
హిందీ హీరో అక్షయ్‌కుమార్. అదేనండి.. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘2.0’లో విలన్‌గా చేశారు కదా ఆయనే. తన సినిమా ‘పాడ్‌మ్యాన్’ను జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అంతే... ‘2.0’ సినిమా రిలీజ్ లేట్ అవుతుందని, ఆ టైమ్‌కి ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మిస్తోన్న ‘కాలా’ రిలీజ్ అవుతుందని కథలు అల్లేసారు గాసిప్‌రాయుళ్ళు. ‘2.0’ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయనున్నట్లు లైకాప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దుబాయ్‌లో జరిగిన ఆడియో ఫంక్షన్లో కూడా ‘2.0’ చిత్రబృందం ముందుగా కన్‌ఫార్మ్ చేసిన రిలీజ్ డేట్ (జనవరి 25)ను మరోసారి ప్రకటించలేదు.
అసలు విడుదల తేదీ ప్రస్తావనే లేదు. దీంతో ఇలాంటి రూమర్లుకు మరింత ఊపు వచ్చింది. ‘2.0’ ప్లేస్‌లో ‘కాలా కమింగ్’ అని కన్‌ఫార్మ్ చేశాయి చెన్నై ఫిల్మ్ సర్కిల్స్. అయితే ఈ విషయంపై ‘కాలా’ చిత్రబృందం స్పందించింది. ‘‘జనవరిలో ‘కాలా’ రిలీజ్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. సంక్రాంతి రేస్‌లో కూడా ‘కాలా’ లేడు’’ అని అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు ధనుష్ అండ్ టీమ్. ఆ సంగతి పక్కన పెడితే... ‘2.0’ తర్వాతే ‘కాలా’అని రజనీ కూడా\ స్వయంగా చెప్పారట. దుబాయ్‌లో జరిగిన ‘2.0’ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొని చెన్నై వస్తున్న రజనీకాంత్‌ను ఎయిర్‌పోర్ట్‌లో ‘కాలా’ గురించి కొంతమంది అడగ్గా... ‘2.0’నే ముందు రిలీజ్ అవుతుంది అన్నారట. అంటే ‘కాలా’ రావడానికి ఇంకాస్త టైమ్ ఉందన్నమాట. ఆ సంగతి వదలండప్పా... సింహం ఎప్పుడొచ్చినా సింహమే.
Comments
Please login to add a commentAdd a comment