
చిరంజీవి బర్త్‌డేకు రానున్న అతిరథులు
హాజరుకానున్న రజనీకాంత్, అమితాబ్, సల్మాన్ కుటుంబీకులు
ముంబై: మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదినోత్సవ కార్యక్రమానికి సినీరంగ అతిరథులు తరలిరానున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తోపాటు బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్, ఆయన కుటుంబీకులు, సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబీకులు, టబు, బోనీ కపూర్ తదితరులకు ఆహ్వానం అందింది. చిరంజీవి పుట్టినరోజు వేడుకలను శనివారం హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిరంజీవికి ఇష్టమైన వంటలను అతిథులకు రుచి చూపించబోతున్నారు.