యాంకు ఖాతా వంటి వాటిని ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఈ పథకానికి ఆన్లైన్లో సాంకేతిక సమస్య వచ్చి పడింది. దీంతో వందల మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయ పత్రమే అసలు సమస్య... సాధారణంగా దుల్హన్ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలంటే అన్ని రకాల ఆదాయ పత్రాలతో పాటూ మీ సేవ ద్వారా లభించే ఆదాయ ధ్రువీకరణపత్రం కుడా అవసరం, రెవెన్యూ అధికారులు తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారికి ఆదాయ పత్రం అవసరంలేదని, ఇవ్వడంలేదు. రేషన్‌కార్డునే ఆదాయ పత్రంగా వాడుకోవాలంటున్నారు. దీంతో దుల్హన్ పథకానికి దరఖాస్తులు చేసుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పని సరి. అది లేకుండా మిగిలిని వివరాలు ఆప్‌లోడ్ చేయలేరు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం 200 మంది వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుని పథకం ద్వారా లబ్ధి పొందడానికి గత రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎక్కువ శాతం మంది లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు నివేదికలు ఇవ్వడంలో అలస్యం అవుతుండటంతో లబ్ధిదారులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 700 మంది వరకూ ఈ పథకం కింద లబ్ధి కల్పించినట్లు తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకున్నా దరఖాస్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. - ఝాన్సీ రాణి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి -
ఇక ‘లక్ష’ణంగా ఆడపిల్ల పెళ్లి!
సాక్షి, హైదరాబాద్: పేదింటి ఆడపిల్లకు ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించనుంది. పెళ్లి కానుకగా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పేరుతో ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఈ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీలకు చెందిన నిరుపేద కుటుంబాల్లోని ఆడ పిల్లలకు పెళ్లి కోసం ప్రభుత్వం రూ.75,116 అందిస్తోంది. త్వరలోనే ఈ సాయాన్ని రూ.లక్షకు పెంచనుంది. వచ్చే బడ్జెట్లో అందుకు తగిన నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత సీఎం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ముస్లిం కుటుంబాలకు షాదీ ముబారక్, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కల్యాణలక్ష్మి పేరుతో అమలు చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని బీసీలు, అగ్ర కులాల్లోని పేదలకూ విస్తరించింది. తొలుత రూ.51 వేల ఆర్థిక సాయా న్ని ఆడపిల్లల తల్లి పేరుతో చెక్కు రూపంలో అందించారు. 2017–18 బడ్జెట్లోనే ఈ ఆర్థిక సాయాన్ని రూ.75,116 కు పెంచింది. 3 లక్షల మందికి కానుక.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 3,02,856 మంది ఆడపిల్లలు పెళ్లి కానుక అందుకున్నారు. తొలి ఏడాది బడ్జెట్లో రూ.70 కోట్లతో ప్రారంభించిన ఈ పథకానికి ప్రభు త్వం లబ్ధిదారులు పెరిగిన కొద్దీ సరిపడా నిధులు కేటాయించింది. 2015–16లో రూ.388.66 కోట్లు, 2016–17లో రూ.530. 17 కోట్లు, 2017–18లో ఇప్పటి వరకు రూ.818.5 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం రూ.1807.33 కోట్లు వెచ్చించింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి ఈ పథకం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారు. రాజకీయంగా కూడా ప్రయోజనకరంగా ఉందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకే సాయాన్ని రూ.లక్షకు పెంచేందుకు సీఎం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. -
ఐఫోన్ 8 కోసం సింగపూర్ వెళ్లి..
సింగపూర్: కుమార్తెకు గిఫ్ట్‌గా ఐఫోన్-8 ఇచ్చేందుకు ఓ భారతీయుడు ఏకంగా సింగపూర్‌కు వెళ్లారు. అక్కడ ఏకంగా 13 గంటలపాటు క్యూలో ఉండి అక్కడ ఐఫోన్ సాధించిన మొదటి వ్యక్తి అయ్యారు. సింగపూర్ డెయిలీ తెలిపిన వివరాలివీ... అమిన్ అహ్మద్ ధోలియా(43) అనే భారతీయ వ్యాపారవేత్త కుమార్తె వివాహం త్వరలోనే జరుగనుంది. దీంతో ఆయన తన కుమార్తెకు ఇటీవలే విడుదలైన ఐఫోన్-8 ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నారు. ఇండియాలో ఐఫోన్ రిలీజ్ కాకపోవటంతో సింగపూర్ ప్రయాణమయ్యారు. గురువారం రాత్రి 7 గంటలకు సింగపూర్ నగరంలోని ఆర్చార్డ్ రోడ్డులో ఉన్న యాపిల్ స్టోర్‌కు చేరుకున్నారు. ఆ రాత్రంతా అక్కడే క్యూలో నిలబడిన ఆయన, శుక్రవారం ఉదయం 8 గంటలకు స్టోర్ తెరుచుకునే వరకు అక్కడే ఉండి మొదటి ఫోన్‌ను అందుకున్నారు. కాగా ఆయన వెనుక క్యూలో పలువురు విదేశీయులు సహా 200మంది ఉన్నారు. రాత్రంతా క్యూలో నిలబడి ఉండటం జీవితంలో ఇదే మొదటిసారని ధోలియా అన్నారు. అనుకున్నట్లు ఐఫోన్‌ను సాధించినందుకు సంతోషంగా ఉందని, కానీ రాత్రి వేళ అన్ని గంటలపాటు క్యూలో ఉండటం కష్టసాధ్యమేనన్నారు. కాగా, టెల్కో కాంట్రాక్టు ఫలితంగా సింగపూర్ వాసులకు ఐఫోన్లు సబ్సిడీ ధరకే లభిస్తున్నాయి. ఇదిలా ఉండగా సదరు భారతీయ వ్యాపార వేత్త పూర్తి వివరాలు తెలియరాలేదు. -
ఇండో-పాక్ పెళ్లికి సుష్మాజీ గిప్ట్ ఏంటో తెలుసా?
జోథ్‌పూర్ : సవాలక్ష అడ్డంకుల అనంతరం పాకిస్తాన్ అమ్మాయి.. ఇండియా అబ్బాయి పెళ్లి నేడు జరుగుతోంది. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సహకారంతో జోథ్‌పూర్(రాజస్తాన్)కు చెందిన నరేశ్ తేవానీ, కరాచీకి చెందిన ప్రియా బచ్చానీలు ఒకటి కాబోతున్నారు. రెండేళ్ల కిందట మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా కుదిరిన వీరి పెళ్లికి ఇటీవల భారత్-పాకిస్తాన్ల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు అడ్డుగా నిలిచాయి. పెళ్లి బృందానికి వీసా నిరాకరించారు. దిక్కుతోచని పరిస్థితిలో పెళ్లికొడుకు దేశప్రధానికి, విదేశీ వ్యవహారాల మంత్రికి తమ గోడు విన్నవించుకున్నాడు. వారి పెళ్లికి వీసా మంజూరు చేపించే బాధ్యత తానదేనంటూ సుష్మాస్వరాజ్ హామీఇచ్చారు. సుష్మా జోక్యంతో భారత రాయబారి కార్యాలయం పెళ్లికూతురికి, తన కుటుంబానికి వీసా మంజూరు చేసింది. దీంతో పెళ్లి కూతురు కుటుంబసభ్యులు 35 మంది ఆదివారం జోథ్‌పూర్ చేరుకున్నారు. నిర్ణయించిన ప్రకారం నేడు వారి పెళ్లి జోథ్‌పూర్‌లో జరుగుతోంది. తమ అభ్యర్థనకు వెంటనే స్పందించి, పెళ్లికూతురికి వారి కుటుంబానికి వెంటనే వీసా మంజూరు చేసినందుకు నరేశ్, సుష్మాస్వరాజ్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. "నేను చాలా సంతోషంగా ఉన్నా. అన్నీ అనుకున్నమాదిరిగానే జరిగాయి. వేడుకలను చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం" అని ప్రియా చెప్పింది. పెళ్లి నిశ్చయం అయ్యాక, అమ్మాయి తరుఫు వాళ్లు వీసాకు దరఖాస్తు చేసుకున్నారని, పెళ్లి ఏర్పాట్లన్నీ షెడ్యూల్ ప్రకారం జరుగుతూ వస్తున్నాయని కానీ అంతలోనే వారికి వీసా మంజూరులో ఆటంకం ఏర్పడిందని అబ్బాయి తండ్రి కన్హెయా లాల్ తేవానీ చెప్పారు. ఇలాంటి సమస్యలకు సుష్మాజీ దయాగుణం తెలిసి, వెంటనే ఆమెకు అభ్యర్థన పెట్టుకున్నామని తెలిపాడు. తమ అభ్యర్థనకు కూడా వెంటనే స్పందించిన సుష్మా , వెంటనే వీసా మంజూరు చేపించారని వివరించాడు. -
అత్తారింటికి దారిదే...
భర్త మరుగుదొడ్డి కట్టించడంలేదని, కట్టించాకే తిరిగి వస్తానని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది ప్రియాంక. ఆమెది ఉత్తరప్రదేశ్‌లో కంచన్కుయా గ్రామం. అదే రాష్ట్రంలో ఈ నెల పదిహేనో తేదీన ఖేసియా అనే ఊళ్లో నీలమ్, కళావతి, షకీనా, నిరంజన్, గుడియా అనే ఆరుగురు కొత్త కోడళ్లు అత్తింట్లో టాయ్‌లెట్ లేదని పుట్టింటికి వెళ్లిపోయారు. సరిగ్గా అదే రోజు మహారాష్ట్రలో చందా అనే ఒక వధువు తనకు వేరే ఏమీ వద్దనీ, రెడీమేడ్ మరుగుదొడ్డిని పెళ్లికానుకగా ఇవ్వమని బంధువులను అడిగి మరీ సాధించుకుంది. చందా, మిగతా మహిళలు చూపిన ఈ చొరవ మన గ్రామాల్లోనూ ప్రతి మహిళకూ స్ఫూర్తిదాయకం కావాలని సాక్షి ‘ఫ్యామిలీ’ ఆకాంక్షిస్తోంది. మనకు స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలోనూ సామాజికంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించాం. చట్టసభల్లో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం... కానీ స్త్రీ స్వేచ్ఛగా తిరగగలిగే పరిస్థితిని సాధించుకోవడం కోసం ఏమీ చేయలేకపోతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లిన స్త్రీ క్షేమంగా తిరిగి వస్తుందనే భరోసా తెచ్చుకోలేకపోతున్నాం. అత్యవసరాలైన కాలకృత్యాలకోసం సైతం మన పల్లెటూళ్లలో ఆడవాళ్లు బహిర్భూమికి వెళ్లవలసి వస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాం తప్పితే టాయిలెట్ నిర్మాణానికి చొరవ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టాయిలెట్ కోసం చందా అనే నవ వధువు చొరవ చూపడం తాజా ఉదంతం. చొరవ చూపక తప్పలేదు మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగిన ఓ పెళ్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. యావత్మాల్ జిల్లాలోని మోజర్ కు చెందిన కృష్ణకుమార్ మాకోడెతో అకోలా జిల్లా కారంజా రమజాన్పూర్ (నయా అందురా)కి చెందిన చందా అలియాస్ చైతాలి గలాఖే (రాఠోడ్)కు మే 15న వివాహం నిశ్చయమైంది. తాను కోడలిగా అడుగుపెట్టబోయే ఇంట్లో మరుగుదొడ్డిలేదని, పెళ్లయి అత్తగారింటికెళ్తే ఆ అవసరం కోసం ఆరుబయటకే వెళ్లాలన్న విషయం వధువుకు తెలిసింది. ఈ పరిస్థితి రాకూడదంటే, అత్తగారింట్లో కూడా మరుగుదొడ్డి ఉండి తీరాలనుకుంది. దాంతో, మొహమాటాన్ని వదిలి పెట్టి, తనకు పెళ్లి కానుకగా రెడీమేడ్ మరుగు దొడ్డిని ఇవ్వాలని తల్లిదండ్రులను, ఇతర బంధువులను కోరింది. ఆమె కోరికను తీర్చాలనుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లికి ముందే ఓ రెడీమేడ్ మరుగుదొడ్డిని సిద్ధం చేశారు. శుక్రవారం వివాహం అనంతరం కానుకలకు బదులుగా రెడీమేడ్ మరుగుదొడ్డిని ఆమె పెదనాన్న గజానన్ నాడే ఆమెకు అందించారు. నో ప్రాఫిట్, నో లాస్... ఇదిలా ఉంటే, ఈ రెడీమేడ్ టాయిలెట్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోందని, రెడీమేడ్ టాయిలెట్లను పెళ్లిలో కానుకలుగా ఇవ్వాలనుకునేవారికి ‘నో ప్రాఫిట్, నో లాస్’ ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు రెడీమేడ్ టాయిలెట్ మ్యానుఫ్యాక్చరర్ అరవింద్ దేతే తెలిపారు. ఆనందంగా ఉంది... కాబోయే అత్తారింట్లో మరుగుదొడ్డిలేదని తెలిసి చాల బాధవేసింది. అంతే! ఎవరు, ఏమి అనుకున్నా ఫర్వాలేదు కాని, నాకు పెళ్లి కానుకలకు బదులుగా రెడీమేడ్ మరుగుదొడ్డిని ఇవ్వాలని పట్టుబట్టాను. దీనికి మా కుటుంబసభ్యులతోపాటు బంధువులూ అంగీకరించి నా గౌరవాన్ని మరింత పెంచారు. ఇది నాకెంతో ఆనందాన్నిచ్చింది. - వధువు చందా స్వచ్ఛత ‘ఐకాన్’... పెళ్లి కానుకగా రెడీమేడ్ మరుగుదొడ్డిని అందుకుని వధువు చందా స్వచ్ఛభారత్‌కు ఐకాన్‌గా మారిందని బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఉమేష్ దేశ్‌ముఖ్ అభివర్ణించారు. కానుక విషయం తెలుసుకున్న ఆయన మరికొందరు అధికారులతో కలసి పెళ్లి మంటపానికి చేరుకుని, వధూవరులను ఆశీర్వదించారు. ఆడపిల్లలందరూ చందాను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. - గుండారి శ్రీనివాస్, సాక్షి, ముంబై వధువు చందాకి కానుకగా వచ్చిన టాయిలెట్ దేశవ్యాప్తంగా టాయిలెట్ అవసరాల కోసం యాభై శాతానికిపైగా ఇప్పటికీ బహిర్భూమిపై ఆధారపడక తప్పడం లేదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలలో అధిక భాగం ఆరుబయట టాయిలెట్‌కి వెళ్లినప్పుడే జరుగుతున్నట్లుగా సర్వేల్లో తేలింది. ♦ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్న ఏడులక్షల మంది చిన్నారుల్లో బహిరంగ మలవిసర్జన కారణంగా అంటువ్యాధులు సోకి మరణిస్తున్న వారు రెండు లక్షలమంది ఉంటారని అంచనా. ♦ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటున 42 శాతం మందికే టాయిలెట్లు ఉన్నాయి. ♦ దేశంలోనే అతి పేద రాష్ర్టంగా పేరు పొందిన బీహార్‌లో గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 85 శాతం మందికి టాయిలెట్లు లేవట. ♦ బీహార్‌లో గత సంవత్సరం నమోదైన రేప్ కేసులలో 870 కేసులు బహిరంగ టాయిలెట్‌కి వెళ్లిన వారిపైన జరిగినట్లుగా నమోదైంది. ♦ యూపీలో బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు యువతులు ఇటీవల అత్యాచారానికీ, హత్యకూ గురయ్యారు. ♦ దేశవ్యాప్తంగా నమోదవుతున్న రేప్ కేసులలో కనీసం 500 కేసులు బాధిత మహిళలకు ఇంటిలో టాయిలెట్ ఉంటే జరిగేవి కావని అంటున్నారు పోలీసులు. -
'టాయ్‌లెట్' కోరిన వధువుకు 10 లక్షల నజరానా
ముంబై: పెళ్లికానుకగా బంగారు ఆభరణాలకు బదులు టాయ్‌లెట్ కావాలని కోరిన మహారాష్ట్రకు చెందిన అమ్మాయికి 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. అలోకా జిల్లా అందురా గ్రామానికి చెందిన చైతలీ గలాఖే అనే అమ్మాయికి యవత్మాలా జిల్లాకు చెందిన దేవేంద్ర మకోడే అనే అబ్బాయితో ఇటీవల పెళ్లి జరిగింది. అత్త వారింట్లో మరుగుదొడ్డి లేదన్న సంగతి తెలుసుకొని.. ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిందేనని పెళ్లికి ముందు స్పష్టంగా చెప్పడంతో ఆ ఏర్పాటు చేశారు. పుట్టింటివారు, మెట్టింటివారు కలిసి అన్ని వసతులు ఉన్న ఓ టాయిలెట్ (ప్రిఫ్యాబ్రికేటెడ్)ను కట్నకానుకలతో కలిపి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సులభ్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు చైతలీకి 10 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆకర్షితురాలైన చైతలీని వారు అభినందించారు.