రజనీ ప్రజాసంఘంలో హిజ్రాల విభాగం | Hijras division in rajinikanth party | Sakshi
Sakshi News home page

రజనీ ప్రజాసంఘంలో హిజ్రాల విభాగం

Published Tue, Feb 13 2018 8:27 AM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM

Hijras division in rajinikanth party - Sakshi

తమిళసినిమా: రజనీకాంత్‌ ఈ పేరు ఇప్పుడు సినీరంగంలోనూ, రాజకీయరంగంలోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయరంగ ప్రవేశాన్ని ధ్రువపరిచిన ఆయన ఆ దిశగా పావులను వేగంగా కదుపుతున్నారు. రజనీ అభిమాన సంఘాన్ని ప్రజా సంఘంగా మార్చారు. పలువురు అభిమానుల్ని నిర్వాహకులుగా నియమించారు. వారంతా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యుత్వ నమోదు పనిలో నిమగ్నమయ్యారు. కాగా రజనీకాంత్‌ ఏప్రిల్‌లో తన పార్టీ పేరును, గుర్తును వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పుడే పార్టీ విధి విధానాలను వెల్లడించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రజనీ చెన్నై, మాంబళంలో ఉన్న జిల్లా ప్రజాసంఘం యువభాగంలో బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేది కపై పలువురు రైతులకు సహాయకాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ త్వరలో రజనీ ప్రజాసంఘంలో హిజ్రాల విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

కాలా ఫైట్స్‌ లీక్‌..
రజనీ నటిస్తున్న కాలా చిత్రం తాజాగా సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ చిత్రంలోని పోరాట దృశ్యాలు కొన్నిప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చత్రాన్ని నటుడు, రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చిత్రాన్ని ఏప్రిల్‌ 27వ విడుదల చేమనున్నట్లు ధనుష్‌ ఇటీవలే ప్రకటించడంతో భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్‌ ఆఫ్‌ ది టాక్‌గా మారింది. ఆ తేదీకి ముందు, ఆ తరువాత కూడా ఇతర చిత్రాలను విడుదల చేయకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారని చెప్పవచ్చు. కాగా తాజాగా లీకైన ఈ చిత్ర ఫైట్‌ సన్నివేశాల్లో రజనీకాంత్‌పై విలన్‌ అనుచరుడొకడు ఇనుప రాడ్డుతో దాడి చేయడం, అతన్ని రజనీకాంత్‌ చితక బాదడం వంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. గతంలో రజనీకాంత్‌కు శివాజీ, లింగా లాంటి చిత్రాలకు ఇలాంటి షాక్‌ తగిలింది. ఆ మధ్య బాహుబలి చిత్రం ఈ లీకుల నుంచి తప్పించుకోలేకపోయింది. చిత్ర మిక్సింగ్, ఎడిటింగ్‌ కార్యక్రమాల సమయాల్లో ఇలాంటి లీకులు జరిగే అవకాశం ఉంటుంది. కాగా చిత్ర యూనిట్‌ వర్గాలే కావాలని ప్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి లీకులు చేస్తుంటారనే ఓ వర్గం లేకపోలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement