
My death is your wedding gift: కొంతమంది తమకు నచ్చినట్లు జీవితం లేదనో లేక తమకు కావల్సింది దక్కలేదనో డిప్రెషన్‌తో ఆత్మహత్యయత్నానికి పాల్పడుతుంటారు. అంతేకాదు నచ్చిన వ్యక్తి దొరక్కపోతే ఇక జీవితం అయిపోయిందనుకుని మూర్ఖంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మరికొంతమంది వాళ్లు ఆత్మహత్య చేసుకోవడమే కాక దానికి కారణం వీళ్తే అంటూ బతికి ఉన్నవాళ్లని జీవచ్ఛవాలుగా చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడోక యువకుడు దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
వివరాల్లోకెళ్తే... ఛత్తీస్‌గఢ్‌లో బలోద్ జిల్లాకి చెందిన ఒక యువకుడు తను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం నిశ్చయం అయ్యిందని తెలుసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆత్మహత్యయత్నానికి ముందు.. అతను ఉరి వేసుకున్న వీడియోని వాట్సాప్ స్టేటస్ పెట్టి మరీ.. నా చావే నీ పెళ్లి కానుక అంటూ ఒక భయంకరమైన సందేశాన్ని కూడా తను ప్రేమించిన అమ్మాయికి పంపాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఆ యువకుడు తన ప్రేమించిన యువతికి పెళ్లి నిశ్చయమైందని తెలుసుకుని తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ ప్రతీక్ చతుర్వేది తెలిపారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
(చదవండి: పోలీసుల దాష్టీకానికి యువకుడు బలి!)
Comments
Please login to add a commentAdd a comment