dying
-
చనిపోయే క్షణాల్లో మెదడు ఆలోచించగలదా? అలాంటివి..
చనిపోయే క్షణాల్లో మన మెదడులో జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ప్లే అవుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఆ సమయంలో కూడా మెదడు కలలు కనే తరంగాలను ఉత్పత్తి చేసిందన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు చివరి క్షణాల్లో మనతో ఉండే ఆలోచనలను మరింత లోతుగా అర్థం చేసుకోనే ప్రయత్నంలో భాగంగా 87 ఏళ్ల వ్యక్తి మొదడు తరంగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆ వ్యక్తి మూర్చ వ్యాధితో బాధపడుతున్న రోగి అని, చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. కలలు కంటున్నప్పుడు లేదా ఏవైనా విషయాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు మెదడులో ఎలాంటి తరంగాలు జనిస్తాయో అచ్చం అలాంటి తరంగాలే చనిపోవడానికి 30 సెకన్ల ముందు సదరు వ్యక్తి మెదడులో పరిశోధకులు గుర్తించారు. జీవితం చివరి క్షణాల్లో మరచిపోలేని అన్ని విషయాలను గుర్తు చేసుకోవడానికి ఈ తరంగాలు సంకేతం కావొచ్చని ఏజింగ్ న్యూరోసైన్స్ మ్యాగజైన్లో ప్రచురితమైన అధ్యయనంలో వివరించారు. మరణిస్తున్న మెదడులో మేం అనుకోకుండా ఇలాంటి తరంగాలను రికార్డు చేయగలిగామని పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ అజ్మన్ జెమ్మర్ చెప్పారు. వాస్తవానికి తాము ఇలా మెదడులోని తరంగాలను రికార్డు చేయాలని భావించలేదని, అనుకోకుండా ఇదంతా జరిగిందని అన్నారు. ఆఖరి నిమిషంలో మధుర క్షణాలు లేదా మనకిష్టమైన వారితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవచ్చేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా గుర్తుచేసుకోవాలనే ఘటనలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చని అన్నారు. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోవడానికి 30 సెకన్ల ముందు.. ఏకాగ్రత పెట్టడం, కలలు కనడం, ఏవైనా సంగతులను గుర్తు చేసుకోవడం లాంటి సమయంలో మెదడులో ఎలా అయితే తరంగాలు జనిస్తాయో అవే ఆ టైంలో కూడా ఉత్పత్తవ్వడం గుర్తించామని న్యూరో సర్జన్ జెమ్మర్ అన్నారు. తరంగాలు 30 సెకన్లపాటు కనిపించాయి. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అంటే సదరు వ్యక్తి మరణించాడని అర్థం. చనిపోయే ముందు మన జీవితంలో మరుపురాని సంఘటనలు చివరిసారిగా మన మెదడులో ప్లే అవుతాయని ఈ కేసులో తేలిందని అన్నారు. ఈ పరిశోధన సరిగ్గా ప్రాణం ఎప్పుడు? ఎలా పోతుంది? గుండె ఎప్పుడు కొట్టుకోవడం ఆగిపోతుంది? లేదా మెదడు ఎప్పుడు పనిచేయడం ఆగిపోతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుందని అన్నారు. (చదవండి: కన్నతల్లి ఆచూకీకై పరితపిస్తున్న స్వీడిష్ యువతి!) -
అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు?
ప్రపంచంలోని వివిధ దేశాలలోని ప్రజల జీవన విధానం భిన్నంగా ఉంటుంది. ప్రజల జీవనశైలి, పని విధానంలో తేడాలు కనిపిస్తాయి. అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలలో ప్రజల జీవితకాలం కూడా భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని ప్రజలు అధికకాలం జీవిస్తుండగా, మరికొన్ని దేశాల్లోని ప్రజల ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. అమెరికాకు సంబంధించి ఒక నూతన నివేదిక పలు ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. అమెరికాలో గత 100 సంవత్సరాలతో పోలిస్తే, ప్రజల సగటు వయస్సులో క్షీణత చోటుచేసుకున్నదని తేలింది. ఈ రిపోర్టు ప్రకారం చూస్తే అమెరికన్లు గతంతో పోలిస్తే ఇప్పుడు త్వరగా చనిపోతున్నారు. పరిశోధకులు తెలియజేసిన విషయాలను బీబీసీ ప్రపంచం ముందు ఉంచింది. అమెరికాలో పేదల సగటు వయసు తగ్గిందని పరిశోధనల్లో తేలింది. నల్లజాతి అమెరికన్ల జీవితకాలం తగ్గుతున్నట్లు కనుగొన్నారు. సమాజంలోని అసమానతలు వయస్సుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. అమెరికన్ల సగటు జీవితకాలం క్షీణించడానికి అనేక కారణాలను దానిలో తెలియజేశారు. ఇందుకు వ్యాధులతో పోరాటం, ఔషధాలు నుంచి ఆయుధాల వరకు అన్నీ బాధ్యతవహిస్తున్నాయి. సామూహిక కాల్పుల ఘటనలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల అమెరికాలో లక్షల మంది చనిపోతున్నారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం కరోనా మహమ్మారి, ఇతర వ్యాధుల కారణంగా, చిన్న వయస్సులోనే మరణాలు సంభవించాయని వివరించారు. వేగంగా పెరుగుతున్న అసమానతలు, మారణాయుధాల వినియోగం, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని స్పష్టమయ్యింది. ఇది కూడా చదవండి: సింగపూర్‌కు ఐఆర్సీటీసీ బడ్జెట్ ప్యాకేజీ -
ఇదేం రూల్ సామీ.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ.20 వేలు ఫైన్!
మన ఇంటి బాల్కనీలో లేదా టెర్రస్‌పైన ఉతికిన దుస్తులను ఆరబెట్టడం సహజమే. అయితే ఓ ప్రాంతంలో మాత్రం అలా బాల్కనీలో బట్టలు ఆరబెడితే ఫైన్ కట్టాల్సివస్తుంది. ఎక్కడనుకుంటున్నారా.. ఈ వింత రూల్ యూఏఈలోనిది. అయితే ఇలాంటి నిబంధన తీసుకురావడానికి కారణం ఉందని ఆ ప్రాంత అధికారులు చెప్తున్నారు. అసలు ఆ కథేంటని తెలుసుకుందాం! వివరాల్లోకి వెళితే.. అబుదాబిలోని మున్సిపాలిటీ అధికారులు అపార్ట్మెంట్ల బాల్కనీలు, కిటికీలపై బట్టలు ఆరబెట్టవద్దని ఆ ప్రాంత నివాసితులకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 20,000) లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఓ కారణం ఉందని అంటున్నారు అక్కడి మున్సిపల్ అధికారులు. బాల్కనీలో దుస్తులు ఆరేయడం వల్ల నగర అందం దెబ్బతింటుందని, అందుకే బాల్కనీలో, కిటికీలకు బట్టలు వేలాడదీయవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయంగా లాండ్రీ డ్రైయింగ్ గానీ, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చదవండి: ‘ఇది కరెక్ట్ కాదు.. రష్యా వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తోంది’ -
భయంకరమైన వాట్సాప్ సందేశం!..నా చావు నీ పెళ్లి కానుక..
My death is your wedding gift: కొంతమంది తమకు నచ్చినట్లు జీవితం లేదనో లేక తమకు కావల్సింది దక్కలేదనో డిప్రెషన్‌తో ఆత్మహత్యయత్నానికి పాల్పడుతుంటారు. అంతేకాదు నచ్చిన వ్యక్తి దొరక్కపోతే ఇక జీవితం అయిపోయిందనుకుని మూర్ఖంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మరికొంతమంది వాళ్లు ఆత్మహత్య చేసుకోవడమే కాక దానికి కారణం వీళ్తే అంటూ బతికి ఉన్నవాళ్లని జీవచ్ఛవాలుగా చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడోక యువకుడు దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే... ఛత్తీస్‌గఢ్‌లో బలోద్ జిల్లాకి చెందిన ఒక యువకుడు తను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం నిశ్చయం అయ్యిందని తెలుసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆత్మహత్యయత్నానికి ముందు.. అతను ఉరి వేసుకున్న వీడియోని వాట్సాప్ స్టేటస్ పెట్టి మరీ.. నా చావే నీ పెళ్లి కానుక అంటూ ఒక భయంకరమైన సందేశాన్ని కూడా తను ప్రేమించిన అమ్మాయికి పంపాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఆ యువకుడు తన ప్రేమించిన యువతికి పెళ్లి నిశ్చయమైందని తెలుసుకుని తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ ప్రతీక్ చతుర్వేది తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com (చదవండి: పోలీసుల దాష్టీకానికి యువకుడు బలి!) -
ఖగోళంలో భారీ విస్పోటనం.. పలు పరిశోధనలకు ఆటంకం!
విశ్వంలో అంతుచిక్కని దృగ్విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిని ఛేదించడం కోసం మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని దృగ్విషయాల చిక్కుముడి విప్పి ఇప్పటికే కొంతమేరకు విజయాన్ని సాధించాడు. అందులో చెప్పుకోదగినదే.. ఈవెంట్ హారిజోన్.. ఈ ఈవెంట్ మొట్టమొదటి సారిగా కృష్ణ బిలాల( బ్లాక్‌హోల్) ఫోటోను తీయడానికి ఉపయోగపడింది. కాగా ప్రస్తుతం నైరుతి ఆఫ్రికాలోని నమీబియా శాస్త్రవేత్తల బృందం సుదూరాన ఉన్న గెలాక్సీలో జరిగిన నక్షత్ర భారీ విస్పోటనాన్ని గుర్తించారు. సుమారు ఈ నక్షత్ర ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కంటే 10 రెట్లు ఎక్కువ. ఈ విస్పోటనం ద్వారా అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన గామా-రే పేలుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. గామా రే పేలుళ్ల నుంచి అత్యంత శక్తివంతమైన రేడియేషన్ వెలువడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రేడియేషన్ విశ్వంతరాలపై జరుగుతున్న పరిశోధనలపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గామా రే పేలుడు భూమి నుంచి సుమారు ఒక బిలియన్ కాంతి సంవత్పరాల దూరంలో జరిగింది. కాగా ఈ విస్పోటనం భూ గ్రహానికి అత్యంత సమీపంలో జరిగింది. సాధారణంగా గామా రే పేలుళ్లు భూమి నుంచి 20 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరుగుతుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పేలుడు ప్రస్తుతం ఉన్నగామా రే పేలుళ్ల సిద్ధాంతాన్ని సవాలు చేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటిపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో ఎక్స్ రే, గామా పేలుళ్లలో భారీగా సారుప్యతలు ఉన్నాయని వెల్లడించారు. ఈ పరిశీలనకు సంబంధించిన విషయాలను డ్యూయిష్ ఎలెక్ట్రోనెన్-సింక్రోట్రోన్ (DESY) లో ప్రచురించారు. ఇది జర్మనీకి చెందిన అతిపెద్ద శాస్త్రీయ సంస్థ అంతేకాకుండా హెల్మ్హోల్ట్జ్ అసోసియేషన్‌లో భాగం.ఈ పేలుళ్లలకు సంబంధించిన సిములేషన్ వీడియోను ఈ సంస్థ పోస్ట్ చేసింది. కాగా ఈ పేలుడు నుంచి వెలువడే అత్యంత ప్రకాశంతమైన నీలి రంగు కాంతిని కొన్ని సంవత్సరాల తరువాత భూమిపై చూడవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. అసలు ఏంటి ఈ గామా రే పేలుళ్లు... సాధారణంగా నక్షత్రాలు తమ జీవితకాలన్ని ముగిసిపోయి, సూపర్నోవాగా రూపాంతరం చెంది అప్రకాశవంతమైన వస్తువులుగా మారి క్రమేపి కృష్ణబిలాలుగా మారుతుంటాయి. నక్షత్రాల్లో పేలుళ్లు సంభవించినప్పుడు అత్యంత శక్తివంతమైన ఎక్స్ రే, గామా దృగ్విషయాలు వెలువడుతుంటాయి. గామా-రే పేలుళ్లు సుదూరంగా ఉన్న గెలాక్సీలలో జరిగే అపారమైన శక్తివంతమైన పేలుళ్లు. ఈ పేలుళ్లు విశ్వంలో సంభవించే అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన విద్యుదయస్కాంత సంఘటనలు. గామా రే పేలుళ్లు కొన్ని సార్లు పది మిల్లీసెకన్ల నుంచి కొన్ని గంటల వరకు జరుగుతుంటాయి. -
పెళ్ళికోసమే ఛస్తున్నాః సల్మాన్ ఖాన్
తన మాటలతో ఇటీవల వివాదాల్లో చిక్కుకుంటున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఈసారి తనడైలాగ్స్ తో అభిమానులను ఆకట్టుకునేట్లు చేశాడు. త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న సుల్తాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ఖాన్.... 'నేను పెళ్ళికోసం పడి ఛస్తున్నానని, అయితే ఇతరుల అంగీకారం కోసం వేచి చూస్తున్నానని' చెప్పడం అభిమానులకు ఆసక్తికరంగా మారింది. సింగింగ్ రియాలిటీ షో 'సా రే గా మా పా' లో పాల్గొన్న దబాంగ్ స్టార్ ను ఓ పోటీదారుడు తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో అడ్వైజ్ అడగడంతో ఖాన్ అలా సమాధానం ఇచ్చాడు. లులియా వంటోర్.. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ అని, అతడు ఆమెనే పెళ్ళి చేసుకుంటాడని వస్తున్న పుకార్లపై ఎదరయ్యే ప్రశ్నలను తప్పించుకునేందుకే సల్మాన్.. సింగింగ్ రియాలిటీ షో 'స రే గా మా పా' లో తాను పెళ్ళికోసం ఛస్తున్నానంటూ చమత్కరించి ఉండొచ్చని జనం గుసగుసలాడుతున్నారు. ఏభై ఏళ్ళ వయసున్న ప్రసిద్ధ సినీ స్టార్.. తానెప్పుడూ స్థిరపడాలనే అనుకుంటున్నానని, అయితే తనను ఇతరులు అంగీకరించడం కోసమే వేచి చూస్తున్నట్లు తెలిపాడు. స రే గా మా పా పోటీదారుడు జగ్ ప్రీత్ బజ్వా... జీవిత భాగస్వామిని ఎలా ఎంపిక చేసుకోవాలి అంటూ సల్మాన్ ను సలహా అడగడంతో.. ''మీరు తప్పుడు వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు జగ్ ప్రీత్... ఆ విషయంలో నేను చాలా అన్ లక్కీ పర్సన్.. నా గురించి జనం అనుకుంటున్నది కూడ తప్పే..'' అంటూ సల్మాన్ చమత్కరించినట్లు.. టీవీ షో జారీ చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. పైగా... ఇది పురుషులు చెప్పే విషయం కాదని, అన్నింటినీ డిసైడ్ చేసే మహిళలే ఈ విషయాన్ని చెప్పాలని సల్మాన్ చమత్కరించాడట. మరోవైపు నేను సల్మాన్ ఖాన్ కి అతి పెద్ద ఫ్యాన్ అని, ప్రతి విషయంలోనూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని, భాయ్ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడో, అదే సంవత్సరంలో నేను కూడ పెళ్ళి చేసుకుంటానని కార్యక్రమానికి మెంటార్ గా ఉన్న మిల్కా సింగ్ చెప్పడం.. రియాలిటీ షో లో నవ్వులు పూయించింది. సుల్తాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా 'సా రే గా మా పా షోలో' సల్మాన్ హాజరైన ఈ భాగం టీవీలో జూన్ 26న ప్రసారం కానుంది. -
సంప్రదాయ కళల్లో సమస్యల 'ప్రదర్శన'
నాగాలాండ్ సంప్రదాయ కళలు అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్లో భాగమయ్యాయి. స్థానిక సమస్యల కథాంశాలుగా మారాయి. నాగాలాండ్ మహిళల రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఉండే నూలు వడకడం, నేత, నృత్యం, అల్లికలు, కాన్వాస్, పెయింటింగ్స్, ఫోక్ డ్యాన్స్ వంటి సంప్రదాయ కళలను కాన్వాస్‌లు, షాల్స్ రూపంలో రూపొందించిన ఓ కళాకారిణి ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంలో 'హీలింగ్' పేరున ప్రదర్శన ఏర్పాటుచేసింది. సమస్యలు ప్రధానాంశంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శన చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగాలాండ్‌కు చెందిన విద్యావంతురాలు, కళాకారిణి ఐరిస్ ఓడ్యూ తన కళకు అక్కడి సమస్యలను జోడించింది. గృహహింస, లైంగిక వేధింపుల వంటి సమస్యల పరిష్కారంతో పాటు... వారి గౌరవానికి వన్నె తెచ్చేలా శాలువాలు, పెయింటింగ్స్ గా అనేక కళాత్మక డిజైన్లను రూపొందించి ప్రదర్శన ఏర్పాటు చేసింది. నాగాలాండ్ లోని వివిధ సామాజిక వర్గాల ద్వారా తయారైన 9 ఎక్రిలిక్ పెయింటింగ్స్, ఉలెన్ సంప్రదాయ శాలువాలను ఓడ్యూ 12వ ఆసియా ఉమెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రదర్శించారు. మహిళలే కాదు.. బాధిత పురుషులు, బాలల సమస్యలను కూడ తన కళల్లో పొందుపరిచారు. ప్రపంచయుద్ధ సమయంలో జర్మన్ సైనిక యూనిఫారాల కోసం మొదటిసారి ఫ్యాబ్రిక్స్ వాడకం మొదలు పెట్టారని, నాగాలాండ్ బర్మా సరిహద్దు ప్రాంతంలో నేటికీ అదే సంప్రదాయం కొనసాగుతోందని, అత్యధిక సమయం పట్టడంతో పాటు, కఠినంగా కూడా ఉండే నేత కళను గ్రామాల్లోని మహిళలు అందమైన శాలువాలుగా వారి కోసం నేస్తూనే ఉన్నారని ఓడ్యూ చెబుతున్నారు. తన కాన్వాస్ కోసం శాలువాలను నేసే విధానం చూస్తే అక్కడి మహిళల కష్టం ప్రత్యక్షంగా తెలిసిందంటున్నారు. ఈ ప్రదర్శనలు గ్రామీణ మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించగలవని, సమస్యల పరిష్కారానికి సహకరిస్తాయని ఓడ్యూ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే ఆలోచనతోనే హీలింగ్ పేరున తాను ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఓడ్యూ వెల్లడించారు. -
అమెరికా చిన్నారికి చైనా యూజర్ల సహకారం
ఆ చిన్నారి అందరిలాగే తానూ ఎంతో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందాలనుకుంది. అదీ... గ్రేట్ వాల్ కలిగిన చైనా దేశంలోనే ప్రసిద్ధిపొందిన వ్యక్తిగా మారాలనుకుంది. అయితే దురదృష్టం ఆమెను వెంటాడింది. ఓ మాయదారి రోగంతో బాధపడుతున్న ఆ ఎనిమిదేళ్ళ బాలిక జీవితానికి అంత సమయం లేకపోయింది. అందుకే తల్లిదండ్రులు ఆమె కోరిక తీర్చేందుకు సామాజిక మాధ్యమాల సహాయం కోరారు. ఫేస్ బుక్ లో తమకు సహకరించమని వేడుకున్నారు. దీనికి చైనా నెట్ వినియోగదారులు భారీగా స్పందించారు. అమెరికాలోని రోడే ఐల్యాండ్ వెస్లీ ప్రాంతానికి చెందిన డోరియన్ కు నాలుగేళ్ళ వయసులోనే చిన్నపిల్లల్లో చాలా అరుదుగా కనిపించే క్యాన్సర్ (ర్యాబ్డోమియోసర్కోమా) సోకింది. పసి వయసులోనే శరీరమంతా పాకిన ఆ జబ్బుకు వైద్యం లేదని ఇంటికి వెళ్ళిపొమ్మని వైద్యులు చెప్పేశారు. పది రోజుల తర్వాత బాధితురాలి తల్లి తన గారాలపట్టి కోరికతోపాటు... చిన్నారి డోరియన్ గురించి ప్రార్థనలు చేయమంటూ.. ఫేస్ బుక్ లో తన విన్నపాన్ని పోస్ట్ చేసింది. దీంతో చైనా ఇంటర్నెట్ యూజర్లు మరణానికి దగ్గరలో ఉన్న ఆ పసిప్రాణం కల నిజం చేసేందుకు నడుం బిగించారు. ముందుగా స్పందించిన జు జింగ్ అనే మహిళ స్వయంగా బీజింగ్ దగ్గరలోని గ్రేట్ వాల్ ప్రాంతానికి వెళ్ళి, తనతోపాటు ఇతరులను కూడా 'డి స్ట్రాంగ్' బోర్డుతో ఫోటోలు తీసి ఆ సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో పోస్ట్ చేసింది. గ్రేట్ వాల్ ఎక్కినందుకు ఆమె ఓ మెడల్ ను కూడా పొందింది. మెడల్ తో పాటు ఆ ఫోటోలను డోరియన్ కుటుంబానికి పంపించింది. దీంతో గ్రేట్ వాల్ తో పాటు ఇతర చైనాలోని ప్రముఖ స్థలాల్లో 'డి స్ట్రాంగ్' అంటూ తీసుకున్న అనేక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తాయి. అంతేకాదు చైనా ప్రభుత్వ వార్తా పత్రిక సిబ్బంది కూడా ఈ ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఇంకేముందీ డి స్ట్రాంగ్ వీబోలో టాప్ టెన్ టాపిక్స్ లో ముందు నిలిచింది. దీంతో ఐదువేలకు పైగా లైక్ లు, 2,500 పైగా షేర్లు వచ్చిన కొన్ని ఫోటోలు, వీడియోలను వీబో అధికారికంగా వెల్లడించింది. తమకు అందిన సహకారానికి డోరియన్ తల్లి మెలీసా ఆశ్చర్యపోయింది. డోరియన్ ప్రపంచ ప్రజలనుంచి ఎంతో స్ఫూర్తిని పొందిందని, అందరికీ తమ కృతజ్ఞతలు తెలుపుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. పలువురు ప్రముఖులు కూడా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో డోరియన్ కు ప్రోత్పాహాన్నిచ్చారు. వారికి మాత్రమే అనుమతి ఉండే హాలీడే రిసార్ట్ లో వీఐపీ ట్రీట్ మెంట్ తో ఆనందంగా గడిపేందుకు ఒకరోజు అవకాశం కల్పించారు. స్థానిక రోడే ఐల్యాండ్ గవర్నర్, ఆయన సెనేటర్లు కూడా డి స్ట్రాంగ్ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. -
మరణించినా.. హీరోగా మారాడు!
ఒకవైపు మృత్యువు దూసుకొస్తోంది. ఆ విషయం విమానంలో ఉన్నవాళ్లెవరికీ తెలియదు.. పైలట్‌కు మాత్రం తెలుసు. అయినా ఎలాగోలా ఇతరుల ప్రాణాలు కాపాడాలని చివరి క్షణం వరకు ప్రయత్నించాడు. దగ్గర్లోనే ఆయిల్ ట్యాంకర్, రైల్వే ట్రాక్ ఉన్నా.. విమానం వాటి మీదకు పడకుండా దూరంగా చెట్ల మీద పడేలా చూశాడు. బీఎస్ఎఫ్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఆ పైలట్.. హీరోగా నిలిచాడు. సూపర్ కింగ్ బి200 విమాన ప్రమాదంలో 10 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది మరణించిన ఘటనలో పైలట్.. నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా కృషిచేశాడు. టేకాఫ్ తర్వాత కొన్ని సెకన్లకే విమానంలో ఒక ఇంజన్ ఫెయిల్ అవ్వడాన్ని గుర్తించిన అతడు.. విమానాశ్రయం సరిహద్దు గోడ దగ్గర ఉన్న చెట్టుపై పడేలా చేసి భారీ నష్టాన్ని తగ్గించాడు. ఉదయం బయలుదేరిన క్షణంలోనే పైలట్ కెప్టెన్ భగవతి ప్రసాద్ ఇంజన్లో సమస్య ఉందని గ్రహించాడు. ఇంతలోనే కూలిపోతున్న పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి భారీ నష్టాన్ని నియంత్రించగలిగాడు. కానీ కేవలం 60 సెకన్లలోనే పైలట్ ప్రసాద్, కో పైలట్ రాజ్ దేశ్ సహా పదిమంది బీఎస్ఎఫ్ సిబ్బంది జీవితాలు ఆహుతైపోయాయి. ప్రమాదం జరుగుతోందని తెలిసినా సిబ్బందిని రక్షించే సమయం లేకపోయింది. ఇంజన్లో సాంకేతిక లోపం రావడంతో నేలపై పడబోయిన విమానాన్ని 180 డిగ్రీల్లో యు టర్న్ తీసుకొన్నాడు. భారీనష్టం వాటిల్లకుండా చూసేందుకు పైలట్ తీవ్రంగా ప్రయత్నించి, విమానాన్ని బలవంతంగా చెట్టుకు గుద్దించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విమానంలో సాంకేతిక లోపం వచ్చిందని గమనించగానే పైలట్ ఏటీసీ అనుమతితో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడని కొందరు అధికారులు, ఇతర ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాతికేళ్లకు ముందే తండ్రయ్యారా.. అయితే ముప్పే?
పాతికేళ్ల వయసు కంటే ముందే తండ్రయితే మధ్య వయసులోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందట. ఈ విషయాన్ని ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ పరిశోధకులు వెల్లడించారు. యుక్త వయసులోనే తండ్రయితే వారి ఆరోగ్యం క్షీణిస్తుందని, తద్వారా 40, 45 ఏళ్ల నడి వయసులోనే చనిపోయే ప్రమాదం ముందని చెప్పారు. ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటి హెల్త్ ప్రచురించిన జర్నల్‌లో తమ పరిశోధనా వివరాలను వెల్లడించారు. చిన్నవయసులో పిల్లల్ని కనడం మహిళలతో పోలిస్తే పురుషులపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది. ముఖ్యంగా భర్తగా, తండ్రిగా, కుటుంబ యజమానిగా పలు బాధ్యతలను నిర్వహించడంలో ఎదుర్కొనే ఒత్తిడే దీనికి కారణమని చెబుతున్నారు. ఈ సమయంలో ఎదుర్కొనే మానసిక, శారీరక ఒత్తిడులు యవ్వనంలో తండ్రయ్యేవారి ఆయుష్షును మింగేస్తున్నాయని స్పష్టంచేసింది. పురుషులు యుక్తవయసులో తండ్రి అవ్వడం, మధ్యవయసు మరణాలపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడైనట్టు చెబుతున్నారు. మధ్య వయసులో పురుషుల మరణాలకు, లేత వయసులో పితృత్వానికి మధ్య అవినాభావం సంబంధముందని తన పరిశోధకులు అంటున్నారు. మధ్యవయసులో చనిపోతున్న పురుషుల సంఖ్య 22-24 ఏళ్ల మధ్య మొదటి బిడ్డను కలిగిన పురుషుల మరణాల శాతంతో పోలిస్తే 25 ఏళ్ల తర్వాత బిడ్డను కన్న పురుషుల మరణాల శాతం తక్కువగా ఉందని ఈ పరిశోధన చెబుతోంది. తమ పరిశోధనలో విద్యార్హతలు, నివాస ప్రదేశాల లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. మొదటి బిడ్డను కన్న వయసు, పిల్లల సంఖ్య, వైవాహిక స్థితి ఇవన్నీ పురుషుల దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయన్నారు. పదేళ్ల కాలంలో ఒకటి నుంచి 20 మంది ఇలా మధ్య వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలిపారు. 21 శాతం మంది తీవ్ర గుండె జబ్బులు, 16 శాతం మంది మద్యపాన సంబంధిత వ్యాధుల వల్ల చనిపోతే దాదాపు 26 శాతం మరణాలు తొందరగా బిడ్డను కనడం వల్ల సంభవిస్తున్నాయని లెక్కలు చెబుతున్నారు. అయితే ఆ పురుషుని కుటుంబ పరిస్థితులు, ఇతర సామాజిక పరిస్థితులను కూడా అధ్యయనం చేయాల్సి ఉందంటున్నారు. -
వెలుగులు చిమ్మిన వీధులు...నేడు ఖాళీ