హిజ్రాల్లో వర్గపోరు, ఒక గ్రూప్ పై మరొకరు దాడులు! | Hijras gangwar in Warangal, several injured | Sakshi
Sakshi News home page

హిజ్రాల్లో వర్గపోరు, ఒక గ్రూప్ పై మరొకరు దాడులు!

Published Sun, Jun 15 2014 9:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

Hijras gangwar in Warangal, several injured

వరంగల్: బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను, రైళ్లలో ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్న హిజ్రాల్లో వర్గపోరుకు తెరలేచింది. వర్గపోరులో భాగంగా హిజ్రాలకు చెందిన ఓ గ్రూప్ మరో గ్రూప్ పై దాడులు చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటన వరంగల్ చోటు చేసుకుంది. 
 
హిజ్రాల్లోని సౌజన్య వర్గంపై 30 మందితో లైలా వర్గం దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడుల్లో పలువురికి తీవ్రగాయాలవ్వడంతో చికిత్స కోసం వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంలో హిజ్రాల ఆగడాలు ఎక్కువయ్యాయంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement