Rajini
-
బయటకు వచ్చేద్దామనుకున్నాం.. అంతలోనే దుర్ఘటన
మద్దిలపాలెం: ‘అప్పటి వరకు ఇద్దరం కలిసి క్యూలో జాగ్రత్తగా ఉన్నాం. రద్దీగా ఉండటంతో లైనులో నుంచి బయటకు వెళ్లిపోదాం అనుకున్నాం. అదే సమయంలో రద్దీ అధికమవడంతో గేట్లు తెరిచారని చెప్పారు. ఒక్కసారిగా భక్తులు ముందుకు కదలడంతో తొక్కిసలాట జరిగింది. క్షణాల్లో నా భార్య రజనీ ప్రాణాలు కోల్పోయింది..’ అని గుడ్ల లక్ష్మారెడ్డి విలపించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో విశాఖపట్నంలోని మద్దిలపాలేనికి చెందిన గుడ్ల లక్ష్మారెడ్డి భార్య రజనీ మరణించిన విషయం తెలిసిందే. మద్దిలపాలెంలోని వారి ఇంటి వద్ద రజనీ మృతదేహానికి శుక్రవారం పలువురు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి తిరుపతి క్యూలైనులో జరిగిన ఘోరం గురించి వివరిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘క్యూలో ఉన్న ప్రతి ఒక్కరు 10వ తేదీన దర్శనం టికెట్ల కోసమే ఆరాటపడ్డారు. ఆ ఆరాటమే తొక్కిసలాటకు కారణమై భక్తుల ప్రాణాల మీదకు తీసుకొచి్చంది. మేం ఇద్దరం కలిసి జాగ్రత్తగా లైనులో వెళుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో విడిపోయాం. ఇంతలో రజనీ కోసం చూసే సరికి కనిపించలేదు. ఆ క్షణంలో అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాలేదు. తేరుకుని చూసేసరికి రజనీ కనిపించకుండాపోయింది. తొక్కిసలాటలో తప్పిపోయిన రజనీ కోసం తీవ్రంగా వెతికా. ఎక్కడా జాడలేదు. నా ఫోన్ కూడా రజనీ బ్యాగులో ఉండిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నా పనిచేయలేదు. ఏం జరిగిందో తెలియదు... రెండు గంటల తర్వాత రజనీని ఆస్పత్రిలో చేరి్పంచారని సమాచారం అందింది. ఆ ఆస్పత్రి ఎక్కడుందో తెలియదు. చివరకు ఆటోలో అక్కడి చేరుకున్నా. వెళ్లి చూసే సరికి నా భార్య విగతజీవిగా పడి ఉంది. రజనీ ఒంటిపై ఒక్క గాయం కూడా లేదు. తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిందనుకుంటున్నా...’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అమ్మా... వద్దన్నా వినలేదు... ‘అమ్మా ఇప్పుడు వద్దు.. మరోసారి వెళ్లొద్దాం..’ అని కొడుకు హర్షవర్థన్ ఫోన్లో చెప్పినా రజనీ వినలేదని లక్ష్మారెడ్డి చెప్పారు. ‘చుట్టుపక్కలవారికి సుమారు పదిసార్లు వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్లిన అనుభవం ఉండడంతో వారితో కలిసి మేం తొలిసారి వెళ్లాం. పది మంది గ్రూపుగా వెళ్లగా, ఆదిలక్ష్మి అనే మహిళకు తొక్కిసలాటలో గాయాలయ్యాయి. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..’ అని ఆయన తెలిపారు. అమెరికా నుంచి వచ్చి.. అమ్మ వద్ద సొమ్మసిల్లి..అమెరికా నుంచి హుటాహుటిన వచి్చన రజనీ కుమారుడు హర్షవర్థన్ రెడ్డి... తల్లి భౌతికకాయాన్ని చూసి సొమ్మసిల్లిపోయాడు. బంధువులు సపర్యలు చేయడంతో కొద్దిసేపటి తర్వాత తేరున్నాడు. తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ హర్షవర్ధన్ కూర్చున్న తీరు అందరినీ కలచివేసింది. కాగా, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కాంగ్రెస్ నాయకులు దండి ప్రియాంక తదితరులు రజనీ మృతదేహం వద్ద నివాళులర్పించారు. రజనీ తమ్ముడు అమెరికా నుంచి శనివారం విశాఖ వస్తారని, అతను రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. ఊహించుకుంటేనే భయమేస్తోంది» మాకు పీడకలను మిగిల్చింది »మా ప్రాణాలను మేమే కాపాడుకోవాల్సి వచ్చిoది » తొక్కిసలాటలో క్షతగాత్రుల మనోగతంతిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వేచి ఉండగా జరిగిన తొక్కిసలాటను ఊహించుకుంటేనే భయమేస్తోందని క్షతగాత్రులు తెలిపారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులు మాట్లాడుతూ.. తొక్కిసలాట సందర్భంగా భక్తుల అరుపులు, కేకలు, ఆర్తనాదాలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నాయని చెప్పారు. అక్కడ తొక్కిసలాటకు గల కారణం, సహాయక చర్యలు, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై వారు ఏమన్నారంటే.. – తిరుపతి తుడా/తిరుపతి కల్చరల్తొక్కిసలాటకు ఆ తాడే కారణంవైకుంఠ ద్వారదర్శనం కోసం మా ఊరి నుంచి 450మంది ఇంటిల్లిపాది బుధవారం తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలోని కౌంటర్ వద్దకు చేరుకున్నాం. క్యూలైన్లలోనికి భక్తులను వదలకుండా పద్మావతి పార్క్‌లోకి పంపించేశారు. భక్తులతో పార్క్ నిండిపోయింది. రాత్రి 8గంటల సమయంలో టోకెన్లను జారీ చేస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. పార్క్ గేట్లను ఒక్కసారిగా తీయడంతో వేలాది మంది పరుగులు పెడుతూ గేటు వద్దకు దూసుకొచ్చారు. అయితే గేటుకు రెండువైపులా రెండడుగుల ఎత్తులో కట్టి ఉన్న తాడును తొలగించకుండానే గేటును తెరిచారు. దీంతో ముందు వరుసలో ఉన్న మహిళలు తాడుకు తగులుకుని బోర్లా పడిపోయారు. వెనుక నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో అంతమంది ప్రాణాలు కోల్పోయారు. తాడు లేకుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు. – వెంకటేశ్, క్షతగాత్రుడు, రామసముద్రం, అన్నమయ్య జిల్లా మా వాళ్లను మేమే కాపాడుకున్నాం క్యూలైన్లలోకి వెళ్లేందుకు పార్క్ గేటు తెరవడంతో భక్తులు గుంపులుగా పరుగులు పెడుతూ దూసుకొచ్చారు. ముందుగా విశాఖ ప్రాంతానికి చెందిన భక్తులు తాడుకు తగులుకుని కింద పడిపోయారు. ఆ వెనుకే∙ఉన్న మాపైకి వందలాది మంది దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. కిందపడ్డ మా వాళ్లను కాపాడుకునేందుకు 20 నిమిషాలు పట్టింది. సకాలంలో 108 రాకపోవడంతో ఆటోల్లో ఆస్పత్రులకు తీసుకెళ్లాం. – చిన్నరాజు, క్షతగాత్రురాలి భర్త, నరసాపురం, అన్నమయ్య జిల్లానా జీవితంలో అదో పీడకల కళ్ల ముందే భక్తులు కుప్పకూలిపోయారు. ముందు వరుసలో ఉన్న మహిళా భక్తులు కిందపడిపోయారు. వారిపై పదుల సంఖ్యలో భక్తులు పడ్డారు. కిందపడిన వారిలో నేనూ ఒకడిని. నా పై సుమారు 20మంది పడిపోయారు.వారిని పట్టించుకోకుండా వెనక నుంచి వచ్చే వారు తొక్కుకుంటూ వెళ్లిపోవడంతో 50మందికిపైగా గాయాలయ్యాయి. ఆరుగురు చనిపోవడానికి కూడా ఇదే కారణం. స్వయంగా అనుభవించిన ఈఘటన పీడకలగా మిగిలిపోతుంది. – చిన్న అబ్బయ్య, క్షతగాత్రుడు, రామసముద్రం, అన్నమయ్యజిల్లాభక్తులను నమ్మించి దగా చేశారు సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని టీటీడీ యాజమాన్యం నమ్మించి వారిని మోసం చేసింది. టికెట్ ఉన్నవారికే తిరుమలకు ప్రవేశం, స్వామిదర్శనం అంటూ నమ్మపలికారు. ఫలితంగా భక్తులు స్వామి దర్శన భాగ్యం కోసం అధిక సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. ప్రచారానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. – ఎ.మధు, జై హిందూస్థాన్ పార్టీ,రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు.వైకుంఠానికే పంపారు వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిoచాలని కోరిన భక్తులను టీటీడీ వారిని నేరుగా వైకుంఠానికి పంపింది. టీటీడీలో ఏటా వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తున్నా అదే అనుభవంతో ఏర్పాట్లు, పర్యవేక్షణ కొరవడడంతో భక్తులకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే భక్తులు మరణించారు. –ఎం.నీలకంఠ, హిందూ చైతన్య సమితి అధ్యక్షుడు. నేరుగా దేవుని దగ్గరకే పంపిన టీటీడీ శ్రీవారిని చూపాలని కోరిన భక్తులకు టీటీడీ నేరుగా దేవుని దగ్గరకు పంపడం అమానుషం. వైకుంఠ దర్శన టోకన్ల జారీలో భక్తుల పట్ల టీటీడీ, పోలీసులు చులకనగా మాట్లాడడం విడ్డూరం. తొక్కిసలాట సందర్భంగా భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడమేకాక ఎవరు రమ్మన్నారంటూ వ్యాఖ్యానించడం దుర్మార్గం. – తుమ్మ ఓంకార్, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు భక్తులు మృతి చెందారు. భక్తులు తిరుమలకు రావాలంటే భయపడే పరిస్థితిని టీటీడీ యాజమాన్యం తీసుకొచ్చిoది. టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యమే ఇందుకు కారణం. – దిలీప్‌కుమార్, తిరుమల, తిరుపతి సంరక్షణ సంఘం అధ్యక్షుడు -
లాయర్‌గా...
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ లాయర్‌గా తన నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. మరోసారి కోర్టులో అమితాబ్ బచ్చన్ మాట్లాడే పవర్ఫుల్ డైలాగ్స్ వినే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘వేట్టయాన్’ చిత్రంలో లాయర్ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారట. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అది లాయర్ పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. రజనీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపిస్తారని, అమితాబ్ లాయర్‌గా కనిపిస్తారనీ భోగట్టా. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలోని ఓ స్టూడియోలో జరుగుతోందట. రజనీ ఇంట్రో సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. -
జమ్మికుంట తహశీల్దార్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు!
సాక్షి, కరీంనగర్: జమ్మికుంట తహశీల్దార్ రజినీ ఆస్తులను ఏసీబీ ప్రకటించింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.20 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 22 ఓపెన్ ఫ్లాట్స్, 7 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు పేర్కొంది. కిలోలకొద్దీ బంగారం, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బినామీ పేర్లతో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. పెద్ద మొత్తంలో ఆస్తుల కొనేందుకు తహశీల్దార్ రజినీ అడ్వాన్స్ చెల్లించినట్లు తెలిపింది. జమ్మికుంట తహసీల్దార్ రజినీ ఇంట్లో ఇవాళ ఏసీబీ సోదాలు జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేశారు. హన్మకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహశీల్దార్ రజని బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. -
ఐర్లాండ్: వాసవి మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు..
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో త్రిశక్తి స్వరూపిణి, సకల వేద స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘశుద్ధ విదియ రోజు వందమందికి పైగా వాసవి మాత భక్తులు, కమిటీ సభ్యులందరు కలిసి ఉదయాన్నే అనుకున్నట్టుగా కింగ్స్‌వుడ్ ప్రాంతమునందున్న స్థానిక వినాయగర్ ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. మొదటగా పిల్లలు తరువాత మహిళలంతా కలిసి చక్కగా అమ్మవారికి భక్తిశ్రద్దలతో అభిషేక కార్యక్రమాన్ని పూర్తిచేశారు. తరువాత అమ్మవారికి వివిధరకాల పుష్పాలతో అలంకరించిన పిమ్మట లలిత సహస్రనామ పఠనము, మణిదీపవర్ణన, సామూహిక కుంకుమార్చన నిర్వహించగా.. విశాలి రమేష్, శృతి, అనూష చేసిన అమ్మవారి గీతాలాపనలో భక్తులందరూ తన్మయత్వం చెందారు. అటుపిమ్మట అమ్మవారికి మహిళలందరూ వడిబియ్యం సమర్పించి మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అంకిత ఈ కార్యక్రమం మొత్తాన్ని చక్కగా సమన్వయము చేసారు. చిరంజీవి-లక్ష్మి హాసిని వాసవి పురాణం నుండి సేకరించిన ధర్మసూత్రాలను ఆంగ్లంలోకి అనువదించిన వాసవి దివ్యకథను భక్తులందరికీ చదివి వినిపించారు. అమ్మవారి నామస్మరణతో భక్తులందరూ పులకించిపోయారు. సంప్రదాయ వస్త్రధారణలో పిల్లలు పెద్దలు ఆనందంగా వారి ఒకరోజు సమయాన్ని ఇలా అమ్మవారి సేవలో గడపటం చాలాా ఆనందంగా ఉందని కోర్-కమిటీ సభ్యుల్లో ఒకరైన అనీల్ అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన ఆలయ సెక్రటరీ, డైరెక్టర్ బాలకృష్ణన్ దంపతులకు కార్యవర్గ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ముత్తుస్వామిని ఘనంగా సత్కరించారు. బాలకృష్ణన్ మాట్లాడుతూ అమ్మవారి కార్యక్రమాలు వినయాగర్ ఆలయం నందు నిర్వహించడం అందులో భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందమైన విషయమని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనీ అభిలాషించారు. సరసమైన ధరలకే భోజన ప్రసాదాలు అందించిన బిర్యానీవాలా రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్‌కి, దీనికి సహకరించిన ప్రశాంత్‌కి కమిటీ కార్యవర్గ సభ్యులు శివ కుమార్, నవీన్ సంతోష్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. హాజరైన సభ్యులందరు ముక్తకంఠంతో ఐర్లాండ్ నందు ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఎంతో శుభపరిణామమని ఆనందించారు. కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు రేణుక దినేష్, రజిత సంతోష్, నితేశ్ గుప్తాలకు కమిటీ సభ్యులు సత్కరించి కృతఙ్ఞతలు తెలియజేసారు. అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో మాధవి, దివ్య మంజుల, శృతి, మాధురి, రేణుక, అంకిత, మణి, లావణ్య తదితరులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. తదుపరి కార్యక్రమంలో అధ్యక్షులు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. అమ్మవారి జీవిత విశేషాలను ప్రస్తుత సమాజం ఎలా స్వీకరించాలో ఉదాహారణలతో వివరించి సభ్యులందరికి అమ్మవారు చెప్పిన ధర్మ సంబంధమైన విషయాలను లోతుగా వివరించి చెప్పారు, హాజరైన సభ్యులకు భక్తులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. చివరిగా.. అందరూ భోజన ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమం మొత్తం ముందుకు సాగడంలో కీలకంగా కోర్-కమిటీ సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా గంగా ప్రసాద్, లావణ్య, సంతోష్ పారేపల్లి, శ్రీనివాస్, సతీష్, మాణిక్, శ్రవణ్ తదితరులు పాల్గొని విజయవంతంగా ముగించారు. -
తొలి ఉద్యోగం ఆమెకే..ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోనున్న రేవంత్ రెడ్డి
-
మాటిచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సీఎంగా..
తెలంగాణలో తొలి ఉద్యోగం నాకే రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. గాంధీ భవన్ వెళ్లినప్పుడు ఆయన నాకు ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ ఆయన నెరవేరుస్తుండడం హ్యాపీగా ఉంది.. :::రజిని అధికారంలోకి గనుక వస్తే.. అంటూ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సర్కార్ ఏర్పాటు అవుతున్న తరుణంలో వాటిని నెరవేర్చేందుకు సిద్ధమైపోయింది. రేపు డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణం ముఖ్యమంత్రిగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ హామీలు నెరవేర్చడంపైనా ఆయన స్పష్టమైన ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. తొలి ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలనలో తొలి ఉద్యోగం రజినీ అనే యువతికి దక్కనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని అధికార యంత్రాంగాన్ని రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం అని స్వయంగా ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడా గ్యారెంటీని నెరవేర్చేందుకు రెడీ అయిపోయారు. అక్టోబర్ 17వ తేదీన.. నాంపల్లికి చెందిన రజిని అనే ఓ దివ్యాంగురాలు గాంధీభవన్‌కు వెళ్లి రేవంత్‌రెడ్డిని కలిశారు. రజిని రెండేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతోంది. పీజీ చేసిన తనకు ఇటు ప్రభుత్వంలోనూ అటు ప్రైవేటులోనూ ఉద్యోగం రావట్లేదని తన బాధను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెప్పింది. అప్పుడు రేవంత్ రెడ్డి .. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి ఉద్యోగం నీకే ఇస్తాం. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకార సభ ఉంటుంది. ఆ సభకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ వస్తారు. ఆ సభలోనే మొదటి ఉద్యోగం నీకేనమ్మా. ఇది నా గ్యారెంటీ’’ అంటూ రేవంత్ ఆమెకు హామీ ఇచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు మీద స్వయంగా ఆయన రజినీ పేరు రాసి.. కింద సంతకం కూడా చేశారు. As PCC President of Telangana , promised first job to Rajini, a physically challenged girl from Nampally as soon as #Congress comes to power. I filled the Congress guarantee card with Rajini's name. Rajini, who completed post graduation expressed her grief that she is not… pic.twitter.com/JFSha8a56M — Revanth Reddy (@revanth_anumula) October 17, 2023 నెలన్నర తర్వాత.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో తొలి ఉద్యోగం రజినికే దక్కబోతోంది. కానీ, ప్రమాణ స్వీకారమే రెండు రోజులు ముందుగానే జరుగుతోంది. -
రాష్ట్రంలో సామాజిక న్యాయం వెల్లివిరుస్తోంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో సామాజిక న్యాయం వెల్లివిరుస్తోందని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళల సాధికారత సీఎం జగన్ ఘనతేనని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో జరిగిన సభలో మంత్రి రజిని మాట్లాడారు. సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. పేదవారిని ప్రజాప్రతినిధులుగా మారుస్తున్నారని అన్నారు. విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచి్చన ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని చేరువ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని, ఏలూరులోనూ రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. గతంలో వార్డు మెంబరు కావాలంటే పెత్తందారుల వద్ద ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేదని, ఆ స్ధితి నుంచి సీఎం జగన్ బయటకు తీసుకువచ్చి చట్ట సభల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అందలం ఎక్కిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. రాష్ట్రంలో 25 మంది మంత్రులు ఉంటే వారిలో 17 మంది ఈ వర్గాలకు చెందిన వారే ఉన్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలంతా కలిసి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగనన్నకు విజయం చేకూర్చాలని కోరారు. సీఎం జగన్ బయటకు రాకపోయినా ఆయన కటౌట్‌ను చూసి 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు జనం తరలివస్తున్నారని చెప్పారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ గతంలో సామాజిక న్యాయం కోసం అనేక మంది ఉద్యమాలు చేశారని, వారి ఆశయాలను ఇప్పుడు సీఎం జగన్ నెరవేర్చారని చెప్పారు. దళిత కులంలో పుట్టాలనుకుంటారా.. అనే మాటలు గతంలో ఓ సీఎం నుంచి విన్నామని, కానీ ప్రస్తుతం వెనుకబడిన వర్గాలకు, దళితులకు, మైనార్టీలను అందలం ఎక్కిస్తున్న సీఎంను చూస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ వల్ల దళిత, బలహీన వర్గాలకు ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ వంటి చదువులు అందుతున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని పేకాటరాయుడు, అవినీతిపరుడు, దళిత ద్రోహి అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సాధికారత సీఎం జగన్‌తోనే సాధ్యమైందన్నారు. 2014లో చంద్రబాబు ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో కేవలం ఆయనకు చెందిన వారికి మాత్రమే పనులు చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం కులం, మతం, పార్టీ చూడటంలేదని, వైఎస్సార్సీపీకి ఓటు వేసినవారికి, వేయనివారికి కూడా న్యాయం చేస్తున్నారని, కలెక్టర్ల సమావేశంలో కూడా ఇవే ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. జగన్ పాదయాత్రలో చెప్పిన పనులు, చెప్పని పనులు కూడా చేశారన్నారు. నాలుగున్నరేళ్లలో దెందులూరులో రూ.2,800 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. నిన్న హైదరాబాద్‌లో ఒక సామాజికవర్గ సమావేశం జరిగిందని, దానిలో ఎస్సీ, బీసీలు ఎవరూ పాల్గొనలేదని చెప్పారు. గతంలో పేదలపై పెత్తనం జరిగేదని, ఇప్పుడు అదే పేదలకు పదవులు వస్తున్నాయని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ వల్ల పేద వర్గాలు చట్టసభల్లో అడుగుపెడుతున్నాయని, ఇందుకు తానే ఉదాహరణ అని చెప్పారు. అక్రమ కేసులతో దళితులను జైళ్లలో పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. దళితులు, బీసీలు, మైనార్టీలు జైళ్ళలో కాదు చట్టసభల్లో ఉండాలని భావించిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలో 11 వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చామని, దెందులూరు గడ్డ వైఎస్సార్ సీపీ అడ్డాగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కవురు శ్రీనివాస్, జయమంగళ వెంకట రమణ, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, మేకా వెంకట ప్రతాప అప్పారావు, దూలం నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, ఎలీజా, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ విగ్రహం చూస్తుంటే అందరికీ ఒక విషయం అర్థం అవుతుంది. సీఎం వైఎస్ జగన్ బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి పరుస్తూ సామాజిక సాధికారత సాధిస్తున్నారు. అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలను నిజం చేస్తున్నారు. అందుకే.. తన ఆలోచనలు, ఆశయాలు కలిగిన వ్యక్తి తాడేపల్లిలో ఉన్నారని అంబేడ్కర్ వేలు ఆ వైపు చూపిస్తున్నారు. – నందిగం సురేష్, ఎంపీ -
జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ రక్ష
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్ర ప్రజలందరికీ రక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. దీనిని బట్టి తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత బలోపేతం చేసిందో, ఏ స్థాయిలో వైద్య సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా ఇప్పటివరకు 2.30 కోట్ల ఓపీలు నమోదయ్యాయని చెప్పారు. ఇది ఒక చరిత్రగా అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.8,500 కోట్ల ఖర్చుతో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తోందని, వీటిలో ఐదింటిని సీఎం జగన్ శుక్రవారం పారంభించారని గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో మిగిలిన 12 కళాశాలలను కూడా పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు. సంక్షేమ రాడార్ నుంచి తప్పించుకోకుండా.. జగనన్న సంక్షేమ రాడార్ నుంచి ఎవరూ తప్పించుకోకూడదనే లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపుదిద్దుకుందని మంత్రి రజని చెప్పారు. మొదటి దశలో వలంటీర్ల ఇంటింట సర్వే ఈ నెల 15న ప్రారంభమైందని, స్థానిక ప్రజా ప్రతినిధులు, వలంటీర్లు, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు తొలి దశలో గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సీహెచ్‌వో లేదా ఏఎన్ఎం ఆ ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయాన్ని వలంటీర్లు సమాచారం ఇస్తారన్నారు. రెండో దశలో సీహెచ్‌వో, ఏఎన్ఎంలు ప్రజల ఇళ్లకే వెళ్లి అందించే సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయన్నారు. ప్రజల అంగీకారం మేరకు బీపీ, మధుమేహం, హిమోగ్లోబిన్ వంటి ఏడు రకాల పరీక్షలను ఇంటివద్దే చేస్తారన్నారు. మూడో దశలో వలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సేవాభావం గల వ్యక్తుల బృందాలు మరోసారి ఇంటింటికీ వెళ్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించే తేదీ, అందించే సేవలను వివరిస్తారన్నారు. నాలుగో దశలో ఈ నెల 30న వైద్య శిబిరాలు మొదలుపెట్టి.. 45 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్టు మంత్రి రజిని వివరించారు. శిబిరాల్లో రోగులను పరీక్షించి, అవసరమైన వారికి మందులు ఇస్తారని, చికిత్స అవసరమైతే వారిని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో, తహసీల్దార్, పీహెచ్‌సీల వైద్యాధికారులు.. పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు, మునిసిపల్ ఆరోగ్య అధికారులు, యూపీహెచ్సీల వైద్యాధికారులు వైద్య శిబిరాల బాధ్యత తీసుకుంటారన్నారు. ఐదో దశలో ఆ గ్రామానికి చెందిన ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వో, ఏఎన్ఎంలు రిఫరల్ కేసులకు సంబంధించిన రోగులకు ఫాలోఅప్ వైద్యం అందిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందిందా లేదా.. రోగం పూర్తిగా అదుపులోకి వచ్చిందా లేదా పరిశీలిస్తారని వివరించారు. నిఫా వైరస్‌పై అప్రమత్తం నిఫా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి రజని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. నకిలీ మందుల విషయంలో కఠినంగా ఉన్నామని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీజీ సీట్ల విషయంలో నకిలీ ఎల్వోపీలపై విచారణ కొనసాగుతోందని, ఇది పూర్తిగా ఎన్ఎంసీ పరిధిలోని అంశం అవడంతో వారి ద్వారా విచారణ కోరినట్టు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కార్యదర్శి మంజుల, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
డెంగీ జ్వరమే కదా.. అని తేలికగా తీసుకున్నారో.. ఇక అంతే!!
మహబూబాబాద్: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని(35) విషజ్వరంతో బుధవారం రాత్రి చనిపోయింది. రజని వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానిక ఆర్ఎంపీల వద్ద నాలుగు రోజులు వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. దీంతో ఏటూరునాగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ పరీక్షలు చేసి టైఫాయిడ్‌గా తేల్చారు. మెరుగైన వైద్యం నిమిత్తం ములుగు వెళ్లాలని సూచించడంతో ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లారు. రజిని చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళ.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో ఉంటున్న మనీష(30) రాఖీ పండుగ సందర్భంగా వాజేడు మండల పరిధిలోని మొరుమూరు కాలనీ గ్రామానికి వచ్చింది. ఆమె ఇక్కడికి జ్వరంతోనే వచ్చింది. స్థానికంగా వైద్యం చేయించుకున్నా తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ తీసుకెళ్లినట్లు సమాచారం. ఆరు నెలల పాప.. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎస్కే.గౌస్– సహర దంపతుల కుమార్తె మినహ(6నెలలు) డెంగీ జ్వరంతో బాధపడుతూ వారంరోజుల నుంచి ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలించగా గురువారం చనిపోయినట్లు తండ్రి గౌస్ తెలిపారు. -
15న ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.8,500 కోట్లతో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తలపెట్టారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. తొలి విడతలో నిర్మాణం పూర్తయిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి సీఎం జగన్ వస్తారని, ఇక్కడి నుంచే రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని వివరించారు. వచ్చే సంవత్సరం మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత సంవత్సరానికి మిగతా ఏడు కాలేజీలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం పర్యటనకు ఏర్పాట్లను ఆమె శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి రజిని తెలిపారు. -
సాయిచంద్ కుటుంబానికి రూ.కోటిన్నర ఆర్థికసాయం
బడంగ్పేట్/అమరచింత: ప్రజా గాయకుడు, దివంగత నేత సాయిచంద్ కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడలో నివాసం ఉంటున్న సాయిచంద్ సతీమణి రజినీకి సోమవారం ప్రభుత్వం తరఫున రూ.కోటి చెక్కును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి అందజేశారు. అనంతరం రజినీతో పాటు చిన్నారులను ఓదార్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, జెడ్పీ చైర్‌పర్మన్ తీగల అనిత తదితరులు పాల్గొన్నారు. రజనికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి సబితారెడ్డి, దాసోజు సాయిచంద్ తండ్రి, చెల్లెలికి చెక్కుల అందజేత అణగారిన వర్గాల బాధలను, ఆంధ్ర పాలకుల నైజాన్ని ఎండగట్టిన మహాగాయకుడు సాయిచంద్ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సాయిచంద్ తండ్రి వెంకట్రాములు, చెల్లెలు ఉజ్వలకు చెరో రూ.25 లక్షల చొప్పున చెక్కులను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
విజన్–2047 పేరిట చంద్రబాబు కొత్త మోసం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విజన్–2047 పేరుతో చంద్రబాబు మరో కొత్త మోసానికి తెర తీశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ధ్వజమెత్తారు. విశాఖ కేజీహెచ్‌లో సుమారు రూ.60 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి సోమవారం మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు తానే ఒక దార్శనికుడిగా ప్రకటించుకుంటున్నారని, ఆయన స్వయం ప్రకటిత దార్శనికుడు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న మంచి చంద్రబాబుకు కనిపించదు, వినిపించదని దుయ్యబట్టారు. చంద్రబాబు సూచనల మేరకే పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. రుషికొండపై గతంలో ఎంత విస్తీర్ణంలో భవనాలు ఉన్నాయో.. అదే విస్తీర్ణంలో ఇప్పుడు భవనాలు నిర్మిస్తున్నారని స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తూనే భవనాల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కట్టడంలో తప్పు ఏముంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్య రంగంలో సరికొత్త విప్లవం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన నాటినుంచి ఆంధ్రప్రదేశ్ వైద్య విభాగం స్వరూపం పూర్తిగా మారిపోయిందని మంత్రి రజిని తెలిపారు. ఏకంగా రూ.3,820 కోట్లతో రాష్ట్రంలోని 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, టీచింగ్ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సుమారు రూ.8,500 కోట్లతో రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు గ్రామస్థాయి నుంచి అందాలనే లక్ష్యంతో ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో అన్ని స్థాయిల్లో ఆస్పత్రులను జగనన్న అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. ఉత్తరాంధ్రకు వెన్నెముక లాంటి కేజీహెచ్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఏకంగా రూ.79 కోట్లతో ఆస్పత్రి అవసరాలకు పరికరాలు కొనుగోలు చేశామని చెప్పారు. రూ.500 కోట్లతో నాడు–నేడు కింద కేజీహెచ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.12 కోట్లతో ఎమ్మార్ స్కానింగ్‌ను సమకూర్చామని చెప్పారు. రూ.46 కోట్లతో క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కలెక్టర్ మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
ఏ పార్టీ కూడా వైఎస్సార్సీపీ దరిదాపులకు రాలేదు
సాక్షి, విశాఖపట్నం : పవన్‌కళ్యాణ్ ఎందుకు యాత్ర చేస్తున్నారో ఆయనకే తెలియదని, అందుకే ప్రజలు కూడా పవన్‌ను పట్టించుకోవడం మానేశారని టీటీడీ చైర్మన్, ఉమ్మడి విశాఖ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన భీమిలి, విశాఖ పశ్చిమ, పెందుర్తి నియోజకవర్గాల అభివృద్ధి సమీక్షలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినితో కలిసి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో 9వ తేదీన వారాహి యాత్ర అని వస్తున్న వార్తలపై సుబ్బారెడ్డి మీడియాతో స్పందిస్తూ.. ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా ఒరిగేదేమీ లేదని, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వైఎస్సార్సీపీ దరిదాపులకు వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏడాది కాలంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు, ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన, నిర్మాణ పనుల గురించి టీడీపీ నేతలకు నోరెందుకు పెగలడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు మాదిరిగా శిలా ఫలకాల స్థాయిలో ఏ పనీ ఆగదని, అనుకున్న సమయానికి ప్రతి పనీ పూర్తిచేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ సంకల్పమన్నారు. ఇటీవల వలంటీర్ ఒక వృద్ధురాల్ని హత్య చేశారంటూ బురద జల్లే కార్యక్రమాన్ని టీడీపీ ప్రారంభించిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేస్తే.. నిందితుడిని వలంటీర్ విధుల నుంచి ఎప్పుడో తొలగించేశారని తెలిసి మిన్నకుండిపోయారని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు రావడమే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చంద్రబాబు జోక్‌లు వేస్తున్నారు : మంత్రి రజిని ఊరూరా తిరుగుతూ వైనాట్ పులివెందుల అంటూ చంద్రబాబు వేస్తున్న పెద్ద జోక్‌లకు ప్రజలు పగలబడి నవ్వుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల తర్వాత చంద్రబాబు అండ్ కో అడ్రస్ గల్లంతవుతుందన్న విషయం ఏపీ ప్రజలందరికీ తెలుసన్నారు. ఆ విషయం తెలిసే.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంటే.. తమ హయాంలో ఏమీ చేయలేకపోయామన్న దుగ్ధతో టీడీపీ నేతలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌కు మించి సౌకర్యాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా లేని అత్యాధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు విభాగంలో రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిన నవజాత శిశు వైద్య విభాగాలు ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లను గురువారం మంత్రి ప్రారంభించారు. ప్రసూతి విభాగంలో ఇప్పటికే 250 పడకలు అందుబాటులో ఉండగా.. అదనంగా 40 పడకలను నవజాత శిశు వైద్యం కోసం అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు. తక్కువ బరువు, కామెర్లు వంటి అనారోగ్య కారణాలతో అప్పుడే పుట్టిన శిశువులకు అత్యవసర విభాగ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 ఎస్ఎన్సీయూలు, ఎన్ఐసీయూలు అందుబాటులో ఉన్నాయని, వాటికి అదనంగా రూ.31.51 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక్కడి ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణ పనులను సైతం త్వరలో ప్రారంభిస్తామని రజిని తెలిపారు. కాగా, రాజీవ్‌నగర్‌లోని ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాశ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సాయిచంద్ భార్య రజినీకి కీలక బాధ్యతలు.. నేడు స్వీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నూతన చైర్మన్‌గా రజనీ సాయిచంద్ గురువారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. సంస్థ చైర్మన్ వి.సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించడం తెలిసిందే. అయితే, సాయిచంద్ స్థానంలో ఆయన సతీమణి రజనిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న రజని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరవుతారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం చెందిన విషయం తెలిసిందే. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని, మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని కేసీఆర్ అన్నారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని.. కళాకారున్ని కోల్పోయింది. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇది కూడా చదవండి: సాయిచంద్ మృతిపై కేసీఆర్ ఆవేదన, హరీష్ రావు కంటతడి.. ఆ పేరు శాశ్వతమన్న కేటీఆర్ -
తెలుగులో ఫస్ట్ మూవీ.. పది పేజీల డైలాగ్: సీనియర్ నటి
రజని అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు గుర్తుకు రాకపోవచ్చు. కానీ అప్పటి తెలుగు సినిమా అభిమానులకు ఆమె సుపరిచితురాలు. ఆ కాలంలో ఆమె అందాల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరిగా నిలిచింది. దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఆగ్ర హీరోల సినిమాల్లోనూ కనిపించింది. ఎలాంటి సినీ నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 1985లో ‘బ్రహ్మముడి’ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు రజనీ. తొలి సినిమాతో మంచి గుర్తింపు రావడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. సీతారామ కల్యాణం, రెండు రెళ్ల ఆరు, అహ నా పెళ్లంట చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మజ్నులో నాగార్జున , సీతరాముల కల్యాణంలో బాలకృష్ణ సరసన నటించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తెలుగు సినిమాల్లో ఎంట్రీపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రజిని మాట్లాడుతూ..' దాసరి నారాయణరావు నుంచి ఫోన్ వచ్చింది. మా అన్నయ్య దాసరి వద్దకు వెళ్లారు. ఈ సినిమాలో మీ చెల్లెలు హీరోయిన్ అని చెప్పారు. నాన్నను అడిగితే నీకు ఇష్టమైతే చేయి అన్నారు. నీ లైఫ్ నీ ఇష్టం అన్నారు. అప్పట్లో డీడీలో తెలుగు నెలకొకసారి వచ్చేది. నాకేమో తెలుగు రాదు. ఫస్ట్ డేనే కాలేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో సీన్. ఈ డైలాగ్స్ అన్నీ మీవే అని ఒకాయన ఓ పది పేజీల నా చేతిలో పెట్టారు. అప్పుడే నాకు చాలా భయమేసింది. ఇక డైరెక్టర్ వస్తే బయటకు పో అనడం ఖాయమని ఫిక్స్ అయిపోయా. ఆయన చెప్పిన వెంటనే వెళ్లిపోదామనుకున్నా. నాకు తెలుగులో నమస్కారం తప్ప ఏమీ రాదు. కాసేపటికే దాసరి నారాయణరావు వచ్చారు. ఆ డైలాగ్ చెప్పడం రాదు సార్ అన్నా. వెంటనే డైలాగ్ పేపర్ ఇచ్చిన ఆయన్ను పిలిచి బయటకు పంపారు. ఆ డైలాగ్ పేపర్ తీసుకుని అవీ చదవడం నాకే కష్టంగా ఉంది నీకెలా వస్తాయన్నారు. ఆ క్షణం నాకు దేవుడిలా కనిపించారు. అప్పుడే ఆయనను గురువుగా భావించా. అంతవరకు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న నేను కాస్త కూల్ అయ్యా. 1234 వచ్చా అన్నారు. ఏ భాషలోనైనా చెప్పు.. ఏమీ రాకపోతే 1234 చెప్పు చాలు అన్నారు. నా ఫస్ట్ మూవీలో నంబర్స్తోనే నేను డైలాగ్స్ చెప్పా. బ్రహ్మముడి సినిమాతో నా కెరీర్లో తెలుగులో ప్రారంభమైంది. నేను తెలుగులో మాట్లాడాతుంటే నవ్వడం స్టార్ట్ చేస్తారు. ' అంటూ చెప్పుకొచ్చింది అలనాటి అందాల నటి రజినీ. -
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన పీవీ సింధు, రజనీ
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన పీవీ సింధు, రజనీ, సాయిరాజ్‌లు శుక్రవారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ సింధు, రజనీ, సాయిరాజ్‌లను ఘనంగా సన్మానించారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన మహిళగా రికార్డు సాధించింది. ఇక భారత మహిళల హాకీ జట్టులో రజనీ గోల్ కీపర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 41 ఏళ్ల తర్వాత సెమీస్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. -
‘ఇంకా బతికే ఉన్నావా.. ఈ వయసులో ఇదేం బుద్ధి’
తిరువనంతపురం: మలయాళ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రజిని చాందీను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ వయసులో మీకు ఇలాంటి పనులు అవసరమా అంటూ విద్వేషపూరిత కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఆమె తీయించుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఇందుకు కారణం. కాగా 2016లో ‘ఒరు ముతస్సి గాథ’తో రజిని వెండితెరపై రంగప్రవేశం చేశారు. ఆరు పదుల వయసు పైబడిన ఆమె.. ఈ సినిమాలో కీలకమైన బామ్మ పాత్రలో మెప్పించారు. ఈ క్రమంలో మలయాళ బిగ్‌బాస్ సీజన్ 2లో కూడా పాల్గొన్నారు. అయితే గత కొంతకాలంగా బిగ్‌స్క్రీన్‌కు దూరమైన రజినీ, ఫొటోగ్రాఫర్ అథిరా జాయ్ ప్రోత్సాహంతో పాశ్చాత్య వస్త్రధారణలో ఫొటోషూట్ నిర్వహించుకున్నారు. (చదవండి: ‘ఏంటా ఫొటో.. అసలేం చెప్పదలచుకున్నారు’) ఇక ఎక్కువగా సంప్రదాయ చీరకట్టులో కనిపించే ఆమె.. డెనిమ్స్, ఫ్లోరల్ మాక్సీలు ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇందుకు కొంతమంది సానుకూలంగా స్పందించి.. ‘‘మీ ఆలోచనా విధానానికి హాట్సాఫ్. మీపై మీకున్న విశ్వాసం అమోఘం’’ అంటూ ప్రశంసలు కురిపించారు. మరికొంత మంది మాత్రం.. ‘‘నువ్వు ఇంకా చచ్చిపోలేదా? ఈ వయసులో ఇదేం బుద్ధి’’ అంటూ విషంకక్కారు. ఇక ఈ నెగటివ్ కామెంట్లపై స్పందించిన రజినీ చాందీ ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను ఆకతాయిగా అభివర్ణించారు. ఇంకా బతికే ఉన్నావా అని అడిగారు. ఇంట్లో కూర్చుని దేవుడికి ప్రార్థన చేసుకోవాలని సూచించారు. భగవంతుణ్ని తలచుకుని కాలం గడపాల్సిన వయసులో ఇలా స్కిన్ షో ఎందుకు అని ప్రశ్నించారు. ఇలాంటి వారిలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. నాకు తెలిసి 40-50 ఏళ్ల వయస్సున వాళ్లు నన్ను చూసి అసూయ పడుతున్నారేమో. ముసలావిడ అందంగా కనిపిస్తే బహుశా వాళ్లకు నచ్చడం లేదేమో. నాకు త్వరలో 70 ఏళ్లు నిండుతాయి. నాకు నచ్చిన పనిచేయడంలోనే సంతృప్తి దొరుకుతుంది. యవ్వనంలో ఉన్నపుడు కుటుంబ బాధ్యతలు, పిల్లల బాగోగులు చూసుకోవడంలోనే చాలా మందికి కాలం గడిచిపోతుంది. అలాంటి వారికి ఇలాంటి వ్యాపకాలు స్ఫూర్తిగా నిలుస్తాయనే అనుకుంటున్నా’’ అని ట్రోల్స్‌కు గట్టి సమాధానమిచ్చారు. -
‘అడ్డుగోడ’కు అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని యెనుమలవారిపల్లి గ్రామం... యెర్రవారిపాలెం మండల పరిధిలోని ఈ గ్రామంలో ఉండేది 30 కుటుంబాలే. అలాంటి చోటు నుంచి వచ్చిన ఒక అమ్మాయి జాతీయ క్రీడలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ప్రాంతీయ అసమానతలు, ముఖ్యంగా ఉత్తరాది ఆధిపత్యం చాలా ఎక్కువగా కనిపించే హాకీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఆట ఒక్కటే సరిపోదు. అంకితభావం, పట్టుదల, పోరాటపటిమ, దృఢసంకల్పం కావాలి. ఇవన్నీ కలబోసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇటిమరపు రజని దశాబ్దకాలంగా గోల్‌కీపర్‌గా భారత జట్టులో కొనసాగుతోంది. ఇప్పటికే ఒకసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న రజని ... మరో ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతోంది. వేగంగా దూసుకుపోయి... సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన రజని పాఠశాలస్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో హాకీ స్టిక్ చేతబట్టింది. ఆ తర్వాత విశేషంగా రాణిస్తూ పోయింది. గోల్‌కీపర్‌గా తొలి అవకాశం లభించగా... అదే పొజిషన్లో తన ఆటను మెరుగుపర్చుకుంటూ సత్తా చాటింది. ఫలితంగా అండర్–14 రాష్ట్ర స్థాయిలో మొదలైన ప్రయాణం భారత సీనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించే వరకు సాగింది. జోనల్ ప్రదర్శన తర్వాత తొలిసారి 2009లో రజని భారత జట్టులోకి ఎంపికై ంది. అదే ఏడాది న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి భారత టీమ్ జెర్సీలో గోల్‌పోస్ట్ ముందు రక్షణగా, సగర్వంగా నిలబడింది. ఇది ఆమె కెరీర్లో మధుర క్షణంగా నిలిచింది. మరో ఒలింపిక్స్ కోసం... ఇటీవలే 30 ఏళ్లు పూర్తి చేసుకున్న రజని తన అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున 91 మ్యాచ్‌లు ఆడింది. పలు చిరస్మరణీయ విజయాల్లో ఆమె భాగంగా నిలిచింది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 ఆసియా క్రీడల్లో రజతం సాధించిన జట్లలో ఆమె సభ్యురాలు. భారత జట్టు తొలిసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు, ఏడాది ముందుగా 2015లో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడు కూడా గోల్‌కీపర్‌గా రజని కీలకపాత్ర పోషించింది. రియోలో జరిగిన 2016 ఒలింపిక్స్‌లో రజని భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి ఆడిన మన భారత మహిళల జట్టులో తానూ ఉండటం ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకమని ఆమె చెబుతుంది. ఇప్పుడు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత జట్టులోనూ ఆమె కూడా ఉంది. దాని సన్నాహాలు కొనసాగుతుండగానే కరోనా కారణంగా అంతా మారిపోయింది. వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్‌లో భారత్ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని, తాను కూడా చక్కటి ప్రదర్శన కనబర్చాలని రజని కోరుకుంటోంది. శిక్షణకు బ్రేక్... ‘ఫిబ్రవరి 16న బెంగళూరు ‘సాయ్’ సెంటర్లో భారత జట్టుకు ఒలింపిక్స్ శిబిరం ప్రారంభమైంది. నెల రోజులకు పైగా అంతా బాగానే సాగింది. కోచ్ జోయెర్డ్ మరీన్ కొత్త పద్ధతుల్లో చక్కటి శిక్షణ అందిస్తూ వచ్చారు. ఆ తర్వాత కరోనా కారణంగా క్రీడా కార్యకలాపాలను నిలిపివేశారు. దాంతో సుమారు రెండు నెలల కేవలం ఫిట్నెస్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్‌కే ప్లేయర్లు పరిమితమయ్యారు. సడలింపుల తర్వాత ఆటగాళ్ళంతా ఇంటిపై బెంగ పెట్టుకోవడంతో హాకీ ఇండియా శిక్షణకు విరామం ఇచ్చింది. నెల రోజుల పాటు కుటుంబసభ్యులతో గడిపేందుకు అవకాశం ఇచ్చారు. క్రీడాకారిణులు కొత్త ఉత్సాహంతో తిరిగి రావాలని ఫెడరేషన్ కోరుకుంటోంది. అంతా తిరిగొచ్చాక మళ్లీ శిక్షణ మొదలవుతుంది. షెడ్యూల్ ప్రకారం మరో నాలుగు నెలల పాటు ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలు లేవు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఉన్నా... ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేది సందేహమే. అదొక్కటి చాలు... పదకొండేళ్లుగా భారత్‌కు ఆడుతున్నా నాకు ఇప్పటి వరకు ప్రభుత్వంలోగానీ, ప్రభుత్వరంగ సంస్థలో గానీ ఉద్యోగం లభించలేదు. ఏ క్రీడాంశంలోనైనా ఇన్ని సంవత్సరాలు జాతీయ జట్టుకు ఆడిన వారికి ఏదో ఒక ఉద్యోగం లభించడం సహజం. కానీ దురదృష్టవశాత్తూ నాకు అలాంటి అవకాశం దక్కలేదు. నా జట్టులోని సహచరులు అందరికీ వారి వారి రాష్ట్రాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్‌గా తగిన గుర్తింపు, హోదా ఉన్నాయి. నేను మాత్రం ఇంకా ఇబ్బంది పడుతున్నాను. ఎన్నో అడ్డంకులను అధిగమించి భారత హాకీకి ప్రాతినిధ్యం వహించా. ఇప్పటికైనా నేను స్థిరపడేందుకు తగిన ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నా. –ఇటిమరపు రజని, భారత హాకీ గోల్‌కీపర్ -
దిశ చట్టాన్ని తీసుకొచ్చిన జగనన్నకు కృతఙ్ఞతలు
-
చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు
-
జాతీయ శిబిరంలో రజని, సౌందర్య
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల ప్రపంచ కప్‌నకు ముందు హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రత్యేక జాతీయ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ నెల 28 నుంచి జూన్ 9 వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించే ఈ శిబిరం కోసం హాకీ ఇండియా 48 మంది సీనియర్ క్రీడాకారిణుల పేర్లను శనివారం ఎంపిక చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ ఎతిమరపు రజని, తెలంగాణ ఫార్వర్డ్ ప్లేయర్ యెండల సౌందర్య కూడా ఉన్నారు. ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత మహిళల హాకీ జట్టు తిరిగి సోమవారం నుంచి శిబిరంలో పాల్గొననుంది. చీఫ్ కోచ్ జోయర్డ్ మరీనే నేతృత్వంలో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ‘ఫిట్నెస్ ప్రమాణాలు పెంచుకునేందుకు ఈ క్యాంప్‌ను వినియోగించుకుంటాం. దీంతో పాటు మానసికంగా ఇంకా ధృడంగా మారేందుకు కృషిచేస్తాం’ అని కోచ్ తెలిపారు. -
తల్లి పదే..కొడుకు పదే..
పంజాబ్: అయినా ఇదేమి చోద్యమమ్మా.. పిల్లల్ని చదివించాల్సిన ఈ లేటు వయసులో ఈ చదువులేమిటో అని నలుగురూ నానా రకాలుగా అవహేళన చేసినా ఆ మహిళ పట్టించుకోలేదు. చదువుకోవాలనే దృఢ సంకల్పంతో పదో తరగతి చదువుతున్న కొడుకుతో కలిసి ఆమె కూడా స్కూలుకు వెళ్లి పాఠాలు నేర్చుకుంటోంది. పంజాబ్‌లోని లుధియానా వాసి అయిన 44 ఏళ్ల రజనీ బాల సంగతి ఇది. ముగ్గురు పిల్లల తల్లి అయిన రజనీ బాల...చదువు మీద మక్కువతో 29 ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకాలు చేతపట్టింది. తల్లీకొడుకులు పదో తరగతి చదువుతున్నారు. ‘నా భర్త చాలాసార్లు పదో తరగతి చదవమని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల చదవలేక పోయాను. కానీ ఇప్పుడు మా పిల్లలు కూడా చదువుకోమని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్న నాకు కనీసం పదో తరగతి విద్యార్హత ఉంటే బాంగుండనిపించింది. దీంతో మా అబ్బాయితో కలిసి స్కూల్లో చేరాను. మా అత్తమ్మ, మా భర్త నాకు చాలా సహకరిస్తున్నారు. రోజు ఉదయాన్నే నన్ను, మా పిల్లల్ని నిద్రలేపి చదివిస్తారు. నా కూతుళ్లు కూడా సహాయం చేస్తారు. ఈ రోజుల్లో కనీసం పదో తరగతి అయినా చదివి ఉండాలి’ అని ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీ బాల తెలిపారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆమె భర్త రాజ్ కుమార్ సతి కూడా 17 ఏళ్ల విరామం తర్వాత డిగ్రీ పట్టభద్రుడయ్యారు. రజనీ బాలను కూడా డిగ్రీ చదివిస్తానని రాజ్ కుమార్ చెబుతున్నారు. ఓవైపు తన కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకుంటూ, మరో వైపు చదువుకోవాలనే పట్టుదలతో పాఠశాలకు వస్తున్న రజనీ బాలను ఆ పాఠశాల ఉపాధ్యాయులు మెచ్చుకుంటున్నారు. ఏదిఏమైనా చదువు నేర్చుకోవడాని వయస్సు అడ్డురాదని మరో సారి నిరూపించింది రజనీ బాల కుటుంబం. -
మహాబలిపురంలో మస్తీ!
ఎక్కడో పుట్టారు! ఎక్కడో పెరిగారు! కలిసింది మాత్రం ఇక్కడే... కళామతల్లి ఒడిలో, వెండితెర వెలుగుల్లో! అప్పట్నుంచి స్నేహంగా మెలుగుతూ మరింత ఎత్తుకు ఎదిగారు... ప్రేక్షకుల్లో ప్రేమాభిమానాల్ని సొంతం చేసుకుని పెరిగి పెద్దయ్యారు. అయినా సరే... ఏడాదికొకసారి కలవడం మాత్రం మరువలేదు. 1980లలో సౌత్ స్టార్లు అందరూ కలిసి ‘ఎయిటీస్ సౌత్ యాక్టర్స్’ పేరుతో ఓ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. రజనీకాంత్, మోహన్‌లాల్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, భాగ్యరాజ, అర్జున్, జాకీ ష్రాఫ్, సీనియర్ నరేశ్, సత్యరాజ్, సుమన్, ప్రభు, రమేశ్ అరవింద్, భానుచందర్, సురేశ్ తదితర హీరోలతో పాటు రేవతి, రమ్యకృష్ణ, రాధిక, సుహాసిని, నదియా, రాధ, మేనక తదితర హీరోయిన్లు ఈ ఎయిటీస్ క్లబ్లో సభ్యులు. ఎనిమిదేళ్లుగా వీళ్లందరూ ‘ఎయిటీస్ సౌత్ యాక్టర్స్–రీయూనియన్’ పేరుతో ఏదొక చోట కలుస్తుంటారు. ఈ ఏడాది మహాబలిపురంలో కలిశారు. ఈ నెల 17, 18వ తేదీల్లో గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. ఈ పార్టీల స్పెషాలిటీ ఏంటంటే... ప్రతి ఏడాది ఏదొక థీమ్ ప్రకారం చేసుకుంటారు. అందరూ ఒకే రంగు దుస్తులు ధరిస్తారు. ఈసారి ఊదా రంగు థీమ్‌తో డ్రస్సులు ప్లాన్ చేసుకున్నారు. ఐ–ఫీస్ట్ కదూ! ఈ తారలు గత 17వ తేదీన ఊదా రంగు దుస్తుల్లో మహాబలిపురంలో మీట్ అయ్యారు. తాము బస చేసిన హోటల్‌ను ఊదా రంగుతో అలంకరించారు. అలనాటి నటీమణులు సుహాసినీ, లిసీ, పూర్ణిమా భాగ్యరాజ్, ఖుష్బూ, నటుడు రాజ్‌కుమార్ సేతుపతిలు గెట్ టుగెదర్కి వచ్చిన వారికి ఆహ్వానం పలికారు. అందరూ ఆనందంగా అలనాటి జ్ఞాపకాలను పంచుకుని, ఫొటోలు దిగారు. తర్వాత పాటల పోటీ నిర్వహించారు. 1960 – 70 కాలంలో విడుదలైన ప్రముఖ హిందీ పాటలను నటీనటులు రేవతి, ఖుష్బూ, సురేశ్, రమ్య, సుమలత, నరేష్, రాధిక, శరత్‌కుమార్ ఆలపించారు. విజేతలు రేవతి, ఖుష్బూలకు బహుమతులు అందించారు. ర్యాంప్ వాక్: మొదటి రోజు పురుషులు, మహిళలకు ర్యాంప్ వాక్ పోటీ నిర్వహించారు. చిరంజీవి అధ్యక్షత జరిగిన ఈ షోలో పురుషుల బృందం గెలుపొందింది. రెండో రోజు ఆధ్యాత్మిక అంశాలపై చర్చా వేదికలు నిర్వహించారు. -
పుట్టినరోజున రజినీ పొలిటికల్ ఎంట్రీ?
-
రజనీకి పోటీగానా... నో చాన్స్!
చాన్సే లేదు... రజనీకాంత్ ‘2.0’కి పోటీగా అక్షయ్‌కుమార్ ‘ప్యాడ్మాన్’ వచ్చే చాన్సే లేదు. ఎందుకంటే... ‘నా సినిమాతో నేనెందుకు పోటీ పడతా?’ అనడుగుతున్నారు అక్షయ్! ‘2.0’ను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేస్తామని చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్ మ్యాన్’ను జనవరి 26న (అంటే ‘2.0’ విడుదల తర్వాతి రోజున) విడుదల చేస్తామని ఆ యూనిట్ ప్రకటించింది. ‘2.0’లో ఈ హిందీ హీరో యాంటీ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అదేంటి? విలన్‌గా నటించిన సిన్మాకి పోటీగా హీరోగా నటించిన సిన్మాను అక్షయ్ ఎలా విడుదల చేస్తానంటున్నారు? రెండు సినిమాల మధ్య క్లాష్ తప్పదా? అని అనుకున్నారంతా! ఇదే విషయాన్ని అక్షయ్ ముందుంచితే... ‘‘నా సినిమాకి పోటీగా నేను నటించిన మరో సినిమా రిలీజ్‌ను ఎందుకు ప్లాన్ చేస్తా? నాకు తెలిసి... ఇప్పటివరకూ ‘2.0’ విడుదల తేదీ ఖరారు కాలేదు. ఒకవేళ రిపబ్లిక్ డే (జనవరి 26) నాడు ‘2.0’ను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటిస్తే, ‘ప్యాడ్మాన్’ను విడుదల చేయను’’ అని క్లారిటీ ఇచ్చారు. నిజం చెప్పాలంటే... అక్షయ్ అండ్ కో ‘ప్యాడ్మాన్’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 13న విడుదల చేయాలనుకున్నారు. ‘2.0’ వెనక్కి వెళ్తుందని తెలిసిందో ఏమో... విడుదల తేదీని జనవరికి జరిపారు. అక్షయ్ చెప్పిన మాటలను బట్టి ఒక్కటి స్పష్టమైంది. అయితే ‘2.0’... లేదంటే ‘ప్యాడ్మాన్’... రెండిటిలో ఏదో ఒక్క సినిమాయే జనవరిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది!! -
ఇంకా టైమ్ ఉంది!
హిందీ హీరో అక్షయ్‌కుమార్. అదేనండి.. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘2.0’లో విలన్‌గా చేశారు కదా ఆయనే. తన సినిమా ‘పాడ్‌మ్యాన్’ను జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అంతే... ‘2.0’ సినిమా రిలీజ్ లేట్ అవుతుందని, ఆ టైమ్‌కి ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మిస్తోన్న ‘కాలా’ రిలీజ్ అవుతుందని కథలు అల్లేసారు గాసిప్రాయుళ్ళు. ‘2.0’ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయనున్నట్లు లైకాప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దుబాయ్‌లో జరిగిన ఆడియో ఫంక్షన్లో కూడా ‘2.0’ చిత్రబృందం ముందుగా కన్ఫార్మ్ చేసిన రిలీజ్ డేట్ (జనవరి 25)ను మరోసారి ప్రకటించలేదు. అసలు విడుదల తేదీ ప్రస్తావనే లేదు. దీంతో ఇలాంటి రూమర్లుకు మరింత ఊపు వచ్చింది. ‘2.0’ ప్లేస్‌లో ‘కాలా కమింగ్’ అని కన్ఫార్మ్ చేశాయి చెన్నై ఫిల్మ్ సర్కిల్స్. అయితే ఈ విషయంపై ‘కాలా’ చిత్రబృందం స్పందించింది. ‘‘జనవరిలో ‘కాలా’ రిలీజ్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. సంక్రాంతి రేస్‌లో కూడా ‘కాలా’ లేడు’’ అని అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ధనుష్ అండ్ టీమ్. ఆ సంగతి పక్కన పెడితే... ‘2.0’ తర్వాతే ‘కాలా’అని రజనీ కూడా\ స్వయంగా చెప్పారట. దుబాయ్‌లో జరిగిన ‘2.0’ ఆడియో ఫంక్షన్లో పాల్గొని చెన్నై వస్తున్న రజనీకాంత్‌ను ఎయిర్‌పోర్ట్‌లో ‘కాలా’ గురించి కొంతమంది అడగ్గా... ‘2.0’నే ముందు రిలీజ్ అవుతుంది అన్నారట. అంటే ‘కాలా’ రావడానికి ఇంకాస్త టైమ్ ఉందన్నమాట. ఆ సంగతి వదలండప్పా... సింహం ఎప్పుడొచ్చినా సింహమే. -
రజనీ రాజకీయ ప్రవేశంపై ట్విట్టర్ వార్!
చెన్నై: ట్విట్టర్లో కుష్బు, తమిళి సై మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం విమర్శలతో ఎవరికి వారే అన్నట్టుగా ఇద్దరూ చాటింగ్‌తో రచ్చకెక్కారు. గురువారం ఇద్దరు మహిళా నేతల మధ్య ఏకంగా కొంతసేపు ట్విట్టర్లో వ్యాఖ్యల తూటాలు పేలడం చర్చకు దారి తీసింది. ఆ ఇద్దరిలో ఒకరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు, మరొకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై. ట్విట్టర్ వార్ : రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చర్చ ఈ ఇద్దరు మహిళా నేతల మధ్య ట్విట్టర్‌వార్ నడిచింది. రజనీకాంత్ బీజేపీ వైపుగా రావాలని తమిళి సై చేసిన ట్విట్లో కుష్బు వ్యంగ్యాస్త్రంతో కూడిన కామెంట్ చేయడంతో వివాదానికి దారి తీసింది. ఇలా, బ్రతిమలాడి పార్టీలోకి ఆహ్వానించడం కాదు అని, సిద్ధాంతాలకు ఆకర్షితులై రావాలని సూచిస్తూ, ఈ ట్విట్ భిక్షాటనతో సమానం అన్నట్టుగా కుష్బు స్పందించడం తమిళిసైకు ఆగ్రహం కలిగించింది. ఇందుకు ఆమె సమాధానమిస్తూ, ప్రస్తుతం తమరికి ఎదురవుతున్న సమస్యలు నాకు తెలుసు అని, సిద్ధాంతాల ఆకర్షణ అంటే, వేరే పార్టీలో చేరడమా, లేదా జంప్ జిలానీనా అని ప్రశ్నించారు. ఇందుకు కుష్బు సమాధానమిస్తూ, తమరి మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందా తనకు తెలియదంటూ, తనకు నచ్చిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యలు చేశారు. తనను ఎవ్వరూ కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించలేదు, దూతల్ని పంపించలేదంటూ వ్యంగ్యాస్త్రం సందించారు. దీంతో తమిళి సై మరింత దూకుడు పెంచి, డీఎంకే నుంచి తమరిని గెంటేశారుగా అని ట్విట్ చేయడం కుష్బులో మరింత ఆగ్రహం రేపింది. తమరు తనకు పీఆర్వోనా, అసిస్టెంటా? అని ప్రశ్నిస్తే ఏ కారణంతో తాను డీఎంకే నుంచి బయటకు వచ్చానో తెలుసా?, తన గురించి తమరికి ఏమి తెలుసు పెద్దరికంతో వ్యవహరిస్తే బాగుంటుందని, తమరేమైనా మానసిక వైద్యులా అని ప్రశ్నిస్తూ.. తమిళి సైకు కుష్బు చురకలు అంటించారు. ఇందుకు తమిళి సై ట్విట్ చేస్తూ, తాను డాక్టర్నే, ఇతరుల మెదడు స్కాన్ చేసే సత్తా ఉందని సమాధానం ఇచ్చారు. చురకలు అంటించిన సామన్యుడు.. సెకండ్ గ్యాప్‌లో ఈ ట్వీట్ వార్‌ను ఆసక్తిగా పరిశీలిస్తూ వచ్చిన ఓ వ్యక్తి ట్వీట్‌తో ఆ ఇద్దరికి చురకలు అంటించే కామెంట్ పెట్టడం గమనార్హం. 2014లో కుష్బు డీఎంకే నుంచి బయటకు వచ్చారని, అప్పుడు ఆమెను తమ వైపు రావాలని బీజేపీ తరఫున తమిళి సై కూడా ఆహ్వానించిన్నట్టుందేనని కామెంట్ చేశాడు. అప్పుడు ఇలా వార్ సాగ లేదే అని చురకలు అంటించడంతో, సీనియర్ నేతగా, మహిళా నాయకురాలిగా ఉన్న తమిళి సైకు తాను గౌరవం ఇస్తున్నట్టు ట్విట్టర్‌ను కుష్బు సైన్ అవుట్ చేశారు. ఇక, ఈ యుద్ధం కాస్త మీడియాలోకి ఎక్కడంతో వేదికల మీదే కాదు, ట్విట్టర్లోనూ తాము ఏ మాత్రం తగ్గమని ఇద్దరు మహిళా నేతలు నిరూపించుకోవడం గమనార్హం. -
జీవో 59లో అవకతవకలపై ఏసీబీ విచారణ
జమ్మికుంట రూరల్ : గతంలో జమ్మికుంట తహసీల్దార్‌గా పని చేసిన రజిని పదవీ కాలంలో 59 జీవోలో అవకతవకలు జరిగాయని, అనర్హులకు క్రమబద్ధీకరణ ద్వారా లబ్ధి చేకూర్చడంతో భారీగా ముడుపులు అందాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ సీఐ సుందరగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వం కబ్జాల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో 59ని అనుకూలంగా మార్చుకున్న కొందరు తహసీల్దార్ సహకారంతో అక్రమంగా లబ్ధి పొందారని ఆరోపణలున్నాయి. వేలాది గజాల విలువైన భూములను అప్పటి తహసీల్దార్ రజిని అనర్హులకు కట్టబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు కార్యాలయంలో సుదీర్ఘ విచారణ జరిపారు. దరఖాస్తులు, లబ్ధిదారుల జాబితా పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలో మొత్తం 180 దరఖాస్తులు అందగా.. 30 మంది దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. వారిలో పదిమందికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారు. విచారణలో భాగంగా ఎంత భూమిని కేటాయించారంటూ కొందరు లబ్ధిదారులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే.. తమ వద్ద సంబంధిత దస్తావేజులు లేవని వారు సమాధానం చెప్పడంతో రెవెన్యూ సిబ్బందిపై ఏసీబీ అధికారులు మండిపడ్డారు. -
రజనీకి కోర్టు సమన్లు
హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశం చెన్నై : చెన్నై, గిండి, రేస్‌కోర్స్ ప్రాంతంలోని ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ పాఠశాల స్థల వివాదంలో నటుడు రజనీకాంత్, ఆయన భార్య లతా రజనీకాంత్, పాఠశాల చైర్మన్ వందనలకు మద్రాసు హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంలో రజనీకాంత్, లతా రజనీకాంత్ ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా చెన్నై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నటుడు రజనీకాంత్‌కు చెందిన ఈ ఆశ్రమ్ పాఠశాల స్థల వివాదం కేసు గత కొంత కాలంగా కోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం(27వ తారీఖున) ఈ కేసు విచారణకు రజనీకాంత్ ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వక పోవడంతో తమిళనాడు మెట్రిక్యులేషన్ పాఠశాలల జాయింట్ డెరైక్టర్ వారికి సమన్లు పంపారు. అయితే ఈ కేసు వ్యవహారంలో ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలన్న ఉత్తర్వులో నటుడు రజనీకాంత్ పేరును మినహాయించాలని ఆశ్రమ్ పాఠశాల ప్రిన్సిపల్ వందన హైకోర్టులో రిట్ పిటీషన్ వేశారు. ఈ కేసు విచారణ గురువారం న్యాయమూర్తి ఎంఎం.సుందరేశ్ సమక్షంలో విచారణకు వచ్చింది. అయితే వాదోపవాదాలు విన్న తరువాత రజనీకాంత్, లతా రజనీకాంత్‌లు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనని, అవసరమైతే రెండు వారాల వ్యవధి ఇవ్వనున్నట్లు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలకు ఎలాంటి సంబంధం లేదని ఆశ్రమ్ మెట్రి క్యులేషన్ పాఠశాల నిర్వాహకులు తెలిపారు. అలాగే హైకోర్టు కూడా రజినీకాంత్‌ను ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించలేదని పేర్కొన్నారు. ఈ కేసులో రిట్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు ఆశ్రమ్ మెట్రి క్యులేషన్ పాఠశాల నిర్వాహకులు చెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
వేసవి బరిలో ఆ ముగ్గురు
హైదరాబాద్: వచ్చే ఏడాది వేసవి బరిలో ముగ్గురు స్టార్ హీరోలు తలపడనున్నారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల మధ్య ఈ బాక్సాఫీసు పోరు ఆసక్తికరంగా జరగబోతోంది. వీరి సినిమాలు ఒకే సమయంలో విడుదలకు సిద్ధం అవుతుండటంతో ముగ్గురు స్టార్ హీరోల మధ్య ఉండే ఈ రసవత్తరమైన పోటీపై అభిమానులు దృష్టి సారించారు.. మొదటిది రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న తెలుగు, తమిళం ద్విబాషా చిత్రం కబాలి. రెండోది శ్రీమంతుడు లాంటి భారీ హిట్ తరువాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా బ్రహ్మోత్సవం. ఇక మూడోది బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'సరైనోడు'. ఈ మూడు ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాగా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్న రజనీ కబాలి సినిమాను.. షూటింగ్ జాప్యం కారణంగా వాయిదా వేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీని తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అటు మహేష్ బాబు బ్రహ్మోత్సవాన్ని కూడా ఏప్రిల్ 8న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వేసవి బరిలో నిలవాలని యోచిస్తున్నారట. మరోవైపు ఏప్రిల్‌ను ఎప్పుడూ లక్కీ నెలగా భావిస్తున్న అల్లు అర్జున్ ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తాడని సమాచారం. గతంలో ఆయన సినిమాలు రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి ఇదే సమయంలో విడుదలై మంచి విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలోనే సరైనోడు సినిమాను ఏప్రిల్ నెలకల్లా రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. సో... అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది వేసవి బరిలో ప్రిన్స్ , తలైవా, బన్నీ పోటీ ఖాయమయిందన్నమాట. -
చిరంజీవి బర్త్‌డేకు రానున్న అతిరథులు
హాజరుకానున్న రజనీకాంత్, అమితాబ్, సల్మాన్ కుటుంబీకులు ముంబై: మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదినోత్సవ కార్యక్రమానికి సినీరంగ అతిరథులు తరలిరానున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తోపాటు బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్, ఆయన కుటుంబీకులు, సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబీకులు, టబు, బోనీ కపూర్ తదితరులకు ఆహ్వానం అందింది. చిరంజీవి పుట్టినరోజు వేడుకలను శనివారం హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిరంజీవికి ఇష్టమైన వంటలను అతిథులకు రుచి చూపించబోతున్నారు. -
భార్య ఎదుటే రొమాన్స్ చేశా
సినిమా వాళ్లంటే చులకన భావం, ఒక రకమైన అభద్రత ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. అదిప్పుడు పూర్తిగా పోయిందని కచ్చితంగా చెప్పలేం. నటుడు విష్ణువిశాల్ ప్రేమ కథ వింటే సినిమా వాళ్లపై అపోహలు పూర్తిగా తొలగిపోలేదన్నది సుస్పష్టం అవుతుంది. విష్ణువిశాల్ ఈయన అసలు పేరు విష్ణు. నటుడైన తరువాత విష్ణువిశాల్గా మార్చుకున్నారు. ఈయన ఒక పోలీస్అధికారి కొడుకు. సినిమా, క్రికెట్ అంటే పిచ్చి.అందులో శిక్షణ కూడా పొందారు. ఈయనకో ప్రేయసి ఉంది.పేరు రజిని. వరుసకు మామ కూతురే. విష్ణువిశాల్‌కు సినిమాలో నటించాలని మక్కువ. అవకాశాల కోసం ప్రయత్నించి నిరాశ చెందారు. దాంతో వేరే జాబు చేసుకుంటున్నారు. విష్ణు ప్రియురాలి తండ్రి ఒక్క సినిమా వాళ్లను మినహా ఎవరిని పెళ్లి చేసుకో అని కండిషన్ పెట్టారట. ఈ కుటుంబం సినిమాకు వ్యతిరేకం కాదు గానీ సినిమా వాళ్లతో పెళ్లి సంబంధాలకు ససేమిరా అంగీకరించరు. మొత్తం మీద విష్ణువిశాల్, రజినీల పెళ్లి జరిగిపోయింది. భార్య కళ్లెదుటే రొమాన్స్ ఆ తరువాతే అసలు కథ మొదలైంది. విష్ణువిశాల్‌కు దర్శకుడు సుశీంద్రన్ నుంచి పిలుపొచ్చింది. వెన్నెల కబడీ కుళు చిత్రంలో కథానాయకుడిగా అవకాశం. కలలు కన్న జీవితం. ఇటు సినిమా వాళ్లంటే పడని భార్య వర్గం. ఏదో తంటాలు పడి భార్యను ఒప్పించగలిగారు. మరి మామ గారి విషయం. ఆ భాధ్యతల్ని ఆయన భార్య తీసుకున్నారు. నేను వద్దని గోల చేస్తాను మీరు దాన్ని భరించండి. అలా కొంత కాలం తరువాత అంతా సర్దుకుంటుంది. అన్న అర్ధాంగి సూచనను విష్ణువిశాల్ తూచ తప్పకుండా పాటించి సినిమా హీరో అయిపోయారు.ఆ తరువాత నీర్పరవై చిత్రంలో భార్య కళ్లెదుటే హీరోయిన్ సునైనను కౌగిలించుకుంటే ఆమె ఇందుకే సినిమాలు వద్దన్నాను అంటూ కాసేపు రాద్దాంతం చేసింది, ఆ తరువాత నటనే కదా అని సర్దుకుంది అన్న విష్ణువిశాల్ ప్రస్తుతం యువ హీరోలలో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఇటీవల జీవా, ముండాసుపట్టి,నేట్రు ఇండ్రు నాళై వరుసగా మూడు చిత్రాల విజయాలు సొంతం చేసుకున్నారు. ఈ విజయోత్సాహంతో శుక్రవారం తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. ఈ ఆనందాన్ని విలేకరులతో పంచుకుంటూ ఈ రోజు తానీస్థాయిలో ఉండడానికి చాలా మంది కారణం. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. తొలి చిత్ర అవకాశం ఇచ్చిన సుశీంద్రన్, నీర్పరవై చిత్ర దర్శకుడు శీనురామసామి, కష్టకాలలో ఉన్న తనను ప్రోత్సహించిన విత్రులు విశాల్, ఆర్యలకు కృతజ్ఞతలు అన్నారు. స్నేహితులంటే వారే నిజమైన స్నేహితులంటే విశాల్, ఆర్యలేనని అన్నారు. సాధారణంగా ఒక హీరో చిత్రాన్ని మరొకరు పట్టించుకోరన్నారు. అలాంటిది తాను నటించిన జీవా చిత్రాన్ని విశాల్, ఆర్య విడుదల చేశారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం ఇదం పొరుళ్ ఎవల్, వీర ధీర శూరన్, కలక్కరాయ్మాప్పిళే, పోడా ఆండవనే ఎన్ పక్కమ్ చిత్రాల్లో నటిస్తునట్లు విష్ణువిశాల్ వెల్లడించారు. -
తమిళ సినిమా తల్లితో సమానం
తమిళసినిమా తల్లిలాంటిదని సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద పేర్కొన్నారు. తమిళ చిత్రపరిశ్రమలో నినైత్తాలే ఇనిక్కుమ్(తలుచుకుంటేనే మధురం) అనే పాట వింటుంటే కమల్, రజినీలతో పాటు గుర్తుకొచ్చే నటి జయప్రద. అంతగా తమిళ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి జయప్రద. తమిళం, తెలుగుభాషల్లో ప్రముఖ నాయికగా వెలుగొంది అటు పిమ్మట బాలీవుడ్ రంగప్రవేశం చేసి అక్కడా టాప్ హీరోయిన్గా వెలిగారు. ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రజాసేవకు అంకితమైన జయప్రద తాజాగా తన కొడుకు సిద్ధూను హీరోగా పరిచయం చేస్తూ ఉయిరే ఉయిరే అనే చిత్రాన్ని స్టూడియో9 మోషన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించారు. నటి హన్సిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. చిత్ర గీతాలను ప్రముఖ రాజకీయ నాయకుడు అమర్‌సింగ్ సమక్షంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్‌కపూర్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని తెలుగు ప్రముఖ నటుడు మోహన్‌బాబు, పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డి, నటి రాధిక, శ్రీప్రియలు అందుకున్నారు. చి త్రం ప్రచార చిత్రాన్ని అమర్‌సింగ్ ఆవిష్కరిం చి వేదికపైనున్న వారందరికి అందించారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ ఈ వేది కపై దర్శకుడు కె.బాలచందర్ ఉంటే బాగుండేదన్నారు. అయినా ఆయన ఆశీస్సులు తన కొడుక్కి ఉంటాయని భావిస్తున్నానన్నారు. బాలచందర్ తన చేతిని పట్టుకుని సినిమాను నేర్పించారని గుర్తు చేసుకున్నారు. తన కొడుకు సిద్ధూను తమిళంలో ఎందుకు పరిచయం చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారన్నారు. తమిళసినిమా తనకు కన్నతల్లిలాంటిదని వివరించారు. పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందీ తమిళసినిమానేనన్నారు. అలాంటి ఈ పరిశ్రమలో తన కొడుకు ఎదగాలనే పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఇతర చిత్రాల కంటే ఈ ఉయిరే ఉయిరే చిత్రంలో సిద్ధూ, హన్సికల జంట చూడ ముచ్చటగా, అందంగా ఉన్నారని జయప్రద పేర్కొన్నారు. నటుడు మోహన్‌బాబు, సుబ్బరామిరెడ్డి, రాధిక, శ్రీప్రియ, సుమలత, అమర్‌సింగ్ తదితరులు చిత్ర యూనిట్‌కు శుభాశీస్సులు అందించారు. చివరగా నటుడు అనిల్‌కపూర్ సినిమా ఎంటర్టైన్ అంటూ జయప్రద, హన్సిక, రాధిక, సుమలత తదితరులతో సరదాగా స్టెప్స్ వేసి అందర్నీ అలరించారు. -
పిల్లలపై వేధింపులపై ...నటి రజని మనోగతం
-
వెకిలి ’చే’ష్టలు
-
రజనీ పాత్రలో అజిత్?
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు నటుడు అజిత్ అంటే చాలా ఇష్టం. అజిత్కూ రజనీ అంటే చాలా గౌరవం. ఇంతకు ముందు రజనీ నటించిన బిల్లా చిత్రం రీమేక్‌లో అజిత్ నటించి మెప్పించారు. ఇప్పడు రజనీ నటించాల్సిన పాత్రలో అజిత్ నటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. అజిత్ తొలిసారిగా స్టార్ డెరైక్టర్ శంకర్‌తో కలిసి పని చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విషయానికొస్తే రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన ఎందిరన్ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లోనూ అనువాదమై విజయవంతమైంది. ఈ చిత్రానికి కొనసాగింపు తెరకెక్కించాలన్నది దర్శకుడు శంకర్ ఆకాంక్ష. ఇందుకు కథను కూడా సిద్ధం చేసుకున్నారు. ఎందిరన్ -2 ను కూడా రజనీకాంత్‌తోనే రూపొందించాలన్నది శంకర్ భావన. ఈ విషయమై శంకర్, రజనీ కాంత్‌లు ఇటీవల చర్చించుకున్నట్లు సమాచారం. అయితే ఎందిరన్-2, చిత్రంలో రజనీకాంత్ నటించడానికి ఆసక్తి చూపడంలేదని తెలిసింది. అందుకు కారణం ఆయన ఆరోగ్యమే. ఎందిరన్-2 చిత్రంలో నటించే విషయమై రజనీకాంత్ ఇంతకు ముందు తనకు చికిత్స అందించిన వైద్యులను సంప్రదించగా వారు నటించవద్దని చెప్పినట్లు సమాచారం. శరీరానికి ఒత్తిడి కలిగించే పాత్రల్లో నటించరాదని వైద్యులు రజనీకాంత్‌కు సూచించారట. ఎందిరన్-2 చిత్రంలో శరీర బరువు తగ్గించి నటించే సన్నివేశాలుంటాయట. దీంతో ఈ చిత్రంలో సూపర్ స్టార్ నటించే అవకాశం లేదని తెలుస్తోంది. రజనీ కాకుంటే శంకర్ దృష్టిలో అజిత్ ఉంటారని సమాచారం.ప్రస్తుతం విక్రమ్ హీరోగా ఐ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శంకర్ తదుపరి ఎందిరన్ -2 కు తెరరూపం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. -
బీఎస్ఎఫ్ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
మధిర: బీఎస్ఎఫ్ జవాన్ చింతల అంజయ్య(38) మృతదేహం స్వగ్రామమైన మధిర మండలంలోని నక్కలగరుబుకు శనివారం చేరుకుంది. ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీలో విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో ఆయన మృతిచెందారు. అంజయ్య 18 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆయన ఇటీవలే జమ్మూకాశ్మీర్ నుంచి ఉద్యోగోన్నతిపై ఢిల్లీకి వచ్చారు. మృతదేహాన్ని ఢిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో, అక్కడి నుంచి ఆర్మీ బస్సులో (ఆర్మీ) సిబ్బంది శనివారం నక్కలగరుబు తీసుకొచ్చారు. అంజయ్యకు భార్య, కుమారుడు ప్రణీత్, కుమార్తె సౌజన్య ఉన్నారు. మృతదేహాన్ని మధిర టౌన్ ఎస్ఐ గూడ అశోక్‌రెడ్డి, పోలీసు సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియల సమయంలో సైనిక సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. నక్కలగరుబులో విషాదం అంజయ్య మృతితో ఆయన స్వగ్రామం నక్కలగరుబులో విషాదం నెలకొంది. స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి మృతదేహాన్ని సందర్శించారు. తమ గ్రామంలోని వారితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని అందరికీ అంజయ్య సుపరిచితుడని స్థానికులు చెప్పారు. నాయకుల సంతాపం అంజయ్య మృతదేహాన్ని వైఎస్ఆర్ సీపీ మధిర మండల అధ్యక్షుడు యన్నం కోటేశ్వరరావు, ఆత్కూరు ఎంపీటీసీ సభ్యురాలు యన్నం రజిని, సీపీఎం నాయకుడు లింగాల కమల్‌రాజ్, రైతు సంఘం నాయకుడు చిత్తారు నాగేశ్వరరావు తదితరులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. -
అతిథిగా రజనీ?
ఒక ఆశ్చర్యకరమయిన ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. అదే కమల్‌హాసన్, రజనీ కలిసి త్వరలో ఒక చిత్రం చెయ్యబోతున్నారన్నది. కమల్ హాసన్, రజనీకాంత్ తొలి రోజుల్లో పలు చిత్రాలు కలిసి నటించారన్న విషయం తెలిసిందే. ఆ చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ తరువాత ఇద్దరికీ సొంత ఇమేజ్ రావడంతో విడివిడిగా నటించడం సూపర్‌స్టార్స్‌గా ఎదగడం తెలిసిందే. ఆ తరువాత కూడా ఈ దిగ్గజాల కలయికలో చిత్రం చేయూలని చాలా మంది ప్రయత్నించి విఫలం అయ్యారు. స్వయంగా వారి గురువు కె.బాలచందర్‌కు కూడా అలాంటి ఆలోచన వచ్చినా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. అయితే అలాంటి ఒక అద్భుత కలయికతో త్వరలో ఒక చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రసిద్ధ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ హీరోగా నటించనున్నట్లు రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రానికి వీర విళైయాట్టు అనే టైటిల్‌ను నిర్ణయిం చినట్లు సమాచారం. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన ఏదీ లేదు. ప్రస్తుతం కమల్‌హాసన్ ఉత్తమ విలన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత మలయాళ చిత్రం దృశ్యం రీమేక్‌లో నటించనున్నారు. అలాగే రజనీకాంత్ లింగా చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
అమ్మ కూడా చూడాలి!
ముంబై: సచిన్ టెండూల్కర్ 24 సంవత్సరాల కెరీర్లో అతడి తల్లి రజనీ ఒక్క మ్యాచ్ కూడా మైదానానికి వచ్చి ప్రత్యక్షంగా చూడలేదు. కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. అందుకే చివరిసారి తాను ఆడబోయే టెస్టు (200వ మ్యాచ్)ను తన తల్లి ప్రత్యక్షంగా చూడాలని మాస్టర్ కోరుకుంటున్నాడు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా లేరు. ఒకవేళ మైదానానికి వచ్చినా వీల్‌చెయిర్‌లోనే రావాలి. అటు గురువు ఆచ్రేకర్ కూడా సచిన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు. మాస్టర్ ఇప్పటికే వాంఖడేలో తన చివరి మ్యాచ్ ఆడతానని బోర్డును కోరాడు. దీనికి బోర్డు కూడా సానుకూలంగా ఉంది. అయితే రొటేషన్ పాలసీని పక్కనబెట్టి సచిన్ 199వ మ్యాచ్‌ను కోల్‌కతాకు కేటాయించాలని దాల్మియా కూడా బోర్డును కోరారు. క్రికెట్ ‘పాలన’లోకి వస్తాడు: పవార్ రాయ్‌గఢ్: సచిన్‌ను క్రికెట్ పాలన వ్యవహారాల్లోకి లేదా కన్సల్టెంట్‌గా తీసుకొచ్చేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, బీసీసీఐ మాజీ చీఫ్ శరద్ పవార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు సచిన్ నుంచి హామీ కూడా లభించిందని వెల్లడించారు. ‘వీడ్కోలు తర్వాత శుక్రవారం నాడు సచిన్‌తో మాట్లాడా. మున్ముందు భారత క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు అడ్మినిస్ట్రేటర్‌గా రావాలని కోరా. దానికి అతను సానుకూలంగా స్పందించాడు. నా విజ్ఞప్తిని మన్నించినందుకు నాకూ సంతోషంగా ఉంది. వీడ్కోలు తర్వాత ఆటకు సేవ చేయడాన్ని మించిన సంతృప్తి ఉండదని చెప్పాడు’ అని పవార్ వ్యాఖ్యానించారు. -
ఆసియా కప్ హాకీ టోర్నీకి సౌందర్య, రజని
న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య జాతీయ జట్టులో పునరాగమనం చేసింది. ఈనెల 21 నుంచి 27 వరకు కౌలాలంపూర్‌లో జరిగే ఆసియా కప్ మహిళల టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులోకి ఆమె ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఎతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా జట్టులో కొనసాగనుంది. మొత్తం 18 మంది సభ్యులుగల భారత జట్టుకు రీతూ రాణి నాయకత్వం వహిస్తుంది. చన్చన్ దేవి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆసియా టోర్నీలో గ్రూప్ ‘ఎ’లో భారత్‌తో పాటు చైనా, మలేసియా, హాంకాంగ్ ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, చైనీస్ తైపీ జట్లు ఉన్నాయి. ఈనెల 21న హాంకాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ టోర్నీని ప్రారంభిస్తుంది. వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రపంచకప్‌కు దీనిని అర్హత టోర్నీగా పరిగణిస్తున్నారు. -
ప్రియుడితో కలిసి బంధువు హత్య
హైదరాబాద్: పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్మారావు నగర్ ఫేస్టూలోని బాపూనగర్‌లో బుధవారం దారుణం చోటుచేసుకుంది. రజిని అనే యువతి తన ప్రియుడితో కలిసి సమీప బంధవును హత్యచేసింది. ఆమె బంధువు కృష్ణచైతన్యరెడ్డి అనే యువకునికి తినే ఆహారంలో విషం కలపి ఇచ్చింది. దీంతో ఆ యువకుడు మృతిచెందాడు. ప్రియుడు సహాయంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అనంతరం రజిని ఆ శవాన్ని గోనెసంచిలో కట్టి మాయం చేసేందుకు యత్నించినట్టు సమాచారం.