kala
-
గ్యాంగ్‌స్టర్, లేడీ డాన్ల పెళ్లికి గ్యాంగ్‌వార్ ముప్పు? భారీ పోలీసు బందోబస్తు!
దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలోగల సంతోష్ మ్యారేజ్ గార్డెన్లో గ్యాంగ్‌స్టర్ కాలా జఠేడి, లేడీ డాన్ అనురాధల వివాహం నేడు (మార్పి 12) జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అయితే గ్యాంగ్‌వార్ ముప్పును దృష్టిలో పెట్టుకుని మ్యారేజ్ గార్డెన్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అతిథులను బార్ కోడ్ ద్వారా గుర్తించి, ప్రవేశం కల్పించనున్నారు. మ్యారేజ్ గార్డెన్లో పలు సీసీటీవీలను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మ్యారేజ్ హాల్ చుట్టూ ఉన్న రోడ్లను కూడా ఎప్పటికప్పుడు సీసీటీవీలతో పర్యవేక్షిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాలుగు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు ఈ వివాహంపై దృష్టి పెట్టాయి. గ్యాంగ్ వార్ ముప్పు దృష్ట్యా సంతోష్ గార్డెన్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలు, దుకాణాలను పోలీసులు మూసివేయించారు. రెండు రోజుల క్రితం ఐదుగురు షూటర్లను పోలీసులు మ్యారేజ్ గార్డెన్ సమీపంలో అరెస్ట్ చేశారు. కాలా జఠేడికి పలు ముఠాల నుండి ముప్పు ఉంది. వాటిలో బంబిహా గ్యాంగ్ పేరు మొదట వినిపిస్తుంది. బంబిహా గ్యాంగ్‌కి చెందిన షూటర్లు కాలా జఠేడితో పాటు అతని గ్యాంగ్‌పై దాడి చేయడానికి నిత్యం వెదుకుతుంటారని పోలీసులు దగ్గర సమాచారం ఉంది. గ్యాంగ్‌స్టర్, లేడీ డాన్ల వివాహ వేదికను పూలతో అందంగా అలంకరించారు. అతిథులు కూర్చునేందుకు అద్భుతమైన సోఫాలను ఏర్పాటు చేశారు. అతిథుల విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. VIDEO | Tight security for gangster Sandeep alias Kala Jathedi's marriage with "history-sheeter" Anuradha Choudhary alias 'Madam Minz' in #Delhi. The Delhi Police has made a strategic plan to avert any incident of gang-wars or possibility of Sandeep's escape from custody,… pic.twitter.com/9YQPB9950U — Press Trust of India (@PTI_News) March 12, 2024 -
ప్రజలు కోరిందే తీర్మానించాం!
సిరిసిల్ల: ప్రజాపాలన దరఖాస్తుల్లో పలు ఆప్షన్లను కోరారని వాటినే మున్సిపల్ ఎజెండాలో ఉంచి తీర్మానం చేశామని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ప్రజాపాలన కార్యక్రమంపై భేషజాలకు పోకుండా పలు అంశాలపై ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలోనే రేషన్‌కార్డులు, ఉచిత విద్యుత్‌కోసం ప్రత్యేకంగా ఆప్షన్లు ఇవ్వాలని కోరామన్నారు. ఈవిషయాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. కానీ కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనంతరం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, విలీన గ్రామాలను జీపీలు చేస్తామని ఎమ్మెల్యే కేటీఆర్ ఎన్నికలకు ముందు బహిరంగ సభలో ప్రకటించారని పేర్కొన్నారు. రూ.వందల కోట్ల ఖర్చుతో బైపాస్‌రోడ్డు వేయించారని, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయించారని ఇవన్నీ విలీన గ్రామాల అభివృద్ధికి దోహదం చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. వస్త్ర పరిశ్రమలో నేతకార్మికులు, పద్మశాలీలను పూర్తిస్థాయిలో కేసీఆర్, కేటీఆర్ ఆదుకున్నారని, కేవలం రాజకీయ లబ్ధికోసం వారిని ఇష్టానుసారంగా విమర్శించడం సరికాదన్నారు. సమావేశంలో టీఎస్‌పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, సత్తార్, వేణు, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్ -
3ఎస్
హుమా ఖురేషీ అంటే? మూడు ముక్కల్లో చెప్పాలంటే... స్పాంటేనిటీ, స్టైల్, స్టేట్మెంట్స్. గుంపులో ఒకరిగా కాకుండా తనదైన ప్రత్యేకతను బాలీవుడ్లో నిలుపుకుంటూ వస్తున్న ఖురేషీ ‘కాలా’ సినిమాతో ‘జరీనా’గా దక్షిణాది సినిమాకు పరిచయమైంది. ‘ఉన్నదున్నట్లే మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో కష్టం’ అంటూనే నిర్మొహమాటంగా మాట్లాడే హుమా ఖురేషీ అంతరంగ తరంగాలు... అభిమానం వరకే... చిన్నప్పుడు సినిమాలు తెగ చూసేదాన్ని. అద్దం ముందు నిల్చొని డ్యాన్స్‌లు చేయడం, డైలాగులు చెప్పడం సరేసరి. మధుబాల, మాధురి దీక్షిత్, శ్రీదేవి...నా అభిమాన తారలు. అంతమాత్రాన...నేను ఎప్పుడూ వారిని అనుకరించే ప్రయత్నం చేయలేదు. నాదైన ముద్ర కోసం ప్రయత్నం చేశాను. నా అదృష్టం! సవాలు విసరని ఇండస్ట్రీ అంటూ ఏదీ ఉండదు. కాబట్టి సవాళ్లను ఎదుర్కోవడానికి సదా సిద్ధంగా ఉంటాను. ఇండస్ట్రీలో నేను ప్రముఖుడి కూతురు, బంధువై ఉంటే ‘ఎక్స్పెక్టేషన్స్’ ఎక్కడో ఉండేవి. అవేమీ లేకపోవడం, ఇతరులతో పోలిక తేకపోవడం నా అదృష్టంగానే భావిస్తున్నాను. శిక్షణ మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉండాలంటే థియేటర్ ట్రైనింగ్ తప్పనిసరి. ఇది సినిమాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మలయాళ సినిమా ‘వైట్’ కోసం డైలాగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు నేను థియేటర్లో నేర్చుకున్న ‘జిబ్బరీష్ టెక్నిక్’ను వాడుకున్నాను. ఒక్కటైనా చాలు... సంవత్సరానికి పది సినిమాలు చేయాలనే ఆరాటం నాలో లేదు.నంబర్లతో నటనను అంచనా వేయలేం. సంవత్సరానికి ఒక్క సినిమా చేసినా ఫరవాలేదుగానీ... నలుగురు మెచ్చే పాత్ర చేయాలనేది నా కోరిక.‘బాగా డబ్బులు సంపాదించాలి’ అనే కోరిక మనల్ని ఎప్పుడూ సృజనాత్మకత అనే గమ్యానికి చేర్చదు. అలాగే ‘భారీ తారగణం’ ‘భారీ బడ్జెట్’....ఈ రెండు ‘భారీ’లు మాత్రమే ఒక సినిమాను విజయవంతం చేయలేవు. అద్భుతం! ఒకప్పుడు మన సినిమాలు అంటే ఇతర దేశాల్లో ‘సింగింగ్ అండ్ డ్యాన్సింగ్’ సినిమా అనే పేరు ఉండేది. ఇప్పుడు దృశ్యం మారిపోయింది. మన సినిమాలపై ఆసక్తి పెరిగిపోయింది. మన దగ్గర అద్భుతమైన దర్శకులు, రచయితలు ఉన్నారు. అందరూ కలిసి నిర్మాణాత్మకంగా కృషి చేస్తే మరిన్ని సృజనాత్మక అద్భుతాలు సృష్టించడం కష్టమేమీ కాదు. -
అమితాబ్ పక్కనే తలైవా
అమితాబ్ బచ్చన్.. రజనీకాంత్... ఇద్దరూ ఇద్దరే. ఒకరేమో నార్త్‌లో మెగాస్టార్.. మరొకరేమో సౌత్ సూపర్‌స్టార్... తమ స్టైల్, మేనరిజమ్, యాక్టింగ్‌తో ఇద్దరూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. తాజాగా అమితాబ్ పక్కనే తలైవా (నాయకుడు) చేరారు. ఇంతకీ ఏ విషయంలో అనేగా మీ డౌట్. జైపూర్‌లోని నహార్గఢ్ కోటలోని మ్యూజియంలో అమితాబ్ మైనపు బొమ్మ ఉంది. తాజాగా అక్కడ రజనీకాంత్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. రజనీ నటించిన ‘కాలా’ చిత్రం రిలీజ్‌ను పురస్కరించుకొని గురువారం రాజస్థాన్‌లోని ఆయన అభిమానులు ఈ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మ్యూజియం డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ– ‘‘నహార్గఢ్ కోట మ్యూజియమ్‌కి దక్షిణాది నుంచి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడ రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. 55 కేజీల బరువు, 5.9 అడుగుల ఎత్తు ఉన్న ‘నరసింహ’ సినిమాలోని లుక్‌లో తలైవా విగ్రహం ఏర్పాటు చేశాం. అది కూడా బిగ్ బీ పక్కనే. మ్యూజియమ్‌ను సందర్శించాలని రజనీకాంత్‌కు ఆహ్వానం పంపుతాం. త్వరలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నాం’’ అన్నారు. -
నేను ఏ తప్పూ చేయలేదు
న్యూఢిల్లీ/చెన్నై: కర్ణాటకలో ‘కాలా’ సినిమా విడుదలకు సహకరించాలనీ కన్నడిగులకు రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. సినిమా చూడాలనుకునే వారిని దయచేసి అడ్డుకోవద్దు. మీ సహకారం కోరుతున్నా’ అని చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని నివాసం వద్ద మీడియా సమావేశంలో కన్నడలో అర్థించారు. ‘నా సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే వారికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరి యాజమాన్య బోర్డు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని మాత్రమే నేను కర్ణాటక ప్రభుత్వాన్ని కోరా. అందులో తప్పేమిటో నాకు తెలియదు. కన్నడిగుల ప్రయోజనాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కానేకాదు. కాలా గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతుండగా ఒక్క కర్ణాటకలోనే ఆపివేయటం మంచిదికాదు. హైకోర్టు ఆదేశాల మేరకు సినిమా విడుదల ప్రశాంతంగా జరిగేలా సీఎం కుమారస్వామి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’అని అన్నారు. రజనీకాంత్ హీరో, ఆయన అల్లుడు ధనుష్ నిర్మాతగా ఉన్న ‘కాలా’ గురువారం విడుదలకానున్న విషయం తెలిసిందే. కొనసాగుతున్న అనిశ్చితి సుప్రీంకోర్టుతోపాటు కర్ణాటక, మద్రాస్ హైకోర్టులు కాలా విడుదలకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ వివిధ కన్నడ సంఘాలు ఇందుకు ముందే ప్రకటించాయి. కాలా సినిమా పోస్టర్లను చించి వేయడంతోపాటు రజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. బెంగళూరులోని టౌన్‌హాల్ నుంచి ‘కాలా’ సినిమా ప్రదర్శించే థియేటర్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు కన్నడ సంఘాల కన్వీనర్ వాటాల్ నాగరాజ్ తెలిపారు. -
జరీనా ఆగయా
ప్రశాంతంగా కనిపిస్తోన్న జరీనా కళ్లలో మాత్రం ఏదో కథ ఉంది. మరి ఆమె గురించి పూర్తీగా తెలియాలంటే మాత్రం ‘కాలా’ సినిమా చూడాల్సిందే. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో దర్శక–నటుడు, నిర్మాత ధనుష్ నిర్మించిన సినిమా ‘కాలా’. హ్యూమా ఖురేషి, అంజలిపాటిల్ కథానాయికలు. నానా పటేకర్, ఈశ్వరీ రావ్, సముద్రఖని కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాలో 45ఏళ్ల జరీనా పాత్ర చేశారు హ్యూమా ఖురేషి. ఆమె లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.‘‘రజనీకాంత్‌గారి ‘కాలా’ సినిమాలో జరీనా క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’అన్నారు హ్యూమా. ‘‘జరీనా పాత్రకోసం చాలా మంది కథానాయికలను పరిశీలించాం. కానీ ‘గ్యాంగ్ ఆఫ్ వస్పేయపూర్’లో హ్యూమాను చూసినప్పుడు జరీనా క్యారెక్టర్‌కు ఆమె కరెక్ట్ అనిపించింది. రజనీ, ధనుష్‌లు కూడా హ్యూమాను ఓకే చేశారు’’ అన్నారు రంజిత్. ‘కాలా’ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. -
మేక్ వే ఫర్ ది కింగ్
ఈసారి రంజాన్‌కు వారం ముందే పండగ స్టార్ట్ కానుంది. ఎందుకంటే రజనీకాంత్ వారం ముందే థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అవును.. జూన్ 7న ‘కాలా’ రిలీజ్ కానుంది. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాలా’. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించారు. అంజలీ పాటిల్, హ్యూమా ఖురేషీ కథానాయికలు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాను తొలుత ఈ నెల 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, కోలీవుడ్ ఇండస్ట్రీ స్ట్రైక్ వల్ల ‘కాలా’ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యిందని ఊహించవచ్చు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ‘కాలా’ సినిమాను జూన్7న రీలీజ్ చేయబోతున్నామని చెప్పడానికి ఆనందంగా ఉంది. మేక్ వే ఫర్ ది కింగ్(రాజుకి దారి ఇవ్వండి)’’ అని పేర్కొన్నారు ధనుష్. నానా పటేకర్, సముద్రఖని తదితరులు నటించిన ‘కాలా’ చిత్రానికి సంతోష్ నారాయణ్ స్వరకర్త. -
40 ఏళ్లల్లో ఇదే మొదటిసారి!
కొత్త సంవత్సరం అంటే.. చేయాలనుకునే పనుల్లో ‘కొత్త సినిమా’ చూడటం ఒకటి. సినిమా లవర్స్ ప్లాన్ మోస్ట్లీ ఇలానే ఉంటుంది. అయితే ఈసారి తమిళ సినిమా లవర్స్‌కి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే తమిళ సంవత్సరాది (ఏప్రిల్ 14)కి కొత్త బొమ్మలేవీ థియేటర్‌కి రాలేదు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఆర్థిక లావాదేవీల విషయంలో పొత్తు కుదిరే వరకూ కొత్త సినిమాలు విడుదల చేసేది లేదని తమిళ పరిశ్రమ బలంగా నిర్ణయించుకుంది. ఆ మేరకు కొత్త సినిమాలేవీ రిలీజ్ చేయడంలేదు. స్ట్రైక్ మొదలై దాదాపు నెల రోజులు పైనే అయింది. ఇంకా తమిళ పరిశ్రమవారు కొత్త సినిమాలు విడుదల చేసే విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. గడచిన 40 ఏళ్లల్లో ‘కొత్త సినిమా రిలీజ్’ చూడని కొత్త సంవత్సరాది ఇదేనట. సినీప్రియులకు ఇది బాధగానే ఉంటుంది. మరోవైపు పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు, బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు, థియేటర్లో సైకిల్ స్టాండ్, స్నాక్స్ అమ్ముకునేవారి వరకూ... అందరికీ నష్టమే. థియేటర్ల మెయిన్టైనెన్స్ కోసం పాత తమిళ సినిమాలను ప్రదర్శించుకుంటున్నారు. వాటికి ఆశించిన కలెక్షన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ స్ట్రైక్ లేకపోయి ఉంటే.. రజనీకాంత్ ‘కాలా’ వచ్చి ఉండేది. ఇక్కడ విడుదలైన ‘మెర్క్యురీ’ అక్కడ రిలీజయ్యుండేది. విశాల్ ‘ఇరుంబుదురై’ ఎప్పుడో రిలీజ్‌కి రెడీ అయి, రిలీజ్ డేట్ దొరక్క ఒకటి రెండు సార్లు, ఇప్పుడు స్ట్రైక్ వల్ల తెరపైకి రావడానికి నోచుకోలేదు. ఇప్పటికే ఇండస్ట్రీ 200 కోట్ల వరకూ నష్టపోయిందని చెన్నై వర్గాల అంచనా. మరి.. ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందో? కొత్త తమిళ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి. ‘ఇరుంబుదురై’ లో విశాల్, సమంత ‘మెర్క్యురీ’లో ఓ దృశ్యం -
సొంత కూతురిలా చూసుకున్నారు
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ కూతురిలా తనను చూసుకున్నారని చెప్పింది బాలీవుడ్ భామ హూమా ఖురేషీ. దక్షిణాది చిత్రసీమలోకి అడుగు పెట్టిన ఉత్తరాది భామలు ఇక్కడ మళ్లీ మళ్లీ నటించాలని ఆశపడుతుంటారు. నటి హుమా ఖురేషీ అలాంటి కోరికనే వ్యక్తం చేస్తోంది. డిల్లీకి చెందిన ఈ బ్యూటీ ధియేటర్ ఆర్టిస్ట్‌గా పలు స్టేజీలో నటించి, ఆనక మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత ముంబాయికి చేరిన హుమా ఖురేషీ బుల్లితెర కార్యక్రమాలతో దర్శకుడు అనురాగ్ కశ్యప్ దృష్టిలో పడటంతో తన దశ మారిపోయింది. ఆయన దర్శకత్వంలో నటించిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ హింది చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అలా కొన్ని హింది చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ దర్శకుడు పా. రంజిత్ కంట్లో పడింది. అంతే తంతే బూరెల బుట్టలో పడ్డట్టుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కాలా చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అంతే కోలీవుడ్‌లో పాపులర్ అయిపోయ్యింది. కాలా చిత్రం నిర్మాణ కార్మక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా హూమా ఖురేషీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కాలా చిత్రంలో నటిస్తున్న సమయంలో రజనీకాంత్ నిరాడంబరతను చూసి విస్మయం చెందానంది. ఆయన ఒక కూతురిలా తనపై అభిమానం చూపించారని చెప్పింది. రజనీకాంత్ ఇంటి నుంచి ఆహారపదార్థాలను తెప్పించి తనకు విందు ఇవ్వడం ఎప్పటికీ మరచిపోననీ అంది. అలాగే తమిళ సంస్కృతి, సంప్రదాయాలు తనకు బాగా నచ్చాయని పేర్కొంది. కాలా చిత్రం తనకు కోలీవుడ్‌లో మంచి ఎంట్రీ అవుతుందనీ, ఆ చిత్రం విడుదలనంతరం మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉందనీ చెప్పింది. ఇప్పటికే కొన్ని చిత్రాలలో నటించే విషయమై కొందరు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయనీ తెలిపింది. అదే విధంగా కాలా చిత్రం విడుదల తరువాత తాను ముంబాయి నుంచి దక్షిణాదికి మకాం మార్చనున్నాననీ హూమా ఖురేషీ చెప్పింది. -
వణక్కం! వచ్చానని చెప్పండి
‘వందుట్టేన్ను సొల్లు’ అంటున్నారు రజనీకాంత్. అంటే వచ్చానని చెప్పు అని అర్థం. మరి.. వణక్కం అంటే ఏంటి? అంటే ‘నమస్కారం’ అని అర్థం. ఇంతకీ రజనీ ఎక్కడికి వచ్చారు? అంటే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి. ‘కబాలి’ సినిమాలో పలికిన పవర్ఫుల్ డైలాగ్ (‘వందుట్టేన్ను సొల్లు’) తోనే ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లోకి అఫీషియల్‌గా అడుగుపెట్టారు రజనీకాంత్. రెండేళ్లుగా అదిగో వస్తున్నా.. ఇదిగో వస్తున్నా అని అభిమానులను ఊరించి ఎట్టకేలకు న్యూ ఇయర్‌కి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారాయన. రాజకీయాల్లో యువతను టార్గెట్ చేసే విధంగా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్లను ఓపెన్ చేశారని సమాచారం. ఇంతకు ముందు రజనీకాంత్ కేవలం ట్విట్టర్లో మాత్రమే ఉన్నారు. ట్విట్టర్ ఖాతాలో తన సినిమాలకు సంబంధించిన విషయాలు, ఏదైనా కామెంట్స్ తెలియజేస్తూ యాక్టీవ్‌గా ఉంటుంటారు. ఇప్పుడాయన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ అల్లుడు, హీరో ధనుష్ నిర్మించిన ‘కాలా’ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది. -
కాలా టీజర్ కేక
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎదురుచూస్తున్న కాలా చిత్రం టీజర్ గురువారం అర్ధరాత్రి విడుదలై కేక పుట్టిస్తోంది. కబాలి తరువాత రజనీ నటించిన చిత్రం కాలా. ఆయన అల్లుడు, నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటి ఈశ్వరిరావు రజనీకాంత్‌కు భార్యాగా నటించారు. హిందీ నటుడు నానాపటేకర్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చిత్ర టీజర్‌ను మార్చి ఒకటవ తేదీన విడుదల చేయనున్నట్లు నటుడు ధనుష్ ముందుగా ప్రకటించడంతో రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే కంచి కామకోటి పిఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి శివైక్యం కావడంతో కాలా టీజర్ విడుదలను ఒక్క రోజు వాయిదా వేశారు. గురువారం అర్ధరాత్రి విడుదలైన టీజర్ కేక పుట్టిస్తోంది. రజనీ పంచ్ డైలాగులు దుమ్మురేపుతూ చిత్ర రెంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఒక్కడినే నిలబడ్డా దిల్లుంటే మొత్తంగా రండి అని తిరునెల్వేలి తమిళ యాసలో రజనీ చెప్పే డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి. నా రౌడీయిజాన్ని మొత్తం చూడలేదు. చూస్తారా? అంటూ తనదైన స్టైల్లో రజనీకాంత్ చెప్పే డైలాగులకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మొత్తం 78సెకన్ల నిడివి కలిగిన కాలా టీజర్ అభిమానుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ కిరాక్ పుట్టిస్తోంది. టీజర్ విడుదలైన కొద్ది గంట ల్లోనే కబాలి చిత్ర టీజర్‌ను బీట్ చేసేందంటున్నారు సినీ వర్గాలు. అయితే ఈ టీజర్‌పై కొన్ని విమర్శలు తెలెత్తడం గమనార్హం. కాలా చిత్రంలో రజనీ అణగారిన జనం కోసం పోరాడే పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కబాలి చాయలు కనిపిస్తున్నాయని,వరుసగా రజనీకాంత్‌ను రౌడీగా చూడడం మోనాటనీగా భావించే అవకాశం ఉందనే విమర్శలు మొదలయ్యాయి. అదేవిధంగా రాజ్యాంగ కర్త అంబేడ్కర్‌ను కించపరచే విధంగా సంభాషణలు చోటుచేసుకున్నాయనే వివాదం తెరపైకి వస్తోంది. ఇది ఎటు వైపు దారి తీస్తుందో వేచి చూడాలి. -
దిల్ ఉంటే గుంపుగా రండి రా!
ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లు... దాదాపు 20 ఏళ్ల క్రితం ‘బాషా’లో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఆ తర్వాత ఇలాంటి పంచ్ డైలాగులు బోలెడన్ని చెప్పారు. వాటిలో ‘శివాజీ’లో చెప్పిన ‘నాన్నా.. సింహం సింగిల్‌గా వస్తుంది. పందులే గుంపుగా వస్తాయి’ అనే డైలాగ్ ఒకటి. ఇప్పుడు రజనీ ‘గుంపుగా రండి రా’ అంటున్నారు. ఇలా పిలుస్తున్నది ‘కాలా’ గెటప్‌లో. ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై దర్శక–నటుడు, రజనీ అల్లుడు ధనుష్ నిర్మించిన చిత్రం ‘కాలా’. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ‘కాలా’ టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘కాలా అంటే.. ఎవరు? కాలుడు. కరికాలుడు. గొడవపడైనా సరే కాపాడేవాడు...’, ‘క్యారె.. సెట్టింగా? వీరయ్య బిడ్డను రా ఒక్కడినే ఉన్నా.. దిల్ ఉంటే గుంపుగా రండిరా!’ అని టీజర్లో రజనీకాంత్ పలికిన డైలాగ్స్ అదిరిపోయేలా ఉన్నాయంటున్నారు అభిమానులు. ‘కాలా’ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ నెక్ట్స్ చిత్రం ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిరు«ద్‌ను సంగీతదర్శకునిగా తీసుకున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. -
అండర్స్టాండింగ్
వార్ తప్పదు. సూర్య, భరత్‌కు బాక్సాఫీసు వార్ తప్పదనుకున్నారంతా. ఈ వార్ రెండు కాంపౌండ్ల మధ్య గొడవకు దారి తీస్తుందని, వినోదం చూడొచ్చని ఔత్సాహికరాయుళ్లు ఆసక్తిగా ఎదురు చూశారు. అది మాత్రం జరగకూడదని ఇండస్ట్రీ మేలు కోరుకునేవాళ్లు ఆకాంక్షించారు. చివరికి వాళ్లు అనుకున్నదే జరిగింది. ఔత్సాహికుల ఆసక్తి మీద బిందెడు నీళ్లు చల్లినట్లయింది. మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ సినిమాల మధ్య వార్ లేదు. రెండు చిత్రాల నిర్మాతలు ఫ్రెండ్లీగా మాట్లాడుకుని, ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చారు. భరత్.. సూర్య.. కాలా కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమతి డి. పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. తొలుత ఈ రెండు సినిమాలను ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సడన్‌గా మధ్యలో ‘కాలా’ దూసుకొచ్చాడు. అంతే ముక్కోణపు వార్ స్టారై్టంది. ఎందుకంటే.. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘కాలా’ చిత్రాన్ని కూడా ఏప్రిల్ 27నే రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. అంతే.. డబుల్.. ట్రిపుల్ అయ్యింది. అంటే.. బాక్సాఫీసు వద్ద ముక్కోణపు పోటీ అన్నమాట. అయితే ‘కాలా’తో రాకుండా భరత్, సూర్య ఒక్కరోజు ముందుకొచ్చారు. ఏప్రిల్ 26న ‘భరత్ అనే నేను’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందాలు ప్రకటించాయి. కానీ, రెండు సినిమాల మధ్య పోటీ కూడా సరికాదని చాలామంది భావించారు. ఇప్పుడా చింత లేదు. ఎందుకుంటే.. భరత్, సూర్య చిత్రబృందాలు కూడా స్నేహపూర్వకంగానే వార్‌కు ప్యాకప్ చెప్పారు. రెండు సినిమాల రిలీజ్ డేట్స్‌ను మార్చుకున్నట్లు గురువారం నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఫైనల్‌గా ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని ఏప్రిల్ 20న, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని మే 4న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఇప్పుడు బాక్సాఫీస్ వార్ లేదు. ఉన్నదల్లా స్నేహపూర్వకమైన వాతావరణం మాత్రమే. -
ఒక్కరోజు ముందుకు
... వస్తున్నారు భరత్ అండ్ సూర్య. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ సినిమా షూటింగ్‌కు మార్చి 27న ప్యాకప్ చెప్పనున్నారు చిత్రబృందం. సీయం భరత్ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో, శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. సైనికుడు సూర్య పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ‘భరత్ అనే నేను’, ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమాలను ముందుగా ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు రెండు సినిమాలు ఏప్రిల్ 26న విడుదల కానున్నాయి. మరి.. ఇద్దరూ ఒకరోజు ముందుకు రావడానికి రజనీకాంత్ ‘కాలా’ కారణం అయ్యుంటుందా? అనే చర్చ జరుగుతోంది. ‘కాలా’ 27న విడుదల కానుంది. ఆ సంగతలా ఉంచితే ‘‘మహేశ్‌బాబు–కొరటాల శివ కాంబినేషన్లో సినిమా చేయడం చాలా హ్యాపీ. ఇది మా బేనర్‌కి ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేస్తాం’’ అని డీవీవీ దానయ్య అన్నారు. ‘‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ ఫెస్టివల్‌ను ఒక్కరోజు ముందుకు తీసుకొస్తున్నాం. ఏప్రిల్ 26న విడుదల చేస్తున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలోని రెండో సాంగ్ ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో’ను ఈరోజు విడుదల చేస్తున్నారు. -
రజనీ ప్రజాసంఘంలో హిజ్రాల విభాగం
తమిళసినిమా: రజనీకాంత్ ఈ పేరు ఇప్పుడు సినీరంగంలోనూ, రాజకీయరంగంలోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయరంగ ప్రవేశాన్ని ధ్రువపరిచిన ఆయన ఆ దిశగా పావులను వేగంగా కదుపుతున్నారు. రజనీ అభిమాన సంఘాన్ని ప్రజా సంఘంగా మార్చారు. పలువురు అభిమానుల్ని నిర్వాహకులుగా నియమించారు. వారంతా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యుత్వ నమోదు పనిలో నిమగ్నమయ్యారు. కాగా రజనీకాంత్ ఏప్రిల్‌లో తన పార్టీ పేరును, గుర్తును వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పుడే పార్టీ విధి విధానాలను వెల్లడించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రజనీ చెన్నై, మాంబళంలో ఉన్న జిల్లా ప్రజాసంఘం యువభాగంలో బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేది కపై పలువురు రైతులకు సహాయకాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ త్వరలో రజనీ ప్రజాసంఘంలో హిజ్రాల విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాలా ఫైట్స్ లీక్.. రజనీ నటిస్తున్న కాలా చిత్రం తాజాగా సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ చిత్రంలోని పోరాట దృశ్యాలు కొన్నిప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చత్రాన్ని నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చిత్రాన్ని ఏప్రిల్ 27వ విడుదల చేమనున్నట్లు ధనుష్ ఇటీవలే ప్రకటించడంతో భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. ఆ తేదీకి ముందు, ఆ తరువాత కూడా ఇతర చిత్రాలను విడుదల చేయకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారని చెప్పవచ్చు. కాగా తాజాగా లీకైన ఈ చిత్ర ఫైట్ సన్నివేశాల్లో రజనీకాంత్‌పై విలన్ అనుచరుడొకడు ఇనుప రాడ్డుతో దాడి చేయడం, అతన్ని రజనీకాంత్ చితక బాదడం వంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. గతంలో రజనీకాంత్‌కు శివాజీ, లింగా లాంటి చిత్రాలకు ఇలాంటి షాక్ తగిలింది. ఆ మధ్య బాహుబలి చిత్రం ఈ లీకుల నుంచి తప్పించుకోలేకపోయింది. చిత్ర మిక్సింగ్, ఎడిటింగ్ కార్యక్రమాల సమయాల్లో ఇలాంటి లీకులు జరిగే అవకాశం ఉంటుంది. కాగా చిత్ర యూనిట్ వర్గాలే కావాలని ప్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి లీకులు చేస్తుంటారనే ఓ వర్గం లేకపోలేదు. -
రైటర్ రజనీ!
గాల్లోకి సిగరెట్ ఎగరేసి అలవోకగా నోటితో రజనీకాంత్ క్యాచ్ చేయడం చూశాం. నేను.. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అని రజనీ డైలాగ్స్ చెప్పడమూ చూశాం. స్టైలు స్టైలు రా.. ఇది సూపర్స్టైలు రా అంటూ ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించిన రజనీ స్టైలిష్ డ్యాన్స్ చూశాం. కానీ ఆయనలో ఎవరికీ తెలియని ఇంకో స్టైల్ ఉంది. అదే ఆయన రైటింగ్ స్టైల్. యస్.. రజనీ కథ రాశారని నటుడు–దర్శకుడు సముద్రఖని చెబుతున్నారు. ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన సినిమా ‘కాలా’. ఇందులో సముద్రఖని కీలక పాత్ర చేశారు. ‘కాలా’ షూటింగ్ అనుభవాలను ఆయన పంచుకున్నారు. ‘‘ఈ చిత్రం కోసం ఎక్కువగా నైట్ షూట్స్ చేశాం. రజనీసార్ ఫుల్ ఎనర్జీతో ఉండేవారు. ఫస్ట్ షాట్‌కు ఎలా ఉంటారో మార్నింగ్ 4 గంటల లాస్ట్ షాట్‌కు సేమ్ ఎనర్జీ. ఇది చూసి మేం అందరం షాక్ అయ్యాం. అంతేకాదు రజనీసార్ ఓ కథ రాశారు. ఆ కథ నాకు చెప్పారు. అందులో నన్నే నటించమన్నారు. ఆ సినిమాకి రైటర్‌గా రజనీసార్ పేరు ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు సుమద్రఖని. అయితే ఈ సినిమాను ఎప్పుడు తీయాలనుకుంటున్నారో మాత్రం సముద్రఖని చెప్పలేదు. -
డబ్బింగ్ షురూ
కాలా స్టార్ట్ చేశాడు. డబ్బింగ్ షురూ చేశాడు. ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం ‘కాలా’. హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్ కథానాయికలు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ రీసెంట్గా స్టారై్టన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని తన క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పడానికి చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చారు రజనీ. ‘కాలా’ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందిన ‘2.0’ రిలీజైన రెండు నెలల తర్వాత రిలీజ్ చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ టాక్. ‘2.0’ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. పొలిటికల్ ఎంట్రీపై రజనీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేసిన తర్వాత రజనీ సినిమాలకు గుడ్‌బై చెబుతారన్న వార్తలు కోలీవుడ్‌లో ఊపందుకున్నాయి. మరోవైపు రజనీ సినిమాలను తగ్గిస్తారేమో కానీ పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టరన్న వాదనలూ వినిపిస్తున్నాయి. రజనీ అధికారికంగా ప్రకటన ఇస్తే గానీ ఇలాంటి వార్తలకు ఫుల్స్టాప్ పడదని అభిమానులు అనుకుంటున్నారట. -
అలాంటి కథ ఉంటే చెప్పండి!
తమిళసినిమా: సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయాలకు రహదారి సినిమా అనే భావం చాలా మందిలో ఉంది.ముఖ్యంగా తమిళనాడులో జరుగుతున్నది ఇదే అయినా అనాధిగా జరుగుతున్నదే. కాగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న మీమాంసను బద్దలు కొడుతూ సుదీర్ఘకాలం తరువాత ఎట్టకేలకు ఆయన రాజకీయరంగప్రవేశం చేశారు. అందుకు అభిమానులు స్వాగతిస్తున్నా, కొందరు సినీ, రాజకీయవాదులు మాత్రం రజనీకాంత్ రాజకీయాల్లో రాణించలేదని బాహటంగానే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన రాజకీయ పునాదులను బలంగా నాటుకునే ప్రయత్నంలో వ్యూహాలు రచిస్తున్నారు రజనీ అండ్ కో. అందులో భాగంగా అభిమానులను కార్యకర్తలుగా మార్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నా, మరో పక్క తనను ఉన్నత శిఖరాలకు చేర్చిన సినిమాను వాడుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు టాక్. రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రం ఏప్రిల్‌లో విడుదలమ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి ఆయన అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న కాలా చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే 2.ఓ బ్రహ్మండ చిత్రమే అయినా అది అభిమానులను మాత్రమే సంతృప్తి కలిగించగలదు. ఇక కాలా చిత్రంలో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఇది ఆయనకు రాజకీయంగా ఎంత వరకు పనికొస్తుందో ఊహించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మరో రెండేళ్లలో పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించి తమిళనాడులోని 234 నియోజిక వర్గాల్లోనూ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. అందువల్ల తన రాజకీయ భవిష్యత్‌కు బ్రహ్మాస్త్రంలా పనికొచ్చే రాజకీయ నేపథ్యంతో కూడిన ఒక చిత్రాన్ని చేయాలన్న ఆలోచనతో మన సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉన్నట్లు తాజా సమాచారం. ఇదే భావనతో కబాలి, కాలా చిత్ర దర్శకుడు పా.రంజిత్‌ను ఆ తరహా కథ ఉందా? లేకపోతే అలాంటి కథను సిద్ధం చేయండి అని రజనీ చెప్పారట. అదే విధంగా శివాజీ, ఎందిరన్, 2.ఓ చిత్రాల దర్శకుడు శంకర్‌తో కలిసి ముదల్వన్–2 చేయాలని ఆయన భావిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. -
ప్రేక్షక దేవుళ్లు శాసిస్తారు.. తలైవా పాటిస్తాడు
ఎవరు నడుచుకుంటూ వస్తే సూర్యుడు గొడుగు పడతాడో... ఎవరికి దాహం వేస్తే మేఘం పరుగు పరుగున వస్తుందో... ఎవరు విశ్రమిస్తే చుక్కలు జోల పాడతాయో... ఎవరు బొటనవేలెత్తి చూపితే కోట్ల అభిమానులు పూలదండలౌతారో... ఆ తమిళ సూపర్‌స్టార్ సింగిల్‌గా రాజకీయాల్లోకి వచ్చి ‘తలైవా’గా రాణిస్తారా? తెలుగు ఇండస్ట్రీ ఏమంటోంది? రజనీకాంత్ : కలక్షన్లలో హిట్ అయ్యారు. ఎలక్షన్లలో హిట్ అవుతారా? పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో డిసెంబర్ 31న రజనీకాంత్ ప్రకటించడంతో ఆయన అభిమానులకు ఈ ఏడాది ఒక రోజు ముందుగానే న్యూ ఇయర్ వచ్చేసినట్లయింది! అయితే అది యేటా రెగ్యులర్‌గా వచ్చే న్యూ ఇయర్ కాదు. ఇరవై ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తే వచ్చిన న్యూ ఇయర్! న్యూ ఎరా!పాలిటిక్స్‌లోకి వచ్చేశానని రజనీ ప్రకటించగానే మండపంలోని వేలాది మంది అభిమానులు ‘తలైవ.. తలైవ..’ అని నినాదాలు చేశారు. అవి రణన్నినాదాలు. తమిళనాడులో ఉద్ధండులైన రాజకీయ నాయకులను సైతం ఉలిక్కిపడేలా చేసిన రాజకీయ ప్రకంపనాలు. ‘‘అవినీతిపై పోరాడదాం.. అసమానతల్ని అంతమొందిద్దాం. మార్పుని తీసుకొద్దాం’’ అని రజనీ పిలుపు ఇవ్వగానే.. ‘అలాగే తలైవా.. చూపిద్దా తడాఖా’’ అని అభిమానుల స్వరం ప్రతిధ్వనించింది. రజనీ నిజంగానే పాలిటిక్స్‌లోకి వచ్చేశారా? ఇంకా కొంతమంది నమ్మడం లేదు. రెండు దశాబ్దాల ఎదురుచూపులు అంత వెలుగును ఒక్కసారిగా తట్టుకోగలవా? ఆ వెలుగు నిజమని నమ్మగలవా? నమ్మాలి. నిజంగానే రజనీలో ఆ రోజున రాజకీయ నాయకుడు సాక్షాత్కరించాడు. బొటనవేళ్లు పైకెత్తి తన రాజకీయ ప్రవేశానికి సంకేతం ఇచ్చారు. ‘‘నాకు జీవితాన్ని ఇచ్చిన అభిమానులారా.. తమిళ ప్రజలారా.. మీ అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు. నా అభిమానులను ఎలా కీర్తించాలో తెలియడం లేదు. ఆర్రోజులుగా, ఆరువేల మందికి పైగా అభిమానులు నాతో ఫొటో దిగేందుకు చూపిన ఓర్పు, పాటించిన క్రమశిక్షణ చెప్పలేని అనుభూతిని కలిగించింది. ఇదే క్రమశిక్షణ, ఓర్పు భవిష్యత్తులో కూడా కొనసాగితే ఏదైనా సాధించగలమని అర్థమైంది. మనం సరైన దిశగా వెళుతున్నాం. రాజకీయాల్లోకి రావడానికి నాకు భయం లేదు’’ అని తన ప్రసంగాన్ని చిన్నపాటి మోటివేషన్‌తో ప్రారంభించారు రజనీ. ‘‘నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చు. మిగతావి నేను చూసు కుంటానని కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. యుద్దంలో జయిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం ప్రాపిస్తుంది. అదే.. యుద్ధం చేయకుండా వెళ్లిపోతే పిరికిపంద అంటారు. ఇప్పటికే అన్నీ పూర్తి చేశాను. బాణాన్ని గురి చూసి వదలడమే ఇక మిగిలింది’’ అని చెప్పారు. రజనీ ఒకసారి చెప్పాడు కాబట్టి.. ఇంకోసారి అడగన క్కర్లేదు. నిజమేనా అని చెయ్యి గిల్లుకోనక్కర్లేదు. రజనీసర్.. యువార్ ది స్టార్. రజనీసర్.. యువార్ ది వార్. ఇదీ.. నిన్నటి, మొన్నటి వైబ్రేషన్.. సెలబ్రేషన్! రాజకీయాల్లో రజనీ శక్తియుక్తులేమిటో బయట పడేందుకు మరికొంత సమయం పట్టొచు కానీ సినిమాల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ ఏ స్టార్‌కూ లేనిది. ‘రజనీసర్ టైమ్ చూసుకోరు. టైమ్ ఎంత అవ్వాలో ఆయనే డిసైడ్ చేస్తారు!’. ‘రజనీసర్ క్యాలెండర్లో మార్చి 31 తర్వాత ఏప్రిల్ 2 ఉంటుంది. అందుకే రజనీసర్ని ఎవరూ ఫూల్‌ని చెయ్యలేరు’. ‘శాంటాక్లాస్ తనే ప్రతి సంవత్సరం రజనీసర్ దగ్గరికి గిఫ్ట్ కోసం వస్తాడు!’. ‘రజనీసర్ ‘కౌన్‌బనేగా...’ హాట్ సీట్లో కూర్చున్నప్పుడు సర్ని క్వొశ్చన్ అడగడానికి కంప్యూటర్ గారే హెల్ప్‌లైన్ తీసుకోవలసి వచ్చింది!’. రజనీసర్ ఆరో తరగతి నోట్సే ఇప్పుడు మనం చూస్తున్న వికీపీడియా! సూపర్‌మేన్, బాట్స్‌మేన్ రజనీసర్ దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆ రోజు టీచర్స్ డే. ఇవన్నీ.. రజనీకాంత్ అభిమానుల మీద ఉన్న జోకులు. అంతగా వారికి ఆయనపై నమ్మకం. ఏదైనా చేయగలడని, ఏదైనా సాధించగలడని. అలాంటి శక్తిమంతుడు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడంటే.. సమాజమే మారిపోతుంది వారు గట్టిగా నమ్ముతున్నారు. అభిమానం రాబిన్హుడ్నీ చేస్తుంది, రాఘవేంద్ర స్వామినీ చేస్తుంది. పాలిటిక్స్‌లో అంత పవర్ ఉంటుంది. రజనీ రాజకీయ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు మాత్రమే ఇంతకాలం ఎదురు చూడలేదు. ప్రత్యర్థులకు చెక్ పెట్టడం కోసం రాజకీయ నాయకులు సైతం పరోక్షంగా ఆయన్ని ‘రాజకీయం’లోకి దింపేందుకు ఇరవై ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. జయలలితకు చెక్ పెట్టడానికి కరుణానిధి వర్గం, కరుణానిధిని అదుపులో ఉంచేందుకు జయలలిత వర్గం ఎన్నోసార్లు రజనీ అనే అస్త్రాన్ని ఎక్కుపెట్టే ప్రయత్నం చేశారు. ‘పోలింగ్ డేట్ దగ్గర పడింది రజనీ. నువ్వొక్క మాట చెప్పు ఈ రాష్ట్రానికి.. మేము వందసార్లు ప్రచారం చేసుకుంటాం’ అనే సంకేతాలనూ డీఎంకే అనేకసార్లు రజనీకి పంపింది. ఆఖరికి ‘కబాలి’ ట్రైలర్‌ని కూడా ఆ పార్టీ జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంది! రజనీ మాత్రం ఎప్పుడూ ఎవరి పక్షమూ నిలవలేదు. చివరి వరకు అభిమానుల పక్షాన్నే ఉండి, ఇప్పుడు తమిళ ప్రజల కోసం అభిమానుల అండతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నిలబడి గెలిచారూ అంటే ఆయనపై అభిమానులకు ఉన్న నమ్మకం గెలిచినట్లు. అభిమానంతో ఏదైనా సాధించగలం అన్న ఆయన నమ్మకం కూడా గెలిచినట్లే! కామెంట్స్: శివ మల్లాల ఎమ్జీఆర్‌లా ఉండాలి రజనీకాంత్ వచ్చి సరిగ్గా నిలబడి చేస్తారా? ఎలక్షన్ దాకా ఉంటారా? ఊరికే మాట్లాడుతు న్నారా? పవన్ కల్యాణ్ కూడా ముప్పైసార్లు చెప్పాడు. అది అంటాడు, ఇది అంటాడు. పొలిటికల్ కన్సిస్టెన్సీ ఉండాలి పవన్‌కి అయినా, రజనీకాంత్‌కు అయినా. ఎన్టీఆర్‌గారు వచ్చారంటే, యంజీఆర్ గారు వచ్చారంటే ఒక మాట అనుకున్నారంటే తప్పో ఒప్పో చేసేసేవారు. వాళ్లకున్న కాన్ఫిడెన్స్ గానీ నమ్మకం గానీ వీళ్లకు లేదు. – తమ్మారెడ్డి భరద్వాజ తపన ఉన్న మనిషి తొంభైల మధ్యకాలంలో చాల సంవత్సరాలు రజనీతో సన్నిహితంగా మెలిగాను. ప్రజలకు ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంటాడు. చాలా మంచి మనిషి. గొప్ప మానవతావాది. ఆయన రాజకీయాలలోకి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు. ఆయన మనస్పూర్తిగా తలుచుకుంటే, దానిని సాధించే దాకా వదిలిపెట్టే రకం కాదు. కచ్చితంగా రాజకీయాల్ని ఒక పట్టు పడతాడని అనుకుంటున్నాను. – అల్లు అరవింద్ స్ట్రాంగ్‌గా నిలబడాలి రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి రావటం మంచిదే. పాలిటిక్స్‌లోకి ఎవరైనా రావచ్చు. ఫలానా వాళ్లే రావాలనే రూలేం లేదు. సేవ చేయలనే ఉద్దేశం ఉంటే చాలు ఎవరైనా ఎన్నికల్లో పోటీ పడొచ్చు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు. ఆయన పార్టీ పెడితే బావుంటుంది. ఆయన ఎంత వరకూ స్ట్రాంగ్ నిలబడి చేస్తారో చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. – జీవిత రాజశేఖర్ మానవతావాది నేను రజనీకాంత్‌ని రెండు సార్లు కలిశాను. రజనీ గురించి దేÔ¶ ం మొత్తం మీద ఒక అభిప్రాయం ఉంది మోస్ట్ హానెస్ట్ అని. గొప్ప మానవతావాది. ఫ్రెండ్లీ నెచర్. ప్రజలందరికి ఏమని ఉంటుందంటే..æ ‘రాజకీయాలు బావుండాలి. రాజకీయ నాయకులు బావుండాలి. మన సొమ్ము తినకూడదు’ అని. అది నిజం కావాలంటే రజనీకాంత్‌లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలి. అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రి కావాలి. ప్రజలకు సేవ చేయాలి. – పోసాని కృష్ణ మురళి సరైన సమయం రజనీకాంత్ తమిళనాడు ప్రజల సమస్యలను చూసి అర్ధం చేసుకున్న వ్యక్తి. ఏ నటుడైనా రాజకీయల్లోకి రావాలంటే వాళ్లంత మాస్ ఫాలోయింగ్ ఉండాలి. తెలుగు నాట ఎన్టీఆర్, తమిళనాట ఎమ్జీఆర్, జయలలిత.. వీళ్లంతా కూడా మాస్ ప్రజల హృదయాల్ని గెలుచుకున్నవారే. 25 సంవత్సరాలు టైమ్ తీసుకుని శూన్యమైన తమిళ రాజకీయల్లోకి సరైన సమయంలో రజనీ వస్తున్నాడు అనిపిస్తోంది. మనస్ఫూర్తిగా ఆయన్ని ఆహ్వానిస్తున్నాను. – జయప్రద -
‘2.0’ ముందుకు వస్తుందా?
రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే అభిమానులకు పండగ రోజు. అలాంటిది పండగ రోజు ఆయన సినిమా విడుదలైతే డబుల్ ఫెస్టివల్. వచ్చే సంవత్సరాది (ఏప్రిల్ 14) రజనీకాంత్ అభిమానులకు టూ ఫెస్టివల్స్. ఒకటి తమిళ న్యూ ఇయర్. ఇంకోటి ‘2.0’ రిలీజ్. అదేంటీ.. ఏప్రిల్ 27న కదా ‘2.0’ రిలీజ్ అనుకుంటున్నారా? లేదట. ‘ఏప్రిల్ 14న రిలీజ్ అనుకుంటున్నాం’ అని శనివారం ‘ఫ్యాన్స్ మీట్’లో రజనీకాంత్ పేర్కొన్నట్లుగా వార్త షికారు చేసింది. ‘‘2.0 చాలా గ్రాఫిక్స్‌తో కూడుకున్న సినిమా. అందుకే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అందుకే జనవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా పడింది. ఎన్నిసార్లు వాయిదా పడినా సినిమా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. బడ్జెట్ విషయంలోనే కాదు కంటెంట్ పరంగా కూడా చాలా గొప్ప సినిమా ఇది. తమిళంలో వచ్చిన ‘చంద్రలేఖ’ సినిమాలాగా చాలా కాలం గుర్తుపెట్టుకునే సినిమాగా నిలిచిపోతోంది. దర్శకుడు శంకర్ చాలా యునిక్ పాయింట్‌ను ఈ సినిమాలో చెప్పబోతున్నాడు. ‘కాలా’ సినిమాలో కొత్త డైమెన్షన్లో కనిపిస్తాను. ఒక కొత్త రజనీకాంత్‌ను దర్శకుడు పా.రంజిత్ మీ అందరికి చూపించబోతున్నాడు’’ అని రజనీకాంత్ ‘2.0, కాలా’ గురించి ఫ్యాన్స్‌తో పలు విశేషాలు పంచుకున్నారు. ఇంత చెప్పారు కదా సార్.. మరి రాజకీయల గురించి ? అని అడిగితే ‘‘ఇంకొక్క రోజు ఆగండి’’ అన్నారు. ఆ ఇంకొక్క రోజు ఈరోజే (ఆదివారం). సో.. రజనీ రాజకీయాల్లోకి వస్తారా? రారా? సాయంత్రానికల్లా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటివరకూ ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వని రజనీ ఈసారి మాత్రం స్పష్టంగా తన నిర్ణయాన్ని చెప్పేయాలనుకుంటున్నారట. ఫ్యాన్స్ మీట్లో రజనీ తన ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసుకున్నారు. ఈ స్థాయికి రావడానికి కారణమైన దర్శకుడు కె.బాలచందర్ గురించి మాట్లాడారు. ‘‘బాలచందర్‌గారిని నేను మొట్టమొదటిసారి కలసినప్పుడు తమిళ్ నేర్చుకోమన్నారు. మూడు సినిమాలకు నన్ను బుక్ చేసుకున్నారు. బాలచందర్‌గారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుని, నేను స్టార్ అయ్యాక దర్శకుడు ఎస్. పి. ముత్తురామన్గారు, మణిరత్నంగారు, సురేష్కృష్ణగారు.. నన్ను సూపర్ స్టార్‌ని చేశారు. ‘రోబో’ సినిమాతో శంకర్ నన్ను జాతీయ స్థాయి నటుణ్ణి చేశారు’’ అని రజనీ అన్నారు. వాస్తవానికి ‘రోబో’కన్నా ముందే రజనీ జాతీయ స్థాయి నటుడే. అయితే శంకర్ పేరుని సూచించడం ఆయన సింప్లిసిటీని తెలియజేస్తోంది. ఇదిలా ఉంటే... ఒకవేళ ‘2.0’ నిజంగానే ఏప్రిల్ 14న విడుదలైతే ఇక్కడ మన రెండు తెలుగు సినిమాల రిలీజ్ డేట్ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు (‘భరత్ అనే నేను) హీరోగా రూపొందుతోన్న సినిమా. ఇంకొకటి వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వాస్తవానికి ముందు రిలీజ్ డేట్ (ఏప్రిల్ 27) ప్రకటించింది ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రబృందమే. ఆ తర్వాత అదే తేదీని మహేశ్‌బాబు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే రెండు పెద్ద సినిమాలు ఒకే తేదీన విడుదల కావడం శ్రేయస్కరం కాదు కాబట్టి, రెండు చిత్రాల నిర్మాతలిద్దరూ కలసి సామరస్యంగా మాట్లాడుకుని, ఓ నిర్ణయానికి రావాలనుకుంటున్నారు. -
కాలా.. ముందుకు రాలా!
ఒక్క పక్క ఫ్యాన్స్ మీట్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ బిజీగా ఉన్నారు. మరోపక్క ‘కాలా’ టీమ్ కూడా బిజీగానే ఉంది. ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్వకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘కాలా’. హ్యూమా ఖురేషి కథానాయిక. దర్శక–నిర్మాత, హీరో, రజనీ అల్లుడు ధనుష్ ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంతో శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందిన ‘2.0’ చిత్రం కంటే ముందుగా ‘కాలా’నే తెరపైకి వస్తుందనే వార్త షికారు చేస్తోంది. ఈ వార్తలను యూనిట్ సన్నిహిత వర్గాలు ఖండించాయి. ‘కాలా’ని వచ్చే ఏడాది ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. లైకా ప్రొడక్షన్స్ ముందు ప్రకటించిన ప్రకారమే ‘2.0’ ఏప్రిల్‌లోనే విడుదలవుతుందట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే... ‘2.0’ సినిమాను సౌదీ అరేబియాలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ ఖబర్. రీసెంట్గా సౌదీ ప్రభుత్వం సినిమాలపై నిషేధం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. -
వన్ అండ్ ఓన్లీ కాలా
ఫొటోలో కళ్లను కళ్లద్దాలు కవర్ చేస్తున్నాయి కానీ ఆ కళ్లలో మాత్రం కసి ఉందన్న విషయం ఫేస్‌లో ఉన్న కోపం చెప్తోంది. మరి ఆ కోపం, కసి ఎందుకు? ఎవరిపై అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆగాల్సిందే. ‘కబాలి’లో స్టైలిష్‌గా చూపించిన రంజిత్. పా దర్శకత్వంలో మళ్లీ సూపర్ స్టార్ రజనీ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ కాలా’. మంగళవారం రజనీకాంత్ (67) బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన అల్లుడు, హీరో, దర్శక–నిర్మాత ధనుష్ ‘కాలా’ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘మా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘కాలా’ సెకండ్ లుక్. హ్యాపీ బర్త్‌డే సూపర్ స్టార్. వన్ అండ్ ఓన్లీ ‘కాలా’’ అని ధనుష్ పేర్కొన్నారు. మరోవైపు రాజకీయల్లో రజనీ రాక గురించిన ఎనౌన్స్మెంట్ మంగళవారం వస్తుందని ఊహించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ‘కాలా’ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. -
ఇంకా టైమ్ ఉంది!
హిందీ హీరో అక్షయ్‌కుమార్. అదేనండి.. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘2.0’లో విలన్‌గా చేశారు కదా ఆయనే. తన సినిమా ‘పాడ్‌మ్యాన్’ను జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అంతే... ‘2.0’ సినిమా రిలీజ్ లేట్ అవుతుందని, ఆ టైమ్‌కి ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మిస్తోన్న ‘కాలా’ రిలీజ్ అవుతుందని కథలు అల్లేసారు గాసిప్రాయుళ్ళు. ‘2.0’ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయనున్నట్లు లైకాప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దుబాయ్‌లో జరిగిన ఆడియో ఫంక్షన్లో కూడా ‘2.0’ చిత్రబృందం ముందుగా కన్ఫార్మ్ చేసిన రిలీజ్ డేట్ (జనవరి 25)ను మరోసారి ప్రకటించలేదు. అసలు విడుదల తేదీ ప్రస్తావనే లేదు. దీంతో ఇలాంటి రూమర్లుకు మరింత ఊపు వచ్చింది. ‘2.0’ ప్లేస్‌లో ‘కాలా కమింగ్’ అని కన్ఫార్మ్ చేశాయి చెన్నై ఫిల్మ్ సర్కిల్స్. అయితే ఈ విషయంపై ‘కాలా’ చిత్రబృందం స్పందించింది. ‘‘జనవరిలో ‘కాలా’ రిలీజ్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. సంక్రాంతి రేస్‌లో కూడా ‘కాలా’ లేడు’’ అని అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ధనుష్ అండ్ టీమ్. ఆ సంగతి పక్కన పెడితే... ‘2.0’ తర్వాతే ‘కాలా’అని రజనీ కూడా\ స్వయంగా చెప్పారట. దుబాయ్‌లో జరిగిన ‘2.0’ ఆడియో ఫంక్షన్లో పాల్గొని చెన్నై వస్తున్న రజనీకాంత్‌ను ఎయిర్‌పోర్ట్‌లో ‘కాలా’ గురించి కొంతమంది అడగ్గా... ‘2.0’నే ముందు రిలీజ్ అవుతుంది అన్నారట. అంటే ‘కాలా’ రావడానికి ఇంకాస్త టైమ్ ఉందన్నమాట. ఆ సంగతి వదలండప్పా... సింహం ఎప్పుడొచ్చినా సింహమే. -
అనుకోకుండా అలా కుదిరింది!
అభిమాన హీరో జస్ట్ నాలుగు నెలల గ్యాప్‌లో రెండు సార్లు స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్‌కి ఫెస్టివలే. సంక్రాంతి, ఉగాది, దీపావళి.. అన్ని పండగలూ ఒకేసారి వచ్చినట్లు అనిపిస్తుంది. వచ్చే ఏడాది జనవరి టు ఏప్రిల్ రజనీకాంత్ అభిమానులు ఆల్ ఫెస్టివల్స్ చేసుకునే చాన్స్ ఉంది. ఎందుకంటే సూపర్ స్టార్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.0’ వచ్చే జనవరి 25న విడుదల కానుంది. ఆ తర్వాత ఏప్రిల్‌లో రజనీ ‘కాలా’ విడుదల అవుతుందట. ఈ మధ్య ఏడాదికో సినిమా లేక రెండేళ్లకో సినిమాలో కనిపిస్తున్నారు రజనీ. ఇప్పుడిలా నాలుగు నెలల్లో రెండు సినిమాల్లో కనిపించడం అనేది ఫ్యాన్స్‌కి తీపి వార్తే కదా. ‘2.0’ గ్రాఫిక్స్‌కి ఎక్కువ టైమ్ పట్టడం, ఈలోపు రజనీ ‘కాలా’చేయడంతో ఇలా కుదిరింది. ‘2.0’ షూటింగ్ ఇటీవల చిత్రీకరించిన పాటతో పూర్తయిన విషయం తెలిసిందే. ‘కాలా’ ఆన్ సెట్స్‌లో ఉంది. ఇటీవలే నైట్ సీన్స్ తీశారు. రజనీ అల్లుడు, హీరో ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకుడు. -
సూర్యుడొచ్చాడా... అయితే గుడ్‌నైట్!
సూర్యుడు ఉదయించగానే ఎవరైనా ‘గుడ్ మార్నింగ్’ చెబుతారు. కానీ, హ్యూమా ఖురేషీ మాత్రం ‘గుడ్ నైట్’ అంటున్నారు. పదీ పదిహేను రోజులుగా ఇదే వరస. మేడమ్ తేడానేమో? కొంచెం తిక్క ఉందేమో అనుకుంటున్నారా? ఆ తిక్కకో లెక్కుంది. ఇంతకీ ఆ లెక్క ఏంటంటే, దాదాపు రెండు వారాలుగా ఆమె నైట్ షూట్స్ చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా రంజిత్.పా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాలా’. ఇందులో హ్యూమా కథానాయిక నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. నైట్ సీన్స్ తీస్తున్నారు. రాత్రంతా షూటింగ్ చేసి, ఉదయం ప్యాకప్ చెబుతున్నారు. అందుకే, నైట్ మేల్కొని, డేలో ‘గుడ్ నైట్’ చెప్పి నిద్రపోతున్నారు. ‘‘మా కెప్టెన్ భీమ్జీ (పా. రంజీత్)తో పాటు అందరం నైట్ షెడ్యూల్స్‌లో చాలా కష్టపడుతున్నాం. మిడ్నైట్ షూట్స్. ప్రతి రోజూ సూర్యోదయం తర్వాతే షూటింగ్‌కి ప్యాకప్ చెబుతున్నారు. సో.. నా స్లీప్ టైమ్ అంటే డే టైమే’’ అని హ్యూమా ఖురేషీ పేర్కొన్నారు.