తన మాటలతో ఇటీవల వివాదాల్లో చిక్కుకుంటున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఈసారి తనడైలాగ్స్ తో అభిమానులను ఆకట్టుకునేట్లు చేశాడు. త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న సుల్తాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ఖాన్.... 'నేను పెళ్ళికోసం పడి ఛస్తున్నానని, అయితే ఇతరుల అంగీకారం కోసం వేచి చూస్తున్నానని' చెప్పడం అభిమానులకు ఆసక్తికరంగా మారింది. సింగింగ్ రియాలిటీ షో 'సా రే గా మా పా' లో పాల్గొన్న దబాంగ్ స్టార్ ను ఓ పోటీదారుడు తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో అడ్వైజ్ అడగడంతో ఖాన్ అలా సమాధానం ఇచ్చాడు.
లులియా వంటోర్.. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ అని, అతడు ఆమెనే పెళ్ళి చేసుకుంటాడని వస్తున్న పుకార్లపై ఎదరయ్యే ప్రశ్నలను తప్పించుకునేందుకే సల్మాన్.. సింగింగ్ రియాలిటీ షో 'స రే గా మా పా' లో తాను పెళ్ళికోసం ఛస్తున్నానంటూ చమత్కరించి ఉండొచ్చని జనం గుసగుసలాడుతున్నారు. ఏభై ఏళ్ళ వయసున్న ప్రసిద్ధ సినీ స్టార్.. తానెప్పుడూ స్థిరపడాలనే అనుకుంటున్నానని, అయితే తనను ఇతరులు అంగీకరించడం కోసమే వేచి చూస్తున్నట్లు తెలిపాడు. స రే గా మా పా పోటీదారుడు జగ్ ప్రీత్ బజ్వా... జీవిత భాగస్వామిని ఎలా ఎంపిక చేసుకోవాలి అంటూ సల్మాన్ ను సలహా అడగడంతో.. ''మీరు తప్పుడు వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు జగ్ ప్రీత్... ఆ విషయంలో నేను చాలా అన్ లక్కీ పర్సన్.. నా గురించి జనం అనుకుంటున్నది కూడ తప్పే..'' అంటూ సల్మాన్ చమత్కరించినట్లు.. టీవీ షో జారీ చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. పైగా... ఇది పురుషులు చెప్పే విషయం కాదని, అన్నింటినీ డిసైడ్ చేసే మహిళలే ఈ విషయాన్ని చెప్పాలని సల్మాన్ చమత్కరించాడట.
మరోవైపు నేను సల్మాన్ ఖాన్ కి అతి పెద్ద ఫ్యాన్ అని, ప్రతి విషయంలోనూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని, భాయ్ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడో, అదే సంవత్సరంలో నేను కూడ పెళ్ళి చేసుకుంటానని కార్యక్రమానికి మెంటార్ గా ఉన్న మిల్కా సింగ్ చెప్పడం.. రియాలిటీ షో లో నవ్వులు పూయించింది. సుల్తాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా 'సా రే గా మా పా షోలో' సల్మాన్ హాజరైన ఈ భాగం టీవీలో జూన్ 26న ప్రసారం కానుంది.
పెళ్ళికోసమే ఛస్తున్నాః సల్మాన్ ఖాన్
Published Fri, Jun 24 2016 7:07 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM
Advertisement
Advertisement