Hijras
-
హిజ్రా దారుణ హత్య
తూర్పు గోదావరి: జొన్నాడ బస్టాండ్ సమీపాన జాతీయ రహదారి పక్కన ఓ హిజ్రా దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన మరిపట్ల ఆనంద్ ఆలియాస్ ఆనంది (33) కొన్నేళ్లుగా ధవళేశ్వరంలో నివాసం ఉంటోంది. అమ్మానాన్నలను చూసేందుకు వెళ్తానంటూ ఆమె కొంత నగదుతో బయలుదేరినట్టు సహచర హిజ్రాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె జొన్నాడలోని 216ఎ జాతీయ రహదారి పక్కన పంట కాలువ డ్యామ్ సమీపాన పశువుల పాక చెంతన ఉన్న పంట కాలువలో శవమై కనిపించింది. ఆమెను పాశవికంగా హతమార్చిన దుండగులు ఆమె మృతదేహాన్ని పంట కాలువలో కుక్కేశారు. ఆనంది మృతదేహాన్ని గుర్తించిన స్థానిక రైతు సత్తి సత్యనారాయణరెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ నేతృత్వంలో రావులపాలెం సీఐ ఎన్.రజనీకుమార్, ఎస్సైలు ఎం.వెంకటరమణ, ఎస్.శివప్రసాద్‌లు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాకినాడ నుంచి వేలిముద్ర నిపుణుడు కె.ప్రవీణ్‌కుమార్ బృందాన్ని, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. తనిఖీలు చేయించి ఆధారాలు సేకరించారు. అక్కడ లభించిన ఆనవాళ్లను బట్టి హత్యకు ముందు తీవ్ర పెనుగులాట జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. హంతకులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్సై శివప్రసాద్ చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆనంది హత్య విషయం తెలియడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో హిజ్రాలు సంఘటన స్థలానికి తరలివచ్చారు. మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. పోలీసులకు అనుమానితుల పేర్లు అందించి, ఆ దిశగా విచారణ జరపాలని అభ్యర్థించారు. -
కూవాగంలో హిజ్రాల సందడి..
సాక్షి, చైన్నె: కూవాగంలో హిజ్రాల సందడి నెలకొంది. మిస్ కూవాగం పోటీలు హోరాహోరీగా మొదలయ్యాయి. మంగళవారం హిజ్రాల పెళ్లి సందడి ప్రారంభం కానుంది. వివరాలు.. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలందూరు పేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువు దీరిన కూత్తాండవర్ హిజ్రాలకు ఆరాధ్యుడనే విషయం తెలిసిందే. ఈ ఆలయంలో గత నెలాఖరు నుంచి చైత్రమాసం(చిత్తిరై) ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి అత్యంత వేడుకగా మంగళవారం జరగనుంది. ఈ వేడుకల కోసం హిజ్రాలు కూవాగం వైపుగా పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి సైతం ఇక్కడకు తరలి వస్తున్నారు. ఫలితంగా విల్లుపురం, ఉలందూరు పేట పరిసరాల్లోని లాడ్జీలు గెస్ట్‌హౌస్‌లు పూర్తిగా నిండిపోయాయి. అందగత్తెలకు తామేమీ తక్కువ కాదన్నట్టుగా సింగారించుకుని హిజ్రాలు రోడ్ల మీద ప్రత్యక్షం కావడంతో వారిని చూసేందుకు యువకులు ఎగబడుతున్నారు. సోమవారం స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో జరిగిన మిస్ కూవాగం పోటీలలో సేలంకు చెందిన ప్రతీశివం, చైన్నెకు చెందిన వైషు, తూత్తుకుడికి చెందిన బ్యూలాలు తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. సాయంత్రం నుంచి ఉత్సవాల్లో భాగంగా హిజ్రాలకు ఫ్యాషన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్ముడి, ఉదయ నిధి స్టాలిన్ , సినీ నటి వరలక్ష్మీ తదితరులు హాజరయ్యారు. ఇక, హిజ్రాల పెళ్లి సందడి మహోత్సవం కోసం కూవాగం గ్రామం ముస్తాబైంది. -
AP: హిజ్రాల కోసం ట్రాన్స్‌జెండర్ పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హిజ్రాల మేలు కోసం ట్రాన్స్‌జెండర్ పాలసీని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇప్పటికే హిజ్రాలకు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం ప్రత్యేకంగా వారికోసం మరిన్ని చర్యలు చేపట్టనుంది. ట్రాన్స్జెండర్లకు సరైన విద్య, వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారు నివసించే ప్రాంతాల్లో అందిరి మాదిరిగానే మంచినీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు కల్పిస్తోంది. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఆర్థిక సహాయాలు అందిస్తోంది. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి సాధికారత సాధించేలా తోడ్పాటు అందించనుంది. మొత్తంగా వారికి సామాజిక భద్రత కల్పించేలా ప్రభుత్వం పాలసీ అమలు చేస్తుంది. రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు జారీచేయనుంది. ట్రాన్స్‌జెండర్స్ హక్కులను కాపాడటంతోపాటు వారి సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వ ప్రస్తుత (2022–23) బడ్జెట్లో రూ.2 కోట్లు కేటాయించడం విశేషం. చదవండి: Heart Attack: టీకాల వల్లే యువత గుండెకు ముప్పు! -
పెళ్లిలో రెచ్చిపోతున్న హిజ్రాలు.. డబ్బులు ఇవ్వకుంటే అసభ్యకర ప్రదర్శనలు
రెండు రోజుల కిందట కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నగరానికి చెందిన ఓ పెద్ద వ్యాపారి కొడుకు వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. ఫంక్షన్‌హాల్ లోపలికి వెళ్లి వేదికపైకి వచ్చారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. డబ్బులివ్వాలంటూ అసభ్య పదజాలం వాడారు. దీంతో పెళ్లి కుమారుడి తండ్రి రూ.5 వేలు ఇచ్చాడు. ‘మాకు అవి సరిపోవు. రూ.50 వేలు కావాలి. అవి ఇస్తేనే ఇక్కడ నుంచి వెళ్లి పోతాం’ అని వీరంగం స్పష్టించారు. ఎంత చెప్పినా వినకుండా పెళ్లి మండపంపైనే కూర్చున్నారు. చేసేది ఏమీ లేక వధువు వరుడు తరఫున రూ.50 వేలు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. ఇలా ఒక్క కరీంనగర్‌లోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోని అన్ని ఫంక్షన్ హాళ్లలో హిజ్రాలు ఇలానే హల్చల్ చేస్తున్నారు. ఒక్కో పెళ్లికి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ సమీప మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ బంధువు వివాహం జరిగింది. రాత్రి బరాత్ జరుగుతున్న సమయంలో కొందరు హిజ్రాలు వచ్చి వీరంగం సృష్టించారు. పెళ్లి కుమారుడిని డబ్బులు డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో రెచ్చిపోయి నగ్నంగా డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడున్న వారు పారిపోయారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ముందు హేళన కావొద్దని అడిగినంత ముట్టజెప్పారు. తిమ్మాపూర్(మానకొండూర్): పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక. దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరుపుకోవాలని అనుకుంటారు. కానీ.. ఈ మధ్య హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అందరూ జంకుతున్నారు. దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు కొంతమంది ట్రాన్స్జెండర్లు ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తూ, దౌర్జన్యంగా వేలకు వేలు డబ్బులు గుంజుతున్న సంఘటనలు దృష్టికి వస్తున్నాయి. ఎవరైనా చనిపోయిన సందర్భంలో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండగా శ్మశాన వాటిక వద్దకు కూడా చేరిపోయి.. వదిలిపెట్టడం లేదు. వేలకు వేలు డబ్బులు గుంజుతున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికైనా వారు తమ వైఖరి మార్చుకోవాలి. లేని ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే డయల్ 100 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలియజేయాలి. ఐదు నిమిషాల్లో దగ్గరలో ఉన్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది, పెట్రో కార్ సిబ్బంది చేరుకునేలా చర్యలు తీసుకుంటాం. జీవనోపాధి కోసం గౌరవంగా ఉండే ఏదైనా వృత్తిని.. లేక చిన్నచిన్న పనులు చేసుకొని జీవించాలి . ఇటీవల వారికి బ్యాంక్ రుణాలు కూడా మంజూరయాయి. వాహనాలు నడుపుకునేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా ఇచ్చారు. – ఎల్.సుబ్బారాయుడు, పోలీస్ కమిషనర్ -
ట్రైన్లో గర్భిణీకి పురిటి నొప్పులు.. ప్రసవం చేసిన హిజ్రాలు..
రోజూ బస్టాండ్, రైల్వే స్టేషన్, ట్రాఫిక్ కూడళ్ల వద్ద అనేక మంది హిజ్రాలు(ట్రాన్స్‌జెండర్స్్) తారసపడుతుంటారు. వారిని చూసినప్పుడు చాలా మంది అసహ్యించుకుంటూ దూరంగా వెళ్తుంటారు. చాలా వరకు హిజ్రాలు జనాలను ముఖ్యంగా అబ్బాయిలను వేధించి మరీ డబ్బులు లాక్కుంటారు. ఇవ్వకుంటే దౌర్జన్యానికి పాల్పడుతుంటారు. కానీ అందరూ ఒకేలా ఉండరు. వారిలో మంచివారు కూడా ఉంటారు. అంతేగాక హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని నమ్మేవారూ లేకపోలేదు. అంటే హిజ్రాలు ప్రవర్తించే తీరును బట్టే వారిని చూసే కోణం మారుతుంటుంది. తాజాగా ట్రాన్స్జెండర్లు ఓ మంచి పని చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ట్రైన్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు హిజ్రాల బృందం ప్రసవం చేసి ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. షేక్‌పనురా జిల్లాకు చెందిన ఓ గర్భిణి తన భర్తతో కలిసి హౌరా నుంచి లఖిసరాయ్‌కు హల్వారా-పాట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తోంది. రైలు జాసిదిహ్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన వెంటనే మహిళకు పురిటి నొప్పులు రావడం ప్రారంభించాయి. గర్భిణి నొప్పులతో అవస్థలు పడుతున్న భార్య పరిస్థితిని గమనించిన భర్త.. సాయం కోసం కోచ్‌లోని ఇతర మహిళలను ప్రదేయపడ్డాడు. అయితే ప్రవస వేదనతో బాధపడుతున్న మహిళకు సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. సమయం గస్తున్న కొద్దీ బాధితురాలి పరిస్థితి మరింత క్షీణించడం ప్రారంభించింది. ఇంతలో అదే సమయానికి అటుగా వెళ్తున్న కొంతమంది హిజ్రాలు గర్భిణీ పరిస్థితిని చూసి స్పందించారు. వెంటనే గర్భిణీని రైలులోని విశ్రాంతి గదిలోకి తీసుకెళ్లారు. అక్కడే ఆమెకు ప్రసవం చేశారు. సదరు మహిల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కోచ్‌లోని ప్రతి ఒక్కరూ హిజ్రాలను అభినందించారు. చదవండి: విక్రమార్కుడు.. రత్న ప్రభాకరన్..104 సార్లు ఫెయిల్..105వ సారి శభాష్ అనిపించుకున్నాడు -
బంజారాహిల్స్ పీఎస్ ఎదుట హిజ్రాల హంగామా.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట హంగామా సృష్టించిన 20 మందికిపైగా హిజ్రాలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లోని ఇందిరానగర్‌కు చెందిన సోనా రాథోడ్ బృందానికి, ఐడీపీఎల్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన మోనాలిసా టీం మధ్య కొద్ది రోజులుగా ఆధిపత్య గొడవలు జరుగుతున్నాయి. సోనా రాథోడ్ టీంపై మోనాలిసా దౌర్జన్యానికి పాల్పడుతుండటంతో చర్యలు తీసుకోవాలంటూ వారు ఆదివారం బంజారాహిల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతోపాటు కిరోసిన్ మీద పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు సోనా రాథోడ్‌తోపాటు స్వీటి, చందుబాయి, జోయ, రోషిని, వైశాలి, లక్కీ, పుష్ప తదితర 20 మందికిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ పోలీసులు పరారీలో ఉన్న హిజ్రాలను పట్టుకొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో వారికోసం గాలించి పది మంది హిజ్రాలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో రోజా, వసు, హిమ, అన్షు, నందు, లక్ష్మి, వైష్ణవి, స్పందన, జోయ, రియా ఉన్నారు. ప్రధాన నిందితురాలు సోనా రాథోడ్, బుల్బుల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. Extortion in Hyderabad: Third gender groups fight over who is original and who is fake and stage dharna infront of Banjara Hills police. Extortion of money by such groups increases a lot in Hyderabad.#Hyderabad #Thirdgender pic.twitter.com/OiJP1z1bYz — Sudhakar Udumula (@sudhakarudumula) December 26, 2022 కాగా గత కొద్ది కాలంగా హిజ్రాల తీరుపై పోలీసులకు పలు ఫిర్యాదులు అందుతున్నాయి. కూడళ్లతోపాటు ఏదైనా ఫంక్షన్ జరిగినా, షాప్ ఓపెనింగ్ జరిగినా అక్కడికి వచ్చి వాలుతున్నారని ఫిర్యాదులు అందడం, ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలా వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు హిజ్రాలతోపాటు వారికి సహకరిస్తున్న ఇద్దరు ఆటోవాలాలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా హిజ్రాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఒకరిపై ఒకరు దాడులకు దిగడం, పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం తలెత్తింది. చదవండి: నడిరోడ్డుపై మహిళ ప్రసవం.. మహబూబ్‌నగర్‌లో హృదయవిదారక ఘటన -
హిజ్రాల వేధింపులతో బాలిక ఆత్మహత్య
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): తీసుకున్న అప్పు తీర్చలేదని హిజ్రాలు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెంది బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. తంబి దాసు, పద్మ దంపతులు. నగరంలోని ఒక హోటల్లో పనిచేసుకుంటూ ఇద్దరు కూతుళ్లతో కలసి డీమార్టు వెనుక, బావాజీపేట 2వ లైన్లో నివాసముంటున్నారు. పెద్ద కూతురు ల్యాబ్‌లో పనిచేస్తుండగా రెండవ కుమార్తె తంబి అనురాధ (18) నగరంలోని ఒక కళాశాలలో ఇంటర్ చదువుకుంటుంది. ఇటీవల ఇంటి అవసరాల మేరకు కుటుంబసభ్యులు తమకు తెలిసిన ఒక హిజ్రా వద్ద రూ.10 వేలు అప్పుగా తీసుకున్నారు. సకాలంలో అప్పు తీర్చకపోవడంతో సోమవారం రాత్రి కొంతమంది హిజ్రాలు వారి ఇంటి ముందుకు చేరి అసభ్యకరంగా దూషణలకు దిగారు. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన అనురాధ మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 11.30 గంటల సమయంలో బాలిక అమ్మమ్మ కొమ్మూరి నరసమ్మ కూరగాయలు ఇచ్చేందుకు ఇంటికి వచ్చి చూడగా బాలిక ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి స్థానికుల సాయంతో లోపలికి కిందికి దింపి ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీనిపై ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా.. -
హిజ్రాలను టార్గెట్ చేసిన 10 మంది యువకులు.. మూడు నెలలుగా..
తాళ్లరేవు(తూర్పుగోదావరి): యానాంలో తమపై దాడికి పాల్పడడంతో పాటు చంపుతామని బెదిరించిన యువకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ హిజ్రాలు శనివారం కోరంగి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. సుమారు 100 మందికి పైగా హిజ్రాలు జాతీయ రహదారి 216లో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. సుమారు అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం తాము పట్టి ఇచ్చిన నిందితులను వదిలేస్తారా అంటూ పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. స్టేషన్లోకి ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డంగా కూర్చోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చదవండి: వేరే మహిళలతో భర్త వివాహేతర సంబంధం.. భార్య షాకింగ్ నిర్ణయం ఎస్సై టి.శివకుమార్ ముగ్గురు యువకులపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో హిజ్రాలు శాంతించారు. అయితే కేసు నమోదు చేసేవరకూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని చెప్పడంతో అదనపు బలగాలను రప్పించారు. ఈ సందర్భంగా బాధిత హిజ్రాలు ఐశ్వర్య, లిథియా తదితరులు విలేకర్లతో మాట్లాడుతూ పొట్టకూటి కోసం యానాం ప్రాంతంలో సంచరిస్తున్న తమపై పది మంది యువకులు మూడు నెలలుగా మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. ఆపరేషన్ చేయించుకున్న ఒకామెపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నందుకు కర్రలు, కత్తులతో దాడిచేసి గాయపరచడంతో పాటు తమ వద్ద సెల్ఫోన్లు, మనీపర్స్‌లు కూడా లాక్కుని వెళ్లారని ఆరోపించారు. హిజ్రాలపై దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి యానాంకు చెందిన కొల్లు మరిడయ్య, ఆకుల సాయిప్రసాద్, మొగలి నానిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. -
హిజ్రాలతో చీకటి ప్రదేశానికి వెళ్లిన వంటమాస్టర్.. చివరికి ట్విస్ట్
తిరువొత్తియూరు(తమిళనాడు): పుదుకొట్టై జిల్లాలో ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సంబంధించి ఐదుగురు హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పుదుకొట్టై జిల్లా పొన్‌అమరావతి ఆలవాయిల్ ప్రాంతానికి చెందిన ధర్మలింగం (45) తుడియలూర్ బస్‌స్టాప్ సమీపంలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. 8వ తేదీ తీవ్రగాయాలతో కోవై ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో తొమ్మిదో తేదీ రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ ధర్మలింగం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో చొక్కలింగం కడుపుపై దాడిచేయడంతో మృతి చెందినట్లు తేలింది. దీంతో పెరియనాయకన్ పాలయం డీఎస్పీ రాజపాండియన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో హిజ్రాలు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. సంఘటన జరిగిన రోజున రాత్రి తుడియలూర్ సమీపంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న హిజ్రాల్లో ఒకరు ధర్మలింగంను ఉల్లాసం కోసం చీకటి ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాగ్వాదం జరగడంతో మరో నలుగురు హిజ్రాలు అక్కడికి చేరుకుని అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ధర్మలింగం చికి త్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు.. గౌండంపాళ్యం మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన హిజ్రాలు రషి్మక (26), అరునిక (24), గౌతమి (20), రూబి (26), మమత (22)ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
హైదరాబాద్: పెళ్లి సందడిలో హిజ్రాల హల్చల్
సాక్షి, బంజారాహిల్స్: పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న ఓ ఇంటికి వచ్చిన హిజ్రాలతో పాటు వారి వెంట వచ్చిన ఆటో డ్రైవర్ బెదిరింపులకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న బి.సురేష్‌కుమార్ మేన కోడలు వివాహం ఈ నెల 13న జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో రాత్రి 8.30 గంటలకు నలుగురు హిజ్రాలు ఓ ఆటోలో ఆ ఇంటికి వచ్చారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రూ. 4 వేలు ఇచ్చారు. అయినా సంతృప్తి చెందకుండా రూ. 40 వేలు కావాలంటూ నానా హంగామా చేశారు. దీంతో ఇంటి యజమానులు వారిని బయటికి వెళ్లిపోవాలని చెప్పారు. వారితో పాటు వచ్చిన ఆటో డ్రైవర్ షేక్ అజీజ్ ఓ కత్తి తీసుకొచ్చి ఇంటి సభ్యులను బెదిరించాడు. మీ ఇంటిని గుర్తు పెట్టుకుంటామని తర్వాత వచ్చి అంతు చూస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మేరకు బాధితుడు సురేష్‌కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆటో డ్రైవర్ అజీజ్‌తో పాటు నలుగురు హిజ్రాలపై ఐపీసీ సెక్షన్ 386, 506తో పాటు ఆరŠమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్.. ‘వన్ ప్లస్’తో చిక్కాడు! -
సినిమాను తలపించే రీతిలో.. హిజ్రాల గ్యాంగ్‌వార్
అనంతపురం క్రైం: హిజ్రాలు రెడ్డెక్కారు. ఆధిపత్య పోరులో ప్రాంతాల వారీగా విడిపోయి దాడులకు తెగబడ్డారు. ఇందులో అనంతపురానికి చెందిన ఒకరు తీవ్రంగా గాయపడగా... దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ గురువారం కలెక్టరేట్ వద్ద హిజ్రాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. టూటౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపిన వివరాల మేరకు.. అనంతపురంలోని జయమణెమ్మ కళ్యాణమంటపంలో మన విజయం ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ మయూరి ఆధ్వర్యంలో ఈ నెల 28న హిజ్రాలు ఉలిగమ్మ ఉత్సవం నిర్వహించారు. వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, బళ్లారి ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది హిజ్రా లతో పాటు హైదరాబాద్, కర్ణాటక నుంచి 120 మంది హాజరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన సునితా నాయక్ అలియాస్ అక్తార్‌భాను ఆధ్వర్యంలో నడిచే సంఘానికి ఇకపై డబ్బులు చెల్లించకూడదని కర్ణాటక, ఏపీకి చెందిన హిజ్రాలు నిర్ణయించగా, హైదరాబాద్ హిజ్రాలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే మాటామాట పెరగడంతో వాదన చేసుకున్నారు. ఉత్సవం అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు హైదరాబాద్, కర్ణాటకకు చెందిన ఆశా, వీనా, ఆర్థన, గీతమ్మ తదితరులు అర్ధరాత్రి వేళ అనంతపురం శివారులోని తపోవనం వద్దకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు వాదులాట జరగ్గా... అనంతపురం హిజ్రా రుక్సానా అలియాస్ శర్మాస్‌పై వారంతా దాడి చేశారు. దీనికి నిరసనగా గురువారం కలెక్టరేట్ ముందు పలువురు హిజ్రాలు ఆందోళన చేపట్టారు. బంగారం, డబ్బులు లాక్కున్నారని, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వన్‌టౌన్ సీఐ ప్రతాప్ రెడ్డి, టూటౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ హిజ్రాలతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆధిపత్య పోరుతోనే సమస్య తలెత్తిందని, విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
ఆ జంక్షన్ హిజ్రాల అడ్డా..సిగ్నల్ పడితే హడలే..
సాక్షి,రాజమహేంద్రరం రూరల్: నగరంలోని జంక్షన్లలో హిజ్రాలు హల్చల్ చేస్తున్నారు. కొందరు ఎటువంటి మాస్కు ధరించకుండా నగదు వసూలు చేయడంతో వాహన చోదకులు బెంబేలెత్తిపోతున్నారు. రెండు నెలలుగా మోరంపూడి జంక్షన్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాజమహేంద్రవరంలో అతిపెద్దది మోరంపూడి జంక్షన్. ఇక్కడ అధికంగా నగదు వస్తుందన్న అంచనాతో హిజ్రాలు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇందులో సగం మంది ఎటువంటి మాస్కులు ధరించకుండా నగదు వసూలు చేస్తున్నారు. సిగ్నల్ పడినప్పుడు ఎక్కువ వాహనాలు ఆగుతాయి. ఆ సమయంలో నాలుగు వైపుల నుంచి హిజ్రాలు వచ్చి వాహన చోదకులను నగదు డిమాండ్ చేస్తున్నారు. కారులు, లారీలు, ఇతర వాహన చోదకుల నుంచి రూ.10 తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా వల్ల జాతరలు, ఇతర కార్యక్రమాలు లేకపోవడంతో జంక్షన్లలో నగదు వసూలు చేస్తున్నారన్న మానవతా దృక్పథంతో వాహన చోదకులు సైతం ఎంతో కొంత ఇస్తున్నారు. వీరితో పాటు భిక్షాటన చేసే చిన్నపిల్లలతో తల్లులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ వస్తువులు అమ్మకందారులతో జంక్షన్లో రద్దీగా ఉంటోంది. అన్నీ జంక్షన్లలోనూ.. మోరంపూడి జంక్షన్‌తో పాటు నగరంలోని ఇతర ముఖ్యకూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద హిజ్రాల నగదు వసూలు కొనసాగుతూనే ఉంది. ఇటీవల తాడితోట జంక్షన్లో హిజ్రాలను చెదరగొట్టే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌పై తిరగబడ్డారు. జంక్షన్లలో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సిగ్నల్‌ను చూసుకోవాలో, హిజ్రాల నుంచి తప్పించుకోవాలో తెలియక కంగారు పడుతున్నారు. కుటుంబంతో కలిసి మోటారుసైకిల్‌పై వచ్చిన వారిని కూడా వదలడం లేదు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్య నుంచి రక్షించాలని వాహనచోదకులు కోరుతున్నారు. -
రెచ్చిపోయిన హిజ్రాలు, బాలుడిపైనా ప్రతాపం
బత్తలపల్లి/అనంతపురం: హిజ్రాలు రెచ్చిపోయారు. ప్రధాన రహదారిపై భిక్షమెత్తుకుంటూ తాము అడిగిన మేరకు డబ్బు ఇవ్వని ప్రయాణికులపై దాడికి తెగబడ్డారు. ఫలితంగా పలువురు రక్తగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం సాయంత్రం బత్తలపల్లి మండలం పోట్లమర్రి సమీపంలో కొందరు హిజ్రాలు వాహనాలను ఆపి బలవంతంగా డబ్బు వసూలు చేయసాగారు. అదే సమయంలో నార్పల మండలం బొందలవాడ నుంచి పెళ్లి బృందంతో బొలెరో వాహనం వచ్చింది. దాన్ని ఆపి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. ఇచ్చిన మేరకు తీసుకునేందుకు హిజ్రాలు ససేమిరా అన్నారు. అంతటితో ఆగకుండా రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఘటనలో పెళ్లి బృందంలోని బయన్న, ఈశ్వరమ్మ, ఆంజనేయులు, రామాంజినమ్మ, ఆదెమ్మ, సింహాద్రి, శివయ్య, బాలుడు చిన్న గాయపడ్డారు. అతి కష్టంపై బయటపడిన పెళ్లి బృందం.. బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. తర్వాత గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. హిజ్రాల దాడిలో గాయపడిన చిన్నా ఇంతలో పోట్లమర్రికి చేరుకున్న హిజ్రాలు వివస్త్రలుగా మారి రోడ్డుపై పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని పంపించి వేశారు. అనంతరం బత్తలపల్లికి చేరుకున్న హిజ్రాలు మద్యం మత్తులో వివస్త్రలుగా మారి కూడలిలో నిలబడి అసభ్యపదజాలంతో దూషణలు మొదలుపెట్టారు. దీంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాశి, లావణ్య, మురళి, దుర్గ, శ్యామలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
హిజ్రాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్
సాక్షి బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో హిజ్రాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర సర్కార్ తెలిపింది. హిజ్రాలకు రిజర్వేషన్ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సంగమ స్వయం సేవా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది విజయకుమార్ పాటిల్ తన వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలానుసారం అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం పోస్టులను హిజ్రాలకు కేటాయించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కర్ణాటక పౌరసేవా నియామక చట్టం–1977 సెక్షన్ 9ని సవరించినట్లు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే రెండు నోటిఫికేషన్లను కూడా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ నోటిఫికేషన్లపై అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 20కు వాయిదా వేసింది. చదవండి: ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించండి -
పెళ్లింట్లో అసభ్య ప్రవర్తన, హిజ్రాల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా బలవంతంగా డబ్బులు వసూలు చేసిన హిజ్రాలు వారికి సహకరించిన ఆటో డ్రైవర్లను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతినగర్ ఆర్.కె.లేఅవుట్‌కు చెందిన ప్రేవేటు ఉద్యోగి పంచాంగం చలపతి ఈనెల 24న తన కుమారుడి వివాహం జరిపించాడు. 25న ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసే క్రమంలో 8 మంది హిజ్రాలు ఆయన ఇంటికి వచ్చి రూ.20 వేలు డబ్బులు డిమాండ్ చేశారు. అసభ్యకరంగా ప్రవర్తించారు. భయపడిన చలపతి కుటుబ సభ్యులు వారికి రూ.16,500 ఇవ్వడంతో వెళ్లిపోయారు. ఈ విషయంపై బాధితుడు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు ప్రగతినగర్ ఎలీప్ చౌరస్తాలో టీఎస్15 యూడీ 0298 ఆటోలో వెళ్తున్న 8 మంది హిజ్రాలను, ఆటో డ్రైవర్లు కరణ్ గుప్త, మొహమ్మద్ మాసీలను అరెస్టు చేశారు. ఈ విషయమై మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అమాయకులను వేధించే ట్రాన్స్జెండర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే డయల్ 100కు ఫోన్ చేయాలని, లేదా వాట్సాప్ నెంబర్ 94906 17444కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
నకిలీ హిజ్రా జుట్టు కత్తిరించారు..
-
నకిలీ హిజ్రా జుట్టు కత్తిరించారు..
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని హుజూర్ నగర్లో హిజ్రా వేషంలో తిరుగుతున్న ఓ వ్యక్తికి స్థానిక హిజ్రాలు దేహశుద్ది చేశారు. హుజుర్ నగర్ పట్టణంలో పొట్టి శ్రీరాములు సెంటర్ సమీపంలో అతని జుట్టు కత్తిరించి ఊరేగింపు చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. బిహార్ నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు మహిళా వేషం వేసుకొని స్థానికంగా ఉన్న తమను కత్తులతో చంపుతామని బెదిరిస్తున్నారని హిజ్రాలు పోలీసులకు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, ఇక్కడ హిజ్రాల వేషం వేసుకొని తిరుగుతున్నారని, అలాంటి వారు ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడితే ఆ నింద తమ సమాజంపై పడే అవకాశం ఉందని హిజ్రాలు వాపోయారు. అందుకే ఆ వ్యక్తిని దేహశుద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
మానవతా వజ్రాలు
సాక్షి కడప : కరోనా లాక్డౌన్ సమయంలో ఆకలితో అ లమటిస్తున్న పేదలకు కడపకు చెందిన ట్రాన్స్‌జెండర్స్(హిజ్రాలు) అండగా నిలుస్తున్నారు. పెద్ద మనసు చాటుకుంటున్నారు. రాయలసీమ ట్రాన్స్‌జెండర్స్ అ సోసియేషన్ అధ్యక్షురాలు హాసిని ఆధ్వర్యంలో వీరంతా రోజూ ఆహార వితరణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. కడపతోపాటు కమలాపురం, ఇతర ప్రాంతాల్లో యాచకులు, నిరుపేదలకు ట్రాన్స్‌జెండర్స్‌కు వీరు ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ఒక రోజు బిర్యానీ ప్యాకెట్లు, మరొకరోజు ఎగ్ రైస్, ఇంకో రోజు వెజిటబుల్ రైస్, ఉడకబెట్టిన గుడ్లతో కూడిన పౌ ష్ఠికాహారాన్ని అందిస్తున్నారు. కడపలోని అల్లూరి సీతా రామరాజునగర్‌లో సుమారు 30 మంది ట్రాన్స్‌జెండ ర్స్ స్వయంగా వండుతున్నారు. రెండు ఆటోల ద్వారా మరియాపురం, ఐటీఐ, ఆరోగ్యమాత చర్చి, ఎర్రముక్కపల్లె, ఆర్టీసీ బస్టాండు, కోటిరెడ్డిసర్కిల్, పాతబస్టాండు, పాత కలెక్టరేట్, పాత రిమ్స్, వినాయకనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న పేదలు, యాచకులు, అనాథలకు అందజేస్తూ వస్తున్నారు. ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి 250 నుంచి 300 ప్యాకెట్లు తయారు చేసి అందిస్తూ వస్తున్నారు. ఆకలి బాధ తెలుసు ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు. అందుకే కష్టసమయమైనా ముందుకు వచ్చాం. మావంతు సహాయంగా ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరికీ అందిస్తూ ఆకలిని తీరుస్తున్నాం. – హాసిని, రాయలసీమ ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, కడప అన్నదానం గొప్పది అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు. అందుకే మా వద్ద దాచుకున్న సొమ్మును పేదల కోసం వినియోగిస్తున్నాం. విపత్కర పరిస్థితుల్లో వారిందరి ఆకలి తీర్చడమే మా బాధ్యత. అందుకోసం మరింత కష్టపడుతాం. – అన్యన్య, కడప హాసిని అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు, కడప -
మేము సైతం అంటున్న హిజ్రాలు
తమిళనాడు, కోరుక్కుపెట: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు మేము సైతం అంటూ ముందుకొచ్చారు హిజ్రాలు. దాతల సహకారంతో హిజ్రాల సంక్షేమ సంఘ సభ్యులు తమ ట్రస్ట్ తరఫున 140 మందికి నిత్యావసర సరుకులు ఇచ్చారు. ట్రాన్స్జెండర్ల విద్య, ఉపాధి, సాధికారత కోసం పనిచేసే బోర్న్ టు విన్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సి.స్వేత మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల సహాయంతో, ఆమె 140 మందికి నిత్యావసర వస్తువులు అందించారు. బిల ట్రాన్స్‌జెండర్ రైట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆర్.జీవా పాల్గొన్నారు. అలాగే ఆర్మీ సిబ్బంది సైతం రోడ్డు పక్కన ఉన్న పేదలకు ఆహారాన్ని అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. -
దారుణం: హిజ్రాలకు కరోనాతో ముడిపెట్టారు!
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నకొందరు ఆకతాయిల ఉదంతం మరువకముందే.. హైదరాబాద్‌లో మరో పిచ్చి ప్రచారం మొదలైంది. హిజ్రాలతో మాట్లాడినా.. సన్నిహితంగా ఉన్నా కరోనా వైరస్ సోకుందనే పోస్టర్లు కొన్ని చోట్ల వెలిశాయి. ‘కొజ్జాలు, హిజ్రాలను దుకాణాల వద్దకు రానివ్వకండి.. వారిని తరిమి కొట్టండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి’అని అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద పోస్టర్లు బయటపడటంతో కలకలం రేగింది. ట్రాన్స్జెండర్లపై వివక్ష, ఫేక్ న్యూస్, హింసను ప్రేరేపిస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్జెండర్ల కార్యకర్త మీరా సంఘమిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: కరోనా : ఈశాన్య విద్యార్థులపై జాతి వివక్ష) అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద వెలిసిన ఆయా పోస్టర్లను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఇప్పటికే సమాజానికి దూరంగా బతుకుతున్నామని, తామూ మనుషులమేనని గుర్తించాలని క్రుంగిపోతున్న హిజ్రాలకు ఇదో ఇబ్బందికర పరిస్థితి తెచ్చినట్టయింది. ఇదిలాఉండగా.. కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులపై ప్రాంతీయ వివక్ష వెలుగుచూసింది. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను సూపర్ మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దేశా రాజధాని ఢిల్లీలో సైతం.. మణిపురికి చెందిన ఓ అమ్మాయిని ఒకడు ‘కరోనా’అని పిలిచి అవమానించాడు. #Transphobic Posters at Ameerpet Metro Station reads: “Warning: Do not allow Kojja, Hijras near the shops. If you talk to them or have sex with them, you will be infected with #CoronaVirus. Beat & drive them away or call 100 immediately. Save people from Corona Virus Hijras". pic.twitter.com/21HP5YBDSp — Meera Sanghamitra (@meeracomposes) March 29, 2020 (చదవండి: పెళ్లి పేరుతో మోసం చేశాడు..) (చదవండి: లాక్‌డౌన్‌ను పొడిగించం: కేంద్రం) -
యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాల బీభత్సం
కర్ణాటక, గుంతకల్లు: బెంగళూరు యశ్వంతపూర్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం మధ్యాహ్నం కొందరు ప్రయాణికులపై హిజ్రాలు దాడి చేశారు. ప్రయానికుల నుంచి డబ్బులు లాక్కోవడంతో పాటు టికెట్లు చించివేసి భయబ్రాంతులకు గురి చేశారు. వివరాలు.. యశ్వంతపూర్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ధర్మవరం చేరిన తరువాత కొందరు హిజ్రాలు ఎక్కారు. రైలు కల్లూరు స్టేషన్ దాటిన తరువాత పెన్నానది వంతెనపై ఎస్–3 నుంచి ఎస్–6 బోగీల్లోని చొరబడి సుమారు 15 మంది హిజ్రాలు బీభత్సం సృష్టించారు. కొందరి నుంచి అందినకాడికి డబ్బు లాక్కుతున్నారు. డబ్బులు ఇవ్వనందుకు కొందరి టికెట్లను చించివేశారు. తీరిగ్గా చైను లాగి దిగి వెళ్లిపోయారు. గుంతకల్లులో ప్రయాణికుల ధర్నా ఈ విషయంపై కొందరు బాధితులు ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారమందించారు. ఈ రైలు గుంతకల్లు జంక్షన్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంది. హిజ్రాల దాడిలో జేబులు ఖాళీ అయిన ప్రయాణికులంతా ప్లాట్‌ఫారంపై బైఠాయించి రైలును ముందుకు కదలనివ్వకుండా అరగంటకుపైగా ఆందోళన చేశారు. తక్షణం హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న ఆర్పీఎఫ్ ఎస్ఐ సాయిప్రసాద్, ఏఎస్ఐ ఆనందప్పలు ప్రయాణికులకు సర్దిచెప్పి రైలు ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. -
హిజ్రాల ఆగడాలు.. ఇళ్ల ముందు అసభ్యకర వస్తువులు
ఫిలింనగర్: ఫిలింనగర్‌లోని గౌతంనగర్ బస్తీలో కొందరు హిజ్రాలు అద్దెకుంటున్నారని వీరి ఆగడాలతో తమకు కంటిమీద కునుకు లేకుండా పోతోందని, అరుపులు కేకలతో న్యూసెన్స్ చేస్తున్నారని దీనిపై ప్రశ్నిస్తే తమపై దాడులకు దిగుతున్నారని బస్తీకి చెందిన ఎం. చంద్రకళ అనే మహిళతో పాటు పలువురు ఆదివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తమ ఇళ్ల తలుపులు బాదుతున్నారని, తెరవకపోతే ఇళ్ల ముందు అసభ్యకర వస్తువులను పడేస్తున్నారని చిన్న పిల్లలు వీరిని చూసి భయపడుతున్నారని ఆరోపించారు. వీరి ఆగడాలను నియంత్రించాలని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నాంపల్లిలో భయం..భయం..
నాంపల్లి: హైదరాబాదు రైల్వే స్టేషన్ ఎదుట పోకిరీల బెడద ఎక్కువైపోంది. నానాటికి వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అటు సందర్శకులను ఇటు పోలీసులను బెంబేలెత్తిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్, పబ్లిక్‌గార్డెన్ గేటును అడ్డాగా చేసుకుని జీవిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నిలోఫర్ ఆసుపత్రి వద్ద దాతలు వడ్డించే భోజనాలు స్వీకరిస్తారు. భోజనాలు ఆరగించిన పోకిరీలు నాంపల్లి సరాయికి చేరుకుంటారు. అక్కడే చెట్ల కింద సేదతీరుతూ వచ్చి పోయే వారిని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. సరాయి పక్కనే ఉండే మోతి వైన్స్ దగ్గర ప్రయాణికుల జేబులు, ఎండ వేడిమికి చెట్ల కింద సేదతీరే సందర్శకుల జేబులను కొట్టేస్తుంటారు. ఇలా కొట్టేసిన డబ్బు పంచుకునే క్రమంలో విభేదాలు వచ్చి హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతారు. గడచిన ఏడాది కాలంలో మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు జరిగాయి. హత్యలు చేసిన పోకిరీలు పరావుతుంటారు. పరారైన వారిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక రాత్రి వేళల్లో ట్యాక్సీ స్టాండ్ కేంద్రంగా హిజ్రాలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. తమ దగ్గరకు వచ్చిన విటులను ఒళ్లును గుల్ల చేసి పంపుతున్నారు. కాదు కూడదంటే దౌర్జాన్యాలకు పాల్పడి చంపేస్తున్నారు. మితిమీరిపోతున్న పోకిరీలు, హిజ్రాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది. వీరి స్థావరాలపై దాడులు చేసి నాంపల్లిలో నిలువకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. అలాగే నిలోఫర్ ఆసుపత్రి ఎదుట అన్నదానాలు చేసే దాతలు రోగి సహాయకులకు కాకుండా పోకిరీలకు అన్నం వడ్డించకుండా చర్యలు తీసుకోవాలి. అంతేకా>కుండా నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదుట అధునాతన భవన నిర్మాణం పేరుతో కూల్చివేసిన ట్రాఫిక్ పోలీసు స్టేషన్, లా అండ్ ఆర్డర్ ఔట్ పోస్టు ఉండేందుకు భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి. స్టేషన్ ఎదుట గుర్తుతెలియని వ్యక్తిపై కత్తితో దాడి... ఆదివారం మధ్యాహ్న పోకిరీలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యారు. గాయాలపాలైన వ్యక్తిని హుటా హుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తి కోసం నాంపల్లి పోలీసులు గాలిస్తున్నారు. దాడిలో గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హిజ్రాల పెళ్లి సందడి.. అందాల పోటీలు
సాక్షి, చెన్నై: కూవాగంలో మంగళవారం హిజ్రాల వసంతోత్సవం కోలాహలంగా సాగింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన హిజ్రాలు కూత్తావండర్ ఆలయ పూజారుల వద్ద తాళి కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగారు. ఇక, మిస్‌కూవాగం–2019గా ధర్మపురికి చెందిన నబీషా ఎంపికయ్యారు. విల్లుపురం జిల్లా ఉలందూరుపేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువై ఉన్న కూత్తాండవర్ హిజ్రాల ఆరాధ్యుడు. ఇక్కడ ప్రతి ఏటా చైత్రమాసంలో సాగే ఉత్సవాలు హిజ్రాలకు వసంతోత్సవమే. ఇక్కడి వేడుకకు మహాభారత యుద్ధగాథ ముడిపడి ఉందని పురాణాల్లో పేర్కొన బడి ఉన్నాయి. ఆ మేరకు మోహినీ అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడిని వివాహమాడిన ఐరావంతుడిని తమ ఆరాధ్యుడిగా హిజ్రాలు కొలుçస్తున్నారు. ఇక్కడ కొలువుదీరిన ఐరావంతుడి ఆలయంలో ఉత్సవాలు ఈ నెల రెండో తేదీన ఆరంభమైంది. ప్రతిరోజూ ఆలయంలో వైభవంగా విశిష్ట పూజలు జరుగుతూ వస్తున్నాయి. అలాగే, మహాభారత గాథను వివరిస్తూ నాటకం, హరికథా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పెళ్లి వేడుక: ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి. అత్యంత వేడుకగా జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున హిజ్రాలు ఇక్కడికి తరలి రావడం జరుగుతోంది. అయితే, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హిజ్రాల రాక కాస్త తగ్గిందని చెప్పవచ్చు. మంగళవారం జరిగిన పెళ్లి వేడుక కోసం తరలి వచ్చిన హిజ్రాలతో ఆ పరిసరాలు సందడి వాతావరణంలో మునిగాయి. అందగత్తెలకు తామేమి తక్కువ కాదన్నట్టుగా సింగారించుకుని వచ్చిన హిజ్రాలను చూడడానికి పరిసర గ్రామాల ప్రజలు పొటెత్తారు. హిజ్రాల పెళ్లి సందడి నిమిత్తం ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున దుకాణాలు వెలిశాయి. ప్రధానంగా పక్క రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి హిజ్రాల రాక తగ్గినా, తమిళనాడులోని తిరునల్వేలి, కోయంబత్తూరు, చెన్నై, సేలం, విల్లుపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలోనే తరలివచ్చారు. సోమవారం అంతా ఆటపాటలు, ఫ్యాషన్ షోలు అంటూ సందడి చేసిన హిజ్రాలు మంగళవారం ఉయం నుంచి పెళ్లికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు, తాళిబొట్లను కొనుగోలు చేశారు. సాయంత్రం కొత్త పెళ్లి కూతుళ్ల వలే ముస్తాబైన హిజ్రాలు కూత్తాండవర్ ఆలయం వద్దకు చేరుకోనున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా తాళిబొట్టు కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. తాళి కట్టించుకున్న ఆనందంలో నృత్యం చేస్తూ ముందుకు సాగిన వాళ్లు కొందరు అయితే, తమ మిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకున్న వాళ్లు మరెందరో. రాత్రంతా అక్కడి మైదానంలో ఆనంద తాండవం చేసిన హిజ్రాలు, బుధవారం ఉదయాన్నే జరిగే కూత్తాండవరన్ ఆలయ రథోత్సవం, బలిదానం తదుపరి వితంతువులుగా మారనున్నారు. మిస్ కూవాగంగా నబీషా: అందగత్తెలకు, మోడల్స్‌కు తామేమి తీసి పోమన్నట్టుగా ఇక్కడ సోమవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు మిస్ కూవాగం పోటీలు జరిగాయి. పలు సంస్థల నేతృత్వంలో మిస్‌కూవాగం పోటీలతో పాటు హిజ్రాల ప్రతిభను చాటే విధంగా పోటీలు సాగాయి. ఈ పోటీల్లో అందగత్తెలకు ఏ మాత్రం తాము తీసి పోమన్నట్టుగా, ప్రతిభలో తాము సత్తా చాటుతామన్నట్టుగా హిజ్రాలు ర్యాంప్‌పై వయ్యారాలు ఒలక బోస్తూ క్యాట్‌వాక్ చేశారు. నృత్య ప్రదర్శనలతో ఆహూతుల్ని అలరించారు. విల్లుపురం, తిరునల్వేలి, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, చెన్నై జిల్లాలకు చెందిన 36 మంది హిజ్రాలు మిస్ కూవాగం –2019 కిరిటాన్ని తన్నుకెళ్లేందుకు పోటీ పడ్డారు. అన్ని రకాల పోటీల అనంతరం చివర్లో ఎయిడ్స్ అవగాహన, సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ అంశాలపై ప్రశ్నల్ని సంధించి, విజేతను ఎంపిక చేశారు. ఆ మేరకు ధర్మపురికి చెందిన నబీషా అనే హిజ్రా మిస్ కూవాగం –2019 కిరీటాన్ని కైవసం చేసుకుంది. అలాగే, రెండో స్థానాన్ని మడోనా(కోయంబత్తూరు), మూడోస్తానం రుద్ర (ఈరోడ్ భవానీ) దక్కించుకున్నారు. -
హిజ్రాలపై కక్ష పెంచుకొని..
బంజారాహిల్స్: హిజ్రాలపై దాడులకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటూ అటు పోలీసులకు, ఇటు హిజ్రాలకు చుక్కలు చూపిస్తూ తప్పించుకు తిరుగుతున్న నిందితుడు కురుమ వెంకటేష్ అలియాస్ గ్రానైట్ వెంకట్ అలియాస్ వెంకట్‌యాదవ్ అలియాస్ వెంకట్ అలియాస్ చిన్నాను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఆర్.కళింగరావు, డీఐ కె. రవికుమార్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, కక్కాలపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకట్ యాదవ్‌కు 2009లో ఎల్బీనగర్లో దివ్య అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఏడాది పాటు సహజీవనం చేశారు. అనంతరం వెంకట్‌కు వివాహం జరిగింది. తనను వదిలి భార్యతో కాపురం చేస్తున్న వెంకట్‌పై కోపం పెంచుకున్న దివ్య అతడి గ్రామానికి వెళ్లి గొడవ చేసింది. తన పరువు తీసిందని దివ్యపై పగబట్టిన వెంకట్ ఆమెను హత్య చేసేందుకు నగరానికి వచ్చాడు. దివ్య ఆచూకీ తెలుసుకునే ప్రయతత్నంలో కూకట్‌పల్లిలో ప్రవళ్లిక అనే మరో హిజ్రాను బండరాయితో మోది దారుణం హత్య చేశాడు. తన జీవితాన్ని నాశనం చేసిందన్న కసితో హిజ్రాలపై కక్ష పెంచుకొని వారినే లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డాడు. తరచూ వారిపై లైంగిక దాడులకు పాల్పడటమేగాక నగదు, నగలు దోచుకునేవాడు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్‌నెం. 2లోని ఇందిరానగర్‌లో మకాం వేసిన అతను గతేడాది ఇందిరానగర్‌లోనే ఓ హిజ్రాతో మాట్లాడుతున్న బ్రహ్మం అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను హత్య చేశాడు. గత ఏడాది సెప్టెంబర్ 27న యాస్మిన్ అనే హిజ్రా ఇంట్లో చొరబడి ఆమెపై దాడి చేసి రూ. 2 లక్షల నగదు, బంగారు దోచుకెళ్లాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న వెంకట్ పోలీసుల కళ్లుగప్పి వివిధ రాష్ట్రాల్లో మకాం వేశాడు. పక్కా నిఘా వేసిన బంజారాహిల్స్ డీఐ రవికుమార్ రెండు రోజుల క్రితం అనంతపురంలోని ఓ లాడ్జీలో స్నేహితులతో కలిసి పేకాట ఆడుతున్న వెంకట్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో వెంకట్ క్రిమినల్ చిట్టా వెలుగు చూసింది. ప్రతినెలా హిజ్రాల నుంచి హఫ్తాలు వసూలు చేయడం, తనకు నచ్చిన హిజ్రాపై లైంగిక దాడులకు పాల్పడటం, హిజ్రాల ఇళ్లల్లోకి చొరబడి నగదు ఎత్తుకెళుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై గోపాలపురం, మాదాపూర్, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్, బంజారాహిల్స్, బాలానగర్, ఎల్బీ నగర్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలో పది క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, నాన్‌బెయిలబుల్ వారెంట్లు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఎంతో కష్టపడి వెంకట్ యాదవ్‌ను పట్టుకున్న బంజారాహిల్స్ పోలీసులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు సూచనలు, సమాచారంతో డీఐ రవికుమార్ లక్ష్యాన్ని ఛేదించారని కొనియాడారు. -
హిజ్రాల పాలిట కాల'యముడు'
బంజారాహిల్స్: హిజ్రాల పాలిటకాలయముడిగా మారిన పాత నేరస్తుడు, రౌడీషీటర్ కుమ్మరి వెంకట్ యాదవ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు హత్య కేసులు, 9 దోపిడీ, దొమ్మీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకట్ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గుండు కొట్టించుకుని మారువేషంలో తిరుగుతూ రోజుకో సిమ్‌కార్డు మారుస్తూ, నాలుగు రాష్ట్రాల్లో తల దాచుకుంటున్నాడు. ఎట్టకేలకు బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అతడిని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు సూచనల మేరకు డీఐ రవికుమార్ నాలుగు రోజుల పాటు అనంతపురంలో మకాంవేసి ఓ లాడ్జిలో ఉంటున్న వెంకట్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా, కక్కాల్‌పల్లి గ్రామానికి చెందిన వెంకట్ యాదవ్ 2016 జనవరిలో బంజారాహిల్స్, ఇందిరానగర్‌లో బ్రహ్మం అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను హత్యచేసి జైలుకు వెళ్లాడు. 2015లో కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రవళిక అనే హిజ్రాను రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇందిరానగర్‌లో యాస్మిన్ అనే హిజ్రాపై దాడి చేసి నగలు, నగదు దోచుక్కెళ్లాడు. అప్పటినుండి తప్పించుకు తిరుగుతున్న వెంకట్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. అయితే, గత నెలలో కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో స్వప్న అనే హిజ్రాపై దాడి చేసి నగదు దోచుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఖైత్లాపూర్‌లో హిజ్రాలను సమావేశపరిచి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఇప్పటిదాకా అతడిపై 11 కేసులు నమోదై ఉన్నాయి. 2008లో దివ్య అనే హిజ్రాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతను హిజ్రాలందరితో పరిచయం పెంచుకున్నాడు. 2015 నాటికి హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని దాదాపు 3000 మంది హిజ్రాల పాలిట యముడయ్యాడు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో హిజ్రాలతో గ్రూప్ ఏర్పాటు చేయించి, ప్రతినెలా హప్తా వసూలు చేసేవాడు. ఇలా ప్రతి నెల రూ.1.50 లక్షల వరకు వసూలు చేసేవాడు. ఎవరైనా మామూళ్లు ఇవ్వకపోతే కొట్టడం, కిడ్నాప్, కత్తులతో గాట్లు పెట్టడం, బ్లేడ్‌తో చేతులపై కోయడం తదితర అకృత్యాలకు పాల్పడేవాడు. దీంతో గత నాలుగేళ్లుగా నగరంలోని హిజ్రాలు వెంకట్ పేరు చెబితేనే హడలిపోతున్నారు. తరచూ తనకు నచ్చిన హిజ్రాపై లైంగిక దాడికి పాల్పడటం, వారి వద్ద డబ్బు లాక్కుని పరారవ్వడం మామూలైపోయింది. జైలుశిక్ష అనుభవించినా అతడిలో మార్పు రాలేదు. అతని ఆగడాలను నియంత్రించాలని పలుమార్లు హిజ్రాలు ధర్నాలు సైతం చేశారు. పోలీసుల రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా నమోదైన అతను ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో హిజ్రాలు ఊపిరి పీల్చుకున్నారు. మాట్లాడుతున్న సామాజిక కార్యకర్త దేవి .. రౌడీషీటర్ నుంచికాపాడండి పంజగుట్ట: నగరంలో ట్రాన్స్జెండర్లను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న రౌడీషీటర్ వెంకట్ యాదవ్ బారినుండి తమను కాపాడాలని, అతనికి బెయిల్ రాకుండా చూడాలని పలువురు ట్రాన్స్జెండర్లు కోరారు. ఎట్టకేలకు బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్టు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వెంకటేష్ యాదవ్ బయటికి వస్తే అకృత్యాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సామాజిక కార్యకర్త దేవితో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా వెంకట్ యాదవ్ తమను అన్ని విధాలుగా వేధిస్తున్నాడన్నారు. 2015లో ప్రవల్లిక అనే ట్రాన్స్‌జెండర్‌ను హత్య చేయడమే కాకుండా పలువురు ట్రాన్స్జెండర్లపై అనుచరులతో దాడిచేసి బంగారం, నగదు లాక్కెళ్లే వాడన్నారు. అతను ఎప్పుడు దాడి చేస్తాడో అని బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికామన్నారు. రెండు రోజులక్రితం అతడిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులు అతను బయటకు రాకుండా జైలులోనే ఉంచాలని, అప్పుడే తాము ధైర్యంగా ఉంటామన్నారు. నా అనే వారు లేక భిక్షాటనతో పొట్టపోసుకుంటున్న తమకు వెంకట్ యాదవ్ రూపంలో పెద్ద సమస్య వచ్చిపడిందన్నారు. అతనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీస్స్టేషన్ల ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. సమాజం ట్రాన్స్జెండర్లను దూరం పెట్టడంతోనే సమస్యలు వస్తున్నాయని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని దేవి పేర్కొన్నారు. వారికి కూడా ఓటు హక్కు ఉందని, ఈ విషయాన్ని నాయకులు మర్చిపోతున్నారన్నారు. వెంకట్ యాదవ్ నేరాలన్నింటినీ పరిశీలించి అతనిపై చార్జీషీట్ వేయాలన్నారు. వెంకట్ యదవ్ జైలులో ఉన్నా అతని అనుచరుల ఆగడాలు తగ్గలేదని, వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని హక్కుల కార్యకర్త లారెన్స్ అన్నారు. సమావేశంలో చంద్రముఖి, బాబి, సోనా రాధోడ్, రమ్య తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి హిజ్రాల హల్ చల్
ఉప్పల్: ఉప్పల్ చౌరాస్తాలో హిజ్రాలు హాల్ చేశారు. డబ్బులు ఇవ్వనందుకు ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి చితకబాదిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తార్నాక, నాగార్జున నగర్‌కు చెందిన ప్రదీప్‌రెడ్డి మంగళవారం రాత్రి కారులో తన స్నేహితులు రామిరెడ్డి, రాంచంద్రారెడ్డితో కలిసి నాగోల్‌లోని ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఉప్పల్ బస్‌స్టాప్‌లో స్నేహితుడు రాంచంద్రారెడ్డిని దింపేందుకు కారును ఆపాడు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా స్కూటీపై వచ్చిన ఇద్దరు హిజ్రాలు వారిని డబ్బులు డిమాండ్ చేయడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన హిజ్రాలు ప్రదీప్‌రెడ్డి, రాంచంద్రారెడ్డిపై దాడి చేశారు. బాధితులు 100 కు డైల్ చేయడంతో పోలీసులకు చెబుతారా అంటూ తమ స్నేహితులను ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చిన మరో నలుగురు హిజ్రాలు మరోసారి వారిపై దాడి చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్లో వీరంగం పోలీస్ స్టేషన్లోనూ వారు తన ప్రతాపాన్ని చూపారు. స్టేషన్‌లోని పూల కుండీలను ధ్వసం చేశారు. ఆడ్డు వచ్చిన వారిని తిడుతూ హల్ చల్ చేశారు. దరఖాస్తు రాస్తున్న ప్రదీప్‌పై మరోసారి దాడికి యత్నించడంతో అడ్డుకున్న హోం గార్డు లాలా నాయక్‌ను పక్కకు తోసేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఉప్పల్‌లో అర్థరాత్రి హంగామా సృష్టించిన హిజ్రాలు
-
పురుషులా.. మహిళలా.. ఏ జైలుకు?
హైదరాబాద్: హిజ్రాల అరెస్టు కేసులో పోలీసులకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఓ కేసుకు సంబంధించి ప్రియ(22), సనం(20), అఫ్రిన్(22), యాస్మిన్(26) అనే నలుగురు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించమని కోర్టు ఆదేశించింది. అయితే వారిని మగవారి జైలుకు తరలించాలా? లేక మహిళా జైలుకు తరలించాలా? అన్నదానిపై పోలీసులు తర్జనభర్జన పడ్డారు. జూబ్లీహిల్స్ పోలీసులు మొదట వీరిని చంచల్‌గూడ మగవారి జైలుకు తీసుకెళ్లారు. అయితే వీరు ఆడవారని, ఇక్కడకు అనుమతించబోమంటూ జైలు అధికారి నిరాకరించారు. దీంతో పోలీసులు కోర్టును ఆశ్రయించగా తాము రిమాండ్ విధించి జైలుకు తరలించాలని చెప్పామని, ఎక్కడికి తీసుకెళ్తారో మీ ఇష్టమంటూ వ్యాఖ్యానించింది. దీంతో పోలీసులు ఈ నలుగురిని మహిళా జైలుకు తీసుకెళ్లారు. అయితే వీరు ఆడా? మగా? అన్న విషయాన్ని వైద్యుడిచే ధ్రువీకరించి తీసుకురావాలని జైలు అధికారి తెలిపారు. దీంతో ఈ నలుగురిని ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా ఆడవారే(మగవారు ఆపరేషన్ చేయించుకుని మహిళలుగా మారారు)నని వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఆ పత్రాలు తీసుకెళ్లి చంచల్‌గూడ మహిళా జైలర్‌కు ఇవ్వడంతో జైలర్ వీరిని జైలులోకి అనుమతించారు. వీరిని రిమాండ్‌కు తరలించడానికి 10 గంటల పాటు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన కైలాశ్ పటేల్ అనే యువకుడు అన్నపూర్ణ స్టూడియో పక్కన నుంచి శనివారంరాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఐదుగురు హిజ్రాలు కనపడగా వారితో మాటామంతి కలిపాడు. కొద్దిసేపటికి తన నుంచి హిజ్రాలు డబ్బులు లాక్కున్నారంటూ అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు అనంతరం రిమాండ్‌కు తరలించారు. సిమ్రాన్ ఫాతిమా(20) అనే మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
హత్యాయత్నం పేరుతో హైడ్రామా!
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): హిజ్రాల మధ్య వర్గ పోరు తారా స్థాయికి చేరింది. భౌతిక దాడులు.. ప్రాంతాల మధ్య ఆధిపత్యం కోసం గొడవలు పడుతున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి రచ్చకెక్కుతున్నారు. ఒకరి వల్ల ప్రాణహాని ఉందంటే మరొకరు.. వారి వల్లే మాకు ప్రాణహాని ఉందని మిగిలిన వారు ఆందోళనకు దిగుతున్నారు. అయితే మాజీ హిజ్రాల నాయకుడు, టీడీపీ నాయకుడు సూరాడ ఎల్లాజీ తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి వివాదం తలెత్తింది. కంచరపాలెం పోలీస్‌స్టేషన్ ఎదుట హై డ్రామా నడిచింది. ఇదీ పరిస్థితి బుధవారం ఉదయం 3గంటల సమయంలో టీడీపీ నాయకుడు, మాజీ హిజ్రాల నాయకుడు, రౌడీషీటర్ సూరాడ ఎల్లాజీ తనపై దాడి జరిగిందంటూ గాయాలతో కేజీహెచ్‌లో చేరాడు. అయితే ఎల్లాజీ డ్రామా చేస్తూ తమపై కేసులు పెట్టేందుకు చూస్తున్నాడని, అతని నుంచి మాకు ప్రాణహాణి ఉందంటూ మరో వర్గం హిజ్రాలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ఉత్తరాంధ్ర హిజ్రాల సంఘ సభ్యులు పాల్గొన్నారు. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఎల్లాజిపై ధర్మానగర్ వద్ద కొందరు హిజ్రాలు చేసిన దాడిలో గాయాలయ్యాయి. దీంతో ఎల్లాజీని కేజీహెచ్‌లో చికిత్స నిమిత్తం 108లో తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ వద్ద హిజ్రాలు మాకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేశారు గతంలో హిజ్రాల నాయకుడిగా ఉన్న ఎల్లాజీ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇక్కడి ధర్మానగర్‌లో బుధవారం ఉదయం సమయంలో తన తల్లి ఇంటి వద్ద నుంచి వస్తున్న సమయంలో కొందరు అడ్డగంచి దాడి చేశారంటూ ఆరోపిస్తున్నారు. కిరణ్ పిలిచి రూ.15లక్షలు కావాలని డిమాండ్ చేశాడని ఆరోపించాడు. శిల్ప, మోహన్, సరిత, రమణ, అణు అనే వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని చెబుతున్నాడు. అంతాహైడ్రామా కంచరపాలెం పోలీస్ స్టేషన్ వద్ద హిజ్రాల ఆందోళన... ఎల్లాజీపై దాడి అంతా ఓ హైడ్రామాలా నడిచింది. బుధవారం ఉదయం ఎల్లాజీపై దాడి జరిగిన అంశం మొత్తం పెద్ద డ్రామా అంటూ హిజ్రాలు ఆరోపిస్తున్నారు. గతంలో ఎల్లాజీ ఇంట్లో దొంగతనం చేశారంటూ గతంలో అసత్య ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ఆదాయం లేకే! ఎల్లాజీ వెంట హిజ్రాలు లేకపోవడంతో ఆదాయం లేక పలు ఇబ్బందులు పడుతున్నాడని, హిజ్రాలను తన వైపు తిప్పుకోవడానికి ఈ విధంగా పోలీసులకు ఫిర్యాదులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఎల్లాజి నుంచి మాకు ప్రాణభయం ఉందని, ప్రాణ రక్షణ కావాలని హిజ్రాలు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్లాజీకి న్యాయం చేయాలి పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తమ తరఫున మరో వర్గం హిజ్రాలతో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఎల్లాజీపై దాడిని చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిజ్రాలు కేజీహెచ్ అత్యవసర విభాగం వద్ద బుధవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ విశాఖపట్నంలో పుట్టిపెరిగిన తమపై విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, అనకాపల్లికి చెందిన హిజ్రాలు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తమ నాయకుడు ఎల్లాజీ పరిస్థితిని చక్కబెట్టేందుకు చేసిన ప్రయత్నంలో అతడ్ని చంపేదుకు ప్రయత్నించారని చెప్పారు. ప్రాణాపాయం లేదు వైద్యాధికారులు మాట్లాడుతూ ఎల్లాజీ వీపుమీద రెండు, మొలమీద ఒకటి, కుడితొడ మీద ఒకటి గాయాలున్నాయని పేర్కొన్నారు. బార్బర్ షాపులో వినియోగించే కత్తితో దాడి జరిగి ఉండవచ్చని తెలిపారు. ప్రాణాపాయం లేదని రెండు రోజుల పాటు చికిత్స అందించి డిశ్చార్జ్ చేస్తామన్నారు. -
బాలుడు కిడ్నాప్.. హిజ్రాగా ప్రత్యక్షం
వేసవి సెలవులు ముగించుకుని బస్సులో వస్తుండగా హిజ్రాలు బాలునికి మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లారు. అతనికి లింగమార్పిడి చేసి తమలాగే మార్చి భిక్షాటన ప్రారంభించారు. తమ కొడుకు ఏమయ్యాడోననిఅప్పటినుంచి నిరీక్షించిన తల్లిదండ్రులకు పిడుగులాంటి నిజం తెలిసిదిగ్భ్రాంతికి గురయ్యారు. మైసూరు జిల్లాలో షాక్‌కు గురిచేసే సంఘటన బయటపడింది. ఇలా ఇంకెంతమంది బాలలు ఇటువంటి ముఠాల చెరలో మగ్గిపోతున్నారోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక, యశవంతపుర: ఐదారు నెలల క్రితం అదృశ్యమైన 10వ తరగతి బాలుడు.. ఇప్పుడు హిజ్రాగా కనిపించడంతో కన్నవారు తీవ్రంగా విలపిస్తున్నారు. మైసూరు జిల్లా క్రిష్ణరాజపేట తాలూకా హక్కిమంచనహళ్లికి చెందిన చందన్‌కుమార్ (16) లింగమార్పిడితో ఇప్పుడు చందన్‌కుమారిగా మారిపోయాడు. వివరాలు.. చందన్‌కుమార్ బెంగళూరులోని పిన్నమ్మ ఇంట్లో ఉంటూ బీబీఎంపీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివేవాడు. ఈ ఏడాది మేలో వేసవి సెలల్లో సొంతూరికి వెళ్లాడు. సెలవు ముగియటంతో తల్లిదండ్రులుఅతడిని బస్ ఎక్కించి బెంగళూరుకు పంపించారు. బెంగళూరుకు వస్తూ మిస్సింగ్ అయితే చందన్ బెంగళూరుకు వెళ్లలేదు. అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు కేఆర్‌పేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పోలీసులు, కన్నవారు బాలుని కోసం గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం ఇద్దరు హిజ్రాల జతలో బాలుడు కేఆర్ పేజీ పట్టణంలోని టీబీ రోడ్డులో ఉన్నాడు. ఆ సమయంలో మంజు అనే యాచకుడు చందన్‌ను చూసి గుర్తుపట్టాడు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని బాలున్ని ప్రశ్నిస్తుండగా ఇతర హిజ్రాలతో కలిసి ఆటోలో పారిపోవటానికి ప్రయత్నించగా మంజు ఆటోను వెంబడించి పట్టుకుని కేఆర్‌పేట పట్టణ పోలీసులకు అప్పగించాడు. తన కొడుకు హిజ్రాగా కనిపించాడని తెలిసిన తల్లిదండ్రులు బంధువులతో కలిసి స్టేషన్‌కు చేరుకున్నారు. తన కొడుకును హిజ్రాలే అపహరించి ఇలా మార్చారని తల్లిదండ్రులు పోలీసుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి లింగ మార్పిడి చేసిన ఆరోపణలపై ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు. చందన్‌ను మహిళ శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించిన్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. -
హిజ్రాల్ని అరెస్ట్ చేయవద్దు
సాక్షి,హైదరాబాద్: హిజ్రాలకు సంబంధించిన యూనక్ చట్టం ప్రకారం వారిని అరెస్టు లేదా విచారణలు చేయవద్దని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యూనక్ చట్టంలోని 1329 ఎఫ్‌లోని సెక్షన్ 4, 5ల్లో కొన్ని నిబంధనలు హిజ్రాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వస్తువులపై ముద్ర వేసినట్లుగా ఈ చట్ట ప్రకారం హిజ్రాలపై ముద్ర వేయడం మానవత్వానికే మచ్చ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. యూనక్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ హిజ్రాల సామాజిక హక్కుల ఉద్యమకారులు, హిజ్రాలైన వి.వసంత మోగ్లి సహా ముగ్గురు దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. యూనక్ (నపుంసకుత్వం) అనే పదాన్ని ప్రయోగించడమే హిజ్రాలను కించపరచడమని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. కొత్త రాష్ట్రం వచ్చాక కూడా ఈ చట్టం అమలును కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ చెప్పారు. వాదనల అనంతరం ప్రతివాదులు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
హిజ్రాలను హెచ్చరించిన పోలీసులు
పెరంబూరు: రాత్రివేళల్లో అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హిజ్రాలను పోలీసులు హెచ్చరించారు. రాత్రివేళల్లో బైకులు, కార్లల్లో వచ్చే వాహనదారులను హిజ్రాలు వ్యభిచారానికి ఆహ్వానిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నిలువరించేలా చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్, అదనపు కమిషనర్ సారంగం పోలీసులకు ఉత్తర్వులిచ్చారు. జాయింట్ కమిషనర్ అన్భు ఆధ్వర్యంలో నగరంలోని హిజ్రాలతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా స్థానిక చూలైమేడు, భజన్కోవిల్ వీధిలోని కల్యాణ మండపంలో మంగళవారం హిజ్రాల సమావేశాన్ని నిర్వహించారు. ట్రిప్లికేన్ జాయింట్ కమిషనర్ సెల్వనాగరత్నం, నుంగంబాక్కం అసిస్టెంట్ కమిషనర్ ముత్తువేల్ పాండి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో సుమారు 100 మంది హిజ్రాలు పాల్గొన్నారు. వారితో ఇకపై రాత్రివేళల్లో ఆసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ వృత్తికి బదులు అలంకారనిపుణులు, హోటల్ రిసెప్షనిస్ట్ లాంటి ఉద్యోగ ఉపాధిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అంగీకరించిన హిజ్రాలు తాము కలిసి చర్చించి బదులిస్తామని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న హిజ్రాలతో పలువురు ఇంజినీరింగ్, ఎంబీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎంఎస్సీ, డిప్లమో విద్యార్థులు ఉండడం గమనార్హం. -
న్యూసెన్స్ చేసిన ముగ్గురు హిజ్రాలకు జరిమానా
కాజీపేట రూరల్ : రైళ్లలో న్యూసెన్స్ చేసిన ముగ్గురు హిజ్రాలకు కాజీపేట రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ శుక్రవారం జరిమానా విధించినట్లు స్థానిక ఆర్పీఎఫ్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి నడుస్తున్న రైలు చైన్ లాగి రైలు ఆపిన ఒక హిజ్రాను, శుక్రవారం గుంటూరు నుంచికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులతోసభ్యకరంగా ప్రవర్తించిన మరో హిజ్రాలను అదుపులోకి తీసుకొని కేసులు నమో దు చేసి రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా, వారికి రూ.6 వేల జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
లోకమంతా బాగుండాలి బాయ్యా..
విజయనగరం మున్సిపాలిటీ : సమాజమంతా వారిని చిన్న చూపు చూస్తుంది. తమ పక్కన చోటివ్వటానికి సందేహిస్తుంది. తమలో భాగంగా చూడటానికి తటపటాయిస్తుంది. కానీ వారు మాత్రం అధైర్యానికి చోటివ్వకుండా తాము అందరి లాంటి వాళ్లమేనని, తమకూ మంచి మనసుందని నిరూపించుకుంటున్నారు పట్టణానికి చెందిన పలువురు హిజ్రాలు. వీరు ఏర్పాటు చేసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే సమాజం మెచ్చే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారు రోజంతా పలు ప్రాంతాల్లో యాచించి తెచ్చే ధనంలో అర్ధభాగాన్ని సమాజ సేవకు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా లోక కల్యాణార్ధం హిజ్రాల ఇలవేల్పు మురిగిమాత పూజామహోత్సవాలను మంగళవారం నుంచి మూడు రోజుల పాటు విజయనగరం పట్టణంలో నిర్వహిస్తుండగా... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హిజ్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్థానిక ఎన్సీఎస్ రోడ్డులో గల పెద్ద చెరువు గట్టుపై శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సాగిన కార్యక్రమంలో హిజ్రాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ కార్యదర్శి స్రవంతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండబాబు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వీటిని సాధారణ మానవులు ఆచరించే విధంగా శాస్త్రోక్తంగా చేస్తామన్నారు. బుధవారం బాబామెట్ట ఖాదర్‌వలీబాబా దర్గాలో పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం ఉత్తరా>ంధ్రుల ఇలవేల్పు పైడితల్లమ్మవారికి పసుపు కుంకుమలు చెల్లించి పూజలు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో విశాఖ, విజయవాడ, తదితర ప్రాంతాలకు చెందిన హిజ్రాలు పదుల సంఖ్యలో పాల్గొన్నారు. -
హిజ్రాలకు పింఛన్ మంజూరు పత్రాల అందజేత
ఆమదాలవలస శ్రీకాకుళం : ఆమదాలవలస పురపాలక సంఘం 8వ వార్డులో నివసిస్తున్న ఎనిమిది మంది హిజ్రాలకు నెలకు రూ.1500 చొప్పున పింఛన్‌ను అందజేసే ఉత్తర్వులను గురువారం మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత అందించారు. జిల్లాలో తొలిసారిగా ఆమదాలవలస మున్సిపాలిటీలోనే హిజ్రాలకు పింఛన్లు మంజూరు చేశామని ఈ సందర్భంగా చైర్పర్సన్ తెలిపారు. మరో 20 మందికి వైద్య ధ్రువీకరణ పత్రాలు మంజూరు కావాల్సి ఉందని, వారికి కూడా పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదళ్ అధ్యక్షడు అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, సిబ్బంది ఎ.వి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అవకాశాలు ఇస్తే నిరూపించుకుంటాం...
సిద్దిపేటటౌన్: కనిపించగానే చనువుగా మాట్లాడుతారు. చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ డబ్బులివ్వమని అడుగుతారు. కొన్ని సార్లు బెదిరిస్తారు. వారిని చూసి జాలిపడే వారి కన్నా . ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందామనుకునే వారే ఎక్కువ. ఎంత కోపంతో ఇచ్చినా ఆశీర్వదించి వెళ్తారు. వాళ్లే ‘హిజ్రా’లు. కుటుంబ సభయులు వెలేసినా, సమాజం దూరం పెడుతున్నా, ప్రభుత్వాలు పట్టించుకోకున్నా బతుకు పోరాటం చేస్తున్న హిజ్రాల దీన గాథపై కథనం.. గూడు కోసం గోస.. వీరికి ఉండడానికి సొంత ఇల్లులు ఉండవు. కిరాయికి ఇవ్వడానికి సైతం ఎవరూ ముందుకు రారు. ఆడ, మగ కాకపోయినా సమాజంలో తాము భాగమేనని, తాము కూడా మనుషులమేనని అంటున్నారు హిజ్రాలు. ఉపాధిలేక, ఉండడానికి ఇళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు శుక్రవారం సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావుకు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి తమ సంఘం తరపున వినతిపత్రం అందించారు. చదువుకూ, ఉద్యోగానికి దూరం.. వీరు చదువుకుంటామన్నా స్కూళ్లు కుదరదంటున్నాయి. సామర్థ్యం ఉన్నా ఉద్యోగం రానంటోంది. ప్రతిభను ప్రదర్శిం చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు సైతం హిజ్రాల్లో ఉన్నారు. కలిసి బతుకుతారు.. ఒక ప్రాంతంలో ఉండే హిజ్రాలకు ఇళ్లూ, వాకిలి ఒకటే. అందరూ కలిసి సంపాదించుకుంటారు. కలిసి బతుకుతారు. కష్టం, సుఖం పంచుకుంటారు. గుర్తింపు కోసం పోరాటం... హిజ్రాలు ఇప్పుడు గుర్తింపు కోసం పోరాడుతున్నారు. ఉత్తర భారతదేశంలో సముచిత గౌరవమే లభిస్తోంది వీరికి. తమిళనాడులో ప్రభుత్వ గుర్తింపు పొందిన వీరికి ప్రత్యేకంగా టీ అనే కాలమ్ ఏర్పాటు చేసింది. స్త్రీ పురుషులతో సమానంగా ట్రాన్స్‌జెండర్స్‌ను గుర్తిస్తోంది. ఇక్కడ కూడా తమనూ మనుషులుగా గుర్తించాలని కోరుకుంటున్నారు. ఓటు హక్కు కల్పించాలి... నేటికీ మాకు ఓటు హక్కు లేదు. ఇప్పటికైనా మాకు ఓటు హక్కు కల్పించాలి. ఓటు హాక్కు లేకపోవడంతో ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడం లేదు. మాకు సరైన సౌకర్యాలు కల్పించాలి. మాకు జీవనోపాధి కల్పించేలా, పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.–సోని, ట్రాన్స్‌జెండర్. అవకాశాలు ఇస్తే నిరూపించుకుంటాం... మేం కావాలని ఈ జీవితాన్ని అనుభవించడం లేదు. మాలోను చదువుకున్న వారు చాలా మంది ఉన్నారు. అవకాశాలు ఇస్తే మేం ఎందులో తక్కువ కాదని నిరూపించుకుంటాం. మాకు ఉపాధి కల్పించి సమాజంలో మమ్మల్ని ఒక వర్గంగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలి. –సునీత, హిజ్రా మమ్మల్ని తక్కువగా చూడొద్దు.. సమాజంలో మేము భాగమే. హిజ్రాలు అంటే ఏదో కొత్తగా వచ్చిన వ్యక్తులుగా చూడడం మంచిది కాదు. పురాణాల్లో సైతం మాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటివి చూసైనా సమాజంలో మార్పు రావాలి. మేం కావాలని ఇలా మారడంలేదు. మాకు దేవుడిచ్చిన శాపంగా భావించి జీవితాన్ని గడుపుతున్నాం. మగ వాళ్లు చేసే పనులు, ఆడ వాళ్లు చేసే పనులూ రెండు మేం చేయగలం. మేం ఎందులో తక్కువ కాదు. మమ్మల్ని తక్కువగా చూడొద్దు. –ఆకుల మమత. హిజ్రా సంఘం అధ్యక్షురాలు, సిద్దిపేట -
సెలబ్రిటీల కంటే హిజ్రాలకే డిమాండ్
ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. నాయకుల వెంట నడవడానికి, జై కొట్టడానికి మనుషులు కావాలి కదా. ఆ కొరతను ఇళ్ల పని మనుషులు, హిజ్రాలు తీరుస్తున్నారు. వారికి కూడా రాబడి బాగానే లభిస్తోంది. బనశంకరి: ఎన్నికల పుణ్యమా అని బెంగళూరు మహానగరంలో ఇళ్ల పనిమనుషులకు భలే డిమాండ్ ఏర్పడింది. ఇళ్లలో పనులు చేపట్టే పని మనుషులు సెలవులు పెట్టి వివిధ రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. నెలంతా ఐదారు ఇళ్లలో ఇంటిపనులు చేసినా ఏడెనిమిదివేలు సంపాదించడం కష్టం. కానీ ఎన్నికల ప్రచారానికి వెళితే రోజుకు రూ. 500 నుంచి రూ.1000 నగదు ఇస్తుండటంతో వారికి బాగా గిట్టుబాటవుతోంది. ఎన్నికల ప్రచారానికి వివిధ పార్టీల నేతలు ఇళ్లలో పనులు చేపట్టే మహిళలను వినియోగించుకోవడంతో వీరికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రతిరోజు ఉదయం ఇళ్లకు వెళ్లి చెత్త ఊడ్చి, బట్టలు ఉతికి, పాత్రలు శుభ్రం చేసి వెళ్లేవారు. ఇంతలో ఎన్నికలు ఆశాదీపంలా కనిపించాయి. నగరంలో పనిమనుషులకు సహజంగానే డిమాండ్ ఎక్కువ. బిజీబిజీ జీవితంలో ఇంటి పనులు చేసుకోలేని గృహిణులు, మహిళా ఉద్యోగినులకు పని మనుషులే ఆసరా. అయినప్పటికీ శ్రమ దోపిడీకి కొదవ లేదు. పనిమనుషులతో బండెడంత చాకిరీ చేసుకుని కాస్తా కూలీ ముట్టజెబుతారు. వారికి నెలకు రూ.2–3 వేలు మాత్రమే జీతమిస్తారు. అదే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే రోజుకు రూ. 500 నుంచి రూ.1000 వరకు సులభంగా సంపాదించవచ్చు. ఏమేం చేయాలంటే... ఎన్నికల్లో వీరి పనల్లా.. రాజకీయ నేతల వెంట ప్రచారానికి వెళ్లడం. జెండాలు మోయడం, జై కొట్టడం, ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడగటం, సభలు, సమావేశాలకు వెళ్లడం వంటివే. టికెట్ల కోసం బ ల ప్రదర్శన నాటి నుంచి ఎన్నికల్లో గెలిచి ర్యాలీ లు జరిపే వరకు వీరి అవసరం నాయకులకు చా లానే ఉంటుంది. కూలీతో పాటు టిఫిన్లు, బోజనా లు, మజ్జిగ, క్రూల్డ్రింక్స్ను ఉచితంగా అందిస్తా రు. ఈ మహిళలు తమ పిల్లలను ప్రచారానికి తీసుకెళుతున్నారు. వారికి కూడా నాయకులు తృణమో ఫణమో ముట్టజెబుతుంటారు. ఇంటికే వాహనం మహిళలను ప్రచారానికి తీసుకెళ్లడానికి నాయకులే వాహనాలు పంపుతారు. మురికివాడలు, వివిధ కాలనీల నుంచి వాహనాల్లో తరలించడానికి ఒక్కో ఏరియా కు ఒక టీమ్ లీడర్ ను నియమిస్తారు. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఆ రోజు వేతనం అందిస్తారు. మహిళలకు పార్టీ బేధాలు లేవు, ఏ రాజకీయపార్టీ కార్యకర్తలైనా సరే ఇళ్లు వద్దకు వచ్చి ప్రచారానికి ఆహ్వానిస్తే చాలు వెళ్తారు, సాయంత్రానికి వేతనం అందించాలి అంతే. అయితే ఇంటి పనిమనుషులు గైర్హాజరుతో గృహిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. మంగళముఖిలకూ డిమాండ్ ఎన్నికల ప్రచారానికి సినీతారలు, ప్రముఖ క్రీడాకారులు వంటి సెలబ్రిటీలను ఆశ్రయించడం ఆనవాయితీ కానీ ఈసారి సెలబ్రిటీల కంటే హిజ్రాలకు బాగా డిమాండ్ ఏర్పడింది. హిజ్రాల ముఖం చూస్తే శుభ సూచికమనే నమ్మకం కొన్ని ప్రాంతా ల్లో ఉంది. అందుకే వారికి మంగళముఖిలని కూడా పిలుస్తారు. పలుచోట్ల అభ్యర్థులు ఈ న మ్మకంతో ప్రచారానికి హిజ్రాలను పిలిపిస్తున్నా రు. పైగా వారుంటే సందడి కూడా రెట్టింపవుతుం ది. దీంతో బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా హిజ్రాలకు డిమాండ్ పెరిగింది. జీవనోపాధి కోసం పాటుపడే హిజ్రాలకు ఎన్నికలు అదృష్టంగా వచ్చిపడింది. భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కూడా వందలాది మంది హిజ్రాలను నగరానికి క్యూ కడుతున్నారు. -
రైళ్లలో హిజ్రాల ఆగడాలకు చెక్
సాక్షి, బెంగళూరు: రైళ్లలో ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న హిజ్రాల ఆటలకు బెంగళూరు రైల్వే డివిజన్ చెక్ చెప్పింది. ఇటీవల కాలంలో రైళ్లలో హిజ్రాల ద్వారా వేధింపులకు గురవుతున్నట్లు ప్రయాణికుల నుంచి బెంగళూరు డివిజన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో గత మూడు నెలలుగా డివిజన్ అధికారులు అనేక డ్రైవ్‌లు నిర్వహించి ఆకతాయి హిజ్రాల పని పట్టినట్లు సమాచారం. మూడు నెలల నుంచి ఇప్పటివరకు 135 డ్రైవ్‌లు నిర్వహించి 100 మంది హిజ్రాలను విచారించారు. 182 టోల్‌ఫ్రీ ద్వారాఫిర్యాదుల వెల్లువ.. రైల్వే భద్రతా సిబ్బంది (ఆర్పీఎఫ్) అధికారి ఒకరు మాట్లాడుతూ... ఇటీవల ప్రయాణికుల నుంచి హిజ్రాలపై చాలా ఫిర్యాదులు అందాయని తెలిపారు. 182 టోల్‌ఫ్రీ ద్వారా చాలా మంది ప్రయాణికులు హిజ్రాల చేష్టలపై ఫిర్యాదులు చేసినట్లు చెప్పారు. ఏదొక స్టేషన్లో కొందరు హిజ్రాలు రైల్లోకి ఎక్కి పురుషు ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. డబ్బులు ఇవ్వని ప్రయాణికులన మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు 182 టోల్‌ఫ్రీ ద్వారా చాలా మంది ప్రయాణికులు తమకు ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఇటీవల కాలంలో సమాజంలో ఎంతో విస్తృతమైన సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రయాణికులు హిజ్రాలపై ఫిర్యాదులు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారానే రైల్వే మంత్రికి కూడా ప్రయాణికులు నేరుగా ఫిర్యాదులు చేస్తున్నట్లు చెప్పారు. ఒక ప్రయాణికుడి జేబులో ఇద్దరు హిజ్రాలు చేతులు పెట్టి బలవంతంగా డబ్బులు లాక్కున్నట్లు ఇటీవల తమకు ఒక ఫిర్యాదు అందిందని చెప్పారు. గతంలో ప్యాసెంజర్ రైళ్లలో మాత్రమే ప్రయాణించే హిజ్రాలు ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని స్పష్టంచేశారు. ఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్న స్టేషన్లలో దిగకుండా హిజ్రాలు తప్పించుకుని తిరుగుతున్నారని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు బెంగళూరు కంటోన్మెంట్, హిందూపూరు, బయపనహళ్లి, యశ్వంతపుర, తుమకూరు తదితర రైల్వేస్టేషన్లలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించామని తెలిపారు. అంతేకాకుండా రామనగరం–చన్నపట్న, నిద్వాంద–తుమకూరు, గౌరిబిదనూరు–హిందూపూరు, దొడ్డబళ్లాపుర–గౌరిబిదనూరు, బయపనహళ్లి–కృష్ణరాజపురం రైల్వే సెక్షన్లలోనూ డ్రైవ్‌లు నిర్వహించామని చెప్పారు. ఏప్రిల్ వరకు ఈ డ్రైవ్‌లను కొనసాగిస్తామన్నారు. రూ. 18,200 జరిమానా వసూలు.. ప్రత్యేక డ్రైవ్‌లలో పట్టుబడిన హిజ్రాలను రైల్వే కోర్టుల ఎదుట ప్రవేశపెట్టారు. ఇందులో రెండు కేసులు మినహా అన్ని కేసుల విచారణలను కోర్టు పూర్తి చేసి జరిమానాలు విధించింది. మొత్తం 100 మందిని విచారించిన కోర్టు రూ. 18,200 జరిమానాలను విధించి హిజ్రాల నుంచి వసూలు చేసింది. హిజ్రాలపై నమోదైన సెక్షన్ల మేరకు రూ. 100 నుంచి రూ. 300 వరకు జరిమానాను వసూలు చేశారు. -
హిజ్రాల పింఛన్ కోసం దరఖాస్తులు
కర్నూలు (టౌన్): హిజ్రాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1500 పింఛన్ మంజూరు చేస్తుందని, ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సి.బి. హరినాథరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సవంత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉన్న హిజ్రాలు రేషన్‌కార్డు, ట్రాన్స్ జెండర్‌గా గుర్తింపు పత్రం, హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్పేర్ డిపార్టుమెంటు గుర్తించిన మెడికల్ అథారిటీ సర్టిఫికెట్ ప్రతులతో మున్సిపాల్టీ పింఛన్ విభాగంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు నకలు కలిగి యాచకవృత్తి, వ్యభిచారం, బెదిరింపు తదితర చర్యలకు పాల్పడటం లేదని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలన్నారు. -
హిజ్రాల హక్కులను హరిస్తోంది
సాక్షి, హైదరాబాద్: శతాబ్దం కిందట (1919) నిజాం కాలంలో హిజ్రాలకు సంబంధించి తీసుకొచ్చిన తెలంగాణ యూనక్స్ చట్టంలోని కొన్ని నిబంధనలు అత్యంత దారుణంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నిబంధనలను తాము కొట్టేయడానికి ముందే తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టానికి సవరణలు చేసే అంశాన్ని పరిశీలించాలంది. రాజ్యాంగం అమల్లోకి రాక ముందు తీసుకొచ్చిన ఈ చట్టంపై పునరాలోచన చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. 15–16 ఏళ్ల బాలుడిని హిజ్రాలు తమ వద్ద ఉంచుకోవడం నేరమన్న ఈ చట్ట నిబంధనలపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సమాజంలో పిల్లలపై అనేక రకాలుగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వీటిని కేవలం హిజ్రాలకే ఆపాదించడం ఎంత మాత్రం సరికాదంది. అలాగే హిజ్రాలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని.. నాట్యం, సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నా అరెస్ట్ చేయవచ్చునన్న నిబంధనలు సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సాంఘి క సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ యూనక్స్ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దానిని కొట్టేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన వి.వసంత, కేఎంవీ మోనాలీసా, మరొకరు హైకోర్టులో పిల్ వేశారు. హిజ్రాలపై ఇష్టానుసారం కేసులు.. విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 1919లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ యూనక్స్ చట్టం నిబంధనలను అడ్డం పెట్టుకుని హిజ్రాలపై పోలీసులు ఇష్టానుసారం కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు. కర్ణాటకలో న్యాయపోరాటం చేసిన తర్వాత అక్కడి ప్రభుత్వం యూనక్ (నపుంసకుడు) అన్న పదాన్ని తొలగించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తెలంగాణ యూనక్స్ చట్టం అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 99 ఏళ్ల క్రితం ఈ చట్టాన్ని తీసుకొచ్చారని, ఈ చట్టం కింద రాష్ట్రంలో కేసులెన్ని నమోదయ్యాయో పరిశీలించాల్సి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ అన్నారు. గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
రజనీ ప్రజాసంఘంలో హిజ్రాల విభాగం
తమిళసినిమా: రజనీకాంత్ ఈ పేరు ఇప్పుడు సినీరంగంలోనూ, రాజకీయరంగంలోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయరంగ ప్రవేశాన్ని ధ్రువపరిచిన ఆయన ఆ దిశగా పావులను వేగంగా కదుపుతున్నారు. రజనీ అభిమాన సంఘాన్ని ప్రజా సంఘంగా మార్చారు. పలువురు అభిమానుల్ని నిర్వాహకులుగా నియమించారు. వారంతా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యుత్వ నమోదు పనిలో నిమగ్నమయ్యారు. కాగా రజనీకాంత్ ఏప్రిల్‌లో తన పార్టీ పేరును, గుర్తును వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పుడే పార్టీ విధి విధానాలను వెల్లడించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రజనీ చెన్నై, మాంబళంలో ఉన్న జిల్లా ప్రజాసంఘం యువభాగంలో బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేది కపై పలువురు రైతులకు సహాయకాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ త్వరలో రజనీ ప్రజాసంఘంలో హిజ్రాల విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాలా ఫైట్స్ లీక్.. రజనీ నటిస్తున్న కాలా చిత్రం తాజాగా సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ చిత్రంలోని పోరాట దృశ్యాలు కొన్నిప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చత్రాన్ని నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చిత్రాన్ని ఏప్రిల్ 27వ విడుదల చేమనున్నట్లు ధనుష్ ఇటీవలే ప్రకటించడంతో భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. ఆ తేదీకి ముందు, ఆ తరువాత కూడా ఇతర చిత్రాలను విడుదల చేయకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారని చెప్పవచ్చు. కాగా తాజాగా లీకైన ఈ చిత్ర ఫైట్ సన్నివేశాల్లో రజనీకాంత్‌పై విలన్ అనుచరుడొకడు ఇనుప రాడ్డుతో దాడి చేయడం, అతన్ని రజనీకాంత్ చితక బాదడం వంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. గతంలో రజనీకాంత్‌కు శివాజీ, లింగా లాంటి చిత్రాలకు ఇలాంటి షాక్ తగిలింది. ఆ మధ్య బాహుబలి చిత్రం ఈ లీకుల నుంచి తప్పించుకోలేకపోయింది. చిత్ర మిక్సింగ్, ఎడిటింగ్ కార్యక్రమాల సమయాల్లో ఇలాంటి లీకులు జరిగే అవకాశం ఉంటుంది. కాగా చిత్ర యూనిట్ వర్గాలే కావాలని ప్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి లీకులు చేస్తుంటారనే ఓ వర్గం లేకపోలేదు. -
ఉద్యోగాలపై హిజ్రాల ఆసక్తి
చెన్నై: తమిళనాడులో మే 21న జరిగే పోలీసు ఉద్యోగాల ఎంపిక రాత పరీక్షలకు హిజ్రాలు ఎంతో ఆసక్తిగా దరఖాస్తులు పెట్టుకున్నారు. యాబై మందికి పైగా ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. సమాజంలో చిన్న చూపునకు గురైన హిజ్రాలు కాలంతోపాటు వారు మారుతూ విద్య, ఉపాధి ద్వారా అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. ఇటీవల ఎస్ఐగా ఎంపికైన ప్రితికా యాషిన్ ప్రస్తుతం ధర్మపురిలోని పోలీసు స్టేషన్లో ఎస్ఐ పదవీ బాధ్యతలు వహిస్తున్నారు. ఈమె దేశంలోనే మొట్ట మొదటి హిజ్రా ఎస్ఐ. ఆమెని మార్గదర్శిగా ఎంచుకుని పలువురు హిజ్రాలు పోలీసు ఉద్యోగాలలో ఆసక్తి చూపుతున్నారు. పోలీసు శాఖలో ఖాళీ స్థానాల భర్తీకి మే 21వ తేదీ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 6.32 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా అందులో 50 మంది హిజ్రాలు కావడం విశేషం. పోలీసు శాఖలో హిజ్రాలు చేరడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వారు ఎంతో ఆసక్తి చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనం. -
హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్
చెన్నై (టీనగర్): హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్స్ ఏర్పాటుచేయాలని కోరుతూ నగర కార్పొరేషన్‌కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. బహిరంగ స్థలాల్లో హిజ్రాలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించేందుకు ఉత్తర్వులివ్వాలని కోరుతూ దేవరాజన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి హులువాది రమేష్, టీక్కా రామన్ ఆధ్వర్యంలోని బెంచ్ ఎదుట విచారణకు వచ్చింది. ఆ సమయంలో మొదటి విడతగా హిజ్రాలు అధికంగా నివశించే ప్రాంతాలైన తండయార్‌పేట, చూళైమేడు, పులియాంతోపు, సైదాపేట ప్రాంతాల్లో ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటుచేసేందుకు చెన్నై కార్పొరేషన్‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ సిఫారసులు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేసింది. ఇందుకు సమ్మతించిన న్యాయమూర్తులు టాయిలెట్స్ నిర్మాణ పనులు జరిపేందుకు కార్పొరేషన్‌కు నాలుగు వారాలు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా హిజ్రాలు ఎదుర్కొనే సమస్యల గురించి పరిశీలన జరిపి నివేదిక దాఖలు చేయాలంటూ పిటిషనర్ దేవరాజన్‌కు న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు. -
చోరీలకు పాల్పడుతున్న హిజ్రాల అరెస్ట్
విశాఖపట్నం (పెదవాల్తేరు): రైళ్లలో యాచిస్తూ ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు, నగదు తస్కరిస్తున్న ఇద్దరి హిజ్రాలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే డీఎస్పీ మధుసూదన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి దువ్వాడ స్టేషన్ మధ్యలో ప్రయాణికుల నుంచి యాచిస్తున్నట్లు నటించి హిజ్రాలు పాలూరి వెంకట్ అలియాస్ జెనీలియా(23), పరపతి అనిల్ అలియాస్ సుక్కూ(23) కొద్ది రోజులుగా చోరీలకు పాల్పడుతున్నారు. గురువారం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి విలువైన వస్తువులు, రూ.28,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. -
కలలున్నాయి కన్నీళ్లూ ఉన్నాయి
తల్లిదండ్రులు చేరదీయకపోయినా.. చుట్టుపక్కల వారు దరిచేరనివ్వకపోయినా.. సమాజం దూరం పెట్టినా ఆ ‘మగవ’లు తెగువతో బతుకుతుంటారు. ‘అర్ధనారీ’మణులుగా అవస్థలు పడుతూ.. అర్థం చేసుకుని ఆదరించే వారిని చల్లగా ఉండమని దిష్టి తీస్తుంటారు. చీదరింపులు ఎదురైనా తమ స్వప్న లోకంలో బతుకుతూ కష్టాలకు ఎదురీదుతుంటారు. తాము కలలగన్న ప్రపంచం కోసం కన్నీళ్లను దిగమింగే హిజ్రాల జీవితాల్ని ఓసారి పరికిస్తే.. పాలకొల్లు అర్బన్ : ప్రాణం లేని ఓ శరీరం ఆరుబయట ఉంటుంది. ఓ దుర్మార్గానికి ఆ శరీరం బలైపోయింది. చుట్టూ ప్రాణం ఉన్న మానవ శరీరాలు ఏడుస్తూ ఉంటాయి. దేవుడా.. ఏమిటీ బతుకు.. ఛీ పాడు జన్మ ... మళ్లీ ఇలాంటి జన్మలో మమ్మల్ని పుట్టించకు అంటూ కన్నీళ్లు పెడుతూ.. ప్రాణం లేని శరీరాన్ని చెప్పుతో కొట్టడంతో ప్రేక్షకుల నుంచి చప్పట్లు మారుమోగిపోగాయి. ఇది థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ హైదరాబాద్ యువకులు ప్రదర్శించిన ‘శాపగ్రస్తులు’ నాటకంలో ఓ సన్నివేశం. హిజ్రాలను కూడా మనుషులుగా చూడండి. హార్మోన్ల ప్రభావంతో జన్మించిన వాళ్లను మానవతా ధృక్పథంతో ఆదరించాలే తప్ప సమాజంలో వాళ్లను చిన్నచూపు చూడకూడదు. వాళ్ల మీద అత్యాచారాలు, అరాచకాలు చేయకూడదు. వారిని కూడా సమాజంలో స్త్రీ, పురుషులతో సమానంగా చూడండి. మనుషులుగా గుర్తించండి అనే ఇతివృత్తంతో ప్రదర్శించిన ఆ నాటకం 2007లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును అందుకుంది. అది నాటకం.. కానీ హిజ్రాల జీవితాలను తెరచి చూస్తే వినోదం కన్నా విషాదం వారి బతుకులో ఎక్కువ. వాళ్లూ మనుషులే.. మనలాగే వారు పుట్టారు అని ఆలోచించేవారు బహు తక్కువ. హార్మోన్ల అసమతుల్యత వల్ల అర్ధనారులుగా పుట్టి సమాజంలో చిన్నచూపునకు లోనవుతున్నవారు. వారు కూడా పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చినవారే. అమ్మానాన్న, అన్నాతమ్ముళ్లు, అక్కా చెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలతో పెరిగినవారే. వయసు పెరిగే కొద్దీ ఆడవారి లక్షణాలు శరీరంలో వృద్ధి చెందడం.. ఆడవారిలా అలంకరించుకోవడం.. చీర కట్టుకోవడం.. జడ వేసుకోవడం.. తలలో పువ్వులు పెట్టుకోవడం వంటి లక్షణాలు వారిలో పుట్టే సహజ లక్షణాలు. ప్రత్యేక కుటుంబం వీరిది హిజ్రాగా మారిన వ్యక్తికి ప్రత్యేక కుటుంబం ఏర్పాటవుతుంది. అప్పటికే హిజ్రాగా మారిన వ్యక్తులు ఆసరాగా నిలుస్తారు. అత్త, అమ్మ, అక్క, చెల్లి వరుసలతో వీరి కుటుంబం ఏర్పాటవుతుంది. హిజ్రాలు ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని ఖననం చేయడం వీరి ఆచారం. హిజ్రాగా మారిన వ్యక్తిని హిందూ శ్మశాన వాటికలో ఖననం చేస్తారు. అత్త చనిపోతే కోడలు ముండమోస్తుంది. బొట్టు తీయడం, గాజులు పగులగొట్టడం, తెల్లచీర కట్టుకోవడం వంటి ఆచారాలను కోడలు చేస్తుంది. 41వ రోజు ఛాలిష్మా (దినం) చేస్తారు. హిజ్రాగా మారినప్పుడు ఏవిధంగా పూజలు చేస్తారో అదే విధంగా చనిపోయినప్పుడు కూడా 41వ రోజున ఛాలిష్మా నిర్వహించడం వీరి ఆనవాయితీ. అన్నట్టు వీరికి ఒక సంఘం ఉంది. ప్రతినెలా సంఘ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో సంఘం దృష్టికి వచ్చిన సమస్యలు చర్చించి జరిమానా విధిస్తారు. భిక్షాటనే ప్రధాన వృత్తి రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లు, షాపుల వద్ద వీరు భిక్షాటన చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అడపాదడపా ఉత్సవాలు, ఊరేగింపులు, జాతర మహోత్సవాల్లో వీరు ప్రత్యేక నృత్య ప్రదర్శనలిస్తూ ఉపాధి పొందుతున్నారు. 41 రోజుల దీక్ష హిజ్రాగా మారిన వ్యక్తి 41 రోజులు దీక్ష చేస్తారు. కేవలం చపాతి, డికాషన్ ఆహారంగా ఇస్తారు. 11వ రోజు, 21వ రోజు, 31వ రోజు ప్రత్యేకంగా స్నానాలు చేయిస్తారు. 40వ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఆటాపాట చేపడతారు. తెల్లవారుజామున 3 గంటలకు స్నానాల రేవుకు తీసుకువెళ్లి అక్కడ స్నానం చేయించి 41వ రోజు జల్సా చేస్తారు. వారి వారి స్తోమతను బట్టి చుట్టుపక్కల ఉన్న హిజ్రాలను పిలుచుకుని భోజనాలు పెడతారు. వచ్చిన హిజ్రాలు కానుకల రూపంలో సొమ్ములు చదివించే ఆనవాయితీ వీరిలో కూడా ఉంది. దసరాలో దీక్ష దసరా 9 రోజులు కనకదుర్గమ్మ దీక్ష చేపడతారు. ఎర్రని చీర ధరించి, నెత్తిమీద కుండ.. అందులో వేపాకులు వేస్తారు. మెడలో నిమ్మకాయల దండతో ధరించి భిక్షాటన చేస్తారు. కుండలో వచ్చిన డబ్బుల్లో సగం పేదల భోజనాల కోసం ఖర్చుచేస్తారు. మిగిలిన సొమ్మును హిజ్రాలంతా పంచుకుంటారు. ఉపవాసం వారంలో రెండు రోజులు మంగళ, శుక్రవారాలు ఉపవాసాలు చేస్తారు. ఆ రోజు అన్నం తినరు. కేవలం టిఫిన్‌తో కాలక్షేపం చేస్తారు. అలాగే కొంతమంది వారంలో మూడు రోజు ఉపవాసాలు ఉంటారు. జిల్లా నలుమూలలా.. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో హిజ్రాలు ఉన్నారు. వీరికి ఎన్నికల సంఘం ఇతరుల విభాగంలో ఓటు హక్కు కల్పించింది. అత్యధికంగా భీమవరం పట్టణంలో 103 మంది, ఆచంటలో ఒకరు ఓటర్లుగా నమోదయ్యారు. ఏలూరు, చింతలపూడిలోనూ చెప్పుకోదగిన సంఖ్యలోనే హిజ్రాలు ఉన్నారు. బట్టల వ్యాపారం చేసుకుంటున్నా నా వయస్సు 55. మాది భీమవరం దగ్గరలోని పల్లెటూరు. 8వ తరగతి చదువుతుండగా కుటుంబాన్ని వదిలి వచ్చేశా. అమ్మానాన్న కాలం చేశారు. బంధువులు వదిలేశారు. ఇంటి స్థలం. అర ఎకరం కుటుంబ సభ్యులకు వదిలేశా. ఇప్పటికి సుమారు 40 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నా. ఆరగురు కూతుళ్లను చేరదీశా. వీరిలో ముగ్గురు చనిపోయారు. ముగ్గురున్నారు. ఒకరు ఆగ్రా, మరొకరు పంజాబ్, ఇంకొకరు దిల్బార్లో ఉన్నారు. ప్రస్తుతం బట్టల వ్యాపారం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నా. ప్రత్యేకంగా ఆటో కట్టించుకుని బట్టలు ఇంటింటికీ తిరిగి విక్రయించుకుని వచ్చే లాభంతో బతుకుతున్నా. ప్రభుత్వం ఏదైనా రుణం ఇప్పిస్తే బట్టల వ్యాపారం అభివృద్ధి చేసుకుంటా. – కుమారి, పాలకొల్లు భిక్షాటన చేస్తున్నా.. మాది నంద్యాల. నా పేరు వినోద్‌కుమార్ గౌడ్. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఇంటి నుంచి బయటకు వచ్చేశా. హిజ్రాగా మారిన తరువాత నా కుటుంబ సభ్యులు నన్ను ఇంటికి రానిచ్చేవారు కాదు. ప్రస్తుతం బాగానే చూసుకుంటున్నారు. రైళ్లలో భిక్షాటన చేసుకుని ఉపాధి పొందుతున్నా. ఉత్సవాలకు డాన్స్ చేస్తా. నైట్ డాన్స్ చేస్తే రూ.2 వేలు నుంచి రూ.3 వేల వరకు వస్తుంది. నేను సంపాదించిన దాంట్లోంచి కొంత సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నా. నంద్యాలలోనే అనాథలు, వృద్ధులు, వికలాంగుల సంస్థలు ఉన్నాయి. అక్కడకు పోయి వారికి భోజనాలు, బట్టలకు డబ్బులిస్తుంటా. – వినీత, హిజ్రా దిష్టి తీస్తే శుభం ఇంటికి, వ్యవసాయ భూమికి, షాపులకు హిజ్రాలతో దిష్టి తీయిస్తే మంచిదనే నమ్మకం ఉంది. ఇంటికి పట్టిన శని దోషం పోతుందని.. వ్యవసాయ భూమిలో పంటలు బాగా పండుతాయని.. వ్యాపారం బాగా వృద్ధి చెందుతుందని నమ్ముతారు. అందుకే హిజ్రాలు షాపుల్లోకి వస్తే పదో, ఇరవయ్యో ఇచ్చి పంపిస్తుంటారు. అసభ్యంగా మాట్లాడతారు నలభై ఏళ్ల నుంచి ఎన్నో అవమానాలు పడుతున్నా. ఆటో ఎక్కితే మా పక్కన ఆడవాళ్లు కూర్చోరు. మగవాళ్లు అసభ్యంగా మాట్లాడతారు. ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రత్యేకంగా ఆటో కట్టించుకుని వెళతాం. ప్రభుత్వం మాలాంటి వారికోసం ప్రత్యేక రాయితీలు కల్పించాలి. – రామతులసిæ, భీమవరం రూ.2 లక్షలతో వేషం మారిపోతుంది ఇలాంటి లక్షణాలతో పుట్టిన వారు యుక్త వయసు రాగానే కుటుంబానికి దూరమైపోతున్నారు. సమాజంలో ఒక ప్రత్యేక జాతిగా పిలవబడుతున్నారు. దీనికోసం ముంబయ్, ఢిల్లీ, పూణే వంటి మహానగరాలకు వలస పోతున్నారు. అక్కడ సుమారు రూ.2 లక్షల ఖర్చుతో మగ శరీరాన్ని చంపేసుకుంటున్నారు. ఆడవారిలా మారేందుకు కొన్ని ఇంజెక్షన్లు చేయించుకుంటున్నారు. శరీరంలోని హార్మోన్లను వృద్ధి చేసుకుని కొత్త అవతారంతో సమాజంలోకి మూడో మనిషిగా అవతారం ఎత్తుతున్నారు. కుటుంబ భారం నాపైనే.. మాది భీమవరం పట్టణానికి చేర్చి ఉన్న పల్లెటూరు. 9వ తరగతి చదువుతుండగా ఇంటి నుంచి వచ్చేశా. హిజ్రాగా మారి 13 ఏళ్లయ్యింది. అమ్మ, నాన్నలు చనిపోయారు. అవిటి అక్క, అమ్మమ్మ, తాతయ్య ఉన్నారు. వారి పోషణ నాపై ఉంది. అద్దె ఇల్లు. కరెంట్ లేదు. చాలాహీనంగా బతుకుతున్నా. భిక్షాటన చేసిన సొమ్ములో సగంపైగా శరీర అలంకరణకు సరిపోతుంది. రోజంతా భిక్షాటన చేసినా రూ.200 నుంచి రూ.300కు మించి రాదు. – పూజిత, భీమవరం అమ్మాయిగానే ఊహించుకున్నా.. చిన్నప్పట్నుంచి అమ్మాయిగానే పెరిగా. అబ్బాయిని అని ఏనాడూ అనుకోలేదు. పూజిత అమ్మ నన్ను చేరదీసింది. తను నాకు స్కూల్లో పరిచయం. తను, నేను ఒకే పాఠశాలలో చదివాం. ఇప్పటికి హిజ్రాగా మారి ఆరేళ్లయ్యింది. స్లిమ్‌గా ఉండడానికి సంపాదించిన సొమ్ములో కొంత పోతుంది. అమ్మ (పూజిత) నన్ను సాకుతోంది. ఏ అవసరం ఉన్నా అమ్మే చూసుకుంటుంది. – సురేఖ, భీమవరం డిమాండ్స్ ♦ హిజ్రాలకు ఓటరు జాబితాలో చోటిచ్చారు. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పించలేదు ♦ డ్వాక్రా మహిళలకు ఇస్తున్న మాదిరిగానే బ్యాంకులు రుణాలివ్వాలి ♦ ఇళ్లస్థలాలు కేటాయించి ప్రభుత్వమే పక్కా గృహాలు నిర్మించాలి ♦ విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగులు మాదిరిగా ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి ♦ భిక్షాటన చేసుకునే సమయంలో వారికి పోలీసులు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదు నృత్య ప్రదర్శనలు ఇచ్చే ♦ సమయంలోనూ పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించకూడదు అని హిజ్రాలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
హిజ్రాభవన్లో 2 కిలోల బంగారం, నగదు చోరీ!
⇒ చుడీబజార్‌లో పట్టపగలే దోపిడీ ⇒ లబోదిబోమంటున్న హిజ్రాలు హైదరాబాద్: పెళ్లిళ్లు... పేరంటాలు... దుకాణాలు తిరిగి హిజ్రాలు కూడబెట్టుకున్న సొత్తును దుండగులు దోచుకెళ్లారు. పట్టపగలే చుడీబజార్లోని హిజ్రా భవన్‌లోకి చొరబడి దాదాపు రెండు కిలోల బంగారం, పెద్దమొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని 25 మంది హిజ్రాలు తాము రోజూ సంపాదించే డబ్బులు, బంగారం హిజ్రాభవన్లో నివసించే వారి నాయకురాలు జ్యోతినాయక్ (చౌదరి) వద్ద దాచుకుంటారు. ఈ భవనంలో కొందరు హిజ్రాలు కూడా నివాసముంటున్నారు. వీరు దాచుకున్న సొత్తుపై కన్నేసిన దుండగులు... భవనంలో ఎవరూ లేని సమయం చూసి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలు, పెట్టెలు, కప్‌బోర్డుల్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని ఉడాయించారు. ఈ మేరకు హిజ్రాలు షాహినాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తాము కష్టపడి దాచుకున్నదంతా దోచుకెళ్లారంటా లబోదిబోమన్నారు. గోషామహల్ ఏసీపీ రాంభూపాల్‌రావు, ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. అంతా అయోమయం... ఈ ఘటనలో ఎంత బంగారం చోరీ అయిందన్నది హిజ్రాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. ముందు 5కిలోల బంగారం, రూ.50 లక్షల నగదు పోయిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు సోదా చేస్తున్న క్రమంలో 2 కిలోల బంగారం దోచుకెళ్లారన్నారు. వివరాలు సేకరిస్తున్నాం... చోరీకి గురైన బంగారంలో అసలెంతో... నకిలీ ఎంతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. హిజ్రాభవన్ను పరిశీలించిన ఆయన... హిజ్రాలు రోజూ తిరుగుతూ జమ చేసుకునే ఆభరణాలు చోరీకి గురికావడం విచారకరమన్నారు. సీసీ కెమెరాల ద్వారా దొంగలను పట్టుకుని, సొత్తును వారికి అప్పగిస్తామన్నారు. వాస్తవంగా ఎంత బంగారం, నగదు చోరీ అయ్యాయో లెక్క తేలాల్సి ఉందన్నారు. -
బంద్‌లో భగ్గుమన్న ఆదిలాబాద్
- ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం - కేసీఆర్ ఫ్లెక్సీ దహనం చేసిన హిజ్రాలు ఆదిలాబాద్ క్రైం: నిర్మల్‌ను జిల్లా చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం ఆదిలాబాద్‌లో చేపట్టిన బంద్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేయడంతో పోలీసులు సమితి నాయకులను అడ్డుకున్నారు. బంద్‌తో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని, ఫ్లెక్సీని హిజ్రాలు దహనం చేశారు. ఆయా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కేసీఆర్, మంత్రి రామన్న, ఆదిలాబాద్ ఎంపీ గొడాం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే బాపురావు ఫ్లెక్సీలను దహనం చేశారు. ఆదిలాబాద్ సంరక్షణ సమితి నాయకులు ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి రిమ్స్‌కు తరలించారు. జనగామ కోసం చండీయాగం జనగామ: జనగామ జిల్లా కోసం గురువారం జ్వాలా నరసింహ చండీయాగం నిర్వహించారు. యాగానికి చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట, లింగాలఘనపురం, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి వంటి ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగారెడ్డి జిల్లాలో బంద్ సంపూర్ణం సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని గురువారం ఏడో రోజు బంద్ సంపూర్ణంగా జరిగింది. ముంబై-బెంగుళూరు జాతీయ లింకు రహదారిలో వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఉదయం నుంచి సాయంత్రం వరకు రాస్తారోకో చేశారు. -
హిజ్రాలకు సమాన హక్కులు కల్పించాలి
కర్నూలు(అర్బన్): స్రీ, పురుషలతో పాటు హిజ్రాలకు కూడా సమాన హక్కులు కల్పించాలని హిజ్రా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మాధురి ఆందోళన వ్యక్తం చేశారు. మానవులతో సమానంగా హిజ్రాలకు కనీస హక్కులు కల్పించాలన్న డిమాండ్‌పై ఇండియన్ నేషనల్ సమతా హిజ్రా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో హిజ్రాలు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో 4.5 కోట్ల మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారని, వీరి కోసం రూపొందించిన రైట్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్స్–2015 బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది లోక్‌సభలో పొందలేదన్నారు. ఈ బిల్లును చట్టబద్ధం చేసి సమాజంలో అందరితో సమానమే అనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. కార్యక్రమంలో హిజ్రాల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయకుమార్, రాష్ట్ర కార్యదర్శులు స్వప్నమ్మ, దీపారెడ్డి, ఇందు, అనంతపురం జిల్లా అధ్యక్షులు మయూరి, కర్నూలు నగర నాయకులు ప్రవీణ, స్వప్న, జెస్సీ తదితరులు పాల్గొన్నారు. వీరి దీక్షకు ట్రై బల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.చంద్రప్ప, ఉపాధ్యక్షుడు రామరాజు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులతో పాటు పలు ప్రజాసంఘాలకు చెందిన నాయకులు దీక్షా శిబిరం వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు. -
అక్కడ హిజ్రాలను దేవతలుగా పూజిస్తారు
దేవనిపట్టినమ్: తమిళనాడులోని దేవనిపట్టినమ్ చేపల వేటపై బతికే ఓ చిన్న గ్రామం. అక్కడ దుర్భర జీవితాన్ని అనుభవించే హిజ్రాలను కోఠీలని, కిన్నార్లని, అరవాణిలని ప్రాంతాలనుబట్టి పిలుస్తారు. వారు ఏడాదిలో పది రోజులు మినహా మిగతా అన్ని రోజుల్లో అడుక్కుతింటూ లేదా కూలినాలి చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వారి పట్ల తోటి సమాజం పెద్ద గౌరవం కూడా చూపదు. ఏడాదిలో పది రోజులు మాత్రం వారు దేవతా మూర్తులుగా ప్రజలచేత మన్ననలు అందుకుంటారు. పూజలు, పుణ్య కార్యక్రమాలకు అర్హులవుతారు. ఈ పది రోజులు వారికి పండుగే. ఈ పండుగనే ఇక్కడి ప్రజలు ‘కొల్లాయి పండగ’ అని పిలుస్తారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి లేదా మర్చి నెలలో జరిగే ఈ పండుగ అనాదిగా వస్తున్న సనాచారం. ఈ పది రోజులుపాటు హిజ్రాలు దేవతా మూర్తులుగా ముఖానికి రంగులు వేసుకుంటారు. సగం మనిషి, సగం దేవతామూర్తిగా ముఖానికి మేకప్ వేసుకుంటారు. దేవాలయానికి వచ్చి ప్రజలచేత పూజలు అందుకుంటారు. ప్రజలను సుఖశాంతులతో వర్థిల్లాల్సిందిగా దీవెనలిస్తారు. దేవాలయంలో నృత్యాలు చేస్తారు. వారిలో కొందరు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ భవిష్యవాణిని వినిపిస్తారు. మూర్చలు పోతారు. అనంతరం వీధుల్లో గుంపులుగా సంచరిస్తారు. ఆ గ్రామంలోని ప్రతి కుటుంబం వారిని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించి కొత్త బట్టలతో సత్కరిస్తారు. వారి నుంచి దీవెనలు స్వీకరిస్తారు. ఈ పది రోజులు మాత్రం హిజ్రాల జీవితం పుష్టిగా మూడు పూటల భోజనం, ఆరు పూటల తీర్థ ప్రసాదులుగా ఏ లోటు లేకుండా సాగిపోతుంది. పది రోజులు ముగిశాక వారు మళ్లీ సాదారణ జీవితంలోకి అడుగుపెడతారు. మళ్లీ కష్టాలు, కనీళ్లు షరా మామూలే. కాయకష్టం చేయకుండా పూట గడవడం కూడా కష్టమే. వారిలో కొందరు పెళ్లిళ్లు చేసుకొని కుటుంబాలను కూడా పోషిస్తుండగా, ఎక్కువ మంది జీవితాంతం బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. సమాజంలో మూడవ జెండర్‌గా గుర్తింపు పొందిన హిజ్రాలు అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే రాణిస్తుండగా, ఇంకా ఆ మార్పు ఛాయలు మాత్రం తమిళనాడులోని దేవనిపట్టినమ్లో కనిపించడం లేదు. -
'హవేలీ హిజ్రాల నుంచి రక్షణ కల్పించండి'
సుల్తాన్‌బజార్(హైదరాబాద్ సిటీ): నగరంలో హిజ్రాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. పాతబస్తీలో నివసించే ఒక వర్గం హిజ్రాలు తమపై దౌర్జన్యానికి పాల్పడుతోందంటూ తెలంగాణ హిజ్రా వెల్ఫేర్ బోర్డు ఆరోపించింది. గురువారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో హిజ్రా బోర్డు సభ్యులు లైలా, చంద్రముఖి, గౌతం, రంజితలు తమ గోడు వెళ్లగక్కారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బతకడమే కష్టమవుతోన్న పరిస్థితుల్లో పాతబస్తీకి చెందిన హవేలీ హిజ్రాలు తమపై దాడులు చేస్తూ తీవ్రంగా వేధిస్తున్నారని బోర్డు సభ్యులు చెప్పారు. తమకు తామే హిజ్రాలకు నాయకులమని ప్రకటించుకున్న హవేలీ హిజ్రాలు.. ఇతర దేవుళ్లకు మొక్కొద్దని, ఎలాంటి పూజలు చేయొద్దని, కేవలం తమ మతాన్ని పాటించాలని వేధిస్తున్నట్లు తెలంగాణ హిజ్రాలు ఆరోపించారు. 'ఇష్టమైన దేవుణ్ని పూజిస్తే హవేలీ హిజ్రాలు సహించట్లేదు. దాడులుచేసిమరీ జరిమానాలు విధిస్తున్నారు. హైదరాబాద్ లో ఉండాలంటే నెలకు రూ. 11వేలు చెల్లించాలని బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంమే కల్పించుకుని హవేలీ హిజ్రాల నుంచి మాకు రక్షణ కల్పించాలి' అని తెలంగాణ హిజ్రా వెల్ఫేర్ బోర్డు సభ్యులు కోరారు. -
రైలు నుంచి ప్రయాణికుడిని తోసేసిన హిజ్రాలు
మృతి చెందిన ఒడిశా వాసి టెక్కలిరూరల్: డబ్బులివ్వలేదనే కారణంతో కదులుతున్న రైలు నుంచి హిజ్రాలు తోసేయడంతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడ సమీపంలో సోమవారం జరిగింది. తోటి ప్రయాణికుల కథనం ప్రకారం.. కేరళ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న వివేకానంద ఎక్స్‌ప్రెస్ రైలులో ఒడిశాలోని నయాగఢ్ జిల్లా చడమోల్ గ్రామానికి చెందిన పూర్ణచంద్ర సాహు, మరికొందరు వలస కార్మికులు భువనేశ్వర్‌కు వెళ్తున్నారు. ఇదే రైలులో ప్రయాణిస్తున్న నలుగురు హిజ్రాలు డబ్బులు అడగ్గా.. వారు నిరాకరించడంతో గొడవ మొదలైంది.ఈ క్రమంలో పూర్ణచంద్ర సాహు(45)ను నౌపడ రైల్వేస్టేషన్ సమీపంలో హిజ్రాలు రైలు నుంచి తోసేశారు. ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపి, వారు సాహు వద్దకు వెళ్లేసరికి.. అప్పటికే మృతి చెందాడు. హిజ్రాలు తప్పించుకుని పారిపోయారు. అయితే సాహు రైలులో తలుపు వద్ద కూర్చొని కిందకు పడిపోవడం వల్లే మృతి చెందాడని జీఆర్పీ సీఐ మురళీ వెల్లడించారు. -
మానవత్వం చూపిన హి(వ)జ్రాలు..
రైలులో మహిళకు పురిటి నొప్పులు.. ప్రసవం జరిపిన హిజ్రాలు ఆలేరు: హిజ్రాలు.. మానవత్వం చూపడంలో వజ్రాలని నిరూపించుకున్నారు. రైలులో వెళ్తున్న మహిళకు పురిటినొప్పులు రావడంతో ప్రసవం జరిపారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మా య, చోటు దంపతులు బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా భోపాల్‌కు వెళ్తున్న గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నారు. రైలు రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలోకి రాగానే మాయకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్ర యాణికులకు ఎటూ పాలు పోవడం లేదు. ఇంతలో ఇదే బోగీలోకి ప్రవేశించిన వరంగల్‌కు చెందిన హిజ్రాలైన నిహారిక, జాస్మి న్, లూసియాలు పురిటి నొప్పులతో బాధపడుతున్న మాయను చూశారు. వెంటనే ఆమెను అదే బోగీలోని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి ప్రసవం జరిపారు. మాయ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రైలు డ్రైవర్‌కు కొందరు చెప్పగా, రైలును ఆలేరు లో నిలిపివేశారు. అప్పటికే 108 వాహనాని కి సమాచారం అందించగా, వారు స్టేషన్‌కు వచ్చారు. తల్లీబిడ్డలను ఆలేరులోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. -
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట హిజ్రాల ఆందోళన
హైదరాబాద్ : తమపై దాడి చేసి గాయపరిచిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హిజ్రాలు శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని ఇందిరానగర్ - జవహర్కాలనీలో నివాసముంటున్న మొనాలిసా అనే హిజ్రా బోనాల పండుగ రోజున మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. తనపై నమిత అనే మరో హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చిందని మొనాలిసా భావించింది. ఆ క్రమంలో నమితపై మోనాలిసా గురువారం రాత్రి రౌడీలతో దాడి చేయించింది. ఈ దాడిలో నమిత చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే విషయంపై గత మూడు రోజులుగా ముగ్గురు హిజ్రాలను రౌడీలు కిడ్నాప్ చేసి బాలానగర్‌లో ఓ గదిలో ఉంచి తీవ్రంగా హింసించారు. ఈ నేపథ్యంలో హిజ్రాలు బంజారాహిల్స్ పీఎస్‌కు చేరుకుని మొనాలిసాను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బోనమెత్తిన హిజ్రాలు
శ్రీశైలం: తెలంగాణలో బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది. అయితే అంతే ఘనంగా జరపాలనుకున్నారు ఈ హిజ్రాలు. అందుకే ఆదివారం విజయవాడకు చెందిన కొంతమంది కలిసి శ్రీశైల భ్రమరాంబకు బోనాలను సమర్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీశైలంలోని గంగాధర మండపం వద్ద ఒక హిజ్రా బోనం తలపై పెట్టుకుని రాగా.. మరో ముగ్గురు హిజ్రాలు ఆటపాటలతో నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి వెళ్లి బోనాలను సమర్పించారు. -
చట్టాలపై హిజ్రాలకు అవగాహన
విజయనగరం: హిజ్రాలకు ప్రత్యేకంగా చేసిన చట్టాలతో పాటు సుప్రీంకోర్టు ఇటీవల కల్పించిన వెసులుబాటు వివరాలపై బుధవారం ఇక్కడ అవగాహన కల్పించారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి నాగశేషనాయుడు హిజ్రాల హక్కులతో పాటు చట్టాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షురాలు వీణ, ఉచిత న్యాయ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
హిజ్రాల కోసం వెళ్తే.. సాఫ్ట్ వేర్లు దొరికారు..!
బంజారాహిల్స్: అర్థరాత్రి రోడ్ల పక్కన నిలబడి వాహనదారులను, పాదచారులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న హిజ్రాలపై జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదు మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోలీసులకు చిక్కారు. వీరంతా హిజ్రాల కోసం వచ్చి వారితో మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత కాలంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5 లోని అన్నపూర్ణ స్టూడియో, ఏడెకరాల మధ్య ఉన్న రోడ్డులో ఈ కార్యకలాపాలు జరుగుతుండటంతో పాటు గొడవలు నిత్యకృత్యంగా మారాయి. ఇందిరానగర్ - శ్రీకృష్ణానగర్ గడ్డ మీది నుంచి జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కార్యాలయం మీదుగా జూబ్లీహిల్స్‌వైపు వెళ్లే రోడ్డులో నిత్యం హిజ్రాలు మాటువేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రత్యేక హోదా సాధించాలి.. లేకపోతే...?
అనంతపురం: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని.. లేకపోతే సీమాంధ్ర ఎంపీలకు హిజ్రాలతో స్వాగతం చెబుతామని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లక్షల మందిని ఆహ్వానించిన ప్రభుత్వం ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 27 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సూచించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
నగరంలో కదం తొక్కిన హిజ్రాలు
-
‘హిజ్రాల హక్కుల రక్షణ’కు ఓకే
డీఎంకే ఎంపీ తెచ్చిన ప్రైవేట్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం న్యూఢిల్లీ: దేశంలోని హిజ్రాల హక్కుల రక్షణ అంశానికి సంబంధించిన ప్రైవేట్ బిల్లును రాజ్యసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘ది రైట్స్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ బిల్-2014’ ను డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో 36 ఏళ్ల తర్వాత ఒక ప్రైవేట్ బిల్లుకు ఆమోదం లభించడం గమనార్హం. 1979లో ‘అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సవరణ బిల్లు’ను రాజ్యసభ ఆమోదించింది. తాజా బిల్లుపై తొలుత కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ మాట్లాడారు. హిజ్రాల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం ఉత్తమ బిల్లు రూపొందిస్తుందని, ప్రైవేటు బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే శివ తాను తెచ్చిన బిల్లుపై ఓటింగ్ కు పట్టుబట్టారు. మంత్రి అరుణ్‌జైట్లీ కలుగజేసుకుని.. హిజ్రాల హక్కుల రక్షణపై అందరూ సానుకూలంగానే ఉన్నందున ఏకగ్రీవంగా ఆమోదిద్దామన్నారు. ప్రభుత్వానికి మంచి అవకాశమని, బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి అన్నారు. సభలోనే ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్‌తో పాటు 19 మంది కేంద్ర మంత్రులు, అధికార సభ్యులంతా మద్దతు పలికారు. తర్వాత బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. అనంతరం శివ సభలోని సీనియర్ నేతల దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో 4.5 లక్షల మంది హిజ్రాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉందని.. కానీ 20 నుంచి 25 లక్షల మంది వరకు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయని తిరుచ్చి పేర్కొన్నారు. వారి హక్కులకు ఎలాంటి గుర్తింపు లేనందున వివక్షకు గురవుతున్నారని, ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే వారి హక్కులకు రక్షణ లభిస్తుందన్నారు. -
హోలీ మామూలు కోసం హిజ్రాల దౌర్జన్యం
హైదరాబాద్: హోలీ పండుగను పుర స్కరించుకుని అడిగినంత చందా ఇవ్వలేదని ఆగ్రహించిన హిజ్రాలు...ఓ దుకాణాన్ని ధ్వంసం చేయటంతోపాటు యజమానిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. అడ్డగుట్ట డివిజన్‌కు చెందిన శ్రీనివాస్ తుకారాం గేట్ మీనా హాస్పిటల్ ఎదురుగా మొబైల్ దుకాణం నడుపుతున్నారు. కొంత మంది హిజ్రాలు దుకాణం వద్దకు వచ్చి శ్రీనివాస్‌ను... హోలీ పండుగ చందా ఇవ్వాలని అడిగారు. ఆయన రూ.50 ఇవ్వబోగా రూ.500 డిమాండ్ చేశారు. ఇవ్వలేనని అనడంతో ఆయనను కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కున్నారు. దుకాణంలోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన తుకారాంగేట్ పోలీసులు..దౌర్జన్యానికి పాల్పడ్డ నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. -
హిజ్రాలకు కౌన్సిలింగ్
వరంగల్ అర్బన్: రైళ్లలో ప్రయాణికుల పట్ల హిజ్రాల ఆగడాలు ఎక్కువ అవుతుండటంతో వరంగల్ జిల్లా రైల్వే పోలీసులు శుక్రవారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. సుమారు 100 మంది హిజ్రాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. రైళ్లలో ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించవద్దని వారికి సూచించారు. జుగుప్సాకరమైన కార్యక్రమాలకు పాల్పడి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు. అలాంటి పనులకు పాల్పడితే రైల్వే చట్టప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. కౌన్సిలింగ్లో వరంగల్ జీఆర్పీ సీఐ రవికుమార్, ఎస్ఐ గోవర్ధన్, ఆర్పీఎఫ్ సీఐ హరిబాబు,ఎస్ అనామిక మిశ్రాలు నిర్వహించారు. -
ప్రయాణికుడి డబ్బులు లాక్కున్న హిజ్రాల అరెస్ట్
* రూ.7,500 రికవరీ * జీఆర్పీ సీఐ రవికుమార్ మట్టెవాడ : ప్రయాణికుడిని బెదిరించి డబ్బులు లాక్కున్న హిజ్రాలను వరంగల్ జీఆర్పీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జీఆర్పీ సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. కేరళ నుంచి బిలాస్పూర్ వెళ్లే ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులోని జనరల్ బోగీలో చత్తీస్‌గఢ్‌కు చెందిన శివచరణ్‌కుమార్ ప్రయాణిస్తున్నాడు. వరంగల్ ప్రాంతానికి చెందిన హిజ్రాలు స్టెల్లా, లావణ్య, రజిత, శ్రీజ, హాసిని వరంగల్ స్టేషన్లో ఈ రెలైక్కారు. వారు శివచరణ్‌ను డబ్బులు అడగగా కొన్ని ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. కానీ హిజ్రాలు అవి చాలవని, అతడి వద్ద ఉన్న బ్యాగు లాక్కుని అందులోని రూ.7500 తీసుకున్నారు. అనంతరం రైలు వడ్డేపల్లి చెవువు సమీపంలో ఆగిన పుడు దూకి పారిపోయారు. ఈ సంఘటనను రైల్వే అధికారుల దృష్టికి ఫోన్ ద్వారా ప్రయాణికులు తీసుకెళ్లగా జీఆర్పీ పోలీసులు వారిని నాగేంద్రనగర్‌కు చెందిన హిజ్రాలుగా గుర్తించారు. ఈ క్రమంలోనే శివనగర్ వైపు ఉన్న రోడ్డుపై నిందితులైన హిజ్రాలను పట్టుకున్నారు. వారి నుంచి రూ.7500 రికవరీ చేయడంతోపాటు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 384 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీఐ హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘మేము సైతం..’ ట్రాఫిక్‌పై హిజ్రాల అవగాహన
కొరుక్కుపేట: నిత్యం రోడ్లపై మరణమృదంగ ధ్వనులు వినిపిస్తున్నాయి. విపరీతమైన రద్దీ, నిబంధనలు పాటించని వాహనచోదకులు, ఎవరికి వారు తొందరగా వెళ్లాలనే తొందర ఇవన్నీ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆచరణలో అది కనిపించడం లేదు. రెండు, మూడు నెలలుగా ఎన్జీవోలు, విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీరి బాటలోనే మేము సైతం అంటూ నగరానికి చెందిన కొందరు హిజ్రాలు గళం విప్పారు. అన్నానగర్ చర్చి వద్ద సోమవారం వారు జాగ్రత్తలు పాటించండి.. ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు.. తొందరపాటు పనికిరాదంటూ హితవు పలికారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్లకార్డులు ప్రదర్శించారు. కరపత్రాలు పంచారు. -
హిజ్రాల్లో వర్గపోరు, ఒక గ్రూప్ పై మరొకరు దాడులు!
వరంగల్: బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను, రైళ్లలో ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్న హిజ్రాల్లో వర్గపోరుకు తెరలేచింది. వర్గపోరులో భాగంగా హిజ్రాలకు చెందిన ఓ గ్రూప్ మరో గ్రూప్ పై దాడులు చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటన వరంగల్ చోటు చేసుకుంది. హిజ్రాల్లోని సౌజన్య వర్గంపై 30 మందితో లైలా వర్గం దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడుల్లో పలువురికి తీవ్రగాయాలవ్వడంతో చికిత్స కోసం వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంలో హిజ్రాల ఆగడాలు ఎక్కువయ్యాయంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్న సంగతి తెలిసిందే. -
యువకుడి గొంతు కోసిన హిజ్రాలు
నెల్లూరు జిల్లాలో హిజ్రాల ఆగడాలు రోజురోజూకు అధికమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికుడిని హిజ్రాలు నగదు డిమాండ్ చేశారు. అందుకు అతడు నిరాకరించాడు. దాంతో హిజ్రాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నగదు అడిగితే ఇవ్వవా అంటూ ప్రయాణికుడి గొంతు కోశారు. దాంతో అతడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. అతడి వద్ద ఉన్న బంగారాన్ని హిజ్రాలు దోచుకుని, అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సహాయం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని పోలీసులకు సూచించారు. దాంతో అతడిని నెల్లూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు పూడేరుకు చెందిన చిట్టిబాబుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. -
సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం
న్యూఢిల్లీ: లింగమార్పిడి చేయించుకున్నవారిని ‘థర్డ్ జెండర్’గా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హిజ్రాలు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. అయితే సమాజం కూడా తమను గుర్తిస్తుందా? లేదా? అనే విషయంలో కొంత ఆందోళన వ్యక్తం చేసినా సుప్రీం తీర్పుతో గుర్తిస్తుందనే భరోసా లభించిందన్నారు. ‘సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పునివ్వడం ఆనందంగానే ఉంది. అయితే ఈ సమాజకం మమ్మల్ని ‘మూడోశ్రేణి’గా గుర్తిస్తుందా? లేదా? అనే విషయంలోనే కొంత ఆందోళన’ అని షైలా జాన్ అభిప్రాయపడ్డారు. అయితే తమకూ మంచిరోజులు వస్తున్నాయని చెప్పేందుకు పడిన తొలి అడుగు ఇదని, సమాజంలో తమ గురించి అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో కూడా మార్పు రావాలని తాము ఆశిస్తున్నామని చెప్పారు. ట్రాన్స్జెండర్లను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారీగా పరిగణించాలంటూ న్యాయమూర్తులు కె.ఎస్. రాధాకృష్ణన్, ఎ.కె. సిక్రిలతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని ధర్మాసనం ఆదేశించడంతో తమ ఎన్నోరోజుల కల నెరవేరిందన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పు చాలా గొప్పగా ఉంది. ఇకపై మాకూ మిగతావారితో సమానంగా హక్కులు అనుభవించే అవకాశం వస్తుందంటేనే మనసు ఉప్పొంగుతోంది. అయితే సమాజమే మమ్మల్ని ఎలా ఆమోదిస్తుందనే విషయంలోనే కాస్త ఆందోళన. కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మిగతావారిలాగే మమ్మల్ని స్నేహితులుగా చూస్తారా? లేక వెలివేస్తారా? అనేది రానున్న రోజుల్లో స్పష్టం కానుంద’ని చాందినీ అభిప్రాయపడ్డారు. -
మేమే నయం
మా విలువలు కాపాడుకునేందుకే రాజకీయాల్లోకి.. మాకు డబ్బు వ్యామోహంలేదు... పొట్టకూటికోసమే భిక్షాటన ఖమ్మం నుంచి బరిలోకి దిగిన హిజ్రాల సంఘం రాష్ట్ర కార్యదర్శి మేరీ ఈరగాని భిక్షం, ఖమ్మం మా ఓట్లు తమకే వేయాలంటూ ఎన్నికలప్పుడు నాయకులు బతిమలాడుతారు. కానీ గెలిచాక మా బాగోగులు ఎవరూ పట్టించుకోరు. స్త్రీ,పురుషులకు వేర్వేరుగా రిజర్వేషన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. కానీ మేం గుర్తుకు రాం. మేమూ భారతీయులమే కదా.. అయినా మమ్మల్ని గుర్తించేవారే కరువయ్యారు. మా విలువలు మేం కాపాడుకోవాలి కదా. అందుకే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి సత్తాచాటాలని నిర్ణయించుకున్నా... అంటున్నారు హిజ్రాల సంఘం రాష్ట్ర కార్యదర్శి దోమల మేరీ. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే.. అందరిలా ఆడగానో.. మగగానో పుట్టి ఉంటే అందరితో సమానంగా జీవించే వాళ్లం. కానీ విధి వంచితులుగా పుట్టినందుకు ప్రతీ చోట అవమానాలు భరించాల్సి వస్తోంది. చిన్నప్పటి నుంచి బడి, గుడి, బజారు, ఇంటా బయట ఎక్కడైనా చిన్న చూపే. వీటన్నింటినీ తట్టుకొని గురువుల సహకారంతో ఎనిమిదో తరగతి చదివిన నేను ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. నాలాంటి వారందరం ఒక చోటికి చేరి ఒకరికి ఒకరం మనోధైర్యం కల్పించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. జీవించేందుకు ఏ పనిచేయాలన్నా.. ఎవరూ రానివ్వరు అందుకోసమే పొట్టకూటి కోసం భిక్షాటన చేయాల్సి వస్తోంది. ఖమ్మంలో సుమారు ఐదు వందల మందిమి, జిల్లావ్యాప్తంగా రెండువేల మంది ఉన్నాం. మా అందిరి ఓట్లకోసం ఎన్నికలప్పుడు నాయకులు వస్తారు. కనీసం మమ్మల్ని మనుషులుగా గుర్తించే వారు కరువయ్యారు. నాతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న మా హిజ్రాలకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలని డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరం జరిగిన హిజ్రాల రాష్ట్ర మహాసభల్లో రాజకీయంగా ఎదగాలని తీర్మానం చేశాం. అందులో భాగంగానే రాజకీయాల్లోకి వచ్చాం. ఇప్పటి నుంచి ప్రతీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. పట్టించుకోనందుకే.. మాకు ప్రత్యేకమైన గుర్తింపులేదు. ఏ కార్యాలయానికి వెళ్లినా మిమ్మల్ని ఏ జాబితాలో చేర్చాలని అధికారులు అవహేళన చేస్తుంటారు. అందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగ, ఉపాధి మార్గాలు, రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కానీ మా గురించి ఆలోచించేవారు లేరు. అదే మా వర్గం నుంచి ఒక్కరు అసెంబ్లీకి వెళ్లినా మా వాణి విపిస్తారు. మా సమస్యపై చర్చ జరిగేలా చూస్తారు. అందుకోసమే పోటీలోకి దిగా. ప్రజల నమ్మకమే నన్ను గెలిపిస్తుంది రాజకీయాల్లో విలువలు లేకుండా పోయాయి. ఎన్నికల ముందు ఒక మాట.. గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారు. అలా మాటతప్పే వారికంటే మేమే నయం. మాకు ఏ ఆపేక్ష లేదు. డబ్బులు సంపాదించుకోవాలనే తపన అస్సలు లేదు. ప్రజలకోసం, మా లాంటి అభాగ్యుల కోసం పనిచేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నాం. విధి వంచితులమైన మాలాంటి వారితోపాటు వివిధ కారణాలతో సమాజం నుంచి బహిష్కరణకు గురైన వారికోసం పాటుపడతాం. సమాజంలో ఎక్కడికి వెళ్లినా చిన్నచూపే. పని దొరకకపోవడంతో పొట్టకూటికోసం భిక్షాటన చేస్తున్నాం. ఏ స్వార్థం లేని మేం ప్రజలకు సేవచేస్తామని వారు నమ్ముతున్నారు. ఆ నమ్మకమే నన్ను విజయ తీరం చేరుస్తుంది. -
మేమూ ఓటర్లమే..
- ఓటర్ల జాబితాలో పెరుగుతున్న తృతీయ ప్రకృతి వ్యక్తులు - ‘అదర్స్’గా గుర్తింపు ఇచ్చిన ఈసీ - రాష్ట్ర ఓటర్లలో 4,422 మంది ఎలక్షన్ సెల్: ఓటర్ల జాబితాలో తృతీయ ప్రకృతి వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ‘సెక్సువల్ మైనారి టీలు’గా గుర్తింపు పొందిన మూడో ప్రకృతుల జనాభా 60 లక్షల దాకా ఉంటుందని అంచనా. కానీ ఓటర్ల జాబితాలో మాత్రం వారికి కొంతకాలం క్రితం దాకా ‘ప్రత్యేక’ గుర్తింపు లేదు. దాంతో వారు స్త్రీ లేదా పురుషుడిగా మాత్రమే పేరు నమోదు చేయించుకోవాల్సి వచ్చేది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా తప్పుడు లైంగికతను నమోదు చేసుకోలేక హిజ్రాలు, లింగమార్పిడి చేయించుకున్న వారు ఓటింగ్ ప్రక్రియకే దూరంగా ఉండే వారు. ఈ నేపథ్యంలో వారికి ఓటర్ల జాబితాలో ‘థర్డ్ సెక్స్’గా ప్రత్యేక గుర్తింపు కల్పిం చాలన్న డిమాండ్ 1994 నుంచే మొదలైంది. అది చివరికి 2009లో నెరవేరింది. హిజ్రాలకు, లింగ మార్పిడి చేయించుకున్న వారిని ‘అదర్స్’గా ఓటర్ల జాబితాలో ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. ప్రస్తుతం వీరి సంఖ్య రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో అత్యధికం (447)గా ఉంది. కర్నూలు జిల్లాలో 358, నల్లగొండ జిల్లాలో 63 మంది తృతీయ ప్రకృతులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నమోదైన 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లలో 500 మంది తృతీయ ప్రకృతులున్నారు. ఎన్నికల్లో ఇదో ‘గే’ల... మైనారిటీల ఓట్లు మన దేశంలో ఎంత కీలకమో తెలిసిందే. ఎన్నికల వేళ పార్టీలన్నీ వారి ఓట్ల కోసం పాకులాడుతుంటాయి. మతపరమైన, భాషా పరమైన మైనారిటీల్లాగే లైంగికపరమైన మైనారి టీలు కూడా తాజాగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ వర్గాన్ని ‘లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్’ (ఎల్జీబీటీ)గా సంబోధి స్తున్నారు. ఐపీసీ 377 సెక్షన్ ప్రకారం స్వలింగ సంపర్కం నేరమేనంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పడం తెలిసిందే. దేశంలో దాదాపు 25 లక్షల మంది స్వలింగ సంపర్కులున్నారని ఆ కేసు విచారణ సమయంలో కేంద్రం కోర్టుకు తెలిపింది. వారి వాస్తవ సంఖ్య దాదాపు 10 కోట్ల దాకా ఉంటుందన్నది స్వచ్ఛంద సంస్థల అంచనా. మన రాష్ట్రంలో 2014 ఓటర్ల జాబితాలో ఆడా, మగా కాని వారి సంఖ్య 4,422గా నమోదైంది. 2009 ఎన్నికలతో పోలిస్తే (2,423) ఇది దాదాపు రెట్టింపు. సామాజిక అవహేళనకు భయపడి చాలామంది తమ లైంగికతను బయటకు చెప్పుకోలేకపోతున్నారని చెబుతుంటారు. భారత్‌తో పోలిస్తే, పాశ్చాత్య దేశాల్లో ఎల్జీబీటీ వర్గం కోసం పోరాడే సంస్థలు చాలా క్రియాశీలంగా ఉన్నాయి. అవి ప్రభుత్వ విధానాలను సైతం ప్రభావితం చేయగలుగుతున్నాయి. అమెరికాలో స్వలింగ సంపర్కుల సంఖ్య దాదాపు 3.5 కోట్ల దాకా ఉంది. దాంతో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఎల్జీబీటీ వర్గానికి ఒబామా పలు వరాలు కురిపించారు. ఆయన గెలుపులో ఈ వర్గం పాత్ర కూడా గణనీయమైనదని విలియమ్స్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. భారత్‌లోనూ వీరి సంఖ్య గణనీయంగానే ఉన్నా, సుప్రీం తీర్పు నేపథ్యంలో పార్టీలు ధైర్యంగా ముందుకొచ్చి ఎల్జీబీటీ హక్కులపై బాహాటంగా హామీలిచ్చే పరిస్థితి కన్పించడం లేదు. విదేశాల్లో ఇలా... బ్రిటన్‌లో 50 మంది స్వలింగ సంపర్కులు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బంగ్లాదేశ్‌లో హిజ్రా ఓటర్ల సంఖ్య లక్షకు పైబడింది. దాంతో ఎన్నికల కమిషన్ 2001 ఎన్నికల్లో వీరి కోసం పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసింది! యూరోపియన్ యూనియన్ దేశాల్లో స్వలింగ సంపర్కం నేరం కాదు. స్వలింగ వివాహాలకు 7 ఈయూ దేశాలు చట్టబద్ధత కల్పించాయి. ఉత్తర అమెరికా, ఈయూలతో పాటు పలు లాటిన్ అమెరికన్ దేశాల్లో కూడా స్వలింగ సంపర్కానికి ప్రజామోదం ఉంది. పశ్చిమాసియా, ఆఫ్రికా, రష్యా, ఆసియాల్లోని పలు దేశాల్లో అదే స్థాయిలో వ్యతిరేకత ఉంది. తొలి హిజ్రా ఎమ్మెల్యే షబ్నమ్ మౌసీ దేశంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి హిజ్రా షబ్నమ్ మౌసీనే. ఆమె మధ్యప్రదేశ్‌లోని సుహాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి 1998 ఎన్నికల్లో గెలుపొందారు. అయితే అప్పట్లో వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఓటర్ల జాబితాలో తనను తాను మహిళగా నమోదు చేయించుకున్నారు! మో‘డీ అంటే ఢీ’... వారణాసిలో డాన్, హిజ్రాల పోటీ మో‘డీ అంటే ఢీ’ అంటూ ఒక మాఫియా డాన్, ఒక హిజ్రా కూడా వారణాసి బరిలోకి దిగారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో వారణాసి లోక్‌సభ స్థానంలో ‘ఆప్’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తలపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఆరితేరిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీగా జైలులో ఉంటూనే ఖ్వామీ ఏక్తా దళ్ (క్యూఈడీ) తరఫున వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మవు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్తార్ అన్సారీ, నాలుగు పర్యాయాలుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదివరకు బీఎస్పీలో ఉన్న ఈ మాఫియా డాన్, ప్రస్తుతం క్యూఈడీ సభ్యుడిగా యూపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోడీపై ఈ ఎన్నికల్లో గెలుపు సాధిస్తానని ఈ అసెంబ్లీ‘డాన్’ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషీకి గట్టి పోటీ ఇవ్వగలిగానని, కేవలం 20 వేల స్వల్ప తేడాతో గెలుపు చేజార్చుకున్నానని చెబుతున్నారు. వారణాసి నియోజకవర్గం పరిధిలోని సుమారు 2.50 లక్షల మంది ముస్లిం ఓటర్ల మద్దతు తనకే ఉంటుందని అంటున్నారు. మరోవైపు, కమలా అనే హిజ్రా కూడా వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. గోరఖ్‌పూర్‌లో ఇటీవల హిజ్రాల సంఘం నిర్వహించిన సమావేశంలో ఆమెదించిన తీర్మానం మేరకు కమలా గెలుపు కోసం వారణాసి నియోజకవర్గం పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి హిజ్రాలంతా తరలి రానున్నారు. తామంతా ములాయంసింగ్ యాదవ్‌ను తదుపరి ప్రధాని చేయాలంటూ ప్రచారం చేయనున్నామని హిజ్రాల తరఫు ప్రతినిధి సోనమ్సింగ్ యాదవ్ చెప్పారు. ములాయం మద్దతుదారులమని, ప్రధానిగా ఆయన మెరుగైన పాలన అందించగలరని భావిస్తున్నామని అన్నారు. -
గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాల బీభత్సం
వరంగల్ : గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాలు గురువారం బీభత్సం సృష్టించారు. డబ్బులు ఇవ్వలేదని ప్రయాణికులపై హిజ్రాలు దాడి చేశారు. ఈ సంఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిపై ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక తాము అడిగిన సొమ్ము ఇవ్వని ప్రయాణికులను హిజ్రాలు రైలు నుంచి తోసివేసిన దారుణం గతంలో చోటుచేసుకుంది. కాగా ఇటీవలి రైలు ప్రయాణమంటే ప్రయాణికులు భయపడిపోయే పరిస్థితి తలెత్తింది. ఇందుకు అసౌకర్యాలు, టికెటు రేట్లు, ప్రమాదాల భయం తదితర కారణాలేమీ కాదు.. హిజ్రాల బెడదేనంటూ ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, ఇది నిజం. ముఖ్యంగా బెజవాడ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల జనరల్ బోగీల్లో హిజ్రాల ఆగడాలకు అంతూపొంతూ ఉండడంలేదు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బందికి ఇదేమీ పట్టడంలేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. గతంలో ఆర్పీఎఫ్ అధికారులు కొరడా ఝళిపించి, ఈ ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేశాయి. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పటికైనా ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది హిజ్రాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
సీమాంధ్ర నేతల తీరుపై హిజ్రాల నిరసన