Salman
-
ఆసీస్‌తో మూడో టీ20.. పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్! ఎవరంటే?
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. కనీసం ఆఖరి టీ20లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.అయితే ఈ చివరి మ్యాచ్‌లో పాక్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పాక్ జట్టుకు సల్మాన్ అలీ అఘా సారథ్యం వహించనున్నాడు. రిజ్వాన్‌తో పాటు స్టార్ పేసర్ నషీం షాకు కూడా జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. వీరిద్దరి స్థానాల్లో హసీబుల్లా ఖాన్, పేసర్ జహందాద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చారు. అయితే 21 ఏళ్ల జహందాద్ ఖాన్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 కావడం గమనార్హం. దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండండంతో జహందాద్కు సెలక్టర్లు చోటు ఇచ్చారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లుఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, జోష్ ఇంగ్లిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జాంపాపాకిస్తాన్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, బాబర్ ఆజం, హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, జహందాద్ ఖాన్, హరీస్ రవూఫ్, సోఫియన్ ముఖీమ్చదవండి: అతడొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించండి: రవిశాస్త్రి -
సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?
సౌదీ అరేబియా రాజు సల్మాన్ తీవ్ర స్వస్థతకు గురయ్యారు. జెడ్డాలోని అల్ సలామ్ ప్యాలెస్‌లోని రాయల్ క్లినిక్ సల్మాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారినపడ్డట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన యాంటీబయాటిక్స్‌తో చికిత్స పొందుతున్నారని, తొందరలోనే కోలుకుంటారని పేర్కొంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే..ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా పరాన్నజీవులు, శ్వాసనాళాలు లేదా ఊపిరితిత్తుల కణజాలాలకు వాపు, హాని కలిగించే పరిస్థితి. ఈ పరిస్థితి కారణంగా ఒకటి లేదా రెండ ఊపిరితిత్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సంకేతాలు ఎంలా ఉంటాంటే..లక్షణాలు..దగ్గు..ఎడతెరిపి లేని దగ్గు ఊపిరితిత్తుల సంక్రమణకు సంకేతం. అలాగే స్పష్టంగా పసుపు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే శ్లేష్మం, జ్వరం. సాధారణంగా అయితే అధిక జ్వరం కనిపిస్తుంది.శ్వాస ఆడకపోవుట..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా..ఊపిరితిత్తుల్లో వాపు, ద్రవం పేరుపోవడానికి కారణమవుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఛాతి నొప్పి..ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్లో కూడా ఛాతీలో తీవ్ర నొప్పి కలుగుతుంది. ప్రత్యేకించి లోతైన శ్వాస తీసుకున్నా..దగ్గు తీసుకున్నా..ఛాతీలో పదునైన కత్తిపోటులా నొప్పిగా ఉంటుంది. అలసట..విపరీతంగా అలసిపోయినట్లు ఉండొచ్చు. గురకఇరుకైన వాయుమార్గాల కారణంగా ఊపిరి పీల్చుకునేటప్పుడు పెద్దగా శబ్దం రాడం. ఇది శ్లేష్మంగా కారణంగా ఏర్పడే వాపు లేదా అడ్డంకికి సంకేతం.వేగవంతమైన శ్వాసశరీరం తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు ప్రతిస్పందించినప్పుడూ జరుగుతుంది.గందరగోళం..ఇది ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తుంది.ఆకలి నష్టం..అనారోగ్యంతో పోరాడటానికి శరీరానికి తగినంత శక్తి అవసరం కానీ ఈ ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్ ఆకలిని తగ్గించేస్తుంది.వికారం వాంతులు..కొంతమందిలో లేదా పిల్లలకు వికారం, వాంతులు, అతిసారం వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.ఎందువల్ల వస్తుందంటే..బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు..స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, మైకోప్లాస్మా న్యుమోనియా వంటివి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు ప్రాథమిక కారణాలు. దీని కారణంగా ఊపిరితిత్తులలో వాపు, ద్రవం చేరడం వంటివి జరుగుతాయి.వైరల్ ఇన్ఫెక్షన్లు..సార్స్ కోవీ-2తో సహా ఇన్ఫ్లు ఎంజా వైరస్లు, కరోనా వైరస్లు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు దారితీయొచ్చు. ఈ అంటువ్యాధులు తరుచుగా దగ్గు లేదా తుమ్ముల నుంచి శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లుపర్యావరణంలో శిలీంధ్ర బీజాంశాలను పీల్చడం వల్ల ఈ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల్లో తలెత్తుంది. బలహీన రోగ నిరోధక వ్యవస్థ..హెచ్ఐవీ లేదా ఎయిడ్స్, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, కేన్సర్ చికిత్సలు లేదా అవయవ మార్పిడి వంటి పరిస్థితుల కారణంగా ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. (చదవండి: మామిడి పండ్ల వినియోగంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక! కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించాలంటే..) -
సల్మాన్ ఖాన్@ 220 కోట్లు..
సల్మాన్ ఖాన్ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, తన సంపదను వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిపెట్టి కోట్లు ఆర్జిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చే డబ్బును విభిన్న మార్గాల్లో మదుపు చేసి ఏటా దాదాపు రూ.220 కోట్లు సంపాదిస్తున్నట్లు జీక్యూ ఇండియా సర్వే తెలిపింది. సల్మాన్ ఖాన్ కలిగి ఉన్న తొమ్మిది ఆదాయ మార్గాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 1. బాక్సాఫీస్: అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి అనేక ఇతర బాలీవుడ్ నటుల మాదిరిగానే సినిమా ప్రారంభించడానికి ముందే సల్మాన్‌ఖాన్ రెమ్మునరేషన్ తీసుకుంటారు. కొన్ని సినిమాలకు ప్రాఫిట్-షేరింగ్ ఒప్పందాల ప్రకారం వాటికి వచ్చే ఆదాయంలో దాదాపు 50శాతం వాటాను తనకు ఇవ్వాల్సి ఉంటుంది. 2. ప్రొడక్షన్ హౌస్: 2011లో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యంలో చిల్లర్ పార్టీ జాతీయ అవార్డు చిత్రంతోపాటు బజరంగీ భాయిజాన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఇతర సినిమాలు సైతం ఈ బ్యానర్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. 3. స్టార్టప్‌లలో పెట్టుబడి: యాత్రా.కామ్ అనే ట్రావెల్ కంపెనీలో సల్మాన్‌ఖాన్‌కు దాదాపు 5శాతం వాటా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థల నివేదిక ప్రకారం తెలిసింది. ఆన్‌మొబైల్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ నేతృత్వంలోని చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్ అయిన ‘చింగారి’లో ఆయన పెట్టుబడి పెట్టారు. ఈ స్టార్టప్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా చేరారు. 4. క్లాతింగ్ కంపెనీ: 2012లో స్థాపించిన బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్ కంపెనీ ద్వారా సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ సేవలందిస్తోంది. దీని ద్వారా పేదలకు ఆరోగ్య సంరక్షణ, విద్యను అందిస్తున్నారు. ఈ కంపెనీ యూరప్, మిడిల్ఈస్ట్ దేశాల్లోనూ దాని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలో 90 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది. 5. ఫిట్నెస్ పరికరాలు, జిమ్: సినీ పరిశ్రమలోని ఫిట్నెస్ నటుల్లో ఒకరిగా ప్రశంసలు అందుకున్న సల్మాన్ ఖాన్ 2019లో బీయింగ్ స్ట్రాంగ్ కంపెనీను ప్రారంభించారు. ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచిని లాభదాయకమైన వ్యాపార సంస్థగా మార్చుకున్నారు. ముంబై , నోయిడా, ఇందోర్, కోల్‌కతా, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో జిమ్‌లను ప్రారంభించారు. 6. రియల్ ఎస్టేట్: సల్మాన్ ఖాన్ ముంబయిలో ఇళ్లు, వాణిజ్య స్థలాలను కొనుగోలు చేశారు. ముంబయి శాంటాక్రూజ్‌లోని తన నాలుగు అంతస్తుల భవనాన్ని అద్దెకు ఇచ్చి నెలకు దాదాపు రూ.1 కోటి సంపాదిస్తున్నట్లు అంచనా. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని ఖాన్ 2012లో రూ.120 కోట్లకు కొనుగోలు చేశారు. గతంలో ఈ స్థలాన్ని ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫుడ్హాల్కు నెలకు రూ.90లక్షల చొప్పున అద్దెకు ఇచ్చారు. ఇదీ చదవండి: వందల ఉద్యోగులను తొలగించిన అమెజాన్ అలెక్సా 7. టీవీ షోలు: 2010-11 సీజన్ నుంచి ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం వారానికి రూ.12 కోట్లు వసూలు చేస్తున్నారని కొన్ని మీడియా కథనాల్లో ప్రచురించారు. బిగ్ బాస్ సీజన్ 17 ముగిసే సమయానికి దాదాపు రూ.200 కోట్లను సంపాదించవచ్చని అంచనా. బిగ్ బాస్ కంటే ముందు ఆయన 10కా దమ్ అనే రియాలిటీ గేమ్ షోకు వ్యాఖ్యాతగా పనిచేశారు. 8. బ్రాండ్ యాడ్లు: హీరో హోండా, బ్రిటానియా టైగర్ బిస్కెట్, రియల్మీ, రిలాక్సో, డిక్సీ స్కాట్ వంటి ప్రముఖ బ్రాండ్లకు సల్మాన్ ఖాన్ ప్రచారకర్తగా ఉన్నారు. ఇందుకోసం ఒక్కో కంపెనీ ద్వారా ఏటా దాదాపు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేస్తారని అంచనా. 9. ఎన్ఎఫ్టీ: 2021లో సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, రజనీకాంత్, సన్నీ లియోన్‌తోపాటు ఇతర నటులు నాన్-ఫంగిబుల్ టోకెన్లలో పెట్టుబడి పెట్టారు. దానివల్ల వారి అభిమానులు నటుడికి సంబంధించిన ప్రత్యేకమైన ఆర్ట్‌లు, మ్యూజిక్, వీడియోలు, ఫొటోలు వంటివి డిజిటల్ రూపంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: క్రికెట్ మ్యాచ్‌తో డబ్బు సంపాదన! ఎలాగంటే.. పైన తెలిపిన అన్ని మార్గాల ద్వారా సల్మాన్ ఖాన్ వార్షిక ఆదాయం రూ.220 కోట్లుగా తేలింది. అంటే నెలకు దాదాపు రూ.16 కోట్లు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన ఖాన్ ఆస్తుల నికర విలువ సుమారు 350 యూఎస్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,907 కోట్లు)గా ఉన్నట్లు కొన్ని కథనాలు వల్ల తెలుస్తుంది. -
దేశవ్యాప్తంగా ఏకకాల దాడులకు కుట్ర! విచారణలో కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు భోపాల్, హైదరాబాద్‌లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు బయటపడింది. మధ్యప్రదేశ్, హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు వారు సిద్ధపడ్డట్లు తెలియవచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో పట్టుకున్న ఐదుగురినీ ఏటీఎస్ అధికారులు బుధవారం భోపాల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారిని ఈ నెల 20 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్న జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్ కోసం ఏటీఎస్తోపాటు రాష్ట్ర నిఘా వర్గాలు, పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు అతడి ఆచూకీ లభించలేదు. భోపాల్, హైదరాబాద్‌లలో ఇప్పటివరకు అరెస్టయిన 16 మంది విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... టాస్క్ లు ఇవ్వకపోవడంతో... భోపాల్‌లోని షాజహానాబాద్‌కు చెందిన యాసిర్ ఖాన్ నేతృత్వంలో 2018లో ఈ మాడ్యూల్ ఏర్పడింది. ఓ వర్గానికి చెందిన వారితో మతమార్పిళ్లు చేయించి యాసిర్ వారిని ఉగ్రవాద బాట పట్టించాడు. అతడి మాడ్యూల్‌లోని వారిలో 90 శాతం ఇలాంటి వాళ్లేనని నిఘా వర్గాలు గుర్తించాయి. యాసిర్ తొలినాళ్లలో హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్‌యూటీ) సంస్థలో పనిచేశాడు. మొదట్లో ఐసిస్‌కు అనుబంధంగా పనిచేసిన ఆ సంస్థ ఆపై దాన్నే విమర్శించింది. విదేశాల్లోని హెచ్‌యూటీ కేడర్‌తో యాసిర్ రాకెట్ చాట్‌తోపాటు త్రీమా యాప్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. ఎన్నాళ్లు నిరీక్షించినా ఎలాంటి టాస్్కలు ఇవ్వకపోవడంతో ఆ సంస్థకు దూరమై మహ్మద్ సలీంగా మారిన సౌరభ్‌రాజ్ విద్యతో కలసి సొంతంగా మాడ్యూల్ తయారు చేయడం మొదలెట్టాడు. ఆ పని మీదే సలీంను హైదరాబాద్ పంపి కొందరిని ఉగ్రబాట పట్టించడంతోపాటు మరో ముఠా తయారయ్యేలా ప్రేరేపించాడు. వాటికి హెచ్‌యూటీ (భోపాల్), హెచ్‌యూటీ (హైదరాబాద్) పేర్లు పెట్టుకున్నారు. ఎప్పుడైనా దాడులకు సిద్ధంగా ఉండేలా... టార్గెట్ కిల్లింగ్స్‌గా పిలిచే ఎంపిక చేసుకున్న వారిని హత్య చేయడం, తద్వారా మత కలహాలు రెచ్చగొట్టడం లక్ష్యంగా పెట్టుకున్న యాసిర్, సలీంలు ఆ పంథాలోనే సిద్ధమవుతున్నారు. దేహదారుఢ్యంతోపాటు తుపాకులు కాల్చడం, కత్తులు, గొడ్డళ్ల వినియోగంపై దృష్టి పెట్టారు. పెల్లెట్స్‌తో పనిచేసే ఎయిర్ పిస్టల్స్ వాడకంపై అనంతగిరి అడవుల్లో, నాటు తుపాకులు కాల్చడంపై భోపాల్ సరిహద్దుల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేశారు. అటు యాసిర్ ఇంట్లో, ఇటు హైదరాబాద్‌లోని ఐదుగురి ఇళ్లలో తరచూ సమావేశాలు నిర్వహించారు. ఏడాదిన్నరగా ఈ శిక్షణ పెరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 32 గంటల వరకు ఏమీ ముట్టకుండా... టార్గెట్ కిల్లింగ్స్తోపాటు కిడ్నాప్‌లు, మాల్స్, సినిమా హాళ్లను అదీనంలోకి తీసుకోవడమూ వారి పథకాల్లో భాగమే. హోస్టేజ్‌గా పిలిచే అలాంటి సందర్భాల్లో నిర్భంధంలోని వారికి అన్నీ అందించినా... ఉగ్రవాదులు సైతం కొన్ని గంటలపాటు నీళ్లు, ఆహారం లేకుండా ఉండాల్సి వస్తుంది. పోలీసులు లేదా భద్రతా బలగాలు నీళ్లు, ఆహారంలో మత్తుమందు కలిపి తమను పట్టుకొనే ఆస్కారం ఉందని ఉగ్రవాదులు ఏమీ ముట్టకుండా ఉంటారు. ఇలా గరిష్టంగా 48 గంటల వరకు మాడ్యూల్‌లోని వారంతా ఏమీ తీసుకోకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలని యాసిర్ నుంచి సలీంకు ఆదేశాలు అందాయి. ఈ సర్వైవల్ టెక్నిక్స్‌తోపాటు పర్వతారోహణను ముష్కరులు అనంతగిరి అడవుల్లో ప్రాక్టీస్ చేసినట్లు బయటపడింది. గరిష్టంగా 32 గంటల వరకు ఏమీ తీసుకోకున్నా జీవించేలా హైదరాబాద్ గ్యాంగ్ సిద్ధమైంది. రెండు నెలల క్రితం తన ఇంటికి వచ్చిన యాసిర్‌కు సలీం ఈ వీడియోలను చూపించాడు. పక్కింటి వాళ్లు ఫోన్ చేయడంతో... ముష్కరులను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ ఏటీఎస్, రాష్ట్ర నిఘా వర్గాలు హైదరాబాద్‌తోపాటు భోపాల్‌లోనూ మంగళవారం తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు చేశాయి. ఫలితంగా అక్కడ 11 మంది, నగరంలో ఐదుగురు చిక్కారు. నగరానికి చెందిన మహ్మద్ సలీం, అబ్దుర్ రెహ్మాన్, మహ్మద్ అబ్బాస్ అలీ, షేక్ జునైద్, మహ్మద్ హమీద్లతోపాటు జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌ను కూడా పట్టుకోవాల్సి ఉంది. అయితే పోలీసుల దాడి సమయంలో అతడు పాల ప్యాకెట్ల కోసం బయటకు వెళ్లాడు. అయితే పోలీసుల రాకను పక్కింటి వాళ్లు ఫోన్ చేసి చెప్పడంతో సల్మాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరోవైపు పోలీసులు బుధవారం ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించగా అరెస్టయిన ఉగ్రవాదులతోపాటు వారి భార్యలూ మతమారి్పడి చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. -
ఇమ్రాన్ ఖాన్ నటనలో షారుక్, సల్మాన్‌లను మించిపోయారు
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ దిగ్గజ నటులు సల్మాన్, షారుక్ ఖాన్‌లను మించి పోయారంటూ కామెంట్ చేశారు పాక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్. వజీరాబాద్‌లోని నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల అనంతరం ఇమ్రాన్ ఖాన్ తనపై జరిగిన దాడిని హత్యయత్నంగా పేర్కొన్నారు. కానీ పాక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ చీఫ్ మౌలానా ఫ్లజుర్ మాత్రం ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తాను తొలుత ఇమ్రాన్ ఖాన్‌పై జరిగిన ఘటన గురించి విని బాధపడ్డాను కానీ ఇప్పడూ ఇది ఒక డ్రామాలా కనిపిస్తోందన్నారు. "ఖాన్ శరీరంలోకి దిగిన బుల్లెట్ ఎలా ముక్కలుగా అయిపోతుంది. శరీరంలో పేలుడు ముక్కలు దిగడం గురించి విన్నాం ఇలాంటిది ఎప్పడూ వినలేదు. ఖాన్‌పై దాడి గురించి విన్నప్పుడూ తాను ఖండించానని చెప్పారు. కానీ ఎక్కడైన బాంబు శకలాలు శరీరంలోకి దిగడం చూశాం కానీ బుల్లెట్ శకలాలు శరీరంలో దిగడం ఏమిటో అర్థం కావడం లేదు. ఐనా ఆయనపై జరిగింది కాల్పులు కానీ బాంబు దాడి కాదన్నారు." ఖాన్‌కి బుల్లెట్ గాయాలైనప్పుడూ క్యాన్సర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఖాన్ చికిత్స తీసుకుంటున్న షౌకత్ ఖనుమ్ హాస్పిటల్ ఆయన చారిటబుల్ సంస్థ నిర్వహస్తున్న ఆస్పత్రేనని చెప్పారు. అలాగే వైద్యుల స్టేట్మెంట్లు కూడా చాలా విరుద్దంగా ఉన్నాయన్నారు ఫజ్లుర్ రెహ్మాన్ . (చదవండి: రాత్రికి రాత్రే కోటిశ్వరులుగా మారిన పోలీసులు..దెబ్బకు అకౌంట్ బ్లాక్!) -
లారీని ఢీకొట్టిన బైక్
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామస్టేజీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఓ లారీని వెనకనుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన మేడి హరీశ్ (22), హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో నివాసం ఉండే ఎం.డి.ఆసిఫ్ (22), ఎం.డి.సల్మాన్ (23)లు రామంతపూర్‌లోనే ఓ కంపెనీలో ఏసీ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. హరీశ్, ఆసిఫ్‌లు సంస్థకు చెందిన హాస్టల్లోనే ఉంటుండగా సల్మాన్ మాత్రం తల్లిదండ్రులతో కలసి స్థానికంగా ఉంటున్నాడు. ఈ ముగ్గురు శుక్రవారం సాయంత్రం పిట్టంపల్లి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు అందరితో కలసి ఆనందంగా గడిపారు. భోజనం చేశాక ఒంటిగంట సమయంలో ముగ్గురు కలసి హైదరాబాద్‌కు పల్సర్ బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ధర్మోజిగూడెం స్టేజీ వద్ద, వే బ్రిడ్జి నుంచి గ్రానైట్ లోడ్ లారీని డ్రైవర్ రివర్స్ తీస్తూ అకస్మాత్తుగా హైవేపైకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో బైక్ నడుపుతున్న సల్మాన్, లారీ అకస్మాత్తుగా రావడంతో వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. -
సౌదీలో మైనర్లకు మరణశిక్ష రద్దు
దుబాయ్: నేరగాళ్లకు బహిరంగంగా కఠిన శిక్షలు అమలు చేస్తూ విమర్శలనెదుర్కొంటున్న సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. నేరాలకు పాల్పడిన మైనర్లకు మరణశిక్షను రద్దు చేసింది. కొరడా దెబ్బలకు బదులుగా జైలు శిక్ష, జరిమానా, సామాజిక సేవను శిక్షలుగా విధించాలని రాజు సల్మాన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే కనీసం పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారికి సంబంధించిన కేసులను సమీక్షించాలని, శిక్షలను తగ్గించాలని సల్మాన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. దీని ఫలితంగా షియా వర్గానికి చెందిన ఆరుగురు మైనర్లకు మరణ శిక్ష తప్పినట్లయింది. సంప్రదాయాలకు, ఇస్లామిక్ చట్టాలకు పెద్ద పీట వేసే సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ తాజా నిర్ణయం వెనుక ఆయన కుమారుడు, మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, మహిళా హక్కుల కార్యకర్తలు, సంస్కరణ వాదులపై అణచివేత చర్యలు ఆయన పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. 2018లో సౌదీ రచయిత జమాల్ ఖషొగ్గీని టర్కీలో హత్య చేయించడంపై సల్మాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. -
యాక్షన్ షురూ
కొత్త దర్శకులతో సినిమాలు చేయడం నాగార్జునకు కెరీర్ స్టార్టింగ్ నుంచి అలవాటే. తాజాగా మరో కొత్త దర్శకుణ్ణి ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారాయన. భారీ యాక్షన్‌తో కూడిన ఓ పోలీస్ ఆఫీసర్ కథతో నాగార్జున కొత్త చిత్రం ఉంటుందని సమాచారం. ‘ఊపిరి, మహర్షి’ సినిమాల్లో రచనా విభాగంలో పనిచేసిన సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇందులో ఆయన పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ మోతాదు ఎక్కువగా ఉండబోతోందని టాక్. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఈ సినిమాకు పని చేయనున్నారట. ప్రస్తుతం ప్రీ–ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్‌లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. -
ఈ బాబాయ్ బిల్డప్ అంతా ఇంతా కాదు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : ఐఏఎస్ అధికారినని చెప్పుకుని తిరుగుతున్న బిల్డప్ బాబాయ్ మహమ్మద్ సల్మాన్ (37) అనే వ్యక్తి చెన్నపట్టణ తహశీల్దార్ సమయస్పూర్తితో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. సల్మాన్‌ను తమదైన శైలిలో విచారించిన పోలీసులు చాలా విషయాలే రాబట్టారు ఈమేరకు రామనగర ఎస్పీ అనూప్‌శెట్టి అందించిన వివరాల ప్రకారం... నిందితుడు మహమ్మద్ సల్మాన్ ఇతడి సహచరులు సల్మాన్‌ను ఐఏఎస్ అధికారి అని బిల్డప్‌లు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంచరించేవారు. ఖరీదైన ఇన్నోవా కారుపై కర్ణాటక గవర్నమెంట్ అని రాసుకుని తిరిగేవారు. మండ్య, మైసూరు, రామనగర, చెన్నపట్టణ, మాగడి, గంగావతి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ అమాయకులను గుర్తించి ఇళ్ల స్థలాలు, లోన్లు, ప్రభుత్వ పథకాలు వచ్చేలా చేస్తామని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. ఆర్డీపీఐ అధికారిగా చెప్పుకుని విధానసౌధ, ఎంఎస్ బిల్డింగ్‌లోని పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు వెళ్లి అధికారులను ప్రశ్నలు వేసి బెదిరించే వారు. అంగనవాడీ, ఉర్దూ, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పాఠశాలలను దత్తత తీసుకుంటామని నమ్మబలికేవారు. కర్ణాటక రాష్ట్ర సమగ్ర జనస్పందన వేదిక పేరుతో ఒక నకిలీ సంస్థను సృష్టించి ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షుడినని చెప్పుకుని అధికారులను బెదిరించేవాడు. శివమొగ్గ తాలూకా అబ్బలుగెరె గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో 7వ సంతానంగా జన్మించాడు. 2014లో శివమొగ్గ జిల్లా పంచాయతీ కార్యాలయానికి వచ్చే కొందరికి పనులు చేయించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో బెంగళూరు వచ్చాడు. నెలమంగల తాలూకా లక్కేనమళ్లి సొండేకొప్పరోడ్డులో నివసించేవాడు. అనంతరం ఇన్నోవా కారు తీసుకుని నకిలీ సంస్థ పేరు ఒకటి రాయించి రవికుమార్ అనే వ్యక్తిని డ్రైవర్ కం గన్‌మ్యాన్‌గా నియమించుకున్నాడు. నిందితుడి నుండి ఇన్నోవా కారు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, మొబైళ్లు, పోలీసుల డ్రస్సులు, లాఠీలు, టోపీలు, పలు నకిలీ ప్రభుత్వ రబ్బర్ స్టాంపులు, కొందరు వ్యక్తుల అధార్ కార్డులు, ప్రభుత్వానికి సంబంధించిన దాఖలు పత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కత్రినా కోసం ఖాన్స్
బాక్సాఫీస్ దగ్గర పోటీపడే బాలీవుడ్ ఖాన్స్ షారుక్, సల్మాన్ సరదాగా డ్యాన్స్ ఫ్లోర్‌పై పోటీ పడ్డారు. నువ్వా? నేనా అన్నట్లుండే ఈ ఖాన్స్ నువ్వూ నేనూ అంటూ ఓ సాంగ్‌కి చిందేశారు. షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘జీరో’. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో షారుక్ మరుగుజ్జు పాత్రను పోషించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో ‘ఇస్క్బాజీ..’ అనే సాంగ్‌లో కనిపించనున్నారు. ఈ పాట వీడియో సాంగ్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ‘జీరో’ సినిమాలో కత్రినా తన నిజ జీవిత పాత్రనే పోషించారు. ఆమె కోసం ఈ ఇద్దరు ఖాన్స్ సరదాగా పోటీ పడుతున్నట్టుగా ఈ సాంగ్‌ను రూపొందించారు. డిసెంబర్ 21న ‘జీరో చిత్రం రిలీజ్ కానుంది. -
ఖషోగ్గీ ఎమయ్యాడో తెలీదు: సౌదీ రాజు
దుబాయ్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ కనిపించకుండా పోవడంపై సౌదీ అరేబియాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రాజు సల్మాన్ రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. ఖషోగ్గీ ఏమమయ్యాడో తమకు తెలియదని చెప్పారు. సౌదీ పౌరుడైన ఖషోగ్గీ అమెరికాలోఉంటూ సౌదీపై వాషింగ్టన్ పోస్ట్‌లో విమర్శనాత్మక కథానాలు రాసేవారు. ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోపలికెళ్లిన తర్వాత ఆయన కనిపించకుండా పోవడం, ఆయనను సౌదీనే హత్య చేసిందని ఆరోపణలు రావడం తెల్సిందే. సౌదీలో రాజకుటుంబానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే వ్యతిరేక పోస్ట్‌లు కూడా వస్తున్నప్పటికీ వాటిని సౌదీ ప్రభుత్వం వెంటనే తొలగిస్తోందని తెలుస్తోంది. ఇస్తాంబుల్‌లోని సౌదీ ఎంబసీలో ఖషోగ్గీ అదృశ్యంపై టర్కీ పోలీసులు అక్కడ సోదాలు చేశారు. -
అతడితోనే ‘మొదలైన’ ఐసిస్!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఆనవాళ్లు నాలుగేళ్ల క్రితం అబ్దుల్లా బాసిత్ గ్యాంగ్‌తోనే తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన సల్మాన్ మొయినుద్దీన్ది తొలి అరెస్టు. ఆ తర్వాత పలువురి చిక్కినా.. జేకేహెచ్, జేకేబీహెచ్ వంటి అనుబంధ సంస్థల కార్యకలాపాలు సాగినా... ఏడాదిగా పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చిందని పోలీసులు భావించారు. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం అబ్దుల్లా బాసిత్‌తో పాటు ఖదీర్‌లను పట్టుకోవడంతో మరోసారి కలకలం రేగింది. 2016లో ఢిల్లీ యూనిట్ నమోదు చేసిన కేసులో వీరిద్దరినీ అరెస్టు చేసింది. ‘కోల్‌కతా’ నుంచి సిటీకి... ఐసిస్ భావజాల వ్యాప్తి, రిక్రూట్మెంట్ అంశాలు 2012 నుంచి భారత్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. ఉత్తరాదిలో అనేక అరెస్టులు సైతం చోటు చేసుకున్నాయి. అయితే 2014 సెప్టెంబర్‌లో వరకు దీని ఛాయలు సిటీలో ప్రత్యక్షంగా కనిపించలేదు. ఆ నెల్లో అబ్దుల్లా బాసిత్ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ మీదుగా దేశ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ చేరుకుని, అక్కడ నుంచి సిరియా వెళ్ళేందుకు ప్రయత్నించిన మాజ్, అబ్రార్, నోమన్‌లను పోలీసులు కోల్‌కతాలో పట్టుకున్నారు. ఈ నలుగురినీ హైదరాబాద్‌కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 మంది ఐసిస్ ఆకర్షితుల్ని గుర్తించిన పోలీసులు కౌన్సెలింగ్ చేసి వదిలిపెట్టారు. ఫస్ట్ మ్యాన్ సల్మాన్... హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని బజార్‌ఘాట్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సల్మాన్ మొహియుద్దీన్ నిక్కీ జోసఫ్ అనే మహిళ ద్వారా ఐసిస్ వల్లో చిక్కాడు. ఫేస్బుక్ ఆధారంగా గాలం వేసిన జోసఫ్... దుబాయ్ మీదుగా సిరియా వెళ్లేందుకు ఇతడిని సిద్ధం చేసింది. ఆ ప్రయాణంలో ఉండగానే 2015 జనవరి 16న శంషాబాద్ విమానాశ్రయంలో సల్మాన్ చిక్కాడు. నగరంలో ఐసిస్‌కు సంబంధించిన తొలి అరెస్టు ఇదే. జోసఫ్ కాదు అఫ్షా... నిక్కీ జోసఫ్ పేరుతో సల్మాన్‌ను ఆకర్షించి, ఉగ్ర ఉచ్చులోకి దింపింది దుబాయ్‌లో ఉంటున్న అఫ్షా జబీన్‌గా పోలీసులు గుర్తించారు. హిమాయత్‌నగర్‌కు చెందిన ఈమె కొంతకాలంగా దుబాయ్‌లో కుంటుంబంతో సహా నివసిస్తూ ఐసిస్ ఏజెంట్‌గా పని చేస్తోంది. డిపోర్టేషన్ పద్దతిలో హైదరాబాద్ రప్పించిన జబీన్‌ను 2015 సెప్టెంబర్ 11న శంషాబాద్ విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. ఈమెవిచారణలో దేశ వ్యాప్తంగా ఐసిస్ వైపుఆకర్షితులైన అనేక మంది వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఐసిస్ త్రయం అరెస్టు... 2014 సెప్టెంబర్‌లో దేశ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ కోల్‌కతాలో చిక్కిన నలుగురిలో అబ్దుల్ బాసిత్‌తో మాజ్ హసన్ ఫారూఖ్ కూడా ఉన్నాడు. వీరిద్దరూ నగరానికే చెందిన ఫారూఖ్ హుస్సేనీతో కలిసి మరోసారి ఐసిస్ వైపు పయనమయ్యారు. నాగ్‌పూర్ మీదుగా శ్రీనగర్ వెళ్లేందుకు ప్రయత్నించి 2015 డిసెంబర్ 28నఅక్కడి విమానాశ్రయంలో పట్టుబడ్డారు. దీరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆపై జేకేహెచ్... జేకేబీహెచ్ మాడ్యుల్స్... 2016 నుంచి ఐసిస్ తన పంథా మార్చింది. సిరియాకు రప్పించి ‘యుధ్ధం’ చేయించడం కంటే దేశీయంగా ఉన్న యువతను రెచ్చగొట్టి ఇక్కడే విధ్వంసాలకు ప్రేరేపించాలని నిర్ణయించుకుంది. దీనికోసం జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ (జేకేహెచ్) పేరుతో మాడ్యుల్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి 2016 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 16 మందిని పట్టుకున్నారు. వీరిలో టోలిచౌకి, మాదాపూర్ ప్రాంతాలకు చెందిన నఫీజ్ ఖాన్, ఒబేదుల్లా ఖాన్, షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్, అబు అన్స్ సైతం ఉన్నారు. ఆపై అదే ఏడాది జూన్‌లో జునూద్ అల్ ఖలీ ఫీ బిలాద్ అల్ హింద్ (జేకేబీహెచ్) మాడ్యుల్ ఏర్పాటు కావడంతో దీని సౌత్ ఇండియా ఇన్చార్జ్గా భావిస్తున్నా మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. 2017 జూలైలో సిట్ పోలీసులు అరెస్టు చేసిన కొనకళ్ళ సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్‌దే ఐసిస్ కోణంలో ఆఖరి ఉదంతం. ఏపీలోని కృష్ణాజిల్లాకు చెందిన ఇతగాడు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వారి ప్రోద్భలంతో మతం మారడంతో పాటు ఉగ్రవాదబాటపట్టాడు. పాస్‌పోర్ట్ లేనికారణంగా సిరియా వెళ్ళే చాన్స్ లేకపోవడంతో దేశీయంగానే విధ్వంసాలు సృష్టించాలని భావించాడు. ఇతడి వ్యవహారం గుర్తించిన నిఘా వర్గాలు సిట్‌కు సమాచారం ఇవ్వడంతో పట్టుబడ్డాడు. ఆపై ఏడాది తర్వాత తాజాగా ఆదివారం బాసిత్, ఖరీద్లు అరెస్టు అయ్యారు. ఖదీర్ నేపథ్యం ఇదీ... జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అనాథాశ్రమం ఉద్యోగి అబ్దుల్ ఖుద్దూస్ కుమారుడే అబ్దుల్ ఖదీర్. ప్రస్తుతం చంద్రాయణగుట్టలో నివసిస్తున్న ఖదీర్ బాసిత్ ప్రభావంతోనే ఐసిస్ వైపు ఆకర్షితుడయ్యాడు. 2015లో పదో తరగతి ఫెయిల్ అయిన ఇతగాడు ఓ ఇంటర్నెట్ సెంటర్లో పార్ట్‌టైమ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతడి మేనత్తతో పాటు కొందరు బంధువులు పాకిస్థాన్‌లో ఉంటారు. వాస్తవానికి ఈ నెల 10న ఓ శుభకార్యం కోసం కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్ళాల్సి ఉంది. అయితే ఏడో తేదీ నుంచే ఎన్ఐఏ విచారణకు హాజరుతుండటంతో సాధ్యం కాలేదు. ఇతడి నుంచి ఎన్ఐఏ అధికారులు కొన్ని నిషేధిత వస్తువులు సైతం స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. బాసిత్ చరిత్ర ఇలా... చంద్రాయణగుట్టలోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన బాసిత్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. 2014 ఆగస్టులో కోల్‌కతాలో పట్టుబడటంతో యాజమాన్యం కళాశాల నుంచి పంపించేసింది. హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియల్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్లో ఐసిస్‌లో చేరేందుకు వెళ్ళిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి వెళ్ళిపోయాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్‌పూర్‌లో పట్టుకుని అరెస్టు చేశారు. తాజాగా ఎన్ఐఏ అధికారులు ఇతడి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ నుంచి కీలక సమాచారం సేకరించారు. -
చేతికి స్టీరింగ్
ఆదివారం, 24. జూన్ 2018. సౌదీలో వీధులన్నీ కోలాహలంతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. న్యూ ఇయర్‌లా! అంతకన్నా ఎక్కువే. ఓ కొత్త శకంలా. అసలు శనివారం అర్ధరాత్రి గడియారం ముళ్లు 12 మీదకు రాగానే, వీధులన్నీ హర్షాతిరేకపు జల్లులతో నిండిపోయాయి. రియాద్, జెడ్డా, దమ్మమ్లలో మహిళలంతా దీపాలు పట్టుకుని తిరిగారు. ‘‘నేను మా వారి కారును ఈ రోజు ఉపయోగించుకున్నాను. త్వరలోనే నా కారు నేను కొనుక్కుందామనుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ అంతా వింతగా, కొత్తగా కనిపిస్తోంది. ఇది నిజంగానే సౌదీ మహిళలకు పండుగరోజు’’ అన్నారు సౌదీ మహిళ బయన్. సౌదీ మీడియా వీరిని అనుసరించి ప్రపంచానికి వీరి ఆనందాన్ని పంచింది. స్టీరింగ్ తమ చేతికి రావడాన్ని స్వాతంత్య్రానికి తొలి అడుగు పడినట్లు భావిస్తున్నారు సౌదీ మహిళలు. సుమారు 30 సంవత్సరాల తరవాత నిషేధాన్ని ఎత్తివేయడమే ఇంత ఆనందానికీ కారణం. 1990లో పోలీసులు, లైసెన్స్ ఏజెన్సీలు కలిసి మహిళల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసి, మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని నిషేధించిన రోజు నుంచి అక్కడి మహిళలు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. ఇటీవలే పట్టాభిషిక్తుడైన మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీలో సంస్కరణలకు నడుం బిగించారు. సాంఘిక, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగానే మహిళలు స్వేచ్ఛగా వాహనాలు నడుపుకునేలా చట్టం తీసుకొచ్చారు. ‘‘ఇక్కడ జీవితం ఒక్కోసారి దుర్భరంగా అనిపిస్తుంది’ అంటారు బయాన్. సిరియాకి చెందిన బయాన్, డమస్కస్‌లో చదువుకుంటున్న రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నారు.‘‘సూపర్ మార్కెట్‌కి వెళ్లడానికి కూడా ఇతరుల మీద ఆధారపడటం చాలా చిరాకుగా ఉండేది. కనీసం పది నిమిషాల దూరానికి కూడా స్వేచ్ఛగా ప్రయాణించ లేకపోవడం బాధాకరం. ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడటం ఎంతో ఆనందంగా ఉంది. పురుషాధిక్యం ఉన్న సౌదీ అరేబియాలో మహిళలు ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ, సెకండ్ క్లాస్ సిటిజన్‌గా, నిర్ణయాలు తీసుకోలేని వారిగా ఉండటం మాకు ఎంతో బాధగా ఉంటుంది’’ అంటున్నారు బయాన్. – రోహిణి ఎక్కడికైనా వెళ్లగలను రైడ్ హెయిలింగ్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకున్న మొట్టమొదటి సౌదీ అమ్మాయిని నేనే. ఈ రోజు నాకు స్వేచ్ఛ లభించింది. ఏ సమయంలోనైనా ఎక్కడికైనా నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే హక్కును సాధించాను. నేను డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టాను. సౌదీలో మహిళా కాల్ సెంటర్ కూడా స్థాపించాను. ఇక్కడ ఇదే ఏకైక మహిళా కాల్ సెంటర్. త్వరలోనే 20 వేల మంది మహిళా డ్రైవర్లు వచ్చేలా చూస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. – కరీమ్, సౌదీ మహిళ నా జీవితంలో మంచిరోజు ఆర్థికంగా స్వేచ్ఛగా బతకడానికి, సంఘంలో నిలదొక్కుకోవడానికి డ్రైవింగ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను హాయిగా నాకు కావలసినవారిని కలవడానికి స్వేచ్ఛగా వెళ్లగలుగుతాను. నా జీవితంలో ఇంత మంచి అవకాశం వచ్చినరోజు మరొకటి లేదేమో. – ఈనామ్ ఘాజీ అల్ అస్వాద్, సౌదీ మహిళ -
మనవాళ్లు ఐసా నహీ!
‘సార్.. బెంజి కారు తెచ్చాం’‘ఐసా నహీ’ ‘సార్.. లీచీ, బాదాం, కాజూ, పిస్తా, ఖజూర్, కిస్మిస్ జ్యూస్ ఆయా’‘ఐసా నహీ’‘మేడమ్.. టాప్ మీద గోల్డ్ ఎంబ్రాయిడరీ. కాలర్ మీద డైమండ్ స్టడ్డింగ్, బెల్టులో రూబీ ఫిట్టింగ్’‘ఐసా నహీ’ అసలు ‘ఐసా నహీ’ అంటే ఏంటి?‘ఇలా కాదు’ అని. బాలీవుడ్లో ప్రొడ్యూసరు ఏది చేసినా..‘ఐసా నహీ.. అలా కావాలి’ అని అడుగుతుంటారు స్టార్లు.వాళ్ల నకరాలు, ఎక్స్‌ట్రాలు చూస్తే మనవాళ్లు ఐసా నహీ అనిపిస్తుంది. నవంబర్‌లో ఆమిర్‌ఖాన్ యాక్షన్–అడ్వెంచర్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ రిలీజ్ అవుతోంది. థగ్స్ అంటే దోపిడీదారులు. 1839లో ఫిలిప్స్ మెడోస్ టేలర్ అనే ఫ్రాన్స్ రచయిత రాసిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ థగ్’ అనే నవల ఆధారంగా విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. (ధూమ్ వన్, టు, త్రీ; రావన్ ఈయనవే). నిర్మిస్తున్నది ఆదిత్యా చోప్రా. 210 కోట్ల రూపాయల బడ్జెట్. 19వ శతాబ్దం నాటి ఈ స్టోరీలో బ్రిటిష్ పాలకులకు కంట్లో నలకలా మారిన ఒక ఇండియన్ దోపిడీ ముఠా ఉంటుంది. ఆ ముఠాకు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడే ఆమిర్ ఖాన్. ‘ఆమిర్ అలీ’ అనే ఆ పాత్రలో ఆమిర్‌ఖాన్ జీవించేస్తున్నాడట! అయితే ఆ పాత్రలోనే కాదు, తన రెమ్యునరేషన్ దగ్గర కూడా ఆమిర్ ఒక దోపిడీ ముఠా నాయకుడికి ఏ మాత్రం తక్కువ కాని స్థాయిలో.. గొంతు మీద కత్తిపెట్టి, ‘తియ్.. ఎంతుందో’ అని డబ్బును డిమాండ్ చేశాడట! మూవీ ప్రాఫిట్లో 70 పర్సెంట్ తనకు ఇవ్వాలని ఆమిర్ అడిగినట్లు వార్తలొచ్చాయి. అంటే 147 కోట్ల రూపాయలు! ఇది తెలిసి ఇండస్ట్రీ షాక్ అయింది. నిర్మాతలకు, బయటì వాళ్లకు స్టార్లు, సెలబ్రిటీలు ఇచ్చే ఈ షాకులు కొత్తేం కాదు. వాళ్లు పెట్టే డిమాండ్లు ఎంత వింతగా, ఎంత విడ్డూరంగా, కొన్నిసార్లు ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా ఉంటాయో పాపం ఆ.. పడేవాళ్లకు మాత్రమే తెలుసు. అవి తీర్చలేని వారు ‘సారీ’ అంటారు. తీర్చక తప్పనివారు ‘సరే’ అంటారు. అలాంటి కొన్ని గొంతెమ్మ కోర్కెలు, వింత వింత షరతులు ఈవారం మన శాటర్డే స్పెషల్. ఫస్ట్ ఐశ్వర్యారాయ్‌తో స్టార్ట్ చేద్దాం. పెద్ద స్టార్ కదా మరి! నిర్మాతల్ని ఆమె పెద్దగా బెదరగొట్టలేదు కానీ, ఫ్లయింట్ సిబ్బందే.. ఐశ్వర్య ఎక్కిందంటే చాలు.. ‘బాబోయ్’ అని మూలమూలలకి నక్కేస్తారు. ఆమె గురించి తెలియనివాళ్లే ధైర్యంగా ముందుకొచ్చి.. ‘యస్.. మ్యామ్. మేము మీకేదైనా సహాయపడగలమా?’ అని అడుగుతారు. ‘ఓయస్.. తప్పకుండా సహాయపడగలరు’ అని ఒక స్మయిల్ ఇచ్చి, ఫ్లయిట్లో ఏమేం డిష్‌లు ఉన్నాయో అన్నీ మొహమాటం లేకుండా తెప్పించుకుంటారు ఐశ్వర్య! అవన్నీ ఆరగిస్తారా అంటే లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని తెస్తే వాటిల్లో చూడచక్కగా ఉన్న ఒక్కటి మాత్రమే మేడమ్ సెలక్ట్ చేసుకుంటారు. ఫ్లయిట్లో ఎక్కడికి వెళ్లినా ఐశ్వర్యకు ఇదో హ్యాబిట్. ఐశ్వర్యలా.. కరీనా కపూర్ తిండి విషయంలో ఏమంత పర్టిక్యులర్ కాదు. ఉన్నదేదో తినేస్తారు. అయితే ఉన్నవాళ్లెవరో వాళ్లతో నటించేయరు. అర్థం కాలేదా! నిర్మాతలు ఎవరైనా కరీనా దగ్గరికొచ్చి ‘కరీనాజీ మీరే మా సినిమాలో హీరోయిన్’ అని ఆనందంతో తబ్బిబ్బవుతూ చెబితే, కరీనా ఏ మాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా ‘ఇంకా ఎవరెవరుంటారు మీ సినిమాలో?’ అని అడుగుతారు. ‘ఇంకా కాస్టింగ్ పూర్తి కాలేదు’ అంటే.. ‘ఎ–లిస్ట్’ యాక్టర్లు అయితేనే నేను చేస్తాను’ అని షరతు విధిస్తారు కరీనా! కరీనాలా అందరూ ఎ–లిస్ట్ వాళ్లే అయితే నిర్మాతలు ఏ లిస్టులోకి వెళ్లిపోతారో ఊహకు అందనిదేం కాదు. కరీనాలా రేఖ ఇలాంటి షరతులేం పెట్టకున్నా.. కరీనానే నయం అనిపించేలా చేశారొకసారి. అభిషేక్ కపూర్ చిత్రం ‘ఫితూర్’లో నటిస్తూ నటిస్తూ మధ్యలో క్విట్ కొట్టేశారు రేఖ. నిర్మాతకు కాళ్లు ఒణికాయి. ‘ఏమైంది తల్లీ?! మమ్మల్ని నడి సముద్రంలో వదిలేసివెళ్లారు’ అని ఫోన్‌చేసి అడిగాడు. ‘నా లుక్ నేను అనుకున్నంత బాగా రాలేదు. అందుకే మీ సినిమాను వదిలేశా’ అని కూల్‌గా చెప్పారు రేఖ. నిర్మాత కుప్పకూలిపోయాడు. తబూ వచ్చి పైకి లేపి నీళ్లిచ్చింది. నిర్మాత తేరుకుని ‘నువ్వే మా రేఖ’ అనేశాడు. రేఖతో షూట్ చేసిందంతా తిరిగి తబూతో చేయించాడు. ఈ బుద్ధి మల్లికా శెరావత్కీ ఉంది. సీన్ బాగా రాలేదని తనకు అనిపిస్తే (భలే వచ్చిందని డైరెక్టర్‌కి అనిపించినా కూడా) మళ్లీ తీయించమంటుంది. టేకులు తినకుండా టేకులు తినిపించడం అంటే ఇదే. ప్రియాంకా చోప్రాది ఇంకో రకమైన ధోరణి. బయట ‘ఫ్యాషనబుల్‌గా చిరిగిపోయిన’ బట్టల్ని వేసుకుని చక్కగా కనిపిస్తారు కదా ఈవిడ.. సినిమాల్లో నటించడానికి మాత్రం ‘నో–న్యూడిటీ’ క్లాజ్ పెట్టేస్తారు. ‘ఒక్క సీన్ మేడమ్.. ప్లీజ్’ అని బతిమాలినా కూడా కనికరం చూపరు. ఇప్పుడామె హాలీవుడ్ నటి. అక్కడ కూడా అంతే. ‘క్వాంటికో’, ‘బేవాచ్’ సీరీస్‌లో ఒళ్లు కనిపిస్తే ఊరుకోనన్నారు. దాంతో ఆమె ఒళ్లు కనిపించే అవసరం లేకుండా నిర్మాతలు నిరుత్సాహంగా సన్నివేశాలను తిరగ రాసుకున్నారు. దీపిక పడుకోన్ కూడా తక్కువేం తిన్లేదు. అయితే ఒళ్లు కనిపించనివ్వని విషయంలో కాదులెండి. విక్కీ కౌషల్ అనే యాక్టర్‌తో నటించేది లేదు పొమ్మంది. విక్కీ ఎ–లిస్టర్ కాదు. అదీ దీపిక అబ్జెక్షన్. వెంటనే నిర్మాతలు తన్ని తరిమేశారు. ఎవర్ని తన్ని తరిమేశారో వేరే చెప్పాలా?! పాపం విక్కీ. కత్రీనాకు ఈ టైప్ ఆఫ్ అభ్యంతరాలు తక్కువే. అయితే ‘ఫితూర్’ ఫిల్మింగ్ మొత్తం అయిపోయాక ఓ సీన్‌ని మళ్లీ తీయాలని పట్టుపట్టింది. ‘బాగానే ఉంది కదమ్మా’ అని నిర్మాత అన్నాడు. ‘ఏం బాగుంది! నా మొఖం. కొంచెం బొద్దుగా లేనూ. మళ్లీ తియ్యండి’ అని కత్రీనా హఠం పట్టింది. విషయం ఏంటంటే.. సినిమా పూర్తయ్యాక కత్రీనా తగ్గడం మొదలుపెట్టింది. తగ్గాక అద్దంలో తనకు తనే విపరీతంగా నచ్చేసింది. ఆడియన్స్‌కి ఆ బొద్దు సీన్‌ని చూపించడం కన్నా, ఈ స్లిమ్ సీన్‌ని చూపించడం బెటర్ కదా అనుకుంది. చేసేది లేక నిర్మాత ‘ఓకే’ అన్నాడు. ‘అప్పుడే ఓకే కాదు, నాకు నచ్చిన స్టిల్ ఫొటోగ్రాఫర్ వచ్చి ఆ సీన్‌కి ఫొటో తీస్తాడు’ అంది. ‘అలాగే తల్లీ’ అని దండం పెట్టాడు నిర్మాత. ఇప్పుడొక చిన్న బ్రేక్. ముక్కు మీద వేలేసుకునే విషయం. సన్నీలియోన్ తెలుసు కదా. తెలియకుండా ఉంటుందా! ఉండదనే నిర్మాతలూ అనుకున్నారు. అయితే కాంట్రాక్ట్‌లో ఆమె పెట్టిన షరతు చూసి కుప్పకూలి పోయారు. ‘నో కిస్సింగ్’ క్లాజ్ అది. ఇప్పటికీ లియోన్ ఏమీ మారలేదు. రెమ్యునరేషన్ తర్వాతి సంగతి. ముద్దు సీనైతే లేదు కదా అని అడుగుతుంది. భలే అమ్మాయండీ! సోనాక్షి సిన్హా కూడా భలే అమ్మాయే. ఆమెకీ ఈ ‘ముద్దుపిచ్చి’ ఉంది. అంటే.. ముద్దిచ్చే పిచ్చి కాదు. ముద్దొద్దనే పిచ్చి. ‘నువ్విప్పుడు ఈ హీరోని ముద్దు పెట్టుకోవాలమ్మాయ్..’ అని అని చెబితే.. ‘ముందే చెప్పాను కదా.. నాకిలాంటివి ఇష్టం ఉండవని’ అంటుంది. సీన్ డిమాండ్ చేస్తోంది అమ్మాయ్’ అంటే.. నేను కమాండ్ చేస్తున్నా.. సీన్ మార్చండి అంటుంది. అలా చాలా సీన్లతో పాటు, చాలా సినిమాలూ వదులుకుంది సోనాక్షి. ‘దబాంగ్’లో సల్మాన్ పక్కన చేసింది సోనాక్షి. అతడూ అంతే ‘నో–కిస్సింగ్’ అంటాడు.. ప్రాజెక్టుకు సంతకం పెట్టే ముందే. అందుకనే సల్మాన్ చిత్రాల్లో మనకు అతడి కండలు కనిపిస్తాయి కానీ, అతడి ముద్దులు కనిపించవు. సల్మాన్‌తో నిర్మాతలకు ఇంకో ఇబ్బంది కూడా ఉంది. ఆకాశంలో ఔట్ డోర్ షూటింగ్ ఉన్నా.. అక్కడికి జిమ్ ఎక్విప్మెంట్ మొత్తం తెప్పించమంటాడు! షాట్ గ్యాప్‌లో బాడీని వామప్ చేసుకోవాలనిపిస్తే అతడికి ఈ సరంజామా అంతా ఉండాలి. నాలుగు గుంజీళ్లు తీస్తే సరిపోతుంది కదా అని సరిపెట్టుకోడు. హృతిక్ రోషన్‌కి కూడా ఈ బాడీ పిచ్చి ఉంది. అయితే నిర్మాతల్ని మరీ అంతగా వేధించడు. ఔట్ డోర్‌కి వెళ్లే ముందు.. ‘మంచి జిమ్ బుక్ చెయ్యండి’ అని మాత్రం అడుగుతాడు. మరీ అంత మంచి జిమ్ దొరక్కపోయినా అడ్జెస్ట్ అయిపోతాడు. అక్షయ్‌కుమార్ ఇంకో రకం ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. సండే సూర్యుడొచ్చి లేపినా లేవడు. ఇక డైరక్టరొచ్చి లేపితే లేస్తాడా! మంచి లైటింగ్ ఉంది లెమ్మంటే, రమ్మంటే.. ‘రేపు చూద్దాం’ అని నిర్మొహమాటంగా అనేస్తాడు. ఆదివారాలు ఈ మనిషి మనిషి కాదు అని వదిలేశారు దర్శకులు. ఆయన్ని వదిలేయడం కాదు. ఆయనపై ఆశల్ని వదులుకున్నారు. ఇప్పటికీ అంతే. అక్షయ్‌తో మరో తలనొప్పి కూడా ఉంది. షూటింగ్ ఎర్లీ మార్నింగ్ మొదలు కావాలంటాడు! ‘అదేంటీ అక్షయ్’ అని అడిగితే.. ‘లేట్ నైట్ నేను చెయ్యలేను’ అంటాడు. దీన్ని బట్టి అక్షయ్‌ది షూటింగ్‌లకు పనికొచ్చే బాడీ కాదనిపిస్తోంది. టెన్ టు ఫైవ్ ఉద్యోగానికి వెళ్లక, పొరపాటున ఇటు వచ్చినట్లున్నాడు. ఈ స్టోరీ ఆమిర్‌తో కదా మొదలైంది.. చుక్కలు కనిపించే ‘లెక్క’లేశాడని! ఈయనతో ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. ‘లో యాంగిల్’ షాట్ తియ్యనివ్వడు. అంటే.. కాళ్ల దగ్గర కెమెరా పెట్టి, తనను షూట్ చెయ్యనివ్వడు. íసిగ్గట.. ఖాన్ సాబ్‌కి.ఈ సిగ్గులు, అసలు సిగ్గే పడకపోవడాలు డిమాండ్ ఉన్న స్టార్లకు మామూలే. వాళ్లేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. వాళ్లేం అడిగినా వాళ్ల కాళ్ల దగ్గరికి వచ్చేస్తుంది. మరీ ఇబ్బంది అనిపిస్తే తప్ప ప్రొడ్యూసర్లు బయటపడరు. స్టార్లను వదిలించుకోరు. హద్దు దాటినప్పుడే.. పద్దులు చూసుకుంటారు. ‘అమ్మా నీకో దండం’, ‘అయ్యా నీకో నమస్కారం’ అని ప్యాకప్ చెప్పేసి, కొత్త వాళ్లతో మళ్లీ పికప్ అవుతారు. ముద్దంటే చేదు ముద్దు సీన్లంటే గిట్టనివాళ్లు సన్నీలియోన్, సోనాక్షీ, సల్మాన్ (అరె! ముగ్గురి పేర్లూ ‘ఎస్’ తోనే మొదలయ్యాయే) మాత్రమే కాదు. షారుక్ కూడా. (మళ్లీ ఇంకో ‘ఎస్’). అగ్రిమెంట్లో ‘నో కిస్సింగ్’ అని తప్పనిసరిగా కండిషన్ పెడతాడు షారుక్. ఒక్క యాష్ చోప్రా రిక్వెస్ట్పైన మాత్రం ‘జబ్ తక్ హై జాన్’లో తన రూల్‌ని తను బ్రేక్ చేసుకున్నాడు. రికార్డులు బ్రేక్ చేస్తేనే కాదు.. అప్పుడప్పుడు మన రూల్స్‌ని మనమే బ్రేక్ చేసుకున్నా గౌరవమే. యాష్ చోప్రా.. పై నుంచి షారుక్‌ని దీవిస్తూ ఉండివుంటారు.. ముద్దుకి షారుక్ ఓకే అన్నందుకు. -
నేనేమీ గాంధీ, మండేలాను కాదు.. సంపన్నుడిని!
రియాద్: సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ.. కఠిన చట్టాలు తెస్తూ దేశంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కాబోతున్నారు. తమ ఉమ్మడి శత్రువైన ఇరాన్ గురించి ఇరువురు దేశాధినేతలు ఈ భేటీలో చర్చిస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువరాజు సల్మాన్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పాలనలో విషయంలో ఇంచుమించు ఇటు సల్మాన్, అటు ట్రంప్ ఒకే రకం కావడం గమనార్హం. అమెరికాలో ట్రంప్ ఎలాగైతె కొత్త చట్టాలు తెచ్చారో సౌదీలో కూడా సల్మాన్ అలాంటి కఠిన చట్టాలే తెచ్చారు. అవినీతికి పాల్పడ్డారంటూ తన బంధుగణంలో 11మంది యువరాజులనూ, నలుగురు మంత్రులనూ బంధించారు. అంతేకాకుండా సౌదీలో నివసించే విదేశీయుల నుంచి నెలనెలా పన్ను వసూలు చేస్తున్నారు. తీవ్రవాదులకు సాయం చేస్తున్నారని ఖతర్‌తో ద్వైపాక్షిక సంబంధాలను తెంచుకున్నారు. యెమన్‌పై యుద్ధం ప్రకటించారు. సౌదీ దేశాభివృద్ధి కోసమే ఈ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటానని సల్మాన్ తెలిపారు. ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్న పలు ఆసక్తికరమైన విషయాలివి.. మహిళకి స్వేచ్ఛ ఇచ్చాం ఒకప్పుడు సౌదీలో మహిళల పట్ల కఠిన చట్టాలు ఉండేవి. స్త్రీలు డ్రైవింగ్ చేయరాదు. ఆర్మీలో మహిళలకు అవకాశం లేదు. బయటకు వెళ్లాలంటే భయం. కానీ మా హయంలో మహిళలకి స్వేచ్ఛ ఇచ్చాం. ఆర్మీలో వారికి అవకాశం ఇచ్చాం. అన్నిరంగాల్లో మహిళలు రాణించేలా కృషి చేస్తున్నాం. ఉద్యోగం చేయాలంటే ఇకపై గార్డియన్ అనుమతి అవసరం లేకుండా చేశాం. మహిళా సాధికారతకు మేం కృషి చేస్తున్నాం. సౌదీ అంటే ఇది కాదు ఒకప్పుడు సౌదీవాసులు సాధారణ జీవితాన్ని గడిపేవారు. ఇరాన్లో ఇస్లాం విప్లవం, మక్కా మసీదును తీవ్రవాదులు బంధించడంతో దేశం నాశనం అయింది. 1979 కంటే ముందు దేశం చాలా బాగుండేది. స్త్రీలు డ్రైవింగ్ చేసేవారు. అన్ని దేశాల స్త్రీలలాగే సౌదీ మహిళలు కూడా అన్ని రంగాలలో పనిచేసేవారు. 1979 కంటే ముందు సౌదీ ఎలా ఉండేదో ఇంటర్నెట్లో చూడడండి. అప్పటి సాధారణ జనజీవితం ఎలా ఉండేదో తెలుస్తుంది. ప్రక్షాళన చేయాల్సిందే ‘దేశంలో అవినీతి లేకుండా చేయడమే నా లక్ష్యం. తప్పు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. అది ఎవరైనా’ అంటూ 11మంది యువరాజులనూ, నలుగురు మంత్రులనూ బంధించడాన్ని సమర్థించుకున్నారు సల్మాన్. బంధించిన వారి నుంచి 100 బిలియన్ల డాలర్లను స్వాధీనం చేసుకున్నాం. డబ్బు వసూలు చేయడం మా లక్ష్యం కాదు. అవినీతిని నిర్మూలించాలనేదే మా కోరిక అని ఆయన అన్నారు. నా ఆదాయంలో 51 శాతం ప్రజలకే ఇస్తా ఒకవైపు సౌదీ ప్రభుత్వం ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడుపరాదని, పొదుపు పాటించాలని ప్రబోధిస్తుండగా.. ఆ ప్రభుత్వాధినేతగా ఉన్న యువరాజు సల్మాన్ మాత్రం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నివాసంగా పేరొందిన ఫ్రెంచ్ రాజభవనం ఒకటి ఆయన పేరిట ఉందని తాజాగా న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. దీనిపై సల్మాన్ స్పందిస్తూ నేనేమీ మహాత్మాగాంధీనో, నెల్సన్ మండేలానో కాదు. నేను ధనికుడిని. నాది విలాసవంతమైన జీవనశైలి. అయినా, ఆదాయంలో 51శాతం ప్రజలు, చారిటీలకు రాసిస్తానని చెప్పుకొచ్చారు. -
వాంటెడ్ దబాంగ్
సల్మాన్‌ఖాన్–ప్రభుదేవా దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘వాంటెడ్’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మరోసారి వీరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. అది కూడా సల్మాన్‌కి మాంచి హిట్స్ ఇచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన ‘దబాంగ్’ సిరీస్ కావడం విశేషం. ‘దబాంగ్’ కి అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, ‘దబాంగ్ 2’ ని సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో ‘దబాంగ్ 3’ రాబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై అర్బాజ్‌ఖాన్‌తో పాటు పలువురి పేర్లు వినిపించాయి. అయితే.. ఆ అవకాశం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాని వరించింది. ఈ విషయాన్ని ప్రభుదేవా స్వయంగా ప్రకటించారు. ‘‘దబాంగ్ 3’ సినిమాకు సంబంధించి గత వారం ముంబాయిలో చర్చలు జరిపాం. ఈ చిత్రానికి నన్నే దర్శకత్వం వహించమని సల్మాన్‌ఖాన్, అర్బాజ్ ఖాన్ కోరారు. నేనే దర్శకత్వం వహిస్తున్నా. కథానాయిక సోనాక్షీసిన్హా నటిస్తారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ పాతవారే ఉంటారు’’ అన్నారు ప్రభుదేవా. -
రిజల్ట్ కోసం వెయిటింగ్
మేఘన, సంతోషి, సల్మాన్ ప్రధాన పాత్రల్లో కృష్ణకార్తీక్ దర్శకత్వంలో హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘హ్యాక్డ్ బై డెవిల్’ (హెచ్‌బిడి). ఉదయ్‌భాస్కర్. వై నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో కృష్ణకార్తీక్ మాట్లాడుతూ– ‘‘హెచ్‌బిడి’ నా మొదటి సినిమా. చాలా ఉద్వేగంతో ఉన్నా. పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా. మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కృష్ణకార్తీక్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆయనకి ఇది తొలి చిత్రమైనా బాగా తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత రెగ్యులర్‌గా సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు నిర్మాత ఉదయ్‌భాస్కర్. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, నిర్మాతలు టి.రామ సత్యనారాయణ, రాజ్ కందుకూరి, సాయి వెంకట్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్ యం.యం, కెమెరా: కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ గౌడ్ వై. -
దెయ్యం హ్యాక్ చేస్తే..!
మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘హెచ్.బి.డి.’ (హ్యాక్డ్ బై డెవిల్). కృష్ణ కార్తీక్ దర్శకత్వంలో వై.ఉదయ్ భాస్కర్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘పక్కా థ్రిల్లర్ మూవీ ఇది. చిన్న నిర్మాతలు సినిమాలు తీయడం మానేస్తే సినీ పరిశ్రమ ఎంతో చిన్నదైపోతుంది. చిన్న చిత్రాలను అందరూ ఎంకరేజ్ చేయాలి. ఈ నెల 25న మా బ్యానర్లో మరో కొత్త సినిమా ప్రారంభమవుతుంది’’ అన్నారు. ‘‘మొదటి సినిమానే ప్రయోగాత్మకమైన కథతో చేయాలని నిర్మాతలు కోరడంతో హెచ్.బి.డి. తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. నా రెండో సినిమా కూడా ఈ బ్యానర్లోనే త్వరలో ప్రారంభం అవుతుంది’’ అన్నారు కృష్ణకార్తీక్. సంగీత దర్శకుడు మహి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. -
వెంకీ విత్ సల్మాన్ గాళ్‌ఫ్రెండ్
టాలీవుడ్ సీనియర్ హీరో , విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ ప్రవేశంపై మరోసారి ఊహాగానాలు చెలరేగాయి. ఎప్పుడు గాసిప్స్‌కు దూరంగావుండే ఈ నటుడు, సల్మాన్ గాళ్‌ఫ్రెండ్ లులియా వాంటర్‌తో కలిసి ఒకే కారులో కనిపించడం టాక్ ఆప్ టౌన్ అయ్యింది. దీంతో ఆయన బాలీవుడ్ ఎంట్రీపై పుకార్లకు తెరలేచింది. ముంబైలో డిన్నర్‌కు వెళ్లిన సందర్భంగా వీరిద్దరూ ఇలా కెమెరాకు చిక్కారు. దీంతో బాలీవుడ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన వెంకటేష్ పునః ప్రవేశం గురించి చర్చించడానికే వెళ్లారా? అనే పుకార్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలతో వెంకటేష్ బాలీవుడ్లో తిరిగి నటించనున్నారనే వార్తలకు ఈ మరింత బలం వచ్చింది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇటీవల ఓ పార్టీలో సల్మాన్, లులియాతో వెంకీ సమావేశమయ్యారని, దీనికి పార్టీలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. అయితే సమయం, సందర్భం ఏంటన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. అంతేకాదు మరో పుకారు కూడా షికారు చేస్తోంది. టాలీవుడ్ లోకి లూలియా వంతూర్ ప్రవేశం చేయనుందా అనేది ప్రజెంట్ టాక్ ఆఫ్‌ది టౌన్‌గా వుంది. అయితే ఇరువర్గాలనుంచి విశ్వసనీయ సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సల్మాన్ ఖాన్, వెంకటేష్ మధ్య సాన్నిహిత్యం తెలిసిన విషయమే. -
దెయ్యాలున్నాయి జాగ్రత్త!
‘‘ఈ సృష్టిలో దేవుళ్లు ఉన్నది నిజమైతే.. దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం’ అనే అంశంతో ‘హ్యాక్డ్ బై డెవిల్’ (హెచ్‌బిడి) తెరకెక్కించాం. హారర్ – థ్రిల్లర్‌లా సాగుతుందీ చిత్రం’’ అన్నారు దర్శకుడు కృష్ణకార్తీక్. మేఘన, సంతోషి, సల్మాన్ ముఖ్య పాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్. వై ఈ చిత్రం నిర్మించారు. మహిమదన్ యం.యం. సంగీతం అందించిన పాటల సీడీలను మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేశారు. ‘‘కృష్ణకార్తీక్ పక్కా ప్లానింగ్ వల్ల సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి’’ అని నిర్మాత తెలిపారు. మహిమదన్, నిర్మాత లయన్ సాయివెంకట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్ గౌడ్. వై. -
దెయ్యం హ్యాక్ చేస్తే?
సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను హ్యాక్ చేయడం కామన్.. కానీ, దెయ్యాలు హ్యాక్ చేస్తే? ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాక్డ్ బై డెవిల్’. మేఘన, సంతోషి, సల్మాన్ ముఖ్య పాత్రల్లో కృష్ణకార్తీక్ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్ వై. నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను నిర్మాత రామసత్యనారాయణ రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. టెక్నికల్ విభాగంలో పని చేసిన నన్ను, నా కథను నమ్మి ఉదయ్‌భాస్కర్ నాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం తర్వాత వరుసగా చిత్రాలు నిర్మిస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. జనవరి 1న పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని ఉదయ్‌భాస్కర్ చెప్పారు.. ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్ యం.యం, కెమేరా: కన్నాకోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్‌గౌడ్ .వై -
మేకింగ్ ఆఫ్ మూవీ - ప్రేమ్ రతన్ ధన్‌పాయో
-
నా తండ్రే పెద్ద విమర్శకుడు..!
ముంబైః బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలపై విమర్శకుల గురించి అడిగిన ప్రశ్నకు భిన్నంగా స్పందించాడు. ప్రేక్షలకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న సూపర్ స్టార్.. తాజా సినిమా సుల్తాన్ కూడ సునామీ సృష్టిస్తున్న తరుణంలో తన తండ్రే తనకు పెద్ద విమర్శకుడని చెప్పుకొచ్చారు. మీ దృష్టిలో ఎవరు మంచి విమర్శకులు అని అడిగిన ప్రశ్నకు సల్మాన్ కొత్తగా స్పందించారు. ప్రతి సినిమా విషయంలోనూ తనకు తన తండ్రే పెద్ద విమర్శకుడని తెలిపాడు. ముందుగా ఆయన స్పందనే నాకు ముఖ్యమని, ప్రతి సినిమా చూసి వచ్చిన తర్వాత మా త్రండ్రి సలీం ఖాన్... తన అభిప్రాయాన్ని ఎంతో సున్నితంగా చెప్తుంటారని తెలిపాడు. ఆయనకు నచ్చితే ఆ సినిమా విషయం ఇక మర్చిపోయి హాయిగా నిద్రపోవచ్చని చెప్తుంటారని, నచ్చకపోయినప్పుడు కూడా ఆ విషయం మర్చపోయి మరో సినిమాకు ఇంకొంచెం ఎక్కువ కష్టపడమని సూచిస్తుంటారని సల్మాన్ వివరించాడు. అయితే మీకోసం ఆయన ఏదైనా స్క్రిప్ట్ రాస్తుంటారా అన్న ప్రశ్నకు మాత్రం... ఆయన ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాయకపోయినా, అద్భుతమైన వ్యాసాలు రాస్తుంటారని, ప్రస్తుతం ట్వీట్లు కూడా చేస్తున్నారని అన్నాడు. నేను ఎన్నో ఏళ్ళుగా సినిమాలపై అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నానని, ఒక చిత్రంలో చేసినట్లు మరోదాంట్లో చేయనని, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగనివ్వనని ఈ సందర్భంలో తెలిపాడు. -
వంద రోజుల ప్రేమ!
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన మలయాళ చిత్రం ‘100 డేస్ ఆఫ్ లవ్’ అదే పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. జీనస్ మహ్మద్ దర్శకుడు. ఎస్.ఎస్.సి. మూవీస్ సమర్పణలో నిర్మాత ఎస్.వెంకటరత్నం ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. గోవింద్ మీనన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఎస్.వెంకటరత్నం మాట్లాడుతూ - ‘‘చక్కని ప్రేమకథా చిత్రమిది. ‘ఓకే బంగారం’లో దుల్కర్, నిత్యాల నటన, కెమిస్ట్రీలకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతారు. నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నాం’’ అన్నారు. -
సినీ ప్రియుల ‘సుల్తాన్’
సామాన్యుడు విజేతవడం మామూలు సినిమా. విజే తగా మారి, ఆ విజయం మత్తులో జీవి తంలో పరాజితు డైతే? జీవితమనే గోదాలోకి దిగి, తనతో తాను, తనలో తాను పోటీపడితే ఏమవుతుంది? సల్మాన్ హీరోగా చేసిన ఆ మ్యాజిక్ - ‘సుల్తాన్’ కథ ఏమిటంటే... కుస్తీ, కరాటే, బాక్సింగ్ వగైరా మార్షల్ ఆర్ట్స్ అన్నిటి కలగలుపుగా గోదాలో ప్రత్యర్థుల మధ్య జరిగే పోటీ - మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్. ఈ పోటీకి దేశవాళీ టచ్ ఇస్తే అప్పుల ఊబిలో నుంచి బయటకొస్తామనీ, ఒకప్పటి ఫేమస్ భారతీయ మల్లయోధుడు ‘సుల్తాన్’ను బరిలోకి దింపితే బాగుంటుందనీ నిర్వాహకులు భావిస్తారు. హర్యానాలోని పల్లెటూళ్లో కుస్తీ పోటీలకు దూరంగా బతుకుతుంటాడు సుల్తాన్ (సల్మాన్‌ఖాన్). ఒకప్పుడు ఒలింపిక్ స్వర్ణపతక విజేతైన అతనెందుకు అలా అయ్యాడన్నది అసలు కథ. సల్మాన్ భుజస్కంధాలపై... ఈ సినిమాకు ప్రాణం, ప్రణవం - సల్మానే! ఊళ్లో డిష్ టీవీ యాంటెన్నాలు బిగించుకొనే భోళా మనిషిగా, హీరోయిన్ ప్రేమ కోసం... మల్లయోధురాలైన ఆమె కళ్ళల్లో గౌరవం కోసం కుస్తీపట్లు నేర్చుకొనే కార్య సాధకుడిగా, కుస్తీ పోటీలే జీవితమై - గర్వం తలకెక్కిన ఒలింపిక్ గోల్డ్ విజేతగా, జీవితంలో కావాల్సినవి కోల్పోయిన పరాజితు డిగా, తనతో తాను... తనతో తాను పోరాడే నిజమైన పహిల్వాన్‌గా - స్క్రిప్ట్‌లో ఒక్కో దశలో ఒక్కో కోణంలో ఉన్న సుల్తాన్ పాత్రను సల్మాన్ సమర్థంగా పోషించారు. ఈ సినిమా బరువునంతా, పెంచుకున్న కండలు తిరిగిన దేహం సాక్షిగా తన భుజాలపై మోశారు. మల్లయోధురాలిగా, ఆశయానికీ, ప్రేమకీ మధ్య నలిగే వ్యక్తిగా అనుష్క శర్మ బాగున్నారు. నచ్చే అంశాలు... మెచ్చాల్సిన విషయాలు...: గ్రామసీమల్ని అందంగా చూపిన ఛాయాగ్రహణం, అనుభూతినిచ్చే సినిమా రీరికార్డింగ్ లాంటి ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక విభాగాలన్నీ బాగున్నాయి. కథ ఎటు వెళుతుందన్నది ముందే తెలిసిపోతున్నా, గోదాలో హీరోకూ, ప్రత్యర్థులకూ మధ్య పోటీ జరిగినప్పుడల్లా ప్రేక్షకులు కుర్చీలకి అతుక్కుపోతారు. ‘ఊపర్ అల్లా... నీచే ధర్తీ...’ అంటూ పదే పదే వచ్చే గీతఖండిక ఎమోషన్‌ను చాలా సార్లు పెంచింది. పురిట్లో బిడ్డ ఆడపిల్ల అయినా, మగపిల్లాడైనా సమానమే లాంటి అభ్యుదయ అంశాల్ని నైసుగా సిన్మాలో చెప్పించారు. కథ పకడ్బం దీగా రాసుకొని, ఎడిటింగ్‌కు పని పెడితే, ‘సుల్తాన్’ వేరే రేంజ్లో ఉండేది. - రెంటాల జయదేవ